Rohit Sharma, Virat Kohli Absence From India T20I Team: ‘‘టీ20 ప్రపంచకప్-2024 నాటికి హార్దిక్ పాండ్యా సారథ్యంలో పూర్తిస్థాయిలో యువ ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కనుంది. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల టీ20 కెరీర్ ఇక ముగిసిపోయినట్లే! 36 ఏళ్ల హిట్‌మ్యాన్, 34 ఏళ్ల రన్‌మెషీన్ కోహ్లి ఇక పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోవాల్సిందే!
వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టుతో ఈ విషయం సుస్పష్టమైంది. చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అజిత్ అగార్కర్ రోహిత్, కోహ్లిల టీ20 కెరీర్ భవితవ్యం తేల్చనున్నాడన్న వార్తలు నిజమయ్యాయి’’..
వాళ్లే తప్పుకొన్నారా?
విండీస్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌కు యువ ఆటగాళ్లతో నిండిన జట్టును ఎంపిక చేసిన తర్వాత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయాలివీ! ఇంతకీ రోహిత్, కోహ్లిలకు విశ్రాంతినిచ్చారా? లేదంటే తమంతట తామే మొత్తానికే పక్కకు తప్పుకొనేందుకు ఈ ఇద్దరు స్టార్లు సిద్ధమయ్యారా? అన్న సందేహాలు నెలకొన్నాయి.
వాళ్లిద్దరు జట్టులో ఉంటేనే
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లి లేని టీమిండియాను ఊహించడం కష్టమన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది.
కోహ్లి రేంజ్ వేరు! రోహిత్ కూడా తక్కువేమీ కాదు!
వీళ్లిద్దరు లేకుండా టీమిండియా ఐసీసీ ఈవెంట్‌కు సిద్ధమవుతుందని నేను అనుకోవడం లేదు. వాళ్లు ఆల్‌టైమ్ గ్రేట్స్. ఇప్పటికే తమను తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి రేంజ్ వేరు. ప్రతి చిన్నపిల్లాడు కూడా అతడిని ఫాలో అవుతాడు.
ఆట పట్ల తనకున్న అంకితభావంతో వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌గా ఎదిగాడు కోహ్లి. రోహిత్ శర్మ కూడా తక్కువేమీ కాదు. టీ20 క్రికెట్‌లో సెంచరీల మీద సెంచరీలు బాదాడు. అలాంటిది వీరిద్దరిని పక్కన పెడితే మాత్రం టీమిండియా ఇబ్బందుల పాలవడం ఖాయం.
ఐసీసీ టోర్నమెంట్లో వాళ్లిద్దరు కచ్చితంగా ఆడాల్సిందే. ఒకవేళ కెప్టెన్సీ లేకపోయినా(రోహిత్‌ను ఉద్దేశించి) జట్టులో మాత్రం భాగంగా ఉండాలి’’ అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు.
విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్
భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment