బిగ్‌బాస్ షో ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..!
హైదరాబాద్: ప్రముఖ తెలుగు ఛానెల్‌లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షో అతితక్కువ కాలంలోనే అభిమానుల మనసును చూరగొంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో ఆషోకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. యూత్‌లో ఎక్కువ మందికి బిగ్‌బాస్‌షో కనెక్ట్ అయింది. మొదట14 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటికే సంపూర్ణేష్ బాబు, జ్యోతి, మధుప్రియ నిష్క్రమించగా కంటిస్టెంట్ల సంఖ్య 11 మందికి తగ్గిపోయింది. అంతలోనే 'బంతిపూల జానకి' సినిమా ఫేం దీక్షా పంత్‌ను వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ షో 70రోజుల పాటు జరగనుంది. ఇందులో పాల్గొనే శనివారం పోటీలో విన్నర్ గెలుచుకొనే డబ్బు మొత్తాన్ని ప్రకటించారు. షోలో గెలిచిన వారికి రూ.50లక్షలను బహుమతిగా ఇవ్వనున్నారు. గెలుచుకున్న డబ్బును ఏం చేస్తారంటూ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్న ఒక్కొక్కరు తన అభిప్రాయాలను వెల్లడించారు. ధనరాజ్ తన శ్రీమతికి ఒక ఇంటిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పగా, కత్తి మహేష్ మాత్రం గెలిచిన మొత్తాన్ని తన భార్య చేతిలో పెడతానంటూ సమాధానమిచ్చాడు.