Tamil version
-
మళ్లీ ప్రారంభంకానున్న అఖండ జాతర..
నందమూరి నటసింహం బాలకృష్ణ మాసీవ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన చిత్రం 'అఖండ'. బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గతేడాది విడుదలై అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. ఒకరకంగా చెప్పాలంటే థియేటర్లలో అఖండ జాతర జరిగింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో రిలీజై అక్కడ కూడా 'బోత్ ఆర్ సేమ్' అన్న రేంజ్లో వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పుడు ఆ జోరును కోలీవుడ్‌లో చూపెట్టనుంది అఖండ. ఈ యాక్షన్ డ్రామా చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబైంది. జనవరి 28న ఈ సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుందని సమాచారం. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్దగా ఏ సినిమా రిలీజ్లు లేకపోవడంతో ఈ సూపర్ హిట్ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనుందని టాక్. -
ఫ్యామిలీకి దగ్గరయ్యేలా...
‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా మూడో సినిమా షురూ అయింది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. కేతికా శర్మ హీరోయిన్ . బాపినీడు సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవ్ తేజ్ తల్లి విజయ దుర్గ కెమెరా స్విచాన్ చేయగా, ఆయన సోదరుడు, హీరో సాయితేజ్ క్లాప్ ఇచ్చారు. ‘‘ఉప్పెన’తో యూత్‌కు దగ్గరైన వైష్ణవ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసే కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించనున్నాం’’ అన్నారు బీవీయస్‌యన్ ప్రసాద్. -
నీ కోసం నిరీక్షణ
కమల్‌హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ముఖ్య తారాగణంగా భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘పదినారు వయదినిలే’. ఇదే సినిమా తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చంద్రమోహన్, మోహన్‌బాబు, శ్రీదేవి కాంబినేషన్లో రీమేక్ అయింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు తమిళ అనువాదాన్ని చూడబోతున్నారు. తమిళ వెర్షన్‌ని అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతిలో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి అన్ని పాటలను కొత్తగా పొందుపరచారు. సామాజిక మాధ్యమం ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో పాటుగా ఐదు భాషల్లో అనువదించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణసంస్థ వెల్లడించింది. తెలుగులో ‘నీకోసం నిరీక్షణ’ అనే టైటిల్‌ను పెట్టారు. నిర్మాత బామారాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. 30 నిమిషాల నిడివి దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేశాం’’ అని అన్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. -
పర్ఫెక్ట్ హజ్బెండ్
‘బాహుబలి’ చిత్రంలో కట్టప్ప పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్యరాజ్. ఆ సినిమా తర్వాత ఆయన ఎంత బిజీ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకూ పెద్ద తెరపై ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలిసారి ఓ తమిళ వెబ్ సిరీస్‌లో నటించేందుకు అంగీకరించారు. ‘పర్ఫెక్ట్ హజ్బెండ్’ (పరిపూర్ణమైన భర్త) అనే వెబ్ సిరీస్‌లో సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘ఇరట్టై సుళి’, ‘ఆన్ దేవదై’ వంటి చిత్రాలకి దర్శకత్వం వహించిన తామిరా ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నారు. భార్యాభర్తల మధ్య అనుబంధంతో ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ఇందులో రేఖ, సీతా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్లు కొనసాగనుందట. -
నలుగురు దర్శకులు.. నెట్‌ఫ్లిక్స్ కథలు
బాలీవుడ్ అగ్ర దర్శకులు జోయా అక్తర్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్‌లతో ‘లస్ట్ స్టోరీస్’ అనే యాంథాలజీ (ఇద్దరు ముగ్గురు దర్శకులు కలసి ఒక్కో భాగానికి దర్శకత్వం వహించడం) రూపొందించింది నెట్ఫ్లిక్. తెలుగులోనూ ‘లస్ట్ స్టోరీస్’ను తీసుకు రాబోతోంది. సందీప్‌రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి ఒక్కో భాగాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పుడు తమిళంలోనూ నెట్ఫ్లిక్ ఓ యాంథాలజీ ప్లాన్ చేసిందని సమాచారం. దర్శకులు గౌతమ్ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్‌లు ఈ యాంథాలజీను డైరెక్ట్ చేయనున్నారట. ఇది తమిళ వెర్షన్ ‘లస్ట్ స్టోరీస్’ అని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
1 వర్సెస్ 100
నయనతార.. సౌతిండియా లేడీ సూపర్‌స్టార్. కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ చేయడంలో ఎక్స్పర్ట్. ఎన్ని సినిమాలు చేసినా ప్రమోషన్స్‌కు, టీవీ ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కనిపించడానికి ఆసక్తి చూపిస్తారామె. అయితే విచిత్రంగా నయనతార తమిళంలో ఓ టీవీ షో హోస్ట్ చేయబోతున్నారని తెలిసింది. కోలీవుడ్‌లో ఇదివరకూ ఖుష్బూ, రమ్యకృష్ణ తదితరులు టీవీషోలు హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌లోకి లేట్ అయినా లేటేస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు నయన్. ‘1 వర్సెస్ 100’ అనే అమెరికన్ టీవీ షో తమిళ వెర్షన్‌కు హోస్ట్‌గా నయనతార కనిపిస్తారు. ఇన్ని సంవత్సరాలు ప్రమోషన్స్, టీవీలకు దూరంగా ఉన్న నయన్ ఈ షో అంగీకరించారంటే షోలో ఖచ్చితంగా ఏదో స్పెషాల్టీ ఉండి ఉంటుందేమో. షో స్పెషల్‌గా ఉండటంతో పాటు నయనతారకు భారీ పారితోషికం ఆఫర్ చేశారట. త్వరలోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కానుందట. ప్రస్తుతం చిరంజీవితో ‘సైరా’, రజనీతో ‘దర్బార్’, విజయ్‌తో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు నయనతార. త్వరలో దర్శకుడు శివ, సూర్య కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్గా నటిస్తారట. -
ప్యారిస్‌లో పరమేశ్వరి
అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకే పెళ్లి వద్దన్నాడు. చేసేదేం లేక ఒంటరిగా ప్యారిస్‌కు ప్రయాణమైంది పరమేశ్వరి. ఈ జర్నీలో తన అనుభవాలేంటి? తను నేర్చుకున్నదేంటి తెలియాలంటే ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రం చూడాల్సిందే అని కాజల్ అగర్వాల్ అంటున్నారు. కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలో నటుడు, దర్శకుడు రమేశ్ అరవింద్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. బాలీవుడ్ హిట్ మూవీ ‘క్వీన్’ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్ అగర్వాల్, మలయాళంలో మంజిమా మోహన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు చిత్రాలను మీడెంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ నిర్మిస్తోంది. తమిళ వెర్షన్లో కాజల్ అగర్వాల్ పరమేశ్వరి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన లుక్‌ని రిలీజ్ చేశారు చిత్రబృందం. వచ్చే నెలలో ట్రైలర్‌ను, ఏడాది చివర్లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. -
బాహుబలి-2ని క్రాస్ చేసిన స్పైడర్!
సాక్షి, చెన్నై : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది తెలిసిందే. ద్విబాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ వాసనలు ఎక్కువైపోవటంతో, హీరోయిజాన్ని దర్శకుడు తక్కువగా ఎలివేట్ చేయటంతో ఫ్యాన్స్ సైతం పెదవి విరిచారు. అయితే ఈ చిత్రంలో కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం బుల్లితెరపై ప్రదర్శించగా.. 10.4 రేటింగ్ సాధించింది. గతంలో బాహుబలి ది కంక్లూజన్ తమిళ వర్షన్‌కు అక్కడ 10.33 రేటింగ్ దక్కింది. దీంతో మహేష్ స్పైడర్ బుల్లితెరపై బాహుబలి-2 టీఆర్పీని దాటేసినట్లయ్యింది. మురుగదాస్ దర్శకుడు కావటం, సూర్య విలన్, మహేష్ క్రేజ్ మూలంగానే ఈ ఘనత సాధించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇదయదళపతి విజయ్ మెర్సల్ చిత్రంతో పోలిస్తే ఈ రెండు చిత్రాలు అత్యధిక టీఆర్పీ సాధించినట్లు కోలీవుడ్ మీడియా వెల్లడించటం ఇక్కడ మరో విశేషం. -
నేడే బాహుబలి–2
తమిళసినిమా: భారతీయ సినిమాలోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బ్రహ్మాండమైన చిత్రం బాహుబలి–2 ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలకానుంది. కొన్ని రోజులుగా తమిళంలో మాత్రం బాహుబలి–2 చిత్రం విడుదలవుతుందా? లేదా? అనే టెన్షన్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తమిళ వెర్షన్ విడుదలకు నిషేధం విధించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. కార్తికేయన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అందులో బాహుబలి–2 చిత్రాన్ని తమిళంలో విడుదల చేసే గో ప్రొడక్షన్స్ తమ వద్ద తీసుకున్న రుణాన్ని వడ్డీ సహా మొత్తం రూ.1.48 కోట్లు చెల్లించాలని, లేకుంటే చిత్ర విడుదలకు నిషేధం విధించాలని, అన్ని హక్కులను నిలుపుదల చేయాలని కోరాడు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఇటువంటి కారణాలతో చిత్ర విడుదలను అడ్డుకోవడం కుదరదని తీర్పు చెప్పారు. తద్వారా తమిళంలో బాహుబలి–2 విడుదలకు అడ్డంకులు తొలగాయి. ఈ నేపథ్యంలో బాహుబలి–2 చిత్రం తమిళంలో శుక్రవారం విడుదలకానుంది. -
‘బాహుబలి’ కత్తిరింపును ప్రదర్శించొద్దు
మదురై: ‘బాహుబలి’ సినిమా తమిళ వెర్షన్‌లోని సెన్సార్ బోర్డు తొలగించిన కుల ప్రస్తావన భాగాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాము జారీ చేసిన ఆర్డర్ కాపీని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకుండా సినిమా ప్రదర్శిస్తే ధియేటర్ల యాజమానులపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆర్డర్ కాపీని తమకు కూడా పంపాలని సెన్సార్ బోర్డును కోర్టు ఆదేశించింది. తమిళ పులి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సి పెరారీవలన్ తో పాటు ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ‘బాహుబలి’లో కొన్ని సంభాషణలు అరుంధతీయ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ తమిళనాడులో ఆందోళనలు జరిగాయి. మధురైలో బాహుబలి సినిమా పదర్శిస్తున్న ధియేటర్ పై తమిళపులి సంస్థకు చెందిన కార్యకర్తలు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. దీంతో మాటల రచయిత మదన్ కార్గి క్షమాపణ చెప్పారు. ఈ సంభాషణలను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రకటించారు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘బాహుబలి’రూ. 500 కోట్లు పైగా వసూళ్లు సాధించింది. -
సరికొత్త ఫార్మాట్ లో తెలుగు చిత్రరాజం
తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించిన సినిమా ‘శంకరాభరణం’ సినిమా 35 ఏళ్ల తర్వాత తమిళంలో విడుదలవుతోంది. డిజిటలైజ్ చేసి మళ్లీ ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి, 5.1 సౌండ్ సిస్టమ్ హంగులద్దారు. కలర్ కరెక్షన్ చేసి సినిమాను స్కోప్‌లోకి మార్చారు. రీ-రికార్డింగ్ కూడా పాత నోట్స్ తోనే కొత్త ఫార్మాట్ లో అందిస్తున్నారు. ఈ చిత్రరాజాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. దాదాపు ఏడాది కష్టపడి ఈ చిత్రానికి సరికొత్త వన్నెలు అద్దారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో నాలుగు జాతీయ అవార్డులు గెల్చుకుంది. గతంలో ‘శంకరాభరణం’ తెలుగు వెర్షనే తమిళనాట సిల్వర్ జూబ్లీ ఆడింది. మరి ఈ తమిళ వెర్షన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ డిజిటల్ వెర్షన్‌ని తెలుగులో కూడా విడుదల చేసే యోచనలో ఉన్నారు ఏడిద నాగేశ్వరరావు. -
అక్కినేనికి కమల్ వాయిస్?
దివంగత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు విశ్వ నాయకుడు కమలహాసన్ వాయిస్ ఇవ్వనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆసక్తికరమైన అంశం ఇదే. అక్కనేనికి కమల్ వాయిస్ అవసరమేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఏఎన్ఆర్ చివరి చిత్రం మనం ఏఎన్ఆర్తో పాటు ఆయన కొడుకు, ప్రముఖ నటుడు నాగార్జున, ఆయన కొడుకు యువ నటుడు నాగచైతన్య కలసి నటించిన చిత్రం మనం. శ్రీయ, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించిం ది. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలోకి అనువాదం కానుంది. తమిళంలో అక్కినేని పాత్రకు కమలహాసన్‌తో డబ్బింగ్ చెప్పించాలని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అదే విధంగా నాగార్జున పాత్రకు నటుడు మాధవన్ డబ్బింగ్ చెబితే బాగుంటుందనుకుంటున్నట్లు సమాచారం. కమలహాసన్‌కు అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా గౌరవం. ఆయన ఇటీవల మనం చిత్రం చూసి చాలా గొప్ప చిత్రం అంటూ ప్రశంసించడంతో పాటు ఏఎన్ఆర్ తన మానసిక గురువు అని వ్యాఖ్యానించారు. అలాంటిది ఆయనకే వాయిస్ ఇచ్చే అవకాశం రావడం నిజంగా అరుదైన విషయం. మరి కమల్ ఏఎన్ఆర్గా పాత్రకు డబ్బింగ్ చెబితే మనం చిత్రానికి అది మరింత ప్రత్యేక అంశంగా నిలిచిపోతుంది. మరో విషయం ఏమిటంటే మనం చిత్రం తెలుగు వెర్షన్ ఇప్పటికీ చైన్నైలోని ప్రముఖ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.