V.V. Vinayak
-
‘14 డేస్ లవ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన వి.వి. వినాయక్
Vv Vinayk Launched 14Days Love First Look: మనోజ్ పుట్టుర్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘14 డేస్ లవ్’. నాగరాజ్ బోడెమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై హరిబాబు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ని డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘ఈ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చాలా బాగుంది, మంచి ప్రేమకథని ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు నాగరాజ్ బోడెమ్‌కు, నిర్మాత హరిబాబుకి ఈ చిత్రం మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుతూ.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు. -
‘ఇంటిలిజెంట్’ మూవీ రివ్యూ
తారాగణం : సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, బ్రహ్మానందం తదితరులు జానర్ : యాక్షన్, కామెడీ నిర్మాత : సి. కళ్యాణ్ సంగీతం : ఎస్. తమన్ దర్శకుడు : వి.వి. వినాయక్ మెగా అల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే సుప్రీం హీరోగా ఎదిగాడు సాయి ధరమ్ తేజ్. గత కొంతకాలంగా సరైన హిట్‌లేక సతమతమవుతున్న తరుణంలో మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో చేసిన సినిమా ఇంటిలిజెంట్. మెగాస్టార్ కమ్‌బ్యాక్ మూవీతో హిట్ కొట్టిన వినాయక్, ఫుల్ ఎనర్జీ ఉన్న సాయిధరమ్ కలిసి చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం... కథ నందకిషోర్ (నాజర్) ఓ సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని. తనకు వచ్చిన లాభాలతో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఎంతో మంది పేద పిల్లలను, అనాథలను చేర దీసి ఆదరిస్తూ ఉంటాడు. ప్రతిభ ఉన్న చిన్నారులను చదివిస్తుంటాడు. అలా తేజ (సాయిధరమ్ తేజ్)ను చదివిస్తాడు. ఆ కృతజ్ఞతతో నాజర్ వద్దే పనిచేస్తూ ఉంటాడు. తన సాఫ్ట్వేర్ కంపెనీ వల్ల మిగతా ఏ కంపెనీలు మనుగడను సాధించలేకపోతాయి. అలా ఓ కంపెనీ యజమానులు మాఫియా డాన్ విక్కీభాయ్ (రాహుల్ దేవ్)ను ఆశ్రయిస్తారు. విక్కీభాయ్ తమ్ముడు దేవ్‌గిల్ రంగంలోకి దిగి నాజర్‌ను బెదిరిస్తాడు. కానీ నాజర్ వాటికి తలొంచడు. ఇదంతా తేజ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఆ మరునాడే నాజర్ ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ తేజ ఇదంతా నమ్మడు. దేవ్‌గిల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తేజ ఏం చేస్తాడు? అసలు నాజర్‌ది ఆత్మహత్యనా? హత్యనా? అసలు ఏం జరిగింది? తేజ ధర్మభాయ్గా ఎందుకు మారాడు? ధర్మభాయ్ ఏం చేశాడన్నదే మిగతా కథ. నటీనటులు సాయిధరమ్ తేజ్ డ్యాన్సులు, ఫైట్స్‌తో మెగా అభిమానులను అలరించాడు. లావణ్య త్రిపాఠి తన అందంతో ప్రేక్షకులను ముగ్దుల్ని చేసింది. బ్రహ్మానందం కనిపించే రెండు మూడు సీన్లలో నవ్వులు పండించాడు. నాజర్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే తమకు అలవాటైన పోలీస్ పాత్రలో మెప్పించారు. సప్తగిరి, పృథ్వీ, బ్రహ్మానందం, రఘుబాబు, పోసాని కృష్ణమురళీ కామెడీని బాగానే పండించారు. విశ్లేషణ భారీ యాక్షన్ సీన్స్ , కామెడీతో తనదైన శైలిలోనే వినాయక్ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. కథలో కొత్తదనం లేదు. ఆకుల శివ అందించిన మాటలు కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునే స్థాయిలో లేవు. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. సాంగ్స్ లొకేషన్స్ బాగున్నాయి. చమక్ చమక్.. సాంగ్ తీసిన విధానం ఆకట్టుకుంది. వినడానికే కాదు చూడడానికి కూడా బాగుంది. తమన్ సంగీతానికి మార్కులు పడ్డాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్. ఎస్వీ విశ్వేశ్వర్ ఛాయాగ్రహణంతో మెప్పించాడు. ఆయన కెమెరా పనితనం స్క్రీన్‌ను అందంగా కనపడేలా చేసింది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. కొరియోగ్రఫీలో కొత్తదనం కనిపించింది. ప్లస్ పాయింట్స్ పాటలు, ఫైట్స్ కామెడీ చమక్ చమక్ సాంగ్ మైనస్ పాయింట్స్ కథలో కొత్తదనం లోపించడం ముగింపు: ‘ఇంటిలిజెంట్’ అభిమానులు ఆశించినంత ఇంటిలిజెంట్‌గా లేదు. - బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - వి.వి. వినాయక్
-
వినాయక్‌ను పరామర్శించిన సినీ, రాజకీయ ప్రముఖులు
చాగల్లు : సినీదర్శకుడు వీవీ వినాయక్‌ను సోమవారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. వినాయక్ మాతృమూర్తి నాగరత్నం మృతికి వారు సంతాపం తెలిపారు. ప్రముఖ సినీనటుడు నాగార్జున తనయుడు, యువనటుడు అఖిల్ వినాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ వినాయక్‌ను, ఆయన సోదరుడు సురేంద్రకుమార్‌ను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ ఎంపీ చేగొండి హరరామజోగయ్య, సినీ దర్శకుడు శ్రీను వైట్ల, మధ్యాహ్నపు బలరాం, వ్యాపారవేత్తలు నంద్యాల కృష్ణమూర్తి, ఆకుల వినోద్‌బాబు, వెజ్జు వెంకటేశ్వరరావు తదితరులు వినాయక్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు. -
అదుర్స్-2 కథ ఫైనల్ కాలేదు: వినాయక్
చెన్నై: అదుర్స్ చిత్ర కథ ఇంకా ఫైనల్ కాలేదని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తెలిపారు. గతంలో జూ.ఎన్టీఆర్ తో రూపొందించిన 'అదుర్స్' చిత్రానికి సీక్వెల్ గా అదుర్స్-2 నిర్మిస్తున్నారనే వార్తలపై వినాయక్ స్పందించారు. 'కథా చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. త్వరలో కథ చర్చలు పూర్తవుతాయి' అని వినాయక్ అన్నారు. అంతేకాకుండా అదుర్స్2 ఎప్పుడు ప్రారంభమవుతుందని ఇప్పడే చెప్పలేమని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం అల్లుడు శీను విజయంతో దర్శకుడు వీవీవినాయక్ ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే. -
ట్రాఫిక్ని రీమేక్ చేద్దామనుకున్నాను - వీవీ వినాయక్
‘‘‘ట్రాఫిక్’ చిత్రం కథ, కథనాలు అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్‌ని సొంతం చేసుకున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ అదృష్టవంతుడు. ఈ చిత్రాన్ని నేను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాను. మాతృకలో సూర్య చేసిన పాత్రను ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి టాప్‌స్టార్స్‌తో చేయించాలనుకున్నాను’’ అని వి.వి. వినాయక్ అన్నారు. రాధిక, శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్ ముఖ్య తారలుగా, సూర్య ప్రత్యేక పాత్రలో రూపొందిన తమిళ చిత్రం ‘చెన్నయిల్ ఒరునాళ్’. షాహిద్ ఖాదర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘ట్రాఫిక్’ పేరుతో తుమ్మలపల్లి రామసత్యనారాయణ అనువదించారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్, కె.వి.వి.సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, వీరశంకర్, ప్రసన్నకుమార్. బి.కాశీవిశ్వనాథం, మల్టీ డైమన్షన్స్ వాసు, సత్యనారాయణరెడ్డి, దేవిప్రసాద్, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిరంజీవితో సినిమా తీసే అవకాశం వస్తేనా..: వినాయక్
మెగాస్టార్ చిరంజీవితో మరోసారి సినిమా తీసే అవకాశం వస్తే చాలా సంతోషిస్తానని ప్రముఖ దర్శకుడు వి.వి.నాయక్ అన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఠాగూర్' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం 38వ జన్మదినం జరుపుకొంటున్న వినాయక్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన మళ్లీ నటిస్తారా లేదా అన్న విషయం నాకు తెలియదు. ఐతే చిరంజీవి పునరాగమనం చేయాలని భావించి, నాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పిస్తే చాలా సంతోషిస్తా' అని వినాయక్ చెప్పారు.