అదుర్స్-2 కథ ఫైనల్ కాలేదు: వినాయక్
చెన్నై: అదుర్స్ చిత్ర కథ ఇంకా ఫైనల్ కాలేదని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తెలిపారు. గతంలో జూ.ఎన్టీఆర్ తో రూపొందించిన 'అదుర్స్' చిత్రానికి సీక్వెల్ గా అదుర్స్-2 నిర్మిస్తున్నారనే వార్తలపై వినాయక్ స్పందించారు.
'కథా చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. త్వరలో కథ చర్చలు పూర్తవుతాయి' అని వినాయక్ అన్నారు.
అంతేకాకుండా అదుర్స్2 ఎప్పుడు ప్రారంభమవుతుందని ఇప్పడే చెప్పలేమని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం అల్లుడు శీను విజయంతో దర్శకుడు వీవీవినాయక్ ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే.