
Rohit Sharma Clears Fitness Test: టీమిండియా అభిమానులకు శుభవార్త. తొడ కండరాల గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్న టీమిండియా పరిమిత ఓవర్ల సారధి రోహిత్ శర్మ.. ఇవాళ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసయ్యాడు. దీంతో స్వదేశంలో విండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు.
దాదాపు నెల రోజుల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో కఠోరంగా శ్రమించిన రోహిత్.. ఫిట్‌గా మారడంతో పాటు 6 కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాడు. రోహిత్ న్యూ లుక్‌కు సంబంధించిన ఫోటోలు ఇటీవల బాగా వైరలయ్యాయి.
కాగా, విండీస్ సిరీస్ కోసం టీమిండియా ఎంపిక ఇవాళ జరిగే అవకాశం ఉంది. మూడు వన్డేలు, మూడు టీ20ల ఈ సిరీస్‌లో తొలి వన్డే 6న, రెండో వన్డే 9న, మూడో వన్డే 11న జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో వన్డే సిరీస్ మొత్తం అహ్మదాబద్‌లోనే జరగనుంది. ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో మూడు టీ20లు కోల్‌కతా వేదికగా షెడ్యూలయ్యాయి.
చదవండి: హార్ధిక్ పాండ్యా నాన్నమ్మనూ వదలని "పుష్ప" ఫోబియా.. తగ్గేదేలే అంటున్న బామ్మ