India Vs West Indies, 2nd ODI: West Indies Opt To Bowl, Hardik Pandya Leads, Rohit Sharma Rested - Sakshi
Sakshi News home page

Ind vs WI 2nd ODI: కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా.. రోహిత్‌ శర్మ, కోహ్లి లేకుండానే.. ఎట్టకేలకు సంజూకు ఛాన్స్‌

Published Sat, Jul 29 2023 6:36 PM | Last Updated on Sat, Jul 29 2023 8:03 PM

Ind vs WI 2nd ODI: Playing XI Of Both Teams No Rohit Hardik To Lead - Sakshi

West Indies vs India, 2nd ODI: బార్బడోస్‌ వేదికగా టీమిండియా రెండో వన్డేలో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన విండీస్‌ సారథి షాయీ హోప్‌... తొలుత భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తున్నట్లు తెలిపాడు. బౌలింగ్‌లో రాణించి టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. రోమన్‌ పావెల్‌, డ్రేక్స్‌ స్థానంలో అల్జారీ జోసెఫ్‌, కార్టీ తుది జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.

రోహిత్‌, కోహ్లి లేకుండానే
రెండో వన్డేలో స్టార్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. రోహిత్‌, కోహ్లి స్థానాల్లో సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌ జట్టులోకి వచ్చినట్లు పాండ్యా తెలిపాడు.

1-0తో ఆధిక్యంలో..
కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడే నిమిత్తం టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.  ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో తొలి సిరీస్‌లో విండీస్‌తో తలపడ్డ రోహిత్‌ సేన 1-0తో ట్రోఫీ గెలిచింది. మలి టెస్టులోనూ గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావించగా వర్షం అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసిపోయింది.

ఈ క్రమంలో జూలై 27న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగగా.. టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక బార్బడోస్‌లో తొలి వన్డేలో జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్‌కు రెండో మ్యాచ్‌లో అవకాశం వచ్చింది.  

తుది జట్లు
టీమిండియా
శుబ్‌మన్‌ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

వెస్టిండీస్‌
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలీక్ అథనాజ్, షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, కీసీ కార్టీ, రొమారియో షెఫర్డ్, యాన్నిక్ కరియా, గుడకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్.

చదవండి: బీటెక్‌ చదివిన టీమిండియా స్టార్‌.. ధోని, కోహ్లిలతో పాటు! ఆస్తి 100 కోట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement