రైతు బతికే పరిస్థితి లేదు!: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires On Chandrababu Govt at Guntur Mirchi Yard | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. ఇకనైనా కళ్లు తెరువు.. రైతు బతికే పరిస్థితి లేదు!: వైఎస్‌ జగన్‌

Published Thu, Feb 20 2025 4:46 AM | Last Updated on Thu, Feb 20 2025 7:02 AM

YS Jagan Fires On Chandrababu Govt at Guntur Mirchi Yard

గుంటూరు మిర్చి యార్డు వద్ద మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు తరలివచి్చన అశేష జనసందోహంలో ఓ భాగం , మిర్చి యార్డులో మహిళా రైతు ఆవేదనను వింటున్న వైఎస్‌ జగన్‌

చంద్రబాబూ.. ఇకనైనా కళ్లు తెరువు  గుంటూరు మిర్చి యార్డులో వైఎస్‌ జగన్‌ కన్నెర్ర

నిరుడు మిర్చి క్వింటాల్‌ 27 వేలు

నేడు మిర్చి క్వింటాల్‌ 10 వేలు కరువే

ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.. పత్తి, మినుము, కందులు, టమాటా.. అదే దుస్థితి 

దిగుబడులు పడిపోయాయి.. పంటలకు ‘మద్దతు’ లేదు.. రైతన్నకు ‘భరోసా’ కరువు 

సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ ఎగ్గొట్టి.. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు  

అన్నదాతల అగచాట్లు కనపడుతున్నా కళ్లు మూసుకుని కూర్చుంటారా? 

గిట్టుబాటు ధరలు కల్పించి పెట్టుబడి సాయాన్ని అందించండి 

భారీగా తరలి వచ్చిన రైతన్నలతో కిక్కిరిసిన గుంటూరు మిర్చి యార్డు  

ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం.. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు.. పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. నాడు సీఎం యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాం. కానీ నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు.   
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయానికి... ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చున్నారని వైఎస్సార్‌ సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఏ రైతన్నా సంతోషంగా లేడు. 

అన్నదాతల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు’’ అని మండిపడ్డారు. ‘ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మరోవైపు దిగుబడులు పడిపోయాయి. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం.. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు.. పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. దళారులకు తావు లేకుండా పంటల కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకున్న ఆర్బీకే వ్యవ­స్థను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్‌ గాలికి వదిలేశారు. 

ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. సీజన్‌ ముగిసే­లోపు ఇన్‌పుట్‌ సబ్సిడీకి స్వస్తి పలికారు. ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ఇక ఇస్తామన్న దాన్నీ ఎగ్గొట్టారు. సూపర్‌ సిక్స్‌లో చెప్పినవన్నీ విస్మరించారు. సున్నా వడ్డీ రాయితీ అందడం లేదు. ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్స్‌ ద్వారా పరీక్షలు నిర్వహించి నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే విధానానికి తిలోదకాలిచ్చారు. 

నాడు సీఎం యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకుంటే నేడు దళారీల దయాదాక్షి­ణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రవేశ­పెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు’ అని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

బుధవారం గుంటూరులోని మిర్చి యార్డుకు వచ్చిన వైఎస్‌ జగన్‌ రైతులను కలిసి వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతు­న్నా­మని మిర్చి రైతులు ఆయన వద్ద మొర పెట్టుకు­న్నారు. వారి కష్టాలు, బాధలు తెలుసుకుని చలించిపోయారు. సావధానంగా సమస్యలు ఆలకించి ధైర్యం చెప్పారు. 

అనంతరం మిర్చి యార్డు బయట వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ఖాతాలోనూ తన పర్యటన వివరాలను పంచుకున్నారు. రైతన్నలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చి యార్డు ప్రాంతం కిక్కిరిసిపోయిందని.. అందువల్ల మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయానని.. అన్ని అంశాలను ట్వీట్‌లో పొందుపరుస్తున్నానని పేర్కొ­న్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

గుంటూరులో భారీగా హాజరైన జన సందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌ 

 ఏ పంట చూసినా ‘మద్దతు’ కరువు..
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. అమ్ముకుందామన్నా కొనేవారు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చా­రు.. మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలు పెట్టారు. అటు తెగుళ్లతో దిగుబడి తగ్గిపోవడం.. ఇటు రేటు లేక అమ్ముకోలేని పరిస్థితులతో అన్న­దా­తల బతుకు దుర్భరంగా మారింది. 

కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులందరి పరిస్థితి దయనీయంగా ఉంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి.. ఏమాత్రం పట్టించుకో­వడం లేదు. ఒక్క రివ్యూ కూడా చేయలేదు. ప్రభు­త్వం తరఫున రైతులను పలకరించేవారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలోనే గుంటూరు మార్కెట్‌  యార్డు ఉన్నా రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబుకు వినిపించడంలేదు. సీఎం చంద్రబాబు రైతులను దళారీలకు అమ్మేశాడు. 

మిర్చి రైతన్న కుదేలు..
మన ప్రభుత్వంలో నిరుడు అత్యధికంగా క్వింటాలు రూ.21 – 27 వేల దాకా పలికిన మిర్చి ధర ఇప్పుడు రూ.8 – 11 వేలకు పడిపోయింది. పంట బాగుంటే మిర్చి ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్ల కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. ఇక పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు కనీసం రూ.1,50,000 పైమాటే అవుతోంది. 
 


కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక్క మిర్చే కాదు.. కంది పండిస్తున్న రైతు­లు కూడా ధరలు లేక  విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే ఇప్పుడు రూ.5,500 కూడా రావడం లేదు. కానీ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150 పైనే ఉంది. అదే గతేడాది రూ.9–10 వేల మధ్య ధర వచ్చే­ది. 

గత ఏడాది క్వింటాలు పత్తి రూ.10 వేలు ఉండగా ఇప్పుడు రూ.5 వేలు కూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558 కాగా ఇప్పుడు రూ.6 వేలు రావడం కూడా కష్టంగా ఉంది. మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలు మినుములు రూ.10 వేలు పలకగా ఇప్పుడు రూ.7 వేలు కూడా రావడం లేదు. టమాటా రైతులకు కిలోకి రూ.3–5 కూడా దక్కడం లేదు. 

పలావూ.. లేదు! బిర్యానీ లేదు! 
ఎన్నికల్లో చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ అన్నారు.. సూపర్‌ సెవెన్‌ అని కూడా అన్నారు. రైతుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్‌ సాయం కాకుండా అన్నదాతా సుఖీభవ కింద తాము రూ.20 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసాను కొనసాగించకుండా రద్దు చేశారు. మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు అందచేశాం. ఇప్పుడు పలావూ.. లేదు! బిర్యానీ లేదు! 

ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం
ఉచిత పంటల బీమాను కూడా చంద్రబాబు రద్దు చేశారు. ఒక సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నా వడ్డీ పథ­కాన్ని రద్దు చేశారు. ఈ–క్రాప్‌ లేకుండా చేసే­శారు. ధరల స్థిరీ­కరణ నిధికి ఎగనామం పెట్టారు. కనీసం ఎరువుల పంపిణీలోనూ కొరతే. ప్రభుత్వం తన బా­ధ్యత నుంచి తప్పుకోవడం దారు­ణం.  

చంద్ర­బా­బూ..! ఇప్ప­టికైనా కళ్లు తెరవండి. రైతే రాజు అని గుర్తించండి. అన్నదాత కన్నీరు పెట్టుకుంటే అది రాష్ట్రానికే అరిష్టం. చంద్రబాబు గుంటూరు మార్కెట్‌ యార్డు­కు వచ్చి మిర్చి రైతులతో మాట్లాడి వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్‌ చేస్తున్నాం.

ఆదుకోకుంటే తీవ్ర పరిణామాలు..
‘ఇవాళ రైతులు ప్రతి విషయంలోనూ దారుణంగా నష్టపోతున్నారు. ఇప్పటిౖకైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదు­కో­వాలి. రైతులకు పెట్టుబడి సహాయం అందించాలి. చంద్రబాబు  కళ్లు తెరిచి గుంటూరు మిర్చి యా­ర్డు­కు రావాలి. రైతుల కష్టాలను తెలుసుకుని వారికి గిట్టు­బాటు ధర లభించే విధంగా అండగా  నిలబడక­పో­తే రాబోయే రోజు­ల్లో తీవ్రమైన పరిణామాలుంటా­యని రైతుల తర­ఫున హెచ్చరిస్తున్నా’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యు­లు, పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, వైఎస్సార్‌సీపీ గుంటూ­రు జిల్లా అధ్య­క్షుడు అంబటి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, గుంటూరు, పల్నాడు జిల్లాల పార్టీ పరిశీలకుడు మోదుగుల, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, ఏసు­రత్నం, మురుగుడు హనుమంతరా­వు, మేయర్‌ కావ­టి మనోహర్‌నాయుడు, మాజీ మంత్రి విడదల ర­జిని,  పార్టీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా, మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేతలు వనమా బాలవజ్రబాబు, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్, అంబటి మురళీకృష్ణ, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

సాయం చేయకపోగా.. వ్యవస్థలు నిర్వీర్యం
చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులకు సాయం చేయకపోగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ మూలన పడేశారు. ఆర్బీకే­లను, ఈ–క్రాప్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లను నీరుగార్చారు. సీజన్‌ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నా వడ్డీకే రుణాలు, విత్తనాలు, ఎరువులకు సైతం నాణ్యతకు ఆర్బీకేల్లో గ్యారంటీ.. ఇలా మేం తెచ్చిన ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారు. 

ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదు.. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలన్న ఉద్దేశమే లేదు. ఓ నెంబరుకు ఫోన్‌ చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం రైతన్నల్లో కనిపించడం లేదు. ఆర్బీకేలు, వాటికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లతో సహా ప్రతి వ్యవస్థ ఇవాళ నిర్వీర్యం అయిపోయాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలంటే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వమే దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాల సరఫరా నిలిపివేసింది. 

రైతులు ప్రైవేట్‌ డీలర్ల దగ్గర ఎరువులు కొనాల్సి వస్తోంది. వాళ్లు కనీసం రూ.100 నుంచి రూ.400 అధిక ధరలకు బ్లాకులో అమ్ముతున్నారు. క్వాలిటీ కంట్రోల్‌ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించిన పరిస్థితి ఉంటే.. ఇవాళ నాణ్యమైనవేవీ అన్నదాతలకు అందని దుస్థితి నెలకొంది. ఇక పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్‌ కాకుండా తాము ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్నదాతలను దారుణంగా మోసం చేసింది.

గొప్ప మార్పులతో రైతన్నకు అండగా..
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రక­టించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు.. మొత్తంగా 24 పంట­లకు కనీస మద్దతు ధరలను ప్రకటించి, రైతులకు ఎమ్మెస్పీ ధర రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలుకు రూ.­65,258 కోట్లు ఖర్చు చేస్తే... ఇతర పంటల కొనుగోలు కోసం రూ.7,773 కోట్లు వెచ్చించి మన ప్రభుత్వం నాడు రైతులను ఆదు­కుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే చంద్రబాబు నిద్రపోతున్నాడు.

⇒ మన ప్రభుత్వ హయాంలో సీఎం యాప్‌ అ­నే గొప్ప మార్పును తెచ్చి ఏపీలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో యాప్‌ తో సమాచారం సేకరించాం. ఆర్బీకేల సిబ్బంది రైతులకు అందుతున్న ధరలపై ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌డేట్‌ చేసేలా చర్యలు తీసుకు­న్నాం. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. జేసీల ఆధ్వర్యంలో మార్కె­టింగ్‌ శాఖతో కలిసి అవసరమైతే ప్రభు­త్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకే­ల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేశాం. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడానికి 14400, 1907 టోల్‌ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు ఈ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.

⇒ ఇప్పుడు మిర్చికి సోకిన మాదిరిగా పంటలకు వ్యాధులు వస్తే మన హయాంలో ఆర్బీకేల సిబ్బంది, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేసి తగిన చర్యలు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆర్బీకేల ద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది. రైతులకు మెరుగైన అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్‌ సెంటర్, పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించాం.

⇒ రైతులకు అందించే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై మన హయాంలో ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం నెలకొల్పిన 147 ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ ల్యాబ్‌ల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఆ ల్యాబ్‌లను గాలికొది­లే­శారు. ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు.

⇒ మన ప్రభుత్వంలో మార్కెట్‌లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసే­వారు. కలెక్టర్లు, ఎస్పీలు ఈ తనిఖీల మీద, తీసు­కుంటున్న చర్యల మీద క్రమం తప్పకుండా రిపోర్టులు ఇస్తూ గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అడ్డుకట్ట పడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం. 

⇒ మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూ లేని విధంగా  చాలా గొప్పగా పంటల బీమా అందించాం. 2019–­20లో రూ.90.24 కోట్లు.. 2020–21­­లో రూ.36.02 కోట్లు... 2021–22లో రూ.439.79 కోట్లు చొప్పున రైతులకు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మన ప్రభుత్వంలో రైతులపై ఒక్కపైసా భారం పడకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసి 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్ట పరిహారం కింద చెల్లించాం. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేసి రైతులపై భారాన్ని మోపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement