
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఖాలీల్ అహ్మద్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఖాలీల్ అహ్మద్‌ను ఆర్సీబీ బ్యాటర్లు ఊతికారేశాడు. తొలుత అతడిని జాకబ్ బెతల్ టార్గెట్ చేయగా.. ఆఖరిలో రొమరియో షెపర్డ్ చుక్కలు చూపించాడు.
19 ఓవర్ వేసిన ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో షెఫర్డ్ 4 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టి 33 పరుగులు పిండుకున్నాడు. ఖాలీల్ ఓవరాల్‌గా 3 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 65 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఖాలీల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్‌లో 3 ఓవర్లలోనే 65 పరుగులిచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు. అదేవిధంగా ఐపీఎల్-2025లో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్ కూడా అహ్మద్‌నే కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకబ్ బెతల్(55), రొమారియో షెపర్డ్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. సీఎస్‌కే బౌలర్లలో పతిరాన మూడు వికెట్లు పడగొట్టగా.. కుర్రాన్, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.