భారత జట్టు
India Vs New Zealand 2023- ODI And T20 Series: శ్రీలంకతో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లు గెలిచిన టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమవుతోంది. పర్యాటక కివీస్‌తో తొలుత వన్డే సిరీస్.. తర్వాత టీ20 సిరీస్ ఆడనుంది. లంకను 2-1 తేడాతో ఓడించి సిరీస్ గెలిచిన హార్దిక్ పాండ్యా మరోసారి భారత జట్టు టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా- న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్, ఇరు జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం తదితర విషయాలు తెలుసుకుందాం.
భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన: జనవరి 18- ఫిబ్రవరి 1 వరకు
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్
►మూడు మ్యాచ్‌లు
►మొదటి వన్డే: జనవరి 18, బుధవారం- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం- హైదరాబాద్
►రెండో వన్డే: జనవరి 21, శనివారం- షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, రాయ్‌పూర్
►మూడో వన్డే: జనవరి 24, మంగళవారం- హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్
►మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్
మూడు మ్యాచ్‌ల సిరీస్
►తొలి టీ20: జనవరి 27, శుక్రవారం- జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాంచి
►రెండో టీ20: జనవరి 29, ఆదివారం- భారత రత్ర వ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియం, లక్నో
►మూడో టీ20: ఫిబ్రవరి 1, బుధవారం- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
►మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభం.
రోహిత్ శర్మ
వన్డే సిరీస్
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్ జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి
టి20 సిరీస్
భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ గైక్వాడ్, శుభమాన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వై చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ , శివం మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్
న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, జాకోబ్ డఫ్పీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ రిప్పన్, హెన్రీ షీప్లే, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్.
ప్రత్యక్ష ప్రసారం:
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వన్డే, టీ20 సిరీస్‌లు లైవ్ స్ట్రీమింగ్
డిస్నీ+హాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రసారాలు
చదవండి: Sarfaraz Khan: అప్పుడేమో సిద్ధంగా ఉండమన్నారు! కానీ చివరకు.. నేనూ మనిషినే.. నాకూ భావోద్వేగాలు ఉంటాయి..
వుమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్‌కు ఊహించని భారీ ధర
Comments
Please login to add a commentAdd a comment