
వినాయక్‌ను పరామర్శించిన సినీ, రాజకీయ ప్రముఖులు
చాగల్లు : సినీదర్శకుడు వీవీ వినాయక్‌ను సోమవారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. వినాయక్ మాతృమూర్తి నాగరత్నం మృతికి వారు సంతాపం తెలిపారు. ప్రముఖ సినీనటుడు నాగార్జున తనయుడు, యువనటుడు అఖిల్ వినాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ వినాయక్‌ను, ఆయన సోదరుడు సురేంద్రకుమార్‌ను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ ఎంపీ చేగొండి హరరామజోగయ్య, సినీ దర్శకుడు శ్రీను వైట్ల, మధ్యాహ్నపు బలరాం, వ్యాపారవేత్తలు నంద్యాల కృష్ణమూర్తి, ఆకుల వినోద్‌బాబు, వెజ్జు వెంకటేశ్వరరావు తదితరులు వినాయక్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు.