సెయింట్‌ జాన్స్‌ జట్ల జోరు | saint johns teams lead in friendship cup cricket tourney | Sakshi
Sakshi News home page

సెయింట్‌ జాన్స్‌ జట్ల జోరు

Published Sat, Dec 30 2017 12:26 PM | Last Updated on Sat, Dec 30 2017 12:26 PM

saint johns teams lead in friendship cup cricket tourney

సాక్షి, హైదరాబాద్‌: సెయింట్‌ జాన్స్‌ ఫ్రెండ్‌షిప్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీ జట్లు శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అండర్‌–12 విభాగంలో వామోస్‌ ఖుగర్‌ క్రికెట్‌ అకాడమీతో జరిగిన మ్యాచ్‌లో సెయింట్‌ జాన్స్‌ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట వామోస్‌ ఖుగర్‌ జట్టు 25 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెయింట్‌ జాన్స్‌ అకాడమీ 25 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసి గెలుపొందింది. రక్షిత్‌ (77) వేగంగా ఆడాడు.

అండర్‌–15 బాలుర విభాగంలో సెయింట్‌ జాన్స్‌ ‘బి’ జట్టుతో జరిగిన మరో మ్యాచ్‌లో సెయింట్‌ జాన్స్‌ ‘ఎ’ జట్టు 51 పరుగులతో విజయం సాధించింది. మొదట ఎ జట్టు 30 ఓవర్లలో 7 వికెట్లకు 221 పరుగులు చేసింది.  అనంతరం ‘బి’ జట్టు 27.3 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.

మరో మ్యాచ్‌ వివరాలు: అర్షద్‌ అయూబ్‌ క్రికెట్‌ అకాడమీ: 165/7 (పాషా 29; చేతన్‌ 3/27), వామోస్‌ ఖుగర్‌ క్రికెట్‌ అకాడమీ: 166/6.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement