cricket academy
-
Uppal Stadium: టికెట్ ఉన్నా సీటే లేదు!
ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్లక్షం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. శుక్రవారం ఉప్పల్ స్డేడియంలో సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమానికి విచిత్ర అనుభవం ఎదురైంది. అతడికి టికెట్ ఉన్నా స్టేడియంలో సీటు లభించలేదు. నగరానికి చెందిన జునైద్ అహ్మద్ రూ.4,500 వెచి్చంచి టికెట్ కొన్నాడు. టికెట్లో జే– 66 సీట్ నంబర్ అలాట్ చేశారు. తీరా స్టేడియంలోకి వెళ్లగా జే–65 తర్వాత 67 సీటు ఉండటంతో షాక్ తిన్నాడు. జే–66 సీట్ ఎంత వెతికినా లభించలేదు. ఎవరిని ఆరా తీసినా ఫలితం లేకుండాపోయింది. చేసేదేమీలేక మ్యాచ్ ఆసాంతం నిలబడే చూడాల్సి వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. హెచ్‌సీఏ, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్, నిర్లక్ష్యం కారణంగానే తాను 4 గంటల పాటు నిలబడాల్సి వచి్చందని జునైద్ ఆరోపించాడు. ఈ విషయాన్ని న్యాయస్థానం, వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్తానన్నాడు. -
ఆ క్రికెట్ బెట్టింగ్ యాప్‌తో వారికి ఎలాంటి సంబంధం లేదు: డాబర్ గ్రూప్
క్రికెట్ బెట్టింగ్ యాప్‌లో తమకు ఎటువంటి పాత్ర లేదని డాబర్ గ్రూప్‌నకు చెందిన బర్మన్ కుటుంబం స్పష్టం చేసింది. ఇటీవల మహదేవ్ క్రికెట్ బెట్టింగ్‌యాప్‌తో డాబర్ గ్రూప్ ఛైర్మన్ మోహిత్ బర్మన్, గ్రూప్ డైరెక్టర్ గౌరవ్ బర్మన్ పేర్లు వినిపించాయి. దాంతో పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమచారం. అయితే వివాదంపై డాబర్గ్రూప్ స్పందించింది. రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌ను తాము కొనుగోలు చేయకుండా అడ్డుకోవడం కోసం కావాలనే ఈ ఫిర్యాదు నమోదుచేశారని పేర్కొంది. నవంబరు 7న నమోదైనట్లు చెబుతున్న ఆ ఎఫ్ఐఆర్లో యాప్ ప్రమోటరు మహదేవ్‌తో పాటు 32 మందిపై ఫిర్యాదు చేసినట్లు ఉంది. అందులో డాబర్ గ్రూప్ ఛైర్మన్ మోహిత్ బర్మన్, గ్రూప్ డైరెక్టర్ గౌరవ్ బర్మన్ పేర్లున్నాయి. ఎఫ్ఐఆర్లో మోహిత్, గౌరవ్‌లకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని ఆరోపించారు. వారెవరూ మోహిత్, గౌరవ్‌లకు తెలియదని గ్రూప్ సభ్యులు తెలిపారు. బర్మన్ కుటుంబానికి రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లో 21.24 శాతం వాటా ఉంది. అయితే ఆ వాటాను పెంచుకోవాలని భావిస్తున్న సమయంలో ఈ ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. ఇదీ చదవండి: రిటైర్డ్ టీచర్లకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి: ఇన్ఫోసిస్ మూర్తి బర్మన్స్ గ్రూప్ రెలిగేర్‌కు రూ.2,200 కోట్ల ఒపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. కానీ, ఓపెన్ ఆఫర్ చేయడానికి ఆ గ్రూప్‌నకు అర్హత లేదంటూ రెలిగేర్ స్వతంత్ర డైరెక్టర్లు నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఆర్బీఐ, ఐఆర్డీఏఐ వంటి నియంత్రణ సంస్థలు సూచించిన అన్ని అర్హతలూ తమకున్నాయని బర్మన్స్ పేర్కొన్నారు. అదే సమయంలో 2018 నుంచి రెలిగేర్ ఛైర్పర్సన్ రశ్మీ సలూజా పారితోషికం రూ.150 కోట్లకు పెరగడంపైనా బర్మన్స్ ప్రశ్నలు లేవనెత్తగా.. సలూజా వాటిని తోసిపుచ్చారు. ఓపెన్ ఆఫర్ విషయాన్ని అనధికారికంగా సలూజాకు తెలియపరచిన తదుపరి రోజే సలూజా తన షేర్లను విక్రయించడంపైనా బర్మన్స్ ఆరోపణలు చేశారు. -
రియాన్ పరాగ్ అకాడమీ.. మీకు దణ్ణం సామీ
-
'ఇలాగే ఉంటే టెన్త్ కూడా పాసవ్వలేవన్నారు'
ఎంఎస్ ధోని.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్. ఈతరం అభిమానులకు ధోని ఒక ప్రత్యేకం. ఎందుకంటే రెండుమార్లు ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలు అందించడమే కాదు.. టీమిండియా కెప్టెన్‌గా, ఫినిషర్‌గా అతని సేవలు మరిచిపోలేనివి. టికెట్ కలెక్టర్ జాబ్ నుంచి ఫ్రొఫెషనల్ ఆటగాడిగా.. గోల్ కీపర్ నుంచి వికెట్ కీపర్‌గా టర్న్ తీసుకోవడం ఒక్క ధోనికే చెల్లింది. తన ఆటతీరు, కెప్టెన్సీతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ధోని రిటైర్ అయి రెండేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. తాజాగా ధోని మంగళవారం తమిళనాడులోని హోసూరులో క్రికెట్ మైదానాన్ని ప్రారంభించాడు. ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీతో విద్యార్థులకు క్రికెట్ శిక్షణ అందించేందుకు ఒప్పందం కుదిరింది. ఇక కార్యక్రమం అనంతరం ధోనీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో తన స్కూల్ డేస్‌ని గుర్తు చేసుకున్నాడు. ''నేను ఏడో తరగతిలో క్రికెట్ ఆడటాన్ని ప్రారంభించాను. అప్పటికి నేను ఓ యావరేజ్ స్టూడెంట్‌ని. అయితే క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసిన తర్వాత క్లాస్‌లో నా అటెండెన్స్ నెమ్మదిగా తగ్గుతూ వెళ్లింది. ఒక అటెండెన్స్ విషయం వదిలేస్తే నేను చాలా గుడ్ స్టూడెంట్. టెన్త్ క్లాస్‌కి వచ్చేసరికి ఎక్కువగా గ్రౌండ్‌లోనే ఉండేవాడ్ని. దాంతో టెన్త్ క్లాస్‌లో చాలా ఛాప్టర్స్‌పై నాకు కనీసం అవగాహన కూడా లేకపోయింది. కానీ ఎగ్జామ్స్‌లో ఆ ఛాప్టర్స్‌కి సంబంధించిన ప్రశ్నలే వస్తే ఎంత బాధగా ఉంటుంది. ఇక మా నాన్న నేను కనీసం టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ కూడా పాసవనని అనుకున్నాడు. మళ్లీ సంప్లిమెంటరీలు రాసుకోవాల్సిందేనని కంగారుపడ్డారు. ఆయన అంచనాలకు భిన్నంగా 66శాతం మార్కులతో పదో తరగతి పాసయ్యాను. ఇది తెలుసుకున్న తర్వాత నాన్నతో పాటు నేను చాలా సంతోషపడ్డాను'' అని ధోనీ గుర్తు చేసుకున్నాడు. ఇక ధోని కెప్టెన్‌గా భారత జట్టుకి 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్‌లు అందించాడు. ఆ తర్వాత 2013లో టీమిండియాను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజేతగా నిలిపాడు. క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనీనే. అలాగే ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. -
33 ఏళ్లకు భూమిని తిరిగిచ్చేసిన భారత దిగ్గజ క్రికెటర్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ 33 ఏళ్ల తర్వాత తనకు కేటాయించిన భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పడం చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళితే.. 1988లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలంటూ సునీల్ గావస్కర్‌కు ముంబైలో బాంద్రా శివారులో 20వేల స్క్కేర్‌ఫీట్‌లలో ఒక ప్లాట్‌ను కేటాయించింది. 33 ఏళ్లు కావొస్తున్నప్పటికి గావస్కర్ అక్కడ క్రికెట్ అకాడమీని గాని.. అందుకు సంబంధించిన మౌళిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి జితేంద్ర అవ్హద్ గతేడాది గావస్కర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా బాంద్రాలో కేటాయించిన ప్లాట్‌లో అకాడమీని ఏర్పాటు చేయలేనంటూ గావస్కర్ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు బుధవారం లేఖ రాసినట్లు మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంహెచ్ఏడీఏ) పేర్కొంది. కాగా గతంలో క్రికెట్ అకాడమీ విషయమై గావస్కర్.. సచిన్‌తో కలిసి ఉద్దవ్‌ను కలిసి ప్లాన్ వివరించారు. కానీ ఆ ప్లాన్ ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలోనే 33 ఏళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్న ప్లాట్‌ను ఇచ్చేయాలని గావస్కర్‌ను కోరగా.. ఆయన ప్రభుత్వానికి ఇచ్చేసినట్లు ఎంహెచ్డీఏ తెలిపింది. చదవండి: Yuvraj Singh: టెస్టు క్రికెట్ చనిపోయే దశకు వచ్చింది -
కొత్త ‘ఎన్సీఏ’కు శంకుస్థాపన
బెంగళూరు: భారత క్రికెట్‌కు భవిష్యత్ కేంద్రంగా నిలిచే కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి బీసీసీఐ అంకురార్పణ చేసింది. బెంగళూరు నగర శివార్లలో సువిశాల స్థలంలో కొత్త ఎన్సీఏను బోర్డు నిర్మించనుంది. దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం జరిగింది. బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు గంగూలీ, జై షాలతో పాటు ఆఫీస్ బేరర్లు అరుణ్ ధుమాల్, జయేశ్ జార్జ్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2000 సంవత్సరం నుంచి నగరం మధ్యలో ఉన్న చిన్నస్వామి స్టేడియం ప్రాంగణంలోనే ఎన్సీఏ కొనసాగుతోంది. అక్కడ పరిమిత సౌకర్యాల మధ్యనే అకాడమీ కొనసాగింది. కొత్తగా నిర్మించబోయే ఎన్సీఏలో ప్రపంచస్థాయి అత్యుత్తమ సౌకర్యాలతో పాటు దేశవాళీ మ్యాచ్‌లు కూడా నిర్వహించగలిగే మూడు పెద్ద మైదానాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఏడాదిలోగా ఎన్సీఏ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. -
హైదరాబాద్‌లో ధోని క్రికెట్ అకాడమి ప్రారంభం
MS Dhoni Cricket Academy In Hyderabad: భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ)ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తుండడం గొప్ప విషయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి కొనియాడారు. శుక్రవారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)లో జరిగిన ఎంఎస్‌డీసీఏ అకాడమీ ప్రారంభోత్సవంలో మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎంఎస్‌డీసీఏ–ఆర్కా మేనేజింగ్ డైరెక్టర్ మిహిర్ దివాకర్ పాల్గొన్నారు. తొలుత మంత్రి సమక్షంలో ఎంఎస్‌డీసీఏతో రెండేళ్ల కాలానికి కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం, పల్లవి విద్యాసంస్థల చైర్మన్ మల్కా కొమరయ్య, మిహిర్ దివాకర్ మార్చుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎంఎస్‌డీసీఏను ఉన్నత ప్రమాణాలతో నడుపుతూ భవిష్యత్‌లో ధోనీ వంటి ఉత్తమ క్రికెటర్లను టీమిండియాకు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ‘ఎంఎస్‌డీసీఏ’ను స్థాపించినట్టు ఆ సంస్థ ఎండీ మిహిర్ చెప్పారు. తొలి దశలో భాగంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం)లో ఈ నెలాఖరు నుంచి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. -
ధోని ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్..
జైపూర్: రాజస్థాన్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫ్యాన్స్‌పై లాఠీచార్జీ జరిగింది. ధోనిని చూసేందుకు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో రావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఫ్యాన్స్‌ను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో టెంట్లు చిరిగిపోయి, కుర్చీలు విరిగిపోయాయి. ప్రశాంతంగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని అభిమానులు.. బారికేడ్లు తోసుకుని ధోనితో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పలేదు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి షాక్‌తిన్న ధోని.. హడావిడిగా రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోయారు. కాగా, స్నేహితుల కోరిక మేరకు జాలోర్ జిల్లాలోని జాఖల్ గ్రామంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ధోనీ అక్కడికి వెళ్లారు. -
తెలంగాణలో ధోని క్రికెట్ అకాడమీలు..?
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని త్వరలో తెలంగాణలో క్రికెట్ అకాడమీలు ప్రారంభించబోతున్నాడు. ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ పేరుతో ప్రారంభంకానున్న ఈ అకాడమీలను ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ, బ్రెయినియాక్స్ బీ అనే సంస్థలు సంయుక్తంగా ప్రారంభించేందుకు శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాబోయే రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 15 అకాడమీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆర్కా స్పోర్ట్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, భారత మాజీ అండర్-19 ప్రపంచకప్ జట్టు సభ్యుడు మిహిర్ దివాకర్ వెల్లడించారు. అకాడమీలను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు నెలకొల్పడం ధోని చిరకాల కోర్కె అని ఆయన ప్రకటించాడు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రెండేళ్ల కాలంలో తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 25 శిక్షణా కేంద్రాలను నెలకొల్పడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అకాడమీ కోచింగ్ డైరెక్టర్‌గా సౌతాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ డారెల్ కలీనన్ కొనసాగుతారన్నారు. తమ సంస్థకు చెందిన మొదటి అకాడమీ ఈ ఏడాది ఏప్రిల్‌లో బళ్లారిలో ప్రారంభంకానుందని వెల్లడించారు. కాగా, ఇప్పటికే భారత్‌లో 50కి పైగా కేంద్రాలు, విదేశాల్లో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ధోని త్వరలో విద్యారంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నాడని, ఈ ఏడాది జూన్ నుంచి బెంగళూరులో ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభంకానుందని ఆయన ప్రకటించాడు. -
‘లక్ష్యాన్ని ప్రేమతో సాధించాలి’
ఏ అంశంలోనైనా గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు భావిస్తారు. క్రీడా రంగంలో.. అందులోనూ అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్న క్రికెట్ క్రీడ విషయంలో గెలుపు ముఖ్యం కాకూడదు. ఎంత బాగా మన ఆట తీరును ప్రదర్శించాం... ఎంత మందిని ప్రోత్సహించామన్నదే ప్రధానం. ప్రతిభ గల క్రీడాకారులను ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. ఏసీఏ డైరెక్టర్ వై.వేణుగోపాలరావు త్వరలో ఇండియా జట్టులోకి మన కుర్రోళ్లు... ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాధనలో రాటుదేలుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు హనుమ విహారి, కె.ఎస్.భరత్ ఇండియా తరఫున ఆడుతున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. త్వరలో మరో ముగ్గురికి అవకాశం దక్కనుంది. విశేషమేమిటంటే ఆంధ్రప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీలకు క్వాలిఫై కావటం. క్రికెట్ చరిత్రలో ఇదో మంచి పరిణామంగా చెప్పవచ్చు. మన క్రీడాకారుల ప్రతిభకు ఇది తార్కాణంగా నిలుస్తుంది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సాహం గ్రామీణ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏసీఏ అధిక ప్రాధాన్యమిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే విజయనగరం వంటి జిల్లాలో రెండు నుంచి మూడు మైదానాలు ఏర్పాటు చేశాం. త్వరలో శ్రీకాకుళం, తిరుపతి నగరాల్లో మైదానాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆయా మైదానాల్లో శిక్షణ పొందేందుకు వచ్చే వారి కోసం శిక్షకులను ఏర్పాటు చేస్తాం. ఉన్నకాడికి వనరులను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేధించగలిగే స్థాయికి క్రీడాకారులు ఎదగాలి. ఫ్రీగా ఏసీఏ కోసం పని చేస్తున్నా... అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తరువాత ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది. 70 ఐపీఎల్ మ్యాచ్‌లు... 16 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాను. కానీ తాజాగా చేపట్టిన బాధ్యతలతో ఆనందంగా ఉంది. ఇంతకుముందు వారంతా నెలకు రూ. 3లక్షల వరకు జీతం తీసుకునేవారు. నేను మాత్రం అటువంటి రెమ్యూనరేషన్కోసం ఆశపడలేదు. ఫ్రీగానే బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఆంధ్రాలో క్రికెట్ క్రీడాకారులను తయారుచేయటమే ధ్యేయం. ఎన్నో కష్టాలు పడ్డా... మా స్వస్థలం విశాఖ జిల్లా గాజువాక. అక్కడే చిన్న స్టేడియంలో నిత్యం సాధన చేసే వాడ్ని. క్రికెట్లో రాణించాలన్నది నా లక్ష్యం. అందుకు అనుగుణంగానే కష్టపడ్డాను. ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఇష్టంగా ఎదుర్కొన్నా. మద్రాసు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఆడేందుకు వెల్లాల్సిన అవసరం వచ్చిన సమయంలో ట్రైన్లో జనరల్ బోగీలోని బాత్రూం పక్కన కూర్చొని వెల్లిన రోజులున్నాయి. బెంగళూరులో డార్మిటరీలో పడుకుని ప్రాక్టీస్‌కు వెళ్లాను. ఇన్ని కష్టాలు పడ్డ తరువాత అంతర్జాతీయ యవనికపై ఆడే అవకాశం దక్కింది. అప్పుడు ఈ కష్టాలన్నింటినీ మర్చిపోయాను. కుటుంబ ప్రోత్సాహం మరువలేనిది... అమ్మ.. నాన్న... ఐదుగురు అన్నదమ్ములం... అందులో నేను నాల్గవ వాడిని. నా తమ్ముడు జ్ఞానేశ్వర్ ఇండియా అండర్–19 జట్టుకు ఆడాడు. అమ్మనాన్నల ఇష్టంతో ప్రమేయం లేకుండానే క్రికెట్లోకి దిగాను. ఎవ్వరూ అడ్డుచెప్పలేదు. మా అన్నదమ్ములంతా ఆంధ్రా జట్టుకు ఆడినవారే. నేనొక్కడినే ఇండియాకు ఆడాను. ఆంధ్రా నుంచి తక్కువ మంది క్రీడాకారులు ఇండియాకు ఆడిన వారు ఉన్నారు. వారి సంఖ్య మరింత పెరగాలన్నదే నా లక్ష్యం. అందుకోసం నా శాయశక్తుల పని చేస్తా. ఈ విషయంలో నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రస్తుతం భార్య, ఇద్దరు పిల్లలతో చెన్నైలో ఉంటున్నా. మూడు నెలల తరువాత విశాఖలో అమ్మ, నాన్న దగ్గరకు వెళ్లా. -
దగ్గరి దారులు వెతక్కండి!
ముంబై: కెరీర్లో పైకి ఎదిగే క్రమంలో దగ్గరి దారులు వెతకవద్దని, సవాళ్లు ఎదురైనప్పుడు మోసం చేసైనా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యువ ఆటగాళ్లకు సూచించాడు. అలా చేస్తే ఏదో ఒక దశలో దొరికిపోతారని, ప్రపంచం ముందు పరువు పోతుందని అతను హెచ్చరించాడు. సచిన్ తన సొంత క్రికెట్ అకాడమీ ‘టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ డీవై పాటిల్ స్పోర్ట్స్ సెంటర్’ను మంగళవారం ఇక్కడ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో అతనితో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ గ్యాటింగ్, ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు విజయ్ పాటిల్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ కుర్రాళ్లలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ‘క్రమశిక్షణ, ఏకాగ్రత, ప్రణాళిక తదితర అంశాల గురించి జీవితంలో నేను ఎన్నో నేర్చుకున్నాను. అయితే చాలా సార్లు అంచనాలకు తగిన విధంగా రాణించకుండా విఫలమయ్యాను కూడా. అయితే నేను మళ్లీ సరైన దిశలో వెళ్లేందుకు నాకు ఆట ఉపయోగపడింది. ఈ క్రమంలో ఎలాంటి దగ్గరి దారులు లేవని కూడా అర్థమైంది. మున్ముందు సవాళ్లు ఎదురైనా మోసపూరితంగా మాత్రం వ్యవహరించరాదని తెలుసుకున్నాను. నేను చివరి టెస్టులో అవుటైన తర్వాత కూడా దాని గురించి మా అన్నయ్యతో చర్చించాను. మళ్లీ బ్యాటింగ్ చేయనని తెలిసి కూడా ఆ షాట్‌ను ఎలా ఆడాల్సిందని విశ్లేíÙంచుకున్నాను. ఇదంతా నేర్చుకోవడమే’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. -
సచిన్ అకాడమీ ప్రారంభం
-
అందుకు నేనేం అతీతం కాదుగా..
సనత్‌నగర్: ‘భారతీయ సంస్కృతిలో బంగారు ఆభరణాలు ఒక భాగం. మహిళలకు వీటిపై ఎంతో మమకారం. వీటిని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అందుకు నేనూ అతీతమేమీ కాదు. క్రీడాకారిణిగా నా జీవిత కాలంలో ఎక్కువ రోజులు నగలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఏదైనా వేడుకకు వెళ్లేటప్పుడు మాత్రం అందుకు తగ్గట్టుగా ఆభరణాలను ధరిస్తా’నని చెబుతోంది భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్. ఇప్పుడిప్పుడే క్రీడల పట్ల అమ్మాయిలు ఆసక్తి కనబరచడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. తన పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఇంకా సమయం ఉందంటూ నవ్వులు చిందించారు. ప్రముఖ బంగారు ఆభరణాల షోరూం జోయలుక్కాస్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన ఆస్ట్రేలియా డైమండ్స్ కలెక్షన్‌కు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూవిశేషాలు ఇవీ.. పాఠశాల స్థాయి నుంచీ నగరంతోనేమీ అనుబంధం పెనవేసుకుంది.. అప్పటికీఇప్పటికీ ఎలాంటి మార్పులు గమనిచారు? ♦ నగరం చాలా మారిపోయింది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేలా ప్రాజెక్టులు ఇక్కడ కొలువుదీరాయి. అలాగే క్రీడా రంగం విషయానికొచ్చేసరికి దేశంలో ప్రధాన నగరాలతో పోలిస్తే మన నగరంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచే ఎక్కువ క్రీడాకారులు తయారవుతున్నారు. ఇక్కడి సౌకర్యాలతో యువత తమను తాము మౌల్డ్ చేసుకుంటున్నారు. క్రికెట్‌తో బిజీగా ఉండే మీరు.. ప్రచారకర్తగా అవతారమెత్తడంపై ఎలా ఫీలవుతున్నారు? ♦ వివిధ దేశాలతో క్రికెట్ ఆడేటప్పుడు ఆయా దేశాల మధ్య సత్సంబంధాలు ఎంతో బలపడతాయి. జోయలుక్కాస్ ఆస్ట్రేలియా డైమండ్స్‌ను సామాన్య, మధ్యతరగతి కుటుంబీలకు కూడా అందుబాటులో ఉండేలా నగరవాసుల ముంగిటకు తీసుకురావడం సంతోషదాయకం. ఇప్పటివరకు క్రికెట్‌తో ఆస్ట్రేలియాతో అనుబంధం ఉండగా, ప్రస్తుతం డైమండ్స్‌తో మరో బంధం ఏర్పడినట్లయ్యింది. అందుకే బ్రాండ్ అబాసిడర్‌గా ఉండాలనగానే ఒప్పుకొన్నాను. క్రీడాకారిణులు నగలకు దూరంగా ఉంటారటగా. మీకు ఆభరణాలంటే ఇష్టమేనా? ♦ ఔను. క్రికెట్ ఆటతో బాల్యం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అలాగే నగలు పెట్టుకోవడం కూడా చాలా అరుదు. భారతదేశంలో ఏ ఆడపిల్లకైనా నగలంటే ప్రాణం. అందులో నేను ఒకదాన్ని. ఫలానా ఆభరణాలంటూ ఏమీ లేదు గానీ అన్ని రకాల నగలను ఇష్టపడతా. సందర్భాన్ని బట్టి వాటిని ధరిస్తా. మీరు క్రికెట్లోకి ప్రవేశించేనాటికి, ఇప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ♦ నేను క్రికెట్లోకి ప్రవేశించే నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ. నేను చదివిన కీస్ హైస్కూల్ మైదానం, జింఖానా మైదానమే నాకు తెలుసు. ఇప్పుడు కొత్తగా అకాడమీలు అందుబాటులోకి వచ్చాయి. క్రీడాకారులకు అవసరమైన వసతులు పెరిగాయన్నది కచ్చితంగా చెప్పగలను. వసతులు పెరిగాయి సరే.. క్రీడల్లోకి యువత వస్తున్నారా.. రాణిస్తున్నారా? మిథాలీరాజ్: నిజమే, యువత అనుకున్న స్థాయిలో క్రీడారంగం వైపు రాలేకపోతున్నారు. దీనికి కారణం వారికి పాఠశాల స్థాయిలో క్రీడల్లో పునాది ఉండడం లేదు. ప్రస్తుతం ఎక్కువ శాతం పాఠశాలలకు సరైన క్రీడా మైదానాలు లేకపోవడం, పిల్లలను ఆటలకు దూరం కావడం జరుగుతుంది. కళాశాల స్థాయి వచ్చేవరకు కూడా వారికి క్రీడల్లో రాణించలేకపోతున్నారు. రిటైర్మెంట్ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే ఆలోచన ఉందా? ♦ ఇప్పుడు జోయలుక్కాస్ ఆస్ట్రేలియా డైమండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను. భవిష్యత్తులో అదే జ్యువెలరీ వ్యాపారంలోకి దిగుతానేమో (నవ్వుతూ) అకాడమీ స్థాపన ఆలోచన ఏమైనా ఉందంటారా? ♦ ప్రస్తుతం అకాడమీ ఏర్పాటు ఆలోచన లేదు కానీ భవిష్యత్‌లో ఎప్పటికైనా స్థాపించడం మాత్రం ఖాయం. క్రీడా రంగంలో ఆడపిల్లలకు ఇంకా ‘కట్టుబాట్లు’ అడ్డుపడుతున్నాయంటారా? ♦ ఆడపిల్లలు ఏ రంగంలోనైనా రాణించే సత్తా ఉంది. కొందరు తల్లిదండ్రులు కట్టుబాట్ల పేరుతో ఆటలకు దూరం చేస్తున్నారు. ఇది సరికాదు. తల్లిదండ్రుల్లో చైతన్యం రావాలి. తమ పిల్లలకు ఇష్టమైన గేమ్‌లో ప్రోత్సాహాన్ని అందించాలి. పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు.. లవ్ మ్యారేజా.. పెద్దల కుదిర్చిన మ్యారేజా? ♦ పెళ్లికి ఇంకా సమయం ఉంది. లవ్ మ్యారేజా, పెద్దలు కుదిర్చిందా..? అంటే చెప్పలేను. ప్రస్తుతం నా ధ్యాసంతా క్రికెట్‌పైనే. -
రోహిత్ శర్మకు లైన్ క్లియర్
సాక్షి, బెంగళూరు : ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ప్రామాణికమైన యో-యో పరీక్షలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ విజయవంతమయ్యాడు. తద్వారా టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ఈ ముంబైకర్ అర్హత సాధించాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో బుధవారం నిర్వహించిన యో-యో టెస్టును క్లియర్ చేసినట్లు రోహిత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. తన ఫొటోతో పాటు.. ‘యో యో త్వరలోనే ఐర్లాండ్ వచ్చేస్తున్నా’ అంటూ రోహిత్ పోస్ట్ చేశాడు. నిజానికి 15వ తేదీనే రోహిత్ శర్మ ఈ టెస్టుకు హజరవ్వాల్సి ఉండగా.. విదేశాల్లో ఉన్న కారణంగా బీసీసీఐ అనుమతితో 17వ తేదీకి మార్చుకున్నాడు. కానీ 17వ తేదీన కూడా రోహిత్ ఫిట్నెస్ టెస్టుకు హాజరు కాకపోవడంతో ఇంగ్లండ్ పర్యటనకు అర్హత సాధిస్తాడా లేదా అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే బీసీసీఐ బుధవారం రోహిత్‌కు మరో అవకాశం ఇవ్వగా అతడు సద్వినియోగం చేసుకుని జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 27,29న టీమిండియా ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం 3 టీ20లు, 3 వన్డేలు, 5 టెస్ట్‌లు కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. A post shared by Rohit Sharma (@rohitsharma45) on Jun 20, 2018 at 2:39am PDT -
సెయింట్ జాన్స్ జట్ల జోరు
సాక్షి, హైదరాబాద్: సెయింట్ జాన్స్ ఫ్రెండ్షిప్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ జట్లు శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అండర్–12 విభాగంలో వామోస్ ఖుగర్ క్రికెట్ అకాడమీతో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ జాన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట వామోస్ ఖుగర్ జట్టు 25 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెయింట్ జాన్స్ అకాడమీ 25 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసి గెలుపొందింది. రక్షిత్ (77) వేగంగా ఆడాడు. అండర్–15 బాలుర విభాగంలో సెయింట్ జాన్స్ ‘బి’ జట్టుతో జరిగిన మరో మ్యాచ్‌లో సెయింట్ జాన్స్ ‘ఎ’ జట్టు 51 పరుగులతో విజయం సాధించింది. మొదట ఎ జట్టు 30 ఓవర్లలో 7 వికెట్లకు 221 పరుగులు చేసింది. అనంతరం ‘బి’ జట్టు 27.3 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. మరో మ్యాచ్ వివరాలు: అర్షద్ అయూబ్ క్రికెట్ అకాడమీ: 165/7 (పాషా 29; చేతన్ 3/27), వామోస్ ఖుగర్ క్రికెట్ అకాడమీ: 166/6. -
నిరుపేదల కోసం.. పఠాన్ బ్రదర్స్
సాక్షి, న్యూఢిల్లీ: నిరుపేద పిల్లలను క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు భారత క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్లు నడుం బిగించారు. పఠాన్ క్రికెట్ అకాడమీ పేరిట నిరుపేద పిల్లలకు మొబైల్ సంస్థ ‘ఒప్పో’ అందించిన 20 లక్షల స్కాలర్ షిప్ సాయంతో రెండేళ్ల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్యాంపుకు రెండు దశల్లో నిర్వహించిన సెలక్షన్ పోటీల్లో 17 మంది నిరుపేద క్రికెటర్లను ఎంపికయ్యారు. ఈ పోటీలకు 50 మంది పాల్గొనగా తొలి రౌండ్లో 30 మంది ఎంపికవ్వగా.. రెండో రౌండ్లో 17 మందిని ఎంపిక చేశారు. ఈ పిల్లలంతా పఠాన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పలువురి క్రికెట్ దిగ్గజాల శిక్షణతో రాటుదేలనున్నారు. -
కేటీఆర్‌తో వీవీఎస్ లక్ష్మణ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)తో భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ మంగళవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో వీవీఎస్ లక్ష్మణ్ అక్కడికి వచ్చి మంత్రిని కలిశారు. హైదరాబాద్‌లో క్రీడల అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పన, తాను త్వరలో ప్రారంభించనున్న క్రికెట్ అకాడమీకి సంబంధించిన అంశాలను మంత్రికి క్రికెటర్ లక్ష్మణ్ వివరించినట్టు సమాచారం. తెలంగాణ యువతను మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పరంగా అనేక విధాలుగా కృషి చేస్తున్నామని, ఇలాంటి అకాడమీలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. -
నగరంలో వీవీఎస్ మరో అకాడమీ
డీపీఎస్ నాచారంలో ఏర్పాటు అత్యుత్తమ శిక్షణ అందిస్తామన్న లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: నగరంలో అత్యుత్తమ క్రికెట్ శిక్షణ అందించే క్రమంలో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మరో అడుగు ముందుకు వేశారు. రెండేళ్ల క్రితం తొలి వీవీఎస్ అకాడమీని ఏర్పాటు చేసిన లక్ష్మణ్ ఇప్పుడు తన రెండో అకాడమీని కూడా ప్రారంభించనున్నారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ అకాడమీ ఏర్పాటవుతోంది. లక్ష్మణ్ తొలి అకాడమీ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్లో పని చేస్తోంది. కొత్త అకాడమీకి సంబంధించిన విశేషాలను లక్ష్మణ్ గురువారం మీడియాకు వెల్లడించారు. ‘హైదరాబాద్‌లో ఉత్తమ క్రికెట్ శిక్షణ ఎక్కువ మం దికి అందుబాటులోకి రావాలనేది నా కోరిక. అందు కోసం 4–5 అకాడమీలు ఏర్పా టు చేయాలని సంకల్పించాను. ఇందులో భా గంగా రెండోది డీపీఎస్ నాచారంలో ప్రారంభం కానుంది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలు, మంచి కోచ్‌లతో ఇక్కడ శిక్షణనిస్తాం. రెగ్యులర్ కోచింగ్ తర్వాత వీడియో విశ్లేషణలు కూడా ఈ అకాడమీలో అందుబాటులో ఉంచాం. శిక్షణార్ధులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు లోను కాకూడదన్నదే మా ఉద్దేశం’ అని వీవీఎస్ వెల్లడించారు. డీపీఎస్‌లో మొత్తం 10 పిచ్‌లు ఉన్నాయి. ఇందులో 5 టర్ఫ్ వికెట్లు కాగా, మిగతావి ఆస్ట్రోటర్ఫ్, మ్యాటింగ్, సిమెంట్ వికెట్లు ఉన్నాయి. ఇక్కడ ముందుగా వేసవి శిక్షణా శిబిరం ఏప్రిల్ 3నుంచి ప్రారంభం కానుంది. జూన్ మొదటి వారం వరకు ఇది కొనసాగుతుంది. రెగ్యులర్‌గా కోచింగ్ తీసుకునే ఆటగాళ్ల కోసం మూడు వయో విభాగాల్లో వేర్వేరుగా శిక్షణ ఇస్తారు. 5–10 ఏళ్ల వయసు, 10–15 ఏళ్లు, 15 ఏళ్ల పైబడినవారిగా వీటిని విభజించారు. ‘మిగతా అకాడమీల ఏర్పాటు గురించి కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే మున్ముందు దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా వీవీఎస్ అకాడమీలను విస్తరిస్తాను’ అని లక్ష్మణ్ చెప్పారు. మరో వైపు వీవీఎస్లాంటి దిగ్గజ క్రికెటర్‌తో జత కట్టడం పట్ల డీపీఎస్ చైర్మన్ ఎం. కొమరయ్య సంతోషం వ్యక్తం చేశారు. ‘మా పాఠశాలలో 700కు పైగా విద్యార్థులు ఉన్నారు. అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. పెద్ద మైదానం సహా అత్యుత్తమ క్రీడా సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీవీఎస్ రాకతో క్రికెట్ కూడా ఊపందుకుంటుందని మా నమ్మకం. డీపీఎస్ విద్యార్థులే కాకుండా ఆసక్తి గలవారు ఎవరైనా ఈ అకాడమీలో శిక్షణ తీసుకునేందుకు అవకాశం ఉంది’ అని కొమరయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీపీఎస్ అకడమిక్ డైరెక్టర్ టి.సుధ తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ అకాడమీ ప్రారంభం
నెల్లూరు (బృందావనం) :నగరంలోని పొదలకూరురోడ్డులో చిన్మయ మిషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రేమ్ క్రికెట్ అకాడమీని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఐపీఎల్ క్రీడాకారుడు జ్ఞానేశ్వరరావుతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రంజీ క్రికెట్ క్రీడాకారుడు ప్రేమ్‌సాగర్ జిల్లాలో క్రికెట్ క్రీడారంగ ప్రగతిని కాంక్షించి అకాడమీని ప్రారంభించడం హర్షణీయమన్నారు. జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ నెట్ ప్రాక్టీస్‌తో ప్రారంభించిన అకాడమీ వర్థమాన క్రీడాకారులకు ఎంతో తోడ్పాటును అందించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రేమ్‌సాగర్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అకాడమీని ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా నుంచి ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్‌హ్యాండ్స్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ కోచ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో 24 క్రికెట్ అకాడమీలు
-
పఠాన్ బ్రదర్స్ క్రికెట్ అకాడమీ
వచ్చే నెల చివర్లో బరోడాలో అందుబాటులోకి... ముంబై: భారత క్రికెటర్లు యూసుఫ్, ఇర్ఫాన్ పఠాన్లు బరోడాలో క్రికెట్ అకాడమీని నెలకొల్పారు. తమకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఆటకు కొంతైనా సేవ చేసేందుకు దీన్ని ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెల చివరి నుంచి ఈ అకాడమీ అందుబాటులోకి రానుంది. ‘చాలా కాలంగా అకాడమీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ అకాడమీలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. మొదట 8-9 వారాల కోర్సు పూర్తి చేసిన తర్వాత రెండో దశకు వెళ్తారు. ఆటకు సంబంధించిన మౌలిక వసతులున్న పాఠశాలకు వెళ్లి అక్కడ కూడా కోచింగ్ ఇస్తాం. ఏడాది మొత్తం ఇది అందుబాటులో ఉంటుంది’ అని పఠాన్ బ్రదర్స్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో అకాడమీని మరో మూడు నగరాలకు విస్తరించనున్నామని చెప్పిన బ్రదర్స్... 2015 చివరికి 50 అకాడమీలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అకాడమీలోని కోచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్, కామె రూన్ ట్రెడ్వెల్లతో తాము ఒప్పందం చేసుకున్నామన్నారు. అకాడమీల సంగతిని పక్కనబెడితే తమలో 5 నుంచి 7 ఏళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని వెల్లడించారు. -
మెరిసిన తిలక్.. గెలిచిన ‘బ్రదర్స్’
అండర్-16 అంతర్ అకాడమీల టోర్నీ సాక్షి, హైదరాబాద్: తిలక్ వర్మ (42 బంతుల్లో 72 నాటౌట్), సానా కార్తీక్ (35 బంతుల్లో 57)లు చెలరేగడంతో బ్రదర్స్ క్రికెట్ అకాడమీ (బీసీఏ) 9 వికెట్ల తేడాతో అర్షద్ అయూబ్ క్రికెట్ అకాడమీ (ఏఏసీఏ)పై గెలుపొందింది. అండర్-16 అంతర్ అకాడమీల టోర్నీలో భాగంగా శుక్రవారం బేగంపేట గ్రౌండ్స్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఏఏసీఏ 25 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శివ (40), రహీం (31)లు రాణించారు. అనంతరం బీసీఏ జట్టు 13.2 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. ఇతరమ్యాచ్ల ఫలితాలు: రాజు సీసీ (జూబ్లీ హిల్స్): 58 ఆలౌట్ (సుకేష్ 4/18, అంకిత్ 4/16); ఖాజా సీఏ: 60/0 (సాయిరాజ్ 34 నాటౌట్) గుజరాత్ సీఏ: 114 (అభిలాష్ 44; విజయ్‌కుమార్ 3/25); సెయింట్ పీటర్స్ సీఏ: 115/2 (గణేశ్ 30, వికాస్‌రావు 37 నాటౌట్) రాజు సీసీ (మాదాపూర్): 82 (సాయికుమార్ 2/19); సెయింట్ జాన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్: 83 (అజయ్‌దేవ్ గౌడ్ 35 నాటౌట్, కృష్ణ 37 నాటౌట్). ఎస్కెఎన్ సీఏ: 106/7 (భరద్వాజ్ 27; ఆరిఫ్ అహ్మద్ 2/5); హెచ్‌పీఎస్ (బి): 107/7 (రాజశేఖర్ 50). స్పోర్ట్స్ సెంటర్: 202/7 (ప్రతీక్ 73, రోహిత్ 3/25); ఎవర్గ్రీన్ సీఏ: 140/7 (మధు 38; సహేంద్ర 3/10). -
యూఏఈ జట్టులో హైదరాబాదీ!
అండర్-19 వరల్డ్‌కప్‌లో రాణించిన ఉమర్ సాక్షి, హైదరాబాద్: అండర్-19 స్థాయి క్రికెట్లో నగరానికి చెందిన కుర్రాడు ఉమర్ మొహమ్మద్ ఆకట్టుకున్నాడు. అయితే అతను ఆడింది భారత జట్టు తరఫున కాదు. ఈ టోర్నీలో ఉమర్... యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కుడి చేతి వాటం పేస్ బౌలర్ అయిన ఉమర్ స్వస్థలం హైదరాబాదే. నగరంలోని సన్‌సిటీ (లంగర్‌హౌస్) వద్ద గల బీకే క్రికెట్ అకాడమీలో అతను శిక్షణ పొందాడు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం అతను దుబాయ్‌లోనే ఉంటున్నాడు. తరచుగా నగరానికి వచ్చే ఉమర్, ఇదే అకాడమీలో ప్రాక్టీస్ చేస్తాడు. వరల్డ్ కప్ టోర్నీకి ముందు కూడా ఇక్కడే సాధన కొనసాగించాడు. అత్యుత్తమ బౌలింగ్...: తాజాగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో ఉమర్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పొదుపైన బౌలింగ్ చేయడంతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో (10-2-24-4) చెలరేగాడు. తమ అకాడమీ ఆటగాడు అంతర్జాతీయ స్థాయికి ఎదగడం పట్ల బీకే అకాడమీ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. -
కఠోర శిక్షణతోనే సాధ్యం: వెంకటపతిరాజు
మౌలాలి, న్యూస్‌లైన్: క్రికెట్లో రాణించేందుకు కఠోర శిక్షణ అవసరమని మాజీ టెస్టు ఆటగాడు వెంకటపతిరాజు అన్నారు. ఆదివారం చంద్రగిరి కాలనీలోని నలంద హైస్కూల్లో జరిగిన నంది క్రికెట్ అకాడమీ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ పాఠశాలలు క్రికెట్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి నాణ్యమైన క్రీడాకారులను తయారు చేస్తున్నాయని చెప్పారు. అండర్-16 బాలికల విభాగంలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అకాడమీ విద్యార్థిని చిత్రను ఆయన అభినందించి ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో రంజీ మాజీ క్రికెటర్, కోచ్ ఐ.వి.రావు, వసంత్, ఛటర్జీ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టుకెక్కిన కన్వల్జిత్
సాక్షి, హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అకాడమీ డెరైక్టర్ కన్వల్జిత్ సింగ్ వివాదం మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు వీరేందర్ యాదవ్‌పై దాడి చేసిన ఆరోపణలపై గత నెల 26న కన్వల్పై బేగంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తదనంతర పరిణామాల్లో హెచ్‌సీఏ కన్వల్జిత్‌ను సస్పెండ్ చేసింది. అయితే తనపై సస్పెన్షన్ విధించడం అన్యాయమని ఈ మాజీ స్పిన్నర్ కోర్టుకెక్కారు. సస్పెన్షన్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో ‘క్వాష్ పిటిషన్’ దాఖలు చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వినోద్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులను కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చినట్లు సమాచారం. దీనిపై శుక్రవారం కోర్టులో వాదనలు జరిగాయి. సోమవారానికి కేసు వాయిదా పడింది.