ఐసీసీ ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌కు మరో 99 రోజులు మిగిలిఉంది. భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగాటోర్నీలో పది స్టేడియాల్లో 48 మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్ జరగనున్నాయి. ఇక వరల్డ్‌కప్‌కు బీసీసీఐ టీమిండియా బెస్ట్ టీంను ఎంపిక చేసే పనిలో ఉంది. వెస్టిండీస్, ఐర్లాండ్‌తో వరుసగా టీమిండియా వన్డే సిరీస్‌లు ఆడనుంది.
ఆ తర్వాత ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఈ టోర్నీలో ఆటగాళ్లు చేసే ప్రదర్శన ద్వారా తుది జట్టుపై ఒక అంచనాకు రానున్నారు. ఇకపోతే గాయాలతో దూరమైన కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలు కూడా వరల్డ్‌కప్ ఆడాలనే ఉత్సాహంతో త్వరగా కోలుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు వీరంతా ఎన్‌సీఏ అకాడమీలోని రీహాబిలిటేషన్ సెంటర్‌లో వేగంగా కోలుకుంటున్నారు.
టీమిండియాకు ప్రధాన పేసర్ అయిన బుమ్రా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఎన్సీఏలో రిహాబిలిటేషన్ పొందుతున్న బుమ్రా.. వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేసినట్లు సమాచారం. సర్జరీ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. గత కొంతకాలంగా ఎన్సీఏలోనే గడుపుతున్నాడు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుంటున్న అతడు.. ఈ క్రమంలోనే ఏడు ఓవర్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఒక ఫాస్ట్ బౌలర్ గాయం నుంచి కోలుకోవడం అంత సామాన్యమైన విషయమైతే కాదు. మేం బుమ్రా విషయంలో నిత్యం మానిటరింగ్ చేస్తున్నాం. అతడు వేగంగా కోలుకోవడమే గాక ఫిట్‌నెస్‌ను కూడా మెరుగుపరుచుకుంటున్నాడు. నెట్స్‌లో ఇవాళ వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. క్రమంగా అతడు మరిన్ని ఓవర్లు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో అతడు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అక్కడ ఎలా ఆడతాడో చూశాక బుమ్రా ఫిట్‌నెస్‌పై ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే అతడు ఐర్లాండ్‌తో ఆగస్టులో ఆడతాడో లేదో అనే దానిపై ఒక అంచనాకు రావొచ్చు''అని పేర్కొన్నాడు.
ఇక రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లతో పాటు బుమ్రాను ఆగస్టులో జరిగే ఆసియా కప్ వరకైనా సిద్ధం చేయాలనే లక్ష్యం పెట్టుకున్న బీసీసీఐ ఆ మేరకు ప్రణాళికలు కూడా రెడీ చేసింది. ఆసియా కప్ కంటే ముందే ఐర్లాండ్ తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో బుమ్రాను పరీక్షించి ఆసియా కప్.. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ కు సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
🚨🚨 Team India's fixtures for ICC Men's Cricket World Cup 2023 👇👇
— BCCI (@BCCI) June 27, 2023
#CWC23 #TeamIndia pic.twitter.com/LIPUVnJEeu
చదవండి: #ICCWorldCup2023: 2011 నుంచి ఆతిథ్య జట్టుదే.. ఈ లెక్కన వరల్డ్‌కప్ మనదేనా!
#ICCWorldCup2023: టీమిండియాతో తలపడే ఆ ఐదు జట్లకు వేర్వేరు పిచ్‌లు..
Comments
Please login to add a commentAdd a comment