trp ratings
-
సమాజాన్ని చీలుస్తున్నాయి
న్యూఢిల్లీ: వార్తల ప్రసారంలో పలు చానళ్ల తీరును ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాధ్యతారాహిత్యంతో అవి సమాజాన్ని చీలుస్తున్నాయంటూ ఆగ్రహించింది. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసేలా చూడటంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. విద్వేష ప్రసంగాలు సమాజం పాలిట పెను బెడదగా పరిణమించాయంటూ ఈ సందర్భంగా మండిపడింది. వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాల్సిందేనని స్పష్టం చేసింది. బాధ్యతారాహిత ప్రసారాలతో సమాజంలో సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించే చానళ్లపై చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘‘మనకు కావాల్సింది సంతులనంతో కూడిన స్వేచ్ఛాయుతమైన మీడియా. కానీ హెచ్చు టీఆర్పీ రేటింగులు సాధించడమే ఈ రోజుల్లో వార్తల కవరేజీకి పరమావధిగా మారింది. అందుకోసం చానళ్లు తమలో తాము పోటీ పడుతూ ప్రతిదాన్నీ సంచలనాత్మంగా మారుస్తున్నాయి. చాలాసార్లు టీవీల్లో లైవ్ చర్చల్లో యాంకర్లు తామే సమస్యలో భాగంగా మారిపోతున్నారు. ప్యానల్లోని వ్యక్తులు మాట్లాడుతుండగానే ఇష్టారాజ్యంగా మ్యూట్ చేస్తున్నారు. వారికి తమ వాదన విన్పించే అవకాశమే ఇవ్వడం లేదు. టీవీ దృశ్య మాద్యమం కావడంతో పత్రికల కంటే చాలా శక్తిమంతమైనది. వీక్షకులను ఎంతో ప్రభావితం చేయగలుగుతుంది. దురదృష్టవశాత్తూ ప్రేక్షకుల్లో చాలామంది పరిణతి ఉన్నవాళ్లు కాదు. టీవీలు చూపించే దృశ్యాలను చూసి రెచ్చిపోకుండా ఉండటం కష్టం. ఈ నేపథ్యంలో పత్రికలకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాదిరిగా టీవీ ప్రసారాల విషయంలో ఎలాంటి నియంత్రణ వ్యవస్థా లేకపోవడం శోచనీయం’’ అంటూ జస్టిస్ జోసెఫ్ ఆందోళన వెలిబుచ్చారు. విద్వేష వ్యాఖ్యల వ్యాప్తి ద్వారా సమస్యలో భాగంగా మారుతున్న టీవీ న్యూస్ యాంకర్లను ప్రసారం నుంచి ఎందుకు తప్పించకూడదని ప్రశ్నించారు. చానళ్లు తీర్పరులుగా మారి విచారణ కూడా జరుపుతున్నాయంటూ ఆక్షేపించారు. ‘‘ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాయి. అతనింకా విచారణ ఎదుర్కొంటున్నాడు. ప్రతివారికీ పరువు ప్రతిష్టలుంటాయి’’ అన్నారు. పోలీసును పొడిచేసినా పట్టించుకోరా! ఢిల్లీలో ఇటీవల ఒక పోలీసు అధికారిని చైన్‌స్నాచర్ పట్టపగలు అందరి ముందే పొడిచేసినా ఎవరూ పట్టించుకోలేదని ఒక్కరూ అడ్డుకోలేదని జస్టిస్ నాగరత్న ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కానీ చానళ్లలో, బయటా మాత్రం ఎవరు ఏమైనా మాట్లాడే పరిస్థితి నెలకొంది. వార్తా చానళ్లు వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మన దేశంలో వాటిపై ఇప్పటికీ ఎలాంటి నియంత్రణలూ లేవు. భావ ప్రకటన స్వేచ్ఛ గొప్ప బాధ్యతతో కూడుకుని ఉంటుంది. టీవీ చానళ్లు విద్వేష ప్రసంగాల వ్యాప్తికి పాల్పడి కార్యక్రమాల నియమావళిని ఉల్లంఘిస్తే వాటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు. ఒకరిపై అలాంటి చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్లంతా దారికొస్తారని జస్టిస్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంలో ఇలాంటి వేలాది ఫిర్యాదులొచ్చాయని, సదరు చానళ్లపై చర్యలు కూడా తీసుకున్నామని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ చాలా సున్నితమైన అంశమని ధర్మాసనం పేర్కొంది. దానికి భంగం కలగని రీతిలో చానళ్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈ సమస్య ఇప్పటికే కేంద్రం దృష్టిలో ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ బదులిచ్చారు. విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సమస్యగా మారొద్దు ‘‘ప్రత్యక్ష ప్రసారాల్లో చర్చలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత యాంకర్దే. యాంకరే సరిగా వ్యవహరించకపోతే భిన్నాభిప్రాయాలను అనుమతించరు. అవతలి వక్తను మ్యూట్ చేయడమో, వారిని అసలు ప్రశ్నలే అడగకపోవడమో చేస్తారు. ఇది పక్షపాతమే. ఇలాంటి సందర్భాల్లో యాంకర్లపై ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నారు? సమాజంపై ఎంతో ప్రభావం చూపగల అత్యంత బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నామని మీడియాలోని వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సమస్యలో భాగంగా మారి మనసుకు ఏది తోస్తే అది మాట్లాడొద్దు’’ అంటూ ధర్మాసనం హితవు పలికింది. -
కార్తికేయ 2 ఫస్ట్ టైమ్ టీఆర్పీ ఎంతో తెలుసా?
బాక్సాఫీస్ వద్ద కార్తికేయ 2 సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే! అటు థియేటర్లు, ఇటు ఓటీటీలో రికార్డులు సృష్టించిన ఈ మూవీ ఇటీవల బుల్లితెరలోనూ ప్రసారమైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటిసారిగా జీ తెలుగులో ప్రసారం కాగా 7.88 రేటింగ్ అందుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లో 'కార్తికేయ 2'కి ఉన్న క్రేజ్ ఏపాటిదో రుజువైంది. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సూపర్‌నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. చదవండి: హీరోయిన్ ముఖం నిండా సూదులు, ఏమైంది? ఓటీటీలో ల్యాండయిన జిన్నా మూవీ -
ఐపీఎల్ మ్యాచ్‌లపై ఆ రెండు సినిమాల ప్రభావం..!
ఐపీఎల్ 2022 సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్న బీసీసీఐను రెండు పాన్ ఇండియా సినిమాలు భారీగా దెబ్బకొట్టాయి. రాజమౌళి ట్రిపుల్ ఆర్, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ పార్ట్-2 సినిమాల ప్రభావం ఐపీఎల్ వ్యూయర్షిప్పై పడింది. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాల కారణంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌కి అనుకున్నంత వ్యూయర్షిప్ రావడం లేదన్నది బహిరంగ రహస్యం. 2020 సీజన్‌తో పోలిస్తే రెండు విడతలుగా నడిచిన 2021 సీజన్‌కి డబుల్ టీఆర్పీ రాగా, ప్రస్తుత సీజన్లో ఆ రేటింగ్ సగానికి సగం పడిపోయింది. ఐపీఎల్ 2022 ప్రారంభమైన (మార్చి 26) తొలి మూడు వరాలు ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం కారణంగా 30 శాతం టీఆర్పీ పడిపోగా... నాలుగో వారం ‘కేజీఎఫ్ 2’ ఎంట్రీతో రేటింగ్ ఊహించని స్థాయికి దిగజారింది. వ్యూయర్షిప్ పడిపోవడానికి ఈ రెండు సినిమాలు ఓ కారణమైతే.. ఐపీఎల్‌కు కళ తెచ్చిన రెండు అగ్రశ్రేణి జట్లు (ముంబై, సీఎస్కే) ఈ సీజన్లో దారుణంగా విఫలం కావడం మరో కారణం. 2021 సీజన్లో ఒక్కో మ్యాచ్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సగటున 2 నుంచి 5 మిలియన్ల వరకు వీక్షించగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. గరిష్టంగా 50 నుంచి 60 లక్షల మంది మాత్రమే ప్రస్తుత సీజన్ మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షిస్తున్నారు. చదవండి: ఢిల్లీ జట్టులో మరో ప్లేయర్‌కు కరోనా..పంజాబ్‌తో నేటి మ్యాచ్ సాధ్యపడేనా..? -
మహేష్ మేనియా.. అక్కడ ‘మహర్షి’ దూకుడు తగ్గట్లేదుగా!
సందేశాత్మక చిత్రాలను ఎంపిక చేయడంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. ఈ తరహాలో మహేశ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం 'మహర్షి'. ఈ సినిమా కలెక్షనన్లు కొల్లగొట్టి మహేశ్ కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఊపు ఊపిన ‘మహర్షి’ టీవీలో మాత్రం మొదట్లో టెలికాస్ట్ చేసినప్పుడు ఊహించిన స్థాయి టీఆర్పీ రేటింగ్ రాలేదు, కానీ మెల్లమెల్లగా ఊపందుకుంది. అలా ఇప్పుడు పదోసారి టెలీకాస్ట్ కాగా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తొమ్మిది సార్లు ఈ చిత్రం మంచి టీఆర్పీ సాధించగా, పదోసారి 7.80 రేటింగ్స్‌తో సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా మహేశ్ సినిమాలకు ఒక సినిమా పదోసారి కూడా టీవీలో ప్రసారం అయ్యి ఈ రేంజ్లో టీఆర్పీను తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదంటున్నారు. ఇన్ని సార్లు టెలికాస్ట్ అయిన తర్వాత కూడా మళ్లీ అంత మంది చూడటమే కాకుండా మునపటి కంటే ఎక్కువ మందే ఈ సారి వీక్షించడం ఇదొక అరుదైన ఘటననే చెప్పాలి. అయితే మహర్షి సినిమాకు ఆ స్టామినా ఉందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది వరకు మన రాకుమారుడు నటించిన ‘అతడు’ చిత్రం కూడా ఇదే తరహాలో మొదట మెల్లగా ప్రారంభమై, తర్వాత టీవీ ప్రేక్షకులను కట్టిపడేసిన సంగతి తెలిసిందే. 1st Time: 9.3 2nd time : 7.3 3rd Time: 6.13 4th time: 9.02 5th Time: 10.28 6th Time: 8.82 7th Time: 7.14 8th Time: 5.14 9th Time: 4.92 10th Time: 7.80** చదవండి: అప్పట్లో షారుక్ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి -
టీఆర్పీ స్కాం: అర్నబ్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ ఛీప్ అర్నబ్ గోస్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా రిపబ్లిక్ టీవీకి అనుకూలంగా రేటింగ్ మార్చేందుకు భారీ మెత్తంలో అర్నాబ్ గోస్వామి తనకు లంచం ఇచ్చారని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తా తెలిపారు. ముంబై పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. టీఆర్పీలో మార్పులు చేసేందుకు గానూ తనకు 12వేల అమెరికన్ డాలర్లుతోపాటు మూడేళ్లకు గానూ రూ.40 లక్షల మొత్తాన్ని అర్నాబ్ తనకు ముట్టజెప్పారని దాస్‌గుప్తా పేర్కొన్నారు. మూడేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని తాను తీసుకున్నానని ఆయన వెల్లడించారు. (టీఆర్పీ స్కాం: వైరలవుతోన్న వాట్సాప్ చాట్ ) ‘2004 నుంచే అర్ణబ్ నాకు తెలుసు. టైమ్స్ నౌలో మేమిద్దరం కలిసి పనిచేసేవాళ్లం. 2013లో నేను బార్క్ సీఈవోగా నియమితుడినయ్యాను. ఆ తర్వాత 2017లో అర్ణబ్ రిపబ్లిక్ టీవీని ప్రారంభించారు. చానల్ ప్రారంభించక ముందే అర్ణబ్ పలు ప్రణాళికల గురించి నాతో అనేకసార్లు చర్చించేవాడు. చానల్ రేటింగ్ పెంచడంలో సహాయం చేయాలని పరోక్షంగా మాట్లాడేవాడు. నాకు టీఆర్పీ గురించి అన్ని విషయాలు తెలుసన్న విషయం కూడా అర్ణబ్‌కు బాగా తెలుసు. ఇందుకు బదులుగా భవిష్యత్తులో నాకు సాయం చేస్తానని మాటిచ్చాడు. దీంతో రిపబ్లిక్ టీవీకి నంబర్1 రేటింగ్ వచ్చేలా నా టీంతో కలిసి పనిచేశాను. 2017 నుంచి 2019 వరకు ఇది కొనసాగేది. ఇందుకుగానూ అర్నబ్ గోస్వామి నుంచి రెండేళ్ల వ్యవధిలోనే 12000 డాలర్లు (8లక్షల 74 వేలు) అందుకున్నాను' అని దాస్‌గుప్తా తెలిపారు. టీఆర్పీ స్కాంకి సంబంధించి జనవరి 11న 3,600 పేజీల సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను ఇప్పటికే ముంబై పోలీసులు ఫైల్ చేశారు. ఈ కేసులో దాస్‌గుప్తాకు గోస్వామికి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, కాల్స్ వివరాలతోపాటు బార్క్ ఆడిట్ రిపోర్ట్‌ను కూడా పొందుపరిచారు. వీరిద్దరి మధ్యా 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్ మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
టీఆర్పీ స్కాం: వైరలవుతోన్న వాట్సాప్ చాట్
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా, రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు బయటకు లీకయ్యాయి. దాదాపు 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్ మెసేజ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇవి తిరుగులేని ఆధారాలు అంటూ పలువురు స్పందిస్తున్నారు. అయితే కొన్ని చాట్లలో టీఆర్పీకి సంబంధించి అవసరమైతే పార్థోదాస్‌కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సాయం చేస్తానంటూ అర్నబ్ గోస్వామి హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరో చాట్‌లో మంత్రులంతా మనతోనే ఉన్నారు.. అని చెబుతున్నట్లు ఉంది. కండీవలి పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైనట్లు కనిపిస్తున్న ఈపీడీఎఫ్ పేజీల్లో ప్రతి పేజీకి పలువురి సంతకాలు ఉండటం గమనార్హం. (టీఆర్పీ కేసు: అర్నబ్ గోస్వామికి ఊరట) Mumbai Police releases 500 pages WhatsApp chat between Arnab Goswami and Partho Das Gupta ( Ex CEO of BARC) pic.twitter.com/C3wnxjRi0N — Abhijeet Dipke (@abhijeet_dipke) January 15, 2021 -
టీఆర్పీ కేసు: అర్నబ్ గోస్వామికి ఊరట
ముంబై : టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ఆంగ్ల వార్తాచానెనల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి, ఇతర ఉద్యోగులపై జనవరి 29 వరకు ఎలాంటి కఠిన చర్యలు చేపట్టబోమని ముంబై పోలీసులు శుక్రవారం బొంబాయి హైకోర్టుకు తెలిపారు. కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారు. రిపబ్లిక్ టీవీ యాజమాన్య సంస్థ అయిన ఏఆర్జీ ఔట్లియర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు, హంస రీసెర్చ్ గ్రూప్ ఉద్యోగులకు గతంలో కల్పించిన తాత్కాలిక ఊరటను కూడా జనవరి 29 వరకు కోర్టు పొడగించింది. ఆ ఉద్యోగులను వారానికి రెండు సార్లకు మించి విచారణకు పిలవకూడదని కోర్టు గతంలో ఊరట కల్పించిన విషయం తెలిసిందే. ఏఆర్జీ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. టీఆర్పీ కోసం అర్నబ్ గోస్వామి లంచం ఇచ్చారని ముంబై పోలీసులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని సాల్వే వాదించారు. మరోవైపు, ఈ టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నగదు అక్రమ చలామణీ కేసును నమోదు చేసి, విచారణ చేస్తోందని కోర్టుకు తెలిపారు. ఈడీ నమోదు చేసిన కేసు స్టేటస్ రిపోర్ట్‌ను కూడా కోర్టు తెప్పించుకోవాలని కోరారు. ఈడీ నివేదికకు, ముంబై పోలీసుల నివేదికకు మధ్య తేడాలున్నట్లయితే.. ఏఆర్‌జీపై దురుద్దేశంతో కేసు పెట్టినట్లు అర్థమవుతుందని వివరించారు. నివేదిక సీల్డ్ కవర్లో అందించేందుకు ఈడీ సిద్ధంగా ఉందని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ వాదనను ముంబై పోలీసుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఖండించారు. ఈ కేసులో ఆర్థిక అక్రమాలపై వాదించే ఈడీకి భాగస్వామ్యం కల్పించడం సరికాదన్నారు. ఇప్పటివకు ఈడీ ఈ కేసులో భాగస్వామిగా లేదని వాదించారు. కేసులో భాగస్వామి కాకుండానే, స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించాలని ఈడీ ఎందకంత ఉత్సాహం చూపుతోందని ప్రశ్నించారు. -
'రిపబ్లిక్ టీవీ'కి మరో షాక్
ముంబై : టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ డిస్స్ర్టిబ్యూషన్ హెడ్ ఘన్‌శ్యామ్ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు తాజాగా సింగ్‌ను 12వ నిందితుడిగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తారని పోలీసు అధికారులు తెలిపారు. కాగా రిపబ్లిక్ టీవీ సెట్స్‌లోపని చేసిన వేతనాలు చెల్లించనందుకు 2018లో ఆర్కిటెక్ట్ అన్వే నాయక్ మరియు అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి అర్నాబ్ గోస్వామి సహా మరో ఇద్దరిని నవంబర్ 4న ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రోజుల వ్యవధిలోనే రిపబ్లిక్ టీవీ డిస్స్ర్టిబ్యూషన్ హెడ్‌ను అరెస్ట్ చేశారు. ముంబైలో టీఆర్పీల నిర్వహణను హంస అనే ఎజెన్సీ చూస్తోంది. అయితే ఆ సంస్థ మాజీ ఉద్యోగుల సాయంతో, వినియోగదారులకు డబ్బులు ఇచ్చి, తమ చానళ్లనే చూడాలని, చూడకపోయినా తమ చానెళ్లనే ఆన్‌లో ఉంచాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా ఎంపిక చేసిన చానళ్లను నిర్ధిష్ట సమయంలో చూసినందుకు నెలవారీ కొంత డబ్బు ఇస్తామని చెప్పడం వల్ల ఒప్పుకున్నానని ఒక వినియోగదారుడు చెప్పారు. ఇందులో రిపబ్లిక్ చానల్‌తో పాటు ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా వంటి రెండు మరాఠీ చానెళ్లు కూడా ఉన్నాయి. (అర్నాబ్‌కు భద్రత కల్పించండి : గవర్నర్ ) టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు ఆరోపించారు. మరో వైపు టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు చానళ్లు అక్రమ మార్గాలను ఎంచుకున్నా యనే ఆరోపణల నేపథ్యంలో టెలివిజన్ చానళ్ల వారపు రేటింగ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ప్రకటించింన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులను సమీక్షించేందుకు 12 వారాలు పట్టొచ్చని, అప్పటిదాకా నిషేధం ఉంటుందని బార్క్ తెలిపింది. టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బార్క్ రేటింగ్‌ల ఆధారంగానే టీవీ ఛానళ్లకు ప్రకటనలు అందుతాయి. టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ సీఎఫ్‌వో సుందరంను విచారించారు. అయితే ముంబై పోలీసులు చేస్తోన్న ఆరోపణల్ని రిపబ్లిక్ టీవీ యాజమాన్యం ఖండించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణంపై పోలీసుల దర్యాప్తును ప్రశ్నించినందుకే తమ ఛానల్‌పై కేసులు పెట్టారని ఆరోపించారు. (అర్నాబ్‌కు బెయిల్ నో ) -
రిపబ్లిక్ టీవీకి సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: టీఆర్పీ స్కామ్‌లో చిక్కుకున్న రిపబ్లిక్ టెలివిజన్ చానల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ‘హైకోర్టులపై విశ్వాసం కలిగి ఉండాలి’ అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్ కాలంలోనూ పనిచేసిన బాంబే హైకోర్టును ఆశ్రయించాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం రిపబ్లిక్ టీవీ తరఫు న్యాయవాది హరీష్ సాల్వేకు తెలిపింది. అయితే కేసు విచారణపై హరీష్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. రిపబ్లిక్ టీవీ ఆఫీసు వొర్లి ప్రాంతంలో ఉంటుంది కదా? హైకోర్టు విచారించకుండానే ఇలాంటి పిటిషన్లను చేపట్టడం తప్పుడు సంకేతాలను పంపుతుందని ‘ఈ మధ్య కమిషనర్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు’అని వ్యాఖ్యానించింది. టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ సీఎఫ్‌వో సుందరంను విచారణకు పిలిచారు. ఇప్పటికే ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా చానళ్లపై కేసులు నమోదయ్యాయి. టీఆర్పీ రేటింగ్‌ల నిలిపివేత టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు చానళ్లు అక్రమ మార్గాలను ఎంచుకున్నా యనే ఆరోపణల నేపథ్యంలో టెలివిజన్ చానళ్ల వారపు రేటింగ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) గురువారం ప్రకటించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులను సమీక్షించేందుకు 12 వారాలు పట్టొచ్చని, అప్పటిదాకా నిషేధం ఉంటుందని బార్క్ తెలిపింది. టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బార్క్ రేటింగ్‌ల ఆధారంగానే టీవీ ఛానళ్లకు ప్రకటనలు అందుతాయి. -
పోలీసుల విచారణకు రిపబ్లిక్ టీవీ సీఈఓ, సీఓఓ
ముంబై: టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ సీఈఓ వికాస్ ఖాన్‌చందానీ, సీఓఓ హర్‡్ష భండారి ఆదివారం ముంబై పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. వారిలో సీఈఓ వికాస్‌ను 9 గంటల పాటు, హర్‡్షను 5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే ఏ విధమైన ఒత్తిడికైనా తలొగ్గబోమని ఈ సందర్బంగా రిపబ్లిక్ టీవీ ప్రకటించింది. ‘ఈ రోజు మా సీఈఓ, సీఓఓ, డిస్ట్రిబ్యూషన్ టీమ్ సీనియర్ సభ్యుడిని పోలీసులు సుమారు 20 గంటల పాటు ప్రశ్నించారు. ఈ స్కామ్‌కు సంబంధించి హంస ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదు కాపీని రిపబ్లిక్ టీవీ ఎప్పుడు, ఎలా, ఎవరి నుంచి సంపాదించిందనే ప్రశ్ననే వారు అడిగారు’ అని పేర్కొంది. అది ఎడిటోరియల్ విషయమని వారికి సీఈఓ జవాబిచ్చారని తెలిపింది. ‘హంస ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదులో తమపై ఎలాంటి ఆరోపణ లేదు. ఇండియా టుడే చానెల్ పేరునే ఆ ఫిర్యాదులో హంస ఏజెన్సీ ప్రస్తావించింది. ఫిర్యాదు కాపీ లో ఉన్న విషయాన్ని అక్టోబర్ 10 వ తేదీననే రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది’ అని వివరించింది. -
రిపబ్లిక్ టీవీ సీఎఫ్ఓకు సమన్లు
ముంబై: ముంబైలో వెలుగు చూసిన టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టీఆర్పీ) స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ సీఎఫ్ఓ సుందరానికి పోలీసులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. అక్టోబర్ 10న విచారణకు హాజరు కావాలన్నారు. ఈ స్కామ్‌లో రిపబ్లిక్‌తో పాటు మరో 2 మరాఠీ చానళ్ల పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. వినియోగదారులతో ఒప్పందాలు ముంబైలో టీఆర్పీల నిర్వహణను హంస అనే ఎజెన్సీ చూస్తోంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగుల సాయంతో, వినియోగదారులకు డబ్బులు ఇచ్చి, తమ చానళ్లనే చూడాలని, చూడకపోయినా తమ చానెళ్లనే ఆన్‌లో ఉంచాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా ఎంపిక చేసిన చానళ్లను నిర్ధిష్ట సమయంలో చూసినందుకు నెలవారీ కొంత డబ్బు ఇస్తామని చెప్పడం వల్ల ఒప్పుకున్నానని ఒక వినియోగదారుడు చెప్పారు. ఇందులో రిపబ్లిక్ చానల్‌తో పాటు రెండు మరాఠీ చానెళ్లు కూడా ఉన్నాయి స్టాండింగ్ కమిటీ ముందుకు! టీఆర్పీ స్కామ్ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం.. పార్లమెంటరీ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చీఫ్ శశి థరూర్‌కు లేఖ రాశారు. ఒక జాతీయ వార్తా చానల్ సహా 3 చానళ్లు ఈ స్కామ్‌లో ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారని, అందువల్ల తదుపరి కమిటీ మీటింగ్‌లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కార్తి చిదంబరం ఆ లేఖలో కోరారు. -
టాప్ రేటింగ్‌లో ‘రామాయణం’
న్యూఢిల్లీ: 33 ఏళ్ల కిందట దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం, మహాభారతం సీరియళ్లు టెలివిజన్ చరిత్రలో ఓ ట్రెండ్ క్రియేట్ చేశాయి. అంతటి విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియళ్లు కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో మరోసారి బుల్లితెరపై కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం ప్రస్తుతం దంగల్ అనే ఛానల్లో ప్రసారమవుతోంది. తాజాగా బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అందించిన నివేదిక ప్రకారం టెలివిజన్‌లో ఎక్కువ మంది తిలకించే కార్యక్రమాల్లో రామాయణం మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. (స్టార్ మాలో రామాయణం) ఆగస్టు 1 నుంచి 31 వరకు భారతీయ ప్రేక్షకులు టీవీల్లో ఏయే కార్యక్రమాలను ఎక్కువగా వీక్షించారనే దానిపై బార్క్ ఒక నివేదిక విడుదల చేసింది. దీని ఆధారంగా టీఆర్పీల పరంగా రామాయణం ఇప్పటికీ టాప్ రేటింగ్‌లో దూసుకుపోతుందని పేర్కొంది. జీ టీవీలో వస్తున్న శ్రద్ధా ఆర్య, ధీరజ్ ధూపర్ నటించిన కుండలి భాగ్య సీరియల్ రెండో స్థానంలో ఉంది. అలాగే మహిమా శానిదేవ్ కీ మూడవ స్థానంలో కొనసాగుతంది. దూరదర్శలో ప్రసారమవుతోన్న శ్రీ కృష్ణ నాలుగో స్థానం, స్టార్ ప్లస్‌లో ప్లే అవుతున్న అనుపమా అయిదో స్థానం దక్కించుకున్నాయి. (‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’) బార్క్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తితో సతమతమవుతున్న జనాలు కాస్తా వినోదం కోరుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో ప్రేక్షకులు కామెడీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ది కపిల్ షో, తారక్ మెహతా కా ఓల్తా చాష్మా వంటి కామెడీ కార్యక్రమాలతో మరోసారి నవ్వుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
డీడీ నంబర్ వన్
కేబుల్ రాకముందు దూరదర్శన్ (డీడీ) ఛానలే అందరికీ వినోదం, విజ్ఞానం అందించింది. కేబుల్ టీవీ, స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఎక్కువ కావడంతో దూరదర్శన్ కి ఇంతకు ముందు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి. అయితే ఈ ‘లాక్ డౌన్’ సమయంలో ‘డీడీ నేషనల్’ తన పూర్వ వైభవాన్ని చూస్తోంది. టీ. ఆర్. పీ రేటింగ్స్ లో అగ్రగామిగా నిలుస్తోంది. కారణం దూరదర్శన్ లో ఒకప్పుడు బాగా పాపులర్ అయిన సీరియల్స్, షోలను పునః ప్రసారం చేయడమే. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదల చేసిన డేటా ఆధారంగా దేశంలో దూరదర్శన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. లాక్ డౌన్ కి ముందు వారాల్లో టాప్ 10లో లేకపోయినా ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం. మార్చి చివరి వారం (మార్చి 21–27) రేటింగ్ సంఖ్యతో పోలిస్తే ఆ మరుసటి వారం (మార్చి 28– ఏప్రిల్ 3) దూరదర్శన్ వీక్షకుల సంఖ్య సుమారు 580 రెట్లు పెరిగినట్టు తెలిసింది. ‘‘రామాయణం, మహాభారతం, శక్తిమాన్, సర్కస్, బ్యోమకేష్ బక్షి వంటి పాపులర్ సీరియళ్లు, ప్రోగ్రాములు తిరిగి ప్రసారం కావడం దేశం మొత్తాన్ని శ్రద్ధగా టీవీలకు అతుక్కుపోయేలా చేసింది డీడీ. ముఖ్యంగా రామాయణం , మహాభారతం ప్రసారం అవుతున్న సమయాల్లో వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. అలాగే క్వారంటైన్ సమయాల్లో టీవీ వీక్షించే సమయం కూడా 43 శాతం వరకు పెరిగింది’’ అని బార్క్ సంస్థ తెలిపింది. -
టీఆర్పీలో దుమ్మురేపిన బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలే
హైదరాబాద్ : నాగార్జున-చిరంజీవి కాంబినేషన్లో అట్టహాసంగా జరిగిన బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ గ్రాండ్ ఫినాలే టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్, నానిలు ప్రెజెంట్ చేసిన తొలి రెండు సీజన్ల ఫైనల్స్‌తో పోలిస్తే సీజన్ 3 టీఆర్పీ వాటిని అధిగమించింది. బిగ్‌బాస్ తెలుగు 3 గ్రాండ్‌ఫినాలేను నవంబర్ 3న స్టార్ మా ప్రసారం చేసింది. శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ రెజాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొని రాహుల్ సిప్లీగంజ్ బిగ్‌బాస్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 గ్రాండ్ఫినాలే టీఆర్పీలు వెల్లడై ఫైనల్ ఎపిసోడ్ ఏ రేంజ్లో వీక్షకులను ఆకట్టుకుందో తేటతెల్లం చేశాయి. నాలుగున్నర గంటల పాటు సాగిన ఫైనల్ ఎపిసోడ్ 18.29 టీఆర్పీ రాబట్టిందని ఈ షో నిర్మాతలైన ఎండెమోల్ షైన్ ఇండియా ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక టీఆర్పీ నమోదు చేసిన బిగ్‌బాస్ షో ఇదేనని ట్వీట్ పేర్కొంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 గ్రాండ్ ఫినాలేకు 14.13 టీఆర్పీ, నాని ప్రెజెంట్ చేసిన సీజన్ 2 ఫినాలే 15.05 టీఆర్పీ రాబట్టాయి. మరోవైపు బిగ్‌బాస్ సీజన్ 3 గ్రాండ్ఫినాలేలో విజేత రాహుల్‌కు చిరంజీవి టైటిల్‌ను ప్రదానం చేసే ఎపిసోడ్ చివరి గంటలో ఏకంగా 22.4 టీఆర్పీ నమోదైనట్టు స్టార్ మా నెట్వర్క్ ఉద్యోగి రాజీవ్ ఆలూరి ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరో శ్రీకాంత్, హీరోయిన్ క్యాథరిన్ త్రెసా సహా పలువురు సెలెబ్రిటీలు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో తళుక్కున మెరవడం ఈ షోకు అదనపు ఆకర్షణగా మారడంతో భారీ రేటింగ్‌లు దక్కాయి. -
బుల్లితెరపై నిరాశపరిచిన ‘అరవింద సమేత’
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా అరవింద సమేత. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈసినిమా బుల్లితెర మీద మాత్రం ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయింది. ఇటీవల టీవీలో ప్రసారమైన అరవింద సమేత సినిమా కేవలం 13.7 టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే సాధించింది. గతంలో ఎన్టీఆర్ టెంపర్ 25 టీఆర్పీ రేటింగ్ సాధించి రికార్డ్ సృష్టించింది. కానీ అరవింద సమేత మాత్రం ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకు అత్యధిక టీఆర్పీ సాధించిన సినిమాగా 22.7 రేటింగ్‌తో బాహుబలి 2 టాప్ ప్లేస్‌లో నిలిచింది. తరువాత స్థానాల్లో మగధీర (22), బాహుబలి (21.8), డీజే (21.7), శ్రీమంతుడు (21.2), గీత గోవిందం (20.8) సినిమాలు ఉన్నాయి. -
ప్రేమ ముఖ్యం
సినిమా రిలీజ్ అయితే చాలు... బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు, స్మాల్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు టీఆర్పీలు రాకెట్లలా పైకి వెళ్తుంటాయి. ఇది బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ స్టామినా, స్టార్డమ్. కానీ ఇవేమీ తనకు పట్టవంటారు భాయ్. బాక్సాఫీస్ కోట్ల కన్నా, టీఆర్పీ అంకెల కన్నా ప్రేక్షకుల ప్రేమ, ఆదరణే ఎక్కువ అంటున్నారు ఆయన. గురువారం సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. ముంబైలోని పన్వేల్ ఫామ్‌హౌస్‌లో తన ఫ్యామిలీ, ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్‌తో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారాయన. దానికంటే ముందు బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ – ‘‘ఎంతోమంది ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు అనే విషయం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. స్టార్డ్డమ్ ముఖ్యమే, కానీ వాళ్ల ప్రేమకంటే పెద్దదిగా మాత్రం అనిపించదు. ప్రేక్షకులను అలరించడానికి ఇలానే కష్టపడుతుంటాను’’ అని పేర్కొన్నారు. ఇది సల్మాన్ 53వ పుట్టినరోజు. మరి.. భాయ్ బ్యాచిలర్హుడ్కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. -
టీఆర్పీ కోసం మీడియా పాకులాట
హైదరాబాద్: ప్రస్తుతం మీడియా రంగంలో రాజకీయ నేతల జోక్యం ఎక్కువగా ఉంటోందని, గతంతో పోలిస్తే మీడియాలో విలువలు తగ్గిపోతున్నాయని ఇండియా టుడే కన్సల్టింగ్ గ్రూప్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. టీఆర్పీ రేటింగ్ కోసం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోం దన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 53వ వ్యవస్థాపక దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మీడియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా’అనే అంశంపై రాజ్‌దీప్ సర్దేశాయ్ ఉపన్యసించారు. ప్రస్తుతం మీడియా యాజమాన్యాలు కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎడిటోరియల్ కథనాలకు ఎంతో విలువ ఉండేదని, కానీ నేడు అవి రాజకీయ నేతల ప్యాకేజీలుగా మారి పోయాయన్నారు. జర్నలిజాన్ని పెయిడ్ న్యూస్ ఒక కేన్సర్ వ్యాధిలా పట్టిపీడిస్తోందన్నారు. మరుగున పడిపోతున్న ప్రజా సమస్యలు ప్రజల సమస్యలపై వార్తలు ప్రసారం చేయడం, ప్రచురించడం తగ్గిపోయిందని రాజ్‌దీప్ వాపోయారు. దేశవ్యాప్తంగా 400 చానళ్లు ఉండగా అందులో ఎక్కువ శాతం రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. నేడు ప్రధానులు, ముఖ్యమంత్రులు సైతం కనీసం మీడియాకి ఇంటర్వూలు కూడా ఇవ్వడం లేదని.. ప్రెస్మీట్లు పెట్టడానికి సైతం ఆసక్తి చూపడం లేదని అన్నారు. గతంలో ఎన్టీఆర్ లాంటి మహానేతలు ప్రతినిత్యం మీడియాతో కలసిమెలసి ఉండేవారని గుర్తుచేశారు. సంచలనాల కోసమే చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్నారు. ఇంటర్నెట్, మొబైల్, వాట్సప్ జర్నలిజం పెరిగిపోవడంతో తప్పుడు వార్తలు ప్రసారమవుతున్నాయన్నారు. ఇటీవలి కాలంలో జాతీయ మీడియా కులా లు, మతాలు, ప్రాంతీయ భేదాలతో ప్రజల్ని విడదీసే విధంగా కథనాలు ప్రసారం చేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్.. రాజ్‌దీప్ సర్దేశాయ్‌ను ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. జర్నలిజంలో 45 సంవత్సరాలు పూర్తిచేసిన రామచంద్రమూర్తిని, ఐజేయూ అధ్యక్షుడిగా ఎన్నికైన అమర్‌ను, అల్లం నారాయణను రాజ్‌దీప్ సత్కరించారు. -
ప్రాంతీయ పార్టీలదే హవా!
హైదరాబాద్: వచ్చే 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవాకు అవకాశం ఉందని, 10 మంది ఎంపీలుంటే కేంద్రాన్ని శాసించవచ్చని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ సోమాజిగూడలోని పార్క్ హోటల్లో మీడియా ఇన్ న్యూస్ పేరుతో నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అభిప్రాయాలను పంచుకున్నారు. రానున్న ఎన్ని కల్లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా ‘వాట్సాప్’ వేదికగా ఎన్నికల యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు. మీడియా ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని, దేశవ్యాప్తంగా వందల చానళ్లు నిర్వహిస్తున్నారని, ప్రముఖ చానళ్లు కూడా లాభాల్లో లేవని, కేవలం ఎన్నికల అవసరాల కోసమే మీడియా సంస్థలు పని చేస్తున్నాయని అన్నారు. అప్రాధాన్య వార్తలు ప్రాధాన్యత పొందుతున్నాయని, నిజమైన వార్తలు లోపలి పేజీలకు పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూస్ కాకుండా కేవలం వ్యూస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని.. టీఆర్పీ రేటింగ్స్, సంచలనాల కోసం పాకులాడుతూ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని రాజ్‌దీప్ అన్నారు. మీడియా క్రమంగా ‘మెక్‌డొనాల్డ్ డైజేషన్’( అప్పటికప్పుడు తయారు చేసుకొని తినడం), ‘విండో జర్నలిజం’, ‘రావన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం’కి దిగజారుతోందని అభిప్రాయపడ్డారు. మీడియా ‘వాచ్ డాగ్ ఆఫ్ సొసైటీ’ స్థాయి నుంచి ‘ద ల్యాబ్ డాగ్ ఆఫ్ ద సొసైటీ’గా శరవేగంగా మారిపోతోందన్నారు. దేశంలోని పలు పార్టీలు, నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీడియాను నియంత్రిస్తున్నారని, వారికి వ్యతిరేకంగా రాసే వార్తలను ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జయలలిత, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ సహా కేసీఆర్ కూడా ఇదే విధానం అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంతో పోలిస్తే అమెరికాలో మీడియా మరింత శక్తివంతంగా, పక్షపాత రహితంగా ఉందని, మీడియా దెబ్బకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అభిశంసనకు గురైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. మహిళలు నిజాయితీగా రాజకీయాలు చేస్తారని చెప్పడం కష్టమని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నబ్‌కు, తనకు వ్యక్తిగత వైరం లేదని, వృత్తిపరమైన పోటీ మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎఫ్ఎల్వో చైర్పర్సన్ కామిని షరాఫ్ అనుసంధానకర్తగా వ్యవహరించగా, పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
బాహుబలి-2ని క్రాస్ చేసిన స్పైడర్!
సాక్షి, చెన్నై : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది తెలిసిందే. ద్విబాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ వాసనలు ఎక్కువైపోవటంతో, హీరోయిజాన్ని దర్శకుడు తక్కువగా ఎలివేట్ చేయటంతో ఫ్యాన్స్ సైతం పెదవి విరిచారు. అయితే ఈ చిత్రంలో కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం బుల్లితెరపై ప్రదర్శించగా.. 10.4 రేటింగ్ సాధించింది. గతంలో బాహుబలి ది కంక్లూజన్ తమిళ వర్షన్‌కు అక్కడ 10.33 రేటింగ్ దక్కింది. దీంతో మహేష్ స్పైడర్ బుల్లితెరపై బాహుబలి-2 టీఆర్పీని దాటేసినట్లయ్యింది. మురుగదాస్ దర్శకుడు కావటం, సూర్య విలన్, మహేష్ క్రేజ్ మూలంగానే ఈ ఘనత సాధించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇదయదళపతి విజయ్ మెర్సల్ చిత్రంతో పోలిస్తే ఈ రెండు చిత్రాలు అత్యధిక టీఆర్పీ సాధించినట్లు కోలీవుడ్ మీడియా వెల్లడించటం ఇక్కడ మరో విశేషం. -
బుల్లితెరపై కూడా సూపర్ హిట్టే..!
అల్లు అర్జున్ హీరోగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సినిమా డీజే దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాదించినా దర్శకుడు హరీష్ శంకర్ చేసిన కొన్నివ్యాఖ్యలు నెగెటివ్ పబ్లిసిటీకి కారణమయ్యాయి. ముఖ్యంగా నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ డీజే తుడిచిపెట్టేసిందంటూ చెప్పటం పై మెగా ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర 150 కన్నా డీజే కలెక్షన్లు ఎక్కువ కాదంటూ మెగా ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఇటీవల టీవీలో ప్రసారం అయిన డీజే మరోసారి నాన్ బాహుబలి రికార్డు లన్నింటినీ తుడిచిపెట్టేసిందట. ఈ సినిమా ఏకంగా 21.78 టీర్పీతో మూడోస్తానంలో నిలిచింది. డీజే కన్నాముందు 23 రేటింగ్‌తో బాహుబలి 1, 22.7 రేటింగ్‌తో బాహుబలి 2లు ఉన్నాయి. మరి మరోసారి ఖైది రికార్డ్‌ను డీజే తుడిచేసిందన్న వార్తలపై మెగా అభిమానులు ఎలా స్పందిస్తారోచూడాలి. -
'బిగ్‌బాస్'పై సల్మాన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : బిగ్ బాస్ రియాల్టీ షో ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించగా.. హిందీలో చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించారు. 10 సీజన్లు పూర్తిచేసుకున్న హిందీ బిగ్ బాస్ షో త్వరలో 11వ సీజన్లోకి అడుగుపెట్టనుంది. అయితే సీజన్ ఆరంభానికి ముందే షోపై వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. తాను లేకపోతే ఛానెల్‌కు టీఆర్పీ రేటింగ్స్ రావంటూ బాలీవుడ్ కండలవీరుడు, షో హోస్ట్ సల్మాన్‌ఖాన్ సంచలనవ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. అసలు విషయం ఏంటంటే.. పది సీజన్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ అక్టోబర్ 1 నుంచి 11వ సీజన్ ప్రారంభం కానుంది. గత ఆరు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'సల్లూభాయ్' ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా ఉంటారు. ఇటీవల ఇందుకు సంబంధించి ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇదివరకూ దాదాపు రూ.8 కోట్లు తీసుకున్న సల్మాన్.. ఈ సీజన్లో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.11 కోట్లు తీసుకుంటారని సమాచారం. తాను తప్ప ఇతర వ్యక్తులు హోస్ట్ చేస్తే.. కంటెస్టెంట్లను హ్యాండిల్ చేయలేరని సల్మాన్ అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీఆర్పీ రేటింగ్స్ కావాలంటే తాను ఉండాల్సిందేనంటూ సల్మాన్ అన్నారని.. ప్రవర్తన సరిగా ఉండాలంటూ పోటీదారులను హెచ్చరించారని ప్రచారం జరుగుతోంది. -
బిగ్‌బాస్ షోలో సంబరాలు
హైదరాబాద్: టీఆర్పీ రేటుంగుల కోసం ఛానెల్స్ మధ్య పోరు తీవ్రంగానే ఉంటుంది. ఇందుకోసం సరికొత్త ప్రోగ్రాములతో ప్రేక్షకులను ఆకర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌తో ఒకప్పటి మాటీవీలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున అలరించారు. తాజాగా స్టార్ మా ఛానెల్ జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్‌బాస్ రియాలిటీ షోను ప్రారంభించింది. ఈ షో టీవీ రేటింగ్స్‌లో సంచలనాలు సృష్టించింది. 14 మంది ప్రముఖులతో ప్రారంభమైన బిగ్‌బాస్ షో తొలుత నిదానంగా ప్రారంభమైన, రోజులు గడిచే కొద్ది టీఆర్పీ రేటింగులను పెంచకుంటోంది. తొలి వారంలో హౌజ్ మెట్స్ మధ్య అంతా సాన్నిహిత్యం లేకపోవడంతో మొదటి వారం నీరసంగా సాగింది. అయితే వారాంతంలో తారక్ ప్రోగ్రాంకు రావడంతో జోష్ అందుకుంది. అత్యధికంగా 16.18 టి.ఆర్.పి రేటింగ్స్ వచ్చింది. దీంతో స్టార్ మా టెలివిజన్ రేటింగ్స్‌లో మొదటి స్థానంలో నిలచింది. దీంతో బిగ్ బాస్ టీం సంబరాల్లో మునిగి తేలింది. బిగ్‌బాస్ యూనిట్ మొత్తం తారక్ సమక్షంలో కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. -
చిరు సినిమాకు సెన్సెషనల్ రికార్డు!
మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ తీసిన సినిమా ’ఖైదీ నెంబర్ 150’ .. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ అయింది. వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించి చిరు సినీ ఛరిష్మా తగ్గలేదని నిరూపించింది. కొన్ని నెలల కిందట విడుదలైన ఈ సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గలేదని తాజాగా బుల్లితెరపైనా రుజువైంది. గత ఆదివారం ఓ టీవీ ఛానెల్లో ఈ చిత్రాన్ని ప్రసారం చేసింది. ఊహించినట్టే బుల్లితెర టీఆర్పీ రేటింగ్స్‌లో ఈ సినిమా నెంబర్ వన్‌గా నిలిచింది. ఇంకో ఛానెల్లో ఐఫా అవార్డుల వేడుకను ప్రసారం చేసినా.. ప్రేక్షకులు మాత్రం ‘ఖైదీ నెంబర్ 150’కే మొగ్గు చూపారు. దీంతో అభిమానుల ఉత్సాహానికి మరింత ఊపునిస్తూ.. చానెల్ నిర్వాహకులు ఈ సినిమాలోని ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’, ‘రత్తాలు రత్తాలు’ పాటలను రెండేసిసార్లు ప్రసారం చేయడం గమనార్హం. ఇలా రెండేసిసార్లు రిపీటెడ్‌గా ప్రసారం చేయడం బుల్లితెర చరిత్రలో ఇదే మొదటిసారట.