ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కోసం మాజీ నక్సల్స్ చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. లొంగి పోయిన నక్సల్స్ పునరావాస పెండింగ్ అర్జీల పరిష్కారంపై కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్షించారు. స్వయం ఉపాధి పథకాల మం జూరు కోసం ఐటీడీఏ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్, పశుసంవర్థక, రెవెన్యూ శాఖల వద్ద మాజీ నక్సల్స్ అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
బ్యాంకు కాన్సెంట్ ఇవ్వకుండా గ్రౌం డింగ్ కాని అర్జీలు 21 ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి 15లోగా అన్ని శాఖల వద్ద ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులకు మంజూరు చేయాలన్నారు. న క్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను లొంగిపోయిన నక్సల్స్‌తో భర్తీ చేసే అంశాన్ని పరీశీలించాలన్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు స్వయం ఉపాధి కింద రుణాలు అందించేందు కు చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ 12 మంది మాజీ నక్సల్స్‌కు వారంలోగా తక్షణ సహాయం అందిస్తామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ జిల్లాలో లొంగుబాటుకు చాలామంది నక్సల్స్ ఆసక్తి చూపుతున్నారని అన్నారు. భవిష్యత్తులో లొంగుబాట్లు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పోలీసుల నుంచి వేధింపులు లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి, కొత్తగూడెం ఓఎస్డీ తిరుపతి, ఖమ్మం ఆర్డీఓ సంజీవరెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు, మాజీ నక్సల్స్ పాల్గొన్నారు.
‘మాజీ’ల అర్జీలు పరిష్కరించాలి
Published Thu, Jan 30 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement
Advertisement