rehabilitation
-
రోగులకు చేదోడుగా ‘ప్లూటో’ రోబోట్.. ప్రత్యేకతలివే..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) వెల్లూరు సంయుక్తంగా దేశంలోనే మొట్టమొదటి న్యూరో రిహాబిలిటేషన్ రోబోట్-అసిస్టెడ్ థెరపీ సాధనాన్ని తయారు చేశాయి. ప్లూటో (ప్లగ్ అండ్ ట్రైన్ రోబోట్ ఫర్ హ్యాండ్ న్యూరో రిహాబిలిటేషన్) అని పిలవబడే ఈ రోబో న్యూరో, వెన్నుముక సమస్యలు ఉన్న రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తయారీదారులు తెలిపారు. ‘ప్లూటో’ను థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ దేశంలో మార్కెట్ చేయబోతున్నట్లు ప్రకటించారు.సీఎంసీ వెల్లూరు బయో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శివకుమార్ బాలసుబ్రమణియన్, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్ ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్), టాటా ఎలిక్సీ లిమిటెడ్ అందించిన సీఎస్ఆర్ గ్రాంట్లు, భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి వచ్చిన నిధులు ప్రాజెక్ట్‌కు ఎంతో ఉపయోగపడినట్లు చెప్పారు.తొమ్మిది క్లినిక్‌ల్లో ట్రయిల్స్ పూర్తి‘ప్లూటో న్యూరో రోగులకు అవసరమైన కచ్చితమైన చికిత్సలు, రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్‌ను అందిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు అవసరమైన మెరుగైన చికిత్సలు, ఫలితాలను అంచనా వేస్తుంది. అధిక చికిత్స ఖర్చులు, దేశంలో చాలా మంది స్ట్రోక్ బాధితులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్లూటోను రూపొందించారు. ఇది ఒక కాంపాక్ట్, పోర్టబుల్ టేబుల్ టాప్ పరికరం. చిన్న సూట్ కేస్ ద్వారా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దేశంలోని తొమ్మిది క్లినిక్‌ల్లో ప్లూటోను ట్రయిల్ చేశారు. గత 30 నెలల్లో 1,000 మందికి పైగా రోగులు, 100 మంది వైద్యులు దీన్ని ఉపయోగించారు. ఇంట్లో ఉపయోగిస్తూ రోగుల వ్యాధికి సంబంధించిన కచ్చితమైన థెరపీ అధ్యయనాలు తెలుసుకోడానికి ప్లూటో ఎంతో దోహదం చేస్తుంది’ అని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులుఎవరికి అవసరం అంటే..ఈ టెక్నాలజీకి లైసెన్స్ ఇచ్చిన థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ ప్లూటోను బిజినెస్ పరంగా వినియోగించుకునేందుకు భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఆసుపత్రులు, చిన్న క్లినిక్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, రోగుల ఇళ్లల్లో దీన్ని సులువు వినియోగించవచ్చని తెలిపింది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనవారు, చేతి వైకల్యం ఉన్న వ్యక్తులకు ఇది చాలా అవసరం అని పేర్కొంది. -
నరకయాతన అనుభవించాం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : భవానీపురం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో హెచ్ఆర్టీ అపార్ట్మెంట్. ఐదు అంతస్తుల సౌధం. మొత్తం 66 ఫ్లాట్స్. 27 అడుగుల డబుల్ సెల్లారు. శనివారం అపార్ట్మెంట్ చుట్టుపక్కల వర్షపు నీరు చేరడంతో అడ్డుగా ఇసుక బస్తాలు వేశారు. ఆదివారం ఉదయానికి అమాంతం బుడమేరు వరద సెల్లార్లో చేరింది. 27 అడుగుల సెల్లార్ నిండిపోయింది. పార్కింగ్‌లో ఉన్న 42 కార్లు, 72 బైక్‌లు చూస్తుండగానే పూర్తిగా నీటమునిగిపోయాయి. విద్యుత్ సరఫరా లేదు. ఎవరూ బయటకు వచ్చే అవకాశం లేదు. మెట్ల మార్గం గుండా వచ్చి చూస్తే సెల్లారులో భయంకరమైన వరద. అపార్ట్మెంట్లో పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యా«దిగ్రస్తులు ఉన్నారు. చేసేది లేక అంతా అపార్ట్మెంట్ పైకి వెళ్లిపోయారు. లిఫ్ట్, మెట్ల గుండా సెల్లార్లోకి రావడానికి వీల్లేకుండాపోయింది. అధికారులు ఎవరూ రాలేదు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు ఫోన్ చేస్తే స్పందించలేదు. రాత్రి కొందరు అందుబాటులో ఉన్న వస్తువులతో కమర్షియల్ ప్లాట్ల వైపు ఫస్ట్ ఫ్లోర్ గోడను పగులగొట్టారు. గంటల సమయం పట్టింది. సోమవారం ఉదయానికి అపార్ట్మెంట్లో వాళ్లందరిని పగులగొట్టిన గోడ మార్గం గుండా బయటకు తీసుకెళ్లి లారీలు, ట్రాక్టర్లలో బంధువులు, స్నేహితుల ఇళ్లకు పంపించేశారు.ఇంతటి నరకం ఎప్పుడూ చూడలేదునాకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మా అత్తకూడా మా వద్దే ఉంటోంది. అపార్ట్మెంట్ సెల్లార్లో కేటాయించిన గదిలో ఉన్నాం. ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. నిమిషాల్లో మా గది మునిగిపోయింది. ఇంట్లో వస్తువులన్నీ వదిలేసి పిల్లలతో మూడో ఫ్లోర్లో తలదాచుకున్నాం. కరెంట్ లేదు. ఆహారం లేదు. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. ఫ్లాట్స్ యజమానులంతా వెళ్లిపోయారు. మా కుటుంబమంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం. ఇంతటి నరకం ఎప్పుడూ చూళ్లేదు. – గంగాధర్, భవానీపురంలో అపార్ట్మెంట్ వాచ్మెన్గుండెలదిరిపోయాయివరద వస్తుందన్న సమాచారం లేదు. సెల్లార్లోకి వస్తున్న వరద చూసి కిందికి వెళ్లే ప్రయత్నం చేశాను. డబుల్ సెల్లార్ కావడంతో చుట్టుపక్కల వరద అంతా వేగంగా వచ్చి చేరింది. రాత్రంతా పాములు, పందికొక్కులు. రెండు రోజులు దుర్వాసన. తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు లేవు. ఆహారం, పాలు కూడా లేవు. పరిస్థితి చూసి గుండెలదిరిపోయాయి. ఒక్క అధికారి కూడా రాలేదు. – ఆనంద్, భవానీపురంలో అపార్ట్మెంట్ నివాసికృష్ణా నది వరద ఓ వైపు.. బుడమేరు వరద మరోవైపు చూసి భయంతో వణికిపోయాం. పై ఫ్లోర్లలో ఉండే వారంతా లిఫ్ట్, మెట్ల నుంచి కిందకు దిగే పరిస్థితి లేక ఇళ్లలో వినియోగించే వస్తువులతో గంటల కొద్ది కష్టపడి గోడ పగులగొట్టాం. లారీ, ట్రాక్టర్ మాట్లాడుకుని పగులగొట్టిన గోడ మీదుగా గుండె జబ్బులు ఉన్నవారిని బయటకు తీసుకొచ్చాం. వారందరినీ బం«ధువులు, స్నేహితుల ఇళ్లకు పంపించేశాం. ప్రాణాలైతే కాపాడుకోగలిగాం గానీ భారీ ఆస్తినష్టం సంభవించింది.– శివ, ప్రెసిడెంట్, హెచ్ఆర్టీ అపార్ట్మెంట్ -
పునరావాసానికి ‘దిక్కు’లేదు
ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి/లబ్బీపేట (విజయవాడ తూర్పు) : బుడమేరు ముంపు బాధితులకు పునరావాసం కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దీంతో పీకల్లోతు నీటిలో గంటల పాటు నడుచుకుంటూ బయటపడిన బాధితులు ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీసం ముంపు నుంచి బయటకు వచ్చిన వారికి పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారో కూడా చెప్పే వారే లేరు. పునరావాస కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల బాధితులు మండిపడుతున్నారు. తరలింపు విషయంలో పట్టించుకోకపోయినా.. తమకు తాముగా వరద నుంచి బయట పడితే పునరావాసం కూడా కల్పించలేదని ఆరోపిస్తున్నారు. తమకు తెలిసిన వారి ఇళ్లకు కొందరు, బంధువుల ఇళ్లకు మరికొందరు వెళ్తున్నారు. తమకు విజయవాడలో ఎవరూ లేని వారు మాత్రం ఎక్కడకు వెళ్లాలో దిక్కుతోచక, ఏదొక చోట కాస్త జాగా చూసుకుని అక్కడే కూర్చుంటున్నారు. ఇలా నగరంలో ఎక్కడ చూసినా వరద బాధితులే కనిపిస్తున్నారు. ముత్యాలంపాడు వద్ద రైల్వే ట్రాక్, గుడులు, బీఆర్టీఎస్ రోడ్డు, సింగ్‌నగర్ బ్రిడ్జి, చిట్టినగర్ బ్రిడ్జిపైకి వేలాదిగా బాధితులు చేరారు. ఇలా ఎక్కడ చూసినా పిల్లలతో కలసి బిక్కుబిక్కు మంటూ గడుపుతున్న వారే కనిపిస్తున్నారు. దాతలు ఇచ్చే ఆహారం, నీళ్లు తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. నిస్సిగ్గుగా అబద్ధందాదాపు 167 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రభుత్వం అబద్దం చెబుతోంది. కాగితాల్లో మినహా వాస్తవంగా అలాంటివేవీ లేవని ‘సాక్షి’ బృందం పరిశీలనలో తేలింది. విజయవాడ వరద ముంపు ప్రభావం దాదాపు 5 లక్షల మందిపై పడిందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. నగరమంతా జల్లెడపడితే సత్యనారాయణపురంలోని ప్రశాంతి నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో ఓ పునరావాసకేంద్రం మాత్రం కనిపించింది. అందులోకి సోమవారం 250 మందికి, మంగళవారం మరో 100 మందికి ఆశ్రయం కల్పించారు. అరకొర సౌకర్యాలతోనే బాధితులు కాలం గడుపుతున్నారు. అపార్ట్మెంట్లు, డాబాలపైనే ప్రజలు ఆశ్రయం పొందుతుంటే.. వాటినే ప్రభుత్వం పునరావాస కేంద్రాలుగా చెప్పుకుంటోంది. డాబాలు, అపార్ట్మెంట్లలో ఉన్న వారు తాగునీరు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, మంచినీరు వంటివి అందచేస్తున్నాయి. కానీ ఇవి నాలుగోవంతు మందికి కూడా అందడం లేదు.రాణిగారితోటకు చెందిన పలువురు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మెట్లమీదే ఆశ్రయం పొందుతున్నారు. వీరికి కనీసం తిండి, తాగునీరు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. అక్కడున్న పోలీసులు ఇచ్చిన బ్రెడ్డు ముక్కలతో పిల్లలు కడుపునింపుకుంటున్నారు. దొరికిన ఒక బ్రెడ్డు నాదంటే.. నాదంటూ చిన్నారులు వాదులాడుకోవడం చూస్తే.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.ఇలా రావడం.. అలా వెళ్లడమేనా! అధికారులు, ప్రజాప్రతినిధులు సురక్షిత ప్రాంతాల్లో తిరుగుతూ చేతులు ఊపుతూ.. అభివాదాలు చేస్తూ వెళ్తున్నారేతప్ప.. ముంపు ప్రాంతాల్లో చూద్దామంటే ఒక్క ప్రజాప్రతినిధి, అధికారులు కూడా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కేవలం గొల్లపూడి బైపాస్ రోడ్డులో వచ్చి సురక్షిత ప్రాంతంలో హడావుడి చేశారు. కనీసం ఒక్క నిమిషం కూడా అక్కడి బాధితులతో మాట్లాడకుండా.. తమకు న్యాయం చేయాలని అడిగిన వారిని వేలు చూపి బెదిరిస్తూ వెళ్లిపోయాడని ఊరి్మళకాలనీ ప్రజలు వాపోయారు. – సాక్షి బృందం, విజయవాడచెత్త సీఎం.. నికృష్ట పాలనసాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెత్త సీఎం దాపురించారని, నికృష్టమైన పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున దుయ్యబట్టారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేతకానితనాన్ని వైఎస్సార్సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో పాబ్లో ఎస్కోబార్ అంటే చంద్రబాబేనని చెప్పారు. వైఎస్ జగన్ కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ నిర్మించి ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడారని విజయవాడ ప్రజలే చెబుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు జీరి్ణంచుకోలేక పోతున్నారన్నారు. వరద బాధితుల నుంచి విమర్శలు రావటంతో జగన్ భక్త అధికారులంటూ మాట్లాడుతున్నారన్నారు. హెచ్చరికలను పట్టించుకోని సర్కార్: మాజీ ఎమ్మెల్యే కైలే భారీ వర్షాలు, వరదలపై ఐఎండీ ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి విపత్తు వచ్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ చెప్పారు. ఇంతటి విపత్తుకు చంద్రబాబే కారణమని చెప్పారు. బంగాళాఖాతంలో అల్పపీడనంపై గత నెల 28నే ఐఎండీ నుంచి ప్రభుత్వానికి హెచ్చరిక వచ్చిp0దని, 20 సెం.మీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిందన్నారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమవుతాయని సమాచారమిచ్చి0దని చెప్పారు. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శించారు. కదిలిన యువతరంసాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తులో ప్రభుత్వం సాయం అందక బాధితులు విలపిస్తుంటే.. మేమున్నాంటూ యువత ఆపన్న హస్తం అందిస్తోంది. వరద ముంపులో యూనిఫాం లేని సైనికులు మాదిరిగా యుద్ధ ప్రాతిపదికన సాయం చేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు దీటుగా.. ప్రజా సైనికులుగా మారి పీకల్లోతు నీళ్లలో ట్యూబులపై తిరుగుతూ మిద్దెలపై కాలం వెళ్లదీస్తున్న బాధితుల ఆకలి తీరుస్తోంది. నైరుబొమ్మ సెంటర్‌కు చెందిన 50 మంది యువత విజయవాడలోని వరద ముంపులో చిక్కుకున్న భవానీపురం, సాయిరాం కాలనీ, వైఎస్సార్ కాలనీ తదితర ప్రాంతాల్లో బాధితులకు సహాయం అందించేందుకు నడుం బిగించింది. ప్రభుత్వం పట్టించుకోని కంసాలిపేటలో మూడు రోజులుగా స్వచ్ఛందంగా సేవలందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటోంది. -
పునరావాసం ఊసేలేదు
సాక్షి, అమరావతి : భారీ వర్షాలు, వరదలకు ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం కూడా స్పందించడంలేదు. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని విలీన మండలాలు, మరికొన్ని గిరిజన మండలాల్లో గ్రామాలు మునిగిపోయి జనం జలదిగ్బంధంలో చిక్కుకుపోయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. శనివారం సాయంత్రం వరకు 20 మండలాల్లో 200కి పైగా గ్రామాలు మునిగిపోయినా పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయలేదు. దీంతో అక్కడి జనం నానా బాధలు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు వచ్చి, కరెంటులేక, నిత్యావసరాలు దొరక్కపోవడంతోపాటు కనీసం మంచినీరు లేక విలవిల్లాడుతున్నారు. వరద పెరిగాక జనాన్ని తరలిస్తారట.. గోదావరి వరద పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశాకే పునరావాస కేంద్రాల గురించి ఆలోచించాలని అధికారులు సూచించడంతో ఎక్కడా పునరావాస కేంద్రాలు ఏర్పాటుకాలేదు. దీంతో ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇళ్లల్లోకి నీరు చేరినా అక్కడే ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. గోదావరి వరద పెరిగేలోపు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. వరద పెరిగాక సహాయ, పునరావాస కేంద్రాలకు తరలించవచ్చని అధికారులు భావించడంతో వందలాది గ్రామాల ప్రజలు ముంపు గ్రామాల్లోనే చిక్కుకుపోయారు. -
‘మేడిగడ్డ’ ఖర్చు ప్రభుత్వమే భరించాలి
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాఫర్ డ్యాం నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్మాణసంస్థ ఎల్అండ్టీ మళ్లీ తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్‌తోనే బ్యారేజీని నిర్మించామని, అలాంటప్పుడు అందులో తలెత్తిన లోపాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈనెల 17న రామగుండం సీఈకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీళ్లన్నీ మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ను చుట్టుముట్టాయని, దీంతో తాము చేసిన పనులు దెబ్బతిన్నాయని ఆ లేఖలో పేర్కొంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంతో తాము చేసిన పనులు వృథా అయ్యాయని చెప్పింది. ఇందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంటే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్లు (పిల్లర్లు), రాఫ్ట్ ఫౌండేషన్, కటాఫ్ వాల్స్, ససికెంట్ పైల్స్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉందని, పునరుద్ధరణ పనులు చేసే ఏడో బ్లాక్‌తోపాటు దానికి ఇరువైపులా ఉన్న బ్లాకులకు అప్‌స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్‌లో కాఫర్ డ్యాం నిర్మించాల్సి ఉందని ఈ లేఖలో స్పష్టం చేసింది. ఈ పనులు వ్యయ ప్రయాసలతో కూడుకున్నవని, అందుకే ప్రభుత్వం వాటికి మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇందుకు సమ్మతిస్తేనే పునరుద్ధరణ పనులు చేస్తామని పేర్కొంది. గోదావరినదిలో కాపర్‌డ్యాం నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని, వర్క్అగ్రిమెంట్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. మళ్లీ మొదటికొచ్చిన మేడిగడ్డ పనులు అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి ముందు మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని, దీంతో ఆ పనులన్నీ మళ్లీ మొదటికొచ్చాయని ఎల్అండ్టీ ఆందోళన వ్యక్తం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్21న సాయంత్రం కుంగిపోయింది. బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్భూమిలోకి ఐదు అడుగులకుపైగా కుంగింది. దీంతో ఏడో బ్లాక్‌లోని నాలుగు పిల్లర్లు భారీగా, ఇంకో ఆరు పిల్లర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని నేషనల్డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రిలిమినరీ రిపోర్టులోనే స్పష్టం చేసింది. బ్యారేజీలోని మిగతా బ్లాకులు దెబ్బతినకుండా ఉండేందుకు పగుళ్లు తేలిన పిల్లర్లు, వాటి రాఫ్ట్ ఫౌండేషన్‌తో సహా తొలగించేందుకు డైమండ్ కట్టింగ్ విధానం అనుసరించాలని నిర్ణయించారు. బ్యారేజీ కుంగిపోయినప్పుడు దానిని పరిశీలించిన ఎల్అండ్టీ అధికారులు తామే పునరుద్ధరిస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు (డిసెంబర్ 2న) బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్అండ్టీ బాంబు పేల్చింది. ఈమేరకు రామగుండం ఈఎన్సీకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. కాఫర్ డ్యాం నిర్మాణానికికే రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని, ఆ మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, ఎల్అండ్టీ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. బ్యారేజీని పునరుద్ధరించకుంటే ఎల్అండ్టీని బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు ఆ సంస్థ పొందిన బిల్లులను రెవెన్యూ రికవరీ యాక్ట్ప్రయోగించి వసూలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం ఘాటుగా హెచ్చరించిన తర్వాత కూడా ఎల్అండ్టీ అధికారులు అన్నారం బ్యారేజీ నుంచి నీటి విడుదలను సాకుగా చూపుతూ మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని మరో లేఖ రాశారు. మళ్లీ ఒప్పందం చేసుకోండి మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాంతోపాటు బ్యారేజీలో దెబ్బతిన్న పోర్షన్ పునరుద్ధరణకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని ఆ లేఖలో స్పష్టం చేసింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్29నపూర్తయ్యిందని, దీంతో దెబ్బతిన్న బ్యారేజీని పునరుద్ధరించడం తమ బాధ్యత కానేకాదని అందులో పేర్కొన్నారు. 2020లో బ్యారేజీ వద్ద కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు సహా ఇతర పనులు చేయాలని కోరారని, ఆ సమయంలో వర్క్అగ్రిమెంట్లో లేని పనులను తాము చేపట్టలేమని స్పష్టత ఇచ్చామని గుర్తు చేశారు. పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్లు ఇవ్వాలని అప్పుడే కోరినా బ్యారేజీ దెబ్బతినేంత వరకు ఇరిగేషన్డిపార్ట్మెంట్నుంచి తమకు ఎలాంటి డిజైన్లు కూడా అందలేదని లేఖలో ప్రస్తావించారు. బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయిన తర్వాత జరిగిన లోపాలను తాము సరి చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కాఫర్డ్యాంతో పాటు బ్యారేజీ పునరుద్ధరణకు కొత్తగా అగ్రిమెంట్చేసుకుంటే తప్ప తాము అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేమని స్పష్టం చేశారు. -
ఘోర అగ్ని ప్రమాదం: 32 మంది అగ్నికి ఆహుతి
Massive Fire ఇరాన్లో జరిగిన ఘోర అగ్రి ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మత్తు మందులనుంచి బయటపడాలన్న మంచి ఆశయంతో మాదక ద్రవ్యాల పునరావాస కేంద్రంలో చేరిన బాధితులు అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది. గురువారం రాత్రి జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఏకంగా 32 మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా శుక్రవారం నివేదించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో బాధితులు అందులో చిక్కుకు పోయారు. మంటల ధాటికి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బాధితులు తప్పించుకునే మార్గం లేకుండా పోయినట్టు తెలుస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని లాంగరుడ్ నగరంలోని డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో చెలరేగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మొహమ్మద్ జలాయ్ తెలిపారు. ఈ సెంటర్ నిర్వాహకుడితో పాటు పలువురిని ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. -
పల్మనరీ మెడిసిన్ ఔట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ పెట్టడానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులను ఆధారం చేసుకొని గత మార్గదర్శకాల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతి రావాలంటే 24 డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వాటిల్లో నాలుగింటిని తొలగించి, ఒక దాన్ని చేర్చారు. అంటే 21 విభాగాలు ఉంటే సరిపోతుంది. అయితే ఎంబీబీఎస్ విద్యార్థులకు కీలకమైన పల్మనరీ మెడిసిన్ విభాగం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు ప్రాధాన్యత కలిగిన ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, రేడియేషన్ అంకాలజీ విభాగాలను కూడా ఎన్ఎంసీ తొలగించింది. కొత్తగా సమీకృత వైద్య పరిశోధన విభాగాన్ని తీసుకొచ్చింది. అత్యవసర వైద్యానికి ప్రాధాన్యం ఇచి్చంది. సాధారణ పడకలను 8 శాతం తగ్గించి ఐసీయూ పడకలను మాత్రం 120 శాతం పెంచింది. పల్మనాలజీ కిందే ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు లేదా కరోనా వంటి సమయాల్లో పల్మనరీ మెడిసిన్ కీలకమైనది. టీబీ వ్యాధి కూడా దీని కిందకే వస్తుంది. వెంటిలేటర్ మీద ఉండే రోగులను పల్మనరీ, అనెస్తీషియా విభాగాల వైద్యులే చూస్తారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన విభాగాన్ని తొలగించడంపై సంబంధిత వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పల్మనరీని తీసేయడం వల్ల అనెస్తీషియా, జనరల్ మెడిసిన్ స్పెషలిస్టులపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో తొలగించిన విభాగాలకు చెందిన పీజీలు ఉండరు. దానికి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉండదు. పల్మనరీ మెడిసిన్ రద్దు సమంజసం కాదు 50 ఏళ్లుగా ఉన్న పల్మనరీ మెడిసిన్ విభాగం తప్పనిసరి నిబంధన తొలగించడం సరైన చర్య కాదు. 2025 నాటికి టీబీ నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్న భారత్ పల్మనరీ వంటి కీలకమైన విభాగాన్ని తీసేయడం సమంజసం కాదు. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్,ఐఎంఏ, తెలంగాణ మరికొన్ని మార్గదర్శకాలు అనెస్తీషియా కింద పెయిన్ మేనేజ్మెంట్ విభాగాన్ని తీసుకొచ్చారు. దీర్ఘకాలిక నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటివి ఈ విభాగం కిందికి వస్తాయి. యోగాను ఒక విభాగంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు వేర్వేరుగా స్త్రీ, పురుష శిక్షకులు ఉండాలి. గతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 300 పడకలు అవసరం కాగా, ప్రస్తుతం వాటిని 220కి కుదించారు. స్కిల్ ల్యాబ్ తప్పనిసరి చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు నేరుగా రోగుల మీద కాకుండా బొమ్మల మీద ప్రయోగం చేసేందుకు దీన్ని తప్పనిసరి చేశారు. గతంలో కాలేజీకి సొంత భవనం ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు లీజుతో కూడిన భవనం ఉంటే సరిపోతుంది. కాలేజీ, అనుబంధ ఆసుపత్రి మధ్య దూరం గతంలో 10 కిలోమీటర్లు, 30 నిమిషాల ప్రయాణంతో చేరగలిగేలా ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు దీనిని కేవలం 30 నిమిషాల్లో చేరగలిగే దూరంలో ఉండాలన్న నియమానికి పరిమితం చేశారు. ఎన్ని సీట్లకు ఎన్ని జర్నల్స్, పుస్తకాలు ఉండాలన్నది స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా డాక్టర్లు, నర్సులతో పాటు మొత్తం 17 మంది సిబ్బందితో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులను ఇక్కడికి శిక్షణకు పంపుతారు. గతంలో ఎంబీబీఎస్, హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్ వసతి తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు రెసిడెంట్లకు తీసేశారు. -
Andhra Pradesh: వరద ప్రాంతాల్లో వేగంగా సాయం
సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముంపు బారిన పడిన జిల్లాల్లోని 211 గ్రామాల ప్రజల కోసం ప్రభుత్వం 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. 46,170 మంది బాధితులను అక్కడికి యుద్ధ ప్రాతిపదికన తరలించింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 51 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి 43,587 మందికి తాత్కాలికంగా పునరావాసం కల్పించారు. ఏలూరు జిల్లాలో 4 కేంద్రాల్లోకి 1,528 మందిని, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 18 కేంద్రాలకు 758, తూర్పుగోదావరి జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసి 306 మందిని తరలించారు. ఆయా ప్రాంతాల్లో తక్షణ వైద్య సౌకర్యం కల్పించేందుకు 68 వైద్య శిబిరాలు నెలకొల్పారు. మొత్తం 178 బోట్లు, 10 లాంచీలను సహాయక చర్యల కోసం ఏర్పాటు చేశారు. ఐదు జిల్లాలకు ప్రభుత్వం తక్షణ అవసరాల కోసం రూ.12 కోట్లు విడుదల చేయడంతో పునరావాసకేంద్రాల ఏర్పాటు, బాధితుల తరలింపు, వారికి అవసరమైన ఆహారం, తాగు నీరు ఇతర సౌకర్యాల కల్పన వేగంగా జరిగింది. ఐదు జిల్లాల్లో మొత్తం 26 మండలాల్లోని 211 గ్రామాలపై గోదావరి వరద ముంపు ప్రభావం పడినట్లు నిర్ధారించి, ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 96 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో 10 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరులో రెండు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ పోలవరంలో ఒక్కొక్కటి చొప్పున ఎన్టీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూనవరం, చింతూరు, పి గన్నవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో ఒక్కొక్కటి చొప్పున ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఆ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ నుంచి నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పర్యవేక్షణ ♦ వరద తాకిడికి గురైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం ఎటపాక మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు సంబంధించి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు తాగునీటితో పాటు వాడుక నీటి సౌకర్యం కల్పించారు. విద్యుత్ అందుబాటులో లేని ప్రాంతాల్లో జనరేటర్ సౌకర్యం కల్పించారు. బాధితులకు నిత్యావసరాలతో పాటు కూరగాయలు, పాలు అందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా కేంద్రాల పరిసరాల్లో బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టారు. గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లను అందుబాటులో వుంచారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ♦ చింతూరు మండలంలో బాధితులకు కూరగాయలు, పాలతో పాటు కొవ్వొత్తులు పంపిణీ చేశారు. కిరోసిన్ పంపిణీకి కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వారికి 10 వేల టార్పాలిన్లను సిద్ధం చేస్తున్నారు. కూనవరం మండలంలో 12, వీఆర్‌పురం మండలంలో 10, చింతూరు మండలంలో 8 మర పడవలను సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ♦ వరద ముంపు ప్రాంతాలకు లాంచీలు, పడవల ద్వారా కూరగాయలను పంపించారు. చింతూరు జీసీసీ గోడౌను నుంచి వీఆర్‌పురం, కూనవరం మండలాలకు మూడు టన్నుల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, రెండు టన్నుల చొప్పున వంకాయలు, దొండకాయలు పంపించారు. నడి గోదావరిలో ఆరుగురు గర్భిణుల తరలింపు నడి గోదావరిలో శనివారం రాత్రి 10.30 గంటలకు బోట్‌పై ఆరుగురు గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రానికి తరలించాయి. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ రాజీవ్ వేలేరుపాడు మండలంలో అత్యంత మారుమూల గ్రామాలైన టేకుపల్లి, టేకూరు గ్రామాల్లో ఆరుగురు గర్భిణులను గుర్తించారు. వీరిని వెంటనే పునరావాస కేంద్రానికి తరలించేందుకు బోట్‌పై ప్రయత్నించగా, తిర్లాపురం గ్రామానికి వచ్చేసరికి చీకటి పడి అక్కడే బోట్ ఆగిపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మోహన్‌యాదవ్, మిగిలిన బృంద సభ్యులు.. ఆరుగురు గర్భిణులను వేలేరుపాడుకు తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి వారిని తీసుకెళ్లారు. నిత్యావసర వస్తువుల పంపిణీ ♦ పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట మండలంలో అయోధ్య లంక, మర్రిమూల, పెదమల్లం గ్రామాల్లో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించి, బాధితులకు భరోసా ఇచ్చారు. యలమంచిలి మండలంలోని లంక గ్రామాలైన దొడ్డిపట్ల, కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, ఏనుగువాని లంక, బాడవ గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి లంక గ్రామాల్లో పర్యటించారు. ♦ ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో 35 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శనివారం రాత్రి ఇళ్లలోకి వరద నీరు చేరుతుండటంలో ఐదు గ్రామాలు నీటమునిగాయి. పాత నార్లవరం, ఎడవల్లి, టేకూరు, రుద్రమకోట, వేలేరుపాడు సంతబజారుల్లో 30 ఇళ్ల వరకు నీటమునగడంతో జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వీరందరికీ భోజన వసతి కల్పించారు. వేలేరుపాడులో పది దేశీయ బోట్లు, రెండు పెద్ద బోట్లు, మరో రెండు ఫైర్ బోట్లు వినియోగిస్తున్నారు. వరద బారిన పడిన కుటుంబాలన్నిటికీ ఆదివారం 3900 లీటర్ల వంట నూనె, 4 వేల కేజీల కందిపప్పు, కుటుంబానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు పంపిణీ చేయనున్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్‡్ష రాజేంద్రన్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఝాన్సీ దగ్గరుండి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ♦ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇళ్ల మధ్య వరద చేరింది. స్థానికులు పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. వైద్య సేవలకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో పునరావస కేంద్రంలో బాధితులతో మాట్లాడారు. వారి కోసం తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణు గోపాలరావు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులు మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ శనివారం కూనవరం, వీఆర్‌పురం మండలంలో వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని 30 పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం పెంపు సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు గ్రామాలకు చెందిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సొమ్మును పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఆర్ధికసాయంపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఈ జిల్లాల్లో ముంపునకు గురైన కుటుంబాలకు ఉచితంగా 25 కేజీల బియ్యం, కేజీ కందపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. ఈ సరుకులను సమకూర్చాల్సిందిగా మార్కెటింగ్‌కు ఆదేశాలిచ్చారు. దెబ్బతిన్న, పాడైన ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
మణిపూర్ పరిణామాలపై నివేదిక ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితుల పునరావాసంతోపాటు శాంతి భద్రతలను మెరుగుపర్చేందుకు చేపట్టిన చర్యలు, ఆయుధాల స్వాధీనం వంటి అంశాలపై తాజా నివేదికను సమరి్పంచాలని మణిపూర్ ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, కర్ఫ్యూ సమయాన్ని ఐదు గంటలకు కుదించామని మణిపూర్ ప్రభుత్వం తెలియజేసింది. మణిపూర్‌లో మైనారీ్టలైన కుకీ తెగ గిరిజనులకు రక్షణ కలి్పంచాలని కోరుతూ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ‘మణిపూర్ ట్రైబల్ ఫోరం’ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ఆగస్టు 10కి వాయిదా పడింది. మరోవైపు, వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు సోమవారం పునఃప్రారంభమైంది. మణిపూర్ పరిణామాలకు సంబంధించిన పిటిషన్లపై విచారణను మొదలుపెట్టింది. -
వరుసగా ఏడు ఓవర్లు బౌలింగ్.. పూర్తిగా కోలుకున్నట్లేనా!
ఐసీసీ ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌కు మరో 99 రోజులు మిగిలిఉంది. భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగాటోర్నీలో పది స్టేడియాల్లో 48 మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్ జరగనున్నాయి. ఇక వరల్డ్‌కప్‌కు బీసీసీఐ టీమిండియా బెస్ట్ టీంను ఎంపిక చేసే పనిలో ఉంది. వెస్టిండీస్, ఐర్లాండ్‌తో వరుసగా టీమిండియా వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఈ టోర్నీలో ఆటగాళ్లు చేసే ప్రదర్శన ద్వారా తుది జట్టుపై ఒక అంచనాకు రానున్నారు. ఇకపోతే గాయాలతో దూరమైన కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలు కూడా వరల్డ్‌కప్ ఆడాలనే ఉత్సాహంతో త్వరగా కోలుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు వీరంతా ఎన్సీఏ అకాడమీలోని రీహాబిలిటేషన్ సెంటర్లో వేగంగా కోలుకుంటున్నారు. టీమిండియాకు ప్రధాన పేసర్ అయిన బుమ్రా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఎన్సీఏలో రిహాబిలిటేషన్ పొందుతున్న బుమ్రా.. వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేసినట్లు సమాచారం. సర్జరీ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. గత కొంతకాలంగా ఎన్సీఏలోనే గడుపుతున్నాడు. ఫిట్నెస్ను మెరుగుపరుచుకుంటున్న అతడు.. ఈ క్రమంలోనే ఏడు ఓవర్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఒక ఫాస్ట్ బౌలర్ గాయం నుంచి కోలుకోవడం అంత సామాన్యమైన విషయమైతే కాదు. మేం బుమ్రా విషయంలో నిత్యం మానిటరింగ్ చేస్తున్నాం. అతడు వేగంగా కోలుకోవడమే గాక ఫిట్నెస్ను కూడా మెరుగుపరుచుకుంటున్నాడు. నెట్స్‌లో ఇవాళ వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. క్రమంగా అతడు మరిన్ని ఓవర్లు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో అతడు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అక్కడ ఎలా ఆడతాడో చూశాక బుమ్రా ఫిట్‌నెస్‌పై ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే అతడు ఐర్లాండ్‌తో ఆగస్టులో ఆడతాడో లేదో అనే దానిపై ఒక అంచనాకు రావొచ్చు''అని పేర్కొన్నాడు. ఇక రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లతో పాటు బుమ్రాను ఆగస్టులో జరిగే ఆసియా కప్ వరకైనా సిద్ధం చేయాలనే లక్ష్యం పెట్టుకున్న బీసీసీఐ ఆ మేరకు ప్రణాళికలు కూడా రెడీ చేసింది. ఆసియా కప్ కంటే ముందే ఐర్లాండ్ తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో బుమ్రాను పరీక్షించి ఆసియా కప్.. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ కు సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. 🚨🚨 Team India's fixtures for ICC Men's Cricket World Cup 2023 👇👇 #CWC23 #TeamIndia pic.twitter.com/LIPUVnJEeu — BCCI (@BCCI) June 27, 2023 చదవండి: #ICCWorldCup2023: 2011 నుంచి ఆతిథ్య జట్టుదే.. ఈ లెక్కన వరల్డ్‌కప్ మనదేనా! #ICCWorldCup2023: టీమిండియాతో తలపడే ఆ ఐదు జట్లకు వేర్వేరు పిచ్‌లు.. -
శరవేగం.. పునరావాసం
రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం రెండు కళ్లుగా భావించి రెండింటికి ప్రాధాన్యం ఇస్తూ పునరావాసం పనులు వేగవంతం చేసింది.దేవీపట్నం, పూడిపల్లి మినహా గ్రామాలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. గత ప్రభుత్వ హయాంలో పడకేయగా ప్రస్తుత ప్రభుత్వం పనులు ముమ్మరం చేసింది. రంపచోడవరం: రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పునరావాస కాలనీల నిర్మాణం దగ్గర నుంచి నిర్వాసితుల ఖాతాల్లో ఆర్అండ్ఆర్ డబ్బులు జమ, నిర్వాసితులు గ్రామాల నుంచి తరలింపు వంటి పనులు ముమ్మరం చేసింది. ముంపు గ్రామాల్లో.. దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంవల్ల 44 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ( రీహేబిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్) అధికారులు 5618 మందిని పీడీఎఫ్ (ప్రాజెక్టు డిప్లేస్‌మెంట్ ఫ్యామిలీస్)గా గుర్తించారు. అలాగే రెండు, మూడు సర్వేల్లో మరి కొంత మందిని పోలవరం నిర్వాసితులుగా గుర్తించారు. నిర్వాసితుల తరలింపు దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్ట్ కారణంగా 44 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. అధికారులు వీటిని ఖాళీ చేయించి నిర్వాసితులు బయటకు తరలించారు. 42 గ్రామాలకు పునరావాస పనులు పూర్తి చేసి వారిని కాలనీల్లోకి తరలించారు. దేవీపట్నం, పూడిపల్లి గ్రామాలకు పునరావాసం పూర్తయితే దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతున్న వారికి నూరుశాతం పునరావాసం కల్పించినట్లే. గోకవరం గ్రామ శివారులో.. దేవీపట్నం గ్రామ నిర్వాసితులకు మైదాన ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం గ్రామ శివారు రాజమహేంద్రవరం వెళ్లే రహదారిలో కాలనీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నేలను చదును చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. దేవీపట్నం మండలం కొండమొదలు పంచాయతీలోని గిరిజనులు పలు డిమాండ్ల కారణంగా గ్రామాలను ఖాళీ చేయలేదు. ఇటీవల కాలంలో అధికారులు వారితో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి హామీ ఇచ్చారు. దీంతో ఆ పంచాయతీ పరిధిలోని ఎనిమిది గ్రామాల గిరిజనులు గంగవరం మండలం నేలదొనెలపాడులో నిర్మించిన పునరావాస కాలనీలకు తరలివెళ్లారు. ఎనిమిది గ్రామాల నుంచి.. కొండమొదలు గ్రామంలో 23 కుటుంబాలు, మెట్టగూడెంలో 18, తాటివాడలో 38, కొక్కెరగూడెంలో 77, నడిపూడిలో 35, తెలిపేరులో 40, సోమర్లపాడులో 52, పెద్దగూడెంలో 75 కుటుంబాలు పునరావాస కాలనీలకు తరలివెళ్లాయి. దేవీపట్నం నిర్వాసితులకు గోకవరం గ్రామశివారులో 670 మందికి స్థల సేకరణ చేశారు. కొన్ని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. మండలంలోని గిరిజన నిర్వాసితులకు దేవీపట్నం మండలంలోని ఇందుకూరు–1, ఇందుకూరు–2, పోతవరం ,బియ్యంపల్లి, కమలపాలెం , తదితర గ్రామాల్లో ఏడు కాలనీలు నిర్మించారు. 3029 మంది నిర్వాసితులకు.. పీడీఎఫ్ (ప్రాజెక్టు డిప్లేస్‌మెంట్ ఫ్యామిలీస్)లు 5618 మంది ఉంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 3029 నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మరో దఫా కూడా నిర్వాసితులకు డబ్బులు జమ చేశారు.సుమారు 1200 మంది ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాల్సి ఉంది. -
రైతులకు అందాల్సిన నిధులు మింగేసిన అధికారులు
-
ఏపీ: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు పునరావాసం
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు అనాథలుగా మారిపోకుండా వారికి పునరావాసం కల్పించే చర్యలు చేపడుతున్నట్టు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న చాలా మంది పిల్లలు అనాథలుగా మారుతున్నారన్నారు. ఇలాంటి పిల్లలను చేరదీసి, వారికి జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించి పునరావాసం కోసం చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆమె తెలిపారు. ఇందుకోసం 24 గంటలూ పని చేసే 181, 1098 (చైల్డ్ లైన్) టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల గురించి ఎవరైనా సమాచారం అందించి రక్షణ, పునరావాస సేవలు పొందవచ్చన్నారు. అలాగే, తల్లిదండ్రులు ఇద్దరూ కరోనా వ్యాధి బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన సందర్భాల్లో పిల్లలను ఎవరూ పట్టించుకోని ఘటనలు కూడా ఉంటాయన్నారు. కరోనాపై భయంతో అపోహలతో అటువంటి పిల్లలను చుట్టు పక్కల వారు, బంధువులు ఆదరించే పరిస్థితి ఉండదన్నారు. అలాంటి బాలలకు కూడా తల్లిదండ్రులు కోలుకుని ఇంటికి వచ్చే వరకు సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కృతిక శుక్లా తెలిపారు. ఆయా ప్రాంతాలకు చెందిన జిల్లా కలెక్టర్లు కూడా పిల్లలను సంరక్షించే చర్యలను పర్యవేక్షించి సేవలు అందించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని వివరించారు. చదవండి: ఏపీకి 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు ఎన్440కె ఏపీలో వచ్చిన వేరియంట్ కాదు.. -
ఫలాలకు దీటుగా పునరావాసం
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం పొందే ఆయకట్టు రైతులకు దీటుగా త్యాగం చేస్తున్న నిర్వాసితుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది. భూసేకరణ చట్టం– 2013 ప్రకారం పరిహారం చెల్లించడంతోపాటు కాలనీల్లో నిర్మించిన ఇళ్లల్లో పునరావాసం కల్పిస్తోంది. రక్షిత మంచినీరు, రహదారి, మురుగునీటి కాలువలు, విద్యుత్ సరఫరాను పూర్తి స్థాయిలో కల్పిస్తోంది. నిర్వాసితులకు చేతివృత్తులతోపాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా శిక్షణ ఇస్తూ.. ఉపాధి కల్పిస్తోంది. గతేడాది గండికోట, చిత్రావతి జలాశయాల్లో ముంపునకు గురైన గ్రామాల్లో 19,688 కుటుంబాలకు రూ.1166.57 కోట్లు ఖర్చు చేసి పునరావాసం కల్పించింది. దేశంలో ఒక ఏడాది ఇంత భారీ ఎత్తున నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది పోలవరం, వెలిగొండలో 22,070 నిర్వాసిత కుటుంబాల పునరావాసానికి రూ.5,452.52 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల, సోమశిల, గండికోట, చిత్రావతి, వామికొండసాగర్, సర్వారాయసాగర్, పైడిపాళెం రిజర్వాయర్ల చరిత్రలో తొలిసారిగా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసింది. పోలవరంలో శరవేగంగా.. వెలిగొండను ఈ ఏడాదే పూర్తి చేసేలా చర్యలు చేపట్టిన ప్రభుత్వం పోలవరాన్ని 2022 నాటికి పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేసింది. 194.6 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో ఉభయ గోదావరి జిల్లాల్లో 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లో 1,05,601 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు ఓ.ఆనంద్‌ను ప్రభుత్వం అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది 41.15 కాంటూర్ మీటర్ల పరిధిలోని 20,870 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇప్పటికే 3,417 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 17,453 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.3,942.97 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. పునరావాసం కల్పించడం కోసం 73 కాలనీలను నిర్మిస్తోంది. 27 కాలనీల నిర్మాణాన్ని పూర్తి చేసింది. పూర్తి స్థాయి నీటి మట్టం అంటే 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని 84,731 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.25,539.18 కోట్లు అవసరం. ఈ కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 140 కాలనీలను నిర్మించనుంది. వెలిగొండలో వేగవంతం.. వెలిగొండలో అంతర్భాగంగా 53 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న నల్లమలసాగర్ జలాశయంతో ప్రకాశం జిల్లాలో 11 గ్రామాలు ముంపునకు గురవుతాయి. 4,617 నిర్వాసిత కుటుంబాలు, 18 ఏళ్లు నిండిన 2,938 మంది యువతకు ఏకకాల పరిష్కారం కోసం రూ.1510.05 కోట్లు అవసరం. ఇప్పటికే రూ.1411.56 కోట్లను మంజూరు చేశారు. ఏడు పునరావాస కాలనీల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. -
ఊరంతా.. ఊటలే!
ముంపు బాధితులకు మరో ముప్పు వచ్చి పడింది. వానాకాలం వచ్చిందంటే చాలు ఆ రెండు గ్రామాలు వణికిపోతాయి. జనం కునుకు లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఎటు చూసినా ఊటలే. వర్షం వచ్చిందంటే ఇళ్లలో ఉబికి వస్తున్న ఊటనీరు. దీంతో జనం గుండె చెరువవుతోంది. ఈ గ్రామాలకు సంగంబండ, భూత్పుర్ రిజర్వాయర్లు, పంట కాల్వ రెండు వైపులా ఉన్నాయి. తేమ అధికం కావడంతో చలి తీవ్రత పెరుగుతోంది. పైగా నిమ్ము వల్ల గోడలు ఎప్పుడు కూలుతాయోనన్న భయాందోళన నెలకొంది. ఇది నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పుర్, మాగనూర్ మండలం నేరడుగాం ముంపు గ్రామాల ప్రజల దయనీయ పరిస్థితి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో సతమతమవుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని నిర్వాసితులు వాపోతున్నారు. మక్తల్/నారాయణపేట: మక్తల్ మండలం భూత్పుర్‌ను 2010 నవంబర్ 3న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముంపు గ్రామంగా ప్రకటించింది. ఈ మేరకు జీఓ 122ను జారీ చేసింది. సంగంబండ రిజర్వాయర్ కట్టకు ఆనుకునే ఈ గ్రామం ఉంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నీటినిల్వ పెరిగి గ్రామంలో ఎక్కడ చూసినా ఊటలు కనిపిస్తున్నాయి. అప్పట్లో భూములకు తక్కువ ధర ఇచ్చినా, ఇళ్లకు మాత్రం ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఉన్న భూములు కోల్పోయి, పునరావాసం గ్రామం ఏర్పాటుకాక, రిజర్వాయర్ సమీపంలో ఇళ్లు ఉండటం తమకు జీవన్మరణ సమస్యగా మారిందని వారు వాపోతున్నారు. ఇళ్లలోకి ఊట వస్తోందని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భూత్పుర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామం కోసం ఆర్ఆర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు 2015లోనే స్థలం ఎంపిక చేసినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. తేమ అధికంగా ఉండటంతో చివరకు పంటలు సైతం పాడైపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇక మాగనూర్ మండలం నేరడుగాంలోని కొన్ని ఇళ్లలో సంగంబండ రిజర్వాయర్ ఆయకట్టు కింది నుంచి ఊట నీరు వస్తోంది. దీంతో 5, 6వ వార్డుల్లోని సుమారు 30 ఇళ్లలో ఈ నీరు చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాన్ని పునరావాస కేంద్రంగా ప్రకటిస్తామని 2010లోనే అధికారులు సర్వే చేసి వదిలేశారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్ట లేదని విమర్శిస్తున్నారు. వెంటనే పునారావసం కల్పించకపోతే ప్రమాదాలు జరిగి ఆస్తితో పాటు ప్రాణనష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల రోజులుగా ఎత్తిపోస్తున్నాం ఇటీవలి వర్షాలతో సంగంబండ రిజర్వాయర్ నిండింది. మా గ్రామం రిజర్వాయర్ కట్టకు దగ్గరలోనే ఉంది. దీంతో ఇళ్లలో ఊట వస్తోంది. నెల రోజులుగా వస్తున్న ఊట నీటిని బకెట్లు, కడవలతో ఎత్తిపోసినా ఫలితం లేదు. వారం రోజుల పాటు రెండు మోటార్లు పెట్టాం. ఐదేళ్ల కింద అధికారులు వచ్చి చూసి వెళ్లారు. ఇళ్లలో వచ్చే తేమను పరిశీలించి ఇళ్లకు నంబర్ వేసి వెళ్లారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వెంటనే పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. – కుర్వ సాయిబన్న, నేరడ్‌గాం, మాగనూర్ మండలం ఉన్నతాధికారులకు నివేదిస్తా ఈ రెండు గ్రామాలను త్వరలోనే పరిశీలిస్తాం. భూత్పుర్, సంగంబండ రిజర్వాయర్ల నుంచి ఇళ్లలోకి వస్తున్న తేమ విషయాన్ని క్షేత్రస్థాయిలో తెలుసుకుని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. ఈ సమస్య పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాం. –శ్రీనివాసులు, ఆర్డీఓ, నారాయణపేట -
పులి మనుగడ కోసం గ్రామాల తరలింపు
సాక్షి, కడెం(ఖానాపూర్): పులి మనుగడ కోసం కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కోర్ ఏరియాలోని పలు గ్రామాలను తరలించాలని అటవీశాఖ నిర్ణయించింది. మొదటి విడతలో నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని మైసంపేట్, రాంపూర్ గ్రామాలను పునరావాసం కింద తరలించనున్నారు. అటవీ సంరక్షణకు గ్రామస్తులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కాని సంబంధిత శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ పునరావాసం ఏర్పాటు పనులు పారంభించలేదు. ప్రస్తుతం ఉన్న చోట కనీస సౌకర్యాల్లేవని.. తమను పునరావాసానికి ఎప్పుడూ తరలిస్తారని రాంపూర్, మైసంపేట్ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభం కాని పనులు.. రాంపూర్, మైసంపేట్ గ్రామాల ప్రజలకు ఇదే మండలంలోని కొత్త మద్దిపడగ సమీపంలో విద్య, వైద్యం, విద్యుత్, తదితర సౌకర్యాలతో డబుల్బెడ్రూం ఇళ్లను కట్టించనున్నారు. మరోవైపు మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని పెత్తర్పు సమీపంలో లబ్ధిదారులకు వ్యవసాయ భూమిని కేటాయించనున్నారు. గతేడాది జులై 12న ఆయా శాఖల అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పునరావాసానికి అనువైనదిగా తేల్చారు. ఉన్నచోట మౌలిక సౌకర్యాల్లేవు.. పునరావాసం కోసం ఎదురు చూస్తున్నామని.. మరోవైపు ప్రస్తుతం ఉన్న చోట కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.రాంపూర్ గ్రామంలో సొలార్ సిస్టం పని చేయక గ్రామస్తులు అంధకారంలో ఉంటున్నారు. ప్రస్తుతం వీరు ఉంటున్న గ్రామాల్లో ఉపాధి అవకాశాల్లేవు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. మరికొందరు గ్రామంలోనే కుటుంబపోషణకు తడకలు అల్లుతారు. వ్యవసాయ భూములున్నా.. సాగునీటికి ఇబ్బందులు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేనందున ఏళ్లుగా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో పునరావాసం కింద వెళ్లేందుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇబ్బంది పడుతున్నం మా గ్రామాలను పునరావాసం కింద మరోచోటకు తరలిస్తామని అధికారులు తెలిపారు. అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ వెళ్తున్నారు తప్ప పునరావాసం కల్పించడం లేదు. ప్రస్తుతం ఉన్న చోటును పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నం. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే మా ఇబ్బందులు తొలగిపోతాయి. – పెంద్రం లచ్చుపటేల్, మైసంపేట్ ఇంకెప్పుడు తరలిస్తారు? మా గ్రామాలను పునరావాసం కింద ఇంకెప్పుడు తరలిస్తారో అధికారులు స్పష్టతనివ్వాలి. జాప్యం చేస్తే అడవులను నరికి పొడు వ్యవసాయం చేసుకుంటాం. మా కష్టాలు ఎవరికి కనిపించడం లేదు. త్వరగా పనులు పూర్తి చేసి.. పునరావాసం కల్పించాలి. – దేవ్‌రావు, మైసంపేట్ రాష్ట్రం నుంచి నిధులు రాకనే.. టైగర్‌జోన్ పరిధిలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను తరలించేందుకు గతంలోనే ప్రతిపాదనలు సిద్దం చేశాం. కేంద్రం నిధులు విడుదలైనా.. రాష్ట్రానికి సంబంధించిన నిధులు విడుదలలో జాప్యం నెలకొంది. పునరవాసానికి రాష్ట్రం నిధులు విడుదలవగానే పనులు ప్రారంభిస్తాం. – సుతన్, డీఎఫ్‌వో నిర్మల్ -
రైతు కల్లాల నిర్మాణంలో సిద్దిపేట ప్రథమ స్థానం
గజ్వేల్: మల్లన్నసాగర్ ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీని సకల హంగులతో సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. శనివారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలీటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లిలో నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ పనుల ప్రగతిపై సైట్ వద్ద సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఆర్అండ్ఆర్ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంపై ఆరా తీశారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారీ, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ కనకరత్నం, మిషన్ భగీరథ ఈఈ రాజయ్య, ఈడబ్ల్యూఐడీసీ డీఈ రాంచంద్రం, పీఆర్ డిప్యూటీ ఈఈ ప్రభాకర్, తహశీల్ధార్లు అన్వర్, అరుణ తదితరులు పాల్గొన్నారు. రైతు కల్లాల నిర్మాణంలో జిల్లా ప్రథమం ములుగు(గజ్వేల్): రైతు కల్లాల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, పల్లె ప్రకృతి వనాలతోగ్రామాల్లో పచ్చదనం వెల్లి విరుస్తుందని కలెక్టర్ వెంకట్రావిమిరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో శనివారం కల్లం నిర్మాణంతో పాటు పల్లె పకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు, కేబీఆర్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచీలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ అధికారులను, గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు కొన్యాల మమత, సర్పంచ్ కాయితి యాదమ్మ, కేబీఆర్ పౌండేషన్ చైర్మన్ కొన్యాల బాల్‌రెడ్డిలను అభినందించారు. ట్రైనీ కలెక్టర్ దీపక్‌తివారీ, డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి కలెక్టర్ ప్రకృతి వనంలో మొక్కను నాటి నీరు పోశారు. కార్యక్రమంలో ములుగు ఎంపీపీ లావణ్యఅంజన్‌గౌడ్, వైస్ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, ఉపాథిహామి ఏపీడీ కౌసల్యాదేవి, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
మళ్లీ రెండేళ్ల పీజీ డిప్లొమా
న్యూఢిల్లీ: జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను పరిష్కరించడానికి, కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పీజీ డిప్లొమాను పునరుద్ధరించింది. నీట్–పీజీ పరీక్ష పాస్ అయిన ఎంబీబీఎస్ విద్యార్థులను ఈ కోర్సుల్లో చేర్చుకుంటారు. ఈ డిప్లొమా కోర్సులు ప్రారంభించాలంటే, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) నుంచి అక్రెడిటేషన్ తీసుకొన్న, కనీసం 100 పడకలున్న ఆసుపత్రులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఆరోగ్య శాఖ కింద పనిచేసే ఎన్బీఈ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఎనిమిది ప్రధాన విభాగాల్లో రెండేళ్ల పీజీ డిప్లొమా కోర్సులను ప్రారంభించనుంది. అనస్తీషియాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఫ్యామిలీ మెడిసిన్, ఆఫ్తల్మాలజీ, రేడియో డయాగ్నసిస్, ఈఎన్టీ, టీబీ, హృద్రోగ సంబంధిత కోర్సుల్లో పీజీ డిప్లొమా ప్రవేశ పెట్టనున్నారు. 2019లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) దేశంలో బోధనా సిబ్బంది కొరతను అధిగమించడానికి ఈ డిప్లొమా కోర్సులను డిగ్రీ కోర్సులుగా మార్చింది. ఎంసీఐ ఈ కోర్సులను రద్దు చేయడంతో ఏర్పడిన లోటును పూడ్చడానికి ఆరోగ్య శాఖ ఎన్‌బీఈని వారి పరిధిలో, డిప్లొమా కోర్సులను ప్రారంభించే అవకాశా లను పరిశీలించాల్సిందిగా కోరింది. గ్రామీణ, చిన్న పట్టణాలలో ప్రజలకు వైద్యమందిస్తోన్న ఆసుపత్రులకు వైద్య సిబ్బందిని అందించే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ఎన్బీఈ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పవనేంద్ర లాల్ చెప్పారు. నీతి ఆయోగ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆరోగ్య శాఖతో వివిధ దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ పీజీ డిప్లొమా కోర్సులకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. -
ఊరు వదిలేస్తం.. ఉపాధి ఇస్తరా
సాక్షి, హైదరాబాద్ : కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) నుంచి నిర్వాసితుల తరలింపు ముందుకు సాగడం లేదు. పులులు సంచరించే అభయారణ్యంలోని ప్రధాన అటవీ ప్రాంతం (కోర్ ఏరియా)లోని గ్రామాల నుంచి స్థానికులను కదిలించే ప్రక్రియ విఘ్నాలను ఎదుర్కొంటోంది. అక్కడినుంచి ఇరవై గ్రామాలను తరలించాలని తొలుత నిర్ణయించారు.దీనిపై మెజారిటీ గ్రామాల వారు వ్యతిరేకించారు. ఆ తర్వాత పూర్తిగా అడవిలోనే ఉన్న నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని మైసంపేట, రాంపూర్ గ్రామాలను తరలించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి, ఆ ప్రక్రియను ప్రారంభించారు. అటవీశాఖ అధికారుల కృషి ఫలితంగా రెండు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ఊళ్లు ఖాళీ చేయడానికి అనుకూలంగా తీర్మానాలు చేశారు. కేంద్రం నిధుల విడుదల... కేంద్ర ప్రభుత్వ ‘ప్రాజెక్టు టైగర్’ పథకంలో భాగంగా ‘కేటీఆర్’లోని పై రెండు గ్రామాల్లోని 142 కుటుంబాల తరలింపునకు మొత్తం రూ. 14.20 కోట్లు వ్యయం కానుంది.ఇందులో కేం ద్రం 60 శాతం, రాష్ట్రం 40శాతం భరిస్తుంది. ఈనేపథ్యంలో 2018 అక్టోబర్ 22న కేంద్ర అటవీశాఖ తన వంతుగా రూ.8.52 కోట్లు విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో అటవీశాఖ ఉన్నతాధికారులు నిరాసక్తతను ప్రదర్శించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునే విషయంలోనూ చొరవ చూపకపోవడంతో ఎలాంటి పురోగతి లేకుండా నిలిచిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరి 21న జరిగిన అటవీ శాఖ సమావేశంలోనే నిర్మల్ జిల్లాలోని మైసంపేట, రాంపూర్ గ్రామస్తులను తరలించేందుకు 112 హెక్టార్ల అటవీభూమిని డీనోటిఫై చేసే ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపారు. అది పురోగతి లేకపోవడంతో మళ్లీ తాజాగా ఈనెల ఒకటిన జరిగిన రాష్ట్ర వన్యప్రాణిబోర్డు సమావేశంలోనూ డీనోటిఫై ప్రతిపాదనపై మరోసారి ఆమోదముద్ర వేయాల్సిన స్థితి ఏర్పడింది. పునరావాసం కల్పిస్తే వెళ్లిపోయేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినా తమను తరలించడం లేదని ఆ గ్రామాల్లోని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అదీగాకుండా ఇటీవల నిర్మ ల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఈనెల 3న కొత్త కలెక్టర్‌గా ముషారఫ్ అలీ ఫారూఖి వచ్చారు. జిల్లా అధికార యంత్రాంగంలో వచ్చిన మార్పు కూడా తరలింపుపై ప్రభావం పడనుంది. పునరావాసానికి రెండు ఆప్షన్లు ఈ గ్రామాల పునరావాసం కోసం...అధికారులు రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల వంతున ఒకేసారి నగదు అందజేయడం మొదటిదికాగా, విడిగా పునరావాస గ్రామాన్ని ఏర్పాటు చేసి, ఇళ్లు, భూములు ఇచ్చి, ఇతర సౌకర్యాలను కల్పించి ఇవ్వాలనేది రెండో ప్రతిపాదన, వీటిలో 48కుటుంబాలు మొదటి ఆప్షన్‌ను, 94కుటుంబాలు రెండో ఆప్షన్‌ను ఎంపికచేసుకున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండడంతో ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోగా, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పలువురు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. స్థానికంగా ఉండేవారు వెదురు తడకల అల్లికతో జీవనోపాధిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ భూములున్నా సాగునీటికి ఇబ్బందిగానే ఉంది. ఈ కారణాలతో వారు మైదాన ప్రాంతానికి వెళ్లేందుకు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చారు. ఊరును, ఇళ్లను ఇడిసిపెడతం.. మా మైసంపేట ఊరు మొత్తం అడివిలనే ఉంటది. సుట్టూ జంగలే. సాగు చేసుకుందమన్నా ఇబ్బందే. అధికారుల సూచన మేరకు మా గ్రామస్తులం పులుల కోసం ఊరిని, ఇళ్లను ఇడిసిపెట్టేందుకు సిద్ధమై నం. ఊరిని, ఇళ్లను ఇడిసిపెట్టి వస్తున్న మాకు మంచి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నం. – పెంద్రం లచ్చు, గ్రామపటేల్, మైసంపేట్ అందరం ఒప్పుకున్నం.. అటవీ అధికారులు చెప్పిన తర్వాత ఊళ్లే అందరం ఇక్కడి నుంచే పోతందుకు ఒప్పుకున్నం. సార్లు చెప్పినట్లు మేం ఉన్న ఊరిని ఇడిసిపెట్టేందుకు సిద్ధమై నం. మాకు మంచి సౌకర్యాలు కల్పించాలి. సా గు కోసం ఇబ్బంది లేకుండా చూడాలి. ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరుతున్నం. – అమృత్‌రావు, గ్రామస్తుడు, మైసంపేట్ తరలింపు కోసం ఏర్పాట్లు.. నిర్మల్‌జిల్లాలో గల కవ్వాల్ పులుల అభయారణ్యంలో నుంచి రెండు గ్రామాలను ప్రయోగాత్మకంగా తరలించి, పునరావాసం కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారు గ్రామసభ తీర్మానం ద్వారా పునరావాసానికి ఒప్పుకున్నారు. అదే మండలంలోని కొత్తమద్దిపడగ, నచ్చన్ ఎల్లాపూర్ గ్రామాల మధ్య గల అటవీశాఖకు చెందిన ప్రాంతానికి తరలించనున్నాం. పునరావాసానికి 112హెక్టార్ల భూమిని కేటాయించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, అధికారులతో డీఎల్సీ(డిస్ట్రిక్ట్ లెవల్ కో–ఆర్డినేషన్) మీటింగ్ నిర్వహించి, తదుపరి ప్రక్రియ చేపడతాం. – ఎస్పీ.సుధన్, డీఎఫ్ఓ, నిర్మల్ -
మేలోగా నిర్వాసితులకు పునరావాసం
సాక్షి, అమరావతి: గోదావరి నదిలో వరదలు ప్రారంభమయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పన.. స్పిల్ వే, స్పిల్ ఛానల్.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను సమన్వయం చేసుకుంటూ పూర్తిచేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. అప్పుడు వరద వచ్చినా స్పిల్ వే, స్పిల్ ఛానల్ మీదుగా దానిని మళ్లించి.. ప్రధాన ఆనకట్ట (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ – ఈసీఆర్ఎఫ్) పనులు నిరాటంకంగా చేయవచ్చునని.. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయవచ్చునని సూచించింది. ఇదే కాలపరిమితితో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను యథాతథంగా ఆమోదించింది. ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని తాము కేంద్రాన్ని కోరతామని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నాలను చేయాలని పీపీఏ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈఓ) చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. హైదరాబాద్‌లో గురువారం పీపీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో.. ప్రాజెక్టు యాక్షన్ ప్లాన్‌ను ఇవ్వాలని సీఈఓ కోరడంపై రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావులు స్పందిస్తూ.. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన రూ.5,500 కోట్లను కేంద్రం ఇప్పటిదాకా రీయింబర్స్ చేయకపోవడాన్ని ప్రస్తావించారు. రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేస్తున్నట్లు నవంబర్ 8న కేంద్ర జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీచేసిందని.. కానీ ఇప్పటికీ ఆ నిధులివ్వకుండా పనుల పూర్తికి యాక్షన్ ప్లాన్ అడగడం ఏమాత్రం బాగోలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని.. 2021 నాటికి పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనిపై సీఈఓ స్పందిస్తూ.. రూ.1,850 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కేంద్రానికి వి/æ్ఞప్తి చేస్తామని.. మిగతా నిధులు ఇచ్చేలా చూస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం వంతు ప్రయత్నాలు చేయాలని సూచించారు. పునరావాసం ఆధారంగా పనులు పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో నిర్వాసితులకు పునరావాసాన్ని మే లోగా పూర్తి చేయగలిగితేనే, వరద జలాలను దిగువకు పంపడానికి కాఫర్ డ్యామ్‌ల ఇరువైపులా వదిలిన ఖాళీ ప్రదేశాలను భర్తీచేయాలని పీపీఏ సీఈఓ సూచించారు. ఆ లోగా సిŠప్ల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తిచేస్తే.. వరద నీటిని వాటి మీదుగా గోదావరి నదిలోకి మళ్లించవచ్చునన్నారు. దీనిపై సహాయ, పునరావాస కమిషనర్ బాబూరావు స్పందిస్తూ.. బిల్లులు ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లించకపోవడంవల్ల పనులు నత్తనడక సాగుతున్నాయన్నారు. దేవీపట్నంలో 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే మరో వంద కుటుంబాలకు కూడా ఈ ఏడాది పునరావాసం కల్పిస్తే ముంపు సమస్య ఉండదన్నారు. ఇందుకు రూ.మూడు వేల కోట్లు అవసరం అవుతాయని.. అలాగే, ఈ నెల నుంచి ప్రతినెలా సగటున రూ.600 కోట్ల చొప్పున విడుదల చేస్తే మే నాటికి 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరాసం కల్పించే పనులు పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. దీనిపై చంద్రశేఖర్ అయ్యర్ స్పందిస్తూ.. ఆ మేరకు నిధులు విడుదలయ్యేలా చూస్తామన్నారు. ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు మాట్లాడుతూ, స్పిల్ వే, స్పిల్ ఛానల్లో డీవాటరింగ్ పనులను నెలాఖరుకు పూర్తిచేస్తామన్నారు. ప్రస్తుతం సిŠప్ల్ వేలో రోజుకు వెయ్యి క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తున్నామని.. మే నాటికి పనులు పూర్తిచేసేలా ప్రణాళిక రచించామని వివరించారు. హెడ్ వర్క్స్, కుడివైపు కరకట్ట, ఎడమ వైపు కరకట్టలను పటిష్ఠం చేసే పనులకు సంబంధించిన ఎనిమిది డిజైన్లను కేంద్ర జలసంఘం ఆమోదించాల్సి ఉందన్నారు. దీనిపై పీపీఏ సీఈఓ స్పందిస్తూ.. ఈనెల 22న పీపీఏ భేటీని మరోసారి ఏర్పాటుచేస్తామని.. ఆ భేటీలో వాటిపై చర్చించి.. నెలాఖరులోగా డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశంలో డిజైన్లు ఆమోదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీపీఏ సభ్య కార్యదర్శి బీపీ పాండే, సీఈ ఏకే దివాన్, ఎస్ఈ నాగిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
గోదారి పరుగుకు పునరావాసం అడ్డు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు మిడ్‌మానేరు దిగువకు వచ్చేందుకు పునరావాస ప్రక్రియ అడ్డుగోడగా మారింది. మిడ్‌మానేరు నుంచి కొండపోచమ్మసాగర్ వరకు గోదావరి జలాలను తరలించాలంటే నాలుగు గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉండటం, అక్కడ పునరావాస ప్రక్రియ పూర్తయితే కానీ నీళ్లు దిగువకు పారే అవకాశం లేకపోవడం జాప్యానికి కారణమవుతోంది. ఈ ప్రక్రియ అనుకున్నంత వేగంగా సాగకపోవడంతో మరో నెలరోజులైతేకానీ మిడ్‌మానేరు నుంచి నీటిని ఎత్తిపోయడం సాధ్యమయ్యేలా లేదు. సంక్రాంతి తర్వాతే దిగువకు గోదావరి కాళేశ్వరం పథకం ద్వారా ఇప్పటికే మిడ్‌మానేరు వరకు నీటిని తరలించే ప్రక్రియ పూర్తయింది. అవసరాన్ని బట్టి మోటార్లను నడుపుతూ మేడిగడ్డ నుంచి నీటిని మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. మంగళవారం సైతం మిడ్‌మానేరులోకి 9,450 క్యూసెక్కుల మేర నీరు ఎగువ ప్యాకేజీ–6, 8ల ద్వారా పంపింగ్ చేశారు. 25.87 టీఎంసీ సామర్ధ్యం ఉన్న మిడ్‌మానేరులో ఇప్పటికే 23.09 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇక్కడి నుంచి నీటిని లోయర్‌మానేరు డ్యామ్‌కు తరలిస్తున్నారు. నిజానికి మిడ్‌మానేరు నుంచి దిగువన ఉన్న కాళేశ్వరం ప్యాకేజీలు–10, 11, 12ల ద్వారా అనంతగిరి మీదుగా కొండపోచమ్మ వరకు తరలించాల్సి ఉన్నా పునరావాస ప్రక్రియ పూర్తిగాక, నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేయకపోవడంతో దిగువకు నీటి పంపింగ్ జరగడం లేదు. మిడ్‌మానేరు నుంచి నీటిని తోడే పంప్‌హౌస్‌లో 4 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఆసియాలోనే పెద్దదైన 0.2 టీఎంసీ నిల్వ సామర్ధ్యం ఉన్న ఓపెన్ సర్జ్‌పూల్‌ను సైతం నీటితో నింపి పెట్టారు. అయితే మోటార్లు నడిపి అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీళ్లు ఎత్తిపోసేందుకు మాత్రం పునరావాస ప్రక్రియ అడ్డు వస్తోంది. అనంతగిరి కింద ముంపు గ్రామంగా ఉన్న అనంతగిరి గ్రామం ఇంతవరకు ఖాళీ కాలేదు. ఇటీవలే నిర్వాసితుల పునరావాసానికి రూ.50 కోట్లు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే ఖాళీ చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాటే న్యాయపరమైన అంశాలు అడ్డుగా ఉన్నాయి. ఈ గ్రామాన్ని ఖాళీ చేసేవరకు పంపులు నడిపే ఆస్కారమే లేదు. ఈ గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు మరో నెల రోజులైనా పడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడి నుంచి నీటిని తరలించి 15 టీఎంసీల సామర్ధ్యం ఉన్న కొండపోచమ్మసాగర్‌లో నిల్వ చేయాలన్నా దీనికింద మూడు గ్రామాల పునరావాస ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడు గ్రామాల్లోని 900లకు పైగా నిర్వాసిత కుటుంబాలకు తుంకిబొళ్లారం పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం చేసిచ్చినా, వివిధ కారణాలతో నిర్వాసితులు అక్కడికి వెళ్లలేదు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన పెండింగ్ పరిహారంలో ఇటీవలే రూ.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను నిర్వాసితులకు చెల్లించే ప్రక్రియ ఇప్పుడిప్పుడే పుంజుకుంది. ఈ ప్రక్రియ పూర్తయి, నిర్వాసితులు ఖాళీ చేయాలన్నా నెల రోజులు పట్టడం ఖాయంగా ఉంది. దీంతో కొండపోచమ్మ సాగర్‌లో నీటిని నిల్వ చేయాలంటే సంక్రాంతి తర్వాత కానీ సాధ్యపడేలా లేదు. -
గజరాజులకు గూడు.!
ఎప్పుడు ఏ ప్రాంతానికొచ్చేస్తాయో... ఎవరి పంటలు నాశనం చేసేస్తాయో తెలియదు. ఒక రోజు... ఒక పక్షం... ఒక నెల కాదు... ఏడాదిగా అను నిత్యం అనుభవిస్తున్న నరక యాతన. కురుపాం నియోజకవర్గ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల బెడద నుంచి ఇక ఉపశమనం కలగనుంది. ఎట్టకేలకు వాటికి పునరావాసం కల్పించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే పార్వతీపురం మండలం డోకిశిలలో 526 హెక్టార్ల భూమిని పరిశీలించారు. అక్కడ వాటికోసం సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సంచరిస్తున్న పది ఏనుగులకు అక్కడ నివాసం కల్పించనున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా సరిహద్దుల్లో సంచరిస్తున్న ఆరు ఏనుగులతో పాటు, శ్రీకాకుళం అడవుల్లో నివాసం ఏర్పరచుకున్న నాలుగు ఏనుగులకు ఇకపై విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మండలం డోకశిల ప్రాంతంలో గూడు లభించనుంది. జిల్లాలో కొన్నేళ్లుగా ఏనుగులు సంచరిస్తూ పంటలు నాశనం చేయడమే కాకుండా మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటివరకూ ఏనుగులు ముగ్గురిని బలిగొన్నాయి. నాలుగు నెలల్లో ఇద్దరిని గాయపరిచాయి. వందలాది ఎకరాల్లో పంటలు నాశనం చేస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన జిల్లాలో ప్రవేశించిన ఏనుగులు అదే ఏడాది ఒకరిని, ఈ ఏడాది జనవరిలో మరొకరిని బలిగొన్నాయి. శ్రీకాకుళం జిల్లా, ఒడిశా ప్రాంతాల నుంచి ఏనుగులు విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం, సాలూరు గిరిజన ప్రాంతా ల్లోకి ప్రవేశిస్తున్నాయి. గిరిజనులు కొండ చరియల ప్రాంతంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి పంటలను సాగుచేస్తున్నారు. జిల్లాలోని కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో అంకుళవలస, సుందరావువలస, కుమ్మరిగుంట, ఆర్తాం, సోమినాయుడు వలస, గుణానవలస, కుండతిరువాడ, నీచుకవలస, ఆర్నాడ గ్రామాల్లో పంటల్ని ఈ ఏనుగులు తీవ్రంగా నష్టపరిచాయి. 1368 ఎకరాల్లో వరి, చెరకు, అరటి, టమాట పంటలు వీటి దాడిలో దెబ్బతిన్నాయి. 1138 మంది రైతులు ఏనుగుల సంచారం వల్ల రూ.89.50 లక్షల విలువైన పంటలు నష్టపోయారు. తొమ్మిదేళ్ల క్రితం కూడా బీభత్సం.. పార్వతీపురం మండలంలోని ఎర్రసామంతవలస, పిట్టలవలస, ప్రాంతాల్లో 2016లో ఏనుగులు సంచరించాయి. 2007 సంవత్సరంలో కూడా ఏనుగులు జిల్లాలో ప్రవేశించి ఆస్తి, ప్రాణనష్టం కలిగించాయి. అప్పట్లో జియ్యమ్మవలస మండలానికి చెందిన ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాయి. అప్పట్లో ఒక ఏనుగును చంపేశారు. ఏడాదిగా అనేక మందిని గాయపరిచాయి. ప్రస్తుతం గరుగుబిల్లి మండలంలో తిష్టవేశాయి. ఒడిశా సరిహద్దువైపు వెళుతున్నాయి. ఏనుగుల సంచారంతో విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా, ఒడిశా రాష్ట్ర ప్రజలు కూడా భయాందోళనలో బతుకుతున్నారు. గతంలో ఏనుగులు విరుచుకుపడినప్పుడు ఆపరేషన్ జయంతి, అపరేషన్ గజ పేరున రెండు ఏనుగులను రప్పించారు. నాలుగు ఏనుగులను లారీలపై ఎక్కించి ఒడిశా రాష్ట్రంలోని లఖేరీ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు యత్నించిన క్రమంలో ఓ ఏనుగు మరణించడంతో జంతుసంరక్షణ కమిటీ అభ్యంతరం తెలిపింది. దాంతో ఆ ఆపరేషన్ ఆగిపోయింది. తరువాత ఈ ప్రాంతానికి వచ్చిన గుంపులో ఓ గున్న ఏనుగు గతేడాది విద్యుదాఘాతంతో మృత్యువాతపడగా... ఈ ఏడాది జనవరిలో గుంపు నుంచి తప్పిపోయిన ఒక ఏనుగు నాగావళి నదిలో శవమై తేలింది. ఎలిఫెంట్ జోన్‌కు గిరిజనుల వ్యతిరేకం.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలిఫెంట్ జోన్లు ఏర్పాటుచేసి ఏనుగులకు అవసరమైన ఆహారం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలనే ప్రతిపాదనలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే అడవినే నమ్ముకుని బతుకుతున్న గిరి జనులు ఈ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గిరిజనుల భయాం దోళనలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతిపదికన ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేసే అంశాన్ని పక్కనపెట్టి ఏనుగుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించా రు. సాలూరు అటవీ రేంజ్ పరిధిలోని డోకశిల ప్రాంతాన్ని దీనికోసం ఎంపిక చేశారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్య అటవీ సంరక్షణ అధికారి నళినీమోహన్ సోమవారం విజయనగరం జిల్లాకు వస్తున్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విజయనగరంలో జిల్లా అటవీ శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన డోకశిల ప్రాంతానికి వెళతారు. పునరావాసంతో తీరనున్న బెడద.. ఎన్ని ప్రయత్నాలు చేసినా జిల్లాలో ఏడాదిగా ఏనుగుల బెడద తొలగడం లేదు. రోజూ 40 మంది ఎలిఫెంట్ ట్రాకర్లు శ్రమిస్తుండటం వల్ల ప్రాణ నష్టం లేకుండా చేయగలుగుతున్నాం. ఈ నేపథ్యంలో డోకశిల ప్రాంతంలో ఏనుగుల పునరావాస కేంద్రాన్ని 1315 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రాంతం చుట్టూ ఏనుగుల సంచారానికి, నివాసానికి అనుకూల పరిస్థితులు కల్పిస్తాం. అలాగే అవి బయటకు రాకుండా తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తాం. ఇద్దరు వెటర్నరీ డాక్టర్లను నియమిస్తాం. గడ్డి విత్తనాలు జల్లి గడ్డి మొలిపిం చడంతో పాటు నీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతాం. దీనివల్ల స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగదు. – గంపా లక్ష్మణ్, డీఎఫ్ఓ (టెరిటోరియల్), విజయనగరం. -
370 రద్దుపై ఎన్సీ సవాల్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ఉన్న రాజ్యాంగబద్ధ హోదాను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయా న్ని సవాల్ చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పౌరుల సమ్మతి లేకుండానే వారి హక్కులను కేంద్రం లాగేసుకుందని పేర్కొంది. జమ్మూకశ్మీర్ పునర్వ్య వస్థీకరణకు సంబంధించిన చట్టం అమలు కాకుండా చూడాలని ఎన్సీకి చెందిన ఎంపీలు మహమ్మద్ అక్బర్ లోనె, హస్నైన్ మసూదీ తమ పిటిషన్లో పేర్కొన్నారు. ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ శాశ్వతమైంది. కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2019, రాష్ట్రపతి ఉత్తర్వుల ఫలితంగా ఆర్టికల్ 370, 35ఏ రద్దయ్యాయి. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభ జించి ప్రజల హక్కులను కాలరాశారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు రాజ్యాంగవిరుద్ధం. భారత సమాఖ్య వ్య వస్థ, ప్రజాస్వామ్యం, చట్ట పాలనకు సంరక్షకుడిగా ఉన్న సుప్రీంకోర్టు ఈ విషయమై స్పందించాలి. ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాలను అమలు కాకుండా రద్దు చేయాలి’ అని కోరారు. మీడియాపై ఆంక్షలను ఎత్తివేయాలి జమ్మూకశ్మీర్‌లో మీడియాపై కొనసాగుతున్న ఆం క్షలను ఎత్తివేయాలంటూ కశ్మీర్ టైమ్స్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 4వ తేదీ నుంచి కొనసాగుతున్న నియంత్రణల కారణంగా కశ్మీర్‌తో పాటు జమ్మూలోని కొన్ని జిల్లాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయన్నారు. -
పుకార్లు నమ్మొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది!
సాక్షి, తూర్పుగోదావరి: దేవీపట్నం వరద బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలించామని.. ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఆయన ఆదివారం జిల్లాలోని మండపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు వరదలపై ఎటువంటి భయాందోళనకు గురికావద్దని పేర్కొన్నారు. ఎటువంటి పుకార్లు నమ్మవద్దని.. వరద ప్రభావిత ప్రాంతాలకు సరుకులు, బియ్యం, పప్పులు, కిరోసన్, మెడిసిన్ అందజేస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు.. రెవెన్యూ, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా పోలవరం డ్యాం దగ్గర ఇరవై ఆరు మీటర్ల వరకు వరద నీరు ఉందని వెల్లడించారు. దీంతో రేపటివరకు వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఐదువేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. దీంతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
పునరావాసం.. ప్రజల సమ్మతం
సాక్షి, నిర్మల్: కవ్వాల్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు గ్రామాలను మరోచోటుకు తరలించడానికిగాను జిల్లా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామా లను అదే మండలంలోని ధర్మాజిపేట్ గ్రామ సమీపంలో గుర్తించిన అటవీ భూమిలో ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించడానికిగాను చర్యలను వేగవంతం చేశారు. ఈ మేరకు ఆ రెండు గ్రామాలను మరోచోటకు తరలించడానికి ఇప్పటికే గ్రామస్తులు సమ్మతించడంతో ధర్మాజిపేట్ సమీపంలో ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ గ్రామ ప్రాంతంలో వివిధ శాఖల అధికారులు శుక్రవారం ప్రత్యామ్నాయ గ్రామ పున:స్థాపన చేసే ప్రాంతంలో పర్యటించనున్నారు. గ్రామం ఏర్పాటుకు ప్రణాళికలు ప్రస్తుతం ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న రాంపూర్, మైసంపేట్ గ్రామాలను ధర్మాజిపేట్ గ్రామ శివారు ప్రాంతంలోని 112 హెక్టార్ల అటవీ ప్రాంతంలో పున:స్థాపన చేయనున్నారు. ఈ మేర కు గ్రామం ఏర్పాటుకు కావాల్సిన పూర్తిస్థాయి సౌకర్యాలను కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఇళ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌక ర్యం సామాజిక భవనాలు, పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రా ర్థన మందిరాలు, సీసీ రోడ్ల ఏర్పాటు, డ్రెయినేజీ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికిగాను ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించి ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. 142 కుటుంబాల తరలింపు రెండు గ్రామాల నుంచి మొత్తం 142 కుటుంబాలను ధర్మాజిపేట్ సమీపంలో ఏర్పాటు చేయను న్న పునరావాస గ్రామానికి తరలించనున్నారు. అయితే ఈ గ్రామంలో పూర్తిగా నివాసం, వ్యవసాయ భూమి, మౌలిక వసతుల కల్పన కోరుతూ 94 కుటుంబాలు అంగీకరించాయి. మరో 48 కుటుంబాలు మాత్రం తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాయి. ఇందుకుగాను నష్ట పరిహారం కోరిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు. 94 కుటుంబాలకు మాత్రం 250 చదరపు గజాల డబుల్ బెడ్ రూం, వ్యవసాయ భూమితో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ అంగీకరించారు. వీరికి కడెం మండలంలోని ధర్మాజిపేట్ గ్రామ సమీపంలో 112 హెక్టార్ల భూమిని గుర్తించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ. 8 కోట్ల 52 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 5కోట్ల 64 లక్షలు మంజూరయ్యాయి. అధికారులు ప్రణాళికలు రూపొందించి పునరావాస గ్రామం ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. పునరావాస గ్రామ ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా చేయాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు అవసమైన చర్యలను తీసుకోనున్నారు. -
పునరావాస పోరాటంలో.. ఓటుకు నోటు వద్దు
దేశం కోసం సర్వం వదులుకున్నారు. ఉన్న ఇంటిని, తిండి పెట్టే భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పిస్తానన్న ప్రభుత్వ హామీని నమ్మారు. వంద కిలోమీటర్లకు దూరంగా వచ్చేశారు. అన్నం ముద్దకోసం, గుక్కెడు నీటికోసం అలమటించారు. ప్రభుత్వం పునరావాసానికి ఇచ్చిన జీఓ 1024 అమలు కోసం 49 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. వదిలివచ్చిన నివాసాలు, భూముల్లో షార్ ఏర్పాటై దేశం గర్వించేస్థాయిలో ఓ వైపు ఆనందంపడుతూనే తమ జీవితాలు బాగుపడలేదని దుఃఖిస్తున్నారు. ఓటుకు నోటును తిరస్కరిస్తూ ప్రతి ఎన్నికల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సారి కూడా ఓటుకు నోటును తిరస్కరించారు. తమ సమస్యను పరిష్కరించిన వారికే పట్టం కడుతామంటున్నారు శ్రీపురంధరపురం గ్రామస్తులు. బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలోని శ్రీహరికోట పరిసరప్రాంతాల్లోని భూమధ్యరేఖ వద్ద ప్రభుత్వం షార్‌ను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దాని పరిధిలోని భూములను సేకరించాలని భావించింది. ఈ క్రమంలో అక్కడి వారి భూములను, నివాస స్థలాలను ఇవ్వాలని కోరింది. అందుకు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వారికి పునరావాసం ఇస్తానని ప్రకటించింది. పునరావాసంపై 1024 పేరిట జీఓ విడుదల శ్రీహరికోట ప్రాంతంలో నివాసాలు, భూములను ఇచ్చిన వారికి ప్రత్యామ్నాయంగా పునరావాసం, వసతులు కల్పిస్తామని 1970వ సంవత్సరం నవంబరు రెండో తేదీన జీఓ 1024ను విడుదల చేసింది. జిల్లాలోని తాండూరు, రేగడిచెలిక, నెలబల్లి, నెమలిమిట్ట ప్రాంతాల్లో పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకుంది. అక్కడి నుంచి రవాణా చేసేందుకు ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో నివాసాలకు ఐదు సెంట్ల స్థలం కేటాయిస్తానని తెలిపింది. సేకరించిన భూముల ప్రకారం డ్రైల్యాండ్ అయితే ఐదు ఎకరాలు, వెట్ ల్యాండ్ అయితే రెండు ఎకరాలు ఇస్తానని తెలిపింది. దీంతో పాటుగా ఆయా ప్రాంతాల్లోని భూమిని వారికే తాగునీటి వసతి, దేవాలయాలు, పాఠశాలలు, శ్మశాన భూమి, పశువులకు ఆవాసం తదితరాలకు ఉపయోగిస్తామని పేర్కొంది. శ్రీపురంధరపురంలో జీఓ1024 అమలుపై పోరాటం పునరావాసంలో భాగంగా శ్రీహరికోట నుంచి శ్రీపురంధరపురానికి 200 కుటుంబాలు వచ్చాయి. వీరికి తొలినుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీపురంధరపురం ప్రాంతం తొలుత పూర్తిగా అటవీప్రాంతం. ఫారెస్ట్ భూములను ప్రభుత్వం డీ–ఫారెస్ట్‌గా మార్చి పునరావాసులకు అందించింది. అయితే జీఓలో పేర్కొన్న విధంగా ఐదు ఎకరాల మెట్ట భూమిని ప్రజలకు ఇవ్వలేదు. నేటికీ ఎకరా భూమి ఇంకా పునరావాసులకు ఇవ్వాల్సి ఉంది. దీంతో పాటుగా దాదాపు వేయి పశువులు పైగా ఉన్న ఈ ప్రాంతంలో ఆవాసం లేకుండా పోయింది. శ్మశాన భూమి కరువైంది. తాగునీటి వసతి నామ మాత్రంగా మారింది. దీంతో పాటుగా గ్రామంలోని భూమిని బయటప్రాంతాల వారు ఆక్రమించుకున్నారు. వారిపై పాస్‌పుస్తకాలు పొందారు. పునరావాస గ్రామంలో బయటప్రాంతాల వారి ఆక్రమణపై అక్కడి ప్రజలు పోరాడినా రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారం ఆక్రమణదారులకు ఉండడంతో పలు ఇబ్బందులు తప్పలేదు. ఓటుకు నోటు వద్దు శ్రీపురంధరపురంలో శాసనసభ ఎన్నికల సమయంలో గ్రామంలోని అందరూ ఒకేమాటపై ఉంటారు. ఓటుకు నోటు వద్దని మూకుమ్మడిగా చెబుతారు. ప్రభుత్వ విడుదల చేసిన జీఓను అమలు చేయాలని కోరుతారు. ఇందులో భాగంగా 2012 ఉప ఎన్నికలను సైతం అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. ఎన్నికలు తమకు వద్దని బాయ్‌కాట్ చేశారు. చివరకు రెవెన్యూ అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కూడా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ హామీని అమలుచేయలేదు. అందుకే ఈ సారి కూడా అక్కడి ప్రజలు తమ సమస్యను పరిష్కరించిన వారికే మద్దతిస్తామని చెబుతున్నారు. దేశం కోసం అన్నీ వదులుకుని వచ్చాం దేశం కోసం అన్నీ వదులుకుని శ్రీపురంధరపురం వచ్చాం. ఎన్నో కష్టాలు పడ్డాం. పునరావాసం కింద ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాలేదు. – బిడ్డారెడ్డి జర్రారెడ్డి, శ్రీపురంధరపురం ఎకరా భూమిని కేటాయించాలి పునరావాసం కింద ఇవ్వాల్సిన మిగతా ఎకరా భూమి కేటాయించాలి. ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాం. అయినా పట్టించుకోలేదు. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. మాకు న్యాయం చేసిన వారికే ఈ సారి ఎన్నికల్లో మద్దతు ఇస్తాం. – కాను బోగిశయనరెడ్డి, శ్రీపురంధరపురం -
తండ్రి ఎస్టీ.. కొడుకు బీసీ!
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: వేలేరుపాడు మండలం వసంవవాడకు చెందిన శాఖమూరి సుభాష్ అనే వ్యక్తి త నను పునరావాస కాలనీ నిర్మాణం ఎంపిక జాబితాలో ఎస్టీగా నమోదు చేసి బుట్టాయగూడెం మండలంలో ఇల్లు ఇచ్చారని, తన కుమారుడు సాయికృష్ణను బీసీగా నమోదు చేసి జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో ఇల్లు కేటాయిం చారని పొరపాటుగా పడిన పేర్లు వల్ల తన కుటుంబం రెండుగా మారిందని బుధవారం ఐటీడీఏ వద్ద జరిగిన గిరిజన దర్బారులో పీఓ ఎంఎన్ హరేంధిరప్రసాద్‌కు వినతిపత్రం అందించి గోడు వెళ్లబోసుకున్నాడు. పొరపాటుగా పడిన పేర్లను సరిచేసి న్యాయం చేయాలని వేడుకున్నాడు. పోలవరం బీసీ కాలనీ పక్కన డంపింగ్ చేస్తున్నారని, 15 మీటర్లు మాత్రమే డంపింగ్ చేయాలని నిబంధన ఉన్నా 200 మీటర్ల ఎత్తు వేశారని పోలవరానికి చెందిన వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి షేక్ ఫాతిమున్నీసా, పార్టీ జిల్లా నాయకులు సీహెచ్ రత్నప్రసాద్ పీఓకు ఫిర్యాదు చేశారు. దీని వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. నాన్‌లోకల్‌గా చూపిస్తోంది నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు సత్తుపల్లిలో డిగ్రీ వరకూ చదువుకున్నాను. రాష్ట్రం విడిపోయాక వేలేరుపాడు మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు. మాది వేలేరుపాడు మండలం చెరువుగొల్లగూడెం. ప్రస్తుతం నేను ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే నాన్‌లోకల్‌గా చూపిస్తుంది. మెరిట్‌లిస్ట్‌లో నా పేరు ఆరవది. నన్ను లోకల్‌గా పరిగణిస్తే ఎస్టీ మహిళగా నాకు ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. అధికారులు ఆ దిశగా నాకు న్యాయం చేయాలి.– ఉయికే మంగ, చెరువుగొల్లగూడెం, వేలేరుపాడు మండలం ఉద్యోగం కోసం.. ఏఎన్ఎం పోస్టుకు ఎంపికైనట్లు జిల్లా కార్యాలయం నుంచి ఉత్తర్వులు వ చ్చాయి. అయితే ఐటీడీఏ నుంచి ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. తాను స్టాఫ్‌నర్స్‌గా ఎంపికైనట్టు జిల్లా నుంచి వచ్చిన ఆర్డర్స్ ఉన్నా ఐటీడీఏ అధికారులు సరైన వివరణ ఇవ్వడం లేదు. నా పోస్ట్ విషయమై అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – పూసం చింతామణి,బూసరాజుపల్లి, బుట్టాయగూడెం మండలం వినతులు ఇలా.. ♦ ముంపు మండలాలను ఖాళీ చేస్తామంటున్న అధికారులు ముందుగా బిల్లులు చెల్లించాలని పలువురు గిరిజనులు పీఓను కోరారు. ♦ కొయిదా గ్రామానికి చెందిన ముచ్చిక రమేష్ పీహెచ్సీలో అటెండర్‌గా ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ♦ శాఖమూరి వంశీకృష్ణ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం వినతిపత్రం సమర్పించారు. ♦ కుక్కునూరుకు చెందిన సనిపల్లి వేణుబాబు ఆర్ అండ్ ఆర్‌లో భూమి వివరాలు నమోదు చేసి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ వినతిపత్రాన్ని ఇచ్చారు. ♦ జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురానికి చెందిన గుర్రాల వెంకటేశ్వరరావు భూమికి పరిహారం ఇవ్వకుండా నిలుపుదల చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ♦ కుక్కునూరు మండలం వెంకటాపురానికి చెందిన రేగలగడ్డ చిన్న వెంకటేశ్వర్లు నష్టపరిహారం కోసం దరఖాస్తు సమర్పించారు. ♦ వీరితోపాటు సుమారు 70 దరఖాస్తులను వివిధ సమస్యలపై వినతి పత్రాలను గిరిజనులు పీఓకు సమర్పించారు. -
మన్యం.. దైన్యం
సీతంపేట: తిత్లీ ధాటికి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. నాయకులు, అధికారుల హడావుడంతా ఆ గ్రామాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అదే స్థాయిలో నష్టపోయిన మన్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. మైదాన ప్రాంతాల మాదిరిగానే సీతంపేట మన్యంలో భారీ నష్టం సంభవించింది. సుమారు 1500 ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటిలో ఐదు వందల ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఇళ్లు, పంటలు, వివిధ రకాల ఆస్తినష్టం సంభవించి గిరిజనులు నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు విద్యుత్ పునరుద్ధరణ పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ ఆపత్కాలంలో సాయపడాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. కనీసం రేషన్ బియ్యం కూడా పంపిణీ చేయడం లేదని వాపోతున్నారు. 3 వేల ఎకరాల్లో జీడి తోటలు నాశనమయ్యాయి. మిశ్రమ తోటల పెంపకంలో భాగంగా పసుపును అంతర పంటగా వేయగా దానికి కూడా నష్టం వాటిల్లింది. అలాగే మామిడి, బొప్పాయి వంటి పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగింది. 500 ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో ఫైనాపిల్, 300 ఎకరాల్లో అరటి, 200 ఎకరాల్లో కొండచీపర్లు, 200 ఎకరాల్లో కందికి నష్టం వాటిల్లింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సాయం అందాలంటే ఎకరాకు కనీసం 70 మొక్కలు ఉండి వీటిలో 35కుపైగా మొక్కలకు నష్టం వాటిల్లాలి. అది కూడా వేళ్లతో సహా పడిపోతేనే పరిహారం ఇస్తారు. 35 లోపు మొక్కలు పడిపోతే ఎలాంటి పరిహారం రాదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపును అంతర పంటగా సాగుచేస్తున్నందున దానికి కూడా పరిహారం రాదని చెప్పారని వాపోతున్నారు. కొండచీపుర్లకు కూడా పరిహారం అనుమానమేనని అంటున్నారు. తుపాన్ తర్వాత గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరిగిన దాఖలాలు లేవు. సీతంపేట ఏజెన్సీలో 450 గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో 400లకు పైగా గ్రామాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. అలాగే గ్రామాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. నెట్వర్క్ ఎక్కడా లేదు. అత్యవసర సమయాల్లో 108కి ఫోన్ చేయాలంటే కాల్ కలవక ఇబ్బందులు తప్పడం లేదు. గిరిజన ప్రాంతాల పట్ల వివక్ష..గిరిజన ప్రాంతాల పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. ఇక్కడ ఎక్కువ నష్టం జరిగితే ఒక్క ఉన్నతాధికారి కూడా వచ్చి చూసిన పాపాన పోలేదు. ఎలాంటి సౌకర్యాల కల్పనా లేదు. విద్యుత్ లేక గిరిజనులు అల్లాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. - విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే తుపాన్ ప్రభావిత మండలంగా సీతంపేటను గుర్తించాలి. అనేక గ్రామాల్లో గిరిజన సంఘం బృందం పర్యటించి 70 శాతం మంది గిరిజనులు నష్టపోయినట్లు గుర్తించింది. ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణం. గిరిజన మంత్రి నక్కా ఆనందబాబు ఇటీవల రోడ్‌షో మాదిరిగా వచ్చివెళ్లారు. ఆయన పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదు. సర్వే నిర్వహించి గిరిజనులకు పరిహారం అందివ్వాలి. – పి.సాంబయ్య, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి జీడితోటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. మా గ్రామంలో సర్వే కూడా జరగలేదు. దీంతో అనేక అవస్థలు పడుతున్నాం. – బి.తోటయ్య, చిన్నబగ్గ -
నాటి సహాయక చర్యలు నేటికి స్ఫూర్తి
సాక్షి, న్యూఢిల్లీ : ‘గాడ్స్ ఓన్ కంట్రీ... ఏ ల్యాండ్ ఆఫ్ బ్యూటీ.. ఏ ల్యాండ్ ఆఫ్ ప్లెంటీ... ఏ ల్యాండ్ ఆఫ్ పీస్’గా ప్రసిద్ధి కెక్కిన కేరళలో జల ప్రళయం సంభవించడం ఇదే మొదటి సారి కాదు. అనేక సార్లు కేరళలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా 1924, 1999లో వచ్చిన వరదలు అపార ప్రాణ, ఆస్తి నష్టాలను కలిగించాయని చరిత్ర పుటలు తెలియజేస్తున్నాయి. ‘వాటర్! వాటర్ ఎవ్రీవేర్’ అన్న వ్యాఖ్యంతో ప్రముఖ మలయాళ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత థకాజి శివశంకరన్ పిల్లై నవల ‘ఇన్ ది వాటర్’ మొదలవుతుంది. ‘టావన్కోర్లో అది అతిఎత్తైన దేవాలయం. దాని శిఖరంపై 67 మంది పిల్లలు, 350 మంది పెద్దలు, గొర్రెలు, మేకలు, పెంపుడు జంతువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని వారాలుగా భారీ వర్షాలు కురవడంతో వందలాది మానవులు, వేలాది జంతువుల ప్రాణాలు నీటిలో కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లూ, జీవనాధార పంటలు నీటి పాలయ్యాయి. నీటిలో గర్భవతులు, పిల్లల నరక యాతన వర్ణనాతీతం’ అని 1924లో సంభవించిన వరదల గురించి థకాజి తన పుస్తకంలో వర్ణించారు. ఆయన అలప్పూజ జిల్లాలోని థకాజి గ్రామంలో జన్మించడంతో ఆయన ఊరిపేరుతోనే ఆయన్ని పిలిచేవారు. 1924లో జూలై నెలలో వరదలు వచ్చాయి. వరదల కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు ఆగస్టు మొదటి వారంలో అనేక ప్రాంతాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. అలా అంబాలపూజలో 4,000 మందికి, అలెప్పి శిబిరంలో 3,000 మందికి, కొట్టాయంలో 5,000 మందికి, ఛంగనస్సరీలో 3,000 మందికి, పరూర్‌లో 8,000 మందికి ఆశ్రయం కల్పించారు. ఇవే కాకుండా ఇంకా అనేక చోట్ల నాడు ఆశ్రయం కల్పించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ‘మన్నార్ ఫ్లడ్ రిలీఫ్ డిప్యూటేషన్’ నివేదిక ప్రకారం నాడు వరదల వల్ల ఒక్క మధ్య ట్రావన్‌కోర్ ప్రాంతంలోనే 500 ఇళ్లు, 200 కొబ్బరి తోటలు, వెయ్యి ఎకరాల భూమి, 6,40,000 కిలోల ధాన్యం నీటి పాలయ్యాయి. నాడు బ్రిటీష్ మద్రాస్ పాలకులు వరద సహాయక చర్యల కోసం నిపుణుడైన టి. రాఘవయ్యను నియమించారు. ఆయన ఆధ్వర్యంలో సహాయక కమిటీ ఏర్పాటై నిరంతరగా పనిచేసింది. అప్పటి ట్రావన్‌కోర్ పాలకుడు మహారాజ మూలమ్ తిరునాల్ ఆ ఏడాదికి ప్రజల పన్నులన్నింటిని రద్దు చేశారు. వ్యవసాయ రుణాల కోసం నాలుగు లక్షల రూపాయలను కేటాయించారు. ఈ దిశలో ఆయన కన్నుమూశారు. అప్పట్లో కూడా మూడు రోజులపాటు సంతాప దినాలు పాటించాలి. ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించరాదు. అయితే ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన సేతు లక్ష్మీ భాయ్ సహాయక చర్యలను అధికారికంగా అనుమతించారు. ఎప్పటికప్పుడు రాఘవయ్యతో పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకున్నారు. రైతుల వ్యవసాయ రుణాల బడ్జెట్‌ను నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదున్నర లక్షల రూపాయలకు పెంచారు. పేదల ఇళ్ల పునర్నిర్మాణం కోసం అడవిలోని వెదురు చెట్లను ఉచితంగా కొట్టుకొని తెచ్చుకునే హక్కును కల్పించారు. పదివేల మంది రైతులకు ఐదు వందల రూపాయల చొప్పున నాడు రుణాలు అందజేశారు. రైతుల ఆర్థిక పరిస్థితిని బట్టి వడ్డీ రేటును 6.25 శాతం నుంచి ఆరుకు, అంతకన్నా తక్కువకు తగ్గించారు. కొన్ని లక్షల రూపాయలతో రోడ్లు, మంచినీటి సౌకర్యాలను పునరుద్ధరించారు. అప్పుడు ప్రజలు తమ సొంత ఊళ్లకు తరలి వచ్చారు. అప్పటి వరకు తన పట్టాభిషేక ఉత్సవాన్ని వాయిదా వేసుకున్న రాణి లక్ష్మీ భాయ్ ఆ తర్వాత ఉత్సవాన్ని అధికారికంగా జరుపుకున్నారు. మను ఎస్ పిళ్లై రాసిన ‘ది ఐవరీ త్రోన్: క్రానికల్స్ ఆఫ్ ది హౌజ్ ఆఫ్ ట్రావెన్కోర్’ పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి. నేటి పాలకులకు స్ఫూర్తి కోసం నాటి వివరాలు. సంబంధిత కథనాలు: పునరావాసమే సవాల్! ఎందుకు ఎయిర్ పోర్టుల్లోకి వరదలు? సామాన్యులే రియల్ హీరోలు మనిషి పుడతాడు కష్టంలో కేరళలో ఎందుకీ వరదలు? -
పునరావాసం తర్వాతే భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ వల్ల నష్టపోయే రైతు కూలీలు, చేతివృత్తులవారికి నూతన భూసేకరణ చట్టం–2013 ప్రకారం ఉపాధి, పునరావా సం కల్పించాకే సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కృష్ణాపూర్, వేములఘాట్‌ల్లో భూసేకరణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. జీవో 123 ప్రకారం మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన భూముల్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అయితే వాటిపై ఆధారపడినవారికి పునరావాసం కల్పించలేదని గతంలో దాఖలైన రెండు వేర్వేరు వ్యాజ్యాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచందర్‌రావు బుధవారం మధ్యంతర ఆదేశాలిచ్చారు. ఏటిగడ్డ కృష్ణాపూర్ గ్రామ రైతు కూలీలు 93 మంది, వేములఘాట్ గ్రామంలోని 20 మంది రైతు కూలీలు వేసిన వ్యాజ్యాల్లో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
గూడు.. గోడు ఓ బస్సు
ఇంట్లో బట్టలు కుట్టుకోవాల్సిన కుట్టు మెషిన్‌ను బస్సెక్కించారు. ఉన్న చోటును వదల్లేక కన్నీటి పర్యంతమవుతూ కదిలిపోతున్నారు. వీరెవరో కాదు...మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వలస కూలీలు. వారంరోజుల క్రితం ఇక్కడ అగ్నిప్రమాదం జరిగి 100 గుడిసెలు కాలిపోయిన నేపథ్యంలో అధికారులు మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా రంగప్రవేశం చేశారు. వారం రోజులుగా ఆ ప్రాంతంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న గుడిసె వాసులను ఖాళీ చేయించి.. బలవంతంగా అక్కడి నుంచి కేశవనగర్కుతరలించారు. తమను వేరే చోటికి తరలించడం తగదని వేడుకున్నారు. అయినా తప్పనిసరిపరిస్థితిలో వారిని సామాన్లతో సహా బస్సుల్లోకి ఎక్కించారు. అప్పుడే తెల్లవారుతోంది.. హైటెక్‌సిటీ సమీపంలో అలజడి.. జీహెచ్ఎంసీ సిబ్బంది.. పోలీసులు చుట్టుముట్టారు.. వలస కూలీల గుడిసెలు నేలకూల్చారు.. బాధితులను ఖాళీ చేయించారు. పునరావా సం కల్పించేందుకు కేశవనగర్, అమీన్‌పూర్‌కు తరలించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా గుడిసెలు కూల్చివేయడంపై కూలీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.. చెల్లా చెదురైపోయారు.. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.. మాదాపూర్: హైటెక్‌సిటీ సమీపం పత్రికా నగర్‌లోని ప్రభుత్వ స్థలంలో వలస కూలీలు నివాసం ఉంటున్నారు. ఇక్కడ వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడంతో దాదాపు వందకుపైగా గుడిసెలు కాలిపోయి కూలీలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఒకవైపు కట్టుకున్న గుడిసెలు కాలిబూడిదై బాధలో ఉండి తాత్కాలికంగా వేసుకున్న గుడిసెల్లోనే కాపురాన్ని ప్రారంభించిన వలస కూలీలు తెల్లవారుజాము నిద్ర నుంచి లేవకముందే గుడిసెల ముందు పోలీసులు, అధికారులను చూసి కలవరపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసు కునే సరికి వారందరినీ ఖాళీ చేయిం చారు. బస్సులు, ఆటోల్లో కేశవనగర్, అమీన్‌పూర్‌కు తరలించారు. కొంత మంది తమ వస్తువులను నెత్తిన పెట్టుకొని, చిన్న చిన్న ఆటోలలో వస్తు సామాగ్రిని వేసుకొని బాధితులు వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా గుడిసెల చుట్టూ పోలీసులను మోహరించి బలవంతంగా తరలించారని బాధి తులు వాపోయారు. బిక్కు.. బిక్కు మంటూ తమ వస్తువులను చేతపట్టుకొని వాహనాల్లో ఎక్కి కూర్చోవడం అందరినీ కలిచివేసింది. జేసీ బీలతో గుడిసెలను నేలమట్టం చేశారు. 212 కుటుంబాలకు పునరావాసం.. మాదాపూర్ అగ్ని ప్రమాద బాధితుల్లో 212 కుటుంబాలకు పునరావాసం కల్పించామని జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మమత తెలిపారు. 148 కుటుంబాలకు కేశవనగర్‌లోని ట్రాన్సిట్ గృహాల్లో, మరో 64 కుటుంబాలకు అమీన్పూర్లో ప్రభుత్వ గృహాల్లో పునరావాసం కల్పించామని చెప్పారు. మాదాపూర్‌లోని పత్రికానగర్ నుంచి ప్రత్యేక వాహనాల్లో బాధిత కుటుంబాలను కేశవనగర్, అమీన్పూర్లకు తరలించామన్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని డీసీ పేర్కొన్నారు. -
మధ్యవర్తి బెదిరించాడా?
నవాబుపేట: గుడుంబా పునరావాసం కల్పనలో ఏమైనా అక్రమాలు జరిగాయా.. అంటూ ఎక్సైజ్ అధికారులు లబ్ధిదారుడితో ఆరా తీశారు. గుడుంబా తయారీ, అమ్మకం మానేసిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తున్న విషయం విదితమే. అయితే.. ఎక్సైజ్ అధికారులు ఆ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై ‘సాక్షి’ మెయిన్‌లో శనివారం ‘గుడుంబా సొమ్ము గుటుక్కు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన ప్రభాకర్ వాదన వచ్చింది. స్పందించిన ఎక్సైజ్ అధికారులు శనివారం ఉదయమే రంగంలోకి దిగారు. ప్రభాకర్‌కు అందిన ఆవులను ఎక్సైజ్ శాఖ మహబూబ్‌నగర్ రూరల్ ఎస్ఐ రామకృష్ణ పరిశీలించారు. ఆవుల కొనుగోలు సమయంలో మధ్యవర్తి ఏమైనా బెదిరించాడా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ లబ్ధిదారులను ఎంపిక చేసి ఎంపీడీవోలకు అప్పగించడంతో తమ విధి పూర్తవుతుందని తెలిపారు. పథకం అమలును ఎంపీడీవోలు పర్యవేక్షిస్తారని చెప్పారు. -
కొందరికే పునరావాసం
ఉట్నూర్(ఖానాపూర్): గుడుంబా పునరావాస పథకం ప్రహసనంగా మారింది. ఆర్భాటంగా గుడుంబా తయారీదారులను ఎంపిక చేసిన అధికార యంత్రాంగం పునరావాసం కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా వందలాది మంది తయారీదారుల్లో జిల్లావ్యాప్తంగా కేవలం పది మందికి స్వయం ఉపాధి కల్పించారు. గుడుంబా విక్రయాలు అరికట్టి.. స్వయం ఉపాధి కల్పించడం ద్వారా తయారీదారులు, విక్రేతల ఆర్థికాభివద్ధికి బాటలు వేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన పథకం ద్వారా ఉట్నూర్ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో ముగ్గురికే భరోసా లభించింది. ఎక్సైజ్ అధికారులు 215 మంది గుడుంబా విక్రయదారుల వివరాలను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 115 మంది జాబితా కార్యాలయానికి చేరింది. చివరికి 30 మందితో కూడిన జాబితా రాగా.. మొదటి విడతలో తొమ్మిది మందిని ఎంపిక చేశారు. కానీ ఇప్పటివరకు ముగ్గురికి మాత్రమే ఉపాధికి రుణాలు అందజేశారు. మిగతా వారికి ఇప్పటికీ రుణాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉట్నూర్ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాలు ఉన్నాయి. ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు కావడంతో ఈ ప్రాంతాల్లో నివసించే వారి ఆర్థిక స్థితిగతులు అంతంతగా ఉన్నాయి. దీంతో చాలామంది గుడుంబా తయారీ జీవనోపాధిగా ఎంచుకున్నారు. గుడుంబా తాగిన కొందరు ప్రాణాలు కోల్పోవడం, వారి కుటుంబాలు వీధిన పడడంతో గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా గుడుంబా విక్రయాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఎంపిక చేసిన వారికి రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందించి స్వయం ఉపాధి కల్పించింది. తమకూ రుణాలు మంజూరు చేయాలని మిగతా వారు కోరుతున్నారు. మరోవైపు గతంలో ఉన్న కేసుల కారణంగా తయారీ, విక్రేతలు ఇబ్బందులు పడుతున్నారు. పునరావాసం ఇలా.. ఆదిలాబాద్: గుడుంబా తయారీని కుటీర పరిశ్రమగా చేసుకుని జీవనం సాగించిన కొందరు ఇప్పుడు ఆ దందా నుంచి బయటపడ్డారు. గుడుంబా తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న గుడుంబా పునరావాస పథకంతో స్వయం ఉపాధి పొందుతున్నారు. గుడుంబా తయారీని నమ్ముకుని బతుకుబండిని నడిపిస్తున్న నిరుపేద కుటుంబాలు, విక్రయిస్తూ కేసుల్లో ఇరుక్కుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడుంబా పునరావాస పథకాన్ని తీసుకొచ్చింది. గుడుంబా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపా«ధి అవకాశాలు కల్పించింది. కేసులు, బైండోవర్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో దాడులు నిర్వహించడంతో చాలావరకు గుడుంబా తగ్గుముఖం పట్టింది. జిల్లాలోని లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాలో గతంలో పరిస్థితి.. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. 2016లో ఉమ్మడి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాల విభజన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో గుడుంబా చాలామట్టుకు తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మారుమూల గ్రామాల్లో పెద్ద ఎత్తున గుడుంబా, సారా విక్రయాలు జరుగుతుండేవి. మంచిర్యాల, లక్సెట్టిపేట, నిర్మల్, బెల్లంపల్లి ప్రాంతాల్లో గుడుంబా పెద్ద ఎత్తున తయారు చేసేవారు. ఈ ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించినప్పుడల్లా ఎంతో మందిపై కేసులు నమోదయ్యేవి. అయినప్పటికీ గుడుంబా తయారీ కుటుంబాలకు ప్రధాన ఆధారం కావడంతో విక్రయిస్తూనే ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం గుడుంబా పునరావాస పథకం కింద ఆర్థిక సాయం అందజేసేందుకు శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులకు రూ.2 లక్షలు.. జిల్లాలో నాటుసారా, గుడుంబా అమ్మకాలే జీవనాధారంగా గుడుంబా తయారీ కుటుంబాలు ఉన్నాయి. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించి వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. గుడుంబా తయారీ మానేసి జనజీవన స్రవంతిలో కలిసిన ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. 2015 జనవరి నుంచి 2016 సెప్టెంబర్ వరకు గుడుంబా విక్రయిస్తూ బైండోవర్ అయిన ప్రతి ఒక్కరూ ఈ స్కీంకు అర్హులుగా నిర్ణయించారు. జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు అర్హులైన వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. ఈ జాబితాలో 10 మందిని ఎంపిక చేసిన ప్రభుత్వం పథకం కింద ఆర్థిక సాయం అందజేసింది. ఆర్థిక సాయం పొందిన వారిలో కిరాణ షాపు, ఆటో, ఇతర చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. కేసు ఎత్తేస్తే బాగుంటది భర్త ఉన్నప్పుడు గుడుంబా అమ్మేవాడు. ఆయన పోయాక ఉపాధి కోసం నేను కొన్ని రోజులు అమ్మిన. ఆబ్కారీ పోలీసులు కేసులు పెట్టారు. తర్వాత దొరికిన కూలీ చేసుకుని బతికిన. ప్రభుత్వం నాకు రూ.2 లక్షలు లోను మంజూరు చేసింది. ఆటో కొనుక్కొని కిరాయికి ఇస్తున్న. రోజుకు రూ.200 కిరాయి వస్తుంది. సర్కారు సహాయంతోనే రోజు గడుస్తోంది. ఇంత చేసిండ్రు కేసు కూడా ఎత్తేస్తే బాగుంటది. పేషీలకు తిరిగి తిరిగి పరేషాన్ అవుతుంది. – జాదవ్ విమలాబాయి, గుడిహత్నూర్ -
గోడు వినరు.. గూడు కట్టరు!
సాక్షి, హైదరాబాద్ : ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో నిర్వాసితుల వెతలు మాత్రం తీరడం లేదు! ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస ప్రక్రియ పదేళ్లయినా ఇంకా సాగుతూనే ఉంది. మిడ్ మానేరు, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఇందిరమ్మ వరద కాల్వ వంటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నా... పునరావాస ప్రక్రియ మాత్రం నత్తనడకను తలపిస్తోంది. నిధుల కేటాయింపు, పట్టాల పంపిణీ, గృహ వసతి కల్పన, ఇప్పటికే నిర్మించిన పునరావాస కాలనీల్లో వసతుల లేమి.. ఇలా ఒక్కటేమిటీ అన్నింటా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇళ్లు కట్టేది ఇంకెప్పుడు? పద్నాలుగేళ్ల క్రితం చేపట్టిన ఎస్ఎల్బీసీ, ఎస్సారెస్పీ స్టేజ్–2, దేవాదుల, వరద కాల్వ, ఎల్లంపల్లి, సుద్దవాగు, కొమురం భీం, గొల్లవాగు, నీల్వాయి, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టు కింద 65 గ్రామాలు పూర్తిగా, 19 పాక్షికంగా కలిపి మొత్తంగా 84 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాలలో 44,794 మంది నిర్వాసితులవుతున్నారు. వీరందరికీ పునరావాస (ఆర్అండ్ఆర్) కేంద్రాలు ఏర్పాటు చేసి.. గృహాల నిర్మాణం, రోడ్లు, తాగునీరు, కరెంట్ కనెక్షన్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అయితే ఇప్పటివరకు 84 ముంపు గ్రామాలకుగానూ 77 గ్రామాల్లోనే సామాజిక ఆర్థిక సర్వే (ఎస్ఈఎస్) పూర్తయింది. 44వేల పైచిలుకు మందిలో 24,891 మందిని మాత్రమే ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికోసం 16,859 నివాస గృహాలను నిర్మించారు. ఇంకా 18,526 గృహాలు, ఇతర వసతుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. దీనికోసం మరో రూ.1,262 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. అయితే ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఎప్పటిలోగా పునరావాసం పూర్తవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రాజెక్టుల కింద అన్నీ సమస్యలే.. రానున్న జూన్ నాటికి పనులు పూర్తి చేసి సాగుకు నీటిని అందించాలని భావిస్తున్న ప్రాజెక్టుల్లో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు కీలకం. ఇక్కడి భీమా ప్రాజెక్టు కింద 8 ముంపు గ్రామాలుండగా, మొత్తంగా 6,156 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. అయితే ఇందులో 3,500 మందికి మాత్రమే పట్టాల పంపిణీ పూర్తయింది. మౌలిక వసతుల పనులు ఇంకా మధ్యలోనే ఉన్నాయి. కనాయిపల్లి, శ్రీరంగాపూర్, నేరేడ్‌గావ్, భూత్పూర్, ఉజ్జెల్లి గ్రామాలలో నిర్వాసితులకు గృహాల నిర్మాణం వేగిరం చేయాల్సి ఉంది. సంగంబండలో ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. నెట్టెంపాడు కింద ముంపునకు గురయ్యే చిన్నానిపల్లి, ఆలూర్, రేతామ్‌పాడ్ గ్రామాల నిర్వాసితులకు పట్టాలు ఇచ్చినప్పటికీ అక్కడ ఈ ఏడాది చివరికి రోడ్లు, నీరు, విద్యుత్ సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది. కాలనీల్లో వసతులేవీ..? రాజన్న సిరిసిల్ల జిల్లాలో 25 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మిస్తుండగా, బోయినపల్లి మండలంలో కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, శాభాష్‌పల్లి, తంగళ్లపల్లి మండలంలో చీర్లవంచ, చింతలఠాణా, వేములవాడ రూరల్ మండలంలో అనుపురం, రుద్రవరం, కొడుముంజ, సంకెపెల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాల్లో 11,731 కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. వీరందరికి పునరావాసం కోసం సుమారు రూ.100 కోట్లతో ఆర్అండ్ఆర్ కాలనీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి 242 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చారు. ఆర్అండ్ఆర్ కాలనీల్లో సుమారు మూడు వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మరో 1,500 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇదే ప్రాజెక్టు కింద కొదురుపాక, నీలోజిపల్లి ఆర్అండ్ఆర్ కాలనీల్లో రూ.80 లక్షల అంచనాలతో నీటి పథకాలు నిర్మించారు. అయితే సీసీ రహదారులు నిర్మించాక పైప్లైన్లు వేయడానికి కందకాలు తవ్వారు. కొన్ని చోట్ల రోడ్లు బ్లాస్ట్ చే«శారు. దీంతో పలు సీసీ రహదారులు పగుళ్లు బారాయి. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల అనాలోచిత చర్యతో శాభాష్‌పల్లి వాగులో నీటి వసతి కోసం మంచినీటి బావులు తవ్వించారు. అయితే వాగులో నీరు చేరడంతో బావులు మునిగిపోయాయి. రోడ్డు నిర్మాణంలో పైప్‌లైన్ వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. దీంతో పునరావాస కాలనీల్లో నీరు దొరక్క నిర్వాసితులు పుట్టెడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. పలు పునరావాస కాలనీల్లో నిర్వాసితులకు ఇళ్లను అప్పగించడంలో తీవ్ర జాప్యం వల్ల మురుగు కాలువలు మట్టి, పిచ్చి చెట్లతో పూడుకు పోయాయి. పలుచోట్ల విద్యుత్ సదుపాయం లేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. అరిగోస పడుతున్నారు మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి నీరు చేరిందని.. పునరావాస కాలనీలకు తరలాలని అధికారులు ఆదేశించడంతో కట్టు బట్టలతో ఊళ్లు వదిలి ఆర్అండ్ఆర్ కాలనీలకు చేరాము. ఇక్కడ నీటి వసతి లేదు. వాగులో బావులు తవ్వితే మునిగి పోయాయి. సీసీ రోడ్లు పగుళ్లు బారాయి. మౌలిక వసతులు లేక నిర్వాసితులు అరిగోస పడుతున్నారు. – కూస రవీందర్, ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఇళ్ల బిల్లులు చెల్లించలేదు సంగంబండ ఆర్ఆర్ సెంటర్లో ఇళ్లు కట్టుకోవాలంటే బిల్లులు ఇవ్వడంలేదు. జీవో విడుదల చేసి సంవత్సరాలు గడిచినా కొంతమందికి ప్లాట్లు రాలేదు. సర్వం కోల్పోయిన తమను ఆదుకుంటామని చెప్పడం తప్ప సమస్యలు పరిష్కరించడంలేదు. – అనంతరెడ్డి, సంగంబండ, బీమా ప్రాజెక్టు నిర్వాసితుడు ఇంటి నిర్మాణ బిల్లులు చెల్లించాలి ఆర్అండ్ఆర్ కాలనీల్లో వేల మంది నిర్వాసితులు రూ.లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన వారికి బిల్లులు విడుదల చేయాలి. – ఆడెపు రాజు, వరదవెల్లి, మిడ్‌మానేరు నిర్వాసితుడు -
నిర్వాసితుల భూముల్లో నెత్తుటి ధారలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్టులో సర్వం పోగొట్టుకుంటున్న నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు పరిహారంతో పాటు పలు వివాదాలను కూడా ప్రభుత్వం అంటగడుతోంది. వారికి ఇచ్చిన భూముల్లో పంట తీసుకు వెళ్ళాలన్నా లేదా కౌలుకు ఇచ్చుకోవాలన్నా స్థానిక గిరిజనులతో పోరాటం చెయ్యాల్సిందే. నిర్వాసితులు స్థానిక గిరిజనుల మధ్య జరుగుతున్న వివాదాలతో నిర్వాసితుల భూముల్లో నెత్తుటి ధారలు పారుతున్నాయి. జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురం గ్రామంలో పోలవరం నిర్వాసిత గ్రామాలు అయిన ఎర్రవరం, శివగిరి, టేకూరు, కొరుటూరు, గాజుల గొంది, చీడూరు, కటుకూరు గ్రామాల గిరిజనులకు 12 సర్వే నంబర్లలో 500 ఎకరాల భూమిని 2014 సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుండి ఈ భూముల్లో నిర్వాసితులు సాగు చేసుకోవాలన్నా.. కౌలుకు ఇచ్చుకోవాలన్నా ప్రతి సంవత్సరం స్థానిక గిరిజనులతో వివాదాలు ఏర్పడుతున్నాయి. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్న వారిపై కేసుల నమోదు చేయడం జరుగుతోంది. 500 ఎకరాల భూమిపై ఎన్నో ఉద్యమాలు పి.నారాయణపురం గ్రామంలో పోలవరం నిర్వాసితులకు కేటాయించిన అయిదు వందల ఎకరాల భూమి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన భూ ఉద్యమాలకు పుట్టినిల్లు. ఈ భూమిపైనే సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసి అనేక మంది నాయకులు అయ్యారు. ఉద్యమ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ భూమి గిరిజనులకు ఇప్పించడానికి పోరాటం చేశారు. దీనిలో కొంత భూమిలో గిరిజనులకు పట్టాలు కూడా వచ్చాయి. దీంతో మిగిలిన గ్రామాలకు చెందిన వారు కూడా ఈ భూములపై పోరాటం చేస్తే తమకు ఎంతోకొంత భూమి దక్కుతుందని ఆశతో ఉన్నారు. స్థానిక గిరిజనులు అప్పటి నుండి పోరాటాలు చేసూ్తనే ఉన్నారు. ఈ అయిదు వందల ఎకరాల భూమి చాగల్లు గ్రామానికి చెందిన 17 మందితో కూడిన ఫరంకు సంబంధించిన భూమి. ఈ భూమిలో మామిడితోట ఉండేది. రికార్డు అంతా వారికి అనుకూలంగా ఉన్నా గత 30 సంవత్సరాల కాలంలో ఇక్కడ వారు సాగు చేసిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం మామిడి కాయలు తీసుకు వెళ్ళడానికి స్థానిక గిరిజన నాయకులకు ఎంతో కొంత ముట్ట చెప్పి కాయలను అమ్ముకునే వారు. లేదా తహసీల్దార్, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి చివరకు పోలీస్ రక్షణతో వారు పంటను తీసుకు వెళ్ళేవారు. 2014 సంవత్సరంలో ఈ భూమిని పోలవరం నిర్వాసితులకు కేటాయించడంతో చాగల్లు ఫరం ప్రతినిధులు ఈ భూమిపై సొమ్ములు చేసుకోగా వారు పడిన బాధలు ఇప్పుడు ప్రతి సంవత్సరం నిర్వాసితులు పడుతున్నారు. కౌలు పంచాయితీలే వివాదాలకు కారణం నిర్వాసితుల భూమిలో వివాదాలకు ప్రధానంగా భూమి కౌలు పంచాయితీలే కారణమవుతున్నాయి. నిర్వాసితులకు కేటాయించిన భూములను వారు ప్రస్తుతం ఇక్కడకు వచ్చి సాగు చేసుకునే పరిస్థితి లేదు. దీంతో ఈ భూములను స్థానికంగా ఉన్న కొందరు గిరిజనుల ఆధ్వర్యంలో గుత్త బేరంగా కౌలుకు ఇచ్చేస్తున్నారు. వీటిని తక్కువ కౌలుకు తీసుకుని ఎక్కువ కౌలుకు బయట వ్యక్తులకు ఇస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న గిరిజనుల మధ్య వివాదాలు వస్తున్నాయి. నిర్వాసితుల కౌలు సొమ్ములు కొందరే తినడం ఏంటి మేము గిరిజనులం కాదా అని వీరు నిర్వాసిత భూముల్లోకి అడ్డంగా వెళుతున్నారు. దీంతో ఇక్కడ వివాదాలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం భూమి ఇచ్చేశాం కొట్టుకుచావండన్నట్లుగా చూస్తూ ఊరుకోవడంతో ప్రతిసారి ఈ వివాదాలు సర్వసాధారణంగా మారాయి. భవిష్యత్‌లో ఇవి మరింత ఎక్కువ కాకముందే సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోవాలి్స న అవసరం ఉంది. -
వంచన పంచన
పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. వారికి పునరావాసం పేరిట నిర్మిస్తున్న ఇళ్లకు అతి తక్కువ మొత్తం కేటాయిస్తోంది. నిర్వాసితుల కోసం నిర్మించే ఒక్కొక్క ఇంటికి.. గిరిజనులైతే రూ.4.55 లక్షలు, గిరిజనేతరులైతే రూ.3.55 లక్షల చొప్పున వెచ్చించాలని జీఓ జారీ చేసినప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద ఒక్కొక్క ఇంటికి రూ.2 లక్షలు మాత్రమే కేటాయిస్తున్నారు. ఇదేం దారుణమని నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షలు ఏ మూలకు సరిపోతాయని లబ్ధిదా రులు నిలదీస్తున్నారు. మోడల్ కాలనీల్లో.. స్నానపు గదుల తరహాలో.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలు ముంపుబారిన పడనున్నాయి. పోలవరం మండలంలో 29 ముంపు గ్రామాలు ఉండగా, 3 గ్రామాల్లో జనావాసాలు లేవు. మిగిలిన 26 గ్రామాల్లోని 7 గ్రామాల ప్రజలకు ఇప్పటికే పునరావాసం కల్పించారు. మిగిలిన 19 గ్రామాలను ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం రెండో విడత పునరావాస కార్యక్రమం అమలు చేస్తోంది. ఈ గ్రామాల్లోని 2,480 కుటుంబాలతోపాటు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 29,545 కుటుంబాలకు పునరావాస కేంద్రాల్లో ఇళ్లు నిర్మించాల్సి ఉంది. మొదటివిడత పునరావాస గ్రామాల నిర్వాసితులకు సంబంధించి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.15 లక్షలు కేటాయించింది. కానీ.. ప్రస్తుతం ఖాళీ చేయాల్సిన నిర్వాసితులకు సంబంధించి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కేవలం రూ.2 లక్షలు మాత్రమే కేటాయిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో నిర్వాసితులు ఘొల్లుమంటున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో 26 మోడల్ కాలనీల నిర్మాణం చేపట్టారు. వాటిలో స్నానపు గదుల తరహాలో సిమెంట్ ఇటుకలతో ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 17 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టి శ్లాబ్‌లు కూడా వేశారు. ఇంత దారుణమా జీఓ ప్రకారం గిరిజన నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ.4.55 లక్షలు, గిరిజనేతరుల ఇంటి నిర్మాణానికి రూ.3.55 లక్షలు కేటాయించాల్సి ఉందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి కారం వెంకటేష్, నాయకుడు సున్నం పోశీరావు పేర్కొన్నారు. జీఓను తుంగలో తొక్కి కేవలం రూ.2 లక్షలు మాత్రమే కేటాయించి నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఇంత దారుణం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి జీఓ ప్రకారం నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. రూ.2 లక్షలతో ఇల్లు పూర్తవుతుందా మాది వాడపల్లి గ్రామం. పోలవరం ముంపు గ్రామం కావటంతో జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెంలో ఇంటిస్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు పైగా వస్తుందని ఆర్డీఓ చెప్పారు. ఇప్పుడు రూ.2 లక్షలు మాత్రమే వస్తుందంటున్నారు. ఆ మొత్తంతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందా. మొదట విడతలో గ్రామాలు ఖాళీ చేసిన వారికి రూ.3.15 లక్షలు ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం. – నూనె గంగరాజు, నిర్వాసితుడు ఐఏవై పథకంలో నిర్మిస్తున్నారు కొత్త భూసేకరణ చట్టం–2013 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరా ఆవాజ్ యోజన (ఐఏవై) కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఉంది. నిర్వాసితులకు ఆ ప్రకారమే ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పథకంలో ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షలు మాత్రమే కేటాయిస్తారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. – ఎం.ముక్కంటి, తహసీల్దార్, పోలవరం -
మూడు సెంట్లు ఏమూలకు..
వేలేరుపాడు : పచ్చని చెట్ల నడుమ.. విశాలమైన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ప్రశాంతంగా బతికిన వారంతా ప్రభుత్వ పుణ్యమా అని ఇరుకు జాగాల్లో మగ్గాల్సిన దుస్థితి తలెత్తు తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో 29,545 కుటుంబాలు నిర్వాసితుల జాబితాలోకి చేరాయి. ఇందులో 10 వేల వరకు గిరిజన కుటుంబాలు కాగా.. మిగిలినవి గిరిజనేతర కుటుంబాలు. ఈ రెండు మండలాలు పోలవరం ప్రాజెక్ట్ ముంపు పరిధిలోకి చేరడంతో వీరంతా సర్వస్వం కోల్పోయి.. అగ్నిప్రమాద బాధితుల తరహాలో కట్టుబట్టలతో బయటకు రావాలి్సన పరిస్థితి ఏర్పడుతోంది. ముంపు మండలాల్లోని ఏ గ్రామంలో చూసినా పేద, గొప్ప అన్న తేడా లేకుండా ప్రతి కుటుంబం కనీసం 25 సెంట్ల స్థలంలో తమ స్థాయిని బట్టి ఇల్లు నిర్మించుకుని నివాసం ఉటోంది. ఇంటి పెరట్లోనే కూరగాయలు పండించుకుంటున్నారు. పండ్ల మొక్కలను సైతం పెంచుకుని ఫలసాయం అనుభవిస్తున్నారు. పశువుల్ని పెంచుకుంటూ.. వాటిని పాకల్లో సంరక్షించుకుంటూ ఎంతోకొంత ఆదాయం పొందుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వీరంతా స్వగ్రామాలను, సొంత ఇళ్లను వదులుకుని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు సెంట్ల జాగాలో మగ్గిపోవాలట ప్రశాంత వాతావరణంలో.. విశాలమైన ఇళ్లలో జీవించిన గిరిజన కుటుంబాలకు 5 సెంట్లు, గిరిజనేతర కుటుం బాలకు 3 సెంట్ల భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. గిరిజనేతరులకు పట్టణ ప్రాంతాల్లో నివాసం కల్పిం చాల్సి ఉండటంతో వారికి 3 సెంట్ల ఇంటి స్థలం ఉండేలా కాలనీ నిర్మించి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ నిర్ణయంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే.. గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంటి ప్రాంగణంలో ధాన్యం గరిసెలు, దుక్కిటెడ్లు, పాడి పశువులు ఉంచుతారు. ప్రభుత్వం కేటాయించే ఐదు సెంట్ల భూమిలో ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం కష్టసాధ్యమని గిరిజనులు వాపోతున్నారు. కనీసం గిరిజనులకు 8 సెంట్లు, గిరిజనేతరులకు 5 సెంట్ల చొప్పున ఇంటి స్థలం కేటాయించాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఎలా ఉండగలం సర్వం వదులుకుని సొంతూరు నుంచి పునరావాస ప్రాంతానికి వెళ్తున్నాం. గిరిజనులకు ప్రభుత్వం 5 సెంట్ల భూమి ఇస్తుందట. ఆ జాగాలో అన్ని వసతులు కల్పించుకోవడం కష్టం. మా దుక్కెటెడ్లు, పాడి పశువులు, మేకలు, ధాన్యం గరిసెలు లేకపోతే ఎలా జీవించగలం. గిరిజనులకు 8 సెంట్ల జాగా అయినా ఇవ్వాలి. – కొవ్వాసి ధనలక్ష్మి, సర్పంచ్, కట్కూరు ప్రశాంతంగా బతకనివ్వరా ఎకరం స్థలంలో విశాలమైన ఇంటిని నిర్మించుకున్నాం. మా కుటుంబమంతా ఆ ఇంట్లోనే ఉంటున్నాం. మా పెరట్లో అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే మూడు సెంట్ల స్థలంలో ఎలా ఉండగలం. ప్రభుత్వానికిది న్యాయమేనా. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా. – కోటా రమేష్‌బాబు, రైతు, వేలేరుపాడు ఐదు సెంట్లు ఇవ్వాలి గిరిజనేతరులకు ప్రభుత్వం ప్రకటించిన మూడు సెంట్ల ఇంటిస్థలం ఏ మూలకూ సరిపోదు. అంత చిన్న విస్తీర్ణంలో ఎలా నివాసం ఉండగలం. కనీసం ఐదు సెంట్లు ఇవ్వాలి. పశువుల పాకలకు స్థలమివ్వాలి. – వలపర్ల రాములు, వేలేరుపాడు -
పునరావాసం
► గుడుంబా తయారీ కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ► స్వయం ఉపాధి కల్పనకు కార్యాచరణ ► జాబితా తయారీలో ఎక్సైజ్ అధికారులు ► ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఆర్థికసాయం ఆదిలాబాద్:, వాటిని విక్రయిస్తూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇటువంటి వారికి ప్రత్యామ్నాయ ఉపా«ధి అవకాశాలు కల్పించడానికి సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ స్టేషన్ల వారీగా అర్హుల జాబితాను తయారుచేస్తోంది. జూన్ 1 వరకు పూర్తిస్థాయిలో లబ్ధిదారుల వివరాలు సేకరించి జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో గుడుంబా తయారీదారులకు పునరావాసం పథకం కింద బాధితులకు స్వయం ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 360 మందిని గుర్తించారు. సారా విక్రయాలపై సర్కార్ గత ఏడాది నవంబర్ నుంచి ప్రత్యేక దృష్టి సారించింది. సారాపై ఉమ్మడి జిల్లాలో ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కేసులు, బైండోవర్ చేయడం, గ్రామీణా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా మట్టుకు గుండా తయారీ తగ్గుముఖం పట్టిందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. దీంతో గుడుంబా తయారీదారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 ఎక్సైజ్ స్టేషన్లు ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్, బైంసా, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఉన్నాయి. గతేడాది ఉమ్మడి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటికే చాలా మారుమూల గ్రామాల్లో పెద్ద ఎత్తున గుడుంబా, సారా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించినప్పుడల్లా ఎంతో మందిపై కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ గుడుంబా తయారీ కుటుంబాలకు ప్రధాన ఆధారం కావడంతో విక్రయిస్తూనే ఉన్నారు. జూన్ 2న రాష్ట్రాన్ని గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రకటించనున్న నేపథ్యంలో తయారీదారులకు పునరావాస పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు రూ.2లక్షలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో కుటుంబాలు నాటుసారా, గుడుంబా అమ్మకాలే జీవనాధారంగా ఉన్నాయి. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించి వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు అధికారులు ముమ్మరం చేస్తున్నారు. గుడుంబా తయారీ మానేసి జనజీవన స్రవంతిలో కలిసిన ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు. 2015 జనవరి నుంచి 2016 సెప్టెంబర్ వరకు గుడుంబా విక్రయిస్తూ బైండోవర్ అయిన ప్రతి ఒక్కరూ ఈ స్కీంకు అర్హులుగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో ఇప్పటికే ఈ కుటుంబాలను గుర్తించేందుకు జాబితా తయారు చేస్తున్నారు. ఈ సాయంతో బాధితులు స్వయం ఉపాధి పొందనున్నారు. వీరందరికీ పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.58 కోట్లు మంజూరు చేసింది. వివరాలు సేకరిస్తున్నాం.. జిల్లాలో గుడుంబా తయారీ మానేసిన వారి వివరాలు సేకరిస్తున్నాం. జూన్ 1లోగా పూర్తి జాబితాను సిద్ధం చేయనున్నాం. పునరావాస పథకం కింద గుడుంబా తయారీ కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందజేయనుంది. ఇప్పటికే జిల్లాల గుడుంబా నిర్మూలనకు కృషి చేస్తున్నాం. – రమేశ్‌రాజ్, డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ -
భూసేక‘రణం’
సాక్షి ప్రతినిధి, ఏలూరు/జీలుగుమిల్లి : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం భూములు సేకరించిన వ్యవహారం గిరిజనుల మధ్య చిచ్చు రేపింది. గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములను అధికారులు అడ్డగోలుగా కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమికి సంబంధించి పట్టాలు వేరే వారి పేరిట ఉన్నప్పటికీ కొన్ని దశాబ్దాలుగా తామే సాగు చేసుకుంటున్నామని.. ఆ భూములను పట్టాలు కలిగిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి నిర్వాసితులకు అప్పగించడం అన్యాయమనే వాదన వినిపిస్తోంది. ఇదికాస్తా స్థానిక గిరిజనులు, స్థానికేతరులైన నిర్వాసిత గిరిజనుల మధ్య అగ్గి రాజేస్తోంది. జిల్లాలోని జీలుగువిుల్లి, బుట్టాయగూడెం మండలాల్లో ఈ తరహా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తాజాగా జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు కేటాయించిన భూముల్లో స్థానిక గిరిజనులు సర్వే రాళ్లను తొలగించడంతోపాటు మోడల్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. తాము సాగు చేసుకుంటున్న భూములను నిర్వాసితులకు కేటాయించడంతో స్థానిక గిరిజనులు అడ్డం తిరుగుతున్నారు. పోలవరం నిర్వాసిత గ్రామాలైన రాజులగొంది, కొరుటూరు, శివగిరి, కొత్త మామిడిగొంది గ్రామాల గిరిజనులకు జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలో భూమికి భూమితోపాటు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ గ్రామంలోని భూములకు అగ్రవర్ణాల పేరుతో పట్టాలు ఉన్నాయి. ఆ భూములను కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. వీటిని పోలవరం నిర్వాసితులకు కేటాయించడంపై ఈ ప్రాంత గిరి జనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసిత గిరిజనులు ఆ భూముల్లో సాగు చేసుకునేందుకు ఉపక్రమిస్తుంటే అడ్డుకుంటున్నారు. పి.నారాయణపురం రెవెన్యూ పరిధిలో సుమారు 500 ఎకరాల భూములకు సంబంధించి నిర్వాసిత గిరిజనులు, స్థానిక గిరిజనుల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ భూముల్లో పోలీస్ రక్షణతో పోలవరం నిర్వాసితులు సాగు చేసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లోని భూముల్లో స్థానిక గిరిజనులు వేసిన పత్తి పంటను గత ఏడాది జూన్ నెలలో పోలీస్ రక్షణతో నిర్వాసిత గిరిజనులు దున్నేశారు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన స్థానిక గిరిజనులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలావుండగా.. పోలవరం నిర్వాసితుల కోసం పి.నారాయణపురంలో కేటాయించిన ఇంటి స్థలాల్లోని సరిహద్దు రాళ్లను స్థానిక గిరిజనులు మంగళవారం తొలగించారు. ఇక్కడ మోడల్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్స్‌ను ధ్వంసం చేశారు. నిర్వాసితులను సాగు చేసుకోని వ్వకపోవడం, ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడంతో గిరిజనుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారిం చకపోతే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. -
పునరావాస పనుల అడ్డగింత
= వెలిగొండ నిర్వాసితుల కోసం పూసలపాడు వద్ద భూమి కేటాయింపు = కోర్టు వివాదంలో ఉన్న భూముల్లో పనులు ఎలా చేస్తారని రైతుల ప్రశ్న = ఇప్పటికి నాలుగు సార్లు పనులు అడ్డుకున్న రైతులు బేస్తవారిపేట : వెలిగొండ ప్రాజెక్ట్ పునరా వాస పనులను రైతులు శనివారం అడ్డుకున్నారు. నివేశన స్థలాల కోసం కేటా యించిన భూ వివాదం కోర్టులో ఉండగా పనులు ఎలా చేస్తారంటూ రైతులు ప్ర శ్నించారు. ఈ సంఘటన మండలంలోని పూసలపాడు సమీపంలో శనివారం జరిగింది. పూసలపాడు బస్టాండ్ సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవే రోడ్డు పక్కన వెలిగొండ ప్రాజెక్ట్ కాకర్ల గ్యాప్ ముంపు బాధితులకు 20 ఎకరాల్లో 280 ప్లాట్లు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. తోట ఆదినారాయణ, నాగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చాగంటి ఎర్ర గంగయ్య, నరసింహులు, తిరుపాలు, చిన్న కొండలు అనే రైతులు తమ భూములు ఇచ్చేది లేదంటూ కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం హైకోర్టులో వివాదం నడుస్తోంది. పొలాల పక్కనున్న అసైన్డ్ భూములు తీసుకోకుండా తమ వద్ద ఉన్న అరకొర భూములు బలవంతంగా ఎందుకు లాక్కుంటున్నారని, కనీసం ఎటువంటి నోటీస్‌లు కూడా ఇవ్వకుండానే భూములు చదును చేస్తున్నారంటూ రైతులు డోజర్ యంత్రానికి అడ్డుపడ్డారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిలో పనులు ఏ విధంగా చేయిస్తారని అక్కడే పనులు చేయిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ జేఈ సుధాకర్‌ను ప్రశ్నించారు. పనులు నిలిపేయాలని కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు తమకు అందలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011లో మార్కాపురం కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, 19 ఎకరాలకు రూ.14 లక్షలను కోర్టులో డిపాజిట్ చేసినట్లు జేఈ వివరించారు. -
రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఆలయాలు
–శ్రీ విద్యాగణేశానంద మహాసంస్థానం పీఠాధిపతి విద్యాగణేశానంద భారతి రాజమహేంద్రవరం కల్చరల్ : రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా ఆలయాలు మారుతున్నాయని హైదరాబాద్‌కు చెందిన శ్రీవిద్యాగణేశానంద మహాసంస్థానం పీఠాధిపతి విద్యాగణేశానందభారతి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గౌతమఘాట్‌లోని అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించారు. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా విద్యాగణేశానందభారతి మాట్లాడుతూ ఆలయాల నిర్వహణ ధార్మిక సంస్థలు, పీఠాల ఆధ్వర్యంలో ఉన్నప్పుడే సక్రమంగా నడుస్తుందన్నారు. ధర్మశాస్త్ర పరిజ్ఞానం లేనివారు, వేదవేదాంగాలను అధ్యయనం చేయనివారు, ఆచార సంప్రదాయాలు తెలియనివారు ఆలయ కమిటీలకు చైర్మన్లు, కార్యవర్గసభ్యులు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ రంగాల్లో నిష్ణాతులు ప్రభుత్వం నియమించే ఆలయ కమిటీలలో ఒక్కరయినా ఉంటున్నారా? రాజరాజు, శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ, చోళులు ఆలయాలను నిర్మించినా, నిర్వహణలో జోక్యం చేసుకోలేదు. బ్రాహ్మీముహూర్తంలో వచ్చి తొలిపూజ చేసుకుని వెళ్లిపోయేవారు. ఇప్పుడు అంతా అపసవ్యంగా ఉంది.’ అని విద్యాగణేశానంద భారతి తెలిపారు. అయ్యప్పస్వామి ఆలయం నగరానికే తలమానికంగా వెలుగొందుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కోరుకొండ రెవిన్యూ డివిజనులో అధికారులు రిజిస్ట్రేషన్లు నిలిపివేసి, రైతుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో జక్కంపూడి విజయలక్ష్మి స్వామీజీకి వివరించారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నానని విద్యాగణేశానంద భారతి అన్నారు. ఆదిశంకరుల షణ్మత పూజల్లో, గణేశ ఆరాధన అంతరించిపోతున్నదని, దీనిని పునరుద్ధరించడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. ఆంధ్రపత్రిక సంపాదకుడు దివంగత శివలెంక శంభుప్రసాద్‌కు మూడో తరానికి చెందిన వ్యక్తినని ఆయన తెలిపారు. ధర్మశాస్తాసభ్యులు పాల్గొన్నారు. -
పునరావాస పనులను త్వరగా పూర్తిచేయాలి
నెల్లూరు(పొగతోట): మన్సూర్‌నగర్, రామిరెడ్డినగర్, తదితర ప్రాంతాల్లో కాలువల్లో నివసించే వారికి పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. వైఎస్సార్‌నగర్‌లో నివాసం ఉంటున్న ప్రజలతో జేసీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కాలువలపై నివసించే వారు భారీవర్షాలు పడితే ముంపునకు గురవుతారని తెలిపారు. ముంపునకు గురికాకుండా వారికి పునరావాసం కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వైఎస్సారనగర్లో నివాసం ఉంటున్న ప్రజలు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. హౌసింగ్, కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో నిర్దేశిచిన పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు భరోసా ఏదీ?
పునరావాసాల నుంచి తరలివెళ్లాలని అధికారుల ఆదేశం ఇబ్బందులు పడుతున్న ప్రజలు మెదక్ మున్సిపాలిటీ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోగా, శిథిలావస్థకు చేరుకున్న బాధితులను ఇదివరకే స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లకు తరలించారు. రెండురోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకున్నారు. సుమారు 40 కుటుంబాల వరకు పునరావాసం పొందారు. బాధితులకు రెండు రోజులుగా ఆహార సదుపాయలు ఏర్పాటు చేశారు. సోమవారం వర్షం లేకపోవడంతో ఇక పాఠశాలలు వదిలి వెళ్లాలని అధికారులు బాధితులను ఆదేశించడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్నీరు, మున్నీరవుతున్నారు. వర్షాలకు పూరిళ్లు, పెంకుటిళ్లు మెత్తబడి కూలిపోయే ప్రమాదం ఉంది. తిరిగి ఇళ్లలోకి వెళితే మాకు చావు కాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సోమవారం ఆకస్మాతుగా ఇళ్లకు వెళ్లమని చెప్పడంతో తిండికోసం చిన్నా, పెద్దలు, వృద్ధులు ఆకలితో అలమటించాల్సి వచ్చిందని బాధితులు వాపోయారు. ఉన్నఫలంగా వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లి తలదాచుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. స్థానికంగా ఉన్న వారు మొక్కుబడిగా ఆహారం అందించారని వాపోయారు. ఇది ఇప్పటి వరకే గాని తమ అసలు సమస్య పరిష్కరించేది ఎవరని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గోల్కొండ బస్తీలో ఇల్లు కూలి ఇద్దరు దుర్మరణం చెందారని ఆ సంఘట ఇంకా మా కళ్లముందే మెదులుతుందన్నారు. అధికారులు పునరావాసాలను ఖాళీ చేసి వెళ్లాలని చెప్పడంతో ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇళ్లు దెబ్బతిన్న బాధితుల వివరాలు పట్టణంలోని 12 వార్డులో గోల్కొండ బస్తీలో సుమారు 40 ఇళ్లు వివిధ స్థాయిలోని ఇళ్లు శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బస్తీకి చెందిన నర్స్పల్లి మహేష్, బుర్రెనొల్ల పోచమ్మ, ఫతేనగర్ సుజాత, బొడెల్లిగారి శ్యామల, గవ్వలపల్లి అంజయ్య, వినోద, చదల దుర్గయ్య, భీమయ్య, ఘనపురం నారాయణ, భవాని, జోగొల్ల అనురాధ, కిష్టయ్య, చోటబీ, సుగుణ, మల్లమ్మలతోపాటు ఇళ్లు కొన్ని దెబ్బతినగా, మరికొన్ని కూలిపోయే ప్రమాదంలో ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు: బొడెల్లిగారి శ్యామల గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. శిథిలమైన ఇళ్లు, ఉరుస్తున్న ఇళ్లలో నుంచి ఉన్నఫలంగా వచ్చి పాఠశాలలో తలదాచుకున్నాం. ఇప్పుడు అధికారులు ఇళ్లకు వెళ్లమంటున్నారు. కాని పాత ఇళ్లు కావడంతో అవి తడిసి ముద్దగా మారాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. అధికారులు వెళ్లిపొమ్మనడంతో ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి: వినోద ఉన్నఫలంగా పునరావాసాలను వదిలిపొమ్మంటున్న అధికారులు అసలు సమస్య పట్టించుకోవడం లేదు. రేపో మాపో కూలిపోయే ఇళ్లలోకి ఎలా వెళ్లాలి. ఎక్కడ ఉండాలి. చిన్న పిల్లలు ఉన్నారు. మా గోస ఎవరికి పట్టదా? ప్రభుత్వం స్పందించి మేము ఉండేందుకు తగిన వసతి కల్పించి ఆదుకోవాలి. అలాగే కూలిన ఇళ్లకు డబుల్ బెడ్రూంలు మంజూరు చేయాలి. బాధితులకు న్యాయం చేయాలి: అయితారం నర్సింలు, కౌన్సిలర్ పట్టణంలోని 12 వార్డులో అధికారులు పర్యటించి కూలిన ఇళ్లను పరిశీలించాలి. వార్డులోని నిరుపేదలైన ఇళ్లు కూలిన బాధితులకు, పూర్తిగా శిథిలమైన వాటికి న్యాయం చేసి ఆదుకోవాలి. -
పునరావాస కాలనీల పనులు వేగవతం చేయాలి
కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర: ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పనుల ప్రగతిపై సమీక్షించారు. కోటిలింగాల, చెగ్యాం, చీర్లవంచ పునరావాస కాలనీల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోటిలింగాలకు మంజూరైన హైలెవల్ బ్రిడ్జి పనులను వర్షాలు తగ్గగానే ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొత్తగా నిర్మించే కాలనీల్లో తాగునీరు, రోడ్లు ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఖైదీల పునరావాసానికి రుణసాయం
సిద్దిపేట: జైలు నుంచి విముక్తి పొందిన ఖైదీలకు జైళ్ల శాఖ తరఫున రుణాలు అందజేయనున్నట్లు మెదక్ జిల్లా సబ్‌జైళ్ల అధికారి లక్షీనర్సింహ తెలిపారు. శనివారం ఆయన సిద్దిపేట సబ్‌జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైళ్ల శాఖ సంస్కరణల్లో డీజీ వినయ్‌కుమార్ సింగ్ చొరవతో ఖైదీలకు మేలు కలిగేలా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. జైలు నుంచి విముక్తి పొందిన ఖైదీలకు స్థిరాస్తికి సంబంధించిన పత్రాలుంటే బ్యాంక్ రుణాలు ఇప్పించేందుకు సహకరిస్తామని చెప్పారు. దీంతో ఖైదీలకు ఉపాధి లభిస్తుందన్నారు. సిద్దిపేట సబ్‌జైలును చిన్నకోడూరు మండలం మందపల్లి వద్ద ఉన్న ఏఆర్ సబ్‌హెడ్ క్వార్టర్ సమీపంలోకి మార్చేందుకు పరిశీలిస్తున్నామన్నారు. దీంతోపాటు పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేసి ఖైదీలకు ఉపాధిని కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్లు పేర్కోన్నారు. -
సహాయక చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి: బొత్స
హైదరాబాద్: ప్రచారానికి కాకుండా హుదూద్ తుఫాన్ బాధితులకు తగిన సహాయ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ పీసీసీ చీఫ్ బొత్స తెలిపారు. తుఫాన్ తీవ్రతను ముందుగానే ఉహించి.. అధికారులును విశాఖకు తరలించి ఉంటే సహాయక చర్యలు వేగంగా జరిగేవని బొత్స అభిప్రాయపడ్డారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇక నెల జీతాన్ని, మాజీలు ఒక నెల పెన్షన్ ను బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్టు బొత్స తెలిపారు. -
‘బఫర్’ భద్రమేనా..?
భద్రాచలం : గోదావరి వరదల సమయంలో బాధితులకు చేపట్టాల్సిన పునరావాస చర్యలపై జిల్లా యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటి వరకూ గోదావరి నదికి పూర్తిస్థాయిలో వరదలు రానప్పటికీ గత అనుభవాల దృష్ట్యా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఈ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది 30 అడుగులకు పైగానే ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే ఒక్కసారిగా గోదావరి ఉప్పొంగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే డివిజన్ కేంద్రమైన భద్రాచలం నుంచి అటు వాజేడు, ఇటు కూనవరం రహదారులకు దారులు మూసుకుపోతాయి. రహదారుల జలదిగ్బంధంతో ఎటూ వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఏటా మూడు నెలల పాటు గోదావరి వరదలు పరీవాహక ప్రాంతంలోని 14 మండలాలపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లోని ప్రజానీకానికి ఎలాంటి ఆహార కొరత లేకుండా సహాయక చర్యలు అందించేందుకు సరిపడా నిత్యావసర సరుకులను నిల్వ చేస్తారు. బఫర్ స్టాక్ పాయింట్ల పేరుతో గుర్తించిన ప్రదేశాల్లో ముంపు ప్రాంత ప్రజానీకం అవసరాలకు అనుగుణంగా వస్తువులు నిల్వ ఉంచుతారు. ముందస్తు చర్యల్లో భాగంగా వరద ప్రభావిత బాధితులకు పునరావాసం కోసం 14,500 క్వింటాళ్ల బియ్యం, 50 వేల లీటర్ల కిరోసిన్ బఫర్ స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. గిరిజన సహకార సంస్థ గోదాముల (ఎంఎల్ఎస్ పాయింట్) నుంచి మండలాల్లోని ఆయా బఫర్ స్టాక్ పాయింట్లకు ఇప్పటికే సరుకులను తరలించారు. కానీ ఆయా స్టాక్ పాయింట్లలో అధికారుల చెబుతున్న లెక్కల ప్రకారం నిల్వలు ఉన్నాయా.. మాయమయ్యాయా..? అనే దానిపై ఇప్పటి వరకూ ఏ ఒక్క అధికారి కూడా పరిశీలన చేయకపోవడం గమనార్హం. భద్రాచలం గిరిజన సహకార సొసైటీ పరిధిలో 5, 500 క్వింటాళ్లను సరఫరా చేసినట్లుగా గోదాం నిర్వహణ అధికారులు చెబుతున్నారు. కూనవరంలో ఉన్న బఫర్ స్టాక్ పాయింట్లో 2,500 క్వింటాళ్లు భద్రాచలం మండలంలోని తోటపల్లిలో ఆరొందలు, నల్లకుంటలో 275, భద్రాచలంలో ఎనిమిదొందలు, దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో 275, లక్ష్మీనగరంలో తొమ్మిదొందల క్వింటాళ్లు నిల్వ ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే విధంగా వెంకటాపురం సొసైటీ పరిధిలోని మండలాల్లో పరిధిలో ఐదు వేల క్వింటాళ్లు, చింతూరు పరిధిలో రెండు వేలు, కుక్కునూరు పరిధిలో 2,200 క్వింటాళ్ల బియ్యం నిల్వ చే సినట్లుగా అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని చోట్ల అధికారులు చెబుతున్న విధంగా నిల్వలు లేకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తోటపల్లిలో ఆరొందల క్వింటాళ్లు ఉన్నాయని చెబుతున్నప్పటికీ చిన్నపాటి పెంకిటింట్లో 12 వందల బస్తాలు పట్టే అవకాశం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టాక్ పాయింట్లకు నో సెక్యూరిటీ ఆమా ప్రాంతాల్లోని బఫర్ స్టాక్పాయింట్లలో ఉన్న బియ్యం నిల్వలకు ఎలాంటి భద్రత లేదని గ్రామస్తులు చెబుతున్నారు. స్టాక్ పాయింట్లకు వాచ్మన్లను నియమించుకునే అవకాశం ఉంది. అయితే... అలా చేయకుండానే ఆయా గ్రామాల్లోని డీలర్‌కు కాపలా బాధ్యత అప్పగించినట్లుగా తెలిసింది. భద్రాచలం మండలంలోని తోటపల్లిలో పెంకుల ఇంట్లో బియ్యం నిల్వ చేయగా, దానిలోనే గేదెలు క డుతున్నారు. ఆ ప్రాంతం అపరిశుభ్రంగా ఉంది. అదే విధంగా వర్షం వస్తే బియ్యం బస్తాలు తడిస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. వాస్తవంగా వీటిని రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చే యాల్సి ఉన్నప్పటికీ, ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా వెంకటాపురం సొసైటీ పరిధిలో జీసీసీ సేల్స్ డిపోల్లోనే బఫర్ స్టాక్ పెట్టడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. బఫర్ స్టాక్‌నే వినియోగదారులకు నెలసరి రేషన్‌గా సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చేరని కిరోసిన్ గోదావరి వరదల సమయంలో కిరోసిన్ అవసరం ఎంతో ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ మండలాలకు కిరోసిన్ చేరలేదు. 50 వేల లీటర్ల కిరోసిన్ సరఫరాకు అలాట్మెంట్ వచ్చినప్పటికీ, దానిని మండలాలకు ఎందుకు చేర్చలేదనేదే ప్రశ్నార్థకం. వరదల సమయంలో తూతూమంత్రంగా సరఫరా చేసి మిగతా కిరోసిన్‌ను పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో భాగంగానే ఇలా తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు బఫ ర్ స్టాక్ నిల్వలపై దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
అటకెక్కిన పునరావాసం
2009 అక్టోబర్‌లో భారీ వరదలు వడ్డేపల్లిలో ఆరేళ్లుగా నిర్మాణంలోనే ఇళ్లు మద్దూరులో స్థలానికి అతీగతి లేదు కృష్ణమ్మ, తుంగభద్ర నదులు ఉగ్రరూపం దాల్చాయి.. వరద బీభత్సంలో ఇళ్లు, ఊళ్లు కొట్టుకుపోయాయి. ఇది జరిగి సుమారు ఐదేళ్లు గడిచింది. 2009 అక్టోబర్ నాటి వరద బాధితులకు నేటికీ పునరావాసం అందనిద్రాక్షగానే మారింది. ప్రభుత్వాలు మారినా..పాలకులు మారినా వారి గూడుగోస మాత్రం తీరడం లేదు. తుంగభద్ర, కృష్ణానదులు ఉప్పొంగడంతో అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ముంపునకు గురయ్యాయి. తుంగభద్ర తీరంలోని అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి, అయిజ, కృష్ణానది తీరంలో ఉన్న ఇటిక్యాల, అలంపూర్ మండలాల్లోని 28 గ్రామాలు వరద ప్రవాహంలో పూర్తిగా దెబ్బతిన్నాయి. రాత్రికిరాత్రే సంభవించిన వరదల నుంచి ప్రాణాలు దక్కితే చాలనుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య ముంపుగ్రామాలను పునఃనిర్మిస్తామని భరోసాఇచ్చారు. అందులో భాగంగానే చేపట్టిన పునరావాస పనులు ఐదేళ్లుగా ఓ కొలిక్కిరావడం లేదు. వడ్డేపల్లి మండలంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలంపూర్ పట్టణ బాధితుల కోసం సేకరించి సుమారు 44 ఎకరాల్లో ముళ్లపొదలు మొలిశాయి. మద్దూరు మండలంలో ఇప్పటికీ స్థలసేకర ణ జరగలేదు. చేనేతకు పుట్టినిల్లు రాజోలి నేతన్నను ఆదుకునేదిక్కులేదు. ఆరేళ్లుగా అసంపూర్తిగానే..! వరద బాధితుల పునరావాస పనులు ఆరేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. అలంపూర్, మద్దూరులో ఇళ్ల నిర్మాణం ఊసేలేదు. అయిజ మండలంలోని కుట్కనూరు, ఇటిక్యాలం మండలంలోని ఆర్.గార్లపాడు గ్రామాల్లో పునరావాసం పనులు జరగడం లేదు. రాజోలిలో 212 ఎకరాల స్థలాన్ని సేకరించి 3048 ఇళ్లను ప్రతిపాదించగా.. 2625 నిర్మాణాలను మాత్రమే చేపట్టారు. వీటిలో ప్రముఖ ఇన్ఫోసిస్ స్వచ్ఛంద సంస్థ 600 ళ్లను నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ కూడా 483 ఇళ్లను పూర్తిచేయగా..117ఇళ్లను మొదలుపెట్టలేదు. ఆర్డీటీ అనే స్వచ్ఛంద సంస్థకు 700 ఇళ్లు అప్పగించగా 692 నిర్మాణాలను పూర్తిచేయగలిగింది. పడమటి గార్లపాడు నిర్వాసితులకు రాజోలిలోనే 72 ఇళ్లు మంజూరుచేశారు. కానీ స్థానికులు తమ గ్రామంలోనే ఇళ్లు నిర్మించాలని కోరడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కిరాలేదు. మరో వరద గ్రామం తూర్పుగార్లపాడులో 251 ఇళ్లను గాను 248 ఇళ్లకు స్లాబ్‌లు పూర్తిచేశారు. చాలాచోట్ల నిర్మాణాలు పూర్తయినా.. ఇళ్లకు తలుపులు, కిటికీలు, బండ పరుపు వంటి పనులు జరగ లేదు. అలంపూర్ పట్టణ నిర్వాసితులకు 44 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంది. మానవపాడు మండలం మద్దూ రు లో సుమారు 500 కుటుంబాలు వరదల్లో తీవ్రంగా నష్టపోయాయి. కానీ స్థలం కొరతను సాకుగా చూపుతూ ఇప్పటికీ స్థలసేకరణ చేయలేదు. నేతన్నకు చేయూత కరువు రాజోలి, అలంపూర్‌లోని చేనేతకార్మికులకు ప్రభుత్వపరంగా ఆదరణ కొరవడిం ది. రాజోలిలో 764 చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నేత పనిద్వారానే ఎక్కువమంది ఉపాధిపొందుతారు. వరదల్లో చేనేత కార్మికులు ఇళ్లతోపాటు జీవనాధారమైన మగ్గాలు కొట్టుకుపోయాయి. చేనేత కుటుంబాలకు ఇళ్లతోపాటు షెడ్డు ల నిర్మాణం చేపడతామన్నారు. ఇందుకోసం రూ.42,500 ఆర్థికసాయం ఇస్తామని ప్రభుత్వం హామీఇచ్చింది. అయితే నిర్మాణాల్లో జాప్యం జరగడంతో నిర్మాణవ్యయం రెండింతలు పెరిగింది. షెడ్డులు నిర్మించుకున్న 53 మంది ప్రభుత్వసాయం కోసం ఎదురుచూస్తున్నారు. -
మా ఘోష వింటారా?!
వేలేరుపాడు/అశ్వారావుపేట, న్యూస్‌లైన్: పోలవరం కారణంగా ఒరిస్సా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మునిగిపోతున్నది కేవలం 13 గ్రామాలే. అయినా వీరికి పరిహారం కోసం కేంద్రం గంగవైలెత్తి ఉరకలు పెడుతోంది. ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజాప్రతినిధులు కూడా పోలవరానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కానీ, మన రాష్ట్రంలో మునిగిపోతోంది 205 గ్రామాలు. నష్టపోతున్నది లక్షన్నర మంది ప్రజానీకం. ఇప్పుడు వీరి భవితవ్యం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. నష్టపరిహారం, పునరావాసం సమస్యలకు తోడు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం ఇక్కడి వారిని మరింత మానసిక క్షోభకు గురిచేస్తోంది. అసలు మన ప్రజాప్రతినిధులు ఏం చే స్తున్నారో... అమాయక గిరిజనుల పక్షాన ఏం పోరాటాలు చేశారో... వారి బతుకు బండి సజావుగా సాగేందుకు ఎలా సహకరించారో .. వెతుక్కున్నా అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో అసలు పోలవరం ముంపు ప్రాంతాల్లోని వాస్తవిక పరిస్థితిపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం...... పరిహారం పరిహాసమేనా? పోలవరం ప్రాజెక్ట్ వల్ల రెండు డివిజన్లలో వేలేరుపాడు, కుక్కునూరు, భద్రాచలం, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం, బూర్గంపహాడ్ మండలాల్లో 38 వేల కుటుంబాల వారు నిర్వాసితులు కానున్నారు. ఆయా గ్రామాల్లో నీటిపారుదల శాఖ అందించిన లెక్కల ప్రకారం 72వేల ఎకరాలకు నష్టపరిహారం అందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు ప్రభుత్వం 22, 500 ఎకరాలకు రూ.165 కోట్ల మేర పరిహారం అందించింది. ఇంకా యాభైవేల ఎకరాలకు సుమారు రూ.400 కోట్లకు పైగా పరిహారం చెల్లించాల్సి ఉంది. గిరిజనులకు భూమికి బదులు భూమి 32,220 ఎకరాలు అధికారిక లెక్కల ప్రకారం చూపించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అధికారులు కేవలం 1695 ఎకరాలను మాత్రమే గుర్తించగలిగారు. ఎక్కడా సెంటుభూమి గిరిజనులకు ఇవ్వలేదు. కానీ రెవెన్యూ పహణీ రికార్డుల్లో పట్టాదారు కాలంలో రైతుల పేర్లు లేకుండా ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ పేరును ప్రభుత్వం నమోదు చేయిస్తోంది. ఇలా వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, భద్రాచలం, విఆర్‌పురం,చింతూరు మండలాల్లో 90 గ్రామాల్లో 3, 771 మంది గిరిజనులు తమకు చెందిన పదివేల 175 ఎకరాల 11 కుంటల భూమిపై పట్టాహక్కు కోల్పోయారు. ఆయా మండలాల్లో పహణీ రికార్డులో పట్టాదారు, అనుభవదారు కాలమ్‌లో గిరిజనుల పేర్లకు బదులు ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ పేర్లు రాస్తున్నారు. మీ సేవకేంద్రాల్లో తీసుకునే పహణీనకళ్లలో కూడా ఆ గ్రామాల సర్వేనెంబర్లన్నీ ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ పేరుతో నింపి ఉన్నాయి. పాల్వంచ పోలవరం యూనిట్-1 పరిధిలోని వేలేరుపాడు,కుక్కునూరు, కూనవరం మండలాల్లో 2,160 ఎకరాల పట్టాలు కలిగిన 787 మంది గిరిజనులకు భూమికి బదులు భూమి చూపించాల్సి ఉంది. 238 మంది గిరిజన రైతులకు చెందిన 873 ఎకరాల డీ పట్టాభూములకు కూడా భూమికిబదులు భూమి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు భూసేకరణ చేపట్టిన పాల్వంచ యూనిట్-2పరిధిలోని కూనవరం, వేలేరుపాడు, మండలాల్లో తాళ్ళగుడెం,కొండాయిగుడెం, వుల్పర్పేట, బొజ్జరాయిగుడెం,గొమ్మువారిగుడెం,తాట్కూరుగొమ్ము,చిగురుమామిడి,నార్లవరం,తదితర గ్రామాల్లో 562 మంది గిరిజన రైతులు 1671.31 ఎకరాలు, భద్రాచలం యూనిట్ 2 పరిధిలోని కూనవరం,విఆర్‌పురం,చింతూరు,మండలాల్లోని 40 గ్రామాల్లో 1944 మంది గిరిజనులు 5వేల20.06 ఎకరాలు భూమిని కోల్పోయారు. భద్రాచలం యూనిట్-2 పరిధిలోని భద్రాచలం, కూనవరం మండలాల్లో 20 గ్రామాల్లో 190 మంది గిరిజనులకు చెందిన 448.94 ఎకరాలు భూమికి బదులు భూమి చూపించాల్సి ఉంది. ఇందులో ఒక్క గ్రామంలో కూడా ఏ ఒక్క గిరిజనుడికి భూమి చూపించకుండానే రికార్డుల్లో వారి పేర్లను తొలగించారు. ఇంతలోనే మళ్లీ సీమాంధ్రలో కలిపే అంశం తెరపైకి వచ్చింది. దీంతో తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో కొనసాగిన తమ గ్రామాలు ఆంధ్రాలో కలపడం ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మోడల్ కాలనీలు వృధాయేనా...? మీరు కోరుకున్న చోట పునరావాసం కల్పిస్తాం...అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది...అంటూ అధికారులు గతంలో చెప్పిన మాటలకు ఈ ప్రాంత నిర్వాసితులు తలొగ్గారు. తాముకోరుకున్న చోటనే పునరావాసం కల్పిస్తున్నారని గ్రామాలు ఖాళీచేసేందుకు ఒప్పుకున్నారు. కానీ అధికారులు ఆనాడు చెప్పిన మాటలు నేడు నీటిమీద రాతలయ్యాయి. జిల్లాలో ఐదేళ్ల క్రితం నిర్వాసితుల కోసం మూడుచోట్ల తొమ్మిది కోట్ల వ్యయంతో పునరావాస కాలనీలు నిర్మించారు. వేలేరుపాడు మండలం కొయిదా గ్రామపంచాయతీలోని పేరంటపల్లి, కాకీస్నూరు, టేకుపల్లి గ్రామాల్లో 333 గిరిజన కుటుంబాలకు అశ్వారావుపేట మండలం మద్దికొండలో మోడల్ కాలనీ నిర్మించారు. ఇక్కడ ప్రభుత్వం 23ఎకరాల 12కుంటల భూమిని కొనుగోలు చేసింది. ఈ పంచాయతీ పరిధిలో వ్యవసాయానికి అవసరమైన 425 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇక్కడ మొత్తం రూ.5 కోట్ల వరకు వెచ్చించారు. ఇదే మండలంలోని పూచిరాల కాలనీకి చెందిన 122 కుటుంబాల కోసం వేలేరుపాడు మండలం రాళ్లపుడిలో ఐదేళ్ల క్రితం పునరావాస కాలనీ పనులు చేపట్టారు. ఇక్కడ రూ.3 కోట్ల వరకు వెచ్చించారు. కూనవరం మండలంలోని నిర్వాసితుల కోసం చర్ల మండలం కలివేరు వద్ద 12 ఇళ్లు నిర్మించారు. ఈ మూడు చోట్ల మోడల్ కాలనీలు నిరుపయోగంగా ఉన్నాయి. పరిహారం పంపిణీలోనూ మోసం... జిల్లాలో నిర్వాసితులు భూనష్టపరిహారం పంపిణీలో కూడా మోసపోయారు. ఇక్కడి ముంపు ప్రాంతంలో కేటగిరి-1కు లక్షాపదిహేనువేలు, కేటగిరి-2కు లక్షా30 వేలు, కేటగిరి-3కు లక్షా45 వేలు ఇచ్చారు. సారవంతమైన భూములైనప్పటికీ లక్షా45 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పశ్చిమ,తూర్పు జిల్లాల్లో కేటగిరిల తేడాలేకుండా పంపిణీ జరిగింది. ఏ భూమికైనా సరే రూ.3లక్షల నుంచి రూ.3లక్షల50 వేలవరకు అందించారు. పరిహారం పంపిణీ జరిగిన ఆ జిల్లాల మండలాల్లో 1/70 చట్టం అమలులో ఉంది. ఖమ్మం జిల్లాలో1/70 చట్టం అమలులోఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో సారవంతమైన నల్లరేగడి నేలలున్నాయి. పశ్చిమ,తూర్పుగోదావరి జిల్లాల రైతులు వలసవచ్చి ఈ ప్రాంతంలో పంటలు సాగుచేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ విలువను ఉన్నతాధికారులుతగ్గించి చూపించారు. ప్రభుత్వసొమ్ము ఆదాచేసినట్లు గుర్తింపుపొందాలని రైతులను ముంచారు. ఏది ఏమైనా తెలంగాణను వీడేదిలేదంటూ తమకు ఈ ప్రాంతంలోనే పునరావాసం కల్పించాలని, ఎకరాకు కనీస ధర ఐదులక్షలు ఇవ్వాలని, కుటుంబంలో 18 ఏళ్లు నిండిన యువకులకు ప్యాకేజీ అమలయ్యేలా చూడాలని, కుటుంబంలో అర్హత ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, కోరుకున్న చోట పునరావాసం కల్పించాలని నిర్వాసితులు కోరుతున్నారు. సంబంధాలను తెంచుకోమంటారా? ఈ ప్రాంత వాసుల సంబంధ బాంధవ్యాలు పరిసర మండలాలతో ఉండటంతో అంతా దగ్గర గ్రామాల్లో స్థిరపడాలని అనుకున్నారు. అందువల్లనే గ్రామాలు ఖాళీచేసేందుకు మానసికంగా నిర్వాసితులు సిద్ధపడ్డారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామాలన్నిటినీ సీమాంధ్రలో కలిపేందుకు ఆలోచిస్తుండటంతో ముంపు ప్రాంత బాధితులు కలవర పడుతున్నారు. ఎన్నడూ తమకు సంబంధంలేని సీమాంధ్ర ప్రాంతంలో ఎక్కడ పునరావాసం కల్పిస్తారో? అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ,తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కడైనా తమ ప్రాంతానికి దూరంగా పునరావాసం కల్పిస్తే తమ పరిస్థితి ఏమిటని కలవరపడుతున్నారు. ఒక రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రం వెళితే తమకు బతకగలిగే భరోసా ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పచ్చని అడవి తల్లిని నమ్ముకొని ఇక్కడి గిరిజనులు బతుకుతున్నారు. మైదాన ప్రాంతంలో అయితే వీరికి ఇబ్బందికర పరిస్థితులు చోటుచేసుకుంటాయనే వాదనలు బలంగా ఉన్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రధానంగా అటవీ ద్వారా పొందాల్సిన అటవీ ఆదాయవనరులు కోల్పోతారు. చేపల వేట అంటే గిరిజనులకు అమితమైన ప్రేమ. గోదావరి పరివాహక ప్రాంతమైనందున చేపలవేట ఎక్కువగా సాగిస్తుంటారు. ఇది కూడా వీరు కోల్పోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపుతో ఈ ప్రాంతాన్ని జలసమాధిచేస్తున్నందున ఈ ప్రాంత పోలవరం రిజర్వాయర్ పై చేపలు వేటాడేందుకు తమకే పూర్తి హక్కులు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడైనా మునిగేదే! పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా.. కాకున్నా.. వేలేరుపాడు, కుక్కునూరు, భద్రాచలం, వీఆర్ పురం, చింతూరు, కూనవరం, భద్రాచలం మండలాల్లోని పలు గ్రామాలు ఏటా వరదలకు మునకకు గురవుతుంటాయి. గోదావరి ప్రవాహం ఉధృతంగా లేకున్నా.. భద్రాచలం దాటిన తర్వాత శబరి నది ప్రవాహం ఊపందుకుంటే గోదావరి ఉప్పొంగుతుంది.. పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతుంది. గతేడాది జులై, ఆగస్టు నెలల్లో కురిసిన కొద్దిపాటి వర్షాలకే గోదావరి వరద బీభత్సంగా వచ్చి పడింది. దీంతో పరీవాహక మండలాల్లో యాభైశాతం పైగా మునకకు గురయ్యాయి. ముంపు నెల రోజులకు మించకుండా ఉన్నప్పటికీ.. నష్టం కోట్లాదిరూపాయల్లో జరిగింది. కుక్కునూరు మండలంలో గుండేటివాగు, వేలేరుపాడు మండలంలో పెదవాగులు గోదావరి నీరు వెనక్కు ఎగపోటు వేయడంతో గ్రామాలను, గ్రామశివార్లలోని పంట పొలాలను ముంచెత్తుతాయి. ఎఫ్ఆర్ఎల్ రాళ్లు సరయినవేనా..? ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్ఆర్ఎల్) రాళ్లు పేరిట పోలవరం రిజర్వాయర్ కట్టాక నిండితే ఇక్కడి దాకా నీళ్లు వస్తాయంటూ అధికారులు రాళ్లను పాతారు. కాగా ఈరాళ్లకు దాదాపు అరకిలోమీటరు దాకా గోదావరి వరద నీళ్లు ఏటా వస్తున్నాయి. పోలవరం నిర్మించకుండానే గోదావరి వరదకే ఇంత బీభత్సం జరుగుతుంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక.. ఫుల్ రిజర్వాయర్ లెవల్‌కు నీళ్లు ఉండగా.. మరోసారి గోదావరి వరద వస్తే.. అప్పుడు నీటిని ఎవరాపుతారు..? రిజర్వాయర్ గేట్లు, రిజర్వాయర్ ఆపరేషన్ అన్నీ సీమాంధ్ర అధికారుల చేతిలో ఉంటే.. ఇక్కడి భూభాగం మునకకు గురవుతుంటే పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఎలా అందుతుంది..? గోదావరి వరద వచ్చిందంటే నిముషాల్లో నీటి మట్టాలు మారిపోతుంటాయి... ఒకవేళ ముంపు ఎఫ్ఆర్ఎల్ రాళ్లను దాటి వస్తే ముంపు గ్రామాలను పట్టించుకునే అధికారులెవరు? గతేడాది వరద బాధితులకు బియ్యం, ఆవకాయ పచ్చడి ఇచ్చి చేతులు దులుపుకున్న ఘనత మన అధికారులకు దక్కింది. రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్ర ప్రజలుగా చెలామణీ అయ్యే మన వాళ్లు మునకకు గురయితే మన అధికారులు వెంటనే స్పందిస్తారా..? తెలంగాణ భూభాగంలో ముంపునకు గురవుతున్న వారికోసం ఆంధ్ర అధికార యంత్రాంగం ఆలోచిస్తుందా..? అనే సందేహాలకు సమాధానాలు వెతుక్కునే పనిలో ముంపు గ్రామాల ప్రజలున్నారు. పోలవరం కట్టేదాకా కష్టాలేగా..? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు.. నిర్మాణం పూర్తయిన తర్వాతా.. నిర్వాసిత రైతులు వారు కోల్పోయిన భూముల్లో వేసవి కాలంలో.. నీటి నిల్వలు తక్కువగా ఉన్న రోజుల్లో వ్యవసాయం చేసుకోవచ్చని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పుడే చెప్పారు. అయితే.. ముంపు గ్రామాల ప్రజలు నష్టపరిహారం తీసుకున్నా కొందరు వారి భూముల్లో వైఎస్ ఇచ్చిన భరోసాతో వ్యవసాయం చేసుకుంటున్నారు. పరీవాహక గ్రామాల్లో మంచినీటి పథకాలు గోదావరి నుంచే అమర్చబడ్డాయి. వీటితోపాటు ముంపులో లేని గ్రామాలకు కూడా మంచినీటి సరఫరా ఈపథకాల గుండా జరుగుతోంది. రుద్రంకోట వద్ద రూ.11 కోట్లతో తాగునీటి పథకాన్ని నిర్మిస్తున్నారు. ఈపథకం ద్వారా వేలేరుపాడు మండలంలోని అన్ని గ్రామాలకు గోదావరి నీటిని శుద్ది చేసి సరఫరా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర విభజనలో మండలం రెండు ముక్కలయితే.. పథకం ఆంధ్రలో ఉంటే తెలంగాణలోని మిగిలిన గ్రామాలకు తాగునీరు ఇస్తారా.. ఇవ్వరా.. అనే సందేహాలకు సమాధానాలు లేవు. -
‘మాజీ’ల అర్జీలు పరిష్కరించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కోసం మాజీ నక్సల్స్ చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. లొంగి పోయిన నక్సల్స్ పునరావాస పెండింగ్ అర్జీల పరిష్కారంపై కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్షించారు. స్వయం ఉపాధి పథకాల మం జూరు కోసం ఐటీడీఏ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్, పశుసంవర్థక, రెవెన్యూ శాఖల వద్ద మాజీ నక్సల్స్ అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బ్యాంకు కాన్సెంట్ ఇవ్వకుండా గ్రౌం డింగ్ కాని అర్జీలు 21 ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి 15లోగా అన్ని శాఖల వద్ద ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులకు మంజూరు చేయాలన్నారు. న క్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను లొంగిపోయిన నక్సల్స్‌తో భర్తీ చేసే అంశాన్ని పరీశీలించాలన్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు స్వయం ఉపాధి కింద రుణాలు అందించేందు కు చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ 12 మంది మాజీ నక్సల్స్‌కు వారంలోగా తక్షణ సహాయం అందిస్తామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ జిల్లాలో లొంగుబాటుకు చాలామంది నక్సల్స్ ఆసక్తి చూపుతున్నారని అన్నారు. భవిష్యత్తులో లొంగుబాట్లు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పోలీసుల నుంచి వేధింపులు లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి, కొత్తగూడెం ఓఎస్డీ తిరుపతి, ఖమ్మం ఆర్డీఓ సంజీవరెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు, మాజీ నక్సల్స్ పాల్గొన్నారు.