
టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (ఇన్‌స్టాగ్రామ్ ఫొటో)
సాక్షి, బెంగళూరు : ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ప్రామాణికమైన యో-యో పరీక్షలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ విజయవంతమయ్యాడు. తద్వారా టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ఈ ముంబైకర్ అర్హత సాధించాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో బుధవారం నిర్వహించిన యో-యో టెస్టును క్లియర్ చేసినట్లు రోహిత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. తన ఫొటోతో పాటు.. ‘యో యో త్వరలోనే ఐర్లాండ్ వచ్చేస్తున్నా’ అంటూ రోహిత్ పోస్ట్ చేశాడు.
నిజానికి 15వ తేదీనే రోహిత్ శర్మ ఈ టెస్టుకు హజరవ్వాల్సి ఉండగా.. విదేశాల్లో ఉన్న కారణంగా బీసీసీఐ అనుమతితో 17వ తేదీకి మార్చుకున్నాడు. కానీ 17వ తేదీన కూడా రోహిత్ ఫిట్‌నెస్ టెస్టుకు హాజరు కాకపోవడంతో ఇంగ్లండ్ పర్యటనకు అర్హత సాధిస్తాడా లేదా అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే బీసీసీఐ బుధవారం రోహిత్‌కు మరో అవకాశం ఇవ్వగా అతడు సద్వినియోగం చేసుకుని జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 27,29న టీమిండియా ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం 3 టీ20లు, 3 వన్డేలు, 5 టెస్ట్‌లు కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment