Ind Vs WI 5th T20: India Creates Unwanted Records With Shock T20I Series Defeat - Sakshi
Sakshi News home page

#Team India: మరీ అధ్వాన్నంగా.. టీమిండియా చెత్త రికార్డులు ఇవే! కోలుకోలేని షాక్‌

Published Mon, Aug 14 2023 4:27 PM | Last Updated on Mon, Aug 14 2023 6:20 PM

Ind vs WI 5th T20: India Creates Unwanted Records With Shock T20I Series Defeat - Sakshi

West Indies vs India, 5th T20I: ‘‘టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో క్వాలిఫయర్స్‌లోనే ఇంటిముఖం పట్టిన జట్టు.. వన్డే వరల్డ్‌కప్‌-2023కి అర్హత సాధించని ‘బలహీన జట్టు’... ఇలాంటి టీమ్‌పై పటిష్ట టీమిండియా సునాయాసంగా గెలుస్తుంది.. టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేయడం నల్లేరు మీద నడకలాంటిదే!.. టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లేముందు వ్యక్తమైన అభిప్రాయాలు.

వన్డేల్లో గట్టెక్కారు..
కానీ.. స్కాట్లాండ్‌ వంటి పసికూనల చేతిలో ఓటమిపాలైన విండీస్‌.. భారత జట్టుతో సై అంటే సై అంది. టెస్టు సిరీస్‌లో 1-0తో ఓడినా.. వన్డేల్లో గట్టిపోటీనిచ్చింది. 50 ఓవర్ల సిరీస్‌లో 2-1తో టీమిండియా గట్టెక్కగా.. టీ20లలో మాత్రం కరేబియన్‌ జట్టు సత్తా చాటింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వంటి మేటి ఆటగాళ్లు లేని టీమిండియాపై సునాయాసంగా సిరీస్‌ గెలిచింది.

కోలుకోలేని షాక్‌
హార్దిక్‌ పాండ్యా సేనకు సవాళ్ల మీద సవాళ్లు విసురుతూ.. నిర్ణయాత్మక ఐదో టీ20లో గెలిచి ఏకంగా సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. యువ జట్టుతో ప్రయోగాలు చేస్తూ.. తమకు తిరుగులేదనుకున్న భారత జట్టుకు కోలుకోలేని షాకిచ్చింది. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను విండీస్‌కు అర్పించుకుని విమర్శల పాలవుతున్న టీమిండియా చెత్త రికార్డులు మూటగట్టుకుని ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురవుతోంది.

అమెరికాలో ఆదివారం నాటి ఫ్లోరిడా మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ చేతిలో ఓటమి సందర్భంగా భారత జట్టు నమోదు చేసిన చెత్త రికార్డులివే!
1. గత 25 నెలల్లో టీమిండియా టీ20 సిరీస్‌ కోల్పోవడం ఇదే మొదటిసారి.
2. వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లలో గత 17 ఏళ్లలో టీమిండియా ఓటమి పాలవడం ఇదే తొలిసారి.
3. పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఒక టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో ఓడిపోయిన సందర్భాలే లేవు. కానీ టీమిండియా చరిత్రలో తొలిసారి వెస్టిండీస్‌పై తొలిసారి ఈ చెత్త ఫీట్‌ నమోదైంది.

చదవండి: Ind Vs WI: హార్దిక్‌ సేనపై మాజీ పేసర్‌ ఘాటు వ్యాఖ్యలు.. కెప్టెన్‌ వెర్రిమొహం వేస్తున్నాడు! వాళ్లేమో అలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement