బెంగళూరు: భారత క్రికెట్‌కు భవిష్యత్ కేంద్రంగా నిలిచే కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి బీసీసీఐ అంకురార్పణ చేసింది. బెంగళూరు నగర శివార్లలో సువిశాల స్థలంలో కొత్త ఎన్‌సీఏను బోర్డు నిర్మించనుంది. దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం జరిగింది. బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు గంగూలీ, జై షాలతో పాటు ఆఫీస్ బేరర్లు అరుణ్ ధుమాల్, జయేశ్ జార్జ్, ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
2000 సంవత్సరం నుంచి నగరం మధ్యలో ఉన్న చిన్నస్వామి స్టేడియం ప్రాంగణంలోనే ఎన్‌సీఏ కొనసాగుతోంది. అక్కడ పరిమిత సౌకర్యాల మధ్యనే అకాడమీ కొనసాగింది. కొత్తగా నిర్మించబోయే ఎన్‌సీఏలో ప్రపంచస్థాయి అత్యుత్తమ సౌకర్యాలతో పాటు దేశవాళీ మ్యాచ్‌లు కూడా నిర్వహించగలిగే మూడు పెద్ద మైదానాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఏడాదిలోగా ఎన్‌సీఏ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment