ప్రముఖ స్టార్ క్రికెటర్ రోహిత్ గురునాథ్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలోకి బ్యాట్‌తో దిగడంతోనే ప్రత్యర్థులను మట్టికరిపించేలా సిక్స్‌ర్‌లతో చెలరేగిపోతాడు. విధ్వంసకర బ్యాట్సమెన్‌గా ఈ హిట్‌మ్యాన్‌కి పేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేగాదు రోహిత్ టీమిండియా జట్టు కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో ఆడి తొలి సిరీస్‌ల్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అలాంటి విధ్వంసకర బ్యాట్సమెన్ రోహిత్ ఫిట్‌నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా..!
క్రీడాకారులు మంచి ఆటతీరుని కనబర్చాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తేనే మంచి ఆట తీరుని కనబర్చగలరు. మరి ఈ దిగ్గజ ఆటగాడు రోహిత్ ఫిట్‌నెస్ సీక్రెట్, ఫాలో అయ్యే డైట్ ఏంటో సవివరంగా చూద్దామా..!
డైట్..
- రోహిత్ పోషకాహారంతో కూడిన ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అవ్వుతాడు. తన డైట్‌లో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి.
- అల్పాహరంలో రోహిత్ తప్పనిసరిగా గుడ్లు, ఓట్స్, పండ్లను తింటాడు.
- సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు.
- మధ్యాహ్నాం లంచ్‌లో తప్పనిసరిగా బ్రౌన్ రైస్, చికెన్, కూరగాయాలు తీసుకుంటాడు.
- రాత్రిపూట తప్పనిసరిగా కాల్చిన చేపలు, సలాడ్, ఉడికించిన కూరగాయాలు తీసుకుంటాడు
వర్కౌట్‌లు..
- ఫిట్‌గా ఉండేలా శరీరంలో చెడు కొలస్ట్రాల్ చేరకుండా జాగ్రత్త పడతాడు. అలాగే ఇన్సులిన్ స్థాయిలు సమంగా ఉండేలా డైలీ శరీరానికి కావాల్సిన వర్కౌట్‌లు చేస్తుంటాడు.
- ఎక్కువ సమయం తన ట్రైనర్‌తో కలిసి వ్యాయామ శాలలో గడుపుతాడు. కోర్ వర్కౌట్‌లపై దృష్టిపెడతాడు. ఇది కండరాల స్థాయిని మెరుగుపరుస్తుంది. బరువుని అదుపులో ఉంచుతుంది.
- నిజానికి రోహిత్ కెరియర్ ప్రారంభంలో ఫిట్‌నెస్‌లో అంత ప్రావీణ్యం పొందలేదు. రానురాను ఆటను మెరుగుపరచుకునే క్రమంలో తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించడం ప్రారంభించినట్లు ఓ ఇంటర్యూలో వెల్లడించారు.
- ఇక రోహిత్ శాకాహార కుటుంబంలో జన్మించినప్పటికీ ఫిట్‌నెస్‌గా ఉండి మెరుగ్గా ఆడేందుకు నాన్‌వెజ్ తీసుకోక తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment