NCA
-
బుమ్రా ఫిట్‌గా ఉన్నాడా!
బెంగళూరు: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఆడే అవకాశాలపై సందిగ్ధత వీడనుంది. వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటూ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న బుమ్రా ఫిట్‌నెస్‌పై నేడు స్పష్టత రానుంది. అతనికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం శనివారం బీసీసీఐకి తమ నివేదికను అందజేస్తుంది. ఇందులో బుమ్రా గాయం తీవ్రత, చికిత్సతో పాటు మ్యాచ్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ప్రస్తుతానికి భారత పేసర్ బెంగళూరులోనే ఉండనున్నాడు. నివేదికను అందుకున్న తర్వాత బోర్డు అధికారులు బుమ్రాను ఆడించే విషయంపై భారత టీమ్ మేనేజ్మెంట్తో చర్చించే అవకాశం ఉంది. జనవరిలో సిడ్నీ టెస్టు అనంతరం ఆ్రస్టేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత బుమ్రా గాయానికి స్కానింగ్ తీశారు. వెన్ను నొప్పి కారణంగానే ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌కు దిగలేదు. నాడు ఆ రిపోర్టులను న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ క్రీడా వైద్యుడు డాక్టర్ రోవన్ షూటెన్కు చూపించారు. అతని పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగింది కాబట్టి ఇప్పుడు కూడా రోవన్ అభిప్రాయం కీలకం కానుంది. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు ఈ నెల 12 వరకు గడువు ఉంది. బుమ్రా పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో భారత జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లేదా పేసర్ హర్షిత్ రాణాలలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మార్చి 1న బీసీసీఐ ఎస్జీఎం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్త కార్యదర్శి పదవి కోసం ఆసక్తికర పోటీ సాగుతోంది. బోర్డులో ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు సీనియర్ సభ్యులు ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. అవిషేక్ దాల్మియా (బెంగాల్ సంఘం), రోహన్ జైట్లీ (ఢిల్లీ సంఘం), సంజయ్ నాయక్ (ముంబై సంఘం)లలో ఒకరికి ఈ అవకాశం దక్కనుంది. అయితే కార్యదర్శి, కోశాధికారి ఎంపిక తరహాలోనే ఈ పదవికి కూడా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. నిబంధనల ప్రకారం సంయుక్త కార్యదర్శి ఎంపిక కోసం మార్చి 1న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) నిర్వహించనుంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర సంఘాలకు నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న దేవ్జిత్ సైకియా కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. -
వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ సెప్టెంబరుతో ముగియనుంది. అయితే ఎన్సీఏ హెడ్‌గా మరో ఏడాది కాలం పాటు అతడి పదవీకాలాన్ని పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. బెంగళూరు శివార్లలో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిరి్మస్తున్న కొత్త ఎన్సీఏ 2025లో ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష్మణ్ కొనసాగితే బాగుంటుందని బోర్డు భావించింది. కొన్నాళ్ల క్రితం వరకు వ్యక్తిగతంగా కొంత అనాసక్తి ప్రదర్శిస్తూ లక్ష్మణ్ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు బోర్డు జోక్యంతో అతను కొనసాగనున్నాడు. ఎన్సీఏ హెడ్‌గా ఉన్న సమయంలో ఇంజ్యూరీ మేనేజ్మెంట్, ప్లేయర్ రీహాబిలిటేషన్, కోచింగ్ కార్యక్రమాలు, వివిధ వయో విభాగాల క్రికెట్ టోరీ్నల ప్లానింగ్ వంటి అంశాల్లో లక్ష్మణ్ సమర్థంగా పని చేశాడు. ఎన్సీఏ కోచ్‌లు హృషికేశ్ కనిత్కర్, సాయిరాజ్ బహుతులే, షితాన్షు కొటక్ కూడా కొనసాగే అవకాశం ఉంది. -
శ్రేయస్ అయ్యర్‌కు లైన్ క్లియర్
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుభవార్త. ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు అధికారికంగా లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అయ్యర్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్సీఏ సలహా మేరకు అయ్యర్ ముంబైలోని వెన్నెముక నిపుణుడిని సంప్రదించగా.. అతను అయ్యర్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. సదరు వెన్నెముక వైద్యుడు అయ్యర్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తూనే ఓ మెలిక కూడా పెట్టాడని తెలుస్తుంది. గత కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్న అయ్యర్ బంతిని డిఫెండ్ చేసే క్రమంలో కాలును ఎక్కువగా చాచ కూడదని హెచ్చరించినట్లు సమాచారం. ఒకవేళ అయ్యర్ అలాంటి షాట్లు ఆడాల్సి వస్తే వెన్ను సమస్య తిరగబెట్టే ప్రమాదమున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ అయ్యర్ వెన్ను సమస్య కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. -
లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్.. కెప్టెన్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ..!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్ ఐపీఎల్ 2024లో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చని ఎన్సీఏ క్లీన్ చిట్ ఇచ్చింది. రాహుల్ మరో రెండు రోజుల్లో జట్టుతో కలుస్తానడి పేర్కొంది. అయితే సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో రాహుల్ కేవలం బ్యాటర్‌గా మత్రమే కొనసాగాలని కండీషన్ పెట్టింది. ప్రస్తుతం రాహుల్ వికెట్‌కీపింగ్ భారాన్ని మోస్తే అతని గాయం తిరగబెట్టవచ్చని హెచ్చరించింది. కాగా, రాహుల్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా రాహుల్ ఆ సిరీస్‌లోని తదుపరి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. గతేడాది ఐపీఎల్ సందర్భంగా కూడా గాయపడిన రాహుల్ ఈ సీజన్‌కు కూడా దూరమవుతాడని అంతా అనుకున్నారు. అయితే అతను ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో త్వరగా కోలుకుని త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. లక్నో సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. జైపూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో లక్నో.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది. -
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు సారధి రిషబ్ పంత్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎన్సీఏ ఎన్ఓసీతో ఐపీఎల్ 2024 ఆడేందుకు పంత్‌కు లైన్ క్లియర్ అవుతుంది. ఎన్సీఏ నుంచి అధికారికంగా అనుమతి లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ పేరును జట్టులో చేర్చలేదు. గత కొద్ది రోజులుగా పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ క్యాంప్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. అతని ఫిజికల్ ఫిట్నెస్ చూస్తే మనుపటి తరహాలో కనిపిస్తుంది. ప్రాక్టీస్ క్యాంప్‌లో పంత్ మునుపటిలా భారీ షాట్లు ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. అయితే పంత్ వికెట్‌కీపింగ్ చేయడంపై మాత్రం డీసీ యాజమాన్యం ఆఖరి నిమిషం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోదని తెలుస్తుంది. పంత్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని పలు నివేదికలు తెలుపుతున్నాయి. 2022 డిసెంబర్ 31న పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కొద్ది రోజుల కిందటే అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. పంత్ ఎన్సీఏలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. వీరు క్లీన్ చిట్ ఇస్తేనే పంత్ ఐపీఎల్ 2024లో ఆడతాడు. పంత్ గైర్హాజరీలో గతేడాది డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో డీసీ.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. తొలి విడతలో క్యాపిటల్స్ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. పంజాబ్ (మార్చి 23), రాజస్థాన్ (మార్చి 28), సీఎస్కే (మార్చి 31), కేకేఆర్ (ఏప్రిల్ 3), ముంబై ఇండియన్స్‌ను (ఏప్రిల్ 7) డీసీ ఢీకొట్టనుంది. -
IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. గాయంపై అప్డేట్ ఇచ్చిన జడేజా
వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో టీమిండియా సమం చేసింది. ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమయ్యారు. తొలి టెస్టులో తొడకండరాలు పట్టేయడంతో వారిద్దరూ వైజాగ్ టెస్టుకు అందుబాటులో లేరు. కాగా రాహుల్, జడ్డూ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో ఉన్నారు. తమ ఫిట్నెస్ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో జడేజా తన గాయం గురించి అప్డేట్ను అభిమానులతో పంచుకున్నాడు. తన గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నానని ఓ ఫోటో షేర్ చేస్తూ సోషల్‌మీడియా వేదికగా జడ్డూ తెలిపాడు. ‘నా ఆరోగ్యం మెరుగుపడుతోంది’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఆ జట్టులో రవీంద్ర జడేజాకు చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. కాగా ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో జడ్డూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులతో జట్టుకు భారీ స్కోర్ అందించిన అతడు ఆ తర్వాత బంతితోనూ చెలరేగి మూడు కీలక వికెట్లు తీశాడు. ఇక ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: #Sachin Dhas: తండ్రి కలలు కన్నాడు.. కొడుకు నేరవేర్చాడు! ఎవరీ సచిన్ దాస్? View this post on Instagram A post shared by Ravindrasinh jadeja (@royalnavghan) -
జిమ్‌లో చెమటోడ్చుతున్న హార్దిక్.. రీ ఎంట్రీ అప్పుడే! వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీ మధ్యలో తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జట్టుకు హార్దిక్ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు , దక్షిణాఫ్రికా పర్యటనకు పాండ్యా దూరమయ్యాడు. అదే విధంగా జనవరి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో లేడు. హార్దిక్ చీలమండ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు. అతడు ఐపీఎల్-2024 సీజన్‌తో రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ఉన్న హార్దిక్.. పూర్తి ఫిట్నెస్ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. బరువులు ఎత్తుతూ కఠోర సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాతో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవరించనున్నాడు. ఐపీఎల్-2024 సీజన్ మినీ వేలానికి ముందు హార్దిక్‌ను గుజరాత్ నుంచి ముంబై ఫ్రాంచైజీ ట్రేడ్ చేసి అందరని ఆశ్చర్యపరిచింది. చదవండి: IND vs SA: రోహిత్ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్.. చర్యలకు సిద్దం!? -
బ్యాట్ పట్టిన రిషబ్ పంత్.. సిక్సర్ల వర్షం! వీడియో వైరల్
టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న పంత్.. శర వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మెదలుపెట్టేశాడు. మైదానంలో అడుగుపెట్టిన రిషబ్.. ఇక ఇది ఇలా ఉండగా.. గాయపడిన 8 నెలల తర్వాత పంత్ తొలిసారి మైదానంలో అడుగుపెట్టాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఫాండేషన్ నిర్వహించిన ఓ స్ధానిక టోర్నీలో బరిలోకి దిగిన పంత్.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫ్రంట్ ఫుట్‌లో ఎక్స్ట్రా కవర్ మీదుగా పంత్ కొట్టిన సిక్స్ అభిమానులను అలరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక స్వదేశంలో వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో పంత్ పునరాగమనం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్‌కు రానుంది. చదవండి: #Shreyas Iyer: మంచి మనసు చాటుకున్న శ్రేయస్ అయ్యర్.. వీడియో వైరల్ #CWC2023 #AsiaCup #Rishabhpant What's your reaction if rishabh pant returns into the team for ODI WC #AUSvENG #JaspritBumrah #ICCWorldCup2023 pic.twitter.com/aRl9dioNur — CrickStory (@CrickStory) August 16, 2023 -
మంచి మనసు చాటుకున్న శ్రేయస్ అయ్యర్.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న అయ్యర్.. బుధవారం బయటకు వచ్చాడు. ఈ క్రమంలో కారులో వెళ్తున్న సమయంలో ఓ తండ్రి చిన్నారితో సహా అయ్యర్ వద్దకు వెళ్లి సాయం కోరాడు. అయ్యర్ వెంటనే ఆ వ్యక్తిను చూసి నవ్వి జేబులో నుంచి కొంత డబ్బును వారికి ఇచ్చాడు. అదే విధంగా పక్కన మరో వ్యక్తికి కూడా శ్రేయస్ సాయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా అయ్యర్.. మనసున్న మారాజు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆసియాకప్‌తో రీ ఎంట్రీ.. వెన్ను గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న అయ్యర్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అయ్యర్ ఏన్సీఏలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అదే విధంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా శ్రేయస్ మొదలు పెట్టాడు. దీంతో అతడు ఆసియాకప్-2023తో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అతడితో పాటు మరో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ఒకట్రెండు రోజుల్లో భారత జట్టును బీసీసీఐ ప్రకటించే ఛాన్స్ ఉంది. చదవండి: నెమార్‌కు బంపరాఫర్.. ఏకంగా 832 కోట్లు A kind gesture from Shreyas Iyer. - He is winning hearts of all people. pic.twitter.com/l5jSIB0DZI — Johns. (@CricCrazyJohns) August 16, 2023 -
ఎన్సీఏలో ఐదుగురు క్రికెటర్లు.. బీసీసీఐ మెడికల్ బులెటిన్ విడుదల
బెంగళూరు: గాయాలకు గురై జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్న ఐదుగురు భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి బీసీసీఐ మెడికల్ బులెటిన్‌ను విడుదల చేసింది. వేర్వేరు కారణాలతో ఎన్సీఏలో కోలుకుంటున్న వీరందరి ఫిట్నెస్ స్థాయి ప్రస్తుతం మెరుగ్గా ఉందని బోర్డు వెల్లడించింది. బోర్డు చెప్పిన వివరాల ప్రకారం... పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ రీహాబిలిటేషన్ చివరి దశలో ఉన్నారు. నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ కూడా చేస్తున్నారు. ఎన్సీఏ నిర్వహించే ప్రాక్టీస్ మ్యాచ్‌లలో వీరిద్దరు ఆడతారు. ప్రాక్టీస్ గేమ్‌లను పరిశీలించిన తర్వాత వీరిద్దరిపై తుది నిర్ణయం తీసుకుంటారు. బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్ట్రెంత్, ఫిట్నెస్ డ్రిల్స్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ డ్రిల్స్ తీవ్రత పెంచి వారి పరిస్థితిని అంచనా వేస్తారు. కారు ప్రమాదానికి గురై కోలుకుంటున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీహాబిలిటేషన్ చాలా వేగంగా సాగుతోంది. నెట్స్‌లో బ్యాటింగ్ సాధనతో పాటు వికెట్ కీపింగ్ కూడా పంత్ మొదలు పెట్టాడు. స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, రన్నింగ్‌కు సంబంధించి అతని కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఫిట్నెస్ కార్యక్రమాన్ని పంత్ అనుసరిస్తున్నాడు. -
వరుసగా ఏడు ఓవర్లు బౌలింగ్.. పూర్తిగా కోలుకున్నట్లేనా!
ఐసీసీ ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌కు మరో 99 రోజులు మిగిలిఉంది. భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగాటోర్నీలో పది స్టేడియాల్లో 48 మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్ జరగనున్నాయి. ఇక వరల్డ్‌కప్‌కు బీసీసీఐ టీమిండియా బెస్ట్ టీంను ఎంపిక చేసే పనిలో ఉంది. వెస్టిండీస్, ఐర్లాండ్‌తో వరుసగా టీమిండియా వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఈ టోర్నీలో ఆటగాళ్లు చేసే ప్రదర్శన ద్వారా తుది జట్టుపై ఒక అంచనాకు రానున్నారు. ఇకపోతే గాయాలతో దూరమైన కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలు కూడా వరల్డ్‌కప్ ఆడాలనే ఉత్సాహంతో త్వరగా కోలుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు వీరంతా ఎన్సీఏ అకాడమీలోని రీహాబిలిటేషన్ సెంటర్లో వేగంగా కోలుకుంటున్నారు. టీమిండియాకు ప్రధాన పేసర్ అయిన బుమ్రా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఎన్సీఏలో రిహాబిలిటేషన్ పొందుతున్న బుమ్రా.. వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేసినట్లు సమాచారం. సర్జరీ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. గత కొంతకాలంగా ఎన్సీఏలోనే గడుపుతున్నాడు. ఫిట్నెస్ను మెరుగుపరుచుకుంటున్న అతడు.. ఈ క్రమంలోనే ఏడు ఓవర్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఒక ఫాస్ట్ బౌలర్ గాయం నుంచి కోలుకోవడం అంత సామాన్యమైన విషయమైతే కాదు. మేం బుమ్రా విషయంలో నిత్యం మానిటరింగ్ చేస్తున్నాం. అతడు వేగంగా కోలుకోవడమే గాక ఫిట్నెస్ను కూడా మెరుగుపరుచుకుంటున్నాడు. నెట్స్‌లో ఇవాళ వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. క్రమంగా అతడు మరిన్ని ఓవర్లు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో అతడు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అక్కడ ఎలా ఆడతాడో చూశాక బుమ్రా ఫిట్‌నెస్‌పై ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే అతడు ఐర్లాండ్‌తో ఆగస్టులో ఆడతాడో లేదో అనే దానిపై ఒక అంచనాకు రావొచ్చు''అని పేర్కొన్నాడు. ఇక రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లతో పాటు బుమ్రాను ఆగస్టులో జరిగే ఆసియా కప్ వరకైనా సిద్ధం చేయాలనే లక్ష్యం పెట్టుకున్న బీసీసీఐ ఆ మేరకు ప్రణాళికలు కూడా రెడీ చేసింది. ఆసియా కప్ కంటే ముందే ఐర్లాండ్ తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో బుమ్రాను పరీక్షించి ఆసియా కప్.. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ కు సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. 🚨🚨 Team India's fixtures for ICC Men's Cricket World Cup 2023 👇👇 #CWC23 #TeamIndia pic.twitter.com/LIPUVnJEeu — BCCI (@BCCI) June 27, 2023 చదవండి: #ICCWorldCup2023: 2011 నుంచి ఆతిథ్య జట్టుదే.. ఈ లెక్కన వరల్డ్‌కప్ మనదేనా! #ICCWorldCup2023: టీమిండియాతో తలపడే ఆ ఐదు జట్లకు వేర్వేరు పిచ్‌లు.. -
నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్న ఇషాన్ కిషన్.. ఎందుకంటే?
టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు ముందు ఏన్సీఏలో డెడికేటెడ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ పోగ్రామ్‌ను బీసీసీ నిర్వహించనుంది. ఈ పోగ్రామ్‌లో కిషన్‌తో పాటు మరి కొంతమంది బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు పాల్గొనున్నారు. ఆఖరి రెండు అంతర్జాతీయ సిరీస్‌లు గానీ దేశీయ టోర్నమెంట్లలో భాగం కాని సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లకు ఏన్సీఏ నుంచి పిలుపుచ్చింది. వెస్టిండీస్ పర్యటనకు ముందు ఆటగాళ్లను ఫిజికల్‌గా సిద్దం చేయడానికి ఈ పోగ్రాంను బీసీసీఐ నిర్వహిస్తుంది. కాగా వచ్చే నెలలో విండీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. ఆతిధ్య జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12 నుంచి డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టులో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్టు జూలై 3న కరేబియన్ దీవులకు పయనం కానుంది. ఇక విండీస్ టూర్‌కు భారత జట్టును జూన్ 27న బీసీసీఐ ప్రకటించనుంది. జైశ్వాల్, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కే ఛాన్స్ ఉంది. చదవండి: Graeme Smith On Rohit Sharma: రోహిత్ ఫామ్‌లోకి రావాలంటే అదొక్కటే మార్గం -
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎవరి సాయం లేకుండా మెట్లెక్కేసిన పంత్!
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్న పంత్..పూర్తి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు. ఇక తన హెల్త్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకొనే పంత్.. తాజాగా మరో వీడియో పోస్టు చేశాడు. తన ట్రైనింగ్ సంబంధించిన వీడియోను పంత్ షేర్ చేశాడు. పంత్ ఎటువంటి సపోర్ట్ లేకుండా మెట్లు ఎక్కుతుండడం ఈ వీడియోలో కన్పించింది. అయితే మెట్లు ఎక్కే క్రమంలో తొలుత పంత్ కాస్త ఇబ్బంది పడిన ఆ తర్వాత మాత్రం కొంచెం ఈజీగా ముందుకు వెళ్లాడు. కాగా ఈ వీడియోకు "నాట్ బ్యాడ్ యార్ రిషబ్. చిన్న పనులే కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి" అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన పంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న దానికన్నా వేగంగా రిషబ్ కోలుకుంటున్నాడని.. త్వరలోనే మైదానంలో కనిపిస్తాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా పంత్ గాయం కారణంగా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా సిరీస్, ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పంత్ దూరమయ్యాడు. రిషబ్ తిరిగి మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌కు మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. చదవండి: BAN vs AFG: ఆఫ్గాన్ పేసర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే ఏడో బౌలర్‌గా View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) -
ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు
వన్డే ప్రపంచకప్-2023కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. పంత్ తన పూర్వ వైభవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు మరో రెండు మూడు నెలల్లో తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు దృవీకరించారు. "పంత్‌కు ఇప్పటికే పలు పలు సర్జరీలు జరిగాయి. అయితే అతడికి మరో మైనర్ సర్జరీ అవసరమని తొలుత భావించారు. అతడిని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వైద్యులు చెకప్ చేశారు. పంత్ ప్రస్తుతం బాగా కోలుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అతడికి మరి ఎటువంటి సర్జరీలు అవసరమలేదని వైద్యలు నిర్ణయించారు. ఇది భారత క్రికెట్‌కు చాలా మంచి వార్త. పంత్ మనం మొదట ఊహించిన దాని కంటే ముందుగానే మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. కాగా భారత్ వేదికగా జరగనున్న ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో పంత్ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక గతేడాది డిసెంబర్ నుంచి పంత్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్-2023తో పాటు వరల్డ్‌టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు దూరమయ్యాడు. చదవండి: ఏంటీ విభేదాలా? మహీ అన్న.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే: జడేజా ట్వీట్ వైరల్ -
IPL 2023: ఐపీఎల్ జట్టుకు కొత్త కెప్టెన్
ఐపీఎల్-2023 సీజన్లో ఓ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. మే 1న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో కృనాల్ పాండ్యా లక్నో సూపర్ జెయింట్స్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. లీగ్‌లో లక్నో తదుపరి ఆడబోయే మ్యాచ్‌కు కృనాల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఎల్ఎస్జీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. కృనాల్ నేతృత్వంలో లక్నో సూపర్ జెయింట్స్ ఇవాళ (మే 3) చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుందని పేర్కొంది. కేఎల్ రాహుల్ గాయం తీవ్రమైందని, ఈ విషయాన్ని బీసీసీఐ స్వయంగా టేకప్ చేస్తుందని, ఐపీఎల్లో తదుపరి మ్యాచ్‌ల్లో రాహుల్ ఆడాలా లేదా అన్న విషయంపై తుది నిర్ణయం బీసీసీఐ / ఎన్సీఏలదేనని లక్నో టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. వచ్చే నెలలో డబ్ల్యూటీసీ ఫైనల్ (జూన్ 7) ఉన్న దృష్ట్యా బీసీసీఐ రాహుల్ ఇంజ్యూరీ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుందని, రాహుల్ విషయంలో ఎన్సీఏ మెడికల్ టీమ్ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. కాగా, ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ (బౌండరీని ఆపే క్రమంలో ఛేజ్ చేస్తూ) కేఎల్ రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లోనే రాహుల్ స్థానంలో కృనాల్ తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. లీగ్ కీలక దశకు చేరిన తరుణంలో గాయం కారణంగా రాహుల్ దూరం కావడం లక్నో టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం లక్నో.. గుజరాత్ (అగ్రస్థానం), రాజస్థాన్ (రెండో స్థానం), చెన్నై (నాలుగు), ఆర్సీబీ (ఐదు), పంజాబ్ (ఆరు)లతో పాటు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. -
'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఒకసారి ఫిట్‌గా ఉన్నాడంటూ జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తారు.. మరుక్షణమే ఫిట్‌గా లేడని ప్రకటిస్తారు. దీంతో టీమిండియా అభిమానులు బుమ్రా విషయంలో బీసీసీఐ వైఖరిని తప్పుబడుతున్నారు. 'కనబడుట లేదు'(#Missing Bumrah) అంటూ ట్విటర్లో ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు అభిమానులు. కేవలం ఐపీఎల్ కోసమే బుమ్రాను అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపిక చేయడం లేదని.. అటు బుమ్రా కూడా అంతర్జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్‌పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బుమ్రా ఫిట్నెస్ విషయమై బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీ నుంచి ఎలాంటి క్లియరెన్స్ రాలేదు. దీంతో బుమ్రా టీమిండియాలోకి ఎప్పుడు వస్తాడనేది చెప్పలేని పరిస్థితి. ఇక బుమ్రా ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఐదు నెలలు దాటిపోయింది. పెళ్లి తర్వాత వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయంతో జట్టుకి దూరమయ్యాడు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో రెండు టి20 మ్యాచులు ఆడిన గాయం తిరగబెట్టడంతో టి20 ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో తొలుత జస్ప్రిత్ బుమ్రాకి చోటు దక్కలేదు. ఆ తర్వాత కొన్నిరోజులకు బుమ్రా కోలుకున్నాడని, వన్డే సిరీస్‌కి ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది టీమిండియా... మూడు రోజులకు మళ్లీ బుమ్రా కోలుకోలేదంటూ టీమ్ నుంచి తప్పించింది. అటుపై బుమ్రా లేకుండానే టీమిండియా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధమైంది. అయితే బుమ్రా కోలుకుంటున్నాడని ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులు ఆడతాడని కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే ప్రకటించాడు. అయితే ఆదివారం బీసీసీఐ ఆసీస్‌తో జరిగే చివరి రెండు టెస్టులతో పాటు వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు ఎక్కడా కనిపించలేదు. ఇక ఆసీస్‌తో సిరీస్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు నేరుగా ఐపీఎల్లో అడుగుపెట్టనున్నారు. దీన్నిబట్టి చూస్తే గాయంతో దూరమైన బుమ్రా ఐపీఎల్ 2023 సీజన్లో ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు బుమ్రాని అందుబాటులో ఉంచేందుకు అతనికి రెస్ట్ ఇస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ.. బుమ్రాను ఐపీఎల్లో ఆడడానికి కూడా అనుమతి ఇవ్వకూడదని సగటు అభిమాని అభిప్రాయపడుతున్నాడు. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా.. టీమిండియా తరపున మూడు వన్డేలు ఆడేందుకు కూడా ఫిట్‌గా లేని బుమ్రా.. ఒకవేళ ఐపీఎల్లో పాల్గొంటే ముంబై ఇండియన్స్ తరుపున 14 నుంచి 17 మ్యాచుల దాకా ఆడాల్సి ఉంటుంది. మూడు మ్యాచులు ఆడేందుకు లేని ఫిట్నెస్.. ఐపీఎల్లో అన్ని మ్యాచులు ఆడేందుకు ఎలా వస్తుంది? అనేది అంతుచిక్కని ప్రశ్నలా మారింది. బుమ్రా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాడు.. దేశం కోసం ఆడాల్సింది పోయి డబ్బుల కోసం ఆడుకుంటే నష్టపోయేది అతనే అంటూ కొంతమంది అభిమానులు ఘాటుగా స్పందించారు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల కోసం ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే సిరీస్‌ల నుంచి బుమ్రాని తప్పించిన బీసీసీఐ.. అతను ఐపీఎల్లో ఆడకుండా అడ్డుకోగలదా? అంటే సమాధానం మీ అందరికీ తెలిసిందే. చదవండి: 'కోహ్లి ఏంటిది.. తగలరాని చోట తగిలి ఉంటే?' వైస్ కెప్టెన్ హోదా తొలగింపు.. రాహుల్‌పై వేటు! దేశవాళీ క్రికెట్ ఆడితేనే.. #bumrah just before IPL starts :pic.twitter.com/l6l8umPYyI — sri (@sri_verizon) February 13, 2023 Bumrah to play IPL2023 directly now ( CB ) #bumrah #IPL2023 pic.twitter.com/d0STFEq0ba — Nitesh (@Niteshlohmrod) February 20, 2023 #Bumrah undergoing match-simulation workloads at the National Cricket Academy. Hope to see him playing for India soon. #BCCI pic.twitter.com/F3fo04daQw — Mandeep Saharan (@manusaharan) February 17, 2023 misses the major tournament for his country like asia cup, wt20, now BGT... but when it comes to his MI family , he never misses a single match !!! #bumrah #IPL2023 #BGT2023 #country pic.twitter.com/szHqiaUQh3 — Virat kohliiii (@harshit53706385) February 20, 2023 -
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారంటూ
BCCI - Chetan Sharma: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కొంతమంది టీమిండియా ఆటగాళ్లు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారంటూ అతడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి. ఆడనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తారు అందులో.. ‘‘ఆటగాళ్లు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోయినా.. మ్యాచ్ ఆడేందుకు వాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు. 80 శాతం ఫిట్నెస్తో ఉన్నా సరే ఇంజక్షన్లు వేసుకుని మైదానంలో దిగుతారు. 85 శాతం ఫిట్నెస్ సాధించినా.. ‘‘సర్ ప్లీజ్ మమ్మల్ని ఆడనివ్వండి’’అని బతిమిలాడుతారు. అయితే, మా వైద్య బృందం మాత్రం అందుకు అనుమతించదు. అయితే, ఆటగాళ్లు మాత్రం ఇలాంటి విషయాలతో పనిలేకుండా తాము ఎల్లప్పుడూ ఆడుతూనే ఉండాలని కోరుకుంటారు. బుమ్రా విషయమే తీసుకోండి.. అతడు కనీసం కిందకు బెండ్ అవ్వలేకపోతున్నాడు. అలాంటపుడు పాపం తను ఎలా ఆడగలడు? ఒకటీ రెండుసార్లు తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే, కొంతమంది మాత్రం 80 శాతం ఫిట్నెస్తో ఉన్నా.. ‘‘మేము పూర్తి ఫిట్‌గా ఉన్నాము సర్’’’ అని చెప్తారు’’ అని చేతన్ శర్మ పేర్కొన్నాడు. యాంటీ డోపింగ్ జాబితాలో ఉన్నవే.. అయితే, వాళ్లు వాడేవి ఇంజక్షన్లా లేదంటే పెయిన్ కిల్లర్సా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘వాళ్లు కేవలం ఇంజక్షన్లే వాడతారు. పెయిన్ కిల్లర్లు అస్సలు వాడరు. నిజానికి వాళ్లు ఎలాంటి ఇంజక్షన్ తీసుకున్నారో లేదో మనం కనిపెట్టలేం. పెయిన్ కిల్లర్ల వల్ల డోపింగ్‌లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. యాంటీ డోపింగ్ జాబితాలో ఉండే ఇంజక్షన్లే వాడతారు’’ అని చేతన్ శర్మ పేర్కొన్నాడు. మరి ఆటగాళ్లు తమంతట తామే ఈ ఇంజక్షన్లు తీసుకుంటారా అని సదరు టీవీ చానెల్ ప్రతినిధి అడుగగా.. ‘‘వాళ్లంతా పెద్ద పెద్ద సూపర్స్టార్లు. వాళ్లకు డాక్టర్లు దొరకరా? వేలాది మంది డాక్టర్లు చుట్టూ ఉంటారు. ఒక్క ఫోన్ కాల్ చాలు.. క్రికెటర్ల ఇంట్లో వాలిపోతారు’’ అంటూ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నా పనులు నాకుంటాయి.. మరి సెలక్టర్లకు ఈ విషయం తెలియదా అన్న ప్రశ్నకు.. ‘‘వాళ్లు ఇంజక్షన్లు తీసుకున్న విషయం మాకెలా తెలుస్తుంది? మ్యాచ్ ఆడతారు.. ఆరింటి దాకా గ్రౌండ్లో ఉంటారు. అప్పటి వరకు టీమ్ మేనేజ్మెంట్ వాళ్లతోనే ఉంటుంది. తర్వాత వాళ్లు బస్సులో హోటల్‌కు వెళ్లిపోతారు. ఎవరి గదులు వాళ్లకు ఉంటాయి. ప్రతి నిమిషం వాళ్లను గమనిస్తూ ఉండలేం కదా.. వాళ్లేం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారని ఊరికే వాళ్ల గురించే ఆలోచించం. నాకంటూ నా సొంత పనులు ఉంటాయి. వాకింగ్‌కు వెళ్లటమో, డిన్నర్ చేయడమో.. ఎవరి ప్లాన్లు వాళ్లకు ఉంటాయి కదా! ఎవరు నిబంధనలు అతిక్రమిస్తున్నారో నాకైతే కచ్చితంగా తెలియదు. 2500 మంది ఉన్నారు.. 99.9 శాతం మంది ప్లేయర్లు జాతీయ క్రికెట్ అకాడమీకి రిపోర్టు చేస్తారు. అందులో 0.5 శాతం మంది ఇలాంటి పనులు చేస్తారేమో? అది కూడా కచ్చితంగా చెప్పలేం. దాదాపు 2500 మంది ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లందరి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవడం కష్టం’’ అని చేతన్ శర్మ బదులిచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వేటు తప్పదా? కాగా టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా నిరాశజనక ప్రదర్శన నేపథ్యంలో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఆరంభంలో మరోసారి అతడినే చీఫ్ సెలక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. చేతన్ శర్మ వ్యాఖ్యలపై క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చేతన్ శర్మపై కఠిన చర్యలు తప్పవని, వేటు పడే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: నిన్ననే కదా వేలం అయ్యింది.. అప్పుడే విధ్వంసం మొదలైందా..? చిన్నారి విన్యాసాలకు సచిన్ ఫిదా IND Vs AUS: శ్రేయాస్ అయ్యర్ ఆగమనం.. వేటు ఎవరిపై? -
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగున్న టెస్టు సిరీస్‌తో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో జడేజాకు చోటు దక్కింది. అయితే జడేజాను ఎంపికచేసినప్పటికీ ప్రధాన జట్టులో చోటు మాత్రం అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది సెలక్టర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో జడ్డూ తన ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ప్రస్తుతం జరగుతున్న రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 24 నుంచి చెన్నై వేదికగా తమిళనాడుతో జరగనున్న మ్యాచ్‌లో జడేజా సౌరాష్ట్ర తరపున బరిలోకి దిగనున్నట్లు ఈఎస్స్పీన్ క్రిక్ ఇన్ఫో పేర్కొంది. కాగా గతేడాది ఆసియాకప్ తర్వాత మోకాలి గాయం కారణంగా జడేజా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకున్న జడేజా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ ((వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, సి పుజారా, వి కోహ్లి, ఎస్ అయ్యర్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్ చదవండి: BBL 2022 23: పంజాబ్ కింగ్స్ బౌలర్ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్ బ్యాటర్ విధ్వంసం -
హిట్ ఫిట్ కోహ్లి.. ఎన్సీఏ గడప తొక్కని ఒకే ఒక్క టీమిండియా క్రికెటర్
భారత క్రికెట్ జట్టులో ఫిట్ క్రికెటర్ ఎవరని అడిగితే.. అందరూ ఠక్కున విరాట్ కోహ్లి పేరే చెబుతారు. అతని 14 ఏళ్ల కెరీర్లో ఫిట్నెస్ లేమి కారణంగా దూరమైన మ్యాచ్‌లు కేవలం నాలుగు మాత్రమే అంటే తప్పనిసరిగా నమ్మి తీరాల్సిందే. ఈ ఒక్క లెక్క చాలు అతని ఫిట్నెస్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి. తాజాగా కోహ్లి ఫిట్నెస్ గురించిన ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. 2021-22 సంవత్సరంలో విరాట్ ఒక్కసారి కూడా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) గడప తొక్కలేదని బీసీసీఐ ఓ నివేదికలో పేర్కొంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన 24 మంది క్రికెటర్లలో ఒక్క కోహ్లి మాత్రమే ఎన్సీఏలో అడుగుపెట్టలేదని బీసీసీఐ సీఈవో హేమంగ్ అమిన్ తెలిపారు. ఇండియా ఏ, ఇండియా అండర్ 19, వుమెన్స్ టీమ్, స్టేట్ ప్లేయర్లలో 70 మంది 96 రకాల గాయాల కారణంగా ఎన్సీఏ పర్యవేక్షనలో ఉన్నారని అమిన్ పేర్కొన్నారు. భారత పురుషుల జట్టులో కోహ్లి మినహా రోహిత్ శర్మ (హ్యామ్‌స్ట్రింగ్), కేఎల్ రాహుల్ (హెర్నియా), చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్, హార్ధిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, మయాంక్ అగర్వాల్, యుజ్వేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అజింక్య రహానే,అశ్విన్, అక్షర్ పటేల్, వృద్ధిమాన్ సాహా, షమీ, దీపక్ చాహర్, ఇషాంత్ శర్మ.. ఇలా సీనియర్లు,జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ ఎన్సీఏలో చికిత్స తీసుకున్నారు. వీరే కాక టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, సందీప్ వారియర్, రాహుల్ చాహార్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, మనీశ్ పాండే, నవ్‌దీప్ సైనీ, ప్రియాంక్ పంచల్, శుభ్‌మన్ గిల్, ఖలీల్ అహ్మద్, అర్ష్‌దీప్ సింగ్, దేవ్‌దత్ పడిక్కల్, ఇషాన్ పోరెల్, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా, నితీశ్ రాణా, పృథ్వీ షా, సిమ్రన్‌జీత్ సింగ్, కేఎస్ భరత్, వరుణ్ అరోన్, వెంకటేశ్ అయ్యర్ కూడా ఎన్సీఏలో చికిత్స తీసుకున్నారు. -
ఈ ఏడాది 23 మందిలో 'కింగ్' కోహ్లి ఒక్కడే..
కింగ్ కోహ్లి ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 33 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫిట్‌గా కనిపిస్తున్న కోహ్లి గాయపడడం చాలా అరుదు. తనకు తానుగా విశ్రాంతి కోరుకుంటే తప్ప టీమిండియాకు ఎప్పుడు దూరం కాలేదు. ఫామ్ లేమి సమస్యలతో గడ్డుకాలం చూసిన కోహ్లి ఫిట్నెస్ విషయంలో మాత్రం ఏనాడు ఇబ్బంది పడింది లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత జట్టులోని వార్షిక కాంట్రాక్టు కలిగి ఉన్న 23 మంది జాతీయ ఆటగాళ్లు 2021-22 సీజన్లో వివిధ గాయాలు, సమస్యల కారణంగా ఎన్సీఏ అకాడమీలో చికిత్స తీసుకున్నారు. ఈ లిస్ట్‌లో కోహ్లి పేరు ఎక్కడా కనిపించలేదు.. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతను ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తాడనేది. బీసీసీఐ సీఈవో హేమంగ్ అమిన్ వెల్లడించిన నివేదికలో ఈ విషయం బయటపడింది. మొత్తం 70 మంది ఆటాగాళ్లకు సంబంధించి 96 గాయాలకు ఎన్సీఏ వైద్య బృందం చికిత్స చేసిందని నివేదికలో హేమన్ అమీన్ పేర్కొన్నారు. ఇందులో 96 గాయాలకు సంబంధించి ఆటగాళ్లకు ఎన్సీఏలో చికిత్స జరిగిందని తెలిపారు. 70 మంది ఆటగాళ్లలో 23 మంది సీనియర్ ఇండియా ప్లేయర్లు కాగా. 25 మంది భారత్ ఏ టీమ్ తదితర క్రికెటర్లు, ఒకరు అండర్-19, ఏడుగురు సీనియర్ మహిళలు, 14 మంది రాష్ట్రాల ఆటగాళ్లు ఉన్నారని తెలిపారు. టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్,కేఎల్ రాహుల్, పుజారా, ధావన్, హార్దిక్, ఉమేశ్, జడేజా, పంత్, శ్రేయాస్, సూర్యకుమార్ యాదవ్, మయాంక్, చాహల్, సుందర్, కుల్దీప్, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్ తదితర ఆటగాళ్లు ఎన్సీఏలో చికిత్స తీసుకుని కోలుకున్నారు.కానీ కోహ్లి మాత్రం ఈ ఏడాది ఒక్కసారి గాయపడడం లేదా ఫిట్నెస్ సమస్యలతో ఎన్సీఏకు రాలేదని హేమంగ్ అమిన్ పేర్కొన్నాడు. ఇక ఎన్సీఏలో చికిత్స తీసుకున్న మిగతా క్రికెటర్లలో శుబ్‌మన్ గిల్, పృథ్వీషా, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్, కేఎస్ భరత్, నాగర్కోటి, సంజూశాంసన్, ఇషాన్ కిషన్, కార్తిక్ త్యాగి, నవదీప్ సైని, రాహుల్ చాహర్ తదితరులు ఉన్నారు. ఇక 2018లో విరాట్ కోహ్లి వెన్నునొప్పి కారణంగా కౌంటీల్లో ఆడలేకపోయాడు. ఆ ఇబ్బందిని అధిగమించిన రన్‌మెషిన్ అప్పటి నుంచి ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూనే తన ఆటను కొనసాగిస్తూ వస్తున్నాడు. చదవండి: జరగాలని రాసిపెట్టుంటే స్టోక్స్ ఏం చేయగలడు! -
T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు!
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపచంకప్-2022కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా ఆసియా కప్-2022కు దూరమైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జస్ప్రీత్ స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌లతో పాటు టీ20 ప్రపచంకప్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వారం రోజులు పాటు గడిపాడు. అతడు తన గాయం నుంచి కోలుకోవడంతో తిరిగి స్వస్థలం ముంబైకు చేరుకున్నట్లు సమాచారం. "బుమ్రా తన గాయం నుంచి కోలుకోవడంతో పురోగతి సాధించాడు. ఫిజియోలతో నిరంతరం మేము టచ్‌లో ఉన్నాం. మా జట్టు ప్రధాన ఫిజియో నితిన్ పటేల్ జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిజియోలతో ఎప్పటికప్పడు బుమ్రా గాయం గురించి చర్చిస్తున్నాడు. బుమ్రా తిరిగి ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడనున్నాడని మేము భావిస్తున్నాం. అయితే అతడు టీ20 ప్రపంచకప్‌కు మాత్రం ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్‌తో పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడు టీ20ల సిరీస్ నిమిత్తం ఆసీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అనంతరం ఆదే నెలలో దక్షిణాఫ్రికా జట్టు కూడా ఐదు టీ20ల సిరీస్ కోసం భారత గడ్డపై అడుగు పెట్టనుంది. చదవండి: Asia cup 2022: 'కోహ్లి మళ్లీ విఫలమయ్యాడు.. ఇదీ ఒక ఇన్నింగ్సేనా' -
శ్రీలంకతో సిరీస్.. భారత జట్టుతో సమావేశమైన లక్ష్మణ్
భారత మహిళల జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధిచిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు,మూడు టీ20లు ఆడనుంది. తొలి టీ20 దంబుల్లా వేదికగా జూన్23న జరగనుంది. కాగా న్యూజిలాండ్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ తర్వాత భారత్‌కు ఇదే తొలి సిరీస్. ఇక భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత వన్డే కెప్టెన్‌గా హార్మన్ ప్రీత్ కౌర్ ఎంపికైంది. అదే విధంగా శ్రీలంకతో సిరీస్‌కు భారత వెటరన్ పేసర్ జూలన్ గోస్వామి వ్యక్తిగత కారణాలతో దూరమైంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కి భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా, హర్లీన్ డియోల్ టి20 సిరీస్‌కి భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్ చదవండి: T20 World Cup2022: 'భారత్ ప్రపంచకప్ గెలవాలంటే అతడు ఖచ్చితంగా జట్టులో ఉండాలి' 📸 📸: Mr @VVSLaxman281 - Head Cricket, NCA - interacts with the Sri Lanka-bound #TeamIndia, led by @ImHarmanpreet. 👍 👍 pic.twitter.com/yVQNGjHaD8 — BCCI Women (@BCCIWomen) June 18, 2022 -
కేకేఆర్ కమలేశ్‌కు బంపరాఫర్.. ఏకంగా టీమిండియాతో! కీలక బాధ్యత!
Indian Cricket Team: ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రధాన సిబ్బందిలో ఒకరైన కమలేశ్ జైన్ బంపరాఫర్ కొట్టేశారు. టీమిండియా హెడ్ ఫిజియోగా ఆయన ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ కార్యదర్శి, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లను ఆయన మెప్పించినట్లు సమాచారం. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు ఫిజియోగా కమలేశ్ నియామకం దాదాపు ఖరారైనట్లేనని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. కాగా మాజీ ఫిజియో నితిన్ పటేల్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్‌గా వెళ్లిన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇక 2012 నుంచి కేకేఆర్‌తో ఉన్న కమలేశ్.. 2022లో ప్రధాన ఫిజియోగా ప్రమోట్ అయ్యారు. ఇక ఇప్పుడు టీమిండియాలో భాగమయ్యే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.కాగా కమలేశ్ జైన్ చెన్నైకి చెందినవారు. చదవండి👉🏾Kane Williamson: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ -
నేషనల్ క్రికెట్ అకాడమీలో సందడి చేసిన సునీల్ ఛెత్రి.. వీడియో వైరల్
భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీని సందర్శించాడు. అక్కడ శిక్షణ పొందుతున్న యువ క్రికెటర్లతో ఛెత్రి కాసేపు ముచ్చటించాడు. ప్రస్తుతం ఎన్సీఏలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. ఫీల్డింగ్ డ్రిల్‌లో ఆటగాళ్లతో పాటు ఛెత్రి కూడా పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. "ఇండియన్ ఫుట్‌బాల్ కెప్టెన్, లెజెండ్ సునీల్ ఛెత్రి ఎన్సీఎను సందర్శించాడు. అతడు ఫీల్డింగ్ డ్రిల్‌లో అదరగొట్టాడు. నార్త్ ఈస్ట్, ప్లేట్ టీమ్‌లకు చెందిన ఆటగాళ్లతో జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడిగా తన అనుభవాన్ని పంచుకున్నాడు" అంటూ బీసీసీఐ పోస్ట్‌కి క్యాప్షన్ జతచేసింది. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం..! 🎥 NCA's Neighbour, Indian Football Captain and Legend, @chetrisunil11 dropping by on Sunday evening. 👏 👏 He had a delightful fielding competition and shared some learnings from his own incredible journey in Football with the boys from North East and Plate Teams. 👍 👍 pic.twitter.com/1O1Gx7F12K — BCCI (@BCCI) May 9, 2022 -
దీపక్ చహర్ ఉదంతం.. ఎస్‌సీఏకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్
ఐపీఎల్ 2022 సీజన్‌కు దీపక్ చహర్ పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా చహర్ ఐపీఎల్‌తో పాటు రాబోయే టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీపక్ చహర్ ఉదంతంపై బీసీసీఐ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఎన్సీఏ(నేషనల్ క్రికెట్ అకాడమీ) ఫిజియోలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒక గాయంతో బాధపడుతూ రీహాబిటేషన్‌లో ఉన్న ఆటగాడు కోలుకుంటున్న సమయంలోనే మరో గాయం బారిన పడడమేంటని.. అసలు ఫిజియోలు ఏం చేస్తున్నారని మండిపడింది. ''వినడానికి ఆశ్చర్యంగా ఉంది. గాయపడి రీహాబిటేషన్‌లో కోలుకుంటున్న ఆటగాడు మరో గాయం బారిన పడ్డాడు. అంటే ఎన్సీఏ ఫిజియోలు సరిగా పని చేయడం లేదు. ఒక విషయం క్లియర్‌గా మీకు తెలియజేస్తున్నాం. ఈ అంశాన్ని వీలైనంత తొందరగా పరిష్కరించండి. ఒక్క దీపక్ చహర్ మాత్రమే కాదు.. ఇంతకముందు కూడా గాయపడిన ఆటగాళ్లు రీహాబిటేషన్‌లో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో జరగబోయే మేజర్ ఈవెంట్స్‌లో ఆటగాళ్ల ఎంపికలో చాలా సమస్యలు వస్తాయి. ఈ అంశంపై ఎన్సీఏ డైరెక్టర్లు నితిన్, వివిఎస్ లక్ష్మణ్‌తో చర్చలు నిర్వహిస్తాం. అసలెందుకు ఆటగాళ్లు గాయాల నుంచి త్వరగా కోలుకోవడం లేదనే దానిపై ఆరా తీస్తాం.. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. నిజం చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితిపై ఎవరం సంతోషంగా లేము. గాయాలనేవి ఆటగాళ్లకు సహజం. వాళ్లు కోలుకోవాలనే ఎన్సీఏ పేరుతో రీహాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. కానీ అక్కడే పని జరగకపోతే ఏం లాభం. హార్దిక్ పాండ్యా సహా చాలా మంది క్రికెటర్ల విషయంలో ఇది జరిగింది. ఇక్కడి ఫిజియోలతో పని కాదంటే చెప్పండి.. విదేశాల నుంచి ఫిజియోలను తెప్పిస్తాం. అడ్వాన్సన్ టెక్నాలజీతో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికి ఉపయోగం లేకుండా పోయింది.'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీపక్ చహర్ ఒక్కడే కాదు.. ఇంతకముందు హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి గాయం నుంచి కోలుకోవడానికి తొమ్మిది నెలల సమయం పట్టింది. ఈ క్రమంలోనే అతను ఫామ్ కోల్పోవడం.. జట్టులో స్థానం కోల్పోవడం జరిగిపోయాయి. జడేజా కూడా బొటనవేలి గాయంతో రీహాబిటేషన్‌లో చాలాకాలం గడపాల్సి వచ్చింది. రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్‌లకు చిన్న గాయాలే అయినప్పటికికోలుకోవడానికి చాలా సమయం పట్టింది. చదవండి: IPL 2022: దీపక్ చహర్ ఔట్.. సీఎస్కే అధికారిక ప్రకటన -
హార్దిక్‌కు ఫిట్నెస్ టెస్ట్.. ఐపీఎల్‌కు దూరం కానున్నాడా!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే అతడు బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడానికి ఫిట్‌గా ఉన్నప్పటికీ.. బౌలింగ్ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అక్కడ హార్దిక్ ఫిట్నెస్ పరీక్షలో పాల్గొనున్నాడు. ఇక ఐపీఎల్ కొత్త జట్టు అవతరించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు నిర్వహించనున్న విషయం విధితమే. అయితే ఫిట్నెస్ పరీక్షలను క్లియర్ చేయడంలో హార్దిక్ విఫలమైతే ఐపీఎల్లో ఆడడానికి బీసీసీఐ అనుమతించదు." హార్దిక్ రెండు రోజులు పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంటాడు. వివిధ ఫిట్నెస్ పరీక్షలలో పాల్గొంటాడు. అతను సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్, అతడు టీ20 ప్రపంచకప్ నుంచి ఎటువంటి క్రికెట్ ఆడలేదు. గత కొంతకాలంగా ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి అయినందున అతను తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. గత ఏడాది, శ్రేయాస్ అయ్యర్ కూడా ఐపీఎల్ ఆడటానికి ముందు ఫిట్నెస్ టెస్ట్ హాజరయ్యాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు మార్చి 28న లక్నో సూపర్‌జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. అదే విధంగా ఐపీఎల్-2022 మార్చి 26నుంచి ఫ్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదరంగాని, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, బి సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, డొమినిక్ డ్రేక్స్, దర్శన్ నల్కండే, యశ్రీ జోసెఫ్ దయాల్, ప్రదీప్ జోసెఫ్ దయాల్. చదవండి: IPL 2022 Gujarat Titans Jersey: గుజరాత్ టైటాన్స్ జెర్సీ ఆవిష్కరణ.. సర్ప్రైజ్కు సిద్ధంగా ఉండాలన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా -
కొత్త ‘ఎన్సీఏ’కు శంకుస్థాపన
బెంగళూరు: భారత క్రికెట్‌కు భవిష్యత్ కేంద్రంగా నిలిచే కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి బీసీసీఐ అంకురార్పణ చేసింది. బెంగళూరు నగర శివార్లలో సువిశాల స్థలంలో కొత్త ఎన్సీఏను బోర్డు నిర్మించనుంది. దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం జరిగింది. బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు గంగూలీ, జై షాలతో పాటు ఆఫీస్ బేరర్లు అరుణ్ ధుమాల్, జయేశ్ జార్జ్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2000 సంవత్సరం నుంచి నగరం మధ్యలో ఉన్న చిన్నస్వామి స్టేడియం ప్రాంగణంలోనే ఎన్సీఏ కొనసాగుతోంది. అక్కడ పరిమిత సౌకర్యాల మధ్యనే అకాడమీ కొనసాగింది. కొత్తగా నిర్మించబోయే ఎన్సీఏలో ప్రపంచస్థాయి అత్యుత్తమ సౌకర్యాలతో పాటు దేశవాళీ మ్యాచ్‌లు కూడా నిర్వహించగలిగే మూడు పెద్ద మైదానాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఏడాదిలోగా ఎన్సీఏ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. -
అండర్–19 జట్టుపై ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు
ఆసియా కప్‌లో విజేతగా నిలువడం ద్వారా అండర్–19 ప్రపంచకప్‌కు ముందు యువ భారత జట్టుకు కావాల్సినంత విశ్వాసం లభించిందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆసియా కప్‌కు సరైన సన్నాహాలు లేకుండానే యువ భారత్ వెళ్లిందని... నిలకడగా రాణించి విజేతగా అవతరించదని లక్ష్మణ్ కొనియాడాడు. అండర్–19 ప్రపంచకప్ ఈనెల 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరుగుతుంది. కాగా, శ్రీలంక అండర్–19 జట్టుతో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో యువ భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును చిత్తు చేసి టైటిల్ చేజిక్కించుకుంది. భారత అండర్–19 టీమ్ ఆసియా కప్‌ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. (చదవండి: భారత యువ ఆటగాళ్లకిది ఎనిమిదోసారి...) -
భారత అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త కెప్టెన్ వచ్చేస్తున్నాడు!
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు భారత్ అభిమానులకు గుడ్ న్యూస్. గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో వన్డేలకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్ క్రికెట్ ఆకాడమీలో ఉన్న రోహిత్ ప్రాథమిక ఫిట్నెస్ పరీక్షలో నెగ్గినట్లు సమాచారం. సోమవారం రోహిత్ మరోసారి ఫిట్నెస్ పరీక్షకు హాజరు కానున్నాడు. ఈ పరీక్షలో రోహిత్ నెగ్గితే వన్డే సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టు వన్డే కెప్టెన్‌గా కోహ్లిని తొలిగించి రోహిత్‌ని నియమించిన సంగతి తెలిసిందే. "రోహిత్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు తన గాయం నుంచి పూర్తి స్ధాయిలో కోలుకున్నాడు. ప్రాథమిక ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఇంకా ఎన్సీఏ లోనే ఉన్నాడు. రోహిత్ సోమవారం మరోసారి ఫిట్నెస్ టెస్ట్‌లో పాల్గోనున్నాడు. ఈ పరీక్ష ఆధారంగా మేము తుది నిర్ణయం తీసుకుంటాం" అని ఎన్సీఏ అధికారి ఒకరు తెలిపారు. కాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు మరో రెండు రోజుల్లో జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జట్టు ఎంపికలో యువ ఆటగాళ్లు రుత్‌రాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్‌ను పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇక టెస్ట్ సిరీస్ ముగిశాక భారత్ దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది. చదవండి: Vijay Hazare Trophy 2021:తమిళనాడుతో హిమాచల్ ప్రదేశ్ ఫైనల్ పోరు... ధావన్ మళ్లీ మెరిసేనా! -
కొత్త బాధ్యతల్లో మణికట్టు మాంత్రికుడు.. కేటీఆర్ అభినందనలు
VVS Laxman As NCA Director: టీమిండియా మాజీ ఆటగాడు, హైదరాబాదీ సొగసరి బ్యాటర్, మణికట్టు మాంత్రికుడు వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్(వీవీఎస్ లక్ష్మణ్) కొత్త బాధ్యతలను చేపట్టాడు. భారత క్రికెట్‌కు అనుసంధాన సంస్థ అయిన జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్‌గా సోమవారం ఛార్జ్ తీసుకున్న లక్ష్మణ్.. బెంగళూరులోని ఎన్సీఏ ప్రధాన కార్యాలయంలో తొలి రోజు విధులను నిర్వర్తించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను అతనే స్వయంగా సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. కాగా, లక్ష్మణ్‌కు ముందు ఎన్సీఏ చీఫ్ పదవిని ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నిర్వర్తించేవాడన్న విషయం తెలిసిందే. ద్రవిడ్‌కు ప్రమోషన్ రావడంతో లక్ష్మణ్ ఎన్సీఏ బాధ్యతలను చేపట్టాడు. ద్రవిడ్‌ను టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమించడంలో కీలకపాత్ర పోషించిన బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీనే.. లక్ష్మణ్‌ను సైతం ఒప్పించి మరీ బాధ్యతలు చేపట్టేలా చేశాడు. కొత్త బాధ్యతల్లో లక్ష్మణ్.. భారత యువ ఆటగాళ్లకు దిశానిర్ధేశం చేయడంతో పాటు ఆటగాళ్లను సానబెట్టే పనిలో ఉంటాడు. కంగ్రాట్స్ బ్రదర్.. :కేటీఆర్ ఎన్సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ‘కొత్త బాధ్యతలు చేపట్టిన సోదరుడు లక్ష్మణ్‌కు అభినందనలంటూ ట్వీట్ చేశారు. మీరు, రాహుల్ ద్రవిడ్ కలిసి భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తారనే నమ్మకం నాకుంది’ అంటూ కేటీఆర్ ట్వీటారు. Congratulations on the new responsibility brother @VVSLaxman281 👏 I am sure with gentlemen like you and #RahulDravid at the helm of affairs, future Indian cricket will scale newer/greater heights https://t.co/92nxVA6Rz1 — KTR (@KTRTRS) December 14, 2021 చదవండి: క్రేజీ బౌన్సర్.. తృటిలో తప్పించుకున్న రూట్ -
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్: నటరాజన్ డౌటే!
అహ్మదాబాద్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న 5 టీ20 సిరీస్‌లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు అహ్మదాబాద్ వేదికగానే జరగనున్నాయి. భుజం గాయంతో బాధపడుతున్న నటరాజన్ ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో(ఎన్సీఏ) ఉన్నాడు. అతని ఫిట్నెస్ను పరిక్షించి టీ20ల్లో ఆడించాలా వద్దా అనేది మార్చి 12న తేలనుంది. అందుకే నటరాజన్ తొలి టీ20 ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఎన్సీఏ మేనేజ్మెంట్ తెలిపింది. కాగా నటరాజన్‌తో పాటు వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియాలు కూడా టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తిలు ఫిట్నెస్ పరీక్షలో విఫలమైనట్లు సమాచారం. అయితే మార్చి 12లోపు ఒకవేళ ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయితే తొలి టీ20లో ఆడే చాన్స్ ఉందంటూ తెలిపింది. ఒకవేళ రిపోర్ట్‌లో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలితే మాత్రం నటరాజన్ పూర్తిగా దూరమవ్వనున్నాడు. ఇక నెట్‌బౌలర్‌గా వెళ్లి, ఆస్ట్రేలియా గడ్డపై మూడు ఫార్మాట్లలోనూ భారత్ తరఫున అరంగేట్రం చేసిన నట్టూ భాయ్.. ఈ టూర్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. మొత్తంగా 11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీసి దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: అందమైన బహుమతి.. థాంక్యూ లడ్డూ: నటరాజన్ యువీని ఉతికారేసిన కెవిన్ పీటర్సన్.. -
ఇదే సరైన సమయం...
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత విస్తరించేందుకు ఇది సరైన సమయమని భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. లీగ్ నాణ్యతలో రాజీ పడకుండా జట్ల సంఖ్యను పెంచినట్లయితే యువ క్రికెటర్లకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ పరంగా గత దశాబ్ధం భారత్‌కు అత్యుత్తమమని పేర్కొన్నాడు. 2011 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకోవడంతో పాటు టి20 ప్రపంచకప్‌లోనూ గొప్ప ప్రదర్శనలు నమోదయ్యాయని అన్నాడు. రాజస్తాన్ రాయల్స్ సహ యజమాని మనోజ్ బదాలే రాసిన పుస్తకం ‘ఎ న్యూ ఇన్నింగ్స్’ వర్చువల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ద్రవిడ్ ఈ అంశంపై మాట్లాడాడు. ‘ప్రతిభపరంగా చూస్తే ఐపీఎల్‌ను విస్తరించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నా. సత్తా ఉన్న ఎందరో క్రికెటర్లకు ఈ వేదికపై ఇంకా ఆడే అవకాశం దక్కడం లేదు. ఐపీఎల్లో జట్ల సంఖ్య పెంచితే వీరందరికీ అవకాశం లభిస్తుంది. ప్రతిభ చాటేందుకు చాలామంది యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే లీగ్ నాణ్యతలో ఏమాత్రం తేడా రాకుండా ఈ విస్తరణ చేపట్టాలి. తొలుత రంజీలకు ఎంపిక కావాలంటే రాష్ట్ర సంఘాలపై ఆధారపడాల్సి వచ్చేది. క్రికెటర్లకు పరిమిత అవకాశాలుండేవి. ఇప్పడు ఐపీఎల్‌తో పరిస్థితి మారిపోయింది. కోచ్‌లుగా మేం కొంత మాత్రమే సహకరించగలం. కానీ అనుభవం ద్వారానే యువ ఆటగాళ్లు చాలా నేర్చుకుంటారు. లీగ్‌లో యువ దేవదత్... సీనియర్లు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లతో కలిసి బ్యాటింగ్ చేశాడు. ఈ అనుభవం జాతీయ జట్టుకు ఆడటానికి ఉపయోగపడుతుంది. ఐపీఎల్లో రాణించడం వల్లే నటరాజన్ టీమిండియాకు ఎంపికయ్యాడు’ అని ద్రవిడ్ వివరించాడు. ద్రవిడ్ అభిప్రాయాన్ని మనోజ్ స్వాగతించాడు. వచ్చే ఏడాది 9 జట్లతో కూడిన ఐపీఎల్ నిర్వహణ కచ్చితంగా సాధ్యమేనని వ్యాఖ్యానించాడు. ఈ దిశగా బీసీసీఐ ఆలోచించాలని సూచించాడు. రికార్డు స్థాయిలో ఐదోసారి ఐపీఎల్ టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్‌ను ద్రవిడ్ అభినందించాడు. ప్రపంచ స్థాయి టి20 క్రికెటర్లతో పాటు యువకులతో కూడిన ముంబై అన్ని రంగాల్లో పటిష్టంగా ఉందని వ్యాఖ్యానించాడు. -
వాళ్ల అనుభవాన్ని వినియోగించుకోండి: ద్రవిడ్
ముంబై: సాధ్యమైనంత వరకు మాజీ క్రికెటర్ల అనుభవాన్ని వినియోగించుకొని క్రికెట్ అభివృద్ధికి కృషి చేయాలని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ రాహుల్ ద్రవిడ్ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సూచించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన వెబినార్‌లో పాల్గొన్న రాహుల్ ద్రవిడ్ అనుబంధ సంఘాలకు పలు కీలక సూచనలు చేశాడు. రాష్ట్ర సంఘాల కార్యదర్శులు, క్రికెట్ ఆపరేషన్స్ హెడ్స్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో ద్రవిడ్‌తో పాటు బీసీసీఐ–ఎన్సీఏ ఎడ్యుకేషన్ హెడ్ సుజిత్ సోమసుందర్, ట్రెయినర్ ఆశీష్ కౌశిక్ పాల్గొన్నారు. కోవిడ్–19 విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ఆటగాళ్ల ఫిట్నెస్ శిక్షణా శిబిరాల పునరుద్ధరణ, ప్లేయర్ల పిట్నెస్ స్థాయి అంచనా వేసే పద్ధతులు, రాష్ట్ర సంఘాలకు తలెత్తే ఇబ్బందులకు పరిష్కారాల గురించి ఈ వెబినార్‌లో ద్రవిడ్ కూలంకషంగా వివరించినట్లు ఇందులో పాల్గొన్న అధికారి ఒకరు తెలిపారు. ‘రాష్ట్ర సంఘాల క్రికెట్ అభివృద్ధికి మాజీ ఆటగాళ్ల అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలి అని ద్రవిడ్ సూచించారు. అంతేగానీ వారి సేవలు ఉపయోగించుకోవడం తప్పనిసరి అని చెప్పలేదు. ఒకవేళ మాజీ ఆటగాళ్లు రాష్ట్ర జట్లతో చేరితే వారి అనుభవం వృథా కాకుండా జట్టుకు కలిసొస్తుందన్నారు’ అని ఆయన చెప్పారు. మరోవైపు రెండు పద్ధతుల్లో శిక్షణను పునరుద్దరించేందుకు ఎన్సీఏ ప్రయత్నిసున్నట్లు తెలిసింది. కరోనా కారణంగా ఒకేసారి 25–30 మంది ఆటగాళ్లు కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం లేదన్న ద్రవిడ్... రాష్ట్ర జట్ల ఫిజియోలు, ట్రెయినర్లు సగం మందికి వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా మిగతా సగానికి మైదానంలో శిక్షణ ఇవ్వాలని కోరారు. కౌశిక్ మాట్లాడుతూ క్రికెటర్లు క్రికెటింగ్ నైపుణ్యాలపై దృష్టి సారించినపుడు శారీరక సామర్థ్యాన్ని... బాడీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు స్కిల్స్ ట్రెయినింగ్‌ను కాస్త తక్కువ స్థాయిలో చేయాలని సూచించారు. ప్రతీ ఆటగాడి వ్యక్తిగత ఫిట్నెస్ డేటాను ఫిజియోలు భద్రపరుచుకోవాలని పునరావాస కార్యక్రమాల్లో ఈ సమాచారం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కౌశిక్ చెప్పారు. -
ద్రవిడ్‌కు స్పెషల్ విషెస్!
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు మరింత వన్నె తెచ్చిన ఆటగాడు రాహుల్ ద్రవిడ్. మిస్టర్ డిఫెండబుల్‌గా పిలవబడే రాహుల్ ద్రవిడ్‌కు ‘ద వాల్’ అనే పేరు కూడా ఉంది. క్రికెట్ పుస్తకాల్లోని కచ్చితమైన షాట్లకు పెట్టింది పేరు. తన అంతర్జాతీయ కెరీర్లో 24 వేలకు పైగా పరుగులు సాధించి దిగ్గజ క్రికెటర్. అటు క్లాస్, ఇటు టైమింగ్ ద్రవిడ్ సొంతం. అది టెస్టు మ్యాచ్ అయినా, లేక వన్డే అయినా ద్రవిడ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడేవాడు. బ్యాట్ ఝుళిపించాల్సిన పరిస్థితుల్లో ద్రవిడ్ ఆడే తీరు అభిమానుల్లో జోష్ నింపేది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్‌గా కొనసాగుతున్న ద్రవిడ్ 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ద్రవిడ్‌కు స్పెషల్‌గా అభినందనలు తెలిపింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా ద్రవిడ్ ఆటను వీడియో రూపంలో పోస్ట్ చేసింది. పలువురు వెటరన్ క్రికెటర్లు, మాజీలు సైతం ద్రవిడ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ‘హ్యాపీ బర్త్ డే రాహుల్ ద్రవిడ్.. వాటే లెజెండ్’ అని హర్భజన్ సింగ్ విష్ చేయగా, ‘ నువ్వొక స్ఫూర్తి, రోల్ మోడల్, లెజెండ్’ అంటూ మహ్మద్ కైఫ్ శుభాకాంక్షలు తెలిపాడు. ‘ అసాధారణ క్రికెటర్.. ఒక మంచి మనిషి’ అంటూ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అభినందనలు తెలిపాడు. భారత అండర్-19, భారత్-ఏ జట్లకు కోచ్‌గా చేసిన ద్రవిడ్.. ఆపై నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. రాబోవు తరాల క్రికెటర్లకు దిశా నిర్దేశం చేస్తూ భారత్ క్రికెట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ద్రవిడ్ కృషి చేస్తున్నాడు. Wishing The Wall - Rahul Dravid a very Happy Birthday. His exploits in Test cricket are well known but we thought we would relive one of his knocks in ODIs against New Zealand. #HappyBirthdayRahulDravid 🎂🎂 pic.twitter.com/psUsTPw8Xt — BCCI (@BCCI) January 11, 2020 -
దిశ లేకుండా పరే‘షా’న్...
ఒక 20 ఏళ్ల యువ క్రికెటర్ 15 నెలల వ్యవధిలోనే ఉవ్వెత్తున ఎగసి ఉస్సురని కూలిపడ్డాడు... గత కొద్ది నెలలుగా పరిణామాలు చూస్తే పృథ్వీ షాకు బీసీసీఐ నుంచి గానీ ముంబై క్రికెట్ సంఘం నుంచి గానీ సరైన మార్గనిర్దేశనం లభించలేదని అర్థమవుతోంది. అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకొని ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేయాల్సిన కుర్రాడి కెరీర్‌పై అప్పుడే సందేహాలు రావడం దురదృష్టకరం. సాక్షి క్రీడా విభాగం ఆస్ట్రేలియన్ మీడియా సచిన్‌తో పోలుస్తూ రాసిన వ్యాసాల మధ్య పృథ్వీ షా 2018 నవంబరులో ఉత్సాహంగా ఆసీస్ గడ్డపై అడుగు పెట్టాడు. సిడ్నీలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో చూడచక్కటి షాట్లతో అర్ధ సెంచరీ కూడా చేశాడు. అయితే అదే మ్యాచ్‌లో వచ్చిన ఉపద్రవం అతడిని ఇబ్బందుల్లో పడేసింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో షా అనూహ్యంగా గాయపడ్డాడు. బౌండరీ వద్ద క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అతని కాలి మడమకు దెబ్బ తగిలింది. ఆ ఘటన తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించగలదని అతనూ ఊహించకపోవచ్చు! ముందుగా ఒక టెస్టుకే దూరమని టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించినా... చివరకు సిరీస్ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ అతనికి టీమిండియా అవకాశం దక్కలేదు. తాజాగా రంజీ ట్రోఫీ ప్రదర్శనతో న్యూజిలాండ్‌తో సిరీస్‌పై ఆశలు పెరిగినా... మరో గాయం మళ్లీ అతడిని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి పంపించింది. ఆరంభం అదిరేలా... స్కూల్ క్రికెట్లో సంచలనాల తర్వాత సీనియర్ స్థాయిలో నిలకడైన ప్రదర్శన పృథ్వీ షాకు ముంబై క్రికెట్లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఫలితంగా 17 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీ ఆడే అవకాశం దక్కింది. తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించడంతో పాటు దులీప్ ట్రోఫీలో కూడా పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును సవరించడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగినట్లుగానే భారత ‘ఎ’ జట్టు తరఫున కూడా ఆకట్టుకోవడంతో ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులకు అతను ఎంపికయ్యాడు. అక్కడ మ్యాచ్ ఆడకపోయినా... స్వదేశం రాగానే వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టులోనే పృథ్వీ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత జరిగిన హైదరాబాద్ టెస్టులోనూ అతను అర్ధ సెంచరీ చేశాడు. ఇక దూసుకుపోవడమే తరువాయి అన్న సమయంలో గాయం వెతుక్కుంటూ వచి్చంది. కోలుకున్నాక ముస్తాక్ అలీ ట్రోఫీలో, ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ ఆడటంతో షా కెరీర్ మళ్లీ దారిలోకి వచ్చినట్లు అనిపించింది. అయితే మళ్లీ గాయపడటంతో వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన వన్డే సిరీస్‌కు చివరి నిమిషంలో దూరమయ్యాడు. నిజానికి ఈ గాయం గురించి బోర్డు స్పష్టత ఇవ్వలేదు. దగ్గు తెచ్చిన తంటా... ఇన్నేళ్లలో భారత క్రికెట్లో పెద్దగా వినిపించని వివాదంతో పృథ్వీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో బీసీసీఐ అతనిపై 9 నెలల నిషేధం విధించింది. షా ‘టర్బుటలిన్’ అనే నిషేధిత ఉత్రే్పరకం వాడినట్లు తేలింది. అయితే తాను దగ్గుతో బాధపడుతుండటంతో తీసుకున్న సిరప్ వల్లే ఈ సమస్య వచి్చందని ఈ యువ బ్యాట్స్‌మన్ వివరణ ఇచ్చుకున్నాడు. నిజానికి ప్రతీ ఆటగాడికి బీసీసీఐ నిషేధిత డ్రగ్స్ జాబితా ఒకటి ఇస్తుంది. వారు వాడే ఎలాంటి మందులోనైనా ఇవి ఉన్నాయో, లేవో చూసుకోవాలి. సీనియర్ టీమ్‌కు ఆడిన ఒక క్రికెటర్ బోర్డు వైద్య బృందంలో ఎవరినీ సంప్రదించకుండా, సలహా తీసుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా దగ్గు మందు వాడటం నిజంగా ఆశ్చర్యకరం. ఇక్కడే అతనికి ఎవరూ సరైన సూచనలు ఇవ్వలేదని అర్థమవుతోంది. అదృష్టవశాత్తూ పృథ్వీపై నిషేధాన్ని పాత తేదీ నుంచి వర్తింపజేయడంతో గత ఏడాది నవంబర్ 16 నుంచి ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులోకి వచ్చాడు. అవకాశం ఉందా! పృథ్వీ గాయంతో జట్టులోకి వచి్చన మయాంక్ అగర్వాల్ మెల్బోర్న్లో తొలి టెస్టులోనే చెలరేగగా, ఆ తర్వాత కూడా చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడి తన స్థానం ఖాయం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ నుంచి రోహిత్ శర్మకు మరో ఓపెనర్ స్థానం ఖరారైంది. రిజర్వ్ ఓపెనర్‌గా రాహుల్ అందుబాటులో ఉండగా... అవసరమైతే ఇప్పటికే జట్టుతో ఉంటున్న శుబ్‌మన్ గిల్‌కు అవకాశం దక్కుతుంది. ఈ జాబితాలో పృథ్వీ వెనక్కి వెళ్లిపోయాడు. భారత్ ‘ఎ’ తరఫున న్యూజిలాండ్‌లో బాగా ఆడి ఉంటే ఏమైనా చాన్స్ ఉండేదేమో కానీ ఇప్పుడు భుజం గాయంతో కనీసం నాలుగు వారాలు క్రికెట్ ఆడే అవకాశమే లేదు. ఈ నెల 12నే న్యూజిలాండ్ టూర్‌కు జట్టు ఎంపిక ఉంది కాబట్టి ఎలాంటి ఆశలు లేవు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని దేశవాళీలో చెలరేగినా మళ్లీ భారత జట్టులోకి రావడం అంత సులువు కాదు. కొత్త వివాదాలు... 20 ఏళ్ల కుర్రాడంటే సరదాలు, షికార్లు చేస్తాడు, అందులో తప్పేముంది! బయటి నుంచి చూస్తే ఇది మామూలుగానే అనిపించవచ్చు. కానీ భారత్ తరఫున ఆడే స్థాయికి ఎదిగిన ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ ఎక్కడ క్రమశిక్షణ తప్పినా అది పెద్ద తప్పు చేసినట్లే. చిన్న వయసులోనే వచి్చన పేరు ప్రఖ్యాతులు, డబ్బు ఇప్పుడు పృథీ్వని కూడా తప్పు దారి పట్టిస్తున్నాయనేది క్రికెట్ వర్గాల్లో సాగుతున్న చర్చ. వడోదరలో ఇటీవల బరోడాతో మ్యాచ్ సందర్భంగా అతని ప్రవర్తనపై వార్తలు వచ్చాయి. తన హోటల్ గదిలో షా చేసిన ‘రచ్చ’పై ఆగ్రహంతో స్వయంగా ముంబై టీమ్ మేనేజర్ ఫిర్యాదు చేయాల్సి వచి్చందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అపార ప్రతిభ ఉండీ తప్పుడు ప్రవర్తనతో అవకాశాలు కాలదన్నుకున్న వినోద్ కాంబ్లీతో ఇప్పుడు పృథీ్వని వారు పోల్చుతున్నారు. సచిన్ ఉజ్వల ఘనతలకు అతని ఆటతో పాటు క్రమశిక్షణ కూడా కారణమనే విషయాన్ని ఈ యువ ముంబైకర్‌కు గుర్తు చేయాల్సి ఉంది. ‘పృథ్వీ ప్రవర్తన ఇలాగే కొనసాగితే అతనికే నష్టం. అతనికి లభించిన అవకాశాలను మైదానం బయటి వ్యవహారాలతో చేజార్చుకుంటే అది స్వయంకృతమే అవుతుంది. బరోడా ఘటన ఒక్కటే కాదు. అతని గురించి చెప్పాలంటే చాలానే జరిగాయి. అతని ప్రస్తుత జీవనశైలి అన్ని సమస్యలకు కారణం’ అంటూ ముంబై క్రికెట్ సంఘం కీలక సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. పృథ్వీ షా కెరీర్ ఎదుగుదలలో అతని తండ్రి పంకజ్ షా పాత్ర ఎంతో ఉంది. తల్లి లేని పృథీ్వకి అన్నీ తానై క్రికెటర్‌గా ఎదిగేలా తండ్రి ఎంతో శ్రమించాడు. 14 ఏళ్ల వయసులో స్కూల్ క్రికెట్లో 330 బంతుల్లో 546 పరుగులు చేసి కొత్త రికార్డు నెలకొల్పడంతో పృథ్వీ పేరు మార్మోగిపోయింది. ఈ కుర్రాడు భారత్‌కు ఆడతాడు అంటూ అప్పట్లోనే స్వయంగా సచిన్ అతని ఆటను ప్రశంసించాడు. ఆ తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడకుండా పృథ్వీ దూసుకుపోయాడు. నిజానికి సరైన దిశలో వెళ్లడంలో అన్నీ చోట్లా తండ్రి పంకజ్ వెనకుండి నడిపించాడు. అయితే ఇటీవల పరిణామాల అనంతరం సన్నిహితుడొకరు ‘ఈ వయసు కుర్రాళ్లలో ఎందరు తండ్రి మాట వింటారు? ఇప్పుడు అదే జరుగుతోంది. క్రికెట్ కారణంగా ఎక్కువ సమయం పృథ్వీ తన తండ్రికి దూరంగానే ఉంటున్నాడు. ఫలితంగా బయటి స్నేహాలు సమస్యగా మారాయి. దాంతో పంకజ్ కూడా ఏమీ చేయలేకపోతున్నాడు’ అని అభిప్రాయపడ్డాడు. అయితే చిన్న వయసే కాబట్టి ఇప్పటికీ సరిదిద్దుకునే అవకాశం ఉందనేది వారి సూచన. ►సరిగ్గా రెండేళ్ల క్రితం అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు కెపె్టన్ అతను... కొన్నాళ్లకే ఢిల్లీ జట్టు తరఫున భారీ మొత్తానికి ఐపీఎల్లో అవకాశం... ఆ తర్వాత కొద్ది రోజులకే భారత సీనియర్ టెస్టు జట్టులో స్థానం, ఆపై ఓపెనర్‌గా తొలి టెస్టులోనే సెంచరీ... సచిన్ తర్వాత అతి పిన్న వయసులో శతకం బాదిన భారత క్రికెటర్‌గా గుర్తింపు... నెలల వ్యవధిలోనే పృథ్వీ షా పైపైకి దూసుకుపోయిన తీరిది. ►కెరీర్‌ను ఉచ్ఛ స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉన్న ఆస్ట్రేలియా సిరీస్‌కు వెళ్లి కాలి గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెనుదిరగడం... డోపింగ్‌తో నిషేధానికి గురై ఆటకు దూరం కావడం... పునరాగమనం తర్వాత మళ్లీ వెంటాడుతున్న గాయాలు... దీనికి తోడు క్రమశిక్షణా రాహిత్యం... ఇప్పుడు అతను టీమిండియా ఓపెనర్ స్థానానికి కనీసం పోటీపడే స్థితిలో కూడా కనిపించడం లేదు. -
ఆ విషయంలో వెనక్కి తగ్గని ద్రవిడ్..
న్యూఢిల్లీ: ‘అసలు ఏం జరిగిందో జాతీయ క్రికెట్ అకాడమీ డైరక్టర్ రాహుల్ ద్రవిడ్‌ను అడిగి తెలుసుకుంటాను. సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకొని పరిష్కరిస్తా. నేను బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ద్రవిడ్‌తో ఎన్సీఏ విషయమై భేటీ అయ్యాను. కుర్రాళ్లను తీర్చిదిద్దే అంశంలో అకాడమీలో అతని పరిధిని కూడా పెంచాను. అయితే గాయాలకు ఎన్సీఏనే చికిత్స చేస్తుంది. పునరావాస శిబిరాలు ఎన్సీఏ ఆధ్వర్యంలోనే జరగాలి. భారత ఆటగాడు ఎవరైనా ఇదే పాటించాలి’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రానే. గత కొంతకాలంగా వెన్నుగాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. అదే సమయంలో బుమ్రా గాయపడ్డ దగ్గర్నుంచీ బాగయ్యేదాకా అంతా సొంత టీమ్ సహకారంతోనే కోలుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తానొక బోర్డు కాంట్రాక్టు ఆటగాడినన్న సంగతే మరిచాడు. పూర్తిగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ చెప్పినట్లు నడుచుకున్నాడు. వారు చెప్పినట్లుగా ఢిల్లీ క్యాపిటల్ ట్రెయినర్ రజనీకాంత్ శివజ్ఞానం ఆధ్వర్యంలో ముంబైలో శిక్షణ తీసుకున్నాడు. ఎన్సీఏ వర్గాలను సంప్రదించడం గానీ, సూచనలు పాటించడంగానీ ఎప్పుడూ చేయలేదు. ఇలా చేయడం సరైనదికాదనేది ద్రవిడ్ వాదన. వెన్ను గాయం నుంచి కోలుకున్న అతను పునరాగమనం చేయాలంటే ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్టు పాస్ కావాల్సిందే. ఈ టెస్టు రిపోర్టు ఆధారంగానే సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటుంది. గాయం నుంచి కోలుకునేందుకు బుమ్రా అకాడమీని కాదని, తన పునరావాసాన్ని తను చూసుకోవడం తగదని... అతనెలా పురోగతి సాధించాడో తెలియకుండా, క్రమం తప్పకుండా సమీక్షించకుండా... ఉన్నపళంగా ఫిట్నెస్ టెస్టు నిర్వహించడం కుదరదని రాహుల్ ద్రవిడ్ డైరెక్టర్‌గా ఉన్న ఎన్సీఏ సున్నితంగా ఆ పేసర్‌కు చెప్పేసింది. ఎక్కడైనా... ఎప్పుడైనా వ్యవస్థలో ఓ పద్ధతిని అనుసరించే ద్రవిడ్ బుమ్రా ‘సొంత’ తెలివితేటలపై గుర్రుగా ఉన్నాడు. అంతా బాగయ్యాక ఇక ఇక్కడెందుకు పరీక్షని భావించాడు. పేసర్‌కు టెస్టు నిర్వహించడం లేదని టీమిండియా అసిస్టెంట్ ట్రెయినర్ యోగేశ్ పర్మార్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై కాస్త ఆందోళన రేకెత్తింది. జట్టులో ఎంతటి స్టార్ ఆటగాడైనా ఒక పద్థతిని పాటించాలని, అది లేనప్పుడు మొత్తం దెబ్బతింటుందని ద్రవిడ్ భావించాడు. దీనిపై బీసీసీఐ అధ్యక్ష హోదాలో సౌరవ్ గంగూలీ కూడా సీరియస్‌గా దృష్టి సారించడంతో నేరుగా ద్రవిడ్‌నే కలిశాడు. దీనిపై ద్రవిడ్‌తో మాట్లాడిన తర్వాత గంగూలీ మరొకసారి వివరణ ఇచ్చాడు. ఈ విషయంలో వెనక్కి తగ్గని ద్రవిడ్.. ఇలా ప్రతీ ప్లేయర్ సొంత నిర్ణయాలు తీసుకుంటే మొత్తం ఉనికికే ప్రమాదం వస్తుందని గంగూలీకి తెలియజేశాడు. అదే విషయాన్ని స్పష్టం చేసిన గంగూలీ.. ప్రతీ ఒక్కరూ తమ పునరావసంలో ఎన్సీఏలోనే శిక్షణ తీసుకోవాలని తేల్చిచెప్పాడు. ‘నేను ద్రవిడ్‌ను నిన్న కలిశాను. ఎన్సీఏలో ఒక సిస్టం ఉంది. భారత క్రికెటర్ల ఎవరికైనా చికిత్స-శిక్షణ అవసరమైతే ఎన్సీఏకే వెళ్లాలి. ఇక్కడ కారణం ఏదైనా, గాయపడ్డ ఆటగాళ్ల పర్యవేక్షణ బాధ్యత ఎన్సీఏదే. అది ఆటగాళ్లకు సౌకర్యవంతంగానే ఉంటుంది. చికిత్స కోసం శిక్షణ కోసం బయట ఫిజియోలను సంప్రదించడం సరైనది కాదు. ప్రస్తుతం ఎన్సీఏలో నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. రాబోవు 18 నెలల్లో ఎన్సీఏ ఒక అద్భుతమైన రీతిలో రూపుదిద్దుకుంటుంది’ అని గంగూలీ తెలిపాడు. -
బుమ్రాకు ఎన్సీఏ షాక్..!
బుమ్రా ‘సొంత’ ఉత్సాహంపై జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నీళ్లుచల్లింది. తనకు తానుగా చేసుకున్న పునరావాసంపై ఫిట్నెస్ టెస్టు నిర్వహించలేమని సూటిగా, సున్నితంగా చెప్పింది. తద్వారా ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా ఎన్సీఏనే పెద్దదిక్కని చెప్పకనే చెప్పింది. ముంబై: భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రాకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) షాక్ ఇచ్చింది. స్టార్ పేసర్‌కు ఫిట్నెస్ టెస్టు నిర్వహించలేమని సుతిమెత్తగా చెప్పింది. వెన్ను గాయం నుంచి కోలుకున్న అతను పునరాగమనం చేయాలంటే ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్టు పాస్ కావాల్సిందే. ఈ టెస్టు రిపోర్టు ఆధారంగానే సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటుంది. గాయం నుంచి కోలుకునేందుకు బుమ్రా అకాడమీని కాదని, తన పునరావాసాన్ని తను చూసుకోవడం తగదని... అతనెలా పురోగతి సాధించాడో తెలియకుండా, క్రమం తప్పకుండా సమీక్షించకుండా... ఉన్నపళంగా ఫిట్నెస్ టెస్టు నిర్వహించడం కుదరదని రాహుల్ ద్రవిడ్ డైరెక్టర్‌గా ఉన్న ఎన్సీఏ సున్నితంగా ఆ పేసర్‌కు చెప్పేసింది. ఇక బరిలోకి దిగడమే తరువాయి అనుకుని, ఇటీవల విశాఖపట్నంలో భారత జట్టు సభ్యులతో కలిసి నెట్స్‌లో పాల్గొన్న బుమ్రాకిది ఊహించని పరిణామమే! నిజానికి బుమ్రాకు ఫిట్నెస్ పరీక్ష పెట్టేందుకు ఎన్సీఏ టీమిండియా ట్రెయినర్ నిక్ వెబ్‌ను బెంగళూరుకు పిలవాలనుకుంది. కానీ ఎక్కడైనా... ఎప్పుడైనా వ్యవస్థలో ఓ పద్ధతిని అనుసరించే ద్రవిడ్ బుమ్రా ‘సొంత’ తెలివితేటలపై గుర్రుగా ఉన్నాడు. అంతా బాగయ్యాక ఇక ఇక్కడెందుకు పరీక్షని భావించాడు. పేసర్‌కు టెస్టు నిర్వహించడం లేదని టీమిండియా అసిస్టెంట్ ట్రెయినర్ యోగేశ్ పర్మార్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై ద్రవిడ్ స్పందన తెలుసుకునేందుకు మీడియా ప్రయతి్నంచగా అతను అందుబాటులోకి రాలేదు. ఇటు బుమ్రా వివరణ కోరేందుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. అసలేం చేయాలి... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కాంట్రాక్టు ప్లేయర్ ఎవరైనా గాయపడితే ఎన్సీఏ పునరావాస శిబిరంలో పాల్గొనాల్సిందే. ఇక్కడ అకాడమీ డైరెక్టర్ నేతృత్వంలో అనుభవజ్ఞులైన ఫిజియో బృందం, వైద్య సిబ్బంది గాయపడిన ఆటగాడిని ఓ క్రమపద్ధతిలో బాగుచేస్తుంది. గాయాలకు గల కారణాలను విశ్లేషిస్తుంది. దీనివల్ల ఆ క్రికెటర్ మళ్లీ గాయపడకుండా ఎన్సీఏ బృందం సమష్టిగా చర్యలు తీసుకునే వీలుంటుంది. అంటే ఇక్కడ ఆ క్రికెటర్ కెరీర్ చాలా కాలం కొనసాగేందుకు అవసరమైన సూచనలు ఇస్తుంది. అతనేం చేశాడు... కానీ బుమ్రా గాయం నుంచి ఇప్పుడు బాగయ్యేదాకా అంతా సొంత టీమ్ సహకారంతోనే కోలుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తానొక బోర్డు కాంట్రాక్టు ఆటగాడినన్న సంగతే మరిచాడు. పూర్తిగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ చెప్పినట్లు నడుచుకున్నాడు. వారు చెప్పినట్లుగా ఢిల్లీ క్యాపిటల్ ట్రెయినర్ రజనీకాంత్ శివజ్ఞానం ఆధ్వర్యంలో ముంబైలో శిక్షణ తీసుకున్నాడు. ఎన్సీఏ వర్గాలను సంప్రదించడం గానీ, సూచనలు పాటించడంగానీ ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్సీఏ చివరాఖరికి ఓ ఫిట్నెస్ టెస్టు పెట్టి పాస్ మార్క్‌లు వేస్తే, మళ్లీ అతని గాయం తిరగబెట్టినపుడు అప్పుడంతా ఎన్సీఏను, పునరావాస శిబిరం తీరుపై తప్పుబడతారనేది ద్రవిడ్ అభిప్రాయం. గాయాలకు ‘ఎన్సీఏ’ చికిత్స తప్పనిసరి: దాదా ‘అసలు ఏం జరిగిందో ద్రవిడ్‌ను అడిగి తెలుసుకుంటాను. సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకొని పరిష్కరిస్తా. నేను బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ద్రవిడ్‌తో ఎన్సీఏ విషయమై భేటీ అయ్యాను. కుర్రాళ్లను తీర్చిదిద్దే అంశంలో అకాడమీలో అతని పరిధిని కూడా పెంచాను. అయితే గాయాలకు ఎన్సీఏనే చికిత్స చేస్తుంది. పునరావాస శిబిరాలు ఎన్సీఏ ఆధ్వర్యంలోనే జరగాలి. భారత ఆటగాడు ఎవరైనా ఇదే పాటించాలి’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... తన సహచరుడు ద్రవిడ్‌ను సమర్దించాడు. -
కొన్ని ఫ్రాంచైజీలు తప్పు చేస్తున్నాయి: ద్రవిడ్
బెంగళూరు: ఐపీఎల్లో భారత కోచ్‌లను తీసుకోకుండా ఫ్రాంచైజీలు తప్పు చేస్తున్నాయని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయ పడ్డాడు. లీగ్‌లో ఎక్కువ మంది మన ఆటగాళ్లే ఉంటారని, వారిని అర్థం చేసుకోవడంలో భారత కోచ్‌లే ముందుంటారని అతను అన్నాడు. ఎంతో మంది ప్రతిభావంతులైన కోచ్‌లు మనకు అందుబాటులో ఉన్నారని... హెడ్ కోచ్‌గా పెట్టుకునే అవకాశం∙లేకపోతే కనీసం అసిస్టెంట్ కోచ్‌గానైనా ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ద్రవిడ్ సూచించాడు. ‘మనకు చాలా మంచి కోచ్‌లు ఉన్నాయి. మన వాళ్ల యొక్క శక్తి సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. మన క్రికెట్ డిపార్ట్మెంట్లో చాలా టాలెంట్ ఉంది. ప్రత్యేకంగా మెరుగైన కోచ్‌లు భారత్ సొంతం. వారికి మనం అవకాశాలు ఇవ్వాలి’ అని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. కనీసం ఐపీఎల్లో మన వాళ్లను అసిస్టెంట్ కోచ్‌లుగా కూడా తీసుకోకపోవడం తనను నిరాశకు గురి చేస్తుందన్నాడు. కొన్ని ఫ్రాంచైజీలు భారత్ కోచ్‌లను ఎంపిక చేసుకుని లాభం పొందుతున్నాయి. ఆయా ఫ్రాంచైజీలకు భారత్ ప్లేయర్స్ గురించి తెలుసన్నాడు. -
రవిశాస్త్రిని మరింత వాడుకోవాలి: గంగూలీ
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన కార్యాచరణను మరింత వేగవంతం చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగేది ఏడాదిలోపే కావడంతో తన మార్కు ఉండాలనే భావనలో గంగూలీ పని చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరక్టర్ రాహుల్ ద్రవిడ్‌ను కలిసి అక్కడి పని తీరుపై ఆరాతీసిన గంగూలీ.. ఎన్సీఏను ఒక అద్భుత కేంద్రంగా తీర్చిదిద్దాలనే యోచనలో ఉన్నాడు. ద్రవిడ్‌తో భేటీ గురించి మీడియాతో మాట్లాడిన గంగూలీ.. ద్రవిడ్ పర్యవేక్షణలో ఎన్సీఏను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌లో ఉన్న హై ఫెర్ఫామెన్స్ సెంటర్ తరహా కేంద్రాన్ని రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపాడు. ‘ ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రవిశాస్త్రిని మరో రకంగా కూడా వాడుకోవాలనుకుంటున్నాం. రవిశాస్త్రి ఎప్పటివరకూ కోచ్‌గా కొనసాగుతాడో అప్పటివరకూ అతని సేవల్ని ఎన్సీఏలో కూడా మిళితం చేస్తాం. ద్రవిడ్‌తో పాటు రవిశాస్త్రి, పారాస్ మాంబ్రే( అండర్-19, భారత్-ఏ కోచ్), భరత్ అరుణ్(బౌలింగ్ కోచ్)లు కూడా ఇందులో పని చేస్తారు. ప్రస్తుతం ఎన్సీఏ చాలా పని జరుగుతుంది. ఎన్సీఏను ఒక అత్యుద్భుత సెంటర్‌గా రూపొందించాలనే యత్నంలో ఉన్నాం’ అని గంగూలీ తెలిపాడు. ఇక ద్రవిడ్‌తో భేటీకి సంబంధించి మాట్లాడుతూ.. ‘ ద్రవిడ్ ఎన్సీఏ హెడ్. క్రికెట్లో అతనొక దిగ్గజం. ఎన్సీఏ విధి నిర్వహణకు సంబంధించి నేను తెలుసుకోవాలని భావించే ద్రవిడ్‌తో సమావేశమయ్యా. ఎన్సీఏ కోసం కొత్త బిల్డింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మా మధ్య సమావేశం దాదాపు రెండు గంటలు జరిగింది. ఎన్సీఏను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ద్రవిడ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యా. ఎన్సీఏ పనితీరు చాలా బాగుంది. బెంగళూరు నడిబొడ్డన ఎన్సీఏ ఉంది. అంతకంటే మంచి వేదిక ఇంకొటి దొరకదు’ అని గంగూలీ అన్నాడు. -
ద్రవిడ్‌కు అంబుడ్స్‌మన్ నోటీస్
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై బ్యాటింగ్ దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నోటీసు జారీ చేసింది. బోర్డు అంబుడ్స్‌మన్–ఎథిక్స్ ఆఫీసర్ రిటైర్డ్ జస్టిస్ డి.కె.జైన్ మంగళవారం ఈ నోటీసు జారీ చేశారు. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. ద్రవిడ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (బెంగళూరు) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగానూ పనిచేస్తున్నాడు. ఈ కంపెనీకి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ ఉంది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (ఎంపీసీఏ) సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించాల్సిందిగా ఎథిక్స్ ఆఫీసర్ నుంచి ద్రవిడ్‌కు నోటీసు జారీ అయింది. గతంలో క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులైన దిగ్గజాలు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌లపై కూడా గుప్తా ఫిర్యాదు చేశారు. తదనంతర పరిణామాలతో ఈ దిగ్గజాలు సీఏసీ నుంచి వైదొలగడంతో కొత్తగా సీఏసీకి విఖ్యాత మాజీ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్, శాంత రంగస్వామి, అన్షుమన్ గైక్వాడ్‌లను నియమించారు. -
ఎన్సీఏ హెడ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్
న్యూఢిల్లీ: భారత జూనియర్ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ కోచ్‌గా నియమితులయ్యే ప్రక్రియ మొదలైంది. బీసీసీఐ కొత్తగా సృష్టించిన ఈ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తుల్ని ఆహ్వానించింది. ఇప్పటికే భారత్ ‘ఎ’, అండర్–19 జట్లకు ఇన్చార్జ్గా ఉన్న ద్రవిడే ఈ పదవి రేసులో ఉన్నాడని బోర్డు తెలిపింది. అయితే పారదర్శక నియామక ప్రక్రియలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని తెలిపింది. దీంతో ద్రవిడ్ ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకుంటాడని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ‘బీసీసీఐలోని అన్ని పదవుల నియామకానికి చేపట్టినట్లే ఈ హెడ్ కోచ్ కోసం కూడా ప్రక్రియను కొనసాగించేందుకే దరఖాస్తుల్ని ఆహ్వానిస్తాం. ఈ పదవి రేసులో ద్రవిడే ముందు న్నాడు. ఇప్పటికే ఆయన జూనియర్ జట్లను విజయవంతంగా తీర్చిదిద్దుతున్నాడు’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో రాహుల్ నామమాత్రంగా ఒక్కసారి దరఖాస్తు సమర్పిస్తే చాలు నియామకం వెంటనే జరిగిపోయే చాన్స్ ఉంది. గతంలో నేరుగా చేపట్టిన నియామకాలతో బోర్డుపై విమర్శలు రావడంతో ఇకపై ఏ నియామకమైనా పారదర్శకంగా చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. -
అందుకు ఎన్సీఏనే కారణం: యువీ
న్యూఢిల్లీ: టీమిండియా రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వచ్చే నెల్లో లండన్‌కు వెళ్లి తన భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చాక బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాస కార్యక్రమంలో పాల్గొనున్నాడు. దీనిలో భాగంగా జాతీయ క్రికెట్ అకాడమీలోని ఆటగాళ్లకు ఏర్పాటు చేసిన సదుపాయాలపై విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. గాయాలు పాలైన క్రికెటర్లు తిరిగి పునరాగమనం చేయడానికి బీసీసీఐ జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ‘గాయాలు బారిన పడిన టీమిండియా క్రికెటర్లు కోలుకునేందుకు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న మౌలిక సదుపాయాలు ఎంతగానో దోహదం చేస్తాయి. నేను క్యాన్సర్ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవడానికి సదరు అకాడమీలో బీసీసీఐ ఏర్పాటు చేసిన సదుపాయాలే ముఖ్య కారణం. క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న తర్వాత ఎన్సీఏ పునరావాస కార్యక్రమంలో పాల్గొనడం నాకు లాభించింది. అక్కడ చాలా గొప్ప సదుపాయాల్ని బీసీసీఐ ఏర్పాటు చేసింది. దేశంలోనే అత్యంత అనుభవమన్న ఫిజియోలు, ట్రైనర్స్ మన జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నారు’ అని యువీ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. -
ఎన్సీఏలోనే ధోని ప్రాక్టీస్
బెంగళూరు: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిమానుల కంటపడకుండా జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోనే నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫిట్నెస్ నిరూపించుకునేందుకు యో యో టెస్టు కోసం సహచరులతో పాటే ఇక్కడికి వచ్చిన ధోని... 15న టెస్టు ముగిశాక రాంచీకి వెళ్లకుండా ఎన్సీఏలోనే చెమటోడ్చుతున్నాడు. కఠినమైన ఇంగ్లండ్ పర్యటన కోసం ఈ ‘మిస్టర్ కూల్’ సాధనలో నిమగ్నమయ్యాడు. బంతిని వేగంగా విసరడంలో సిద్ధహస్తుడైన రఘు, స్పీడ్‌స్టర్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌ను ఎక్కువగా ఆడాడు. రెండున్నర గంటలపాటు 18 గజాల దూరం నుంచి రఘు, శార్దుల్ విసిరిన బంతుల్ని ప్రాక్టీస్ చేయడం గమనార్హం. మిడ్ వికెట్, ఎక్స్ట్రా కవర్, డీప్‌ఫైన్ లెగ్‌లో షాట్లు కొట్టే విధంగా శార్దుల్‌తో అడిగిమరి బౌలింగ్ వేయించుకున్నాడు. ఈ సెషన్లో సిద్ధార్థ్ కౌల్ కూడా పాల్గొన్నాడు. అతని ప్రాక్టీస్‌ను పెద్దసంఖ్యలో అభిమానులు తిలకించారు. వారిని ఉద్దేశించి ‘మొత్తానికి నేనిక్కడ ఉన్నానని తెలుసుకున్నారు’ అంటూ ధోని నిష్క్రమించాడు. -
బీసీసీఐ హెడ్‌క్వార్టర్స్ తరలింపు?
ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రధాన కార్యాలయం ముంబై నుంచి బెంగళూరుకు తరలిపోయే అవకాశాలున్నాయి. బీసీసీఐకి బెంగళూరులో 40 ఎకరాల భూమి ఉంది. అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ క్రికెట్ అకాడమీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే బీసీసీఐ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా బెంగళూరుకు మార్చాలనే యోచన చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఉంది. అయితే ఫైవ్ స్టార్ సౌకర్యాల కోసం బీసీసీఐ కొన్ని కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఆ నేపథ్యంలో బెంగళూరులో క్రికెట్ అడ్మినిస్టేటర్స్, గెస్ట్‌లు ఉండేందుకు వీలుగా ప్రధాన కార్యాలయం నిర్మించాలని బీసీసీఐ భావిస్తోంది. బీసీసీఐ సమావేశాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో జరిగిన సమయాల్లో ఖర్చు భారీగా అవుతుంది. దాంతోనే బెంగళూరులో ఉన్న సొంత స్థలంలో నేషనల్ క్రికెట్ అకాడమీతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో బీసీసీఐ కార్యాలయాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా.. బోర్డు సభ్యుల అనుమతి కోరుతూ వారందరికీ లేఖలు రాశారు.ఒకవేళ దీనికి ఆమోద ముద్ర పడితే బీసీసీఐ కార్యకలాపాలు రెండు-మూడేళ్లలో ముంబై నుంచి బెంగళూరుకు మారే అవకాశం ఉంది. -
సురేశ్ రైనా అభిమానులకు గుడ్ న్యూస్
సాక్షి, బెంగళూరు: టీమిండియాలోకి రావడానికి మరో సీనియర్ క్రికెటర్ కు మార్గం సుగమమైంది. గత కొంత కాలం నుంచి ఫిట్ నెస్ కోసం నిర్వహించే యో యో టెస్టులో విఫలమవుతున్న భారత క్రికెటర్ సురేశ్ రైనా తాజాగా ఈ టెస్టులో పాసయ్యాడట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా వివరించాడు. భారత జట్టులో చోటు కోల్పోయిన మరో సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇటీవల ఈ యో యో టెస్టులో పాసైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు క్రికెటర్లకు మరోసారి భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకునేందుకు తలుపులు తెరుచుకున్నాయి. జట్టులో చోటు కోల్పోయిన క్రికెటర్లు మళ్లీ ఎంపిక కావాలంటే బీసీసీఐ నిర్వహించే యో యో ఫిట్ నెస్ టెస్ట్ పరీక్షలో పాస్ కావాలన్న నిబంధన తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో గురువారం నిర్వహించిన యో యో టెస్టులో రైనా పాసయ్యాడు. ఈ సంతోషాన్ని తన ట్విటర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు రైనా. 'ఎంతో శ్రమించి యో యో టెస్టులో పాసయ్యాను. కోచ్, ట్రైనర్లు, నిర్వాహకుల నుంచి ఎంతో మద్దతు లభించింది. ఎన్సీఏలో గడిపిన రోజులు నాలో స్ఫూర్తిని రగిలించాయని' రాసుకొచ్చాడు రైనా. అకాడమీ కోచ్, ట్రైనర్లతో కలిసి దిగిన ఫొటోలను ఈ సందర్భంగా పోస్ట్ చేశాడు. ఫిట్ నెస్ పరీక్షలో పాసైన రైనా ఇక ఆటపై దృష్టిపెడితే మరికొన్ని రోజుల్లో భారత క్రికెట్ జట్టులో అతడిని చూడవచ్చునంటూ క్రికెటర్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. Cleared my Yo-Yo & fitness test today, after days of hard work at #NCA! Received tremendous support from all the trainers, coaches & officials. Thank you all! 👍 It’s always so encouraging to train here at #NCA, motivates me to push my limits and bring the best out of me. 💪 pic.twitter.com/E0Rr00NR4m — Suresh Raina (@ImRaina) 21 December 2017 -
పరాటా మేకర్.. అయ్యాడు సూపర్ క్రికెటర్!
పేదరికంలో పుట్టిన అతను.. ఓ హోటల్లో పరాటాలు చేసేవాడిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. హోటల్ వాళ్లిచ్చే జీతం డబ్బుతోనే క్రికెట్ కిట్ కొనుక్కున్నాడు. తీరిక దొరికిందే తడవుగా కఠోర ప్రాక్టీస్ చేసేవాడు. తొలుత జిల్లాస్థాయిలో ప్రతిభకనబర్చిన అతను.. ఇప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ జట్టుకు ఎంపికయ్యాడు. అతిత్వరలోనే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. పేరు హనన్ ఖాన్. ఊరు ఛామన్. పాకిస్థాన్‌లోని కల్లోలిత ప్రాంతమైన క్వెట్టా ఫ్రావిన్స్‌లో ఉందా ఊరు! క్రికెట్ ఆడే మిగతా దేశాలకంటే పాకిస్థాన్ జాతీయ జట్టులోకి కొత్తగా ఎంపికయ్యే ఆటగాళ్లలో చాలా మంది కడుపేదలు, కష్టపడి పైకిచ్చినవాళ్లే ఉంటారు. అబ్దుల్ రజాక్, యూసఫ్ యొహానా, మొహమ్మద్ ఇర్ఫాన్ లాంటి వాళ్లెందరో అందుకు ఉదాహరణ. హనన్ ఖాన్ విషయానికి వస్తే.. బలూచిస్థాన్‌కు చెందిన ఈ యువకుడు స్థానిక రెస్టారెంట్లో పరాటా మేకర్‌గా పనిచేస్తూ క్రికెట్ ఆడుతున్నాడు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మన్‌గా అతని ప్రతిభ గురించి తెలుసుకున్న క్రికెట్ పెద్దలు క్వెట్టా డొమెస్టిక్ గ్రేడ్-2 మ్యాచ్‌లో అవకాశం కల్పించారు. అక్కడ చక్కటి ప్రదర్శన కనబర్చడంతో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ఎంపికై పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడాడు. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. జనవరి 14 నుంచి పాక్ నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ), మలేసియా జట్ల మధ్య లాహోర్‌లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్లోగానీ హనన్ ఖాన్ మెరిస్తేగనుక, నేరుగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. ‘ఎన్సీఏ జట్టులోకి ఎంపిక చేసినందుకు క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. అంతా అల్లా దయ. ఎప్పటికైనా జాతీయ జట్టులో ఆడాలన్నదే నా కల’అంటాడు సూపర్ క్రికెటర్‌గా ఎదిన పరాటా మేకర్ హనన్ ఖాన్. -
ఎన్సీఏ కోచ్‌లుగా
► రామన్, హిర్వాణీ, శేఖర్ ముంబై: మాజీ టెస్టు క్రికెటర్లు డబ్ల్యు.వి. రామన్, నరేంద్ర హిర్వాణీ, టీఏ శేఖర్‌లను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ప్యానెల్ కోచ్‌లుగా బీసీసీఐ నియమించింది. రామన్ బ్యాటింగ్, శేఖర్ పేస్ బౌలింగ్, హిర్వాణీ స్పిన్ బౌలింగ్ కోచ్‌లుగా పని చేస్తారని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు. మరికొంత మంది అసిస్టెంట్ కోచ్‌లు వీళ్లకు సహాయ సహకారాలు అందజేస్తారన్నారు. ఎన్సీఏ డెరైక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఈ త్రయాన్ని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేశారని చౌదరి తెలిపారు. ఎన్సీఏను శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేసేందుకు బెంగళూరులో స్థలం కోసం అన్వేషిస్తున్నామన్నారు. నెల రోజుల్లో అనువైన స్థలం లభించకపోతే అకాడమీని వేరే చోటుకు తరలిస్తామన్నారు. -
ఆఫ్ ద ఫీల్డ్
ఆట మారినా అదే ‘శైలి’ దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత క్రికెటర్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం రెండు గంటల పాటు మన క్రికెటర్లు బ్యాడ్మిం టన్ ఆడుతున్నారు. అయితే ఒకరితో ఒకరు కాకుండా... చిన్నస్వామి స్టేడియంలోని బ్యాడ్మింటన్ క్లబ్ సభ్యులతో కలిసి ఆడుతున్నారు. ధోని, కోహ్లి వరుసగా మూడు రోజులపాటు సాయంత్రం బ్యాడ్మిం టన్ ఆడారు. అయితే ఆట మారినా వీళ్ల శైలి మాత్రం మారలేదు. ధోని తన ఆటతీరులో ఎక్కువగా డ్రాప్స్, ప్లేస్‌మెంట్స్‌తో పాయింట్లు సాధించాడు. క్రికెట్లో సింగిల్స్ దొంగిలించే తరహాలో ఇక్కడా పాయింట్లు రాబట్టాడు. దీనికి భిన్నంగా కోహ్లి దూకుడు ప్రదర్శిం చాడు. స్మాష్‌ల ద్వారానే పాయింట్లు సాధిం చే ప్రయత్నం చేశాడు. ప్రతి పాయిం ట్నూ వేగంగా ముగించాలనే తపనతో ఆడాడు. ఇషాంత్, భువనేశ్వర్, ధావన్, అశ్విన్, అంబటి రాయుడు, కరుణ్ నాయర్, మురళీ విజయ్ కూడా తమ కెప్టెన్లతో పాటు బ్యాడ్మిం టన్ ఆడుతూ కనిపించారు. -
‘నర్మదా’ ఎత్తు పెంచుకోండి
17 మీటర్ల మేర డ్యామ్ ఎత్తు పెంపునకు గుజరాత్‌కు ఎన్సీఏ అనుమతి తీవ్రంగా వ్యతిరేకించిన నర్మదా బచావో ఆందోళన్ అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్లో వివాదాస్పద నర్మదా డ్యామ్ ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.72 మీటర్లకు(455 అడుగులకు) పెంచుకునేందుకు నర్మదా నియంత్రణ అథారిటీ(ఎన్సీఏ) అనుమతి మంజూరు చేసింది. గురువారం ఢిల్లీలో సమావేశమైన ఎన్సీఏ.. పలు అంశాలపై చర్చించిన అనంతరం ఈ మేరకు అనుమతిచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ జునాగఢ్ పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. ఎప్పటి నుంచో డ్యామ్ ఎత్తు పెంచాలని కోరుతున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే ఈ అనుమతి రావడం గమనార్హం. 1961 ఏప్రిల్ 5న జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన ఈ డ్యామ్.. ముంపు ప్రాంతాలు, పునరావాస సమస్యలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రాజెక్టు పూర్తవుతోంది. ఎనిమిదేళ్ల కిందట డ్యామ్ ఎత్తును 121.92 మీటర్లకు పెంచుకునేందుకు ఎన్సీఏ అనుమతి ఇవ్వగా.. అది సరిపోదని, మరింత పెంచాలని గుజరాత్ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతోంది. ఇప్పుడు ఎత్తును పెంచడం ద్వారా.. ప్రస్తుత సామర్థ్యానికి మూడు రెట్లు ఎక్కువగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం వస్తుందని, రాష్ట్రంలో రైతుల కష్టాలు తీర్చగలమని రాష్ట్ర ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్ చెప్పారు. డ్యామ్‌కు 35 గేట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పుడు మళ్లీ ఎత్తు పెంచాల్సి రావడంతో నిర్మాణం పూర్తికావడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశముందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,450 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లకు పంపిణీ చేస్తారు. దీని ద్వారా గుజరాత్లో 17.92 లక్షల హెక్టార్లకు, రాజస్థాన్‌లో 2.46 లక్షల హెక్టార్లకు నీరందే అవకాశముంటుంది. అలాగే గుజరాత్, రాజస్థాన్‌లలో పలు ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద కాంక్రీటు గ్రావిటీ డ్యామ్(పరిమాణంలో). మొదటిది అమెరికాలోని గ్రాండ్ కూలీ ప్రాజెక్టు. అలాగే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్పిల్ వే డిశ్చార్జి సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెంపునకు వ్యతిరేకంగా పోరాటం: మేధా పాట్కర్ డ్యామ్ ఎత్తు పెంపును నర్మదా బచావో ఆందోళన్(ఎన్బీఏ) తీవ్రంగా వ్యతిరేకించింది. నర్మదా నదిపై భారీ డ్యామ్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఈ సంస్థ చైర్పర్సన్ మేధా పాట్కర్ ముంబైలో మాట్లాడుతూ.. ఎత్తు పెంచాలన్న నిర్ణయం అప్రజాస్వామికమని, పెంపు వల్ల 2.5 లక్షల మంది నివాసముండే పలు ప్రాంతాలు, ఆలయాలు, మసీదులు, చర్చిలు, షాపులు, పంటలు ముంపునకు గురవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మోడీ ప్రధాని అయ్యారు కాబట్టే దీనికి అనుమతి లభించిందన్నారు. దీనిపై తాము పోరాటం చేస్తామన్నారు. సామాజిక న్యాయశాఖ నివేదిక ఇచ్చాకే..: ఉమా భారతి ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాసం విషయంలో 100 శాతం సంతృప్తి వ్యక్తంచేస్తూ సామాజిక న్యాయ శాఖ నివేదిక ఇచ్చిన తర్వాతే ఎత్తు పెంపునకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి గురువారం ఢిల్లీలో చెప్పారు. ప్రాజెక్టుతో సంబంధమున్న నాలుగు రాష్ట్ర్రాలనూ సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామన్నారు.