Jr.NTR
-
శ్రీ దేవి దారిలో జాన్వీ కపూర్..!
-
బాలకృష్ణ ఆశ.. జూ.ఎన్టీఆర్ బొచ్చు కూడా పీకలేరు
-
బాలకృష్ణ తొడ కొట్టడం పై పేర్ని నాని సెటైర్లు
-
అదిరిపోయిన ప్రశాంత్ నీల్ ప్లానింగ్?
-
‘నాటు నాటు’ ప్రభంజనం.. ఆస్కార్ ఫీట్‌తో గూగుల్ సెర్చ్‌లో జూమ్
సాక్షి,ముంబై: 95వ అకాడమీ అవార్డ్స్‌లో సత్తాచాటిన సెన్సేషనల్ సాంగ్ నాటు నాటు హవా ఒక రేంజ్లో కొనసాగుతోంది. ఆస్కార్ గెల్చుకున్న ఇండియన్ తొలి సాంగ్‌గా రికార్డును కొట్టేసిన తర్వాత గూగుల్‌లో నెటిజన్లు తెగ వెతికేశారట. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని ఈ సూపర్-హిట్ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ గెల్చుకున్న తరువాత దీనిపై నెటిజన్ల ఆసక్తి 10 రెట్లకు పైగా పెరిగింది. ఫలితంగా నాటు నాటు సూపర్ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై సెర్చెస్ 1,105 శాతం పెరిగాయని ఒక నివేదిక బుధవారం వెల్లడించింది. జపనీస్ ఆన్లైన్ క్యాసినో గైడ్ 6తకరకుజీ, గూగుల్ సెర్చ్ ట్రెండ్ డేటాను విశ్లేషించింది. ఇందులో తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే నాటునాటు కోసం ఆన్లైన్లో భారీ క్రేజ్ వచ్చిందనీ, సగటు కంటే 10 రెట్లు శోధనలు పెరిగాయని వెల్లడించింది. టాలీవుడ్ హీరోలు, జూ.ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిలిచింది. నాటు నాటు ఒక హై-టెంపో రిథమ్, డ్యాన్స్ , స్టెప్పులు గ్లోబల్‌గా విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాపులర్ సింగర్స్ లేడీ గాగా , రిహన్న వంటి సంగీత దిగ్గజాల మనసు కూడా దోచుకుందీ పాట. అంతేనా ఈ సాంగ్ టిక్‌టాక్‌లో ప్రముఖ సంచలనంగా మారింది, గత సంవత్సరం మార్చిలో విడుదలైనప్పటి నుండి 52.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సంవత్సరం ఆస్కార్ వేడుకలో ఆర్ఆర్ఆర్మూవీకిసముచిత గౌరవం లభించిందనీ, అవార్డుతో చరిత్ర సృష్టించిదంటూ 6టకరకుజీ ప్రతినిధి ప్రశంసించారు. కాగా 95వ అకాడమీ ఆస్కార్ వేడుకలో, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఎలక్ట్రిఫైయింగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఉర్రూత లూగిపోయారు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో నాటు నాటు ప్రదర్శనకు అపురూపమైన స్టాండింగ్ ఒవేషన్‌తో పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. -
ముంబై వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష
-
‘జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా వాడుకున్నారు’
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసన అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒక్కరోజు దీక్ష... దొంగ దీక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వచ్చారని అన్నారు. చంద్రబాబు తన ఎదుగుదల కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా వాడుకున్నారని అంబటి రాంబాబు అన్నారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ధర్మాన్ని ఎక్కడైనా కాపాడారా? అని అంబటి ప్రశ్నించారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘అధికారులపై మీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు దాడులు చేశారు ఇది ధర్మమా? హోదా అవసరం లేదని చెప్పి మీరు చెప్పలేదా. ప్యాకేజి కావాలని అడిగారు మరల హోదా కావాలని అంటున్నారు. మీరు చేస్తున్న దీక్షకు ఎలా మద్దత్తు ఇస్తారు. హోదా కోసం జపాన్ తరహా ఆందోళన చెయ్యడం ఏమిటో అర్థం కావడం లేదు. హోదా సీఎం చేసే దీక్షకు డ్వాక్రా, మహిళలు స్కూల్ పిల్లలు కాదు రావాల్సింది టీడీపీ నాయకులు,కార్యకర్తలు తరలి రావాలి. హోదా కోసం పేపర్ ఉద్యమాలు ఆపేసి ప్రజా ఉద్యమాలు చెయ్యాలి. హోదా కోసం వైఎస్సార్ సీపీ యువభేరి నిర్వహిస్తే సీఎం అడ్డుకున్నారు. పదవుల కోసం కుటుంబాన్ని, రాష్ట్ర ప్రజలను సీఎం మోసం చేశారు. సీఎం చేస్తున్నది ధర్మ పోరాటం కాదు అధర్మ పోరాటం. ప్రజలను, ఉద్యమకారులను తప్పు దారి పట్టించడానికి సీఎం దీక్ష చేస్తున్నారు. జపాన్ తరహా దీక్షలు అంటే ఏమిటో సీఎం చెప్పాలి.’ అని సూటిగా ప్రశ్నలు సంధించారు. -
బిగ్‌బాస్ షో ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..!
హైదరాబాద్: ప్రముఖ తెలుగు ఛానెల్లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షో అతితక్కువ కాలంలోనే అభిమానుల మనసును చూరగొంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో ఆషోకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. యూత్‌లో ఎక్కువ మందికి బిగ్బాస్షో కనెక్ట్ అయింది. మొదట14 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటికే సంపూర్ణేష్ బాబు, జ్యోతి, మధుప్రియ నిష్క్రమించగా కంటిస్టెంట్ల సంఖ్య 11 మందికి తగ్గిపోయింది. అంతలోనే 'బంతిపూల జానకి' సినిమా ఫేం దీక్షా పంత్‌ను వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ షో 70రోజుల పాటు జరగనుంది. ఇందులో పాల్గొనే శనివారం పోటీలో విన్నర్ గెలుచుకొనే డబ్బు మొత్తాన్ని ప్రకటించారు. షోలో గెలిచిన వారికి రూ.50లక్షలను బహుమతిగా ఇవ్వనున్నారు. గెలుచుకున్న డబ్బును ఏం చేస్తారంటూ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్న ఒక్కొక్కరు తన అభిప్రాయాలను వెల్లడించారు. ధనరాజ్ తన శ్రీమతికి ఒక ఇంటిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పగా, కత్తి మహేష్ మాత్రం గెలిచిన మొత్తాన్ని తన భార్య చేతిలో పెడతానంటూ సమాధానమిచ్చాడు. -
బిగ్‌బాస్‌లో రానా?
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో టీవీ రేటింగ్స్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. 14 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటికే సంపూర్ణేష్ బాబు, జ్యోతి, మధుప్రియ నిష్క్రమించగా కంటిస్టెంట్ల సంఖ్య 11 మందికి తగ్గిపోయింది. అంతలోనే 'బంతిపూల జానకి' సినిమా ఫేం దీక్షా పంత్‌ను వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తాజా ఈ షోలో మరో సెలబ్రిటీ కనిపించనున్నారు. నెం.1 యారీ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్‌గా మారిన దగ్గుబాటి రానా బిగ్‌బాస్‌లో పాల్గొననున్నారు. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో ముఖ్య అతిథి షోలో ఆయన కనిపించనున్నారు. ఎన్టీఆర్‌తోపాటు ఆయన ఉంటారని సమాచారం. ఇందులో పాల్గొనేందుకు రానా శనివారం ఇక్కడి నుంచి పూణే బయలుదేరారు. అయితే ఇందులో రానా వెళ్లేది మిగతా సభ్యులతో కలిసి ఆడటానికి మాత్రం కాదు. త్వరలో విడుదల కానున్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈకార్యక్రమంలో పాల్గొననున్నారు. -
బిగ్‌బాస్ షోలో సంబరాలు
హైదరాబాద్: టీఆర్పీ రేటుంగుల కోసం ఛానెల్స్ మధ్య పోరు తీవ్రంగానే ఉంటుంది. ఇందుకోసం సరికొత్త ప్రోగ్రాములతో ప్రేక్షకులను ఆకర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌తో ఒకప్పటి మాటీవీలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున అలరించారు. తాజాగా స్టార్ మా ఛానెల్ జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్‌బాస్ రియాలిటీ షోను ప్రారంభించింది. ఈ షో టీవీ రేటింగ్స్‌లో సంచలనాలు సృష్టించింది. 14 మంది ప్రముఖులతో ప్రారంభమైన బిగ్‌బాస్ షో తొలుత నిదానంగా ప్రారంభమైన, రోజులు గడిచే కొద్ది టీఆర్పీ రేటింగులను పెంచకుంటోంది. తొలి వారంలో హౌజ్ మెట్స్ మధ్య అంతా సాన్నిహిత్యం లేకపోవడంతో మొదటి వారం నీరసంగా సాగింది. అయితే వారాంతంలో తారక్ ప్రోగ్రాంకు రావడంతో జోష్ అందుకుంది. అత్యధికంగా 16.18 టి.ఆర్.పి రేటింగ్స్ వచ్చింది. దీంతో స్టార్ మా టెలివిజన్ రేటింగ్స్‌లో మొదటి స్థానంలో నిలచింది. దీంతో బిగ్ బాస్ టీం సంబరాల్లో మునిగి తేలింది. బిగ్‌బాస్ యూనిట్ మొత్తం తారక్ సమక్షంలో కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. -
బిగ్ బాస్‌లో నేనా..? టైం లేదు: అనసూయ
అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ హోస్ట్‌గా మొదలైన 'బిగ్‌బాస్' రియాల్టీ షోకు ఆదరణ లభించడం లేదని ప్రచారం జరుగుతోంది. కేవలం ఎన్టీఆర్ శని, ఆదివారల్లో కనిపించడం ఓ కారణం అయితే.. హౌస్‌మేట్స్‌లో ఎవరూ పెద్దగా ఇప్పుడు 'ఫైల్'లో ఉన్నవాళ్ళు కాకపోవడం మరో కారణం. అంతా ఔట్‌డేటెడ్ గ్యాంగ్.. అన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అంతేగాకుండా సోషల్ మీడియాలో షో గురించి నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో 'బిగ్‌బాస్' రియాల్టీ షోకి ఊపు తెచ్చేందుకోసం, పలువురు హాట్ సెలబ్రిటీస్‌ని 'వైల్డ్ కార్డ్ ఎంట్రీ' ద్వారా తీసుకొస్తున్నారనే ప్రచారం ఊపందుకొంది. ఈ లిస్ట్‌లో అందరికన్నా ముందు విన్పించిన పేరు హాట్ యాంకర్ అనసూయదే. అయితే, అనసూయ మాత్రం తన చుట్టూ విన్పిస్తోన్న 'బిగ్‌బాస్' గాసిప్స్‌ని కొట్టి పారేసింది. తనకు అంత టైమ్ లేదని తేల్చి చెప్పేసింది. టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నానని అనసూయ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చేసింది. Umm..Laksmi garu..i dont know I dont think I can afford that time to #BigBossTelugu ..i am hands full with prior TV and movie commitments.. -
11నుంచి ఎన్టీఆర్ 27?
‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ చిత్రం తర్వాత తమ అభిమాన హీరో కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న చిన్న ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించనున్న కొత్త చిత్రానికి ఫిబ్రవరి 11న కొబ్బరికాయ కొట్టనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ కొంచెం విరామం తీసుకున్నారు. తర్వాతి చిత్రం ఎవరి దర్శకత్వంలో చేస్తారనే దానిపై పలువురి పేర్లు వినిపించినా, ఫైనల్‌గా బాబీ దర్శకత్వంలో నటించేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫిబ్రవరి 11న గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరపాలనుకుంటున్నారట. ఆగస్టులో సినిమా విడుదల చే సేలా యూనిట్ భావిస్తోందని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్‌ని పెట్టనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘జై లవకుశ’ నమోదు చేయించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు భోగట్టా. అన్నట్లు.. ఇది ఎన్టీఆర్‌కి 27వ సినిమా. -
'తాత గురించి ఎంత చెప్పినా తక్కువే'
-
'తాత గురించి ఎంత చెప్పినా తక్కువే'
హైదరాబాద్ : తాత గురించి ఎంత చెప్పినా తక్కువేనని హీరో జూ.ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ 21వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ తాత అడుగుజాడల్లో నడుస్తామన్నారు. గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఎన్టీఆర్ సంస్కరణలు దేశానికే ఆదర్శమని మాజీ రాజ్యసభసభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. నివాళులర్పించిన వారిలో హీరో కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు. -
జీవితంలో ఎవరికీ తలవంచను : హరికృష్ణ
‘‘నా అరవై ఏళ్ల జీవితంలో ఎవరూ పొందలేని, అనుభవించలేని ఆనంద సమయాలు చూశా. మా నాన్న నందమూరి తారక రామారావుగారి దగ్గర 30 ఏళ్లు పనిచేశా. ఆయనతో నా అనుభవాలు హిమాలయ పర్వతాలను మించిపోయాయి. ఆయన మాకు వీరాభిమానులను ఇచ్చారు. అభిమానాన్ని ఎవరూ దొంగలించలేరు’’ అని నటులు హరికృష్ణ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఇజం’. అదితీ ఆర్య హీరోయిన్. అనూప్ రూబెన్స్ స్వర పరచిన ఈ చిత్రం పాటల సీడీని హరికృష్ణ విడుదల చేసి చిన్న ఎన్టీఆర్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ- ‘‘నేనెప్పుడూ మనసులో అనిపించినది బయటకు చెప్పేస్తా. దాచుకోలేను. ఎన్ని దెబ్బలు తగిలినా జీవితంలో ఎవరికీ తలవంచను.. వంచే ప్రశ్నే లేదు. తల వంచేవాడినైతే ఎన్టీఆర్ కడుపున పుట్టేవాణ్ణే కాదు. ఆయన మాకు జీవితం ఇచ్చింది తలవంచి బ్రతకమని కాదు. కృషి చెయ్. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ఆ బాటలో నా బిడ్డలు వెళుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ ‘ఇజం’ టీజర్ హరికృష్ణగారికి నచ్చడంతో నాకు రెండు పావురాలు బహుమానంగా ఇచ్చారు. ఈ చిత్రం కోసం మూడు నెలల్లో కల్యాణ్ రామ్ 13 కిలోలు బరువు తగ్గాడు. ఇందులో కోర్టు సీన్ హైలెట్’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ- ‘‘నేను ఇప్పటి వరకూ పనిచేసిన వాళ్లలో ‘ఇజం’ టీమ్ బెస్ట్. నా కెరీర్లో బెస్ట్ డెరైక్టర్ పూరీనే. ఆయన గురించి సినిమా విడుదల రోజు ఓ గంట మాట్లాడతా. మరోసారి ఇదే టీమ్‌తో పని చేయాలని ఉంది’’ అన్నారు. ‘‘ ‘టెంపర్’ టైమ్‌లో అన్నయ్యతో(కల్యాణ్ రామ్) ఓ చిత్రం చేయాలనుకుంటున్నట్లు పూరీ భయ్యా నాతో అన్నప్పుడు సంతోషపడ్డా. వెంటనే ఫోన్ చేసి అన్నయ్యకు చెప్పా. ‘టెంపర్’ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అన్నయ్య నాకు ఫిలాసఫర్, గైడ్.. ఒక్కోసారి గర్ల్‌ఫ్రెండ్ కూడా. ‘ఇజం’ కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది’’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ వేడుకలో అదితీ ఆర్య, అనూప్ రూబెన్స్, నందమూరి రామకృష్ణ, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, నటులు తనికెళ్ల భరణి, ప్రకాశ్‌రాజ్, అలీ, పాటల రచయిత భాస్కరభట్ల, కెమెరామేన్ ముఖేష్, ‘ఆదిత్య’ నిరంజన్, దర్శకుడు హేమంత్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటికీ తారక్‌ను తిట్టుకుంటుంటా! - రాజమౌళి
ఎడిటింగ్ అసిస్టెంట్‌గా కెరియర్ ప్రారంభించిన రాజమౌళి పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. డెరైక్టర్‌గా పదిహేనేళ్ల ప్రస్థానం కంప్లీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమా 2000లో సెప్టెంబర్ 27న విడుదలైంది. తాజాగా రాజమౌళి ఆ సంగతులు పంచుకుంటూ, ‘‘స్విట్జర్లాండ్‌లో ‘స్టూడెంట్ నెం.1’ షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు, తారక్‌కు (జూనియర్ ఎన్టీఆర్) ఒకే రూమ్. నాకేమో 9 గంటలకే పడు కునే అలవాటు. తారక్ అర్ధరాత్రి 12 వరకూ టీవీ చూసేవాడు. ఆ టీవీలో వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం స్విస్ భాషలో వస్తుండేది. ఆ విషయం గుర్తుకొస్తే ఇప్పటికీ తారక్‌ని తిట్టుకుంటుంటా’’ అన్నారు. ‘‘ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం మిన హా మిగిలిన సన్నివేశాల్లో నాకు దర్శకత్వ అనుభవం లేని విషయం తెలుస్తుంది. సక్సెస్ టూర్లో 19 ఏళ్ల తారక్‌ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, పెద్ద వయసు వారూ రావడం మరచిపోలేని అనుభూతి’’ అని రాజమౌళి పేర్కొన్నారు. చిన్న ఎన్టీఆర్ స్పందిస్తూ, ‘‘పదిహేనేళ్ల క్రితం వర్ధమాన దర్శకుడిగా జర్నీ ప్రారంభించిన నా జక్కన్న దేశంలో అత్యంత గౌరవనీయమైన దర్శకులు. ఆయనకు సుదీర్ఘ ప్రయాణం ఉంది’’ అని అన్నారు. -
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం?
హైదరాబాద్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో జూ.ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం త్వరలో తెరకెక్కనుందట. త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేసే విషయమై ఎన్టీఆర్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. దసరా నాటికి పూరీ జగన్నాధ్ దర్శకుడుగా తన సోదరుడు కల్యాణ్ రాం నిర్మాతగా ఓ చిత్రంలో నటించేందుకు తారక్ సిద్ధమయ్యారు. ఆ చిత్రం షూటింగ్ ప్రారంభమైన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని, ఇక అధికారికంగా ప్రకటించటమే మిగిలి ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
'జనతా గ్యారేజ్'లో కొత్త సన్నివేశాలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో అతి పెద్ద హిట్‌గా నిలిచిన 'జనతా గ్యారేజ్' కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.70కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే జోరుని కొనసాగిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి మరో రెండు సన్నివేశాలను జత చేశారు. ఆదివారం నుంచి ఈ కొత్త సన్నివేశాలతో కలిపి సినిమా ప్రదర్శితమవుతోంది. దీంతో అభిమానులు మళ్లీ చూసే అవకాశాలు ఎక్కువ. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. జనతా గ్యారేజ్ హిట్‌తో మరింత టాప్ లెవల్‌కు చేరుకున్నాడు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో తారక్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. కొత్త సన్నివేశాలు జత చేయడంతో ఈ వారం కూడా కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. -
రేపు సెన్సార్ కి 'జనతా గ్యారేజ్'
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్' సెప్టెంబరు 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్.. రిలీజ్ సంబంధిత పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం సాయంత్రం సెన్సార్‌కు వెళ్లనుంది. సెన్సార్ పూర్తి కాగానే అన్ని ప్రాంతాలకు ప్రింట్స్ పంపిణీ కానున్నాయి. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో తనకంటూ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించారు. సమంత, నిత్యా మీనన్‌లు తారక్ సరసన హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ఇప్పటికే హల్ చల్ చేస్తుంది. -
ఒకరోజు ముందే ఆ సినిమా రిలీజ్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' సెప్టెంబర్ 2వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సోమవారంతో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా పోస్ట్ ప్రొడక్షన్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. ముందు ప్రకటించినట్లు సెప్టెంబర్ 2న కాకుండా, ఒకరోజు ముందే.. అంటే సెప్టెంబర్ 1 వ తేదీనే ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శకుడు కొరటాల శివ స్పష్టం చేశారు. ఈ మేరకు అందరి ఆశీస్సులు కావాలంటూ ట్వీట్ చేశారు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన 'జనతా గ్యారేజ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సమంతలు హీరోయిన్లుగా నటించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. And all set for September 1st. Need ur love and blessings. Thank u all. — koratala siva (@sivakoratala) 23 August 2016 And here it is.. pic.twitter.com/2LCQwcWnzZ — koratala siva (@sivakoratala) 23 August 2016 -
'నా ప్రాణం లెక్క చేయనంత'
యువ హీరో మంచు మనోజ్ ఒక్క ట్వీట్‌తో తారక్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. ట్విట్టర్లో ఓ అభిమాని 'అన్నా.. నీకు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం?' అని ప్రశ్నించగా.. నా ప్రాణం లెక్కచేయనంత అంటూ సమాధానమిచ్చాడు మనోజ్. దాంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్ చేయాలి అని, మంచువారి మంచి ఫ్రెండ్షిప్ అని.. రకరకాల కామెంట్లు పోస్టు చేస్తున్నారు అభిమానులు. ఇండస్ట్రీలో తారక్, మనోజ్‌ల మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉందన్నది తెలిసిన విషయమే. కాగా ప్రస్తుతం మంచు మనోజ్.. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో 'ఒక్కడు మిగిలాడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మనోజ్ ఉద్యమకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్గా నటిస్తుంది. శివ ఆర్. నందిగం ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. @HeroManoj1 @akramsyedrocks anna niku ntr ante enta ishtam? — Yashwanth Kumar (@yashwanthk115) 19 August 2016 Naa Pranam Lekacheyani anthaa:) https://t.co/iqRnDHHcgf — Manchu Manoj (@HeroManoj1) 19 August 2016 -
ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది
గత కొన్ని రోజులుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 12 వ తేదీన పాటలను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. శిల్ప కళావేదికలో గ్రాండ్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎన్టీఆర్, సమంతలపై పాట చిత్రీకరణకు మూవీ టీం కేరళ చేరుకుంది. ఎన్టీఆర్ సరసన మరో కథానాయికగా నిత్యామీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రి రిలీజ్ బిజినెస్ పరంగా దూసుకుపోతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా పక్కాగా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్
-
క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్
యంగ్ జనరేషన్ హీరోలు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ఉత్సాహం పాల్గొంటున్నారు. ముఖ్యంగా నయం కానీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతీ ఒక్కరు కదలివస్తున్నారు. ఇటీవల క్యానర్‌తో బాధపడుతున్న అమ్మాయిని తమిళ హీరో ధనుష్ పరామర్శించగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు క్యాన్సర్ బాధితున్ని కలిసి ధైర్యం చెప్పాడు. బెంగళూరుకు చెందిన నాగార్జున కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఎన్టీఆర్‌ను కలవటమే తన ఆఖరి కోరిక అని తెలపటంతో.. ఆ అభిమానిని కలిసేందుకు ఎన్టీఆర్ సమయమిచ్చాడు. నాగార్జునతో కొంత సమయం గడిపిన జూనియర్, అతని ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఎన్టీఆర్ చేసిన పనికి అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులనుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇది దయాగాడి దండయాత్ర...
‘దండయాత్ర... ఇది దయాగాడి దండయాత్ర’ అంటూ ‘టెంపర్’ చూపించారు ఎన్టీఆర్. యంగ్ టైగర్ నటనలో ఫైర్‌కు రెండున్నర గంటల తెరరూపమే ఈ ‘టెంపర్’ సినిమా. ఈ కథను రాసిన వక్కంతం వంశీ ఇంతకంటే పవర్ఫుల్ క్యారెక్టర్లో ఎన్టీఆర్‌ను చూపించనున్నారు. విశేషం ఏంటంటే... ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించనున్నారు కూడా. ఎన్టీఆర్‌తో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారు. దీని కోసం ఓ పవర్ఫుల్ స్టోరీ కూడా రెడీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్న, హీరో కల్యాణ్‌రామ్ నిర్మించనున్నారు. ఆగస్టులో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 2న ‘జనతా గ్యారేజ్’ విడుదలైన తర్వాత వక్కంతం వంశీ, ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. రచయితల్లో మంచి దర్శకులు కూడా ఉంటారని ఇప్పటికే త్రివిక్రమ్, కొరటాల శివ వంటి వాళ్లు నిరూపించారు. ఇప్పుడు వక్కంతం వంశీ కూడా దర్శకుడిగా మారనున్నారు. ఇప్పటివరకూ దర్శకులుగా కూడా సక్సెస్ అయిన రచయితల జాబితాలో వంశీ కూడా చేరతారని ఊహించవచ్చు. -
జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ తో వచ్చేశాడు..
జనతా గ్యారేజ్ ఫస్ట్‌లుక్‌తో నందమూరి అందగాడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకొచ్చేశాడు. ఒకరోజు ముందుగానే తన అభిమానులకు పుట్టినరోజు ట్రీట్ ఇచ్చేశాడు. తన తాజా చిత్రం ఫస్ట్‌లుక్‌ను 'జనతా గ్యారేజ్' ఫస్ట్‌లుక్ అంటూ ఎన్టీఆర్ గురువారం తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ నెల 20న (శుక్రవారం) ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు జనతా గ్యారేజ్ కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. గడ్డంతో బైక్‌పై మాస్ లుక్‌తో కనిపించిన ఎన్టీఆర్ పోస్టర్ అదుర్స్ అనిపించేలా ఉంది. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరో పోస్టర్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. (చదవండి....స్టైలిష్‌గా...స్టన్నింగ్‌గా..!) నాన్నకు ప్రేమతో చిత్రం సక్సెస్‌తో మంచి జోరులో ఉన్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో మరో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. అంతేకాదు ఈ నెల 28న సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జనతా గ్యారేజ్ ఫస్ట్ టీజర్‌ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ముగించి ఆగస్టులో సినిమా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు యూనిట్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదలను భారీగా ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ గత చిత్రాలు ఓవర్సీస్లో మంచి వసూళ్లు సాధించటంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి జనతా గ్యారేజ్ ఆడియోలో అమెరికాలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. Here it is. #JanathaGarage1stLook pic.twitter.com/lv9y5Ig99k — tarakaram n (@tarak9999) 19 May 2016 -
ఎన్టీఆర్ కు షాకిచ్చిన జపాన్ యువతి
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఓ మహిళా అభిమాని స్వీట్ షాకిచ్చింది. ఏకంగా జపాన్ నుంచి ఆ యువతి తారక్‌ను కలిసేందుకే ఇండియాకు విచ్చేసింది. ఆమె సరాసరి హైదరాబాద్‌లో జరుగుతున్న 'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌కు వెళ్లడంతో అంతా ఆశ్చర్యపోయారు. తారక్ సినిమాలు కొన్ని జపనీస్‌లోకి డబ్ చేసి విడుదల చేయడం తెలిసిన విషయమే. 'బాద్షా' సినిమా అక్కడ మంచి బిజినెస్ చేసింది కూడా. అలా తారక్ సినిమాలు చూసి అభిమాని అయిపోయిన నాన్ అనే యువతి అతడిని కలిసేందుకు ఏకంగా జపాన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. మంగళవారం నగరానికి చేరుకున్న ఆమె తారక్ ఎక్కడున్నాడో తెలుసుకుని డైరెక్ట్‌గా స్పాట్‌కు వెళ్లి యూనిట్ ను ఆశ్చర్యపరిచింది. తన అభిమాన నటుడిని కలుసుకుని ఉబ్బితబ్బిబ్బయ్యింది. తారక్ సినిమాల్లోని కొన్ని డైలాగులు తెలుగులో చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. తాను నటించిన పలు సినిమాల గురించి ఆమె మాట్లాడటం చూసిన ఎన్టీఆర్ మహదానంద పడిపోయారు. తెలుగు నేర్చుకోవాలని ఉందని, త్వరలో నేర్చేసుకుంటానని అంటోంది. ఎన్టీఆర్ సినిమాలన్నీ చూసినట్లు నాన్ చెప్పింది. అంతేకాకుండా ఆమె 'నాకు తెలుగు అంటే ఇష్టం' కోట్ రాసిన టీ షర్ట్ ధరించింది. ఎల్లలు దాటి వచ్చిన అభిమానానికి ఎన్టీఆర్‌తోపాటు యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీ అయ్యారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతా గ్యారేజ్' ఆగష్టులో విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. -
అలాంటివారిలో తారక్ ఒకడు- నాగ్
'సోగ్గాడే చిన్ని నాయన' సూపర్ హిట్ అవ్వడంతో మాంచి ఊపు మీదున్న టాలీవుడ్ మన్మధుడు నాగార్జున 'ఊపిరి' తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊపిరి సినిమా గురించి మాట్లాడుతూ నాగార్జున.. యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్తీ పాత్రకు ముందుగా ఎన్టీఆర్ ను అప్రోచ్ అయ్యామని, అతడు కూడా ఊపిరిలో నటించేందుకు ఆసక్తి చూపించారని చెప్పారు. కానీ డేట్స్ సర్దుబాటు అవ్వక తారక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలిపారు. అయితే తారక్ ను ఆ పాత్రకు ఎంచుకోవడం పూర్తిగా తన నిర్ణయమేనని నాగ్ చెప్పారు. ఇంకా మట్లాడుతూ.. 'నేనెప్పుడూ మా పిల్లలకు కూడా సలహా ఇస్తుంటాను.. మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటే అవే స్టార్ డమ్ ను తీసుకొచ్చిపెడతాయని. అయినా 30 ఏళ్ల లోపు స్టార్ డమ్ అందుకున్న నటులు చాలా అరుదు, అలాంటివారిలో తారక్ ఒకడు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లు కూడా 30 ఏళ్ల తర్వాతే స్టార్ డమ్‌ను చవిచూశారు' అంటూ తారక్ మీదున్న ప్రత్యేక అభిమానాన్ని బయటపెట్టారు కింగ్ నాగార్జున. అలాగే నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్ లతో గుండమ్మ కథ 'రీమేక్' ఆలోచనలు కూడా నాగార్జునకు ఉన్నట్లు టాక్. -
'ఆ నలుగురే మూలస్తంభాలు'
-
ఆ నలుగురే మూలస్తంభాలు: జూ.ఎన్టీఆర్
‘‘ నిస్వార్థంగా మేం చేసింది ప్రయోగమో, ప్రయత్నమో గానీ మా వెంట నిలబడ్డ ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మనసా, వాచా, కర్మణ మాతో పాటూ అందరూ నమ్మి అందించిన విజయ మిది. ఇది నా 25వ చిత్రంగా కాక జీవితకాలం గుర్తుండి పోయేలా కథ రాసిచ్చిన సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఈ నెల 13న విడుదలై విజయవంతంగా నడుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం సక్సెస్‌లో నేను మెయిన్ పిల్లర్ అంటున్నారు. కానీ సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబులే మూల స్తంభాల్లా నిలిచారు. ఎన్ని వసూళ్లు సాధించాం, సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందనే విషయాన్ని పక్కనపెడితే ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం’’ అని తెలిపారు. ‘‘సినిమా సక్సెస్ చూస్తే మాటలు రావడం లేదు. సక్సెస్‌కు ముందు బాగా అలసిపోయాను, ఇప్పుడు నిద్రపోవాలనిపిస్తోంది. ఈ సక్సెస్‌లో నాతోపాటూ నా టీమ్, ప్రొడక్షన్ టీమ్ అందరి సపోర్ట్ ఉంది’’ అని సుకుమార్ అన్నారు. ‘‘ఈ చిత్రంలో హీరో, విలన్‌కు మధ్య వచ్చే సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సీన్ చూసిన ఎన్టీఆర్ ‘నీకు ముద్దివ్వాలనుంది’ అని నాతో అంటున్నాడు’’ అని జగపతి బాబు పేర్కొన్నారు. ‘‘37 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నా, ఈ చిత్రం చూశాక నా భార్య ‘చాలా బాగా నటించారు’ అంది. నేనింత నిజా యితీగా నటించడానికి కారణం జూ. ఎన్టీఆర్’’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరోయిన్ రకుల్, నటులు రాజీవ్ కనకాల, నవీన్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జూ.ఎన్టీఆర్ కు టీటీడీపీ బాధ్యతలివ్వాలి
► తెలుగు తమ్ముళ్ల డిమాండ్ ► ఎన్టీఆర్ భవన్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతలను నందమూరి కుటుంబానికే అప్పగించాలని ‘తమ్ముళ్లు’ డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు టీటీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం ద్వారా దివంగత ఎన్టీఆర్ అభిమానులకు పార్టీలో న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ అక్కడున్న లోకేష్ కటౌట్లను, కార్యకర్తలకు ఆర్థిక సాయం చేసినట్లు చూపించే ఫ్లెక్సీలను చించివేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. అలాగే పార్టీ హైదరాబాద్ నాయకుడు నైషధం సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో మరికొందరు నాయకులు ఎన్టీఆర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. పార్టీ టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. అమ్ముకున్న టికెట్లను పార్టీని నమ్ముకున్న నిజమైన కార్యకర్తలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రబాబును ఉద్దేశిస్తూ రాసిన వినతిపత్రాన్ని ఎన్టీఆర్ విగ్రహానికి సమర్పించారు. గ్రేటర్ టికెట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలు, నాయకులు సీట్లు అమ్ముకోవడం వంటివాటిపై విచారణ జరిపించాలని అందులో కోరారు. తెలంగాణలో టీడీపీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కు బాధ్యతలు అప్పగించాలన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్టీఆర్ అభిమానులను, టీడీపీ కార్యకర్తలు, నాయకులను జలగల్లా పీక్కుతింటారన్నారు. చంద్రబాబు అందుబాటులో లేనందువల్లే ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించామని.. చంద్రబాబును కలసి గ్రేటర్లో జరిగిన సంఘటనలను వివరిస్తామని సత్యనారాయణమూర్తి చెప్పారు. టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు సస్పెన్షన్ ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో నారా లోకేష్ ఫ్లెక్సీలను చించివేసిన ందుకు టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని టీఎన్ఎస్ఎఫ్ విభాగం ఇన్చార్జి కె.మదన్మోహన్రావు మీడియాకు తెలియజేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అక్బర్‌బాగ్ డివిజన్ సీటును ఆశించిన శ్రీకాంత్‌రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. దీంతో ఇతర టీడీపీ, అనుబంధ సంఘాల నేతలతో కలసి ఆయన బుధవారం ఎన్టీఆర్ భవన్లో ధర్నా చేశారు. లోకేష్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను చింపేశారు. దీనిని పార్టీ వ్యతిరేక చర్యగా భావించిన నాయకత్వం... శ్రీకాంత్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని మదన్మోహన్రావును ఆదేశించింది. ఈ మేరకు శ్రీకాంత్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్లు మదన్మోహన్రావు ప్రకటించారు. అక్బర్‌బాగ్ డివిజన్లో నిర్వహించిన సర్వేలో శ్రీకాంత్‌రెడ్డి మూడోస్థానంలో ఉన్నందున టికెట్ ఇవ్వలేదని... టీడీపీ, బీజేపీ కూటమి కోసం కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరాన్ని కార్యకర్తలు గుర్తించాలని పేర్కొన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ర్యాలీ
హైదరాబాద్ : సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఓ సామాజిక వర్గం వారి మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టర్లను ముద్రించారని, తక్షణం ఆ పోస్టర్లను తొలగించి సినిమా నుంచి కూడా ఆ దృశ్యాలను తీసేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో యువకులు శనివారం బంజారాహిల్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఈ పోస్టర్లపై ఫిర్యాదు కూడా చేశామని వెల్లడించారు. రోడామిస్త్రీ కాలనీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాసబ్‌ట్యాంకులోని సెన్సార్‌బోర్డు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. దృశ్యాలు తొలగించకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వందలాదిగా యువకులు బైక్ ర్యాలీతో వెళ్లడంతో బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. -
ఎన్టీఆర్ కు తెగ నచ్చేసిన 'కుమారి'
సున్నితమైన ఫీలింగ్స్‌ను స్టోరీ లైన్‌గా ఎంచుకుని స్క్రీన్‌ను షేక్ చేసే డైరెక్టర్ సుకుమార్. అతడు మొదటిసారి నిర్మాతగా మారి కథాకథనాలు అందించిన చిత్రం 'కుమారి 21 ఎఫ్'. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ల కన్నా ముందు ప్రశంసలను అందుకుంటోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్ర విజయం పట్ల ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుమారి 21 ఎఫ్... యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనసు కూడా దోచేసిందట. గురువారమే సినిమా చూసిన ఎన్టీఆర్.. కథ హృదయానికి హత్తుకునేలా ఉందని.. ఇలాంటి బ్రేవ్ అండ్ బోల్డ్ రైటింగ్‌కు గాను సుకుమార్‌కు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, దర్శకుడు సూర్య ప్రతాప్‌లు ఓ రేంజ్ లో రాణించారని.. అలాగే హీరోయిన్ హెబ్బా, హీరో తరుణ్ నటన బెస్ట్ అంటూ అభినందించాడు యంగ్ టైగర్. సో సుకుమార్ మార్క్ సున్నితమైన, స్వచ్ఛమైన భావోద్వేగాలను బోల్డ్ గా చూపించడంలో దర్శకుడు సూర్య ప్రతాప్ విజయం సాధించినట్టే. A new age luv story..KUMARI 21F.throughly loved it!!!Pratap Devi and Randy excelled to the highest.heebah and raj were at their best. — tarakaram n (@tarak9999) November 19, 2015 Last but not the least a very heart touching story from the master himself SUKKU Garu..hats off for the brave and bold writing sir. — tarakaram n (@tarak9999) November 19, 2015 -
అభయ్ రామ్‌తో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్!
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. చిరునవ్వులు చిందిస్తున్న తన కొడుకు నందమూరి అభయ్ రామ్‌తో ఆనందంగా గడుపుతున్న క్షణాలు. హాయిగా నవ్వుతూ, కొడుకుతో ఆడుకుంటూ మధురానుభూతిని పొందుతున్నారు. తన ఆనందాన్ని అభిమానులకు కూడా పంచాలని నవ్వులు పూయించే ఆ దృశ్యాలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అభయ్ రామ్‌తో జూనియర్ ఎన్టీఆర్ గడిపే ఆ మధుర క్షణాలను చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. -
తండ్రిగా ఆ బాధ నాకు తెలుసు:జూ.ఎన్టీఆర్
హైదరాబాద్ : పిల్లలకు ఏమైనా జరిగితే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసునని టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీనిధిని మంగళవారం అతడు పరామర్శించాడు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ 'నాకు ఓ కొడుకు ఉన్నాడు. పిల్లలకు ఏదైనా జరిగితే తల్లిదండ్రుల గుండె తరుక్కుపోతుంది. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. చిన్నారి శ్రీనిధి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఆమె కోలుకుని మనందరి మధ్య ఆరోగ్యంగా తిరగాలని కోరుకుంటున్నా. నాకు ఏదో చేయాలని ఉంది. తప్పకుండా సాయం చేస్తా. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నేను రావడం వల్ల అయినా ఆ పాపకు ఆరోగ్యం ఎంతో కొంత మెరుగుపడితే బాగుంటుంది. అందరి ప్రార్థనలు ఫలించి శ్రీనిధి త్వరగా కోలుకోవాలి. పాప కోలుకుంటే అంతకన్నా కావల్సింది ఏమీ లేదు. పాప కోర్కెను తీర్చాలనే ఇక్కడకు వచ్చాను' అని తెలిపాడు. -
శ్రీనిధికి జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ
ఆ చిన్నారికి... జూనియర్ ఎన్టీఆర్ అంటే.. విపరీతమైన అభిమానం. ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా.. చూడకుండా... ఉండదు. ఫస్ట్ షో దొరక్కున్నా... కనీసం విడుదలైన రోజైనా. ఆ సినిమా చూడాల్సిందే. ఎప్పటికైనా తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌ను కలుసుకోవాలన్న కోరిక బలంగా ఉండేది. అయితే ఆడుతూ పాడుతూ ఉన్న ఆ చిన్నారికి కేన్సర్ సోకింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్‌రావ్ ఆస్పత్రిలో చేర్పించారు. తన అభిమాన నటుడుని వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శివాజీ కూతురు శ్రీనిధి. పాపకు పదేళ్లు వయస్సు.. రెండేళ్ల క్రితం నడుము నొప్పి రావటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారికి ఓ పిడుగులాంటి వినాల్సి వచ్చింది. బ్యాక్‌పెయిన్ కాదు... పాపకు బ్లడ్‌క్యాన్సర్ అన్న డాక్టర్ల మాట విని షాక్ తిన్నారు. దీంతో... బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలన్న తల్లిదండ్రులు ఆరాటపడ్డారు. పేరున్న ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇక అమ్మాయి పరిస్థితి మెరుగుపడదని వైద్యులు తేల్చేశారు. దీంతో బిడ్డను ఎలాగూ బతికించుకోలేమనుకున్న తల్లిదండ్రులు... కూకట్‌పల్లిలోని స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న రామ్‌దేవ్‌రావ్ ఆస్పత్రిలో చేర్పించారు. శ్రీనిధి చివరి కోరికనైనా తీర్చాలనుకున్నారు. ఫేస్బుక్ ద్వారా శ్రీనిధి పరిస్థితిని వివరించారు. దీంతో స్పందించిన ఎన్టీఆర్ మంగళవారం పాపను చూసేందుకు నేరుగా ఆస్పత్రికి వచ్చాడు. అయితే శ్రీనిధికి బ్లడ్ కేన్సర్ అన్న విషయం తెలియనివ్వకుండా పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ వస్తున్నాడని చెప్పారు. శ్రీనిధిని కలిసి కొద్దిసేపు ఆమెతో గడిపాడు. ఆ కుటుంబానికి తనకు చేతనైన సాయం అందిస్తానని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చాడు. -
నటుడిగా నా బాధ్యత పెరిగింది : ఎన్టీఆర్
‘‘నేను మామూలుగా సినిమా కలెక్షన్ల గురించి పట్టించుకోను. అభిమానుల కళ్లల్లో ఆనందమే నాకు ముఖ్యం. ఈ ‘టెంపర్’ చిత్రం ప్రతి అభిమానిలో ఆనందం నింపింది. అలాగే నటుడిగా నా బాధ్యతను కూడా పెంచింది. వక్కంతం వంశీ చాలా మంచి కథను ఇచ్చారు. పూరి జగన్నాథ్ తప్ప ఏ దర్శకుడూ ఈ కథను తెరకెక్కించలేరు. అంత బాగా తీశారు’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం ‘టెంపర్’. ఈ చిత్ర విజయోత్సవం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘జీవితం చాలామందికి సరదా తీర్చేస్తుంది... అలానే ఓ బ్లాక్ బస్టర్ ఇస్తుంది. మాకది ‘టెంపర్’ రూపంలో వచ్చింది. నీతో (ఎన్టీఆర్) వర్క్ చేయడానికి నేనెప్పుడూ రెడీ. మంచి కథ ఇచ్చిన వంశీకి ధన్యవాదాలు. ‘ఇది మన జీవితాలను మార్చేసే సినిమా’ అని ప్రకాశ్‌రాజ్ అనేవారు. అది నిజమైంది’’ అన్నారు. ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ - ‘‘మానవ సంబంధాల గురించి ఈ కథలో చాలా బాగా చెప్పారు. తారక్ నట విశ్వరూపాన్ని దయా పాత్ర చూపించింది. ఇలాంటి పాత్రలను అతను మళ్లీ మళ్లీ చేయాలి’’ అని చెప్పారు. బండ్ల గణేశ్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం విడుదల రోజు వరకు మా అందరికీ టెంపర్! ఆ మరుసటిరోజు నుంచి బంపర్! పూరి, తారక్ అవకాశం ఇస్తే, మళ్లీ ‘టెంపర్’లాంటి సినిమా నిర్మిస్తా. ఈ చిత్ర విజయంతో ఏడాదికి రెండు సినిమాలు చేయాలనుకుం టున్నా’’ అన్నారు. రచయిత వక్కంతం వంశీ మాట్లాడుతూ - ‘‘ఏ రచయితకైనా స్వేచ్ఛ కావాలి. పూరి నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు. మంచి ఎక్కడున్నా తీసు కోవడం పూరీగారిలో ఉన్న మంచి లక్షణం. ఆయనతో పని చేయాలని చాలాసార్లు ప్రయ త్నించా. ఈ చిత్రంతో కుదిరింది. ఈ కథలో ఎన్టీఆర్‌ని తప్ప నేనెవర్నీ ఊహించ లేదు. దయా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు’’ అని చెప్పారు. చిత్ర సాంకేతిక నిపుణులు అనూప్ రూబెన్స్, భాస్కరభట్ల, కందికొండ, బ్రహ్మ కడలితో పాటు గణేశ్ మిత్రుడైన నటుడు సచిన్ జోషీ, పి.నాగేంద్రకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే వేదికపై వక్కంతం వంశీ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. -
మేము సైతం...
హుదూద్ తుఫాన్ బీభత్సం కారణంగా గోదావరి జిల్లాలు, విశాఖ సహిత ఉత్తరాంధ్ర అతలా కుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి వైపరీత్యంపై సినీపరిశ్రమ అభినందనీయంగా స్పందించింది. పలువురు సినీ ప్రముఖులు మేము సైతం అంటూ బాధితులకు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. బాధితుల సహాయార్థం పవన్‌కల్యాణ్ 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేయనున్నట్లు ప్రకటించారు. బాధిత ప్రాంతాలలో త్వరలోనే పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ స్పందించాలని, అభిమానులు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు. మహేశ్‌బాబు కూడా ఈ విపత్తు విషయంలో తనదైన శైలిలో స్పందించారు. 25 లక్షల రూపాయలు బాధితుల సహాయార్థం ప్రకటించారు. జరిగిన నష్టం నుంచి త్వరగా కోలుకొని, త్వరగా ఆ ప్రాంతాలు పూర్వవైభవానికి చేరుకోవాలని మహేశ్ ఆకాంక్షించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా అభి మానులకు పిలుపునిచ్చారు. సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ కూడా 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం అనౌన్స్ చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి విజయనిర్మల కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఘట్టమనేని అభిమానులు తక్షణం తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రామ్‌చరణ్ 15 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వాటిలో పది లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందిస్తామని, మిగిలిన అయిదు లక్షలు విశాఖకు చెందిన రామకృష్ణ మిషన్ వారికి అందిస్తామని, ఇంకా అయిదువేల పులిహోర పొట్లాలు, పదివేల వాటర్ బాటిల్స్, అయిదు వేల బిస్కెట్ ప్యాకెట్స్ అందిస్తామని రామ్‌చరణ్ మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మానవతా దృక్పథంతో అందరూ కలిసి తుఫాన్ బాధితుల్ని ఆదుకోడానికి ముందుకు రావాలని పిలుపునిస్తూ జూనియర్ ఎన్టీఆర్ 20 లక్షల రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి ప్రకటించారు. షూటింగ్ నిమిత్తం కొచ్చీలో ఉన్న అల్లు అర్జున్ కూడా తుఫాన్ బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కి 20 లక్షల రూపాయిల ఆర్థిక సాయం ప్రకటించారు. తుఫాన్ కారణంగా తానెంతో ఇష్టపడే విశాఖ నగరం రూపురేఖలు మారిపోవడం తననెంతో కలచివేసిందనీ, తాను ప్రకటించిన 20 లక్షల ఆర్ధిక సాయంలో ఎక్కువ శాతం మత్స్యకారుల కుటుంబాలకే చెందాలని బన్నీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభాస్ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. రామ్ కూడా సీఎమ్ రిలీఫ్ ఫండ్‌కు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. అందరూ కలిసి కట్టుగా ఈ విపత్తును ఎదుర్కోవాలని రామ్ పేర్కొన్నారు. ‘హృదయకాలేయం’ ఫేమ్ సంపూర్ణేశ్‌బాబు కూడా లక్ష రూపాయిలు బాధితుల సహాయార్థం అందించడం గమనార్హం. ఇంకా బియ్యం, కూరగాయలు కూడా తుఫాన్ బాధితులకు అందించనున్నట్లు చెప్పారు. తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి కూడా మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతానికి 25 లక్షల రూపాయిలు ఇస్తున్నామని, ఇక ముందు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 3జి లవ్’ చిత్ర నిర్మాత ప్రతాప్ కొలగట్ల ఒక లక్ష రూపాయలు అనౌన్స్ చేశారు. -
మహేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా స్పందించారు!
-
అదుర్స్-2 కథ ఫైనల్ కాలేదు: వినాయక్
చెన్నై: అదుర్స్ చిత్ర కథ ఇంకా ఫైనల్ కాలేదని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తెలిపారు. గతంలో జూ.ఎన్టీఆర్ తో రూపొందించిన 'అదుర్స్' చిత్రానికి సీక్వెల్ గా అదుర్స్-2 నిర్మిస్తున్నారనే వార్తలపై వినాయక్ స్పందించారు. 'కథా చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. త్వరలో కథ చర్చలు పూర్తవుతాయి' అని వినాయక్ అన్నారు. అంతేకాకుండా అదుర్స్2 ఎప్పుడు ప్రారంభమవుతుందని ఇప్పడే చెప్పలేమని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం అల్లుడు శీను విజయంతో దర్శకుడు వీవీవినాయక్ ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే. -
రామయ్య డ్యూయెట్.. ఇంతకీ ఆ జాబిల్లి ఎవరు?
జాబిల్లి ముంగిట్లో డ్యూయెట్లు పాడుకోవడం మనకు తెలుసు. కానీ జాబిల్లితో డ్యూయెట్ పాడటం ఎక్కడైనా విన్నామా? మన ఎన్టీఆర్ పాడబోతున్నాడు. అయితే... ఎన్టీఆర్ డ్యూయెట్ పాడేది... ఆకాశంలోని జాబిల్లితో కాదు, నేల మీది జాబిల్లితో. ఇంతకీ ఆ జాబిల్లి ఎవరు? అనుకుంటున్నారా? సమంత కావచ్చు. శ్రుతీహాసన్ అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే... ‘రామయ్యా వస్తావయ్యా’లో కథానాయికలు వాళ్లిద్దరేగా. ఈ సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన అందమైన యుగళగీతం ‘జాబిల్లి నువ్వే చెప్పమ్మా’. ఈ పాట టీజర్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్ కథ అంటే మాస్ మెచ్చాలి. మా సంస్థ నుంచి వచ్చే సినిమా కథంటే... అన్ని వర్గాలవారికీ నచ్చాలి. అందుకు తగ్గట్టే ‘రామయ్యా వస్తావయ్యా’ కథ ఉంటుంది. ‘బృందావనం’ ఎన్టీఆర్‌కి ఎంత మంచి పేరు తెచ్చిందో.... అంతకు పదింతలు పేరు తెచ్చే సినిమా ఇది. హరీష్‌శంకర్ అద్భుతం అనిపించే స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఎన్టీఆర్ పాత్రను ఆయన మలిచిన తీరు చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమాతో హరీష్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. తమన్ శ్రావ్యమైన స్వరాలందించాడు. త్వరలో పాటలను, సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఎన్టీఆర్‌తో తనకిది హ్యాట్రిక్ హిట్ అవుతుందని తమన్ నమ్మకం వ్యక్తం చేశారు. సానుకూల దృక్పథాన్ని పెంపొందించే పాట రాశానని అనంతశ్రీరామ్ చెప్పారు. ఇందులో కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారని స్క్రీన్‌ప్లే రచయిత రమేష్‌రెడ్డి అన్నారు. కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ముఖేష్‌రుషి, రవిశంకర్, రావురమేష్, అజయ్, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. -
ఎన్టీఆర్, చరణ్ సినిమాలపై ఉద్యమాల ప్రభావం
తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల ప్రభావంతో తమ సినిమాలు అనుకున్న సమయానికి విడుదల చేయలేక చిత్ర నిర్మాలు అల్లాడుతున్నారు. క్రేజీ హీరోలు అందరిపైన ఈ ప్రభావం పడుతోంది. తండ్రుల రాజకీయ నిర్ణయాల ప్రభావం కొడుకుల సినిమాలపై పడుతోంది. ఈ విధంగా మొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ చిత్రానికి దెబ్బతగితే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రానికి తగులనుంది. చిత్రం ఏమిటంటే సినిమా అడకపోతే వాస్తవానికి నష్టపోయేది నిర్మాత. నిర్మాత ఎవరు? ఏ ప్రాంతం వారు? అనే విషయం ఉద్యమకారులు ఆలోచించడంలేదు. హీరోల కుటుంబ సభ్యులు రాజకీయాలలో ఉంటే ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటోంది. కేంద్ర మంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు తెలుపలేదని, మంత్రి పదవికి రాజీనామా చేయలేదని అతని కుమారుడు చిత్రాలను సీమాంధ్రలో అడ్డుకుంటామని సమైక్యాంధ్రవాదులు హెచ్చరించారు. దాంతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా విడుదల తేదీలను పలుమార్లు ప్రకటించి వాయిదాలమీద వాయిదాలు వేశారు. ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరి కృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపధ్యంలో అతని కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వం అని ఓయు విద్యార్థి జెఎసి హెచ్చరించింది. జూనియర్ ఎన్టీఆర్ సమైక్యావాదో, తెలంగాణవాదో స్పష్టం చేయాలని జెఎసి డిమాండ్ చేసింది. దీంతో ఈ ప్రభావం హరీష్‌శంకర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్య వస్తావయ్యా' చిత్రం విడుదలపై పడనుంది. చిరంజీవి సో్దరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉద్యమాల ప్రభావం వల్ల ఈ చిత్రం విడుదల తేదీలను కూడా వాయిదాలపై వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఎవడు, రామయ్య వస్తావయ్యా రెండు చిత్రాలకు నిర్మాత దిల్ రాజు. ఇంకో విశేషమేమిటంటే ఈ రెండు సినిమాలలో హీరోయిన్గా శృతిహాసన్ నటించగా, రామయ్యావస్తావయ్యా, అత్తారింటికి దారేది చిత్రాలలో సమంత హీరోయిన్గా నటించింది. మరో విశేషం ఏమిటంటే అత్తారింటికి దారేది, ఎవడు రెండు సినిమాలకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. -
సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్
ఎన్టీఆర్ తన కెరీర్లో వేగం పెంచారు. వరుసపెట్టి సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సెప్టెంబరులో ఆ చిత్రం విడుదల కానుంది. ఇక మరో పక్క ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఇప్పుడు సుకుమార్ సినిమా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సుకుమార్ చెప్పిన కథ ఎన్టీఆర్‌కి విపరీతంగా నచ్చేసిందట. చాలా కొత్త కాన్సెప్ట్‌తో ఉన్న ఆ మూవీని చేయడానికి వెంటనే ఎన్టీఆర్ ఓకే చెప్పేశారు. కొత్త కాన్సెప్ట్‌తో హీరో కారెక్టరైజేషన్ని డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తూ స్టయిలిష్‌గా సినిమాలు తీస్తాడని పేరున్న సుకుమార్, ఎన్టీఆర్ ఇమేజ్‌కి నప్పే విధంగా స్క్రిప్టుని చేసుకున్నారట. ప్రస్తుతం ఆయన మహేశ్‌బాబు. ‘1-నేనొక్కడినే’ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తిగానే ఎన్టీఆర్ చిత్రం మొదలవుతుంది. బివీఎస్ఎస్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. -
జూ.ఎన్టీఆర్‌తో సిల్లీబ్రాండ్