India Vs West Indies 2nd ODI: Why Rohit Sharma And Virat Kohli Not Playing; Fans Get Disappointed - Sakshi
Sakshi News home page

#Rohit and Virat: కావాలనే రోహిత్‌, కోహ్లి లేకుండా! ఆసియా కప్‌ తర్వాత జట్టు నుంచి అవుట్‌! పిచ్చిగానీ పట్టిందా?

Published Sat, Jul 29 2023 7:30 PM | Last Updated on Sat, Jul 29 2023 8:32 PM

Ind vs WI 2nd ODI Why Rohit Kohli Not Playing Fans Gets Disappointed - Sakshi

Virat Kohli- Rohit Sharma Rested For Ind vs WI 2nd ODI: వెస్టిండీస్‌ పర్యటనకు ముందు.. టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి స్వదేశానికి తిరిగి రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రపంచకప్‌-2023 నేపథ్యంలో యువ ఆటగాళ్లను పరీక్షించే ఇచ్చే క్రమంలో సీనియర్లకు రెస్ట్‌ ఇస్తారని అంతా భావించారు.

అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వన్డే జట్టుకు రోహిత్‌, కోహ్లిలను ఎంపిక చేశారు సెలక్టర్లు. కానీ మొదటి వన్డేలో వీరిద్దరు తుది జట్టులో ఉన్నప్పటికీ యంగ్‌స్టర్లకే పెద్దపీట వేశారు. ఓపెనర్‌గా శుబ్‌మన్‌ గిల్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌కు ఛాన్స్‌ ఇచ్చి.. రోహిత్‌ తన స్థానాన్ని త్యాగం చేశాడు.

కోహ్లి, రోహిత్‌ లేకుండానే..
టాపార్డర్‌లో ఇషాన్‌ మినహా మిగతా వాళ్లంతా విఫలమైన నేపథ్యంలో తప్పక ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇక అప్పటికే లక్ష్య ఛేదన పూర్తైన క్రమంలో కోహ్లికి బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు. ఈ క్రమంలో రెండో వన్డేలో వీరిద్దరు లేకుండానే టీమిండియా బరిలోకి దిగడం గమనార్హం.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌ శర్మ వారసుడిగా భావిస్తున్న హార్దిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక మొదటి వన్డేలో కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు అవకాశమివ్వకుండా విమర్శల పాలైన బీసీసీఐ.. ఈసారి అతడిని కరుణించింది. రోహిత్‌, విరాట్‌ స్థానాల్లో సంజూ, అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి వచ్చారు.

కఠిన ప్రశ్నలకు సమాధానాలు వెదికే క్రమంలో..
టాస్‌ సందర్భంగా ఈ విషయం గురించి హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘రోహిత్‌, కోహ్లి విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్నారు. కొన్ని కఠిన ప్రశ్నలకు సమాధానాలు వెదికే క్రమంలో ఈ మ్యాచ్‌లో వాళ్లిద్దరికి విశ్రాంతినిచ్చాం. అయితే, వాళ్లిద్దరు మూడో వన్డేకు అందుబాటులో ఉంటారు’’ అని పేర్కొన్నాడు.

అయితే, బలహీన విండీస్‌పై బార్బడోస్‌లో తొలి వన్డేలో 5 వికెట్లతో గెలుపొందిన భారత జట్టు.. అదే వేదికపై మరోసారి శనివారం ఆతిథ్య జట్టుతో తలపడుతోంది. ఫామ్‌ పరంగా చూస్తే.. అద్భుతాలు జరిగితే తప్ప.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయాన్ని అడ్డుకోవడం షాయీ హోప్‌ బృందానికి కష్టమే.

మ్యాచ్‌ ఓడిపోవాలి.. అప్పుడే
ఒకవేళ అదే జరిగితే నామమాత్రపు మూడో వన్డేలోనూ రోహిత్‌, కోహ్లిల అవసరమే లేకుండా పోతుందనడం అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే.. రెండో వన్డేలో మేనేజ్‌మెంట్‌ నిర్ణయంతో రోహిత్‌, కోహ్లి ఫ్యాన్స్‌ హర్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ‘‘ఈ ఇద్దరు స్టార్లు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అలాంటపుడు ఎందుకు ఎంపిక చేశారు? డబ్ల్యూటీసీ తర్వాత కావాల్సినంత విశ్రాంతి దొరికింది కదా!

ఏం మాట్లాడుతున్నారు? పిచ్చిగానీ పట్టిందా?
ఒకవేళ యువకులకు ఛాన్స్‌ ఇవ్వాలని భావిస్తే ముందే వీళ్లకు రెస్ట్‌ ఇవ్వాల్సింది. వాళ్ల కోసమే టీవీల ముందు కూర్చున్నాం. కానీ ఇప్పుడిలా నిరాశ చెందాల్సి వచ్చింది. ఎప్పుడూ లేనిది జట్టు ఓడిపోవాలని కోరుకోవాలన్నంత కోపం వస్తోంది’’ అని సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు నెటిజన్లు మాత్రం.. ‘‘వరల్డ్‌కప్‌ ఆడబోయే జట్టే ఈరోజు విండీస్‌తో రెండో వన్డే ఆడుతోంది. ఆసియా కప్‌ తర్వాత రోహిత్‌, విరాట్‌లను జట్టు నుంచి తప్పిస్తారు. జరుగబోయేది ఇదే! రాసి పెట్టుకోండి!’’ అంటూ జోస్యం చెప్తూ.. అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇంకొందరేమో ఎలాగైతేనేం సంజూకు న్యాయం జరిగిందని పేర్కొంటున్నారు.

చదవండి: ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్‌ హోస్టెస్‌
బీటెక్‌ చదివిన టీమిండియా స్టార్‌.. ధోని, కోహ్లిలతో పాటు! ఆస్తి 100 కోట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement