బాహుబలి-2ని క్రాస్‌ చేసిన స్పైడర్‌! | Spyder TRP Crosses Baahubali 2 in Tamil | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 3 2018 6:04 PM | Last Updated on Sat, Mar 3 2018 6:04 PM

Spyder TRP Crosses Baahubali 2 in Tamil - Sakshi

స్పైడర్‌-బాహుబలి 2 పోస్టర్లు

సాక్షి, చెన్నై : టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు స్పైడర్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచింది తెలిసిందే. ద్విబాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ వాసనలు ఎక్కువైపోవటంతో, హీరోయిజాన్ని దర్శకుడు తక్కువగా ఎలివేట్‌ చేయటంతో ఫ్యాన్స్‌ సైతం పెదవి విరిచారు. అయితే ఈ చిత్రంలో కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ రికార్డును క్రియేట్‌ చేసింది. 

తాజాగా ఈ చిత్రం బుల్లితెరపై ప్రదర్శించగా.. 10.4 రేటింగ్‌ సాధించింది. గతంలో బాహుబలి ది కంక్లూజన్‌ తమిళ వర్షన్‌కు అక్కడ 10.33 రేటింగ్‌ దక్కింది. దీంతో మహేష్‌ స్పైడర్‌ బుల్లితెరపై బాహుబలి-2 టీఆర్‌పీని దాటేసినట్లయ్యింది. మురుగదాస్‌ దర్శకుడు కావటం, సూర్య విలన్‌, మహేష్‌ క్రేజ్‌ మూలంగానే ఈ ఘనత సాధించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇదంతా ఒక ఎత్తయితే ఇదయదళపతి విజయ్‌ మెర్సల్‌ చిత్రంతో పోలిస్తే ఈ రెండు చిత్రాలు అత్యధిక టీఆర్పీ సాధించినట్లు కోలీవుడ్‌ మీడియా వెల్లడించటం ఇక్కడ మరో విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement