బిగ్‌బాస్ షోలో సంబరాలు
హైదరాబాద్: టీఆర్పీ రేటుంగుల కోసం ఛానెల్స్ మధ్య పోరు తీవ్రంగానే ఉంటుంది. ఇందుకోసం సరికొత్త ప్రోగ్రాములతో ప్రేక్షకులను ఆకర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌తో ఒకప్పటి మాటీవీలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున అలరించారు. తాజాగా స్టార్ మా ఛానెల్ జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్‌బాస్ రియాలిటీ షోను ప్రారంభించింది. ఈ షో టీవీ రేటింగ్స్‌లో సంచలనాలు సృష్టించింది.
14 మంది ప్రముఖులతో ప్రారంభమైన బిగ్‌బాస్ షో తొలుత నిదానంగా ప్రారంభమైన, రోజులు గడిచే కొద్ది టీఆర్పీ రేటింగులను పెంచకుంటోంది. తొలి వారంలో హౌజ్ మెట్స్ మధ్య అంతా సాన్నిహిత్యం లేకపోవడంతో మొదటి వారం నీరసంగా సాగింది. అయితే వారాంతంలో తారక్ ప్రోగ్రాంకు రావడంతో జోష్ అందుకుంది. అత్యధికంగా 16.18 టి.ఆర్.పి రేటింగ్స్ వచ్చింది. దీంతో స్టార్ మా టెలివిజన్ రేటింగ్స్‌లో మొదటి స్థానంలో నిలచింది. దీంతో బిగ్ బాస్ టీం సంబరాల్లో మునిగి తేలింది. బిగ్‌బాస్ యూనిట్ మొత్తం తారక్ సమక్షంలో కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.