srinivas srinaresh
-
మైక్రో అబ్జర్వర్లే కీలకం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. స్థానిక జెడ్పీ మీటింగ్ హాల్లో గురువారం జిల్లా పరిషత్ మీటింగ్ హలులోసార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సూక్ష్మపరి శీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న ఉదయం 5గంట లకు తమకు కేటాయించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వెళ్లి రిపోర్టు చేసి విధులకు హజరుకావాలని ఆదేశిం చారు. కౌంటింగ్ కోసం ఖమ్మం సమీపంలోని 7 లెక్కింపు కేంద్రాలు, కొత్తగూడెం పట్టణంలో 3 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కౌంటింగ్ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సూచనల మేరకు ఒక పరిశీలకుడితో పాటు ప్రతి లెక్కింపు టేబుల్‌కు సూక్ష్మపరిశీలకుడు ఉంటారన్నారు. ఖమ్మంపార్లమెంట్ పరిశీలకులు జశ్వంత్‌సింగ్ మాట్లాడుతూ కౌంటింగ్ జరుగుతున్న తీరును అప్రమత్తంగా ఉండి గమనించాలన్నారు. సూక్ష్మపరి శీలకులు సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దని సూచించారు. శిక్షణలో సాధారణ పరిశీ లకులు అశిశ్‌కుమార్‌ఘోష్, గోబిందచంద్రసేధి, లెక్కింపు కేంద్రాల పరిశీలకులు పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు: కలెక్టర్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలి పారు. నియోజకవర్గాల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌సిబ్బంది, సూపర్వైజర్లు, ఏజెంట్లు, అభ్యర్థులు నిర్ణీత సమయం కంటే అరగంట ముందు కేంద్రాలకు రావాలన్నారు. పోటీ చే సిన అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఓట్ల లెక్కింపులోఎలాంటి అనుమానాలకు తావీయకుండా సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. -
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు ప్రధాన భూమిక పొషించాలని ఎన్నికల పరిశీలకులు జశ్వంత్‌సింగ్, ఆశిష్‌కుమార్‌ఘోష్‌అన్నారు. బుధవారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్‌తో కలసి రిటర్నింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 2291 పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. నియోజకవర్గ పరిధిలో ఈవీఎంలను తప్పనిసరిగా పరిశీలించి, పోలింగ్‌కు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సున్నిత,అతిసున్నిత ప్రాంతాలపై ప్రత్యేకదృష్టి సారించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ఫిర్యాదులు స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారులు తమ సెల్ నంబర్లు పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా ప్రకటించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ స్వీకరణ, అప్పగింతకు ఏర్పాటు చేసే రిసెప్షన్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్ల డైరీల స్వీకరణకు అదనంగా కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రెండు గంటలకోసారి నివేదిక పంపాలి పోలింగ్‌శాతాన్ని ప్రతి రెండు గంటలకు పంపి నివేదికలను సకాలంలో పంపాలని పరిశీలకులు ఆదేశించారు. పోలింగ్ఏజెంట్ల నియామకాల ప్రక్రియను సకాలంలో పూర్తిచేసి నియామక పత్రాలను అందించాలని ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రతి పోలింగ్‌కేంద్రంలో లైటింగ్ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. పోలింగ్ రోజున సెక్టోరియల్ అధికారులు తమ సెక్టోరల్ పరిధిలో మాత్రమే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సత్వరమే స్పందించాలని వారు సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్లను ముందుగానే సరి చూసుకోవాలన్నారు. ప్రతి మండలానికి సంబంధించి ఒక ప్రాంతంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఓటరు స్లిప్‌ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. చనిపోయిన, వలస వెళ్లిన, స్థానికంగా లేని వారి జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా సిద్ధం చేసి ఈ నెల 26వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. జిల్లాలో 757 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్‌ను అతిక్రమించిన వారిపై నిబంధనల మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారికి సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ టీమ్‌లు గ్రామాలలో పర్యటించాలని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఐటీడీఏ పీవో దివ్య, నియోజకవర్గాల అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
మున్సి‘పోలింగ్’కు ఏర్పాట్లు పూర్తి
కొత్తగూడెం, న్యూస్‌లైన్: ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ చెప్పారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓరారు. ఆయన శుక్రవారం ఇక్కడ ఎస్పీ ఎవి.రంగనాథ్, ఎన్నికల పరిశీలకుడు విష్ణువర్థన్‌తో కలిసి విలేకరుల సమావేశంలోలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామన్నా. ఈవీఎంలు మొరాయిస్తాయేమోనని ప్రత్యామ్నా య ఏర్పాట్లు కూడా చేశామన్నారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేయని చోట రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కొత్తగా ఓటరు నమోదు కోసం ఈ నెల 9న పదివేల మంది దరఖాస్తు చేశారన్నారు. పరిశీలనలో జాప్యం కారణంగా వీరికి ఇంకా ఓటు హక్కు రాలేదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ప్రధానంగా కొత్తగూడెం, ఖమ్మం డివిజన్ల నుంచి ఆన్లైన్ ద్వారా కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. రూ.60 లక్షలు స్వాధీనం: ఎస్పీ ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న రూ.60లక్షల నగదు స్వాధీనపర్చుకున్నట్టు ఎస్పీ ఎవి.రంగనాథ్ చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమణ కింద 35 కేసులు నమోదు చేశామన్నారు. తనిఖీలు, దాడుల ద్వారా 3,600 క్వార్టర్ మద్యం బాటిళ్లు, 4,200 బీర్ బాటిళ్లు, 25 టన్నుల నల్ల బెల్లం, తొమ్మిది టన్నుల పటిక పట్టుకున్నట్టు చెప్పారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిలిపివేశామని, బెల్ట్ షాపులకు సహకరిస్తున్న ఏడు వైన్ షాపులను సీజ్ చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులకు నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల బందోబస్తులో ఏడుగురు డీఎస్పీలు, 36 మంది సీఐలు, 123 మంది ఏఎస్సైలు, 7175 మంది కానిస్టేబుళ్లు, 402 మంది మహిళా కానిస్టేబుళ్లు పాల్గొంటారని వివరించారు. వీరితోపాటు నాలుగు కంపెనీల పారామిలటరీ బలగాలు కూడా విధులు నిర్వర్తిస్తాయన్నారు. సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్, డీఎస్పీ రంగరాజు భాస్కర్ పాల్గొన్నారు. -
ప్రాదేశిక ఎన్నికలు తొలిరోజు నామినేషన్లు
సాక్షి, ఖమ్మం: స్థానిక పోరుకు తెరలేచింది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం సోమవారం నుంచి ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 46 జెడ్పీటీసీలకుగాను కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. 640 ఎంపీటీసీలకుగాను 13 ఎంపీటీసీలకు 13 నామినేషన్లు వేశారు. పార్టీల మధ్య పొత్తులు కుదరకే ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయలేదని తెలుస్తోంది. జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ సోమవారం విడుదల చేశారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణకు అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ సమయంగా ప్రకటించారు. జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏడు కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ల ఆధారంగా ఈ కౌంటర్లను పెట్టారు. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి డిపాజిట్ డీడీలు చెల్లించడానికి మరో కౌంటర్ ఏర్పాటు చేశారు. నామినేషన్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పరిశీలిస్తున్నారు. ఎంపీటీసీల నామినేషన్లకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశారు. మండలస్థాయిలో ఈ ప్రక్రియను పరిశీలించేందుకు గెజిటెడ్ స్థాయి అధికారిని నియమించారు. తొలిరోజు ముదిగొండ, భద్రాచలం, చర్ల, ఏన్కూరు, పెనుబల్లి మండలాల్లో ఒక్కో ఎంపీటీసీకి ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలు అయ్యాయి. పినపాక, ఎర్రుపాలెం, చింతూరు, కొత్తగూడెం ఎంపీటీసీలకు రెండు నామినేషన్ల చొప్పున వేశారు. ఖమ్మంరూరల్ మండలం జెడ్పీటీసీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా డి.నీలిమ నామినేషన్ వేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఒక్క ఎంపీటీసీకి కూడా నామినేషన్ దాఖలుకాలేదు. జెడ్పీటీసీ నామినేషన్లు జెడ్పీలోనే వేయాలని ఆదేశాలు ఉండటంతో కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు రోజులే గడువు.. ఈనెల 20వ తేదీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు విధించారు. కేవలం మూడురోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మొన్నటి వరకు మున్సిపల్ ఎన్నికల పొత్తులు, నామినేషన్లపై తలమునకలైన పార్టీలు స్థానిక పొత్తులపై ఇంకా చర్చలకు దిగలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న పొత్తులే స్థానికంగా ఉంటాయని పార్టీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక పరిస్థితులను బట్టి పొత్తులు ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పొత్తులు కుదరకపోయినా నామినేషన్ వేసి ఆ తర్వాత పొత్తులకు దిగాలని భావిస్తున్నారు. ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో ఆశావాహులు పోటీకి సై అంటుండగా.. నేతలకు మాత్రం అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. గత ఎన్నికల్లో నామినేషన్ల సమయం వారంరోజులు ఉండేదని ఇప్పుడు నాలుగు రోజులకు కుదించడమేంటని..ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. డిపాజిట్ డబ్బులు, ఇప్పటి వరకు చెల్లించని బకాయిలతో బరిలో నిలిచే అభ్యర్థులు సతమతమవుతున్నారు. రిజర్వేషన్ అయినచోట కొందరు కులధ్రువీకరణ పత్రాలు సరి చూసుకునే పనిలో ఉన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు మండలస్థాయిలో ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికను పార్టీలు మండల పార్టీ నేతలకే అప్పగించాయి. గతంలో పోటీచేసిన వారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. జెడ్పీ పీఠం దక్కించుకోవడమే ధ్యేయంగా అన్ని పార్టీలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. పొత్తులతో పోతే ఎలా ఉంటుంది..? ఒంటరిగా పోటీచేస్తే జెడ్పీ పీఠంపై జెండా ఎగురవేస్తామా..? అన్న కోణంలో పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తై జెడ్పీటీసీ అభ్యర్థులపై ఎంపికపైనే మండలాలవారీగా అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. అంగ, ఆర్థిక, రాజకీయ బలం ఉన్న అభ్యర్థులనే పోటీకి దింపాలన్న యోచనలో ఉన్నాయి. అలాగైతేనే జెడ్పీ పీఠం దక్కుతుందన్న వ్యూహంలోనూ ఉన్నాయి. -
ఇక పరిషత్ వేడి...
ఖమ్మం జడ్పీ సెంటర్, న్యూస్‌లైన్: ఎన్నికల సంగ్రామంలో పరిషత్ వేడి రాజుకుంది. ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు బ్యాలెట్ బాక్సులను సమకూర్చారు. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నేటి నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీటీసీ అభ్యర్థులు మండల కేంద్రాల్లో, జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్‌లో నామినేషన్లు వేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 21న నామినేషన్లను పరిశీలిస్తారు. 22 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లపై అభ్యంతరాలు, 23న అభ్యంతరాల తిరస్కరణ ఉంటుంది. 24 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే సమస్యాత్మక, అతి సమస్యాత్మక , తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను ఆయా మండలాలకు చెందిన తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్సైలతో కూడిన కమిటీలు గుర్తించాయి. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పించేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లకు ఏప్రిల్ 6న, ఖమ్మం డివిజన్లో 8న ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జేసీ సురేంద్రమోహన్ ఆదివారం జిల్లా పరిషత్ ఆవరణంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల నిర్వహణ భాధ్యత రిటర్నింగ్ అధికారులపైనే ఉందని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అధికారుల హడావుడి ... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో జిల్లా పరిషత్ అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 46 జెడ్పీటీసీ, 46 ఎంపీపీ, 640 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. పోలింగ్ స్టేషన్ల తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసిన అధికారులు బ్యాలెట్ పేపర్ల ముద్రణకు టెండరు ప్రకటన జారీ చేశారు. అభ్యర్థుల తుది జాబితా ఖరారైన అనంతరం ముద్రణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఎన్నికల నిర్వహణకు 46 మంది రిటర్నింగ్ అధికారులు,92 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు, ఎంపీటీసీలకు పింక్ (ఊదా) రంగు బ్యాలెట్ పేపర్లను కేటాయించారు. ఈ ఎన్నికల్లో 15,26,998 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 7,54,632 మంది పురుషులు, 7,72,366 మంది మహిళలు ఉన్నారు. ఒక ఓటరు రెండ్లు ఓట్లు వేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు రూ.2 కోట్లు విడుదల చేశారు. రిజర్వేషన్ ఇలా... జిల్లాలోని 46 జడ్పీటీసీ, 640 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు పూర్తి చేశారు. ఇందులో మహిళలకు 23 జడ్పీటీసీలు (50 శాతం), మిగిలిన 23 జనరల్(పురుష/మహిళా అభ్యర్థులు)కు కేటాయించారు. కాగా మొత్తం స్థానాల్లో ఎస్టీ జనరల్‌కు 7, ఎస్టీ మహిళలకు 8, ఎస్సీ జనరల్ 4, ఎస్సీ మహిళలకు 4, జనరల్ 7, బీసీ జనరల్ 5, బీసీ మహిళ 5, జనరల్ మహిళ 6 స్థానాలు రిజర్వ్ చేశారు. అలాగే 640 ఎంపిటీసి స్థానాలకు ఎస్టీలకు 225, ఎస్సీలకు 110, బీసీలకు 106, ఇతరులకు 199 స్థానాలను కేటాయించారు. వీటిలో ఏజన్సీలో ఎస్టీలకు 145, ఎస్సీలకు 27, బీసీలకు 13, అన్‌రిజర్వుడ్ 68, మైదాన ప్రాంతంలో ఎస్టీలకు 80, ఎస్సీలకు 63, బీసీలకు 93, అన్‌రిజర్వుడ్ 131 స్థానాలను రిజర్వ్ చేశారు. పన్నుల చెల్లింపునకు పరుగులు... పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఎంపీటీసీగా విజయం సాధించి ఎంపీపీ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరికొందరు జడ్పీటీసీ పదవి కోసం పావులు కదుపుతున్నారు. నామినేషన్ నాటికి ఆయా పంచాయతీలకు చెల్లించాల్సిన పంపు, ఇంటి పన్నులు చెల్లించాలి. లేకుంటే ఆయా అభ్యర్థులను రిటర్నింగ్ అధికారులు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో గ్రామ స్థాయి నేతలు పన్నుల చెల్లింపునకు పరుగులు తీస్తున్నారు. -
ఫిఫ్టీ.. ఫిఫ్టీ..
ఖమ్మం జడ్పీసెంటర్, న్యూస్‌లైన్: జడ్పీటీసీ స్థానాలలో సగం సీట్లు మహిళలకు దక్కాయి. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ గురువారం రిజర్వేషన్ జాబితాను ఆమోదించారు. జిల్లాలోని 46 జడ్పీటీసీ స్థానాలకు జనాభా ప్రతిపాదికన, రోటేషన్ పద్ధతిపై రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ జాబితాను గెజిట్‌లో అధికారికంగా ప్రచురించనున్నారు. జిల్లాలోని 46 మండలాలకు గాను 23 మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లోని 640 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. మండలాల వారీగా జడ్పీటీసీ రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. -------------------------- మండలం రిజర్వేషన్ -------------------------- అశ్వాపురం ఎస్సీ జనరల్ అశ్వారావుపేట బీసీ జనరల్ బయ్యారం జనరల్ భద్రాచలం ఎస్సీ జనరల్ బోనకల్లు ఎస్టీ జనరల్ బూర్గంపహడ్ ఎస్టీ జనరల్ చండ్రుగొండ జనరల్ చర్ల ఎస్సీ మహిళ -------------------------- మండలం రిజర్వేషన్ -------------------------- చింతకాని జనరల్ మహిళ చింతూరు జనరల్ మహిళ దమ్మపేట బీసీ మహిళ దుమ్ముగూడెం జనరల్ ఏన్కూర్ ఎస్సీ జనరల్ గార్ల బీసీ మహిళ గుండాల జనరల్ మహిళ జూలూరుపాడు బీసీ జనరల్ కల్లూరు ఎస్టీ మహిళ కామేపల్లి బీసీ జనరల్ ఖమ్మంరూరల్ ఎస్టీ మహిళ కొణిజర్ల ఎస్టీ జనరల్ కొత్తగూడెం ఎస్సీ జనరల్ కుక్కునూరు బీసీ మహిళ కూనవరం బీసీ మహిళ కూసుమంచి ఎస్టీ జనరల్ మధిర ఎస్టీ మహిళ మణుగూరు ఎస్టీ మహిళ ముదిగొండ జనరల్ -------------------------- మండలం రిజర్వేషన్ -------------------------- ముల్కలపల్లి బీసీ జనరల్ నేలకొండపల్లి ఎస్టీ మహిళ పాల్వంచ జనరల్ పెనుబల్లి ఎస్టీ మహిళ పినపాక ఎస్సీ మహిళ రఘనాధపాలెం ఎస్టీ జనరల్ సత్తుపల్లి ఎస్టీ మహిళ సింగరేణి జనరల్ టేకులపల్లి జనరల్ తల్లాడ ఎస్టీ జనరల్ తిర్ములాయపాలెం ఎస్టీ మహిళ వీఆర్‌పురం జనరల్ మహిళ వేలేరుపాడు జనరల్ మహిళ వేంసూరు ఎస్టీ జనరల్ వెంకటాపురం ఎస్సీ మహిళ వాజేడు ఎస్సీ మహిళ వైరా బీసీ మహిళ ఇల్లందు జనరల్ మహిళ ఎర్రుపాలెం బీసీ జనరల్ -
సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటే ప్రజలకు మెరుగైన సేవలను వేగంగా అందించవచ్చునని, అందుకు ప్రతక్ష్య నిదర్శనం ‘మీ సేవా’ అని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. బుధవారం ఖమ్మంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో జేసీ సురేంద్రమోహన్ అధ్యక్షతన ‘ మీ సేవా’పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ‘మీ సేవా’ను మరింత ప్రతిభావంతంగా అమలు చేసేందుకు క్వాంటిటీతో పాటు క్వాలిటీకి పెద్దపీట వేయాలని అన్నారు. ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు ప్రభుత్వం ఈ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టిందని అన్నారు. సంప్రదాయ విధానంలో సేవలు పొందిన ప్రజలు ఈ విధానంపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి వారి విశ్వాసాన్ని పొందేందుకు ఆపరేటర్లు, అధికారులు గుణాత్మక సేవలు అందించాలని సూచించారు. మీ సేవా కేంద్రలను కొంత మంది లీజ్‌కు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్టిఫికెట్ల జారీలో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. భద్రపరిచిన డాక్యుమెంట్లలో గుర్తించిన పొరపాట్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని, జిల్లాలో మీ సేవా తీరు మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మంచి నైపుణ్యం, అనుభవం ఉన్న జేసీ సురేంద్రమోహన్ కృషే ఇందుకు కారణమని అన్నారు. ఐటీడీఏ నూతన పీఓకు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అనుభవం ఉందని, వీరద్దరి సహకారంతో జిల్లాలో మీ సేవను ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు. జేసీ సురేంద్రమోహన్ మాట్లాడుతూ ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే ‘మీసేవా’ విప్లవాత్మక మార్పులకు కారణమైందని అన్నారు. అధికారులకు పనిభారం తగ్గిందని అన్నారు. మీ సేవా ప్రారంభంలో రెండు విభాగాలకు సంబంధించి తొమ్మిది సేవలే అందించామని, ప్రస్తుతం 232 కేంద్రాల ద్వారా 22 డిపార్ట్మెంట్లకు చెందిన 233 సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మీసేవా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 16.68లక్షల అభ్యర్థనలు వచ్చాయని, కేటగిరి ఏ కింద పరిష్కరించే వీలున్న 6.72లక్షల సమస్యలను వెంటనే పరిష్కరించామని అన్నారు. జిల్లాలోని పలు విభాగాల్లో అత్యంత ముఖ్యమైన, పురాతనమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి భద్రపరిచేందుకు జిల్లాకు రూ.50లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. అతిత్వరలో మీసేవ ద్వారా రైతులకు ఈ -పట్టాదారు పాసు పుస్తకాలను అందించనున్నట్లు జేసీ తెలిపారు. ఐటీడీఏ పీఓ దివ్య మాట్లాడుతూ మీసేవ ఆపరేటర్లకు ప్రభుత్వం పలు అధికారాలను బదిలీ చేసిందని, వాటిని దుర్వినియోగం చేయరాదని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ నమూనా ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మీసేవ అమలులో మంచి పనితీరు కనపరచిన ఇ-డివిజనల్ మేనేజర్, వీఆర్వో, వీఆర్ఏ, సర్వీస్ సెంటర్ ఏజన్సీ మేనేజర్లకు ప్రశంసాపత్రాలు అందించారు. నూతనంగా వికలాంగుల కేటగిరిలో మీసేవా కేంద్రాల ఏర్పాటు చేసేందుకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ బాబురావు, ఆర్డీఓలు సంజీవరెడ్డి, వెంకటేశ్వర్లు , సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
భూపంపిణీ లక్ష్యం పూర్తి
ఖమ్మంసిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో ఏడోవిడత భూపంపిణీ లక్ష్యాన్ని నూరుశాతం సాధిం చినట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, భూసంబంధిత కేసులు తదితరాంశాలపై భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ ఐవైఆర్.కృష్ణారావు గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భూపంపిణీ లక్ష్యాల సాధన తదితరాంశాలను కలెక్టర్ వివరించారు. ప్రధాన కమిషనర్ ఐవైఆర్.కృష్ణారావు మాట్లాడు తూ.. ఈ నెల 10వ తేదీ నుంచి జరగాల్సిన అన్ని రెవెన్యూ సదస్సులను వాయిదా వేసినట్టు చెప్పారు. వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారంటూ కలెక్టర్‌ను అభినందించారు. ఈ-పాస్ పుస్తకాల జారీపై అవగాహన కల్పిం చాలని, పాత పాస్ పుస్తకాలను వాపస్ తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించేం దుకుగాను తహశీల్దారులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ట్రైనీ కలెక్టర్ మల్లికార్జున్, జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీని వాస్, ఖమ్మం ఆర్డీవో సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మాజీ’ల అర్జీలు పరిష్కరించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కోసం మాజీ నక్సల్స్ చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. లొంగి పోయిన నక్సల్స్ పునరావాస పెండింగ్ అర్జీల పరిష్కారంపై కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్షించారు. స్వయం ఉపాధి పథకాల మం జూరు కోసం ఐటీడీఏ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్, పశుసంవర్థక, రెవెన్యూ శాఖల వద్ద మాజీ నక్సల్స్ అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బ్యాంకు కాన్సెంట్ ఇవ్వకుండా గ్రౌం డింగ్ కాని అర్జీలు 21 ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి 15లోగా అన్ని శాఖల వద్ద ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులకు మంజూరు చేయాలన్నారు. న క్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను లొంగిపోయిన నక్సల్స్‌తో భర్తీ చేసే అంశాన్ని పరీశీలించాలన్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు స్వయం ఉపాధి కింద రుణాలు అందించేందు కు చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ 12 మంది మాజీ నక్సల్స్‌కు వారంలోగా తక్షణ సహాయం అందిస్తామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ జిల్లాలో లొంగుబాటుకు చాలామంది నక్సల్స్ ఆసక్తి చూపుతున్నారని అన్నారు. భవిష్యత్తులో లొంగుబాట్లు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పోలీసుల నుంచి వేధింపులు లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి, కొత్తగూడెం ఓఎస్డీ తిరుపతి, ఖమ్మం ఆర్డీఓ సంజీవరెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు, మాజీ నక్సల్స్ పాల్గొన్నారు. -
బదిలీ తప్పదా...అయితే...దగ్గర్లో చూడండి!
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకపక్క ప్రభుత్వ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతుండగా...మరోపక్క పైరవీలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు...జిల్లాలో మూడేళ్ల పాటు ఒకే చోట పనిచేస్తూ, ఇదే జిల్లాకు చెందిన, ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులకు స్థానచలనం కలిగించే కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల పరిధిలో మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచే స్తున్న అధికారుల జాబితాను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆ పనిలో ఉండగా...ఈవిషయంలో రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేస్తున్నారు. బదిలీ అయ్యే ఉద్యోగులు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తుండడంతో వారు కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ తప్పనిసరి అయిన పక్షంలో తమ వారిని దగ్గరి ప్రాంతాలకు బదిలీ చేయాలని, మళ్లీ ఎన్నికల తర్వాత మంచి పోస్టింగ్ ఇచ్చేలా చూసుకోవాలని పలువురు రాజకీయ నాయకులు పైరవీలు చేస్తున్నారు. ఈ ైపైరవీల ప్రభావం జాబితా తయారీపై బాగానే పడుతుందని, అయినా ఎట్టి పరిస్థితుల్లో జాబితాను త్వరలోనే సిద్ధం చేస్తామని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ఏదిఏమైనా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రాగానే బదిలీల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనే పట్టుదలతో కలెక్టర్ ఉన్నట్లు సమాచారం. 37 మంది తహశీల్దార్ల బదిలీ? జిల్లాలో 37 మంది తహశీల్దార్లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో 24మంది రెగ్యులర్ తహశీల్దార్లు కాగా, ప్రొబెషనరీ డిప్యూటీ తహశీల్దార్లు(డీటీ) 10మంది, ప్రమోషన్ పొందనున్న మరో ముగ్గురు ఉన్నట్లు సమాచారం. ఎంపీడీవోల బదిలీలు జరిగేనా? జిల్లాలో 46 మండలాలకు గాను 42మంది ఎంపీడీవోలు పనిచేస్తున్నారు. తాజాగా వచ్చిన ఆదేశాలతో జిల్లా పరిషత్ అధికారులు బదిలీల జాబితాను సిద్ధం చేస్తున్నారు. దుమ్ముగూడెం ఎంపీడీవో ఇతర జిల్లా నుంచి రావడం, గార్ల ఎంపీడీవో మరో ఆరునెలల్లో పదవీ విరమణ పొందనుండటంతో 40మంది ఎంపీడీవోలను బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే గతంలో నిర్వహించిన సాధారణ ఎన్నికల సమయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల సంఘానికి తమ బదిలీలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేయడంతో ఆ బదిలీలను నిర్వహించలేదు. అలాగే ఇప్పుడు కూడా ఎంపీడీవోలు తమ బదిలీలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. -
భూ సమస్యల పరిష్కారంలో...రాజకీయ పార్టీల పాత్ర కీలకం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భూ సంబంధ సమస్యల పరిష్కారంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైందని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. వచ్చే నెల 10 నుంచి 25వ తేదీ వరకు జరిగే మూడోవిడత రెవెన్యూ సదస్సుల సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూసమస్యల పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ వాడలలో రెవెన్యూ గ్రామానికొక సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రెవెన్యూ వ్యవస్థకు కీలకమైన వీఆర్ఓ కార్యాలయాలను పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా జిల్లాలో 1242 రెవెన్యూ గ్రామాలుంటే 935చోట్ల రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 307 గ్రామాల్లో కంపెనీల సామాజిక బాధ్యత నిధుల నుంచి కార్యాలయ సొంత భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు. 2005 నుంచి ఇప్పటివరకు ఏడు విడతలుగా పంపిణీ చేసిన భూముల స్థితిగతులను పరిశీలిస్తామన్నారు. అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసిన వారిపై పీఓటీ చట్టం కింద కేసులు పెట్టనున్నట్టు తెలిపారు. ఇ-పాస్ బుక్‌ల జారీకిగాను ఖమ్మం జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ ఎంపిక చేసినట్టు తెలిపారు. మూడోవిడత రెవెన్యూ సదస్సులలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఈ నెలాఖరు వరకు రెవెన్యూ, ఐకేపీ బృందాలు గ్రామాలలో పర్యటిస్తాయన్నారు. నిరుపేద ఎస్సీలకు భూముల కొనుగోలు కింద యూనిట్‌కు ఐదులక్షల రూపాయల చొప్పున 100 యూనిట్ల కేటాయింపునకు లబ్ధిదారులను గుర్తించనున్నట్టు చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ కె.బాబూరావు, డీఆర్ఓ శివశ్రీనివాస్, సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ అశోక్, ఐకేపీ లీగల్ కో-ఆర్డినేటర్ ఎ.శ్రీకాంత్, రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగం హేమంతరావు(సీపీఐ), ఎన్.వెంకయ్య(కాంగ్రెస్), ఎం.నాగేశ్వరరావు, తాతా భాస్కర్‌రావు(సీపీఎం), కె.రంగారెడ్డి(న్యూడెమోక్రసీ), ఎల్.పుల్లారావు(లోక్‌సత్తా), ఎన్.వెంకటేశ్వరరావు(టీడీపీ), హెచ్.వెంకటేశ్వరరావు(వైఎస్ఆర్ సీపీ), దాసు మహారాజు, కె.కృష్ణ(బీఎస్పీ) తదితరులు పాల్గొన్నారు. -
ప్రలోభాలకు లొంగవద్దు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రధానమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దనికలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ కోరారు. శనివారం జాతీ య ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాపరి షత్ సమావేశ మందిరంలో జరిగిన వేడుకలనుద్దేశించి ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో జిల్లాలో 70 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 19.72లక్షల మంది ఓటర్లు నమోదైనట్టు చెప్పా రు. జిల్లాలో ఓటరునమోదు ప్రత్యేక డ్రైవ్ ద్వారా 45వేల మంది ఓటు హక్కు పొందారని తెలి పారు. 18,19సంవత్సరాల వయసుగల యువత జిల్లాలో 40వేల మంది ఉన్నారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ దిశ గా రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. ఎస్పీఎవి.రంగనాథ్ మాట్లాడుతూ.. డబ్బు ఖర్చు లేకుండా అభ్యర్థులు గెలిస్తే ప్రజాస్వామ్యం విలువ పెరుగుతుందని అన్నారు. యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే మంచి వ్యక్తులు ఎన్నికయ్యే అవకాశముంటుందన్నారు. ఓటర్లు ఓటు వినియోగాన్ని హక్కుగా మాత్రమే కాకుండా బాధ్యతగా కూడా భావించాలని కోరారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ తన బాధ్యతను నిర్వర్తిస్తుందన్నా రు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ ప్రభావం లేకుండా చూస్తుందన్నారు. హాజరైన వారితో కలెక్టర్ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. సీనియర్ ఓటర్లకు సన్మానం క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పదిమంది సీనియర్ సిటిజన్లను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. జాతీయ ఓట రు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, డ్రాయింగ్, వక్తృత్వ పోటీల విజేతలకు మెమెంటోలను కలెక్టర్, ఎస్పీ ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ్, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్, డీఈఓ రవీంద్రనాథ్, డీడీ ఎస్డబ్ల్యూ లక్ష్మిదేవి, డీపీఆర్ఓ వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భారీ ప్రదర్శన, మానవహారం జాతీయ ఓటరుదినోత్సవం సందర్భంగా నగరం లో భారీ ప్రదర్శన జరిగింది. తొలుత, ఈ ప్రదర్శనను పెవిలియన్ గ్రౌండ్లో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ ఎవి.రంగనాథ్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబురావు, జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ ప్రారంభించారు. పెవిలి యన్ గ్రౌండ్ నుంచి మయూరిసెంటర్, బస్టాం డ్, వైరారోడ్, జడ్పీసెంటర్ కు ప్రదర్శన సాగింది. అక్కడప్రదర్శకులు మానవహారంగా ఏర్పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సందేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ చదివి వినిపించారు. ఓటర్ల ప్రతిజ్ఞ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాపరిషత్ ఆవరణలోని పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో.. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిలబెడతాం. మతం, జాతి,కులం, వర్గం, భాష తదితర ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తాం’ అని ప్రతిజ్ఞ చేశారు. నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులను ఇక్కడి సిబ్బంది స్వీకరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లలో బీఎల్ఓలు అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేశారు. -
మార్కింగ్ వేస్తే...గూడు చెదిరినట్టే
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: ‘వారిలాగా మేము స్థలం ఆక్రమించి ఇల్లు కట్టలేదు. మా ఇంటికి పక్కాగా రిజిస్ట్రేషన్ పత్రాలున్నాయి. మాకేమవుతుంది..?’ అని ఇప్పటిదాకా ధీమాగా ఉన్న కొందరు ఇళ్ల, స్థల యజమానులు.. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఖమ్మంలోని సాగర్ కాల్వలను ఆక్రమించి నిర్మించిన గుడిసెల తొలగింపు కార్యక్రమం శనివారం పార్శీబంధం, ముస్తఫానగర్, శ్రీరామ్‌నగర్, ధంసలాపురం తదితర ప్రాంతాల్లో కొనసాగింది. కాల్వ సరిహద్దులను గుర్తిస్తూ, దాని పరిధిలోని ఇళ్లు, నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ వేయిస్తున్నారు. ఇలా మార్కింగ్ వేసేంతవరకు.. తమ ఇల్లు కాల్వ పరిధిలో ఉందన్న విషయం తెలియని అనేకమంది లబోదిబోమంటున్నారు. కాల్వ స్థలాలను కొందరు రియల్ వ్యాపారులు ఆక్రమించి, వాటిపై ఇళ్లు నిర్మించి, మున్సిపల్ కార్యాలయం నుంచి ఇంటి నంబర్ తీసుకుని, రిజిస్ట్రేషన్ చేయించి లక్షల రూపాయలకు విక్రయించారు. అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లల్లో కొన్నింటికి ఇప్పటికే రెండు మూడు రిజిస్ట్రేషన్లు జరిగినవి కూడా ఉన్నాయి. వీటిని తాము లక్షల రూపాయలకు కొన్నామని, దారుణంగా మోసపోయామని వీటి కొనుగోలుదారులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు లోనవుతున్నారు. కళ్లెదుటే గూడు చెదిరిపోతుంటే.. తట్టుకోలేక గుండె చెరువవవుతోంది. కొందరు లోలోనే కుమిలిపోతుంటే.. మరికొందరు భోరుమని విలపిస్తున్నారు. కూల్చివేతకు వచ్చిన అధికారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపిస్తూ.. ‘రియల్ వ్యాపారుల మోసానికి బలయ్యాం. మా కష్టార్జితమైన లక్షల రూపాయలను వారికి పువ్వుల్లో పెట్టిచ్చి... మేమేమో ఇలా రాళ్లు, ఇటుకల శిథిలాలు మిగుల్చుకున్నాం’ అంటూ, గోడు వినిపించారు. కొందరు రాజకీయ నాయకులుగా, రియల్ వ్యాపారులుగా చలామణవుతూ అనేకమంది అమాయకులను ఇలా మోసగించారన్న బాధితులు తీవ్ర ఆగ్రహావేశం వ్యక్తం చేస్తున్నారు. శనివారం నాటి కూల్చివేతలను ఆర్డీఓ సంజీవరెడ్డి, డీఎస్పీ బాలకిషన్, కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్, తహశీల్దార్ ఆశోక్ చక్రవర్తి పర్యవేక్షించారు. గృహ ప్రవేశం జరిగి నెల కూడా కాలేదు... శనివారం ఇల్లు కోల్పోయిన బాధితుల్లో ఒకరి పరిస్థితి మరీ దారుణం. ఆ ఇంటి యజమాని నెల రోజుల కిందటే ఓ ఇంటిని లక్షల రూపాయలకు కొన్నారు. గృహ ప్రవేశం జరిగి నెల రోజులు కూడా కాలేదు. ఇంతలోనే అధికారులు వచ్చి, అది ఆక్రమిత స్థలంలో ఉందంటూ మార్కింగ్ చేసి వెళ్లారు. ఇలా ఇళ్లు కోల్పోయిన వారిలో ఛత్తీస్‌గఢ్, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు కూడా ఉన్నారు. తమ కుటుంబీకుల రెక్కల కష్టంతో ఎన్నో ఏళ్ల కిందట కొన్న ఇళ్లను కూల్చివేస్తుండడాన్ని చూస్తూ భోరున విలపించారు. కూల్చివేతను పర్యవేక్షించేందుకు వచ్చిన కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ ఎవి.రంగనాథ్‌కు తమ గోడు చెప్పుకుని, దిక్కెవరంటూ కన్నీటితో ప్రశ్నించారు. కోర్టు స్టేతో నిలిచిన తొలగింపు పార్శీబంధం, ముస్తఫానగర్ ప్రాంతంలో కాల్వల పరిధిలోగల కొన్ని ఇళ్ల యజమానులు ముందస్తుగా కోర్టును ఆశ్రయించి (తొలగింపు నుంచి మినహాయింపునకు) స్టే తెచ్చుకున్నారు. వీటికి సర్వే అధికారులు మార్కింగ్ చేసి, స్టే ఆర్డర్ నంబర్లు వేశారు. -
‘గణతంత్ర’ ఏర్పాట్లు పూర్తి చేయండి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా ఖ్యాతిని ప్రతిబింబించేలా గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై బుధవారం టీటీడీసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖ సహకారంతో ఖమ్మం ఆర్డీవో, అర్బన్ తహశీల్దార్ సమన్వయంతో పరేడ్ ఏర్పాట్లకు సిద్ధం చేయాలన్నారు. డీఆర్డీఏ, ఆర్డబ్ల్యూఎస్, ఎస్సీ కార్పొరేషన్, డీఎమ్హెచ్వో, వ్యవసాయశాఖ, డ్వామా, హౌసింగ్, ఐసీడీఎస్, ఆర్వీఎం పీవో, ఉద్యానవన శాఖలతో పాటు ప్రత్యేకంగా ఓటరు నమోదు కార్యక్రమం గురించి అవగాహన కల్పించే శకటాలను కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ఏజెన్సీ ప్రాంతంలో సేవలు అందిస్తున్న వైద్యులకు మెరిట్ సర్టిఫికెట్లు అందించేందుకు 20వ తేదీలోపు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల భాగస్వామ్యం కల్పించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈవోను ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో శివ శ్రీనివాస్, జడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణ, డీఎస్పీ బాలకిషన్‌రావు, ఆర్డీవో సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియోను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లాలో ఈ నెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ వైద్యారోగ్య శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పల్స్ పోలియో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 19న పూర్తిస్థాయి పల్స్‌పోలియో కార్యక్రమం, 20, 21 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. ఏజన్సీ, గిరిజన ఆవాసాల్లో, వారాంతపు సంతల్లో మొబైల్ సంచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ప్రత్యేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జిల్లా అయినందున వలసలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో భానుప్రకాష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలు 2,98,228 మంది ఉన్నారని, అందరికీ పోలియో చుక్కలు వేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. సమావేశంలో డీఐఓ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ ఆనందవాణి, డీపీఆర్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 24న జిల్లా ఆవిర్భావ దినోత్సవాలు... ఈనెల 24న జిల్లా 60వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో 60 వసంతాల వేడుకల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లాకు సంబంధించి 60 సంవత్సరాల అరుదైన ఛాయాచిత్రాలు ఉంటే అందించాలని చెప్పారు. -
భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్: ముక్కోటి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ స్థానిక సిబ్బందిని ఆదేశించారు. భద్రాచల అనుబంధ ఆలయమైన పర్ణశాల రామాలయాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. స్నానఘట్టాలను పరిశీలించిన ఆయన ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నదిలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని అన్నారు. అనంతరం రామాలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. రామాలయంలో అర్చకులు వేదమంత్రాలతో కలెక్టర్‌కు స్వాగతం పలికారు. రామయ్యను దర్శించుకున్న కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముక్కోటి ఉత్సవాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్నారు. అదేవిధంగా బాపు ఏర్పాటు చేసిన కుటీరం, విగ్రహాల వద్ద ‘ఇందిరమ్మ పచ్చ తోరణం’ పథకం ద్వారా మొక్కలను పెంచాలని సూచించారు. దీనికి అవసరమైన నిధులను సమకూర్చాని ఐటీడీఏ పీఓ వీరపాండియన్‌కు సూచించారు. హైడల్ ప్రాజెక్టు పరిశీలన: దుమ్ముగూడెం గోదావరి నదీ బ్రాంచ్ ఆనకట్ట వద్ద నిర్మించిన విద్యుత్ మినీ హైడల్ ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మేనేజర్ శ్రీనివాసరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు అన్నీ పూర్తి అయ్యాయని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట జేసీ సురేంద్రమోహన్, జెడ్పీసీఈఓ జయప్రకాష్, ఆర్డీఓ వెంకటేశ్వరరావు, స్థానిక తహశీల్దార్ జి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విశ్వనాథసుబ్రహ్మణ్యం, ఎస్సై సత్యనారాయణ, ఈఓఆర్డీ నాగేశ్వరరావు, కార్యదర్శి బొగ్గా నారాయణ, విద్యుత్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అసంపూర్తి పనులు పూర్తి చేస్తా
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని కలెక్టర్ ఐ.శ్రీనివాసశ్రీనరేష్ హామీ ఇచ్చారు. గురువారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఎస్పీ రంగనాధ్, జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ విలేకరులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపకార వేతనాలకు ఆధార్ అనుసంధానం, గ్యాస్ నగదు బదిలీ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. భూసేకరణ చట్టం కొత్తగా అమలులోకి వచ్చిందని తెలిపారు. రాజీవ్ యువ కిరణాలు పథకం, ఐఏపీ (ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్) నిధులు, ఆర్వీఎం తదితర పథకాలను పటిష్టంగా అమలు చేస్తామన్నారు. త్వరలో ఎన్నికల ప్రక్రియ ఉంటుందని, అప్పటి వరకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సూర్యాపేట నుంచి దేవరపల్లి రోడ్డు ఫోర్‌లైన్ రోడ్డుకు సర్వే జరుగుతోందని చెప్పారు. హెవీవాటర్ ప్లాంట్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, అక్కడ మరోప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గోదావరి తీర ప్రాంతాలైన మణుగూరు నుంచి అశ్వాపురం వరకు పరి శ్రమలకు అనుకూలంగా ఉంటుందని, పరి శ్రమలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొం దిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్నారని, వారి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. ఎస్పీ రంగనాధ్ మా ట్లాడుతూ జిల్లాలో నక్సల్స్‌ను నియంత్రించామని, పూర్తిస్థాయిలో ఈ సమస్యను రూపుమాపుతామని చెప్పారు. భద్రాచలం డివిజన్లో రోడ్లను అభివృద్ధిచేస్తామన్నారు. దొంగతనాలను నియంత్రిస్తామని, మధిరలో జరిగిన దోపిడీకి సంబంధించిన అత్యాధునిక పరి జ్ఞానం సహాయంతో దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిచేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటామని తెలిపారు. జిల్లా అనేక పథకాల నిర్వహణలో ముందంజలో ఉందన్నారు. నూతన సంవత్సరంలో అర్హులకు పథకాలను అందించి జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్‌కలెక్టర్ బాబూరావు, జెడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణ, డ్వామా పీడీ శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ పద్మజారాణి, మెప్మా పీడీ వేణుమనోహర్, ఆర్డీవో సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి... 23, 24 తేదీల్లో భారీ వర్షాలు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: హెలెన్ తుపాను కారణంగా జిల్లాలో ఈ నెల 23, 24 తేదీల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నద ని, ఆ రోజుల్లో మండల, జిల్లా స్థాయి అధికారులంతా విధుల్లో ఉండాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. తుపాను పట్ల అప్రమత్తం చేసేందుకు శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని ప్రజ్ఞసమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను నష్టాన్ని కనిష్టస్థాయికి పరిమితం చేసేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. వ్యవసాయాధికారులు మండల కేంద్రాల్లో ఉండి రైతులకు తగు సూచనలు, సలహాలు అందించాలని చెప్పారు. నీటి పారుదలశాఖ అధికారులు ఖమ్మం, పాల్వంచ, భద్రాచలం డివిజన్లలో చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా తగు చర్యలు తీసుకొని వరద ముంపునుంచి పంటలను కాపాడాలన్నారు. ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండి వాటిని వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, సబ్ సెంటర్లలో అత్యవసర మందులు సమృద్ధిగా నిల్వ చేసుకోవాల ని అన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది 24 గం టలు అందుబాటులో ఉండాలని అన్నారు. నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సివిల్‌సప్లయీస్ డీఎంకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు నిరంతరాయంగా నడిపించేందుకు అన్నిరకాల సామగ్రి ని ముందస్తుగా నిల్వ చేసుకోవాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండి తగు సమాచారం వెంటనే తెలపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేఏసీ బాబురావు, డీఆర్వో శివశ్రీనివాస్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
చింతూరు, న్యూస్‌లైన్: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించి, ప్రజా సమస్యల పరిష్కా రం కోసమే ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోందని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అ న్నారు. బుధవారం చింతూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీలో రాష్ట్రస్థాయిలోనే ఆంక్షలు ఉండడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. అర్హులను గుర్తించి, వారికి మంజూరు చేస్తున్నామని, రేషన్ కార్డుల్లో తప్పులను సరిచేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తున్నామని చెప్పారు. పోలవరం ముంపులో భాగంగా ఆర్ఆర్ ప్యాకేజీ కింద బాధితులకు ఇతర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేస్తామని, వీరికి అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో ఐఏపీ కింద రహదారుల నిర్మాణాలకు రూ. 90 కోట్లు మంజూరు కాగా, అందులో 90 శాతం నిధులను భద్రాచలం డివిజన్‌కే ఖర్చు చేస్తున్నామని చెప్పా రు. ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భద్రాచలం డివిజన్లో గత విద్యా సంవత్సరంలో ఇంటర్, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు రాలేదని, ఈ ఏడాది ఫలితాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తామని, దీనికోసం విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరించేందకు త్వరలో పరిష్కృతి కార్యక్ర మం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐటీడీఏ పీ వో వీరపాండియన్ మాట్లాడుతూ గిరిజనుల అ భివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడతున్నామని, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కుంజా సత్యవతి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ సందర్భం గా పలువురికి బంగారుతల్లి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ గణేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మిర్చి కొనుగోలు చేయని వ్యాపారులపై క్రిమినల్ చర్యలు
ఖమ్మం : ఖమ్మం కూరగాయల మార్కెట్ యార్డును ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ శ్రీనివాస్ శ్రీనరేష్ సోమవారం సందర్శించారు. ధర విషయంలో ఆందోళనకు దిగిన పచ్చిమిర్చి రైతులతో వారు చర్చలు జరిపారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ మిర్చి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొనుగోళ్లు చేయని వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేసి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ధర విషయంలో గత రాత్రి వ్యాపారులకు, మిర్చి రైతులకు మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. దాంతో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లను నిలిపివేయటంతో ...రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘర్షణకు దిగారు. అనంతరం అధికారులు చర్చలు...జరిపి మిర్చిని కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. అయితే అధికారుల ఆదేశాలను మాత్రం వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ...రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగటంతో ట్రాఫిక్ స్తంభించింది. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే.. అనుమతి రద్దు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని అధికారులను కలెక్టర్ శ్రీని వాస శ్రీనరేష్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ఆయన మంగళవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... ఇళ్ల నిర్మాణం చేపట్టని లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టాలని, వారి స్థానంలో ఇతరులకు అవకాశమివ్వాలని ఆదేశించారు. నిర్మా ణం పూర్తిచేసిన లబ్ధిదారులకు వెంటనే బిల్లు లు చెల్లించాలన్నారు. ఆన్లైన్ నమోదులో తప్పులు దొర్లడంతో అనేకమంది లబ్ధిదారులు ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందలేకపోతున్నారని చెప్పారు. పినపాక, దమ్మపేట, పెనుబల్లి మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు. దీనిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసి, జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిపేందుకు హౌజింగ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. జిల్లాలో చాలామంది పేదలు ఇంటి నిర్మాణ మంజూరు ఉత్తర్వులు రాకుండానే నిర్మాణలు చేపట్టారని, వీటికి బిల్లులు చెల్లించాలని ‘గ్రీవెన్స్ డే’లో అర్జీలు ఇస్తున్నారని చెప్పారు. ఈ అర్జీలను పరిశీ లించి, పేపర్ వర్క్ పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వీరికి ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే వీరికి ఆర్ధిక సహాయం అందించవచ్చని అన్నారు. ఇక నుంచి నూతన గృహాలను మంజూరు చేసే సమయంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి హౌజింగ్ అధికారులదే బాధ్యతని అన్నారు. నిర్మల్ భారత్ అభియాన్ కింద ఇప్పటివరకు 20వేల వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తయ్యాయని చెప్పారు. మి గతా వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇళ్లు, మరుగుదొడ్ల ని ర్మాణానికి అవసరమైన ఇసుకను తరలిం చేందుకు పోలీసులు అభ్యంతరం చెబుతున్నారని, జరిమానా విధిస్తున్నారని ఈజీఎస్, ఆర్డబ్ల్యూఎస్, హౌజింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని డీఈలు, ఏఈలు, ఆర్డీవోలు, తహశీల్దారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కలెక్టర్ సూచిం చారు. ఈ సమావేశంలో హౌజింగ్ పీడీ వైద్యం భాస్కర్, డ్వామా పీడీ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మల్లేశం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చాంబర్ ఆఫ్ కామర్స్‌ను విస్తరించాలి
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: చాంబర్ ఆఫ్ కామర్స్‌ను జిల్లావ్యాప్తంగా విస్తరించాలని కలెక్టర్ ఐ. శ్రీనివాస శ్రీనరేష్ సూచించారు. ఆదివారం రాత్రి చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఆవిర్భవించి 60 ఏళ్లు అవుతోందని, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో ముందంజలో ఉందని అన్నారు. మరింతగా ముందుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. విద్యావంతులైన పలువురు యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని, వారికి చేయూతనందిస్తే వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారని అన్నారు. జిల్లా కేంద్రంలో అనేక సమస్యలున్నాయని, ప్రధానంగా ట్రాఫిక్ సమస్య నెలకొందని అన్నారు. రహదారులను అభివృద్ధి చేయడంతోపాటు నగరంలో వ్యాపారాలను శివారు ప్రాంతాలకు విస్తరింపచేయాలని సూచించారు. నగరాభివృద్ధికోసం వివిధ శాఖల అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇన్నర్ రింగ్‌రోడ్, అవుటర్ రింగ్‌రోడ్ కోసం ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో అపారంగా ఖనిజ సంపద ఉందని, దానికి అనుగుణంగా పరిశ్రమలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులు దగా కాకుండా చాంబర్ ఆఫ్ కామర్స్ ఉద్భవించిందని, మార్కెట్లలో వ్యాపారులు నిర్ణయించిన ధరలకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులు దగా కాకుండా చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సేవలు రైతులకు, ప్రజలకు అందించాలని తెలిపారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు జిల్లా అసోసియేషన్‌గా విస్తరింపచేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం త్రీటౌన్ సమీపంలో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించి మోడ్రన్ మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరారు. త్రీటౌన్ నుంచి ప్రభుత్వానికి రూ.12 కోట్ల రెవెన్యూ వస్తోందన్నారు. త్రీటౌన్‌లో ఉన్న మార్కెట్‌ను బస్టాండ్‌గా అభివృద్ధి చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. వ్యాపార విద్యా విశ్లేషకురాలు వై.శ్రీదేవి మాట్లాడుతూ ప్రజల్లో వ్యాపారుల పట్ల వ్యతిరేక భావన ఉందన్నారు. వ్యాపారులు ఆ విధంగా వ్యవహరించకుండా ఉండాలని కోరారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, తెలుగు వేద, సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రసంగించారు. చాంబర్ ఆఫ్‌కామర్స్ అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, సహాయ కార్యదర్శి చింతల రామలింగేశ్వరరావు, కోశాధికారులు కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, తూములూరి లక్ష్మీ నరసింహారావులతోపాటు పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధ్యక్ష,కార్యదర్శులతో ఎన్నికల అధికారి వీవీ అప్పారావు ప్రమాణస్వీకారం చేయించారు. ఆత్మీయ అతిథులకు అవమానం.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఆత్మీయ అతిథులు అవమానానికి గురయ్యారు. ఆత్మీయ అతిథులుగా ఆహ్వాన పత్రికల్లో ప్రచురించినప్పటికీ ప్రమాణ స్వీకార సమయంలో వారి గురించి మాట్లాడక పోవడం, వేదికపైకి ఆహ్వానించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వెంపటి లక్ష్మీనారాయణ, కొప్పు నరేష్కుమార్, గుర్రం ఉమామహేశ్వరరావు, మెంతుల శ్రీశైలం తదితరులను విస్మరించడంతో వారు కాసేపు ఉండి వెళ్లిపోయారు. -
జిల్లా అవతరణ వేడుకలు పదికాలాలు గుర్తుండాలి...
ఖమ్మం కల్చరల్, న్యూస్‌లైన్: జిల్లా అవతరణ వేడుకలు పదికాలాల పాటు చక్కగా గుర్తుండేలా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ కోరారు. జిల్లా ఏర్పాటై 60 సంవత్సరా లు పూర్తై సందర్భంగా ఖమ్మంలోని స్తంభాద్రి గుట్టపై శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో మంగళవారం అవతరణ వేడులు ప్రారంభిం చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అవతరణ వేడుకలను వచ్చే జనవరి 26వ తేదీ వరకు నిర్వహిం చనున్నట్లు తెలిపారు. అవతరణ వేడుకలను జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్, మండల, గ్రామ స్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఆవిర్భావం నుంచి నేటి వరకు జిల్లా అభివృద్ధికి సహకరించిన ప్రముఖులను ఈ సందర ్భంగా సత్కరించనున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి సమాచారం సేకరిం చేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు వీలుగా జుజ్చిఝఝ్చఝ60డ్ఛ్చటటఃజఝ్చజీ.ఛిౌఝను ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యురాలు గారపాటి రేణుకాచౌదరి మాట్లాడుతూ ఖమ్మంజిల్లా జ్యోతిని దేశమంతా ప్రతిబింబించేలా అవతరణ వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజలందరికీ జిల్లా చరిత్ర తెలిసేలా సమగ్ర సమాచారంతో ఒక సావనీర్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాకు వచ్చే రహదారులపై ప్రవేశమార్గాలలో 60 వసంతాల చిహ్నాలతో ద్వారాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఖమ్మంను గ్రేటర్ ఖమ్మంగా తీర్చిదిద్దడానికి నిర్ణయించామని అన్నారు. దీనికోసం జిల్లాలోని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. శాసనసభ ఉపసభాపతి మల్లుభట్టివిక్రమార్క మాట్లాడుతూ గత 60 ఏళ్ల కాలంలో ఖమ్మంజిల్లా వివిధ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని, జిల్లాలోని సహ జవనరులను సమర్ధవంతంగా వినియోగించుకుని మరింత వడివడిగా అభివృద్ధి చెందాలని అన్నారు. జనవరి 26 వరకు నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరిం చుకుని మధిరలో ‘మధిరోత్సవాలను’ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన, జిల్లా ఎస్పీ రంగనాధ్, జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబురావు, మెప్మా పీడీ వేణుమనోహర్, డీఈఓ రవీంద్రనాధ్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య, జిల్లా సాంస్కృతికమండలి సభ్యులు వీవీ అప్పారావు, నాగబత్తిని రవి, వివిధ శాఖల అధికారులు, పలువురు కవులు, కళాకారులు, రచయితలు, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. ఎంపీ రేణుకాచౌదరి జ్యోతి ప్రజ్వలనచేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె 60 వసంతాల కేక్‌ను కట్‌చేశారు. ఘనస్వాగతం: అవతరణ వేడుకల కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీస్తంభాద్రి గుట్టకు వచ్చిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం లభించింది. దేవాలయ కమిటీ చైర్మన్ శనగవరపు ప్రసాద్, కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్రావు, అర్చకులు నరహరి నరసింహాచార్యులు, కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో వారికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భం గా అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రీలక్ష్మినరసింహస్వామికి, శ్రీలక్ష్మి అమ్మవారికి పూజలు చేశారు. జిల్లా అవతరణ వేడుకల ప్రారంభ సూచికగా ఎంపీ రేణుకచౌదరి, డిప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే మిత్రసేన తదితరు లు బెలూన్లను గాలిలో ఎగురవేశారు. కళాకారులు మొగిలి వెంకటేశ్వర్లు, మిమిక్రీ సుధాకర్, కిన్నెర జాన్, ఫైర్ రవి తమ ఆట పాటలతో అలరించారు. -
పోలీస్ సేవలు భేష్
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. స్థానిక ఎస్బీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసులు అనేక సమస్యలను అధిగమిస్తూ గణనీయమైన ప్రగతి సాధించారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కా ప్రణాళికతో విధులు నిర్వహించారని అన్నారు. అన్ని వర్గాల వారి ప్రయోజనాలను కాపాడటంలో పోలీస్ సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాని అభినందించారు. మన రాష్ట్ర పోలీసులకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దోషులకు శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయని, అప్పుడు పోలీసుల్లో నైతిక స్థైర్యం పెరుగుతుందని అన్నారు. అందుకు అవసరమైన సాక్షులను గుర్తించడంతోపాటు సకాలంలో చార్జిషిట్ దాఖలు చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచిం చారు. అటవీ భూముల పరిరక్షణకు పోలీస్, రెవెన్యూ, అటవీశాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చా రు. ఎస్పీ ఎ.వి. రంగనాధ్ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు నిర్ధిష్టమైన ప్రణాళిక ఉండాలని చెప్పారు. క్రిమినల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. చైన్‌స్నాచింగ్, దొంగతనాల నివారణకు స్పెషల్ పార్టీలను వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా డయల్ 100పై నిర్వహించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శిం చారు. డాక్యుమెంటరీని రూపొందించిన టి.ఆనందరావు, వెంకటేశ్వర్లు, ఖాదర్‌బాబు, కార్తనందంలను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్, ఏఎస్పీలు భాస్కర్ భూషణ్, ప్రకాష్‌రెడ్డి, డీఎస్పీలు బాలకిషన్‌రావు, కృష్ణ, సా యిశ్రీ, అశోక్‌కుమార్, రవీందర్, కుమారస్వామి,సురేష్‌కుమార్, ఎస్బీఐ వెంకట్రావు, ఏవో వెంకట్, డీసీఆర్బీ సీఐ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.