ఉప్పల్ స్టేడియంలో వింత అనుభవం
4 గంటల పాటు నిలబడి మ్యాచ్‌ను వీక్షించిన ఓ అభిమాని
ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్లక్షం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. శుక్రవారం ఉప్పల్ స్డేడియంలో సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమానికి విచిత్ర అనుభవం ఎదురైంది. అతడికి టికెట్ ఉన్నా స్టేడియంలో సీటు లభించలేదు. నగరానికి చెందిన జునైద్ అహ్మద్ రూ.4,500 వెచి్చంచి టికెట్ కొన్నాడు. టికెట్‌లో జే– 66 సీట్ నంబర్ అలాట్ చేశారు.
తీరా స్టేడియంలోకి వెళ్లగా జే–65 తర్వాత 67 సీటు ఉండటంతో షాక్ తిన్నాడు. జే–66 సీట్ ఎంత వెతికినా లభించలేదు. ఎవరిని ఆరా తీసినా ఫలితం లేకుండాపోయింది. చేసేదేమీలేక మ్యాచ్ ఆసాంతం నిలబడే చూడాల్సి వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్, నిర్లక్ష్యం కారణంగానే తాను 4 గంటల పాటు నిలబడాల్సి వచి్చందని జునైద్ ఆరోపించాడు. ఈ విషయాన్ని న్యాయస్థానం, వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్తానన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment