Mirchi Farmers
-
మిర్చి రైతులకు చేయూతపై ఎటూ తేల్చని ఏపీ సీఎం చంద్రబాబు
-
మా వల్ల కాదు.. మిర్చికి మద్దతివ్వలేం
-
రైతులపై చిత్తశుద్ధి ఇదేనా చంద్రబాబు: వైఎస్ జగన్
-
రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
తాడేపల్లి : రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయే పరిస్థితి ఉంటే, చంద్రబాబులో ఏమాత్రం కదలిక లేకపోవడం నిజంగా సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ ఎక్స్’ వేదికగా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్న తీరును ఎండగట్టారు.మేం స్పందిస్తే గానీ మీలో కదలిక లేదు.. ‘చంద్రబాబు గారూ, తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి ఉంది. కొనేవాడులేక రూ.10వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ, మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్టుగా యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారు. తూతూ మంత్రంగా మళ్లీ రైతులను మోసం చేసి, ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖరాయడం ఏంటి?, కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖరాయడం ఏంటి? , మీరు బాధ్యతను వేరేవాళ్లమీద నెట్టడం ఏంటి? , మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటిసాకులు వెతుక్కోవడం ఏంటి?, ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు. మేం 2021లో అంటే 5ఏళ్ల కిందట, పెట్టుబడి ఖర్చులు ఎకరాకు రూ.1లక్ష ఉన్నప్పుడు, సాధారణంగా అప్పుడు దిగుబడి ఎకరాకు 20 క్వింటాళ్లుపైన ఉన్నప్పుడు అప్పట్లోనే 5 ఏళ్ల కిందట ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.7,000. గతంలో మీరెప్పుడూ మిర్చికి కనీస మద్దతు ధరలు ప్రకటించలేదు.చంద్రబాబు.. 5 ఏళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా?5ఏళ్ల కిందట, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన పంటలకే కాకుండా, ప్రకటించని పంటలకూ, రాష్ట్రం మరికొన్ని పంటలను అదనంగా చేర్చి మొత్తంగా 24 పంటలకు మద్దతు ధరలు ప్రకటించి, పోటీవాతావరణం కల్పించి ధరలు పడిపోకుండా అడ్డుకోవడమేకాదు, ధరలు పెరిగేట్టుగా చూశాం. ధాన్యం కొనుగోళ్లకు రూ.65,000 కోట్లు ఖర్చు చేయడమే కాకుండా, ఇతర పంటల కొనుగోళ్లకు మరో రూ.7,800 కోట్లు ఖర్చుచేసి రైతుకు అండగా నిలిచాం. మరి ఈ ధరలు ప్రకటించి అప్పటికీ, ఇప్పటికీ 5ఏళ్లు అయ్యింది. 5 ఏళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా? ,అప్పట్లో మిర్చి సాగుకు ఎకరాకు రూ.1లక్ష అయితే, ఇప్పుడు రూ.లక్షన్నర అయిన మాట వాస్తవం కాదా?, మీరుకూడా మాలాగే ఇప్పుడు కొత్త మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు? , రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయలేదు? , కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌చౌహాన్ సింగ్‌కు రాసిన లేఖలో మా హయాంలో మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయని మీరే చెప్పారు. మీరు రాసిన లేఖ ప్రకారమే మా హయాంలో మిర్చికి మోడల్ ధర రూ.20,000 ఉంటే, గరిష్ట ధర రూ.27,000 పలికింది వాస్తవం కాదా?, మిర్చిరైతుల సంక్షోభంపై ఈ జనవరిలో ఉద్యానవనశాఖ అధికారులు నివేదించిన తర్వాత అయినా, మీరేమైనా పట్టించుకున్నారా? , మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని, జోక్యం చేసుకోవాలని నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?, పైగా తప్పుడు రాజకీయాలు చేస్తూ, మిర్చి కొనుగోళ్లతో సంబంధంలేని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకుంటారా? , గతంలో ఎప్పుడైనా, ఏ రాష్ట్రంలోనైనా నాఫెడ్ మిర్చిని కొనుగోలు చేసిందా? , మీచేతిలో ఉన్న మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయకుండా, ఎప్పుడూ మిర్చి కొనుగోళ్లు చేయని నాఫెడ్ కొనాలంటూ లేఖ రాయడం రైతులను నిలువునా మోసం చేయడం, మభ్యపెట్టడం కాదా? , మిర్చిరైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెట్టారు. అలాంటప్పుడు ఈ ఫిబ్రవరి 15న, మీరు పాల్గొన్న మ్యూజికల్‌నైట్‌కు ఎన్నికలకోడ్ అడ్డం రాలేదా?రైతులను కలిస్లే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందానేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా? , పైగా మేము ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడంలేదు, నిన్నటి కార్యక్రమంలో పలానావారికి ఓటు వేయమనికూడా చెప్పలేదు, కనీసం మైక్‌లో కూడా మాట్లాడలేదు. అయినా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇది అప్రజాస్వామికం కాదా?, మీ హయాంలో పంటలకు కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా?, పత్తి, పెసర, మినుము, కంది, టమోటా, మిర్చి, మొన్నటి ధాన్యం సహా అన్ని పంటల రైతులకు కనీసమద్దతు ధరలు లభించక మీరే వారిని సంక్షోభంలో నెట్టిన మాట వాస్తవం కాదా?మేం సృష్టించిన మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేశారు..రైతుకోసం మేం సృష్టించిన మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలు, ఈ క్రాప్ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా నిర్వీర్యం, సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ నిర్వీర్యం, ఆర్బీకేల్లో కనీస మద్దతు ధరల పోస్టర్లు అతికించి, CM APP ద్వారా కొనుగోలు చేసే విధానం నిర్వీర్యం, నాణ్యతను ధృవీకరిస్తూ ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తూ, బ్లాక్‌లో అమ్మే పరిస్థితిని నిరోధిస్తూ చేసిన కార్యక్రమం నిర్వీర్యం, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ ల్యాబుల వ్యవస్థ నిర్వీర్యం, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సెపరేటు కాల్‌సెంటర్, టోల్ ఫ్రీ నంబరును నిర్వహించే వ్యవస్థ నిర్వీర్యం, ఆర్బీకేల్లో కియోస్క్‌లు పెట్టి, రైతులకు తోడుగా నిలిచే విధానం నిర్వీర్యం, సున్నావడ్డీ నిర్వీర్యం, పెట్టుబడి సహాయం నిర్వీర్యం, ధాన్యం కొనుగోలు కాకుండా ఇతర పంటల కొనుగోలుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి నిర్వీర్యం.. మొత్తంగా ఇలా వ్యవసాయరంగంలోని మేం తీసుకు వచ్చిన విప్లవాత్మక వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యంచేశారు.వ్యవసాయం దండగ అన్న మీ ఆలోచన, మైండ్ సెట్ మారలేదు చంద్రబాబుగారు. ఇప్పుడు కూడా కలరింగ్ ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు. 10. మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేదిలేదు.నేను రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్నికేసులు పెట్టినా రైతులకోసం, ప్రజలకోసం నిలబడతాను. చంద్రబాబుగారూ… ఇప్పటికైనా తక్షణమే మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోండి. ఈ సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా, వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించండి.’ అని వైఎస్ జగన్ కోరారు.1. @ncbn గారూ, తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి ఉంది.కొనేవాడులేక రూ.10వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ, మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ సీఎం…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 20, 2025 -
రైతు బతికే పరిస్థితి లేదు!: వైఎస్ జగన్
ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం.. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు.. పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాం. కానీ నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయానికి... ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చున్నారని వైఎస్సార్ సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఏ రైతన్నా సంతోషంగా లేడు. అన్నదాతల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు’’ అని మండిపడ్డారు. ‘ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మరోవైపు దిగుబడులు పడిపోయాయి. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం.. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు.. పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. దళారులకు తావు లేకుండా పంటల కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకున్న ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ గాలికి వదిలేశారు. ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీకి స్వస్తి పలికారు. ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ఇక ఇస్తామన్న దాన్నీ ఎగ్గొట్టారు. సూపర్ సిక్స్‌లో చెప్పినవన్నీ విస్మరించారు. సున్నా వడ్డీ రాయితీ అందడం లేదు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే విధానానికి తిలోదకాలిచ్చారు. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకుంటే నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్సార్ సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరులోని మిర్చి యార్డుకు వచ్చిన వైఎస్ జగన్ రైతులను కలిసి వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మిర్చి రైతులు ఆయన వద్ద మొర పెట్టుకున్నారు. వారి కష్టాలు, బాధలు తెలుసుకుని చలించిపోయారు. సావధానంగా సమస్యలు ఆలకించి ధైర్యం చెప్పారు. అనంతరం మిర్చి యార్డు బయట వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలోనూ తన పర్యటన వివరాలను పంచుకున్నారు. రైతన్నలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చి యార్డు ప్రాంతం కిక్కిరిసిపోయిందని.. అందువల్ల మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయానని.. అన్ని అంశాలను ట్వీట్లో పొందుపరుస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..గుంటూరులో భారీగా హాజరైన జన సందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఏ పంట చూసినా ‘మద్దతు’ కరువు..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. అమ్ముకుందామన్నా కొనేవారు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలు పెట్టారు. అటు తెగుళ్లతో దిగుబడి తగ్గిపోవడం.. ఇటు రేటు లేక అమ్ముకోలేని పరిస్థితులతో అన్నదాతల బతుకు దుర్భరంగా మారింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులందరి పరిస్థితి దయనీయంగా ఉంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్క రివ్యూ కూడా చేయలేదు. ప్రభుత్వం తరఫున రైతులను పలకరించేవారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలోనే గుంటూరు మార్కెట్ యార్డు ఉన్నా రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబుకు వినిపించడంలేదు. సీఎం చంద్రబాబు రైతులను దళారీలకు అమ్మేశాడు. మిర్చి రైతన్న కుదేలు..మన ప్రభుత్వంలో నిరుడు అత్యధికంగా క్వింటాలు రూ.21 – 27 వేల దాకా పలికిన మిర్చి ధర ఇప్పుడు రూ.8 – 11 వేలకు పడిపోయింది. పంట బాగుంటే మిర్చి ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్ల కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. ఇక పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు కనీసం రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక్క మిర్చే కాదు.. కంది పండిస్తున్న రైతులు కూడా ధరలు లేక విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే ఇప్పుడు రూ.5,500 కూడా రావడం లేదు. కానీ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150 పైనే ఉంది. అదే గతేడాది రూ.9–10 వేల మధ్య ధర వచ్చేది. గత ఏడాది క్వింటాలు పత్తి రూ.10 వేలు ఉండగా ఇప్పుడు రూ.5 వేలు కూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558 కాగా ఇప్పుడు రూ.6 వేలు రావడం కూడా కష్టంగా ఉంది. మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలు మినుములు రూ.10 వేలు పలకగా ఇప్పుడు రూ.7 వేలు కూడా రావడం లేదు. టమాటా రైతులకు కిలోకి రూ.3–5 కూడా దక్కడం లేదు. పలావూ.. లేదు! బిర్యానీ లేదు! ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అని కూడా అన్నారు. రైతుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సాయం కాకుండా అన్నదాతా సుఖీభవ కింద తాము రూ.20 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసాను కొనసాగించకుండా రద్దు చేశారు. మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు అందచేశాం. ఇప్పుడు పలావూ.. లేదు! బిర్యానీ లేదు! ధరల స్థిరీకరణ నిధికి ఎగనామంఉచిత పంటల బీమాను కూడా చంద్రబాబు రద్దు చేశారు. ఒక సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఈ–క్రాప్ లేకుండా చేసేశారు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. కనీసం ఎరువుల పంపిణీలోనూ కొరతే. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం దారుణం. చంద్రబాబూ..! ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజు అని గుర్తించండి. అన్నదాత కన్నీరు పెట్టుకుంటే అది రాష్ట్రానికే అరిష్టం. చంద్రబాబు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి మిర్చి రైతులతో మాట్లాడి వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.ఆదుకోకుంటే తీవ్ర పరిణామాలు..‘ఇవాళ రైతులు ప్రతి విషయంలోనూ దారుణంగా నష్టపోతున్నారు. ఇప్పటిౖకైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. రైతులకు పెట్టుబడి సహాయం అందించాలి. చంద్రబాబు కళ్లు తెరిచి గుంటూరు మిర్చి యార్డుకు రావాలి. రైతుల కష్టాలను తెలుసుకుని వారికి గిట్టుబాటు ధర లభించే విధంగా అండగా నిలబడకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలుంటాయని రైతుల తరఫున హెచ్చరిస్తున్నా’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, గుంటూరు, పల్నాడు జిల్లాల పార్టీ పరిశీలకుడు మోదుగుల, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, మేయర్ కావటి మనోహర్‌నాయుడు, మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేతలు వనమా బాలవజ్రబాబు, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్, అంబటి మురళీకృష్ణ, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయం చేయకపోగా.. వ్యవస్థలు నిర్వీర్యంచంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులకు సాయం చేయకపోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ మూలన పడేశారు. ఆర్బీకేలను, ఈ–క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను నీరుగార్చారు. సీజన్ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నా వడ్డీకే రుణాలు, విత్తనాలు, ఎరువులకు సైతం నాణ్యతకు ఆర్బీకేల్లో గ్యారంటీ.. ఇలా మేం తెచ్చిన ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారు. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదు.. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలన్న ఉద్దేశమే లేదు. ఓ నెంబరుకు ఫోన్ చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం రైతన్నల్లో కనిపించడం లేదు. ఆర్బీకేలు, వాటికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లతో సహా ప్రతి వ్యవస్థ ఇవాళ నిర్వీర్యం అయిపోయాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలంటే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వమే దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాల సరఫరా నిలిపివేసింది. రైతులు ప్రైవేట్ డీలర్ల దగ్గర ఎరువులు కొనాల్సి వస్తోంది. వాళ్లు కనీసం రూ.100 నుంచి రూ.400 అధిక ధరలకు బ్లాకులో అమ్ముతున్నారు. క్వాలిటీ కంట్రోల్ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించిన పరిస్థితి ఉంటే.. ఇవాళ నాణ్యమైనవేవీ అన్నదాతలకు అందని దుస్థితి నెలకొంది. ఇక పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాకుండా తాము ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్నదాతలను దారుణంగా మోసం చేసింది.గొప్ప మార్పులతో రైతన్నకు అండగా..⇒ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు.. మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించి, రైతులకు ఎమ్మెస్పీ ధర రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే... ఇతర పంటల కొనుగోలు కోసం రూ.7,773 కోట్లు వెచ్చించి మన ప్రభుత్వం నాడు రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే చంద్రబాబు నిద్రపోతున్నాడు.⇒ మన ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ అనే గొప్ప మార్పును తెచ్చి ఏపీలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో యాప్ తో సమాచారం సేకరించాం. ఆర్బీకేల సిబ్బంది రైతులకు అందుతున్న ధరలపై ఎప్పటికప్పుడు యాప్‌లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకున్నాం. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖతో కలిసి అవసరమైతే ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేశాం. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడానికి 14400, 1907 టోల్‌ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు ఈ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.⇒ ఇప్పుడు మిర్చికి సోకిన మాదిరిగా పంటలకు వ్యాధులు వస్తే మన హయాంలో ఆర్బీకేల సిబ్బంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేసి తగిన చర్యలు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆర్బీకేల ద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది. రైతులకు మెరుగైన అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్, పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించాం.⇒ రైతులకు అందించే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై మన హయాంలో ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం నెలకొల్పిన 147 ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్‌ల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఆ ల్యాబ్‌లను గాలికొదిలేశారు. ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు.⇒ మన ప్రభుత్వంలో మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసేవారు. కలెక్టర్లు, ఎస్పీలు ఈ తనిఖీల మీద, తీసుకుంటున్న చర్యల మీద క్రమం తప్పకుండా రిపోర్టులు ఇస్తూ గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అడ్డుకట్ట పడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం. ⇒ మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూ లేని విధంగా చాలా గొప్పగా పంటల బీమా అందించాం. 2019–20లో రూ.90.24 కోట్లు.. 2020–21లో రూ.36.02 కోట్లు... 2021–22లో రూ.439.79 కోట్లు చొప్పున రైతులకు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మన ప్రభుత్వంలో రైతులపై ఒక్కపైసా భారం పడకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసి 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్ట పరిహారం కింద చెల్లించాం. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేసి రైతులపై భారాన్ని మోపారు. -
జగన్ ఎఫెక్ట్.. కొత్త డ్రామాకు తెర తీసిన చంద్రబాబు
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ గుంటూరుకు వెళ్లి మరీ మిర్చి రైతులకు సంఘీభావం ప్రకటించిన వేళ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త నాటకానికి తెర తీశారు. మిర్చి రైతుల సమస్యలంటూ కేంద్రానికి ఓ లేఖ రాశారాయన. గుంటూరు మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టారు కూడా. అయితే.. సీఎం హోదాలో చంద్రబాబు(CM Chandrababu) ఇన్నాళ్లు మిర్చి రైతుల కన్నీళ్లను పట్టించుకుంది లేదు. గిట్టుబాటు ధరల కోసం ఒక్క సమీక్ష జరిపిందీ లేదు. కనీసం మంత్రులను కూడా అక్కడికి పంపించలేదు. అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్(YS Jagan) స్వయంగా వెళ్లి పరామర్శించాలనుకోగా.. ప్రభుత్వం అడుగడుగునా ఆటంకం కలిగించబోయింది. అయినా కూడా ఆయన ముందుకు వెళ్లారు. రైతులను కలిసి జగన్ వాళ్ల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. మీడియా ముఖంగా వాటిని వినిపించారు కూడా. మిర్చి రైతుల గోడు విన్న జగన్‌కు పేరు దక్కవద్దనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. జగన్ పర్యటన వేళ.. ఆగమేఘాల మీద మిర్చి రైతుల కోసం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు లేఖ రాసింది. మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వం నుండి మాత్రం రైతులకు ఎటువంటి మద్దతు అందిస్తున్నారో తెలియజేకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: చంద్రబాబూ.. ఇకనైనా కళ్లు తెరిచి రైతుల్ని పట్టించుకో -
ధరలు ఎందుకు తగ్గాయి అంటే ఎవ్వరు చెప్పటం లేదు
-
మిర్చి రైతుల సమస్యలు తెలుసుకున్న వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చి యార్డకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్చి యార్డ్‌కు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు, రైతులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఇసుకేస్తే రాలనంత జనం అక్కడికి వచ్చారు. తమ కష్టాలను వైఎస్ జగన్‌కు చెప్పుకునేందుకు రైతులు భారీగా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ పర్యటన సందర్బంగా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఎక్కడా ట్రాఫిక్‌ను క్లియర్ చేయలేదు. మిర్చి యార్డ్ వద్ద పోలీసు అధికారులు భద్రత కల్పించలేదు. ఉద్దేశపూర్వకంగానే భద్రతా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా మిర్చి యార్డ్ వద్ద ఎక్కడా పోలీసులు కనిపించకపోవడం గమనార్హం. -
మిర్చి ధర ఢమాల్.. రైతుల విలవిల
-
నంద్యాల జిల్లాలో మిర్చి రైతు కష్టాలు
-
వరి, మిర్చి సాగుతో నష్టపోయిన రైతన్న..!
-
రాష్ట్రమంతా ఈ–మిర్చ్
సాక్షి, అమరావతి/గుంటూరురూరల్: మిరపలో నాణ్యత, దిగుబడుల పెంపే లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘ఈ–మిర్చ్’ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రమంతా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని డిజిటల్ గ్రీన్ వ్యవస్థాపకుడు రికీన్ గాంధీ(యూఎస్ఏ), బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కంట్రీ హెడ్ శ్రీవల్లీకృష్ణన్లు తెలిపారు. 2021లో చేపట్టిన ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వ సహకారంతో విజయవంతమైందన్నారు. తామందించిన సాంకేతిక పరిజ్ఞానం రైతు భరోసా కేంద్రాల వల్ల గ్రామ స్థాయిలో రైతులకు వేగంగా చేరిందని, ఆర్బీకే వ్యవస్థ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ముందడుగని అభివర్ణించారు. ఆర్బీకేల ద్వారా వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టును రాష్ట్రమంతా విస్తరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మిరపతో పాటు ఇతర పంటలకు కూడా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తామని చెప్పారు. మిరప రైతుల కోసం డిజిటల్ ఆవిష్కరణలపై గుంటూరులో బుధవారం నిర్వహించిన ఒక రోజు జాతీయ వర్క్‌షాప్‌లో వారు మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని మిర్చి రైతులకు డిజిటల్ మార్గాల ద్వారా సలహాలు అందించామన్నారు. రసాయన పురుగు మందుల వినియోగాన్ని నియంత్రించుకుంటూ.. విత్తు నుంచి మార్కెటింగ్ వరకు అనుసరించాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతులపై 4–6 నిమిషాల నిడివితో రూపొందించిన వీడియో సందేశాలను ఆర్బీకే స్థాయిలో పికో ప్రొజెక్టర్ల ద్వారా రైతులకు చేరువచేశామని వివరించారు. ఉద్యాన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్ ఉత్పత్తి, ఉత్పాదకతలతో పాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు డిజిటల్ గ్రీన్, బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. -
మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేకనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రుణ ప్రణాళిక లేకపోవడం, పంటలను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతోపాటు నకిలీ, కల్తీ విత్తనాలు, పురుగుమందుల కారణంగా రైతులు అప్పులపాలై దిక్కుతోచనిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కారించాలని కోరుతూ మంగళవారం సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగలేఖ రాశారు. మిర్చి, పత్తి రైతుల పరిస్థితి తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. ఒక్క మహబూబ్‌బాద్ జిల్లాలోనే రెండు నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. రైతులకు ఒక్క ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి అవుతుందని, ప్రతి రైతుకు రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు అప్పు ఉందని, అప్పులబాధలు భరించలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత రైతు కుటుంబాలకు వెంటనే రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత రైతు కుటుంబాల ప్రైవేట్ అప్పుల విషయమై ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఆ కుటుంబాల్లోని పిల్లలను ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి ప్రభుత్వం ఉచితంగా చదివించాలని కోరారు. కౌలు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, కల్తీ, నకిలీ పురుగుమందుల నివారణకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలన్నారు. రైతువేదికలను పునరుద్ధరించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి రైతులను ఆదుకోవాలని లేఖలో రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
రైతుల పాలిట శాపంగా మారిన మిర్చి పంట
-
ఎర్ర బంగారం ధగధగ.. క్వింటా రూ. 16,000
కర్నూలు: ఎర్ర బంగారం ధగధగ మెరుస్తోంది. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 17 వేల హెక్టార్లు కాగా.. ఈ ఏడాది అత్యధికంగా 23,670 హెక్టార్లలో సాగు చేశారు. ప్రత్యేకంగా ఎండు మిరప కోసం జిల్లా వ్యాప్తంగా 28,368 ఎకరాల్లో సాగు చేశారని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, నంద్యాల, కోవెలకుంట్ల, రుద్రవరం, శిరివెళ్ల, సంజామల, జూపాడుబంగ్లా, నందికొట్కూరు, మిడ్తూరు, పగిడ్యాల, పాములపాడు, కొత్తపల్లి ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేశారు. పంట సాగు చేసినప్పటి నుంచి బింగి, నల్ల తామర వైరస్ తెగుళ్లు వ్యాపించటంతో పంటను కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడ్డారు. చదవండి: వెంగమ్మ పేణీలు.. రుచి మామూలుగా ఉండదు! రసాయన మందుల పిచికారీతో పాటు ఎరువుల కోసం ఎకరాకు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు వెచ్చించారు. సాధారణంగా ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా చీడపీడలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించగా 12 నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ మొదటి కోత పూర్తయింది. దిగుబడి తగ్గినా ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు. గతేడాది క్వింటా రూ.8,000 – రూ.10,000 వరకు మాత్రమే పలికింది. ప్రసుత్తం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో సూపర్ –10 రకం ధర క్వింటా రూ.16,000, 116 రకం రూ. 15,000 పలుకుతోంది. బ్యాడిగ రకం క్వింటా రూ. 18,000 వరకు పలుకుతుందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో మిర్చి కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు లేకపోవడంతో గుంటూరు యార్డుకు, కర్ణాటకలోని బ్యాడిగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో కొంత మేర కొనుగోళ్లు జరుగుతున్నా ధరలో చాలా వ్యత్యాసం ఉండటంతో రైతులు వ్యయప్రయాసలతో గుంటూరు మార్కెట్‌కు తరలిస్తున్నారు. నంద్యాలకు మంజూరైన మిర్చి మార్కెట్ యార్డు త్వరలో అందుబాటులోకి వస్తే రైతుల కష్టాలు తొలగిపోతాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి నేను ఆరు ఎకరాల్లో పండు మిరప సాగు చేశాను. ప్రస్తుతం మొదటి కోత పండు మిరపను తెంపగా ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా రెండు కోతలు పడే అవకాశం ఉంది. మొత్తంగా ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పంటను అమ్మేందుకు గుంటూరు తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – వీరనారాయణ, రైతు, భాస్కరాపురం, కర్నూలు జిల్లా ధరలు నిలకడగా ఉంటే మేలు నేను రెండు ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాను. మొదటి కోత కోయగా ఎకరాకు 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం క్వింటా ధర రూ.16 వేలు పలికింది. వ్యాపారులు స్థానికంగా ధరలు తగ్గించి అడుగుతున్నారు. పండించిన పంటను గుంటూరుకు తీసుకెళ్లి విక్రయించుకోవాల్సి ఉంది. ధరలు ఇలాగే నిలకడగా ఉంటే రైతులకు ఆదాయం వస్తోంది. – జూటూరు నారాయణ, రైతు, భాస్కరాపురం, కర్నూలు జిల్లా -
రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది:భట్టి విక్రమార్క
-
మిర్చిని మింగేస్తోంది
సాక్షి, అమరావతి: వాణిజ్య పంటల్లో ప్రధానమైన మిర్చికి కాయ కుళ్లు సోకి రైతులను అపార నష్టాలకు గురి చేస్తోంది. ప్రస్తుత వాతావరణం, అకాల వర్షాలు, మంచు, భూమిలో తేమ వంటి వాటి వల్ల ఈ తెగులు సోకుతోంది. దీనివల్ల మార్కెట్లో ధర పడిపోతోంది. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖాధికారులు రైతుల్ని అప్రమత్తం చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. శాస్త్రవేత్తల బృందంతో కలిసి రైతులకు నేరుగా సూచనలు, సలహాలు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తెగులు పరిస్థితి ఇలా.. ప్రస్తుతం మిరప కాయ పండే దశలో కొంత, కోత దశలో మరికొంత ఉంది. కోత తర్వాత రవాణా, నిల్వ చేసే దశలో కూడా ఈ తెగులు రావొచ్చు. ఇప్పటికే పలుచోట్ల కాయ కుళ్లు సోకి తాలు కాయలుగా మారి రైతులు నష్టపోతున్నారు. కొల్లిటోట్రైకమ్ అనే శిలీంధ్రం వల్ల ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల 10నుంచి 54 శాతం వరకు దిగుబడి తగ్గిపోతుంది. కాయ నాణ్యత లోపిస్తుంది. పూత సమయంలో మొదలై ఈ నెలాఖరు (మార్చి) వరకు ఈ తెగులు కనిపిస్తూనే ఉంది. అకాల వర్షాలు పడితే తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నీటి పారుదల కింద సాగయ్యే తోటల్లో ఈ బెడద ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి నేలకు దగ్గరగా ఉన్న వాటి కాయలు లేదా ఆకులపై కాయ కుళ్లు లక్షణాలను గమనించవచ్చు. పండు కాయలపై తొలుత చిన్న నీటి మచ్చలు ఏర్పడి క్రమేపీ పెరుగుతాయి. మచ్చలు నలుపు రంగులోకి మారతాయి. తెగులు ఉధృతి ఎక్కువయ్యే కొద్దీ మచ్చల మధ్య భాగంలో వలయాలు ఏర్పడతాయి. పచ్చి కాయలకు కూడా శిలీంధ్రం సోకుతుంది. కానీ.. కాయ పండిన తరువాతే లక్షణాలు బయట పడతాయి. కుళ్లిన కాయలు రాలిపోతాయి. తెగులు ఆశించిన కాయలు ఎండిన తరువాత తాలు కాయలుగా మారతాయి. తాలు కాయలకు మార్కెట్లో ధర వుండదు. నివారణ ఎలాగంటే.. పంట మారుస్తుండాలి. విత్తనం నుంచి తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున మేలైన కాయ నుంచి విత్తనాన్ని సేకరించి శుద్ధి చేయాలి. ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కాప్టా్టన్తో లేదా 3 గ్రాముల మాంకోజెబ్ పట్టించి శుద్ధి చేయాలి. కాయలు పండటం మొదలైన వెంటనే ముందుజాగ్రత్త చర్యగా మాంకోజెబ్, కార్బండిజమ్ 2.5 గ్రాములు లేదా క్లోరోదలోనిల్ 2 గ్రాములు, ప్రోపినెబ్ 2 గ్రాముల్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఆశిస్తే అజాక్స్ స్త్రోబిన్, ప్రోపికొనజోల్, డైఫిన్ కొనజోల్, కాపర్ హైడ్రాక్సైడ్, పైరా క్లోస్ట్రోబిన్, మేటిరమ్, టేబుకోనజోల్, ట్రైప్లొక్స్ స్త్రోబిన్ మందులలో ఏదో ఒక దానిని 10 రోజుల వ్యవధిలో 2, 3 సార్లు పిచికారీ చేయాలని గుంటూరు లాంఫామ్‌లోని ఉద్యాన పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.హరిప్రసాదరావు సూచించారు. నేటినుంచి శాస్త్రవేత్తల బృందాల పర్యటన కాయ కుళ్లు తెగులుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. కాయ కోసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా చేలల్లో ఉన్న కాయలు నాణ్యత కోల్పోకుండా కాపాడుకునేందుకు సూచనలు, సలహాలను ఈ బృందం ఇస్తుంది. ప్రకాశం జిల్లా నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్న తరుణంలో రైతులకు అవగాహన కల్పిస్తే ఇప్పుడే కాకుండా భవిష్యత్‌లోనూ మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు హనుమంతరావు చెప్పారు. తెగులు ఉధృతికి కారణాలివీ - తెగులును తట్టుకోలేని రకాల సాగు - ఏకరూప పంట వేయడం - కాయ పండే దశలో వర్షాలు కురవడం - నీటి తడులు ఎక్కువగా పెట్టడం, తేమ ఎక్కువగా ఉండటం - ఆకులు, కాయలపై తేమ ఎక్కువ సేపు ఉండటం - 20–24 డిగ్రీల ఉష్ణోగ్రత, 80 శాతం కంటే ఎక్కువ తేమ ఉండి మంచు ఎక్కువగా కురవడం -
‘కోవిడ్’ పేరిట రైతులకు బురిడీ
సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ పేరుతో మిర్చి వ్యాపారులు రైతులను నిలువునా దోచేస్తున్నారు. ఈ వైరస్ కారణంగా చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో మిర్చి ధరను సగానికి సగం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం దాకా క్వింటాల్ రూ.22 వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.8,000 నుంచి రూ.13,500లకు కొంటున్నారు. మరో మార్గం లేక రైతులు పంటను అమ్ముకుంటున్నారు. వ్యాపారులు ఆ మిర్చిని ఇతర రాష్ట్రాలకు, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు సమీప భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ కోల్డు స్టోరేజీల్లో మిర్చీని నిల్వ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అధిక డిమాండ్ ప్రతి సంవత్సరం గుంటూరు నుంచి చైనాకు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది సీజను ప్రారంభమైన మొదటి రెండు నెలల్లో 20 వేల మెట్రిక్ టన్నుల సరుకు ఎగుమతి అయింది. కోవిడ్ వైరస్ కారణంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. క్వింటాల్ రూ.22 వేలు పలికిన మిర్చీ ధర రూ.8 వేలకు పడిపోయింది. ఎటువంటి తాలు లేని మిర్చి గుంటూరు మార్కెట్ యార్డులో రూ.13,500 పలుకుతోంది. చైనాకు ఎగుమతులు నిలిచినా ఇతర రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లో మంచి మిర్చికి డిమాండ్ ఉంది. చైనాకు ఇప్పట్లో ఎగుమతులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదంటూ వ్యాపారులు మాయ మాటలు చెబుతూ రైతుల నుంచి తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌కు ప్రతిఏటా 30 వేల నుంచి 50 వేల మెట్రిక్ టన్నులు మిర్చి ఎగుమతి జరుగుతోంది. ఇప్పుడు చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారులంతా రోజుకు 500 నుంచి 1,000 టన్నులను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ అధికంగానే ఉందన్న విషయాన్ని మార్కెటింగ్ శాఖ ప్రచారం చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపారుల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు ‘‘గుంటూరు మిర్చి యార్డులో మంచి ధర లభిస్తుంది. జనవరి నెలాఖరు వరకు గుంటూరు యార్డుకు రోజుకు 1.20 లక్షల బస్తాల (ఒక బస్తా 40 కిలోలు) మిర్చీ వచ్చింది. ప్రస్తుతం చైనాకు ఎగుమతులు నిలిచిపోయాయి. గ్రామాల్లోని వ్యాపారులు రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తుండటంతో రోజుకు దాదాపు 70 వేల బస్తాలే యార్డుకొస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులను తెలుసుకుంటూ పంటను మంచి ధరకు అమ్ముకోవాలి. వ్యాపారుల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు’’ – వెంకటేశ్వరరెడ్డి, సెక్రెటరీ, గుంటూరు మిర్చి యార్డు -
ఆంధ్రా మిర్చి అ'ధర'హో..
కొరిటెపాడు(గుంటూరు): గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్కెట్లో గుంటూరు మిర్చి దుమ్ము రేపుతోంది. మిర్చి మార్కెట్లో శుక్రవారం తేజ రకం రికార్డు స్థాయిలో క్వింటా రూ.19,500ల ధర పలికింది. ఇప్పటికే రైతులు విక్రయించిన పంటను మినహాయిస్తే.. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన వారికి లాభాల పంట పండనుంది. ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చిని గతేడాది తక్కువ సాగు చేయగా.. చైనా, థాయిలాండ్ నుంచి ప్రస్తుతం భారీగా ఆర్డర్లు రావడంతో మిర్చి ఘాటు అ‘ధర’హో అనిపిస్తుంది. చైనా, థాయిలాండ్ నుంచి ఆర్డర్లు మిర్చి అమ్మకాలకు గుంటూరు మార్కెట్ దేశంలోనే పేరు పొందింది. ఏటా జనవరి మొదటి వారంలో సీజన్ ప్రారంభమవుతుంది. నెలరోజులు వేసవి సెలవులు మినహాయిస్తే నవంబర్ వరకు వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈసారి బొబ్బర తెగులు, సాగునీటి కొరత వల్ల మిర్చి దిగుబడి భారీగా తగ్గింది. దీనికి తోడు రైతు ఆశించిన ధర దక్కలేదు. సగటున క్వింటాకు రూ.9 వేలు దక్కింది. అయితే ఒక్కసారిగా మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది. విదేశాలకు గుంటూరు నుంచే ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తుతం చైనా, థాయిలాండ్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. మార్కెట్ యార్డులు, శీతల గిడ్డంగుల్లో సరుకు తక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగింది. మేలు రకం తేజ క్వింటా ధర రూ.19,500కు చేరింది. మిగిలిన మిర్చి రకాలు కూడా క్వింటా రూ.16 వేలు పలుకుతున్నాయి. క్వింటా రూ.22 వేలకు పెరిగే అవకాశం తేజ రకానికి ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది పచ్చిమిర్చి ధర ఎక్కువగా ఉండటంతో ముందుగానే కోశారు. దీంతో పండు మిర్చి ఉత్పత్తి తగ్గడంతో ధరల పెరుగుదలకు కారణమైంది. పెరుగుదల ఇలాగే కొనసాగితే క్వింటా రూ.22 వేలకు చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 10 లక్షల టన్నుల నిల్వలు ప్రస్తుతం రైతుల వద్ద మిర్చి నిల్వలు తక్కువగా ఉన్నాయి. శీతల గిడ్డంగుల్లో 10 లక్షల టన్నుల మేర నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలల నుంచి మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో తేజ, బాడిగ రకాలు క్వింటా రూ.13 వేలు, ఇతర రకాలు రూ.8 వేలు పలికాయి. ప్రస్తుతం తాలు రకాలు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్లోనూ రికార్డు ధర ఖమ్మం వ్యవసాయం: తెలంగాణలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం తేజ రకం మిర్చి క్వింటా ధర రికార్డు స్థాయిలో రూ.20,021లు పలికింది. గురువారం రూ.18,600 ఉండగా.. ఒక్క రోజులో ఏకంగా రూ.1,400లు పెరిగింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నర్సింహాపురం గ్రామానికి చెందిన ఎ.రామారావు నుంచి వ్యాపారులు ఈ ధరకు మిర్చిని కొనుగోలు చేశారు. ఖమ్మం మార్కెట్లో గతేడాది పండించిన పంటను వ్యాపారులు, కొందరు రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేశారు. ఆ నిల్వలకు జూన్ నుంచి ధర పెరుగుతూ వస్తోంది. జూన్‌లో రూ.11వేలు పలికిన ధర నవంబర్ నాటికి రూ.20 వేలకు చేరింది. ప్రస్తుతం పంటను ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. మిర్చికి ఈ స్థాయిలో ధర రావడంతో వ్యాపారులు, రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ధర ఇలాగే కొనసాగితే ఈ ఏడాది సాగు చేసిన రైతులకు సిరులు కురుస్తాయని ఆనందంగా చెబుతున్నారు. పెరిగిన ధరలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.. మిర్చి ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదు.. చాలా సంతోషంగా ఉంది. ధరలు ఇలానే కొనసాగితే రైతులు కష్టాల నుంచి గట్టెక్కడమే కాదు.. లాభాలనార్జిస్తారు కూడా. రెండెకరాలు కౌలుకు తీసుకుని పదేళ్లుగా మిర్చి సాగుచేస్తున్నా. అప్పులు తప్ప మిగిలిందేం లేదు.. ఈ దశలో మిర్చి ధరలు అమాంతంగా పెరగడం ఆశలు రేకెత్తిస్తోంది. మిర్చి రైతులకు మంచి రోజులొచ్చాయనిపిస్తోంది.. – కొక్కెర నాగేశ్వరరావు, విశదల, గుంటూరు జిల్లా -
మిర్చి రైతుకు దండగ.. వ్యాపారికి పండగ
సాక్షి, ఖమ్మం: ఎండనక వాననక..రేయనక పగలనక..రెక్కలు ముక్కలు చేసుకొని రైతులు పండించిన పంటలు వ్యాపారులకు సిరులు కురిపిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించిన కర్షకుడికి నష్టాలు మిగలగా..ఆ సరుకును కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్న వ్యాపారులకు అనతి కాలంలోనే లాభాలను కూడబెడుతున్నాయి. ఈ ఏడాది రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టుకున్నవారికి లాభాల వాన కురుస్తోంది. పలు దేశాల్లో మిర్చికి డిమాండ్ పెరుగుతుండటంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన సరుకుకు ధర పలుకుతోంది. పంట డిమాండ్ ఉన్న దేశాలకు ప్రభుత్వం ఎగుమతులకు అవకాశాలు కల్పించడంతో వ్యాపారులకు బాగా కలిసి వచ్చింది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ప్రధానంగా క్వింటాల్ రూ.12 వేలకు పైమాటే సగటున రూ.4 వేల మేరకు లాభం 32 కోల్డ్ స్టోరేజీల్లో 15లక్షల క్వింటాళ్ల నిల్వలు సాగు చేసే పంటల్లో మిర్చి ఒకటి. చైనా, మలేషియా, సింగపూర్ తదితర దేశాల్లో తేజ రకం మిర్చికి మంచి డిమాండ్ ఉంటుంది. జిల్లాలో జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు ఈ పంట ఉత్పత్తి సీజన్. అప్పుడే పంట విక్రయానికి వస్తుంది. ఖమ్మం పరిసర జిల్లాల్లో పండించిన తేజ రకం మిర్చిని రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో విక్రయిస్తుంటారు. పంట సీజన్లో సగటున క్వింటా రూ.8,500 పలికింది. తొలికోత మిర్చికి రూ.7వేల నుంచి రూ.7,500 వరకు మాత్రమే ధర పలకగా, రెండో కోత మిర్చికి రూ.8 వేల నుంచి రూ. 9వేలకు మించి పడలేదు. ఇక మూడో కోత మిర్చికి రూ. 8 వేల వరకు మాత్రమే ధర పలికింది. అయితే..అప్పుడు రైతుల నుంచి పంటను వ్యాపారులు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టారు. ఇతర ఆదాయ వనరులు, పెట్టుబడులు ఉన్న రైతులు కొందరు నిల్వ పెట్టుకున్నారు. ఏసీ మిర్చికి క్వింటా ధర రూ. 12 వేలకు పైగానే పలుకుతోంది. నిల్వ మిర్చికి భలే గిరాకీ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజ రకం మిర్చి ధర క్రమక్రమంగా పెరుగుతోంది. సీజన్లో వ్యాపారులు పంట కొనుగోలు చేసిన 70 రోజుల వ్యవధిలో ధర అమాంతం పెరిగింది. జూన్ ఆరంభంలో క్వింటా ధర రూ.10 వేలు దాటి..ఇప్పుడు ఎగబాకింది. 20 రోజుల వ్యవధిలో ఏకంగా క్వింటాల్‌కు రూ. 2,300 పెరిగి రూ.12,300లకు చేరింది. ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ. 12 వేల నుంచి రూ. 12,300 వరకు రేటు పడుతోంది. రైతు వద్ద కొనుగోలు చేసిన ధర కన్నా అదనంగా మరో రూ.4 వేలు మిర్చికి ధర పలుకుతోంది. అయితే కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నందుకు స్వల్పంగా ఖర్చులున్నా..భారీగా లాభాలు దక్కనున్నాయి. పొరుగు దేశాల్లో డిమాండ్ తేజ రకం మిర్చికి పొరుగు దేశాల్లో డిమాండ్ ఉంది. దీంతో ఇక్కడ పండించే ఈ రకం మిర్చికి ధర పెరుగుతోంది. చైనా, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు ఈ రకం మిర్చిని వివిధ రకాలుగా వ్యాపారులు ఎగుమతులు చేస్తున్నారు. ఆయిల్ రూపంలో కొందరు, తొడిమలు తీసి మరికొందరు వ్యాపారులు ఈ పంట ఉత్పత్తిని ఎగుమతులు చేస్తున్నారు. దీంతో పంట ఎగుమతుల వేగం తక్కువగా ఉంది. దీంతో ఆయా దేశాల్లో పంటకు డిమాండ్ పెరుగుతోంది. 32 కోల్డ్ స్టోరేజీల్లో లక్షల క్వింటాళ్ల నిల్వలు జిల్లాలోని మొత్తం 32 కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 15 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వలు ఉన్నట్లు సమాచారం. విలువ దాదాపు రూ.15 వేల కోట్లు ఉంటుందని ఓ అధికారి అంచనా వేశారు. కొందరు వ్యాపారులు తమ ఫరమ్ పేరిట, ఏజెన్సీల పేరిట పంటను నిల్వ పెట్టుకోగా, ఇంకొందరు ఆదాయపు, ఇతర పన్నుల నుంచి తప్పించుకునేందుకు రైతుల పేరిట కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టారు. కొద్ది రోజులుగా వ్యాపారులు ఖరీదు దారులకు(ఎగుమతిదారులు) విక్రయాలు చేస్తున్నారు. ఎగుమతి దారులు ఎప్పటికప్పుడు సరుకును విదేశాలకు పంపించేస్తున్నారు. అప్పట్లో క్వింటా రూ.6,500కే విక్రయించా.. రెండెకరాల్లో మిర్చి వేశా. 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. పంట సాగుకు పెట్టుబడి అప్పుగా తీసుకొచ్చా. అవసరాలు, అప్పుల దృష్ట్యా పంట పండిన వెంటనే క్వింటాకు రూ.6,500 చొప్పున విక్రయించా. ఇప్పుడున్న రేటుతో చూసుకుంటే క్వింటాకు రూ.6 వేలు కోల్పోయా. ఇప్పుడు విక్రయించి ఉంటే మరో రూ. 2.40 లక్షల వరకు అదనంగా వచ్చేవి. – బిచ్చాల శ్రీనివాస్‌రావు, వల్లభి, ముదిగొండ మండలం -
మిర్చి రైతుల నేల చూపులు
సాక్షి, నర్సంపేట: మిర్చి రైతులు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ వైపు ప్రకృతి అనుకూలించకపోవడం.. తెగుళ్లు విజృంభించడంతో దిగుబడి తగ్గి రైతులు నిండా మునిగారు. వచ్చిన పంటకైనా గిట్టుబాటు ధర లభిస్తుందోనన్న అన్నదాతను మార్కెట్ మాయాజాలం మరింత నష్టాన్ని కలుగజేస్తోంది. క్వింటా మిర్చి ధర రూ.10 వేల లోపు పలుకుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తలలు పట్టుకుంటున్నారు. గతేడాది మిర్చి ధరలు మురిపించాయి. గిట్టుబాటు కావడంతో రైతులకు కాసింత ఆదాయం సమకూరింది. దీంతో ఈ ఏడాది మిర్చిని రైతులు ఎక్కువగా సాగు చేశారు. ఊహించని విధంగా అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశా యి. వర్షాల తర్వాత తెగుళ్లు దారుణంగా దెబ్బతీ శాయి. తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందు కు రూ.వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీంతో పెట్టుబడులు రెండు రెండింతలయ్యాయి. దిగుబడులు మాత్రం దారుణంగా పడిపోయాయి. పంటను మార్కెట్‌కు తీసుకొస్తే గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. రూరల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి పంట సాగయింది. నర్సంపేట నియోజకవర్గం రైతులు ఈ ఏడాది భూగర్భ జలాలపై ఆధారపడి బోర్లు, వ్యవసాయ బావుల కిందనే వాణిజ్య పంటలను సాగు చేశారు. పెద్ద ఎత్తున మిర్చి పంట వేశారు. కోత దశకు చేరుకున్న సమయంలో మిర్చికి వైరస్ సోకి ఎకరాల కొద్ది పంట దెబ్బతింది. ఎకరానికి రూ.50 నుంచి రూ.60 వేల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన మిర్చి తోటలు వైరస్‌తో ఎర్రబడి ఎండిపోతుండడంతో, నర్సంపేట మండలం దాసరిపల్లి రైతులు దిగులు పడుతున్నారు. -
దళారుల చేతిలో మిర్చి రైతు నిలువుదోపిడీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మిర్చి ధర భారీ గా పతనం కావడంతో.. వ్యాపారులు, దళారులు విశ్వరూపం చూపిస్తున్నారు. దీంతో బాధిత రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) లేకపోవడంతో.. దళారులు, వ్యాపారులు చెప్పేదే రేటుగా మారిపోయింది. రెండు మూడు నెలల్లోనే భారీగా ధరలు పడిపోవడంతో అన్నదాతలు నష్టాలపాలవుతున్నారు. దళారులు, వ్యాపారులను నియంత్రించే వ్యవస్థ లేకపోవడంతో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతోంది. ఏదో ఒక సాకు చెప్పి కీలక సమయంలో ధరలను తగ్గించేస్తున్నారు. మార్కెట్ అధికారులు కూడా దళారులతో కుమ్మక్కై రైతులను పట్టించుకోవడం లేదు. ఉన్నతస్థాయి యంత్రాంగం కూడా దళారుల ఆగడాలను, అన్యాయాలను అడ్డుకునే దిశగా ఆలోచించడం లేదు. వరంగల్ జిల్లాలో ఇటీవల రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయి. గతంలో కొన్ని రాష్ట్రాల్లో క్వింటా మిర్చికి రూ.1,500 వరకు బోనస్ ఇచ్చారు. కానీ తెలంగాణలో దీనిపై ఉలుకూ పలుకూ లేదు. వివిధ పంటలను కొంటున్న ప్రభుత్వం మిర్చిని కొనేందుకు ముందుకు రాకపోవడంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2, 3 నెలల్లో తగ్గిన ధర! రాష్ట్రంలో 2018–19 సీజన్లో మిర్చి 1.15 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 45,025 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 26,895 ఎకరాలు, గద్వాల జిల్లాలో 15,722 ఎకరా లు, వరంగల్ రూరల్ జిల్లాలో 4,485 ఎకరాలు సాగైంది. దేశంలో మిర్చి ఎక్కువగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సాగవుతోంది. ఈసారి తెలంగాణలో 1.29 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి అవుతుందని అంచనా వేశా రు. ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతంలో ‘తేజ’ రకం మిర్చిని అధికంగా పండిస్తుంటారు. ఈ మిర్చి నుంచి నూనెను తీసి వివిధ రకాలుగా వినియోగిస్తుంటారు. చైనా, మలేసియా, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో ఈ ఆయిల్‌ను కారంగా వినియోగిస్తుంటారు. ఇక్కడ పండించే ‘తేజ’ రకం మిర్చి ఆధారంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో చైనీయులు ఓ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. తేజ రకం మిర్చికి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పంట ఉత్పత్తి సమయంలోనే దళారులు ధరను తగ్గించటం శోచనీయం. జనవరిలో వర్షాలు రావడం, కొన్నిచోట్ల వైరస్ సోకడంతో ఉత్పత్తి పడిపోతుందని రైతులు అంటున్నా రు. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. 35–40 క్విం టాళ్ల మధ్య ఉత్పత్తి వస్తుందని, కానీ 20–25 క్విం టాళ్లకు పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మార్కెట్లో ధర పడిపోవడంతో వీరికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. 2 నెలల క్రితం రూ.11,900 ఉన్న మిర్చి ధర, ఇప్పుడు ఐదారు వేల కు మించడంలేదు. అక్కడక్కడ రూ. 7 వేలకు కొం టున్నారు. మార్కెట్‌కు సరుకు ఎక్కువగా వచ్చిందం టే చాలు వ్యాపారులు సిండికేటుగా మారి ఒక్కసారిగా ధరను పతనం చేస్తున్నారు. వానలకు మిర్చి తడిసిందని దళారులు కారణం చెబుతున్నారు. ధర రూ.10–12 వేల మధ్య ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. ఎగుమతుల్లేవని, నాణ్యత తగ్గిందని..! మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గుతోం దని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా మిర్చి ఎగుమతులు లేకపోవటంతో ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఎగుమతులు నిలిచినందున పంటను కొనుగోలు చేసేవారు ఆసక్తి కనబరచటం లేదని వ్యాపారులంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు, తమిళనాడుకు చెందిన దళారులు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ల నుంచి మిర్చి కొనుగోలు చేస్తుంటారు. ఉత్పత్తి లేని గత అక్టోబర్, నవంబర్ నెలల్లో మిర్చి ధర రూ.12 వేల వరకు చేరింది. రెండేళ్ల క్రితం గరిష్టంగా రూ.16 వేలకూ అమ్ముడైంది. ఈ ధరతో ఉత్సాహంగా అనేకమంది పంట సాగు చేశారు. పంట చేతికందే సమయానికి రూ.10 వేలైనా ధర వస్తుందని భావించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని వ్యాపారులు ఇష్టారాజ్యం గా ధరను నిర్ణయించి కొంటున్నారు. కూలీలకు, ఇత ర ఖర్చులకు తెచ్చిన పెట్టుబడులు తీర్చటం కోసం రైతులు పంటను అమ్మక తప్పడంలేదు. దీంతో ఇదే అదనుగా వ్యాపారులు ధరలో మరికొంత కోతబెడుతున్నారు. ఇక పంట తేమగా ఉందని, రంగు మారిందని, ఇటీవల కురిసిన వర్షాలకు పంట తడిసిందని తదితర కారణాలు చెబుతూ తమకు అవసరమైన నాణ్యతా ప్రమాణాల్లో సరుకు లేదంటూ ధరలు తగ్గించడం దోపిడీయే. జెండా పాటకు, కొనుగోళ్లకు పొంతనేదీ? మిర్చి కొనుగోళ్లలో జెండాపాట నిర్వహిస్తారు. నాణ్యమైన సరుకు వద్ద నిర్వహించే జెండాపాటలో వ్యాపారులు పాల్గొని గరిష్ట ధర నిర్ణయిస్తారు. అయితే ఆ ఒక్క లాట్‌కు మాత్రమే జెండాపాట ధర ఉంటుంది. ఇక మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన ఇతర సరుకుకు ఆ ధరను వర్తింపజేయరు. కానీ దాన్నే అసలైన ధరగా అధికారులు చెబుతుంటారు. వ్యాపారులు, మార్కెట్ అధికారులు కలిసి కుమ్మక్కవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటోంది. ధరలో దగా వివిధ కారణాలతో వ్యాపారులు మిర్చి ధరలో దగాకు పాల్పడుతున్నారు. పంట ఉత్ప త్తి సీజన్లో వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తున్నా రు. క్వింటాలుకు రూ.8,500 పలుకుతుందని పంటను అమ్మడానికి తీసుకొస్తే.. రూ.6,500 లకు అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావటంలేదు. పంట కోసిన కూలీలకు, ఇతరత్రా ఖర్చుల కోసం అమ్మక తప్పటం లేదు. – వెంకటనారాయణ, పెద్దబీరవల్లి, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా పంట లేదు.. ధర లేదు! ఈ ఏడాది మిరపకు తెగుళ్లు విపరీతంగా నష్టం చేశాయి. దీంతో దిగుబడులు గణనీయం గా పడిపోయాయి. ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు రావాల్సిన మిర్చి ఈ ఏడాది 15 క్వింటాళ్లకు మించడం లేదు. తెగుళ్ల కారణంగా పెట్టుబడులు కూడా పెరిగాయి. ధరలు ఆశాజనకంగా లేవు. అన్‌సీజన్‌లో రూ.12 వేల వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.7 వేలు దాటడం లేదు. వ్యాపారుల మాయతోనే ఈ స్థితి నెలకొంది. – ఎం.వెంకన్న, పూమ్యాతండా,గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా 1,500 బోనస్ ఇవ్వాలి మిర్చికి ప్రస్తుతం క్వింటాకు రూ.5–6 వేల ధర పలుకుతోం ది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గింది. వ్యాపారులు ఇష్టానుసారంగా ధర నిర్ణయించి రైతులను దోపిడీ చేస్తున్నారు. ఎంఎస్పీ లేకపోవడంతో నియంత్రణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్వింటా కు రూ.1,500 బోనస్‌గా రైతులకు ఇవ్వాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేయాలి. – టి.సాగర్, కార్యదర్శి,తెలంగాణ రైతుసంఘం వర్షాలతో నాణ్యత తగ్గింది కీలకమైన సమయంలో వర్షాలు రావడంతో మిర్చి నాణ్యత తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ధరల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. సీజన్లో ఎంతైనా రూ.7 వేలకంటే తగ్గదని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర రూ.8 వేల కన్నా ఎక్కువే ధర ఉంది. – లక్ష్మీబాయి, డైరెక్టర్, మార్కెటింగ్‌శాఖ -
తెల్లబారిన ఎర్ర బంగారం..!
నర్సంపేట రూరల్: ఈ సారి మిర్చి రైతుల కంట్లో కారం కొట్టినట్లయింది తుఫాన్ల ప్రభావం మిరప పంటపై తీవ్ర ప్రభావం చూపి ది. లక్షలు పెట్టుబడి చేసి సాగు చేస్తే పెట్టుబడులు అట్లుంచితే కనీసం కూలీల డబ్బులు రాని పరిస్థితి ఉంది. చివరకు అప్పులే మిగిలాయి. జిల్లాలో వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గాలు ఉండగా ఎక్కువశాతం నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో మిర్చి పంట లను అధిక సంఖ్య లో సాగు చేస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలకు నర్సంపేట నియోజకర్గంలో అధిక నష్టం జరిగిం ది. నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నర్సంపే ట, నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ, మండలాల్లో ఎక్కువగా మిర్చి రైతులు నష్టపోయారు. మిర్చి పంట సాగు ఒక ఎకరానికి రూ. 1.50 లక్షల ఖర్చు వస్తోంది. దిగుబడి సుమారుగా 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా సుమారు 15 క్వింటాళ్ల నుంచి 18 క్వింటాళ్ల వరకు వచ్చింది. నాణ్యమైన మిర్చి ఉంటే రూ. 8వేల నుంచి రూ.12వేల వరకు ధర పలుకుతోంది. కాని అకాల వర్షాల దెబ్బకు పంట పూర్తిగా దెబ్బతినండంతో ఎక్కువ శాతం తాలు కాయే అయింది. దీనిని మార్కెట్‌కు తీసుకెళ్తే కనీసం ధర రూ. 2వేల నుంచి రూ. 4వేలు పలికే పరిస్థితే కనపడడంలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పంట దిగుబడి సైతం గణనీయంగా పడిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. మరీ తేజ కాయల పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. పంటను ఏరిస్తే సుమారు రూ. 50వేల వరకు కూలీలకే చెల్లించాల్సి వస్తోందని, తీరా మార్కెట్‌కు వెళ్తే కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా పంటనష్టంపై హార్టికల్చర్ అధికారులతో సర్వే నిర్వహించి నష్ట పరిహారం అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. పెట్టుబడి అధికం.. దిగుబడి తక్కువ.. మిర్చి పంట సాగుచేసేందుకు ఎకరానికి సుమారు పది ప్యాకెట్లు వరకు విత్తనాలు అవసరం. ఒక్కొక్క ప్యాకెట్ సుమారు రూ.3వేలు వరకు ధర ఉంది. కొన్ని సందర్భాల్లో ఆ గింజలు మొలకెత్తకపోతే అదనంగా మరో రెండు ప్యాకెట్ల వరకు నారు పోయాల్సి వస్తోంది. దుక్కులు, దున్నినందుకు సుమారు రూ. 10 నుంచి రూ. 15వేల ఖర్చు వస్తోంది. పంట నాటినప్పటి నుంచి కాయలు వేరడం వరకు కూలీల ఖర్చు సుమారు రూ. 50వేల నుంచి రూ. 60వేల వరకు వస్తోంది. ఎరువు, పురుగు ముందుల, ఇతర ఖర్చులతో కలిపి సుమారు రూ. 1.50 వరకు ఖర్చు వస్తోంది. దిగుబడి తగ్గడంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఈ ఏడాది నెలకొన్నాయి. నాణ్యమైన మిర్చి దొడ్డు రకం సుమారు రూ. 10వేల నుంచి రూ. 15 వేల వరకు పలుకుతోంది. సన్నరకం (తేజ)కు రూ. 8వేల నుంచి రూ. 12వేల వరకు పలుకుతోంది. కనీసం ఈ ఏడాది వర్షాలకు దెబ్బతిన్న కాయ పూర్తిగా తాలు కావడంతో సుమారు రూ. 3వేలు కూడా ధర పలికే అవకాశం లేకుండాపోయింది. కూలీల డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు లబోదిబోమంటున్నారు. తెగుళ్లు ఎక్కువగా సోకాయి. మిర్చి పంట ఏపుగా పెరిగే దశలో తుపాన్ల వల్ల వర్షాలు కురిశాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో ఎక్కువ శాతం తెగుళ్లు సోకాయి. జిల్లా వ్యాప్తంగా కొంత శాతం పంట దెబ్బతింది. వర్షం కురిసిన సమయంలో ఎక్కువ పూత దశలో ఉండడంతో పెద్ద నష్టం జరగలేదు. కాకపోతే వర్షాభావ పరిస్థితితో తెగుళ్లు అధికంగా సోకాయి. కాయలమీద ఉన్న చేను మాత్రం దెబ్బతింది. తెగుళ్ల నివారణ కాప్టన్, తైరాన్ పిచికారీ చేస్తే పంట బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితులను అణుగుణంగా నీటిని పంటకు అవసరమున్న మోతాదులోనే అందించాలి. లేని ఝెడల వైరస్లు ఎక్కువ సోకే అవకాశాలు ఉంటాయి. చలి కాలంలో సూక్షపోషకాలు తక్కువగా అందుతాయి. సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి -
హామీ ఏమాయే..?
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మొదటి హామీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. కేవలం కాగితాలకే పరిమితమైంది. రూరల్ జిల్లా వ్యవసాయాధారిత జిల్లాగా పేరొందింది. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక జిల్లాలో ఉన్న పరిస్థితి, వనరుల గురించి జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎం నివేదికలను కోరారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరకాల నియోజకవర్గం గూడెప్పాడ్‌లో పెద్ద కురగాయల మార్కెట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్థల పరిశీలన చేయాలని ఆదేశించారు. అలాగే నర్సంపేట ప్రాంతంతో మిర్చి రీసెర్చ్ సెంటర్ చేస్తానని తొలి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇంతవరకూ ఊసేలేదు.. జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని గూడెప్పాడ్‌లో కూరగాయలు రైతులు బాగా పండిస్తారు. గూడెప్పాడ్ వ్యవసాయ మార్కెట్ ఐదెకరాల విస్తీర్ణంలో ఉంది. మరో ఐదెకరాల భూమిని ఆ మార్కెట్‌కు పక్కనే కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నర్సంపేట పరిసర ప్రాంతాలు, మహబూబాబాద్ జిల్లాలో మిర్చి పంట పండిస్తారు. ఈ మేరకు అధికారులు గూడెప్పాడ్‌లో కూరగాయల మార్కెట్, నర్సంపేటలో మిర్చి సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.. ప్రకటించి దాదాపు రెండేళ్లయినా ఇంతవరకు ముందుకు జరగడం లేదు. మూడు జిల్లాలకు అనువైన ప్రాంతం.. హైదారాబాద్ తరువాత వరంగల్ పెద్ద నగరంగా గుర్తింపు ఉంది. నగరంలో పెద్ద మార్కెట్ ఏర్పాటు చేసేందుకు స్థలం కొరత ఉంది. నగరానికి దాదాపు 14 కిలో మీటర్ల దూరంలోనే గూడెప్పాడ్ ఉండడంతో ఎంపిక అనువైందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మూడు జిల్లాలకు అనువైన ప్రాంతంగా గూడెప్పాడ్ ఉంది. వరంగల్ అర్బన్, రూరల్, భూపాలపల్లి జిల్లాలకు మధ్యలో ఉంటుంది. మార్కెట్ ఏర్పాటు చేస్తే అందరికీ ఆమోద యోగ్యంగా ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక్కడ పండి ంచే రైతులతో పాటు ఇతర ప్రాంతాలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూరగాయలు తరలించవచ్చనే ఆలోచనతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. స్థల సేకరణ.. తెలంగాణలో పత్తి, మిర్చి రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థల సేకరణతో సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత నిధులు మంజూరు బాధ్యత కేంద్రానిది. పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో స్థల సేకరణ విషయంలో అడుగు ముందుకు పడలేదు. మరోవైపు మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు దాదాపు వంద ఎకరాలకు పైగా స్థలం అససరం అవుతుంది. దీని కోసం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట సమీపంలో అశోక్ నగర్ వద్ద సర్వే నంబరు 265/ఏలో 90 ఎకరాల స్థలాన్ని రెవెన్యూశాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్పందన లేదు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీనే అమలు కాకపోవడంతో సర్వత్రా చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. -
పరిహారం.. పరిహాసం
వారంతా ఆరుగాలం కష్టించి పంట పండించిన మిర్చి రైతులు. గతేడాది లాగే లాభాలు వస్తాయి, కొంతలో కొంత కష్టాలు గట్టెక్కుతాయని ఆశించి, మిర్చి పంటను వేశారు. అయితే మార్కెట్లో ధర పతనమవడం తో తీవ్రంగా నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అదనపు పరిహారం ప్రకటించింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న కొందరు అక్రమార్కులు నకిలీ పత్రాలు పుట్టించి లక్షల్లో పరిహారం పొందారు. తీరిగ్గా విషయం తెలుసుకున్న అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేయడంతో అసలు రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈపూరు(వినుకొండ) : ప్రభుత్వం గత ఏడాది రైతులకు ప్రకటించిన మిర్చి అదనపు పరిహారం అందేనా అని రైతన్నలకు సందేహం ఏర్పడింది. అసలు మిర్చి పంట పండించని వారికి పరిహారం అందింది మా పరిస్థితి ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ పత్రాలతో పరిహారం.. 2016 సంవత్సరంలో మిర్చి పంట బాగా దిగుబడి రావడంతో గత ఏడాది కూడా ఎక్కువగా మిర్చిని పండించారు. అయితే పండించిన పంటకు ఆశించిన ధర రాకపోవడంతో రైతన్నలు దిగాలు పడ్డారు. ఇది గమనించిన ప్రభుత్వం క్వింటాకు అదనపు పరిహారం కింద రూ.1500 ప్రకటించింది. ఒక్కో రైతు 20 క్వింటాళ్ల వరకు పరిహారం పొందవచ్చు. ఇదే అదునుగా భావించిన కొండాయిపాలెం, బొగ్గరం, చిన్నకొండాయిపాలెంకు చెందిన కొందరు అక్రమార్కులు పంటలు వేయకపోయినా అధికారులతో లాలుచీపడి పండించినట్లు నకిలీపత్రాలు సృష్టించి సుమారు రూ.20లక్షల వరకు అదనపు పరిహారం పొందారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణకు అదేశించారు. విచారణ మూడు నెలలపాటు సాగింది. ఆర్డీఓ సారధ్యంలో 100 మంది అధికారులతో విచారణ పూర్తి చేశారు. సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు పరిహారం రాకపోవడంపై సందేహం ఏర్పడింది. సుమారు 558 మంది రైతులకు రూ.కోటి 29లక్షలు నగదు రావాల్సి ఉంది. మండలంలోని రైతులు ఈనెల 9న జిల్లా అధికారులను కలిసి పరిహారం వెంటనే అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దర్జాగా అక్రమార్కులు.. రోడ్డున పడ్డ ఉద్యోగులు అక్రమంగా మిర్చి పరిహారం పొందిన వారు దర్జాగా తిరుగుతుంటే. అందుకు సహకరించిన ఉద్యోగులు ఉద్యోగాలు పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదైనా ఇంతవరకు వారి వద్దనుంచి నగదును రికవరీ చేయకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించడంలో ముఖ్యపాత్ర పొషించిన ఒక వీఆర్ఓ సస్పెండ్ అవటంతోపాటు ఇద్దరు వ్యవసాయ విస్తరణ అధికారులు అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఎంపీఈఓలు తమ ఉద్యోగాలు ఊడి రోడ్డున పడ్డారు. అలాగే హర్టికల్చర్ ఎంపీఈఓను విధుల నుంచి తొలగించారు. దీనికి కారణమైన టీడీపీ నాయకులు మాత్రం దర్జాగా తన పనులు జరుపుకొంటున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పరిహారం ప్రశ్నార్థకం ! మిర్చి అదనపు పరిహారం అసలు అందేనా అని రైతులకు సందేహం ఏర్పడింది. అక్రమార్కులు చేసిన పనిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం రైతులకు మొండిచేయి చూపుతుందేమోనని సందేహం ఏర్పడింది. మరలా పంట చేతికివచ్చినా పరిహారం రాకపోవడంతో పలురకాల అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. అప్పు తీర్చుకుందామనుకున్నాను నేను మూడు ఎకరాలు మిర్చి పంట వేశాను. చివరి కోతలో ప్రభుత్వం అదనపు పరిహారం ప్రకటించింది. దీంతో సంతోష పడ్డాను, 16 క్వింటాళ్లు యార్డుకు తీసుకొని పోయి అమ్మాను, రూ.24వేలు అదనంగా వస్తాయని అనుకున్నా. అదనపు పరిహారం అందితే కనీసం మందుల కొట్లో అప్పుతీర్చుకుందామనుకున్నాను. పరిహారం రాకపోవడంతో ఆ అప్పు అంతే ఆగిపోయింది. ఏంచేయాలో పాలు పోవడం లేదు. – మందపాటి కోటేశ్వరావు, రైతు, బొగ్గరం ఏడాదైనా పరిహారం లేదు నాకు సొంతగా ఎకరం పొలం ఉంది. మరో ఎకరంన్నర పొలం కౌలుకు తీసుకుని మిర్చి పంట వేశాను. గత ఏడాది మిర్చి బాగా పండిందని అదనంగా వేశాను. చివరి దశలో వచ్చిన 20 క్వింటాళ్ల మిర్చిని యార్డుకు అమ్మాను. ప్రభుత్వం అదనపు పరిహారం చెల్లిస్తానని చెప్పిన మాటలు నమ్మాను. ఏడాదైనా ఇంకా అందలేదు. – గన్నవరం వెంకయ్య, మిర్చి రైతు వచ్చిన వెంటనే ఖాతాల్లో జమచేస్తాం మిర్చి పరిహారం పొందవల్సినవారికి పరిహారం ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే వారి ఖాతాలకు నగదు జమచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమార్కుల వద్ద నుంచి రికవరీ విషయం నా పరిధిలోనిది కాదు. – తెల్లిక సుబ్బారావు, మండల వ్యవసాయశాఖాధికారి, ఈపూరు -
మిర్చి రైతుల గుండెల్లో గుబులు
-
యార్డు నిండెన్.. ధర తగ్గెన్..
ఖమ్మంవ్యవసాయం : మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది.. వ్యాపారులు ఇదే అదనుగా భావించారు.. రైతులకు కుంటిసాకులు చెప్పి.. ధర దోపిడీకి పాల్పడ్డారు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సరుకు రాక ఎక్కువైనప్పుడల్లా వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచుకోవడం నిత్యకృత్యమైంది. నాలుగు రోజుల సెలవుల తర్వాత సోమవారం ఖమ్మం మార్కెట్‌కు మిర్చి భారీగా వచ్చింది. సుమారు 60వేల బస్తాలు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నుంచి విక్రయానికి వచ్చింది. ప్రధాన యార్డు నిండటంతో మరో యార్డును మిర్చి కోసం కేటాయించారు. దీనిని అదనుగా భావించిన వ్యాపారులు కూడపలుక్కొని ధరను పూర్తిగా పతనం చేశారు. గత వారంతో పోలిస్తే ఏకంగా రూ.2వేలు తగ్గించి కొనుగోలు చేశారు. గత వారం క్వింటా రూ.11,275 వరకు పలికిన ధర సోమవారం గరిష్టంగా రూ.10,100 చేరింది. వ్యాపారులు కొనుగోలు చేసింది సగటున రూ.9వేలు మాత్రమే. జనవరి మూడో వారం నుంచి రోజుకో రకంగా ధర పెరిగింది. డిసెంబర్ చివరి వారంలో రూ.8,800 వరకు ఉన్న ధర 20 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.11,000 దాటింది. జనవరి 27 వరకు రూ.11, 275 ధరను తాకింది. ఈ క్రమంలో స్థానిక వ్యాపారులు ధరను పెంచుకుంటూ పోతే ఇబ్బందులు ఎ దురవుతాయని చర్చించుకొని సిండికేటుగా మారి, తిరిగి ధర తగ్గించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో జనవరి 30న ధరను రూ. 10,800 తగ్గించారు. 31వ తేదీ నాటికి రూ.10,600 చేర్చారు. సోమవారానికి(జనవరి 5న) ఏకంగా గరి ష్ట ధరను రూ.1 0,125 తీసుకొచ్చారు. కానీ. అంతా కూడపలు క్కొని సగటున రూ.9వేలకు మించి ధర పెట్టలేదు. కొందరి పంటను రూ.8వేల వరకు కూడా కొనుగోలు చేశారు. ఇదేమిటంటే.. నాణ్యత లేదని, తేమ అధికంగాఉందని కుంటి సాకులు చెప్పారు. రూ.2వేలకు పైగా ధర దోపిడీ గత నెల 27వ తేదీ ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.2వేల నుంచి రూ.2,500 వరకు ధర తగ్గించి కొంటున్నారు. విదేశాల్లో తేజ రకం మిర్చికి డిమాండ్ ఉన్నప్పటికీ ఇక్కడి వ్యాపారులు సిండికేటుగా మారి దోపిడీకి గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారం వ్యవధిలోనే ఇంతగా ధర తగ్గించడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సరుకు పెరుగుతుండటంతో వ్యాపారులు ధరను కృత్రిమంగా పడేసి ధర దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అవసరాన్ని ఆసరా చేసుకొని దగా రబీ పంటల సాగు అవసరాలు, మిర్చి కోసిన కూలీల చార్జీలు చెల్లించటం కోసం రైతులు పంటను విక్రయానికి తెస్తున్నారు. దీనిని వ్యాపారులు అదనుగా భావించి.. సిండికేటుగా ఏర్పడి ధర దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యాపారులు ధరను తగ్గించినా రైతులు ధిక్కరించలేకపోతున్నారు. పంటల సాగుకు పెట్టుబడులు ఇచ్చేది ఆ వ్యాపారులే కావటంతో ఏమీ మాట్లాడలేక పెట్టిన ధరకే పంటను విక్రయించక తప్పటం లేదు. వ్యాపారులు పెట్టే ధరలను చూసి రైతులు బిత్తర చూపులు చూస్తున్నారు. రూ.11వేలు వస్తుందనుకున్నా.. మిర్చికి ధర ఉందని, క్వింటాల్‌కు రూ.11వేలకు పైగా ధర వస్తుందని ఆశించా. ఎకరం మిర్చి తోట వేశా. 20 బస్తాలు విక్రయానికి తెచ్చా. క్వింటాల్‌కు రూ.9వేల ధర పెట్టారు. ఎంత బతిమిలాడినా వ్యాపారులు ధర పెంచలేదు. ధరలో అన్యాయం చేశారు. ధర దోపిడీ చేస్తున్నారు. – షేక్ జానీమియా, వనంవారి కిష్టాపురం, ముదిగొండ మండలం కూలీలకు డబ్బు ఇవ్వాల్సి ఉండి మిర్చి అమ్మకానికి తెచ్చా.. మిర్చి తోట ఏరిన కూలీలు డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కుటుంబ అవసరాలు కూడా ఉన్నాయి. అయినా ఖమ్మం మార్కెట్లో రూ.11వేలకు పైగా ధర ఉందని 30 బస్తాల మిర్చిని అమ్మకానికి తెచ్చా. రూ.9వేల ధర పెట్టారు. అవసరాన్ని చూసి రైతులకు వాత పెడుతున్నారు. – ధర్మసోత్ సాగర్, ఎల్లంపేట, మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా -
ఇదేం‘ధరో’!
ఖమ్మం వ్యవసాయం: ఏకమయ్యారు.. రైతన్నను దగా చేస్తున్నారు.. ఆరుగాలం శ్రమించి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పండించిన పంటను మార్కెట్లో అమ్మకానికి తెస్తే.. నిలువు దోపిడీ చేస్తున్నారు.. కఠిన నిబంధనలు, పారదర్శకంగా మార్కెట్ నిర్వహణ అని ప్రభుత్వం చెబుతున్నా.. అవి మాటలు, కాగితాలకే పరిమితమయ్యాయి. వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు, దడవాయిలు, కార్మికులు, మార్కెట్ ఉద్యోగులు సిండికేట్‌గా మారి మోసానికి ఒడిగడుతున్నారు. ఇది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నిత్య తంతులా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సరుకు అమ్మకానికి తెచ్చిన రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేయాల్సిన ఉద్యోగులు కక్కుర్తిపడి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్రస్తుతం మిర్చికి ఉన్న ధర ప్రకారం కూడా కొనుగోళ్లు చేయకుండా సిండికేట్‌గా ఏర్పడి రైతులను దగా చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చి క్వింటాల్ ధర రూ.9వేలకు పైగా ఉండగా.. ఖమ్మం మార్కెట్లో ఒకటి, రెండు లాట్లకు ఆ ధర పెడుతూ.. మిగిలిన లాట్లకు రూ.8వేలకు మించి ధర పెట్టడం లేదు. సరుకు నాణ్యత లేదని, తేమగా ఉందని పేర్కొంటూ రూ.6వేలకు కూడా కొనుగోలు చేస్తున్నారు. గురువారం రఘునాథపాలెం మండలం పడమటితండాకు చెందిన మహిళా రైతు మాలోత్ బుల్లెమ్మ 8 బస్తాల మిర్చిని విక్రయానికి తెచ్చింది. ఆ సరుకును కమీషన్దారు పలువురు ఖరీదుదారులకు చూపించారు. పీకేఆర్ పేరుతో ఉన్న ఖరీదుదారుడు క్వింటాల్‌కు రూ.8,700 ధర నిర్ణయించాడు. అదే ధర వస్తుందనుకున్న బుల్లెమ్మకు వ్యాపారి, కమీషన్ వ్యాపారి, అక్కడున్న మార్కెట్ ఉద్యోగి పెద్ద షాక్ ఇచ్చాడు. మార్కెట్లో ధర నిర్ణయించిన తర్వాత యార్డు గేటు వద్ద ఉన్న సూపర్వైజర్ లాట్ నంబర్‌తో నిర్ణయించిన ధరను పేర్కొంటూ.. సరుకును కాంటా పెట్టి సంబంధిత వ్యాపారికి అప్పగించాలని దడవాయిలకు బాధ్యత అప్పగిస్తాడు. నిరక్షరాస్యురాలైన బుల్లెమ్మ మిర్చికి మార్కెట్ ఉద్యోగి క్వింటాల్‌కు రూ.7వేలుగా పేర్కొంటూ దడవాయిని సరుకు కాంటాకు పంపించారు. దీంతో రైతు బుల్లెమ్మ మరో రైతుకు తన పంటకు ఎంత ధర పడిందో చూడమని చిట్టీ ఇచ్చింది. అందులో రూ.7వేల ధరగా ఉంది. దీంతో ఆమె లబోదిబోమంటూ యార్డు గేటు వద్దకు చేరి తనకు అన్యాయం చేశారని బోరున విలపించింది. ఈ క్రమంలోనే విధుల్లో ఉన్న మార్కెట్ సూపర్వైజర్ అక్కడి నుంచి జారుకున్నారు. దడవాయిలు తమ తప్పు లేదని ఆమెకు చెప్పారు. ఇదిలా ఉండగా, సరుకు కాంటా, తరలింపు కూడా జరిగిపోయింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరుతున్న క్రమంలో కొందరు ఆ మహిళను అక్కడి నుంచి తీసుకెళ్లి తొలుత నిర్ణయించిన ధర ఇప్పిస్తామని చెప్పారు. క్వింటాల్‌కు ఏకంగా రూ.1,700 తేడాతో రైతుకు దాదాపు రూ.7వేల నష్టం వాటిల్లుతోంది. ఇటువంటి ఘటనలు మార్కెట్లో నిత్యం చోటు చేసకుంటున్నాయి. ఏకమై దగా.. పంట మార్కెట్‌కు వచ్చింది మొదలు అడుగడుగునా రైతు అన్యాయానికి గురవుతూనే ఉన్నాడు. పంటకు ధర నిర్ణయించే ఖరీదుదారులంతా సిండికేట్‌గా ఏర్పడి ధర పెడుతున్నారు. ఇక కమీషన్ వ్యాపారులు కూడా ఖరీదుదారులతో కూడపలుక్కొని ధర పెట్టిస్తారు. ఈ తతంగమంతా తెలిసిన మార్కెట్ ఉద్యోగులకు ఆమ్యామ్యాలు ముట్టజెబుతూ అక్రమాలను మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిస్తున్నారు. కాగా.. పంట పరిశీలనలో ఓ ధరను నిర్ణయిస్తూ.. తీరా కాంటా సమయంలో సరుకు నాణ్యతగా లేదని చెబుతూ ధరలో కోత పెడుతున్నారు. క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు కోత పెడుతున్నా.. అధికారులు నియంత్రించలేకపోతున్నారు. వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఉద్యోగులు పంట విక్రయంలో తమకు అన్యాయం జరిగిందని రైతులు మొరపెట్టుకున్నా మార్కెట్ ఉద్యోగులు మాత్రం వ్యాపారులకే కొమ్మకాస్తున్నారు. సరుకు నాణ్యత లేనందునే ధర తగ్గించారని, ఆ ధరకే అమ్మాలని వ్యాపారులకు అండగా నిలుస్తున్నారు. బదిలీ అయినా.. ఖమ్మం మార్కెట్లో బదిలీలు జరిగినప్పటికీ కొందరు అక్రమాలకు రుచిమరిగి ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తూ.. అసిస్టెంట్ సెక్రటరీగా పదోన్నతి పొంది కొత్తగూడెం బదిలీ అయిన ఓ ఉద్యోగి గురువారం ఖమ్మం మార్కెట్ మిర్చి యార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. మీరు బదిలీ అయ్యారుగా అని ప్రశ్నిస్తే.. అవునని, పని ఉండి వచ్చానని బుకాయించాడు. కాగా.. రైతు బుల్లెమ్మకు ధరలో అన్యాయం జరిగిన సమయంలో ఈ అధికారే మిర్చిగేటు వద్ద ఉన్నాడు. పరిశీలించి.. చర్యలు తీసుకుంటాం.. రైతుల పంటకు తగిన ధర కల్పించటంలో ఎటువంటి చర్యకైనా వెనకాడం. పంటకు ధర నిర్ణయించి.. తిరిగి తగ్గిస్తే సహించేది లేదు. ఇటువంటి ఘటనలపై నిఘా పెంచాం. రైతు బుల్లెమ్మకు జరిగిన అన్యాయంపై సమాచారం ఉంది. సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తాం. – రత్నం సంతోష్‌కుమార్, ఉన్నత శ్రేణి కార్యదర్శి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ -
ఖమ్మంలో రైతులకు శాపంగా మారిన చైనా ఫ్యాక్టరీ
-
రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా?
-
రైతు కంట్లో కారం
ఒక్కో ఎకరాకు లక్ష దాకా నష్టపోయిన మిర్చి రైతు ► అన్ని పెట్టుబడులతో కలిపి ఎకరానికి రూ.1.60 లక్షలు ఖర్చు ► ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల దిగుబడి.. క్వింటాకు 4 వేల ధర ► ఈ లెక్కన పెట్టుబడిలోనే రూ.60 వేల నష్టం.. రైతు దంపతుల కష్టాన్నీ కలిపితే రూ.లక్ష పైనే.. ► రాష్ట్రవ్యాప్తంగా మిర్చి రైతుల నష్టం రూ.2 వేల కోట్ల కన్నా ఎక్కువే.. ► ధర దగాతో నిండా మునిగిన రైతన్న బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మం: ఆరుగాలం చేసిన కాయకష్టానికి నష్టమే మిగిలింది. ఎండనక.. వాననక.. పగలనక.. రేయనక మిర్చి పంట సాగు చేసిన రైతన్నకు నష్టాలు తప్ప చేతిలో చిల్లి గవ్వ మిగల్లేదు. దిగుబడి ఆశించినంతగా వచ్చినా.. మార్కెట్ మాయాజాలంతో నిండా మునిగారు. గత ఏడాది ధరను చూసి ఈసారి రాష్ట్రంలో రైతులు 2.61 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎన్నడూ లేనంతగా మిర్చి విస్తీర్ణం పెరి గింది. పంట చేతికొచ్చాక తీరా ధరలు పతనం కావడంతో రైతు కంట్లో కారం పడినట్లయింది. పంట సాగు చేసిన రైతు ఎకరానికి కనీసం రూ.60 వేల చొప్పున నష్టపోయాడు. రైతు కష్టాన్నీ లెక్కలోకి తీసుకుంటే ఇది రూ.లక్షపైనే ఉంటుంది! పెట్టుబడి కూడా దక్కలేదు.. పత్తి సాగు చేయవద్దని ప్రభుత్వం ప్రకటిం చడంతో రైతులు మిర్చి వైపు మొగ్గుచూపారు. గతంతో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో మిర్చి సాగు ఎక్కువగా అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 85 వేల ఎకరాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. వాతావరణం అనుకూలించడం, చీడపీడలు లేకపోవడంతో ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. గతంలో మాదిరిగా ధర బాగానే ఉంటుందని రైతులు ఆశించారు. ఫిబ్రవరిలో మిర్చి కోత ప్రారంభంలో ధర రూ.10 వేల దాకా ఉండటంతో ఈ ధర చివరి వరకు ఉంటుందని అనుకున్నారు. తీరా అందులో సగం ధర కూడా దక్కకలేదు. ఎకరాకు రూ.1.60 లక్షల పెట్టుబడి పెట్టారు. సగటున 25 క్వింటాళ్ల దిగుబడికి.. గతంలో ఉన్న ధర(రూ.10 వేలు)ను బట్టి చూస్తే పంట అమ్మినందుకు రూ.2.50 లక్షలు రైతుకు దక్కాలి. రైతు శ్రమను మినహాయిస్తే సుమారు రూ.లక్ష వరకు మిగలాలి. కానీ ధర అమాంతం తగ్గడంతో క్వింటాల్‌కు సగటున రూ.4 వేలే దక్కాయి. అంటే రైతు ఎకరాకు రూ.1.60 లక్షలు ఖర్చు చేస్తే చివరికి దక్కింది రూ.లక్ష. అంటే రూ.60 వేల నష్టం! రైతు దంపతుల శ్రమ విలువతో కలిపి చూస్తే ఈ మొత్తం రూ.లక్షకు పైనే!! పంటను చేలపైనే వదిలేసి.. ధర లేక.. సాగు ఖర్చు కూడా రావడం లేదని భావించిన రైతులు ఒకట్రెండు కోతలు తీసిన తర్వాత మిగిలిన పంటను చేలపైనే వదిలేశారు. రూ.150 నుంచి రూ.200 కూలీ ఇస్తే పొద్దంతా మిర్చి ఏరేవారు. ఈసారి కూలీల కొరత ఏర్పడడంతో కొందరు రైతులు గ్రూపుగా ఏర్పడి ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి రవాణా ఖర్చులు భరించి కూలీలను తెచ్చారు. కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు ఇవ్వాలని కూలీలు డిమాండ్ చేయడంతో విధి లేని పరిస్థితుల్లో రైతులు ఆ మేరకు చెల్లించారు. మొదటి, రెండు కోతల తర్వాత ధర అమాంతం రూ.2,500, రూ.3 వేలకు పడిపోవడంతో కూలీ, రవాణా ఖర్చు కూడా గిట్టదని పంటను రైతులు చేలపైనే వదిలారు. ఆగిన శుభకార్యాలు.. మిర్చి ధర అమాంతం పడిపోవడంతో రైతు కుటుంబాల్లో శుభకార్యాలు నిలిచిపోయాయి. దిక్కులేని పరిస్థితుల్లో పంటను తక్కువ ధరకు అమ్ముకోవడంతో చేతిలో డబ్బులు లేక రైతులు తమ పిల్లల పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సాగు ఖర్చుతోపాటు ఎకరానికి రూ.25 వేలు కౌలు చెల్లించి చివరికి ధర రాక.. వారంతా కుదేలయ్యారు. దుక్కి నుంచి మార్కెట్ దాకా.. మిర్చి వేసేందుకు దుక్కి నుంచి మార్కెట్‌కు తరలించే వరకు.. సాగు, రవాణా ఖర్చులతో సహా ఎకరానికి రూ.1.60 లక్షల ఖర్చవుతుంది. రైతు దంపతుల కష్టాన్ని లెక్కలోకి తీసుకుంటే ఇది మరింతగా పెరుగుతుంది. ఎకరాకు ఖర్చుల వివరాలివీ..(రూ.లలో..) దుక్కి దున్నితే 8,500 15 ప్యాకెట్ల విత్తనాలు, నారు పెంపకం 6,500 సూపర్, పొటాష్, డీఏపీ, రిజెంట్ గుళికలు 6,500 తోట వేసిన తర్వాత అరక పాట్లు 6, 7 సార్లు 10,000 చీడ పీడల నివారణకు మందుల పిచికారికి 40,000 మిర్చి పంట ఎదుగుదలకు రసాయన ఎరువులు 8,500 మిర్చి ఏరేందుకు కూలీల ఖర్చు 70,000 బస్తాల్లో తొక్కి మార్కెట్‌కి తరలించేందుకు 10,000 మొత్తం ఖర్చు 1,60,000 రైతుల అభిప్రాయాలు.. బిడ్డ పెళ్లి వాయిదా వేసుకున్నా – భూక్యా ఖాసీరామ్, మేకలతండా, కారేపల్లి మండలం మిర్చి వేసి నష్టపోయా. బిడ్డ పెళ్లి వాయిదా వేసుకున్న. రూ.20 వేల చొప్పున 4 ఎకరాలను రూ.80 వేలకు కౌలుకు తీసుకొని పంట సాగు చేసిన. పెట్టుబడికి రూ.2.40 లక్షలు, మిర్చి ఏరిస్తే కూలీలకు రూ.1.50 లక్షలను అప్పు తెచ్చి పెట్టితే.. 80 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. 20 క్వింటాళ్లను రూ.4 వేల చొప్పున అమ్మితే..రూ.80 వేలే వచ్చాయి. అప్పు ఇచ్చినోళ్లు, కూలోళ్లు ఇంటి చుట్టు తిరుగుతున్నరు. ఉన్న మిర్చి అమ్ముదామంటే.. రూ.1900, రూ.2 వేలకు అడుగుతున్నరు. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. ధర లేక అమ్మలేదు – యల్లంకి వెంకటేశ్వర్లు, కారేపల్లి ధర లేకపోవడంతో 40 క్వింటాళ్ల మిర్చి అమ్మకుండా అట్లే ఉంచిన. నేను 3 ఎకరాల్లో మిర్చి సాగు చేసిన. రూ.1.50 లక్షల పెట్టుబడితోపాటు, మిర్చి ఏరించినందుకు రూ.1.20 లక్షల ఖర్చు వచ్చింది. 45 క్వింటాళ్ల దిగుబడిలో 5 క్వింటాళ్లను మొదట్లో రూ.10 వేల చొప్పున అమ్మిన. అప్పటి నుంచి రేటు తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు రూ.2 వేల చొప్పున అడుగుతున్నరు. అమ్మితే..కూలోళ్లకు ఏమి ఇయ్యాలి..? అప్పు తెచ్చిన కాడ ఏం కట్టాలి..? వ్యవసాయం బంద్ చేసి కూలీకి పోదామనుకుంటున్నా.. – బానోతు వీరన్న, గేటు కారేపల్లి పోయిన ఏడాది చెల్లి పెళ్లికి, ఇల్లు మరమ్మతులకు తెచ్చిన అప్పు రూ.2 లక్షలు మిర్చి పంట మీద తీర్చుదామనుకున్నా. ఈ అప్పు కాకుండానే మళీŠల్ రూ.2 లక్షలు అప్పు అయింది. రూ.60 వేలు పెట్టి 2.5 ఎకరాలు కౌలుకు తీసుకుని, రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టిన. మిర్చి ఏరిస్తే రూ.1.70 లక్షలు అయింది. మొత్తంగా రూ.3.20 లక్షలు అప్పు తెచ్చి సాగుచేస్తే..60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధర లేకపోవడంతో.. రూ.3 వేల చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. రూ.2 లక్షలు అప్పు తీరుతుందనుకుంటే.. మరో రూ.2 లక్షలు అప్పు అయింది. వ్యవసాయం బంద్ చేసి కూలీ పనులకు పోదామనుకుంటున్నా. ఫలితం లేదు.. సుతారి పనికి పోత..గుగులోతు సేట్రామ్, మేకలతండా, కారేపల్లి మండలం నాకున్న 4 ఎకరాల్లో మిర్చి పంటకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. నకిలీ విత్తనాలు రావడంతో.. తోట సగం నాశనమైంది. 40 క్వింటాళ్లేæ దిగుబడి వచ్చింది. మిర్చి బాగా లేదని సేటు క్వింటాకు రూ.1900 మాత్రమే సేటు పెట్టిండు. ఏం చేయాల వచ్చిన కాడికే.. తీసుకొని వచ్చి కూలోళ్లకు ఇచ్చిన. కష్టపడి ఎవుసం చేస్తే.. కుటుంబాన్ని సాదుకోలేక పోతున్నం. మా ఊరోళ్లతో ఖమ్మం సుతారి పనికి పోత. అప్పు చేసి ఆపరేషన్ చేయించుకున్నా...– తాటికింది మంగమ్మ, సింగరాయపాలెం, కొణిజర్ల మండలం మాకు ఎకరం పొలం ఉంది. మరో ఎకరం కౌలుకు తీసుకున్నాం. కౌలు రూ.30 వేలు ముందే చెల్లించాం. రెండు ఎకరాలు తోట వేసాం. మొదట నకిలీ మిర్చి విత్తనాలతో కాత రాకుంటే తోట పీకి వేసి మళ్లీ వేసాం. అంతా కలిపి ఎకరానికి రూ.90 వేలు ఖర్చయింది. కౌలుతో కలిపి రెండు ఎకరాలకు రూ 2.10 లక్షలు వచ్చింది. మొదటి కోత 10 క్వింటాళ్లు వచ్చింది. రూ.5 వేలు లెక్క అమ్మాం. ఇంతలో నాకు కడుపు నొప్పి రావడంతో రూ.లక్ష అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. రెండోసారి మిర్చి కోయిస్తే 22 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అమ్మడానికి పోతే రూ 2,800 కి అడిగారు. ఆ రేటుతో అమ్మితే అప్పులు కూడా తీరవు. పాత అప్పులు తీరుద్దామనుకున్నా..బండారు వీరభద్రం, చిన్నగోపతి, కొణిజర్ల మండలం నాకు 3 ఎకరాల పొలం ఉంది. మరో ఒకటిన్నర ఎకరం కౌలుకు తీసకున్నా. రెండెకరాలలో మిర్చి సాగు చేశా. కౌలు రూ.25 వేలు. ఎకరానికి 16 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడులకు రూ.80 వేల దాకా ఖర్చు వచ్చింది. మిర్చి అమ్ముదామని ఖమ్మం మార్కెట్‌కు తీసుకపోతే రూ.3,100 చొప్పున అడిగారు. తిరిగి ఇంటికి వేసుకుని వచ్చా. ఇప్పుడు ఎంతకో కొంతకు అమ్ముదామన్నా కొనే నాథుడు కరువయ్యాడు. పాత అప్పులతో కలుపుకుంటే రూ.4 లక్షల అప్పులు మిగిలాయి. పంట కోయకుండా వదిలేశా..– కొత్తపల్లి మంగారావు, సింగరాయపాలెం, కొణిజర్ల మండలం సింగరాయపాలెంలో ఎకరం రూ.30 వేలు చొప్పున 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. నాకున్న 2 ఎకరాల పొలంలో నీళ్లు కోసం మూడుసార్లు బోర్లు వేయించా, రూ.2 లక్షలు ఖర్చు అయింది. చుక్క నీళ్లు పడలేదు. 2 ఎకరాలలో మిర్చి సాగు చేశా. పంటకు రూ.1.50 లక్షలు అప్పు తెచ్చాను. ఇద్దరు ఆడపిల్లలున్నారు. పంట మంచిగా పండితే పెద్ద పిల్ల పెళ్లి చేద్దామనుకున్నా. అనుకున్నట్లు గానే పంట మంచి గానే పండింది. కానీ ధర లేదు. పంట కోయిస్తే కోత కోసిన కూలీలకు కూడా సరిపోవని అలాగే వదిలేశా. లక్ష పెట్టుబడి...లక్షన్నర కూలీ..– ఆడెపు వెంకన్న, కూసుమంచి నేను రెండెకరాల్లో తోట వేస్తే 30 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. అమ్మితే రూ.1.80 లక్షలు వచ్చింది. కూలీ, పెట్టుబడి ఖర్చు రూ.2.50 లక్షలు వచ్చింది. ఇలా అయితే మిర్చి పంటను ఎలా సాగు చేస్తాం. మాకు లాభాలు ఎలా వస్తాయి? మరోసారి మిరప తోటలు వేయాలంటే భయమేస్తోంది. ఇదీ నష్టం లెక్క.. ఈ ఏడాది మిర్చి సాగు 2.61 లక్షల ఎకరాలు దిగుబడి(ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున) 65.25 లక్షల క్వింటాళ్లు ఎకరాకు రైతు చేసిన ఖర్చు 1.60 లక్షలు 2.61 లక్షల ఎకరాలకు ఖర్చు 4,176 కోట్లు క్వింటాల్‌కు దక్కిన సగటు ధర 4 వేలు 65.25 లక్షల క్వింటాళ్లకు 2,610 కోట్లు అంటే.. రైతు రూ.4,176 కోట్లు ఖర్చు పెడితే నికరంగా చేతికొచ్చింది.. రూ.2,610 కోట్లు! రైతు ఆరుగాల కష్టానికి ప్రతిఫలం రూ.1,566 కోట్ల నష్టం! రైతు దంపతుల ఆరేడు నెలల కష్టాన్ని కూడా కలిపితే ఈ మొత్తం నష్టం రూ.2 వేల కోట్లపైనే..!!! -
ఆత్మహత్యలకు పరోక్షంగా కారకులయ్యారు
-
కొత్తగూడెంలో టీడీపీ, కాంగ్రెస్ రాస్తారోకో
టేకులపల్లి: మిర్చి రైతులను ప్రభుత్వం వేధిస్తున్నందుకు నిరసనగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, మిర్చి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి వారిని హంతకులుగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ టీడీపీ, కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బోడు రోడ్డు సెంటర్లో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పాలనను నాయకులు ఎండగట్టారు. అలాగే రైతుల అరెస్టులను నిరసిస్తూ హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. -
మళ్లీ మిర్చి మంట
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మళ్లీ ఉద్రిక్తత వరంగల్ సిటీ: ప్రభుత్వాలు మద్దతు ధర అందేలా చూస్తామని ప్రకటించినా మిర్చికి తక్కువ ధరలే అందుతుండడంతో రైతులు మళ్లీ కన్నెర్ర చేశారు. శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆందోళన చేశారు. మార్కెట్‌కు వచ్చి 3 రోజులైనా కొనే వారు లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మార్కెట్లో బస్తాలు పెట్టుకున్నందుకు కిరాయి వసూలు చేస్తున్నారంటూ మార్కెట్ మీద దాడికి సిద్ధమయ్యారు. వారికి పలువురు రైతు సంఘం నాయకులూ మద్దతు పలికారు. కానీ మార్కెట్లో నే ఉన్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని.. కొందరు రైతులను, రైతు సంఘం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీన్ని అలుసుగా తీసుకున్న వ్యాపారులు.. క్వింటాల్ మిర్చికి గరిష్ట ధర రూ.4 వేలు, కనిష్ట ధర రూ.2,500తో కొనుగోళ్లు సాగించారు. మూడు రోజులుగా మార్కెట్లో విధులు నిర్వర్తిస్తున్న వరంగల్ ఆర్డీవో వెంకారెడ్డి, తహసీల్దార్ గుజ్జుల రవీందర్‌లు రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించడమే తప్ప.. వ్యాపారులు మిర్చికి తక్కువ ధరే ఇస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. రైతు సంఘం నాయకులపై కేసు నమోదు వరంగల్ మిర్చి మార్కెట్లో కొద్దిరోజులుగా ఉద్రిక్తత, పోలీసు పహారా మధ్య కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మార్కెట్లో పోలీస్ పికెట్ ఎత్తివేయాలని శుక్రవారం ఆందోళన చేసిన రైతు జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఇంతేజార్గంజ్ స్టేషన్‌కు తరలించారు. జేఏసీ నాయకులు పెద్దారపు రమేష్, చల్ల నర్సిం హారెడ్డి, ఎం.మల్లయ్య, ఎరుకల రాజన్న, అ జ్మీరా సారయ్య, మేకల మొగిలి, సారయ్య తది తరుల మీద కేసు నమోదు చేశారు. రైతులను రెచ్చగొడుతూ, దాడికి ఉసిగొల్పుతున్నందున రైతు జేఏసీ నాయకులపై కేసులు నమోదు చేశామని.. రైతులెవరి మీదా కేసులు పెట్టలేదని ఏసీపీ చైతన్యకుమార్ తెలిపారు. అయితే తాము మార్కెట్లో ఎలాంటి గొడవలకు పాల్పడలేదని, అయినా అన్యాయంగా అరెస్టు చేశారని రైతు సంఘం నాయకులు తెలిపారు. జాడలేని ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా ఈనెల 3వ తేదీ నుంచే మద్దతు ధరకు మిర్చి కొనుగోళ్లు మొదలవుతాయని ఆశపడిన రైతులకు మార్కెట్లో తీవ్ర నిరాశే ఎదురవుతోంది. దానిపై ఆదేశాలు రాలేదని పాలక వర్గం, అధికారులు చెబుతున్నారు. మద్దతు ధర అందిస్తామని ప్రభుత్వాలు ప్రకటించి ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది. మే చివరి వరకు మరో వారం రోజులు సెలవులు ఉంటాయి. అంటే మిగిలిన 15 రోజుల్లోనే మద్దతు ధరతో రైతుల వద్దనున్న మిర్చి మొత్తాన్ని కొనుగోలు చేయడం సాధ్యమవుతుందా.. అసలు రైతులకు మద్దతు ధర అందుతుందా అన్నది సందేహాస్పదంగా మారింది. ప్రశ్నిస్తే పట్టుకెళ్తున్నారు మద్దతు ధర గురించి అడిగినా, 3 రోజుల నుంచి కొను గోళ్ల కోసం పడిగాపులు కాస్తున్నామని తెలిపినా పోలీసులు వినడం లేదు. దేని గురించి ప్రశ్నించినా పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇంత అన్యాయమా? మరి మా ఇబ్బం దులను ఎవరికి చెప్పుకోవాలి? – పొంచిక సతీశ్, చిట్యాల, మిర్చి రైతు సగం సచ్చిన రైతుల్ని పూర్తిగా సంపుతరా? మిర్చి అమ్ముకోని స్తలేరు.. దాచుకో నిస్తలేరు.. మద్దతు ధర పెడ్తలేరు. అడిగితే పోలీసులు పట్టుకెళ్తున్నారు. మరేం చేయాలి. మార్కె ట్‌కు మిర్చిని తీసుకొచ్చి ఉత్త పుణ్యానికి (ఫ్రీగా) దానం చేసి పొమ్మంటే అలాగే చేస్తాం. సగం సచ్చిన రైతులను పూర్తిగా సంపుతరా.. – బొర్ర శంకర్, గణపురం, మిర్చి రైతు -
మిర్చి మంట
ఆగని ధరల పతనం.. సర్కారు మీనమేషాలు మిరప రైతు కడుపు రగిలిపోతోంది. ఏ అన్నదాతను కదిలించినా ఒకటే ఆవేదన.. సాయం చేస్తుందనుకున్న సర్కారే.. వ్యాపారులను మించిన లెక్కలు వేస్తోంది. నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేక అయినకాడికి సరుకును తెగనమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. మిర్చి యార్డులో ఖాళీ లేక, ఆరుబయట నిల్వ ఉంచితే అకాల వర్ష భయం రైతన్న గుండెను తొలిచేస్తోంది. సాక్షి, అమరావతి బ్యూరో: సరుకును ఇంట్లో ఉంచుకోలేక, మార్కెట్ యార్డుకు తెచ్చి వ్యాపారులు అడిగిన ధరకు అమ్మలేక మిర్చి రైతులు అయోమయంతో తల్లడిల్లిపోతున్నారు. మిర్చిని ఇంట్లో ఉంచితే వేడికి రంగు మారుతుందని, కల్లాల్లో ఉంచితే వర్షం వస్తే తడిసి పోతుందనే బెంగ రైతన్నను పట్టిపీడిస్తోంది. నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్ స్టోరేజిలు అందుబాటులో లేవు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు మార్కెట్ యార్డుకు సరుకు తీసుకొస్తే.. వ్యాపారులు, మార్కెటింగ్ పాలక వర్గం చుక్కలు చూపుతోంది. సరుకు అమ్ముకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరుకు నిల్వ అధికంగా ఉందనే సాకు చూపి వ్యాపారులు ధరలు పడిపోయేలా చేస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నామ మాత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటోంది. ‘కాయలు పాడయిపోతున్నాయయ్యా.. ఇంట్లో ఉంచితే రంగు మారుతున్నాయి.. కల్లాల్లో ఉంచితే వర్షం వస్తే తడిసిపోతాయి.. తేజ మేలు రకం కాయలు మొదటి కోతయ్యా.. ఇంతకు మునుపు క్వింటాలు రూ.6000 కు అడిగితే ఇవ్వలేదు. ప్రభుత్వ బోనస్ వస్తుందని ఇక్కడకు తెస్తే, ఇక్కడ క్వింటా రూ.3500 – 4000కు మించి కొనుగోలు చేయడం లేదు. మీరే న్యాయం చేయండి’ అంటూ గుంటూరు మార్కెట్ యార్డులో శుక్రవారం ఉదయం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యార్డులో 7 లక్షల టిక్కీల సరుకు.... రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న రైతుకు 20 క్వింటాలు, క్వింటాకు రూ.1500 బోనస్ ప«థకమే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.5000 గురించి ఆలోచించడం లేదు. రైతులు అందోళన చెందాల్సిన పని లేదని, జూలై చివరి వరకు మిర్చిని కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు మిర్చి యార్డులో శుక్రవారం ఉదయం స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన సరుకును ఇక్కడే ఉంచి పెద్ద ఎత్తున నిల్వ ఉన్నట్లు వ్యాపారులు, మార్కెటింగ్ సిబ్బంది కుమ్మక్కై ధరలు తగ్గించి అడుగుతున్నారు. దీంతో శుక్రవారం వచ్చిన 3.5 లక్షల టిక్కీలు, బయట 3.5 లక్షల టిక్కీలు.. మొత్తం 7 లక్షల టిక్కీల సరుకు ఉన్నట్లు సమాచారం. యార్డు మిర్చి బస్తాలతో నిండిపోయింది. సోమవారం మళ్లీ సరుకు అదనంగా వస్తే తిప్పలు తప్పవు. రూ.3 వేలకు కూడా కొనడం లేదు నేను మిర్చి యార్డుకు ఐదు క్వింటాళ్ల మిర్చిని తీసుకొచ్చా. ‘రాయితీ పథకం కింద వద్దు.. మామూ లుగా సరుకు అమ్ముకొని పో.. లేదంటే రెండు నెలల వరకు డబ్బులు రావు’ అని వ్యాపారులు చెబుతున్నారు. ‘తేజ’ రెండో కోత కాయలు క్వింటాలు రూ.3000కు కూడా అడగటం లేదు. ఇలాగైతే రైతుల గతేంటి? – బెల్లం అంజనేయలు, చీమకుర్తి రవాణా ఖర్చులూ రావట్లేదు మొన్నటి వరకు క్వింటాలు రూ.4000 – 5000 అమ్మిన మిర్చి.. ఇప్పుడు రూ.1500 – 2000కు కూడా అడగటం లేదు. రైతు పరిస్థితి దారుణంగా మారింది. ఆదుకునే నాథుడే లేరు. కోత కూలీల మాట దేవుడెరుగు.. కనీసం రవాణా ఖర్చులూ వచ్చే పరిస్థితి లేదు. – కేతవత్ గాసిరాం, హసన్‌బాద్ తాండ, మాచర్ల ఐదు కేంద్రాల్లో మిర్చి కొనుగోళ్లు శని, ఆదివారాల్లో గుంటూరు జిల్లా నడికుడి, వినుకొండ, కృష్ణా జిల్లా నందిగామ, కర్నూలు, ఒంగోలులో మిర్చి కొనుగోలు చేస్తామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా అనందబాబు ప్రకటించారు. మార్కెట్ యార్డులో జరిగిన సమీక్షలో పాల్గొన్న అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నందిగామ, నడికుడిలో శనివారం నుంచి, ఇతర ప్రాంతాల్లో ఆ తర్వాత మిర్చి కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ వెల్లడించారు. ఈ మార్కెట్లలో మిర్చి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు రవాణా చార్జీల్లో రాయితీ, అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. కాగా, గుంటూరు మిర్చి యార్డుకు మే 16 నుంచి జూన్ 4 వరకు సెలవులు ప్రకటించారని, అయినా శని, ఆదివారాల్లో కొనుగోళ్లు కొనసాగుతాయని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 రాయితీ పథకం ద్వారా ఇప్పటి వరకు 6,500 మంది రైతుల నుంచి 1.10 లక్షల క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 వేల మద్దతు ధరలో స్పష్టత లేదని, రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని మాత్రమే కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా, అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిర్చి కొనుగోళ్లపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది. క్వింటాల్‌కు మద్ధతు ధర రూ.8 వేలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు వెల్లడించింది. సమీక్షలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, మిర్చి యార్డు చైర్మెన్ మన్నవ సుబ్బారావు, జెసీ – 2 ముంగా వెంకటేశ్వరరావు, మార్కెట్ కార్యదర్శి దివాకర్, ఏడీ వరలక్ష్మి, పోలీసు, రవాణా, కార్మిక శాఖల అధికారులు, ఎగుమతి వ్యాపారుల సంఘం నాయకుడు దుగ్గిరాజు, హమాలీల సంఘం నాయకుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
ఎర్రబడ్డ మిర్చి రైతు
⇔ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన ⇔ కేంద్రం ప్రకటించిన పథకాన్నిఅమలు చేయని టీడీపీ సర్కారు ⇔ దారుణంగా దిగజారిన ధరలు ⇔ నాటు రకం మిర్చిని కొనేందుకు నిరాకరిస్తున్న వ్యాపారులు ⇔ హైబ్రిడ్ రకాల ధరలూ తగ్గింపు సాక్షి, అమరావతి బ్యూరో గుంటూరు మిర్చి యార్డులో రోజు రోజుకూ ధరలు పతనం అవుతుండటంపై రైతులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు.. మిర్చి యార్డులో ధరలు తగ్గటంతో కడుపు మండిన రైతులు గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ కోల్‌కతా–చెన్నై హైవేతో పాటు గుంటూరు–కర్నూలు రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. మిర్చికి మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. తమను పట్టించుకోవడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాటు రకం మిర్చి కొనుగోలుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. హైబ్రిడ్ (తేజ)రకం హై క్వాలిటీ మిర్చిని సైతం క్వింటాలు రూ. 2,500 నుంచి రూ. 3,000కు మించి కొనుగోలు చేయకపోవడం, సాధారణ రకం మిర్చిని అయితే మరి దారుణంగా క్వింటాలు రూ. 1,500 రూ. 2,000 మధ్య ధర ఉండటంతో రైతులు కన్నెర్ర చేశారు. రోజుల తరబడి యార్డులో పడిగాపులు కాస్తున్నా మిర్చి అమ్ముకునేందుకు అవకాశం లేక అవస్థలు ఎదుర్కొం టున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మిర్చి ధరలు మరింత పతనమయ్యాయి. వందలాది లారీల్లో సరుకు... మార్కెట్ యార్డులో నాటు రకం మిరపకాయలు కొనుగోలు చేయకపోవడం, మిర్చి ధరలను తగ్గించి వ్యాపారులు అడ గటంతో రైతన్నలు మిర్చిని అమ్మేందుకు నిరాకరిస్తుం టంతో మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున సరుకు పేరుకుపోయింది. వందల సంఖ్యలో మిర్చి లారీలు మార్కెట్ యార్డు బయట ఆగిపోయాయి. ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వర్తించేటట్లు అయితే మేం మిర్చి కోనుగోలు చేయబోమని కొంత మంది వ్యాపారులు మెలిక పెడుతున్నట్లు రైతన్నలు వాపోతున్నారు. క్వింటాలుకు హైగ్రేడ్ తేజ క్వాలిటీ రకం గురువారం ఓ వ్యాపారి కేవలం రూ. 3వేలకు కొనుగోలు చేస్తే.. మరో వ్యాపారి ఇంకో రైతుకు అదే రకానికి రూ. 2,500 ఇస్తానని చెప్పాడు. మార్కెట్లో దించిన సరుకు మళ్లీ ఇళ్లకు తీసుకపోరు అనే భావనతో వ్యాపారులు ఉన్నారని రైతులు వాపోతున్నారు. గందరగోళంగా కొనుగోళ్లు.... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద ఇచ్చే రూ.5 వేలే సరిపోదని రైతులు గగ్గోలు పెడుతుంటే దానిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ. 1,500 సహాయం పథకమే ప్రస్తుతం అమలులో ఉందని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలు రూ. 5,000 పథకం రాష్ట్ర పరిశీలనలో ఉందని, దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని సమాచారం. రెండు పథకాలు వర్తిస్తాయని పెద్ద సంఖ్యలో రైతులు యార్డుకు సరుకు తీసుకువచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల కుమ్మక్కు నేపథ్యంలో గురువారం రైతన్నలు రోడ్డెక్కడంతో పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన పోలీసులు అర్బన్ ఎస్పీ త్రిపాఠి పర్యవేక్షణలో యార్డు వద్ద మొహరించారు. గుంటూరు జెసీ–2 ముంగా వెంకటేశ్వరావు రైతులకు నచ్చజెప్పడానికి యార్డు కార్యా లయంలో రైతులతో సమావేశ మయ్యారు. మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావును పలువురు రైతు లు నిలదీశారు. యార్డు కార్యాలయం నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ రైతులు శాపనార్థాలు పెట్టారు. నాటు రకం కాయలు కొనలేదయ్యా.. గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి తెచ్చి పదిరోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మచ్చు (శాంపిల్) తీసి వ్యాపారులు కాయలు కొనటం లేదయ్యా. కనీసం క్వింటాలు రూ.1,000 కూడా అడగటం లేదు. సరుకు వదిలి వెళ్లలేక పది మంది రైతులం ఇక్కడే ఉంటున్నాం. కనీసం భోజన టోకెన్లు కూడా ఇవ్వటం లేదు. కడుపు మాడ్చుకొంటున్నాం. ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదు. – బి.వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లా తేజ మిర్చి రూ. 2,500కు అడుగుతున్నారయ్యా.. నేను వారం క్రితం 110 బస్తాల తేజ రకం మిర్చి తీసుకొని వచ్చా. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించక ముందు క్వింటాలు రూ.7000కు అడిగారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు రూ. 5000 ప్రకటించక ముందు ధర రూ. 6000 ఉంది. ఈ ప«థకం ప్రకటించాక వ్యాపారులు మిర్చిని క్వింటాలు రూ. 3000 అడిగారు. మళ్లీ అంతలోనే ఇంకొక వ్యాపారి రూ. 2500 ఇస్తే తీసుకొంటాం లేకపోతే లేదంటున్నారు. వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నా. ఆత్మహత్య తప్ప శరణ్యం లేదు. ప్రభుత్వం మిర్చి రైతులను పట్టించుకోలేదు. చిన్న చూపు చూస్తోంది. – పువ్వాడ కోటయ్య, కందుకూరు ప్రకాశం జిల్లా సరుకు కొనుగోలు చేయడం లేదు.. ప్రభుత్వం ప్రకటించిన రాయితీ అర్హత కోసం పత్రాలు ఉంటే ఆ సరుకు కొనడం లేదు. ఫారాలు ఇవ్వకుండా, రాయితీ పరిధిలోకి సరుకు రాకుంటేనే వ్యాపారులు కొంటామంటున్నారు. ఇలా వ్యాపారులు మూడు రోజులుగా మిర్చిని కొనడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ధరలు పడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. – శ్రీనివాసరావు, నాదెండ్ల -
కేసీఆర్ చిలక పలుకలు పలికిస్తున్నారు
హైదరాబాద్‌సిటీ: మిర్చి రైతుల పరిస్థితికి సీఎం కేసీఆర్ అసమర్థతే కారణమని బీజీపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు సచివాలయం నుంచి అధికారికంగా మాట్లాడితే కేంద్రం నుంచి సరైన జవాబు వచ్చేదన్నారు. రాజకీయం చేయటం కోసమే పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడారని విమర్శించారు. మిర్చి కోసం రైతులు ఆందోళన చేస్తుంటే..కేంద్రం వెంటనే స్పందించిందని తెలిపారు. మంత్రి హరీష్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, హరీష్ రావు ఎందుకు సచివాలయం లో మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజకీయంగా బీజేపీని తిట్టడానికి మాత్రమే పార్టీ కార్యాలయంలో హరీష్ రావు సమావేశం ఏర్పాటు చేశారని మండిడ్డారు. హరీష్ రావు మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ స్కీమ్ గురించి తెలుసుకోవాలని సూచించారు. మార్క్ ఫెడ్ నుంచి కొనటానికి ఎందుకు కష్టమవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ , హరీష్ రావుతో చిలుక పలుకులు పలికిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం వంకరగా మాట్లాడి రైతులను మోసం చేయవద్దని కోరారు. -
కేసీఆర్ రైతులను గాలికొదిలేశారు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగ సభల కోసం వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేసిన కేసీఆర్ రైతులను గాలికి వదిలేశారని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బహిరంగ సభ కోసం ట్రాక్టర్లను బ్లాక్ చేసి.. మిర్చి పంట తరలించేందుకు వాహనాలు లేకుండా చేశారన్నారు. ఖమ్మంలో జరిగిన ఘటన రైతుల బాధలో నుంచి పుట్టుకొచ్చిందని.. దాన్ని తప్పించుకోవడానికి ప్రతిపక్షాల కుట్ర అని సర్కార్ అబద్ధమాడుతోందని తెలిపారు. ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. టీఆర్ఎస్ సర్కార్‌కు రైతులపై సవతి తల్లి ప్రేమ మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం రూ. 5 వేల ధర ప్రకటించిందని.. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం మిర్చియార్డ్‌ను సందర్శించి జైళ్లో ఉన్న రైతులకు పరామర్శించనున్నట్లు తెలిపారు. -
ఒక్క రైతు అకౌంట్‌కూ చేరని సహాయం
-
రేటొచ్చిందని అదే పంట వేశారు
⇔ అందువల్లే ఈ పరిస్థితి వచ్చింది ⇔ మిర్చి ధర పతనంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్య ⇔ రైతులకు ఏ ఇబ్బందీ లేకుండా చేశామన్న ముఖ్యమంత్రి ⇔ ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటి.. పెండింగ్ అంశాలపై చర్చ ⇔ నేటినుంచి సీఎం బృందం అమెరికా పర్యటన సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: ‘‘ఒక్కోసారి వాణిజ్య పంటలు అధికంగా వచ్చినప్పుడు సంక్షోభం కూడా వస్తుంది. గతేడాది మిరపకు బాగా రేటు వచ్చిందని ఈ ఏడాది అందరూ అదే పంట వేశారు. అందువల్లే ఈ పరిస్థితి వచ్చింది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మిర్చి ధర పతనంపై వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనకోసం గురువారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి పయనమవుతున్న సీఎం బుధవారం దేశ రాజధానిలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు. అనంతరం ఏపీభవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మిర్చి ధర పడిపోవడంపై విలేకరులు ప్రశ్నించగా.. ఆయన పైవిధంగా స్పందించారు. మిర్చి రైతుల్ని ఆదుకునేందుకే తాము క్వింటాలుకు రూ.8 వేల ధర నిర్ణయించి.. ఒకవేళ అంతకంటే తగ్గిపోతే ఒక్కో క్వింటాలుకు రూ.1,500 చొప్పున ప్రయోజనం కల్పించామని చెప్పుకొచ్చారు. ఒక్కో రైతు వద్ద 20 క్వింటాళ్ల వరకు కొంటామన్నారు. కేంద్రం రూ.5 వేల వరకు కొనమని చెప్పిందని, అయితే అది రైతుకు గిట్టుబాటు కాదని, అందుకే తామిచ్చే బోనస్‌లోనూ చెరి సగం పెట్టుకుందామని కోరామని.. కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. మిర్చి రైతులకు మద్దతుగా వైఎస్ జగన్ చేసిన దీక్షను మీడియా ప్రస్తావించగా.. చంద్రబాబు ప్రతిపక్ష నేతపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘ఆయనకేమైనా అవగాహనుందా? వ్యవసాయం తెలుసా ఆయనకు? ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని వ్యక్తి. వ్యవసాయమంటే తెలియని వ్యక్తి. ఒక పద్ధతి, ఒక ప్రక్రియ తెలియదు. కాకిలెక్కలు చెప్పి కబుర్లు చెబుతున్నాడు’’ అంటూ మండిపడ్డారు. ‘‘ఈ సంవత్సరం వర్షం పడలేదు. అయినా ఎక్కడాలేని రీతిలో 14 శాతం వృద్ధిరేటు వచ్చింది. 28.4 శాతం వర్షపాతం తక్కువగా ఉన్నా ఇంత వృద్ధి సాధించాం. వాటర్ మేనేజ్మెంట్ చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు. ఫలితంగా రైతులు సంక్షోభం ఎదుర్కొన్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం’’ అని అన్నారు. కేంద్రమంత్రులతో భేటీ అంతకుముందు చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్, పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే, కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌లను కలిశారు. నీతిఆయోగ్ వైస్ చైర్మన్ అరవిం ద్పనగారియాతోనూ భేటీ అయ్యారు. ఈ భేటీలపై సీఎం వివరిస్తూ.. రాష్ట్రానికి చట్టపరంగా ఇవ్వాల్సిన పెండింగ్ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని జైట్లీని కోరామని చెప్పారు. రాష్ట్రానికివ్వాల్సిన బకాయిలను విడుదల చేయాల్సిందిగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కోరినట్టు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో సీజ్ చేసిన వాటిని అమ్ముకునేందుకు అనుమతులు, తదితర అంశాల గురించి పర్యావరణమంత్రితో చర్చించినట్టు వెల్లడించారు. అమెరికా పర్యటనపై.. అమెరికా పర్యటనలో 300 మంది సీఈవోలను కలుస్తానని సీఎం చెప్పారు. గతంలో సీఎం అయినప్పుడు అమెరికా అంతా తిరిగి ఐటీ కంపెనీల్ని హైదరాబాద్ తీసుకొచ్చానన్నారు. ఈసారీ అందర్నీ కలుస్తానన్నారు. ఇండియా–అమెరికన్ చాంబర్స్ సంస్థ మోస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ సీఎంగా అవార్డు ఇస్తోందని, దానిని స్వీకరించబోతున్నానని వివరించారు. ఆపిల్ కంపెనీ రాష్ట్రానికి రావడంపై మీడియా ప్రస్తావించగా.. ఏ ప్రాజెక్టయినా సాకారం కాకముందే చర్చకు వస్తే సదరు కంపెనీలకు ఇబ్బంది ఉంటుందని ఆయన బదులిచ్చారు. విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి పాల్గొన్నారు. కాగా, సీఎం చంద్రబాబు గురువారం తెల్లవారుజామున ఢిల్లీనుంచి అమెరికాకు పయనమవుతారు. రాత్రి ఏడున్నర గంటలకు శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ నెల 11 వరకు వాషింగ్టన్ డీసీ, శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, చికాగో తదితర నగరాల్లో పర్యటించనున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్సహా 16 మంది సభ్యుల బృందం సీఎం వెంట ఆమెరికా వెళ్లింది. -
జగన్ దీక్షతో కేంద్ర ప్రభుత్వంలో చలనం
-
మీరు అధికారులా.. లేక టీఆర్ఎస్ కార్యకర్తలా
-
మీరు అధికారులా.. లేక టీఆర్ఎస్ కార్యకర్తలా
► అధికారులపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు ఖమ్మం: నగరంలోని మార్కెట్ యార్డ్‌లో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సోమవారం మార్కెట్‌ను సందర్శించిన కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ జానారెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్‌లు మార్కెట్ కమిటీ చైర్మెన్‌తో మాట్లాడారు. అనంతరం అధికారులను నిలదీసిన నాయకులు మీరు అధికారులా.. లేక టీఆర్ఎస్ కార్యకర్తలా అని మండిపడ్డారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకు ముందు జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పత్తికి కనీసం రూ. 3 వేలు కూడా మద్దతు ధర కల్పించకపోవడం సర్కార్ వైఫల్యమే.. రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని మాయమాటలు చెప్పిన ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరడటం లేదని .. రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నామన్నాని తెలిపారు. -
న'గరం'
► రైతులకు మద్దతుగా ఖమ్మంలో విపక్షాల ఆందోళన ► కొనసాగిన అరెస్టుల పర్వం... ► పోలీసుల విస్తృత తనిఖీలు, బందోబస్తు ► ఖాకీ పహారా నడుమ మార్కెట్లో కొనుగోళ్లు సాక్షి, ఖమ్మం/ఖమ్మం వ్యవసాయం: వ్యవసాయ మార్కెట్‌పై దాడి ఘటనతో ఖమ్మం నగరం అట్టుడికింది. రైతులకు మద్దతుగా విపక్షాల ఆందోళనలు, పోలీసుల విస్తృత తనిఖీలు, అరెస్ట్‌లు, 144 సెక్షన్‌తో శనివారం ఒక్కసారిగా ఖమ్మం నగరం వేడెక్కింది. మరోవైపు పోలీసుల పహారాలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లను వేగిరం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం మిర్చి కొనుగోలుపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పడిపోవడంతో రైతులు ఆందోళనకు గురై మార్కెట్‌యార్డుపై దాడి చేసిన విషయం విదితమే. రైతుల ఆందోళనకు మద్దతుగా శనివారం ప్రతిపక్షాలు గొంతు కలిపాయి. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా ఆందోళనలకు సిద్ధమయ్యారు. రైతుల దాడిలో మార్కెట్‌కు సంబంధించిన ఆస్తులు భారీగా విధ్వంసం కావడం, పరిస్థితులు చేయిదాటుతుండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం 144 సెక్షన్ విధించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ యంత్రాంగాన్ని ఖమ్మంనగరంతోపాటు పరిసర మండలాల్లో మోహరింపజేసి గట్టి బందోబస్తు చేపట్టింది. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు.. మిర్చికి మద్దతు ధర కల్పించాలని విపక్షాలు మార్కెట్‌యార్డును సందర్శించడం, ఆందోళనలకు ప్రణాళికలు రూపొందించుకోవడం తదితర చర్యలకు సమాయత్తం కావడంతో పసిగట్టిన పోలీస్‌యంత్రాంగం చర్యలకు పూనుకుంది. నగరంలోని బస్టాండ్ సెంటర్‌తోపాటు కాల్వొడ్డు, వరంగల్ క్రాస్‌రోడ్డు, ప్రకాష్‌నగర్ బ్రిడ్జి, బైపాస్‌రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. జిల్లా సరిహద్దు వద్ద వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. నాయకన్‌గూడెం, ముదిగొండ, తిరుమలాయపాలెం, శ్రీశ్రీ సర్కిల్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. మార్కెట్ దాడి ఘటనలో రైతులున్నారనే అనుమానంతో ముదిగొండలో కొందరిని అదుపులోకి తీసుకోవడంతో పోలీస్‌స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఇక్కడ ఆందోళన చేపట్టడంతో పోలీసులు ఆయనను అరెస్ట్‌చేసి కొణిజర్లకు తరలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితోపాటు జిల్లాకు చెందిన సీపీఐ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి ఆందోళనకు బయలుదేరగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి కొణిజర్లకు తరలించారు. టీడీపీ నాయకులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నామా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబి స్వర్ణకుమారిలను అరెస్ట్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్, జిల్లా రాష్ట్ర, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు,రాయల చంద్రశేఖర్ తదితరులను, సీపీఎం నాయకుడు సుదర్శన్ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కొనుగోళ్లపై జేసీ పర్యవేక్షణ.. వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. మార్కెట్‌కు వచ్చిన సరుకు వివరాలు, కొనుగోళ్లు తదితర అంశాలను మార్కెటింగ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిర్చి కొనుగోళ్లను వేగిరం చేయాలని అధికారులను ఆదేశించడంతోపాటు రహదారులపై ఉన్న మిర్చిని కాంటాలను పెట్టించి తరలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో ఉన్న సరుకు వివరాలు, కొనుగోళ్లు జరిగిన విధానాన్ని, ధరల వివరాలను జేసీ తెలుసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్స్థితిగతులను, మిర్చి కొనుగోళ్ల వ్యవహారాన్ని, శాంతిభద్రతలను తదితర అంశాలపై మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష జరిపి ఉన్నతాధికారులకు నివేదించ చర్యలను చేపట్టారు. -
వైఎస్ జగన్ రైతు దీక్షతో ప్రభుత్వంలో అలజడి
-
మిరప మంటలెందుకు?
-
మిరప మంటలెందుకు?
-
మిర్చిపై ఏం చేద్దాం?
సర్కారు తర్జనభర్జన - కేంద్రం కొనుగోలు చేస్తుందన్న ఆశలు గల్లంతు - క్వింటాలుకు రూ.1,500 బోనస్‌తో కొనుగోలుకు యోచన - ఖమ్మం సంఘటనలో అధికారుల వైఫల్యంపై ఆగ్రహం - ఇష్టానుసారంగా ధరలు తగ్గిస్తున్న వ్యాపారులపై చర్యలు సాక్షి, హైదరాబాద్: మిర్చి రైతులను ఆదుకునే విషయంలో ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఒకవైపు పంటకు సరైన ధర రాక రైతులు అల్లాడుతుం డటం.. మరోవైపు ఈ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తుండటంతో సర్కారును కలవర పెడుతోంది. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మిర్చి రైతుల గగ్గోలు.. నెల రోజులుగా మిర్చి రైతులు «గిట్టుబాటు ధర రాక గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది క్వింటాలుకు రూ.12 వేలు ధర రాగా, ఇప్పుడు అది రూ.4,500కు, ఒకానొక సంద ర్భంలో రూ.2,500కు పడిపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. అసహనంతో అనేక చోట్ల మిర్చిని తగులబెడుతున్నారు. తాజాగా ఖమ్మం మార్కెట్ యార్డు ధ్వంసంతో ప్రభు త్వం ఉలిక్కిపడింది. పరిస్థితి చేయిదాటి పోతోందన్న భయాందోళనలో పడింది. పరి స్థితిని చక్కదిద్దడంలో అధికారుల వైఫల్యంపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. అక్కడ అంత జరుగుతున్నా శాంతిభద్రతల సమస్యగానే అధికారులు చెప్పడం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపారు లను ఒప్పించి రైతులకు తగిన ధర ఇప్పించేలా అధికారులు ఎందుకు చొరవ చూపలేదన్న చర్చ నడుస్తోంది. కొందరు అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. కేంద్రంపై ఆశలు గల్లంతు.. 2016–17 ఖరీఫ్‌లో 2.61 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోనే అధిక సాగు జరిగింది. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 3.17 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. అయితే ధర మాత్రం అమాంతం పడిపో యింది. 2015–16 ఖరీఫ్‌లో పండిన మిర్చి ధర మార్కెట్లో క్వింటాలుకు రూ.12 వేల వరకు పలకగా, ఈ ఏడాది ఏకంగా రూ.4,500 వరకు పడిపోయింది. ఈ నేపథ్యంలో మిర్చిని క్వింటాలుకు రూ.7–8 వేల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదు. లేదంటే బోనస్‌గా క్వింటాలుకు రూ.1,500 ఇచ్చేలా సహకరించాలని కోరింది. లేఖ రాసినా, స్వయంగా అధికారులు వెళ్లి విన్నవించినా కేంద్రం మిన్నకుండిపోయింది. దీంతో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆశలు వదులుకుంది. ఇలాగే కొనసాగితే రైతుల్లో ఇంకా వ్యతిరేకత పెరుగుతుందని, వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. -
మిరప మంటలెందుకు?
- కుమ్మక్కై మిర్చి రైతుల కంట్లో కారం కొడుతున్న వ్యాపారులు - ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మాయాజాలం - పంట భారీగా వస్తుండటాన్ని అదనుగా తీసుకున్న వైనం - మద్దతు ధర ప్రకటించని కేంద్ర ప్రభుత్వం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రోజూ సగటున లక్షా యాభై వేల బస్తాల వరకూ మిర్చి పంట వస్తోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు సిండికేట్ అవుతున్నారు. జెండా పాట పేరిట ఒకటి రెండు లాట్లకు అధిక ధర పెడుతూ.. మిగతా పంటను అతి తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు ధర లేక, పంటను ఇంటికి తీసుకుపోలేని దుస్థితిలో పడిపోతున్నారు. చివరికి పంటను తక్కువ ధరకే తెగనమ్ముకుని ఇంటిబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పరిస్థితి, రైతుల దుస్థితిపై ‘సాక్షి’ఫోకస్.. – బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మం కొనుగోళ్లు ఉండవనే ప్రచారంతో.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మిర్చి రాక మొదలైంది. వారం వారం పెరుగుతూ.. ఏప్రిల్ ఒకటి నుంచి వెల్లువలా పోటెత్తింది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు సిండికేట్ అయ్యారు. కొనుగోళ్లు ఉండవంటూ వారిలో కొందరు గోబెల్స్ ప్రచారానికి దిగారు. ఒక్కసారిగా మిర్చి ధర క్వింటాల్‌కు వెయ్యి రూపాయల దాకా తగ్గించారు. తర్వాత మరింతగా ధరలు తగ్గిస్తూ వచ్చారు. కొద్దిరోజుల కింద రూ.5వేలకుపైన ధర ఉండగా.. మెల్లగా రూ.4,500, రూ.4 వేలు, రూ.3 వేలకు తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించకపోవడం, ధర పడిపోతున్నా.. రైతులను ఆదుకునే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ‘ధర ఇంతేనా..?’అని రైతులు ప్రశ్నిస్తే.. ఎక్కడ ఎక్కువస్తే అక్కడ అమ్ముకోండంటూ పంపేస్తున్నారు. ఇతర వ్యాపారుల వద్దకు వెళ్లినా అదే సమాధానం వస్తోంది. ఇలా ధర కోసం విసిగి వేసారుతున్న రైతులు సిండికేట్ మాయాజాలానికి బలవుతున్నారు. మే నెలలో ఎండలు అధికంగా ఉండటంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 20 రోజుల నుంచి నెలరోజుల పాటు సెలవులు ఇస్తుంటారు. దీనిని వ్యాపారులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. మే మొదటివారం నుంచి మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు ఉండవంటూ రైతుల్లో ప్రచారం చేస్తున్నారు. దీంతో రైతులంతా తమ వద్ద ఉన్న మిర్చిని అమ్ముకొనేందుకు మార్కెట్ దారి పట్టారు. మూడో రకం పేరుతో మోసం తేజా రకం మిర్చిని ప్రధానంగా ఆయిల్ తీయడానికి ఉపయోగిస్తారు. ఈ రకం మిర్చి 3వ కోత నుంచి ఆశించిన మేరకు ఆయిల్ రాదు. ప్రస్తుతం మిరప తోటలు 3వ కోత దశలో ఉన్నాయి. దీంతో వ్యాపారులు ఇదే అదనుగా మోసానికి తెగబడ్డారు. రైతులు తెస్తున్న 2వ కోత మిర్చిని కూడా మూడో కోత మిర్చిగా లెక్కగడుతూ తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. రైతులు 2వ కోత మిర్చి అని చెప్పినా పట్టించుకోవడం లేదు. కొందరు వ్యాపారులైతే 3వ కోత మిర్చి పేరుతో క్వింటాల్‌కు రూ.1,500 నుంచి రూ.2,500కు మించి ధర పెట్టడం లేదు. రూ.12,000 నుంచి రూ.3,000కు.. సీజన్ ఆరంభమైన గత నవంబర్‌లో మిర్చి ధర రూ.12 వేల వరకు పలకగా క్రమంగా ధర క్షీణించింది. డిసెంబర్ నాటికి రూ.10 వేలకు, జనవరిలో రూ.9 వేలకు, ఫిబ్రవరిలో రూ.8,500కు చేరింది. తర్వాత భారీగా పంట ఉత్పత్తి విక్రయానికి వస్తుండటంతో వ్యాపారులు సిండికేటై ధరను బాగా తగ్గించారు. దీంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో రూ.6 వేల నుంచి రూ.3 వేల వరకు ధర పడిపోయింది. మూడు వేలే ఇస్తామంటున్నారు.. ‘‘గతేడాది ఎకరన్నరలో మిర్చి వేసిన. మంచి ధర రావడం, ప్రభుత్వం పత్తిసాగు వద్దని చెప్పడంతో ఈ సారి ఐదెకరాల్లో మిర్చి పంట వేశాం. మొదటి కోతలో 29 క్వింటాళ్ల దిగుబడి రాగా.. ఫిబ్రవరి రెండో వారంలో క్వింటాల్ రూ.8,200 చొప్పున అమ్మిన. మార్చిలో రెండో కోతలో 32 క్వింటాళ్లు రాగా.. రూ.5,200 చొప్పున మాత్రమే ఇచ్చారు. మూడో కోతలో 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దానికి వ్యాపారులు తొలుత రూ.3 వేల చొప్పునే ఇస్తామన్నారు. తర్వాత అడిగే దిక్కు కూడా లేకుండా పోయింది. ధర ఎక్కువ వస్తుందేమోనని మూడు రోజులుగా మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నా. అటు దిగుబడి తగ్గి, ఇటు ధర రాక ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.5 లక్షల దాకా నష్టం వస్తోంది..’’ – రైతు శీలం గణేశ్, సూర్యాపేట జిల్లా నాగారం మండలం మాచిరెడ్డిపల్లి రికార్డుల్లో మాత్రమే గరిష్ట, కనిష్ట ధరలు మిర్చి గరిష్ట, కనిష్ట ధరలు మార్కెటింగ్ శాఖ రికార్డులకే పరిమితం తప్ప.. వాస్తవంగా వ్యాపారులు ఆ మేరకు చెల్లించడం లేదు. జెండా పాట పేరుతో ఒకటి, రెండు లాట్లకు గరిష్టధర నిర్ణయించి.. మిగతా అధిక మొత్తం సరుకును దాదాపుగా కనిష్ట ధరకు, నాణ్యత తక్కువ పేరుతో కనిష్ట ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. సెలవులన్న కారణం చెప్పి.. రూ.2 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి ఎకరన్నరలో మిర్చి సాగు చేసిన. అందులో రూ.1.5 లక్షలు అప్పే. పంట వేసే సమయంలో క్వింటాల్‌కు రూ.12 వేల వరకు ధర ఉంది. నా పంటకు రూ.10 వేల వరకు అయినా రాదా అనుకున్నా. పంటను అంత దూరం నుంచి ఖమ్మం మార్కెట్‌కు తీసుకొస్తే.. వ్యాపారులు సెలవులన్న కారణం చెబుతూ రూ.2,200లే ధర పెడతామన్నారు. గుట్టలు గుట్టలుగా మార్కెట్‌కు బస్తాలు రావడంతో అసలు కొంటారో కొనరోనని ఆందోళనగా ఉంది. తప్పని పరిస్థితుల్లో పంటను అమ్ముకున్నా..’’ – రైతు కలంచెర్ల మల్లయ్య, సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి పెట్టుబడి కూడా వచ్చేలా లేదు ‘‘సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. కూలీల రేట్లు మూడు నాలుగింతలు అయ్యాయి. నేను నాలుగెకరాల్లో మిర్చి వేసిన. ఎకరాకు 25 క్వింటాళ్ల లెక్కన దిగుబడి వచ్చింది. అయినా పెట్టుబడి మేర సొమ్ము అందే పరిస్థితి లేదు. క్వింటాల్‌కు రూ.2,500 నుంచి రూ.3 వేలే ఇస్తుండడంతో కూలీల ఖర్చులే వచ్చే పరిస్థితి లేదు.’’ – సామ శ్రీనివాస్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం మిడ్తనపల్లి వ్యాపారులంతా కలసి ధర తగ్గిస్తున్నారు ‘‘ఈ ఏడాది రెండెకరాల్లో మిర్చి వేశా. 100 బస్తాల దిగుబడి వచ్చింది. అమ్ముకుందామని గురువారం ఖమ్మం మార్కెట్‌కు వచ్చా. వ్యాపారులు సరుకును చూస్తున్నారుగానీ ధర నిర్ణయించడం లేదు. ఓ వ్యాపారి మాత్రం ముఖం విరుస్తూ క్వింటాల్‌కు రూ.3,500 చొప్పున ఇస్తామన్నాడు. పంట నాణ్యంగా ఉన్నా ధరపెట్టడానికి వ్యాపారుల మనసు అంగీకరించడం లేదు. వారంతా ఏకమై ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు..’’ – ఇస్లావత్ కిషన్, సుజాతనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పుల పాలయ్యా.. ‘‘ఎకరన్నరలో మిర్చి పంట వేశాను. 32 బస్తాల దిగుబడి వచ్చింది. మార్కెట్లో క్వింటాల్‌కు రూ.4 వేలు అడిగారు. అమ్మడానికి మనసు రాలేదు. మళ్లీ వ్యాపారులెవరూ రాలేదు. సెలవులుంటాయని అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంతకన్నా తక్కువ ధర వస్తుందేమోనన్న భయం వేస్తోంది. పెట్టుబడి కోసం తెచ్చిన రూ.2 లక్షలకు పైగా అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు..’’ – రైతు లకావత్ బాలాజీ, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవిద్రాల బంజర మార్కెట్కొచ్చి మూడు రోజులైంది.. ‘‘రెండెకరాల్లో మిర్చి సాగు చేశాను. ఆశించిన ధర లేక పెట్టుబడి కూడే పరిస్థితి లేదు. గతంలో కొంత మిర్చిని అమ్మిన. రెండోకోతలో వచ్చిన మిర్చిలో 23 బస్తాలు అమ్మకానికి తెచ్చిన. కానీ అడిగే నాథుడే లేడు. మార్కెట్‌కు వచ్చి మూడు రోజులవుతున్నా వ్యాపారులు పోటీగా సరుకును చూసే పరిస్థితి లేదు..’’ – పులిచింతల ఉపేందర్‌రెడ్డి, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెడ్రెడ్డిగూడెం ఇంకా కల్లాల్లోనే మిర్చి.. ఖమ్మం మార్కెట్‌పై దాడి ఘటన నేపథ్యంలో శనివారం ఉదయం పోలీసు పహారా మధ్య మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో ఉన్న మిర్చిని కొనుగోలు చేసి తరలించడానికి ఇంకా రెండు రోజులు పట్టనుంది. అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో పొలాలు, రైతుల ఇళ్లల్లో ఇంకా లక్షల బస్తాల మిర్చి ఉన్నట్లు అంచనా. ఆ మిర్చిని మార్కెట్‌కు తెస్తే కొనుగోళ్ల పరిస్థితి ఎలాగని అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు ధర అమాంతం పడిపోవడంతో కనీసం సాగు ఖర్చయినా వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఖమ్మం మార్కెట్, ముదిగొండ మండలంలోని చైనా మిల్లులో కలిపి మొత్తంగా 40 లక్షల బస్తాలు కొనుగోలు చేశారు. మరో 15 లక్షల బస్తాలు రైతుల వద్ద ఉన్నట్లు అంచనా. ఎండల్లో పడిగాపులు వేల బస్తాల మిర్చి మార్కెట్‌కు రావడంతో మార్కెట్‌తోపాటు చుట్టుపక్కల రోడ్ల మీద కూడా మిర్చి బస్తాలు నిండుతున్నాయి. కొనుగోళ్లు మాత్రం కేవలం రెండు రోజులే చేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చిన మిర్చిని తూకాలు వేయడానికి రెండు రోజులు, ఎత్తడానికి రెండు రోజులు పడుతోంది. దీంతో రైతులు మండుటెండలో మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారు. రైతులు మిర్చిని తీసుకుని మార్కెట్‌కు వెళితే.. అమ్ముకుని రావడానికి ఐదు రోజులు పడుతోంది. ధర గిట్టుబాటు కాలేదనుకున్న రైతులు వారం రోజులకు పైగా ఉంచి.. చివరకు ఎంతో కొంత ధరకు అమ్ముకుని వస్తున్నారు. పత్తి వద్దని మిర్చి సాగుచేస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న ప్రధాన సాగు పంటలు. నాగార్జున సాగర్ ఆయకట్టు నీరు అందకపోవడం, ప్రభుత్వం పత్తి సాగు వద్దంటూ చేసిన ప్రకటనతో.. ఈసారి ఉమ్మడి జిల్లాలోని రైతులు మిర్చి సాగుకు మొగ్గారు. ఉమ్మడి జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 4.05 లక్షల ఎకరాలు కాగా.. మిర్చి 60 వేల ఎకరాలు. ఈసారి పత్తి 3.2 లక్షల ఎకరాలకు తగ్గగా.. మిర్చి సాగు 85 వేల ఎకరాలకు పెరిగింది. ఇలా సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు వాతావరణ పరిస్థితులు కొంత అనుకూలించడంతో దిగుబడి కూడా పెరిగింది. కానీ దిగుబడి వచ్చిన ఆనందం ధర దగాతో ఆవిరైపోతోంది. 6 లక్షల అప్పు మిగిలింది.. తొలకరి నాటికి ధర చూసి ఆశపడిన ఓ కౌలు రైతు ఎనిమిదెకరాల్లో మిర్చి సాగు చేశాడు. పెట్టుబడి కోసం తెలిసినవారి దగ్గర అప్పులు చేశాడు. ఆరుగాలం కుటుంబ సభ్యులంతా కష్టపడితే నాలుగు కాసులు వెనకేసుకోవచ్చని భావించాడు. కానీ వర్షాభావంతో మిర్చి దిగు బడి తగ్గింది. 8 ఎకరాల్లో కలి పి కూడా 80 క్వింటాళ్ల దిగు బడే రావడంతో ఆందోళన చెందాడు. అటు మార్కెట్లో మిర్చికి సరైన ధర రాలేదు. సాగు, కోత ఖర్చులకు రూ.8 లక్షల వరకు ఖర్చుకాగా.. తన పంటకు రెండు లక్షల వరకే వచ్చింది. దీంతో రూ.6 లక్షల వరకు అప్పు మిగిలింది. ఖమ్మం నగరంలోని టేకులపల్లికి చెందిన బి.పుల్లయ్య అనే గిరిజన రైతు దుస్థితి ఇది. కూలీ కూడా రాని దుస్థితి కారణంగా కుటుంబసభ్యులతోనే కొద్దికొద్దిగా చివరి పంట కోసుకుంటున్నామంటూ పుల్లయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. పరిస్థితి ఇలాగే ఉంటే కౌలు రైతుల చావు కేకలే వినాల్సి వస్తుందని వాపోయాడు. సాగు చేయాలంటే భయమవుతోంది ఈ రైతు పేరు ధారావత్ నాగు.. నర్సంపేట నియోజకవర్గంలోని ఖాదర్‌పేట గ్రామ శివారు సూర్యపేటతండా. కూతురికి పెళ్లి చేశాడు. కుమారుడిని హైదరాబాద్‌లో చదివిస్తున్నాడు. నాలుగెకరాల భూమి ఉంది. గత నాలుగేళ్లుగా ఎకరన్నర విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తున్నాడు. గతేడాది మిర్చి పంటతో మంచి లాభమే వచ్చింది. ఈ ఏడాది కూడా మిర్చి సాగు చేశాడు. పెట్టుబడి కోసం వరంగల్‌లోని మిర్చి అడ్తిదారు వద్ద రూ.25 వేలు అప్పు చేశాడు. 8 క్వింటాళ్ల దిగుబడిరాగా.. ఈనెల 24న వరంగల్ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.2,300 చొప్పున కొనుగోలు చేశారు. ఇలా వచ్చిన రూ.17 వేలను అడ్తిదారు అప్పులో జమ చేసుకున్నాడు. దీంతో ఇంత కష్టపడ్డా పెట్టుబడి సొమ్మూ రాలేదని నాగు ఆందోళనలో మునిగిపోయాడు. ఇంకోసారి మిర్చి సాగు చేయాలంటే భయమవుతోందని వాపోయాడు. ధర లేదు.. నిల్వ అవకాశమూ లేదు.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని స్వామిరావుపల్లికి చెందిన దాసరి రాజమౌళి భార్య, కుమారుడితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది ఎకరన్నర భూమిలో మిర్చి వేశాడు. 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.11,300 చొప్పున ధర పలకడంతో మంచి లాభం వచ్చింది. దీంతో ఈసారి రెండున్నర ఎకరాల్లో మిర్చి వేశాడు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. కానీ మార్కెట్‌కు తీసుకెళ్తే కొనేవారు లేరు. ధర తగ్గిపోయింది. దాచిపెడదామంటే కోల్డ్ స్టోరేజీల్లో ఖాళీ లేదు. మరోవైపు పెట్టుబడి కోసం చేసిన అప్పులతో ఆందోళన నెలకొంది. -
చెప్పేవన్నీ అబద్ధాలే
హైదరాబాద్: మిర్చి రైతుల విషయంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కవిత అబద్దాలు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. కేంద్రం సహకారంతో రైతులకు మంచి ధర అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధరల విషయంలో పుకార్లు పుట్టించారనడాన్ని ఖండించారు. టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కోసం మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడుందని ప్రశ్నించారు. రైతులకు న్యాయమైన ధర అందించడంలో, వ్యాపారస్తులను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మిర్చికి గిట్టుబాటు ధర అందించడంలో కేంద్రం సహకరించడం లేదన్న వాదన సరికాదన్నారు. ధరల్లో హెచ్చుతగ్గులుంటే జోక్యం చేసుకొని ధరల స్థిరీకరణ చేసే హక్కు కేంద్రానికి ఉందని, ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటుండగా తెలంగాణ ఎందుకు నిరాకరిస్తోందని నిలదీశారు. కందుల కొనుగోలు కోసం కేంద్రం రూ.750 కోట్లు విడుదల చేసి 50రోజులు దాటినా రైతులకు చెల్లించడంలేదని విమర్శించారు. మార్కెట్ యార్డుల ఆధునికీకరణ కోసం ఈనామ్ పథకం కింద ప్రతి మార్కెట్‌కు రూ.30 లక్షలు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు చేపట్టడం లేదని మండిపడ్డారు. ఆదివారం నిర్వహించే శాసనసభ సమావేశాల్లో మిర్చి, వేసంగి వరి రైతులకు భరోసా కల్పించేందుకు నిర్ణయం తీసుకోవాలని, రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యక్రమాల కోసం కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని,. ప్రభుత్వ వాహనాలకు టీఆర్ఎస్ జెండాలు కట్టారని ఆరోపించారు. వరంగల్ సభలో కేసీఆర్ తిట్లపురాణం వల్లించడం తప్ప అభివృద్ధి ప్రస్తావన చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. వరంగల్ సభ ఆ పార్టీ పతనానికి ప్రారంభ సూచిక అని అన్నారు. మహానుభావుడు విద్యాసాగర్ రావు మృతి పట్ల బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చింతల రామచంద్రారెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణలో ప్రతి చేనుకు నీరందించేందుకు కృషి చేసిన మహానుభావుడు అని కొనియాడారు. -
ముఖ్యమంత్రి, మంత్రులకు పిచ్చి
ఖమ్మం : ప్రతిపక్షాలకు కాదు.. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులకే పిచ్చిపట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను సంక్షోభంలోకి నెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు. జీఓ 123ను హైకోర్టు రద్దు చేస్తే.., దానిని ప్రతిపక్షాలు రద్దు చేయించాయని మంత్రి తుమ్మల చెబుతున్నారని, హైకోర్టులో కూడా ప్రతిపక్షం ఉందా అని ప్రశ్నించారు. రూ.12 వేల నుంచి రూ.15 వేలు పలికిన క్వింటాల్ మిర్చి.., ఒక్కసారిగా రూ.3 వేల నుంచి రూ.4వేలకు పడిపోవటం దారుణమన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే, వారిని అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. తక్షణమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను ప్రశ్నించేందుకు వచ్చిన నాయకులను కూడా అరెస్టు చేయడం బాధాకరమని అన్నారు. అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలను ఆపలేరని, రైతులపై ప్రేమ ఉంటే వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఈ నెల 30 న జిల్లా వ్యాప్తంగా నిరసనలు, మే 2న జిల్లా దిగ్బంధనం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇలోగా సమస్య పరిష్కారం కాకపోతే మే 15న హైదరాబాద్‌లో అన్ని పార్టీలతో కలిసి ధర్నా చేస్తామన్నారు. -
మద్దతుధర ఇవ్వడంలో సర్కార్ విఫలం
- మిర్చి, ధాన్యం, కందులు, పసుపు రైతుల కష్టాలు పట్టవా..? - వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, ఖమ్మం: ‘‘మిర్చి, ధాన్యం, కందులు, పసుపునకు మద్దతుధర ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతులు నానా కష్టాలు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు’’వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చికి రూ.12 వేల నుంచి రూ.14 వేలు మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.2.500 నుంచి రూ.3 వేలు వరకే ఇస్తున్నారని, దీంతో కడుపు మండిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. మిర్చి రైతులు సాగు ఖర్చులు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కంది, ధాన్యం, పసుపు రైతులది కూడా ఇదే పరిస్థితి అన్నారు. రాష్ట్రంలో రూ.17వేల కోట్ల రుణమాఫీ చేయడానికి మూడేళ్లు పట్టిందని, దీంతో బ్యాంకుల్లో తీసుకున్న అప్పుకు రైతులే వడ్డీ చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో మూడేళ్లలోనే రాష్ట్రంలో 2,256 మంది రైతులు చనిపోయారన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ తెలం గాణ రాష్ట్ర శాఖ ప్లీనరీ జూలైలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్లీనరీకి ముందు లేదా ఆ తర్వాత నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. మండుటెండలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ వైఎస్సార్సీపీ ఖమ్మం జిల్లా పార్టీ సమావేశం సందర్భంగా ఖమ్మం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ పార్టీ నూతన జిల్లా కార్యాలయానికి తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనం తరం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నాయకులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఐదు ఎమ్మెల్యే స్థానాలతోపాటు ఎంపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని, జగనన్న లక్ష్యం ఇదేనని అన్నారు. -
పరిహారమా...? పరిహాసమా..?
-
26, 27న గుంటూరులో జగన్ ‘రైతు దీక్ష’
-
భగ్గుమన్న మిర్చి రైతులు
గిట్టుబాటు ధర కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం హైదరాబాద్: మిర్చికి గిట్టుబాటు ధర లేదని మలక్‌పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళనతోపాటు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా జరిపారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయి చాదర్‌ఘాట్ నుంచి దిల్సుఖ్నగర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు.. రైతుల వద్దకు వచ్చి వారిని మార్కెట్ కార్యాలయానికి పిలిపించి చర్చలు జరిపారు. అనంతరం రైతులు విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే సమయంలో క్వింటాకు రూ.8 నుంచి 12 వేల వరకు ధర పలికిందని, ఇప్పుడు రూ. 500 నుంచి రూ. వెయ్యికి దిగిపోయిందన్నారు. వ్యాపారులు తమను నిలువునా దోచుకుంటూ ఇబ్బందులు పెడుతుంటే మార్కెట్ పాలకులు చోద్యం చూస్తుండటం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి సరుకును ప్రభుత్వం ఎలా కొనుగోలు చేసిందో మిర్చిని కూడా కొనుగోలు చేసి న్యాయం చేయాలని, క్వింటాకు రూ.1,500 చొప్పున ప్రభుత్వమే చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర లభించేలా చర్యలు.. మిర్చి ధరను దృష్టిలో పెట్టుకుని గురువారం, శుక్రవారం రెండు రోజులూ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్జీఎస్ మల్లేశం తెలిపారు. వ్యాపారులతో మాట్లాడి సమస్య రాకుండా చూస్తామని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
రూ.1,500 బోనస్ ఇవ్వండి
- మిర్చి క్వింటాలుకు ఇవ్వాల్సిందిగా కేంద్రానికి తాజాగా ప్రతిపాదన - తక్కువ ధరకు విక్రయించిన, విక్రయిస్తున్న రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి - రాష్ట్ర ప్రభుత్వ గత విన్నపాలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం - ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్న వ్యాపారులు - గిట్టుబాటు ధర రాక మిర్చి రైతుల ఆందోళనలు సాక్షి, హైదరాబాద్: మిర్చి రైతులకు క్వింటా లుకు రూ.1,500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ మార్కెటింగ్ శాఖ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదించింది. గతంలో క్వింటాలుకు రూ.7 వేలు చెల్లించేలా చర్యలు తీసుకో వాలని కోరిన మార్కెటింగ్ శాఖ, దానితో పాటు ప్రత్యామ్నాయంగా బోనస్ విషయాన్ని ప్రస్తావించింది. 70 శాతం వరకు రైతులు వ్యాపారులకు ఇప్పటికే తక్కువ ధరకు విక్రయించినందున వారందరినీ గుర్తించి రూ.1,500 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. తాము గతంలో పేర్కొ న్నట్లు క్వింటాలుకు గిట్టుబాటు ధరగా రూ. 7–8 వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే విక్రయించిన రైతులకు ప్రయోజనం ఉండదని, వ్యాపారులు బాగుపడతారని, కాబట్టి మిర్చి రైతులను గుర్తించి వారికి పరిహారంగా రూ.1,500 ఇవ్వడమే సమంజసమని విన్నవించింది. అలాగే మార్కెట్‌కు తరలివచ్చే రైతులకు కూడా రూ.1,500 చెల్లించేలా నిర్ణ యం తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికా రులు కోరారు. ప్రస్తుతం మార్కెట్లో మిర్చి ధర క్వింటాలుకు రూ.4,500 వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వం రూ.1,500 బోనస్ ఇస్తే క్వింటాలుకు రూ.6 వేలు రైతుకు అంద నుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం అందుకు అంగీకరిస్తే ఇప్పటికే వ్యాపారులకు విక్రయించిన రైతులను రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గుర్తి స్తామని, ఎకరానికి సరాసరి పండిన పంటను లెక్కలోకి తీసుకొని రూ.1,500 చెల్లిస్తామని అంటున్నారు. అయితే కేంద్రం మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జనవరి నుంచి ధర పతనం వాస్తవంగా సీజన్ ఆరంభంలో మిర్చి ధర కొంత బాగుంది. జనవరి నుంచి ధర పతనం మొదలైంది. ఫిబ్రవరిలో దాదాపు రూ.1,500 తగ్గింది. పంట ఉత్పత్తి అధికంగా వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో అనూహ్యంగా ధర పతనమైంది. మార్చి మొదట్లో రూ.8 వేలకు తగ్గగా.. రెండో వారం నుంచి రూ.6–5 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రోజుకు కొంత చొప్పున ధర పడిపోతోంది. రైతుకు ఎకరా పంట సాగు, కోతకు రూ.లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది. రూ. 4,500కు ధరకు పడిపోవడంతో ఎకరాలో పండిన పంట నుంచి రూ.80 వేలకు మించి రావటం లేదని రైతులు వాపోతున్నారు. ధరల పతనంతో మిర్చి రైతులు హాహాకారాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మిర్చి కొనుగోలుకు అనుమతిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాసినా, ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీకి వెళ్లి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా ధరలు ఊహించని రీతిలో మిర్చి ధర పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలుకు సగటున ధర రూ.4,500 మించడంలేదు. కొన్ని చోట్ల నాణ్యత లేదంటూ రూ.3 వేలకు మించి కొనుగోలు చేయడంలేదు. తక్కువ ధరపై రైతులు ప్రశ్నిస్తే కొనుగోలు చేయ కుండా వ్యాపారులు సతాయిస్తున్నారు. బతిమిలాడితే మరో వందో యాభయో చేతిలో పెడుతున్నారు. ఇలా వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తూ మిర్చి కొనుగోలు చేస్తున్నారు. -
26, 27న గుంటూరులో జగన్ ‘రైతు దీక్ష’
పార్టీలకతీతంగా దీక్షకు తరలి రావాలని వైఎస్సార్ సీపీ నేతల పిలుపు గుంటూరు వెస్ట్: గిట్టుబాటు ధర లభించక, రుణ మాఫీ కాక ఆత్మహత్యల బాట పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పాటు గుంటూరులో రైతు దీక్ష చేయనున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ధరల స్థిరీకరణ పేరుతో రూ.5 వేల కోట్లు ఇస్తామని చెప్పి తుదకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేసిన తీరుకు నిరసనగా వైఎస్ జగన్ ఈ దీక్ష చేపడుతున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు. రుణ మాఫీ పేరుతో కనీసం వడ్డీ కూడా మాఫీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను దారుణంగా వంచించడాన్ని నిలదీసేందుకే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మరోమారు పోరుబాటకు సిద్ధమయ్యారని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష చేపడుతున్నారని తెలిపారు. రైతులు పడుతున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులను చూసి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్ల తో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని దౌర్భాగ్యపు స్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దొంగలెక్కలతో రైతులు, ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, ఎవరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని పేర్కొన్నారు. వైఎస్ జగన్ రైతు దీక్షకు పార్టీలకతీతంగా పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ చేతగానితనంతోనే .. మిర్చిని అధికంగా పండించడం వల్లే రైతులు అధిక ధరకు అమ్ముకోలేకపోతున్నారని ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్ధమని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మండిపడ్డారు. గత ఏడాది 8 లక్షల హెక్టార్లలో మిర్చి పండితే ఈ ఏడాది కేవలం 6 లక్షల హెక్టార్లలోనే సాగయ్యిందన్నారు. జెమిని వైరస్, ఇతర కారణాల వల్ల దిగుబడి పడిపోయిందని చెప్పారు. గత ఏడాది పంటలన్నీ బాగానే పండినా మంచి ధరను రైతులు సాధించారన్నారు. ఈ సారి పంటలు సరిగ్గా పండకపోగా, కనీస ధర కూడా పొందలేకపోవడానికి ప్రభుత్వ చేతగానితనమే కారణమని దుయ్యబట్టారు. గత ఏడాది క్వింటా మామిడి రూ.14 వేలు ధర పలుకగా, ఈ ఏడాది కేవలం రూ.3 వేలకు పడిపోయిందన్నారు. పసుపు రూ.25 వేల నుంచి రూ.7 వేలకు పడిపోయిందన్నారు. ౖరైతు దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు సంఘాలు తరలి రావాలని విజ్జప్తి చేశారు. వలస కూలీలుగా రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు ఇతర రాష్ట్రాలకు కూలీలుగా వలస పోతున్నారని మాజీ మంత్రి పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. రాయితీ రైతుకా...కొనుగోలుదారుడికా..? మిర్చి రైతుకు క్వింటాకు రూ.1500 రాయితీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా, దానికి తగ్గ విధివిధానాలు వెల్లడించలేదని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. సబ్సిడీ.. రైతుకా లేక కొనుగోలుదారుడికా అనేది స్పష్టంగా లేదన్నారు. రైతును నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాల గతి ఏమయ్యిందో చరిత్ర చెబుతోందన్నారు. నీళ్లు లేకపోవడం వల్ల ప్రస్తుతం పశ్చిమ డెల్టా ప్రాంతం కూడా ఎండిపోయిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతు కంట మిర్చి మంట
-
మిరప రైతు గగ్గోలు
► క్వింటా ధర రూ.2,500లోపు ► ధర నేలను తాకడంతో రైతుల కంట కన్నీరు ► సాధారణ సాగు 15,567 హెక్టార్లు ► సాగయిన పంట 24,494 హెక్టార్లు ► వడ్డీలకూ సరిపోని దిగుబడి కర్నూలు(అగ్రికల్చర్): మిరప రైతు ఎప్పుడూ లేని విధంగా నష్టాలను మూటగట్టుకున్నాడు. 2015లో కాసులు పండినా.. ఆ తర్వాత ఏడాది ఈ పంట కన్నీరు మిగిల్చింది. అప్పట్లో రూ.10వేలకు పైగా ధర పలికిన మిరప ధర ఇప్పుడు నేలను తాకింది. విత్తనాల కొరత ఏర్పడినా ఎంతో ఆశతో అధిక ధరలతో కొనుగోలు చేసి పంట సాగు చేస్తే పెట్టుబడి కూడా దక్కకని పరిస్థితి నెలకొంది. సాధారణ సాగు 15,567 హెక్టార్లు కాగా.. 24,494 హెక్టార్లలో పంట సాగయింది. కిలో విత్తనం ధర రూ.20వేల వరకు పలికిందంటే ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఎరువులు, పురుగు మందులు, కూలీలు, ఇతరత్రా ఖర్చులు ఎకరాకు రూ.లక్షలకు పైగా పెట్టుబడిగా పెట్టారు. అయితే పెట్టుబడిలో 20 శాతం కూడా దక్కకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో క్వింటా ఎండు మిర్చి ధర రూ.10వేల నుంచి రూ.12వేలు పలికింది. ప్రస్తుతం ధర రూ.3వేలు కూడా మించని పరిస్థితి ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో క్వింటాకు లభిస్తున్న ధర రూ.2వేల నుంచి రూ.2,500 మాత్రమే. మిర్చి క్రయ, విక్రయాలకు గుంటూరు మార్కెట్ ప్రసిద్ధి. అక్కడ కూడా ధర నేలను తాకింది. ఆలూరు, పెద్దకడుబూరు, శిరువెళ్ల, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. మరికొందరు రైతులు భార్యల బంగారం ఆభరణాలు తాకట్టుపెట్టి మిరప పంట సాగు చేశారు. అయితే చీడపీడల కారణంగా దిగుబడులు కూడా పడిపోవడం.. ధర కూడా అంతంతే కావడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మిరపకు మద్దతు ధర ఏదీ: వివిధ పంటలకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిని బట్టి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. ఇటు జిల్లాలోను, అటు రాష్ట్రంలోను సాగు చేసే ప్రధాన పంటల్లో ఎండు మిర్చి ఒకటి. ప్ర«ధాన పంటగా గుర్తింపు ఉన్నా.. మద్దతు ధర కరువయింది. కనీస మద్దతు ధర ఉంటే ధరలు పడిపోయినపుడు ప్రభుత్వం నాఫెడ్, మార్క్‌ఫెడ్‌లను రంగంలోకి దింపి మద్దతు ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. కానీ ఎండు మిర్చికి కనీస మద్దతు ధర లేకపోవడంతో ధరలు నేలను తాకినా పట్టించుకునే వారు కరువయ్యారు. మిరప రైతులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం చెవికెక్కించుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో కనీసం 12వేల మంది రైతులు మిరప సాగు చేశారు. ఇందులో ఒక్క రైతుకు కూడా పెట్టుబడిలో సగం కూడ దక్కలేదంటే నష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం అవుతోంది. మూడెకరాల్లో ఎండు మిర్చి సాగు చేసిన. ఎకరాకు రూ.లక్ష ప్రకారం రూ.3లక్షలు పెట్టుబడి పెడితే 35 క్వింటాళ్ల పంట వచ్చింది. క్వింటాకు లభించిన ధర రూ.2వేలు మాత్రమే. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడంతో రూ.2.30 లక్షల నష్టం వచ్చింది. పంట అమ్మితే వచ్చిన డబ్బు వడ్డీలకే సరిపోయింది. ఈ ఏడాది చానా నష్టపోయినం. ---నీలప్ప, బూదూరు, మంత్రాలయం మండలం కనీస మద్దతు ధర ప్రకటించాలి: రెండు ఎకరాల్లో మిరప సాగు చేసినం. రూ. 2లక్షలకు పైగా పెట్టుబడి అయ్యింది. 20 క్వింటాళ్ల వరకు పంట వచ్చింది. అయితే మార్కెట్లో ధర రూ.2500లే లభించింది. ఈ ధరతో రైతులు ఎట్లా బాగుపడతారు. పంటను అమ్మగా వచ్చిన డబ్బు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. క్వింటాకు కనీసం రూ.7500 ధర ఉంటే రైతులకు కొంత గిట్టుబాటు అవుతుంది. --- నబిషా, కున్నూరు, గొనెగండ్ల మండలం -
మార్కెట్లు ధ్వంసం చేస్తాం: తమ్మినేని
-
మద్ధతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం
విడపనకల్లు(అనంతపురం జిల్లా): మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించాలంటూ అనంతపురం జిల్లా విడపనకల్ లో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. వైస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. మిర్చి రైతు పట్ల ప్రభుత్వ వైఖరిని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ప్రజలతో పాటు భోజనాలు చేశారు. అనంతరం తహశీల్దారుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మద్ధతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రూ. 5 వేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు అది ఏమైందని ప్రశ్నించారు. మిర్చికి మద్దతు ధర కోసం అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రస్తావిస్తే ప్రభుత్వం కనీసం చర్చకు కూడా రాలేదని పేర్కొన్నారు. రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి దుర్భరమైన జీవనం సాగిస్తున్నా చంద్రబాబు కంటికి కనిపించక పోవడం దారుణమన్నారు. -
మార్కెట్లు ధ్వంసం చేస్తాం: తమ్మినేని
వరంగల్ అర్బన్: మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని, లేకుంటే మార్కెట్ యార్డులను ధ్వంసం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన గురువారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మిర్చి రైతులతో మాట్లాడారు. మరో నాలుగు రోజుల్లోగా క్వింటాలుకు మద్దతు ధర రూ.13వేలుగా ప్రకటించకుంటే మార్కెట్లు ధ్వంసమవుతాయని హెచ్చరించారు. అవసరమైతే కోల్డ్ స్టోరేజీలను రైతులు ఆక్రమిస్తారని తెలిపారు. కోల్డ్ స్టోరేజీలు వ్యాపారులు బుక్ చేసుకున్నారని, ఎవరు బుక్ చేశారో ఆన్ లైన్ లో పేర్లు సహా వివరాలు పెట్టాలని డిమాండ్ చేశారు. రూ.1లక్ష 49 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం రూ.250 కోట్ల రైతుల కోసం కేటాయించలేరా అని ప్రశ్నించారు. వేములవాడ, యాదాద్రి ఆలయాల అభివృద్ధి కోసం లక్షల కోట్లు వెచ్చించే సర్కారు రైతుల కోసం ఈ మాత్రం చేయలేదా అని నిలదీశారు. జార్ఖండ్‌లో మిర్చి క్వింటాలుకు ధర రూ.14 వేల వరకు పలుకుతోందని చెప్పారు. -
ఇలా అయితే బ్రతికేదెట్ట చంద్రబాబు !
-
మిర్చి రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖీ
-
మిర్చి రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖీ
గుంటూరు : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు మిర్చి యార్డ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మిర్చిరైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదన్నారు. పంట అమ్మితే కూలి డబ్బులు కూడా రావడం లేదన్నారు. ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ...వైఎస్ జగన్ వద్ద వాపోయారు. ఈ మధ్యనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మార్కెట్ యార్డ్‌ను సందర్శించారని, ఆ తర్వాత మిర్చి క్వింటాల్ ధర మరింత పడిపోయిందని రైతులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే 60శాతం ధరలు పడిపోయాయన్నారు. పట్టిసీమ నుంచి కృష్ణాలో ఏ కెనాల్‌కు నీళ్లు ఇవ్వలేదన్నారు. కల్తీ విత్తనాలు, నీరు అందకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, రోజురోజుకు రైతులపై రుణభారం పెరుగుతూ ఉందని రైతులు తమ గోడు వెలిబుచ్చారు. -
నష్టాల్లో మిర్చి రైతులు
-
మిర్చి రైతుల పడిగాపులు
► మార్కెట్‌కు వచ్చి మూడు రోజులైనా ఖరీదు చేయని వ్యాపారులు ► 10 వేల బస్తాలకు 3,534 బస్తాలు మాత్రమే కొనుగోలు ► కొనేది ముగ్గురు వ్యాపారులే సాక్షి, మహబూబాబాద్ : మిర్చి పంట ఈ సారి రైతన్నను చిన్నబుచ్చింది. విత్తనాల కొనుగోలు దగ్గరి నుంచి ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లో విక్రయించడానికి పడిగాపులు పడుతున్నాడు. తమ సరుకును కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. మహబూబాబాద్ మార్కెట్లో గత కొద్దిరోజులుగా మిర్చి కొనుగోళ్లు సకాలంలో జరగక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం సుమారు 10 వేల బస్తాల మిర్చిఅమ్మకానికి రాగా 3,534 బస్తాలు(1,413 క్వింటాళ్లు) మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. సోమవారం రాత్రి ఈ మారెŠక్ట్లో బస్తాలకొద్ది మిర్చి మార్కెట్లోనే ఉండిపోవడం సాక్షి దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా రైతులను పలకరించగా వారు కన్నీటి పర్యంతమయ్యారు. ధర లభించక అప్పులపాలు నకిలీ విత్తనాలతో సరిగా దిగుబడి రాక అవస్థలు పడుతున్న రైతులను మార్కెట్లో మిర్చి ధర కలవరపరుస్తోంది. మిర్చికి క్వింటాల్‌కు రూ.8,425 నుం చి రూ.7,825 వరకు మాత్రమే పలుకుతోంది. దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక, అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనేది ముగ్గురు వ్యాపారులే.. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చిని కొనుగోలు చేసేందుకు 10 మంది వ్యాపారులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ముగ్గురు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వీరు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే కొనుగోలు చేస్తున్నారు. మిగతా మిర్చి తర్వాత కొనుగోలు చేస్తాం, తమ దగ్గర డబ్బులు లేవని చేతులేత్తుస్తున్నారు. దీంతో మార్కెట్‌కు వచ్చిన ఒక్కో రైతు సుమారు మూడు రోజులపాటు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక్క రోజులో వెళ్లిపోదామని చేతిలో పెద్దగా డబ్బులు లేకుండా వచ్చిన రైతులు ఆకలికి అలమటిస్తున్నారు. ఇప్పటికైనా పాలకవర్గం, మార్కెట్ కార్యదర్శి పట్టించుకొని మార్కెట్‌కు వచ్చిన సరుకులు ఏ రోజుకారోజు కొనుగోలు చేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు. విత్తనం నకిలీది కావడంతో తక్కువ దిగుబడి నకిలీ విత్తనం కావడంతో తక్కువ దిగుబడి వచ్చింది. నాకు రెండు ఎకరాలు ఉంటే 1.5 ఎకరాలు మిర్చి వేశాను. 14 బస్తాలు దిగుబడి వచ్చింది. చెట్టు ఎత్తు పెరిగిందే తప్ప కాయలు కాయలేదు. తిండి కూడా తినకుండానే బస్తాలు ఎవరైనా ఎత్తుకపోతారనే ఇక్కడే కావలి ఉంటున్నా.- చాప్లా, బలపాల మూడు రోజులవుతుంది మార్కెట్‌కు మిర్చి బస్తాలు తీసుకొచ్చి మూడు రోజులవుతుంది. కాంటాలు ఎప్పుడు అవుతాయో అని ఎదురు చూస్తున్నా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని వ్యాపారులు మార్కెట్‌కు వచ్చి మిర్చి కొనుగోలు చేసేలా చూడాలి.– గుగులోత్ పూల్‌సింగ్, అప్పరాజుపల్లి, గూడూరు -
రైతన్నల కన్నీళ్లు
-
కావడి కష్టాలన్నీ పంట కోసమే
మిరపరైతుల భగీరథ ప్రయత్నం అనిగండ్లపాడు (పెనుగంచిప్రోలు): రైతులకు ఈ ఏడాది కూడా సాగునీటి కష్టాలు తప్పలేదు. కన్నబిడ్డల్లాంటి పంటలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. సాగర్ జలాలు రాక, వర్షాలు లేక వాగులు, కుంటలు ఎండి పోవటంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. దేవుడిపై భారం వేసి రైతులు మిర్చి మొక్కలు నాటుతున్నారు. ఎక్కడా నీరు లేక పోవటంతో బావుల నుండి, బోరుల నుంచి పొలం దగ్గర కుంటలను ఏర్పాటు చేసుకొని నీటిని నింపుకుంటున్నారు. చెమటోడ్చి అక్కడి నుంచి కావిళ్లతో, బిందెలతో నీటిని తెచ్చుకొంటున్నారు. దీని కోసం రైతులను మొదట్లోనే ఖర్చులు పెరుగుతున్నాయి. సాగునీటి కష్టాలు ఏర్పడ్డా గత ఏడాది మిర్చి ధరలు అధికంగా ఉండటంతో ఈ ఏడాది మండలంలో 5 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేపట్టారు. మిర్చి మొక్కలు ప్రస్తుతం మొక్క దశలోనే ఉన్నాయి. ఈ దశలో నీరు లేక బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతులు పైపాట్లు చేసుకోవటంతో పాటు వారానికి ఒకసారి లీటరు నీటికి 10 నుంచి 15 గ్రాములు యూరియా పిచికారి చేసినట్లయితే మొక్కలను రక్షించుకోవచ్చని గరికపాడుృకషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. -
మిర్చి రైతులను ఏమార్చి..!
పాతగుంటూరు : కోల్ట్ స్టోరేజీల నిర్వాహకులు, వ్యాపారుల మాయూజాలంతో మిర్చి రైతులు మోసపోతున్నారు. మంచి ధర వచ్చినపుడు మిర్చి అమ్మి నాలుగు రాళ్లు సంపాదిద్దామన్న రైతులను ఏమార్చి కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు జీరో వ్యాపారంతో సెస్ చెల్లించకుండా మార్కెట్ యూర్డు ఆదాయూనికి గండికొడుతున్నారు.ఇదీ జరుగుతోంది.. కోస్తాంధ్రలోని జిల్లాల రైతులు తాము పండించిన మిర్చిని గుంటూరు మిర్చి యార్డులో విక్రరుస్తుంటారు. సరుకు తీసుకొచ్చిన రోజు మార్కెట్ ధర ఆశాజనకంగా లేకపోయినా, మరికొద్ది రోజుల్లో మంచి ధర వచ్చే అవకాశం ఉందని భావించినా తాము తెచ్చిన మిర్చి బస్తాలను కోల్డు స్టోరేజిల్లో నిల్వ చేస్తుంటారు. ఈ సందర్భంలోనే మంచి ధర వచ్చిన రోజున సరుకు విక్రరుుంచేందుకు వీలుగా కోల్డు స్టోరేజీల నిర్వాహకులు, వ్యాపారులు రైతులతో ఒప్పంద పత్రం(బాండ్) రాయించుకుంటారు. అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన సరుకును తాకట్టుగా ఉంచుకుని అవసరమైతే రైతులకు రుణంగా కొంతమొత్తం కూడా అందజేస్తారు. మంచి ధర వచ్చిన రోజున రైతులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి సరుకు విక్రరుుస్తారు. సాధారణంగా ఇక్కడే రైతులు మోసపోతుంటారు. వ్యాపారులు మార్కెట్లో విక్రరుుంచిన ధర కన్నా రైతుకు తక్కువ చెల్లించి జెల్లకొడుతుంటారు. కమీషన్ ఏజెంట్లది కీలకపాత్ర.. ఈ దందాలో కమీషన్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పంట సాగుకు రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను గుంటూరులోని కమీషన్ ఏజెంట్లు, కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులు అరువుపై ఇప్పిస్తారు. తీసుకున్న అరువుకు వ్యాపారులు వడ్డీ కట్టించుకుంటారు. అంతేకాకుండా ఖాళీ ప్రామిసరీ నోట్లపై రైతుల సంతకాలు, వేలిముద్రలు తీసుకుంటారు. ఇంత జరిగినా అవసరానికి ఆదుకున్నారన్న కృతజ్ఞతతో కమీషన్ ఏజెంట్లు చెప్పినట్లు మిర్చి రైతులు వింటుంటారు. వారు చెప్పిన కోల్డ్ స్టోరేజీల్లోనే మిర్చి బస్తాలను నిల్వ చేస్తారు. కాగా గుంటూరులో ఉన్న కోల్డ్ స్టోరేజీల్లో ఎక్కువ శాతం కమీషన్ ఏజెంట్లు, ఎగుమతి-దిగుమతి వ్యాపారులు, ఎరువులు, పురుగుమందుల దుకాణదారులవే కావటం గమనార్హం.అధిక అద్దె వసూలు.. కోల్డ్ స్టోరేజీలో ఏడాదిపాటు నిల్వ చేసేందుకు బస్తాకు 100 రూపాయల చొప్పున అద్దె చెల్లించాలనేది నిబంధన. కానీ రూ.130 చొప్పున వసూలు చేస్తున్నారు. కేవలం నెల రోజులే నిల్వ చేసినా కనీస రుసుముగా 130 రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదని పెదకూరపాడుకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే పెట్టుకోండి లేకుంటే వెళ్లిపోండని కోల్డు స్టోరేజీల నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారని వాపోయూరు. నిల్వ చేసే రోజులను బట్టి అద్దె వసూలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అన్ని రకాల కూలుల వసూలు.. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి బస్తాలను అమ్మిన సందర్భంలోనూ అన్ని రకాల కూలీలను వ్యాపారులు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి కాటా, హమాలీ కూలి తప్ప మరే కూలి కట్టాల్సిన అవసరం లేదు. అయినా వ్యాపారులు దొడ్డి కూలి, కాటా కూలి, ఎత్తుడు, దించుడు కూలి, తరుగు ఇలా అనేక పేర్లతో సొమ్ము మినహారుుంచుకుని మిగతా మొత్తం చెల్లిస్తున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఎక్కువమంది రైతులు యార్డుకు సరుకు తెచ్చిన రోజే అరుునకాడికి విక్రరుుంచి వెళ్లిపోతున్నారు. మార్కెట్ యార్డు ఆదాయం గోవిందా.. కోల్డ్ స్టోరేజీల వద్దే మిర్చి టిక్కీలను విక్రరుుస్తుండటంతో వ్యాపారుల నుంచి రావాల్సిన ఒక శాతం యార్డు సెస్ వసూలు కావటం లేదు. దీన్నే జీరో వ్యాపారమని అంటారు. దీనివల్ల మిర్చి యూర్డు ఏటా కోట్లాది రూపాయల ఆదాయూన్ని కోల్పోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వ్యాపారుల నుంచి భారీగా మామూళ్లు అందుతుండటమే దీనికి కారణమన్న ఆరోపణలు ఉన్నారుు. వ్యాపారులు చేస్తున్న జీరో వ్యాపారం గురించి ప్రస్తుత దిగుమతి వ్యాపారుల సంఘం నాయకులు ఐదేళ్ల క్రితమే అప్పటి కలెక్టర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. -
ఖమ్మంలో మిర్చి రైతుల ఆగ్రహం
-
మిర్చి కొనుగోలు చేయని వ్యాపారులపై క్రిమినల్ చర్యలు
ఖమ్మం : ఖమ్మం కూరగాయల మార్కెట్ యార్డును ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ శ్రీనివాస్ శ్రీనరేష్ సోమవారం సందర్శించారు. ధర విషయంలో ఆందోళనకు దిగిన పచ్చిమిర్చి రైతులతో వారు చర్చలు జరిపారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ మిర్చి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొనుగోళ్లు చేయని వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేసి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ధర విషయంలో గత రాత్రి వ్యాపారులకు, మిర్చి రైతులకు మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. దాంతో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లను నిలిపివేయటంతో ...రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘర్షణకు దిగారు. అనంతరం అధికారులు చర్చలు...జరిపి మిర్చిని కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. అయితే అధికారుల ఆదేశాలను మాత్రం వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ...రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగటంతో ట్రాఫిక్ స్తంభించింది. -
ఖమ్మంలో మిర్చి రైతుల ఆగ్రహం
ఖమ్మం : ఖమ్మంలో మిర్చి రైతులు మరోసారి భగ్గుమన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ రేటుకే మిర్చి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ధ గతరాత్రి ఏడు గంటల సమయంలో మార్కెటుకు వచ్చిన పచ్చిమిర్చిని క్వింటాకు రూ.1390 చొప్పున వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. అయితే ఆ తరువాత మిర్చి భారీగా రావటంతో వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు రూ.800 నుంచి రూ.1000 మాత్రమే చెల్లిస్తామని చెప్పటంతో అన్యాయమని రైతులు నిలదీశారు. ధర విషయమై వారు వ్యాపారులతో వాగ్వివాదానికి దిగారు. దుకాణాల ముందున్న ట్రేలను ధ్వంసం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి చర్చలు జరిపినా వివాదం సమసిపోలేదు. దాంతో రైతులు రాత్రంతా బైపాస్ రోడ్డుపై ధర్నా చేపట్టారు.