మిర్చి కొనుగోలు చేయని వ్యాపారులపై క్రిమినల్ చర్యలు
Published Mon, Oct 28 2013 10:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
ఖమ్మం : ఖమ్మం కూరగాయల మార్కెట్ యార్డును ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ శ్రీనివాస్ శ్రీనరేష్ సోమవారం సందర్శించారు. ధర విషయంలో ఆందోళనకు దిగిన పచ్చిమిర్చి రైతులతో వారు చర్చలు జరిపారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ మిర్చి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొనుగోళ్లు చేయని వ్యాపారుల లైసెన్స్లు రద్దు చేసి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు ధర విషయంలో గత రాత్రి వ్యాపారులకు, మిర్చి రైతులకు మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. దాంతో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లను నిలిపివేయటంతో ...రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘర్షణకు దిగారు. అనంతరం అధికారులు చర్చలు...జరిపి మిర్చిని కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. అయితే అధికారుల ఆదేశాలను మాత్రం వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ...రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగటంతో ట్రాఫిక్ స్తంభించింది.
Advertisement