Mitchell Santner
-
Pak vs NZ: మెగా టోర్నీ షురూ.. టాస్ గెలిచిన పాక్.. తుదిజట్లు ఇవే
CT 2025 Pak vs NZ: ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు తెరలేచింది. పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ బుధవారం ఆరంభమైంది. ఆతిథ్య పాక్- న్యూజిలాండ్ జట్ల మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు ప్రభావాన్ని బట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.అదే విధంగా.. తాము డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్నందున కాస్త ఒత్తిడి ఉన్న మాట వాస్తమేనన్న రిజ్వాన్.. అయితే, ఇటీవలి ముగిసిన త్రైపాక్షిక సిరీస్ మాదిరే దీనిని సాధారణ సిరీస్‌గా భావిస్తే ప్రెజర్ తగ్గుతుందన్నాడు. సొంతగడ్డపై ఆడటం సంతోషంగా ఉందని.. గాయం కారణంగా జట్టుకు దూరమైన హ్యారిస్ రవూఫ్ జట్టులోకి తిరిగి వచ్చాడని తెలిపాడు.కాగా ఈ చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికాతో వన్డే ట్రై సిరీస్ ఆడింది. ఇందులో ఫైనల్‌కు చేరుకున్న పాక్.. ఆఖరి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. మెగా ఈవెంట్లో కివీస్‌దే పైచేయిఇక ఇప్పటి వరకు పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య 118 వన్డేలు జరుగగా.. పాకిస్తాన్ 61, న్యూజిలాండ్ 53 మ్యాచ్‌లు గెలిచాయి. ఒకటి టై కాగా.. మూడు ఫలితం తేలకుండా ముగిసిపోయాయి. అయితే, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో కివీస్ జట్టే పాక్‌పై గెలుపొందడం విశేషం. ఇక 1998లో మొదలైన ఈ వన్డే ఫార్మాట్ టోర్నీని వివిధ కారణాల వల్ల 2017 తర్వాత నిలిపివేశారు. అయితే, తాజాగా మరోసారి ఈ మెగా ఈవెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు.. దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఫలితంగా సొంతగడ్డపై అతిపెద్ద క్రికెట్ పండుగను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లుఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. కరాచీ, రావల్పిండి, లాహోర్లలో మ్యాచ్‌ల నేపథ్యంలో దాదాపు పన్నెండు వేల మంది పోలీసులను మోహరించేందుకు సిద్ధమైందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లతో పాటు 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్స్పెక్టర్లు, 1200 మంది ఉన్నతాధికారులు, 10,566 మంది కానిస్టేబుల్స్, 200కు పైగా మహిళా పోలీస్ ఆఫీసర్లు భద్రతా విభాగంలో భాగమైనట్లు తెలిపాయి. అంతేకాదు టోర్నీలో పాల్గొనే జట్లు, వీరాభిమానుల కోసం పీసీబీ ప్రత్యేకంగా విమానాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025: పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుపాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ -
Pak vs NZ: జట్టు నిండా ఆల్‌రౌండర్లే.. విజయం వారిదే!
న్యూజిలాండ్ జట్టుపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ప్రశంసలు కురిపించాడు. వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా ఆడేందుకే కివీస్ ఆటగాళ్లు ప్రాధాన్యం ఇస్తారని.. అన్నింటికంటే వాళ్లకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నాడు. వారికి ఆట పట్ల నిబద్ధత ఎక్కువని.. అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికల విషయంలోనూ వారికి స్పష్టమైన అవగాహన ఉంటుందన్నాడు.ఐకమత్యమే మహాబలంకాగా పాకిస్తాన్- న్యూజిలాండ్(Pakistan vs New Zealand) మధ్య మ్యాచ్‌తో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు బుధవారం(ఫిబ్రవరి 19) తెరలేవనుంది. ఈ నేపథ్యంలో కివీస్ జట్టు బలాల గురించి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఐకమత్యంగా ఉండటమే న్యూజిలాండ్ జట్టుకు ఉన్న ప్రధాన బలం. ఆ జట్టులో సూపర్స్టార్లు లేకపోవచ్చు.. కానీ అంతా కలిసి సూపర్‌స్టార్ టీమ్‌ను తయారుచేయగలరు.టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ దాకా.. ప్రతి ఒక్క సభ్యుడికి తమ పాత్ర ఏమిటో స్పష్టంగా తెలుసు. అంతేకాదు.. కర్తవ్యాన్ని నెరవేర్చడానికి వారు ఒక్కోసారి త్యాగాలకు కూడా వెనుకాడరు. ప్రణాళికలు, వ్యూహాల విషయంలో వారు రాజీపడరు. అందుకే వారిని చోకర్స్ అనేందుకు నేను ఇష్టపడను.వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా ఆడేందుకే వారు ప్రాధాన్యం ఇస్తారు. జట్టు ప్రయోజనాలే పరమావధిగా మైదానంలోకి దిగుతారు. వ్యక్తిగతంగా ప్రకాశించడం కంటే కూడా.. జట్టుగా సత్తా చాటాడమే వారికిష్టం. ప్రస్తుత టీమ్ మొత్తం ఆల్‌రౌండర్లతో నిండిపోయింది. ముగ్గురు లేదంటే నలుగురు వికెట్ కీపర్లు ఉన్నారు.జట్టు నిండా ఆల్రౌండర్లేఆఫ్ స్పిన్నర్లు, లెఫ్టార్మ్ స్పిన్నర్లు జట్టుతో పాటే ఉన్నారు. రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్‌వెల్... వీరంతా బ్యాటింగ్, బౌలింగ్ చేయగలరు. ఇటీవలే న్యూజిలాండ్ త్రైపాక్షిక సిరీస్ గెలిచింది. పాకిస్తాన్ గడ్డపై పాక్‌తో పాటు సౌతాఫ్రికాను ఓడించింది.వరుస విజయాలుఅంతకు ముందు భారత్‌లో టీమిండియాపై అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం కివీస్ జట్టు సూపర్ ఫామ్‌లో ఉంది. పాక్ పిచ్ పరిస్థితులపై వారికి స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి. ఈ వన్డే ఫార్మాట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుంది.ఫెర్గూసన్ స్థానంలో జెమీసన్ చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన పేసర్ లాకీ ఫెర్గూసన్ స్థానంలో మరో పేస్ బౌలర్ కైల్ జెమీసన్ జట్టులోకి వచ్చాడు. ఈ మార్పునకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది. 30 ఏళ్ల జేమీసన్ న్యూజిలాండ్ తరఫున 13 వన్డేలు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. జేమీసన్ చివరి వన్డే 2023లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టుడెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జెమీసన్.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
మూడో వన్డేలో కివీస్ చిత్తు.. వైట్‌వాష్ నుంచి తప్పించుకున్న శ్రీలంక
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్(Newzeland(తో జరిగిన మూడో వన్డేలో 140 పరుగుల తేడాతో శ్రీలంక(Srilanka) ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ వైట్ వాష్ నుంచి లంక తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగుల భారీ స్కోర్ సాధించింది.శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక(66) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్(54), లియాంగే(53), కమిందు మెండిస్(46) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ శాంట్నర్ రెండు, నాథన్ స్మిత్, బ్రెస్‌వెల్ తలా వికెట్ సాధించారు.నిప్పులు చెరిగిన లంకేయులు..అనంతరం 291 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను లంక బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. అసితా ఫెర్నాండో, తీక్షణ, మలింగ దాటికి న్యూజిలాండ్ కేవలం 22 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఆ సమయంలో మార్క్ చాప్మన్ కివీస్‌ను అదుకునే ప్రయత్నం చేశాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి చాప్మన్ మాత్రం బౌండరీలు బాదుతూ కివీస్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. లంకేయులపై కౌంటర్ ఎటాక్ దిగిన చాప్మన్ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.దీంతో లక్ష్య చేధనలో బ్లాక్ క్యాప్స్ 150 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో చాప్మన్(81 బంతుల్లో 81, 10 ఫోర్లు, ఒక సిక్స్) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో,తీక్షణ, మలింగ తలా మూడు వికెట్లు సాధించారు. మూడు వికెట్లతో సత్తాచాటిన అసితా ఫెర్నాండోకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ సిరీస్ అసాంతం అద్బుత ప్రదర్శన కనబరిచిన మాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా అంతకంటే ముందు కివీస్‌తో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో లంక కోల్పోయింది. ఇక శ్రీలంక తమ తదుపరి సిరీస్‌లో ఆస్ట్రేలియాతో రెండు టెస్టులు ఆడనుంది.చదవండి: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..! హింట్ ఇచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ -
నిస్సాంక అద్భుత ఇన్నింగ్స్ వృథా.. ఉత్కంఠ పోరులో ఓడిన శ్రీలంక
మౌంట్ మౌంగానుయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 8 పరుగుల తేడాతో శ్రీలంకపై కివీస్ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమతమైంది. లక్ష్య చేధనలో లంకకు ఓపెనర్లు పాథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.తొలి వికెట్‌కు 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో శ్రీలంక సునయాసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ శ్రీలంక ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన కివీ పేసర్ జాకబ్ ఢఫీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.కుశాల్ మెండిస్(46),కుశాల్ పెరీరా(0), కమిందు మెండిస్(0)లను ఒకే ఓవర్లో ఔట్ చేసి మ్యాచ్‌ను న్యూజిలాండ్ వైపు మలుపుతిప్పాడు. ఆ తర్వాత లంకేయులు తిరిగి కోలుకోలేకపోయారు. ఆఖరి ఓవర్లో శ్రీలంక విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి.అయితే లంక ఓటమిపాలైనప్పటికి పాథుమ్ నిస్సాంక మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో డఫీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫోల్క్స్, హెన్రీ తలా రెండు వికెట్లు సాధించారు.అదరగొట్టిన మిచెల్, బ్రేస్వెల్అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(62), బ్రేస్‌వెల్(59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, థీక్షణ, హసరంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికలో డిసెంబర్ 30న జరగనుంది.చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు -
న్యూజిలాండ్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్
న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల జట్ల (వన్డే, టీ20) ఫుల్ టైమ్ కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ న్యూజిలాండ్ అధికారికంగా ప్రకటించింది. సాంట్నర్.. కేన్ విలియమ్సన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడు. కేన్ మామ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 32 ఏళ్ల సాంట్నర్ న్యూజిలాండ్ తరఫున 100కు పైగా వన్డేలు, టీ20లు ఆడాడు. సాంట్నర్ ఇప్పటికే 24 టీ20లు, 4 వన్డేల్లో న్యూజిలాండ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. న్యూజిలాండ్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ ప్రస్తానం ఈ నెలాఖరులో జరిగే శ్రీలంక సిరీస్‌తో మొదలవుతుంది. సమీప భవిష్యత్తులో న్యూజిలాండ్ బిజీ షెడ్యూల్ (పరిమిత ఓవర్ల సిరీస్‌లు) కలిగి ఉంది. శ్రీలంకతో సిరీస్‌ల అనంతరం పాక్‌తో కలిసి ట్రయాంగులర్ సిరీస్‌లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. దీని తర్వాత స్వదేశంలో పాక్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉంది.న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్‌గా ఎంపిక కావడంపై సాంట్నర్ స్పందిస్తూ.. ఇది చాలా గొప్ప గౌరవమని అన్నాడు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు న్యూజిలాండ్‌కు ఆడాలనేది తన కల అని చెప్పాడు. అలాంటిది ఏకంగా తన జట్టును ముందుండి నడిపించే అవకాశం రావడం అదృష్టమని తెలిపాడు. కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టడం సవాలుగా భావిస్తున్నానని అన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ రెడ్ బాల్ (టెస్ట్) కెప్టెన్‌గా టామ్ లాథమ్ కొనసాగనున్నాడు. -
చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్..
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓటమి ముగింట నిలిచింది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ మరోసారి భారత్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన శాంట్నర్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా 5 వికెట్లతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ,సర్ఫరాజ్, గిల్, జైశ్వాల్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బ తీశాడు.ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సాంట్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌తో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ 5 వికెట్ల హాల్ సాధించిన తొలి కివీ స్పిన్నర్‌గా సాంట్నర్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ న్యూజిలాండ్ స్పిన్నర్ కూడా భారత్‌పై ఈ ఫీట్ నమోదు చేయలేకపోయారు. ఓవరాల్‌గా ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ 5 వికెట్ల ఘనత సాధించిన రెండో కివీస్ స్పిన్నర్‌గా సాంట్నర్ రికార్డులకెక్కాడు. సాంట్నర్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి రెండు సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆస్ట్రేలియా,బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో వెట్టోరి ఈ ఘనత సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 13 వికెట్లు పడగొట్టాడు.చదవండి: విరాట్ కోహ్లి వల్లే ఇదంతా?.. ఫ్యాన్స్ ఫైర్ -
విరాట్ కోహ్లి వల్లే ఇదంతా?.. ఫ్యాన్స్ ఫైర్
పుణె టెస్టులో భారత బ్యాటర్ల ఆట తీరుపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ లక్ష్యం ముందున్నా చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రిషభ్ పంత్ రనౌట్ అయిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.తప్పు ఎవరిది? పంత్ అవుట్ కావడానికి విరాట్ కోహ్లినే కారణమని కొందరు.. పంత్ స్వీయ తప్పిదం వల్లే ఇలా జరిగిందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ప్రేమికులు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కాగా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుపెట్టింది.ఈ క్రమంలో కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు కట్టడి చేయగలిగిన భారత్.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్.. 255 పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.అయితే, టార్గెట్ ఛేదనలో టీమిండియా ఆరంభం నుంచే తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులకే నిష్క్రమించగా.. శుబ్‌మన్ గిల్ 23 రన్స్ చేశాడు. ఈ క్రమంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్(77).. విరాట్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ మిచెల్ సాంట్నర్ ఈ జోడీని విడగొట్టాడు. జైస్వాల్‌ను అతడు అవుట్ చేయడంతో.. రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు.ఈ క్రమంలో కోహ్లితో కలిసి పంత్ భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కిస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే, కోహ్లి- పంత్ తొందరపాటు చర్య వల్ల టీమిండియా భారీ మూల్యమే చెల్లించింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 23వ ఓవర్లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ వేశాడు.మెరుపు వేగంతో బాల్ విసరడంతోఅప్పటికి క్రీజులో ఉన్న కోహ్లి బంతిని లెఫ్ట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా గట్టిగా బాదాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బంతిని అందుకున్న ఫీల్డర్ మిచెల్ సాంట్నర్ .. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ వైపు వేగంగా విసిరాడు. అప్పటికే సింగిల్ కోసం పంత్ నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ముందుకు రాగా.. కోహ్లి కూడా పరుగుకు వెళ్లాడు. అయితే, అంతలోనే సాంట్నర్ మెరుపు వేగంతో బంతిని విసరడం.. బ్లండెల్ వికెట్లకు గిరాటేయడం జరిగిపోయింది.అప్పటికి పంత్ డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా 245 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 113 పరుగుల భారీ తేడాతో ఓడి కివీస్‌కు సిరీస్‌ను 0-2తో సమర్పించుకుంది.చదవండి: దంచికొట్టిన యశస్వి జైస్వాల్.. సొంతగడ్డపై అరుదైన రికార్డుTrust me bro Kohli ran pant out 😭 pic.twitter.com/0qmNYdZhYh— M. (@IconicKohIi) October 26, 2024Kohli saw pant is running thn he Ran .. clearly pant' call.. and lazy lazy running from him #INDvsNZ pic.twitter.com/Tv5lJm89Gj— भाई साहब (@Bhai_saheb) October 26, 2024 -
Ind vs NZ: రోహిత్ శర్మ మరోసారి ఫెయిల్.. నీకేమైంది ’హిట్‌మ్యాన్’?!
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా తడ‘బ్యాటు’ కొనసాగుతోంది. పుణెలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ రూపంలో ఆదిలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు.కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో బంతిని తప్పుగా అంచనా వేసి రోహిత్ వికెట్ సమర్పించుకున్నాడు. ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అయితే, రోహిత్ అవుటైన తీరుపై టీమిండియా అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.లంచ్ బ్రేక్ సమయానికిస్కోరు ఎంతంటే?భారత రెండో ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌ను సాంట్నర్ వేశాడు. అతడి బౌలింగ్‌లో నాలుగో బంతి అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా వచ్చి.. బౌన్స్ అయింది. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని బ్యాట్‌ను తాకి ఫీల్డర్ విల్ యంగ్ చేతిలో పడింది. దీంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా భోజన విరామ సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది.క్యాచ్‌లు కూడా వదిలేశాడు! ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ఈ టెస్టు మ్యాచ్‌లో పలు క్యాచ్‌లు డ్రాప్ చేసిన విషయం తెలిసిందే. అశ్విన్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్(48*), రవీంద్ర జడేజా బౌలింగ్‌లో టామ్ బ్లండెల్(41) ఇచ్చిన ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను హిట్‌మ్యాన్ వదిలేశాడు. కాగా పుణె టెస్టులో న్యూజిలాండ్ భారత్‌కు 359 పరుగుల భారీ లక్ష్యం విధించింది. ఇక తొలుత బెంగళూరులో జరిగిన టెస్టులో కివీస్ గెలిచి ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. బెంగళూరు టెస్టులోనూ రోహిత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులే చేసిన ఈ ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ద శతకం(52)తో ఫర్వాలేదనిపించాడు.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు(అక్టోబరు 24- 28)వేదిక: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణెటాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 259టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 156న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 255టీమిండియా లక్ష్యం: 359.చదవండి: IND vs NZ Day 3 Lunch: రోహిత్ ఔటైనా దూకుడుగా ఆడుతున్న భారత్~ Can't Bat~ Can't Bowl~ Can't Run~ Can't Field~ Can't Captain ~ Can't Remain Fit~ Can't Take Review That's Captain Rohit Sharma for you!!🤡🤡 #INDvNZpic.twitter.com/EShOy7K6sO— ` (@krish_hu_yaar) October 26, 2024 -
Ind vs NZ 2nd Test: 156 పరుగులకే టీమిండియా ఆలౌట్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. మొదట బెంగళూరు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. పుణె వేదికగా రెండో టెస్టులోనూ స్థాయికి తగ్గట్లు ఆడలేక చతికిలపడింది. మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైన.. గురువారం మొదలైన రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది.చెన్నై స్పిన్నర్లు దుమ్ములేపారుఅయితే, పుణెలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చింది. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై టీమిండియా స్టార్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. చెన్నైకి చెందిన ఈ ఇద్దరు రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్లు కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.అశూ వికెట్ల వేట మొదలుపెడితే.. వాషీ విజయవంతంగా దానిని ముగించాడు. అశ్విన్ 3, వాషీ 7 వికెట్లు పడగొట్టి.. కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ చేశారు. బౌలర్లుగా తమ కర్తవ్యం నెరవేర్చి ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేయగలిగారు.ప్చ్.. బ్యాటర్లు మాత్రంకానీ.. బ్యాటర్లు మాత్రం చేతులెత్తేశారు. న్యూజిలాండ్ స్పిన్నర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ 30 పరుగులతో రాణించగా.. విరాట్ కోహ్లి ఒక్క పరుగు మాత్రమే చేసి చెత్తగా బౌల్డ్ అయ్యాడు.ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రిషభ్ పంత్(18),న సర్ఫరాజ్ ఖాన్(11) త్వరగానే అవుట్ కాగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 38 పరుగులతో అందరిలోకెల్లా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మిగతా వాళ్లలో అశ్విన్ 4, వాషింగ్టన్ సుందర్ 18- నాటౌట్, ఆకాశ్ దీప్ 6, జస్ప్రీత్ బుమ్రా 0 పరుగులు చేశారు. ఫలితంగా శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో టీమిండియా 156 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్ ఏడు, గ్లెన్ ఫిలిప్స్ రెండు వికెట్లు తీయగా.. రైటార్మ్ పేసర్ టిమ్ సౌతీ ఒక వికెట్ దక్కించుకున్నాడు.103 పరుగులు వెనుకబడ్డ టీమిండియాకాగా పుణె వేదికగా రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(76), రచిన్ రవీంద్ర(65) అద్భుత అర్ధశతకాలు సాధించగా.. మిచెల్ సాంట్నర్ 33 రన్స్‌తో రాణించాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్ కావడంతో మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ కంటే 103 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: ఒక్క పరుగు.. 8 వికెట్లు.. 53 పరుగులకే కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్ -
గ్లెన్ ఫిలిప్స్ మాయాజాలం: పంత్ బౌల్డ్.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. పుణె వేదికగా రెండో రోజు ఆటలో భాగంగా శుక్రవారం 16-1 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కివీస్ బౌలర్ మిచెల్ సాంట్నర్ తన స్పిన్ మాయాజాలంతో వరుస విరామాల్లో కీలక వికెట్లు పడగొట్టాడు.తొలుత కోహ్లిభారత ఇన్నింగ్స్ 22వ ఓవర్ మూడో బంతికి శుబ్‌మన్ గిల్(30)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సాంట్నర్.. 24వ ఓవర్ నాలుగో బంతికి విరాట్ కోహ్లి(1)ని బౌల్డ్ చేశాడు. అయితే, సాంట్నర్ వేసిన లో ఫుల్‌టాస్‌ను ఆడలేక వికెట్ పారేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డవేళ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు రిషభ్ పంత్ తోడయ్యాడు.పంత్- సర్ఫరాజ్ జోడీపై ఆశలువీరిద్దరు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతారని అభిమానులు భావించగా.. కాసేపటికే ఆ ఆశలపై గ్లెన్ ఫిలిప్స్ నీళ్లు చల్లాడు. ఈ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ 26వ ఓవర్ నాలుగో బంతికి జైస్వాల్(30)ను నాలుగో వికెట్‌గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. దీంతో వీళ్లిద్దరు కలిసి బెంగళూరు టెస్టు తరహాలో భారీ భాగస్వామ్యం(నాలుగో వికెట్‌కు 177) నెలకొల్పుతారని అభిమానులు ఆశించారు. గ్లెన్ ఫిలిప్స్ మాయాజాలంఅయితే, గ్లెన్ ఫిలిప్స్ మరోసారి స్పిన్ మంత్రం వేసి.. రిషభ్ పంత్‌ను బౌల్డ్ చేశాడు. 31వ ఓవర్ రెండో బంతికి 18 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ నిష్క్రమించాడు. దీంతో 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఈసారి రంగంలోకి దిగిన సాంట్నర్ సర్ఫరాజ్ ఖాన్ రూపంలో మరో కీలక వికెట్ పడగొట్టాడు. 34వ ఓవర్ ఆరో బంతికి సాంట్నర్ బౌలింఘ్ సర్ఫరాజ్ విలియం రూర్కీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 34 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా కేవలం 95 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. లంచ్@ 107/7ఇక అశ్విన్(4) సాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కాగా.. 103 పరుగుల స్కోరు వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు- 107/7 (38). కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఓవరాల్‌గా రెండోసారి..! -
న్యూజిలాండ్ టీమ్‌కు కొత్త కెప్టెన్
నవంబర్ 9 నుంచి శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేశారు ఆ దేశ సెలెక్టర్లు. ఈ సిరీస్‌లలో మిచెల్ సాంట్నర్ కివీస్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత న్యూజిలాండ్ ఆడుతున్న మొదటి పరిమిత ఓవర్ల సిరీస్ ఇదే. ఈ సిరీస్‌లలో సాంట్నర్ న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ మిచ్ హే తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫెర్గూసన్, జాకబ్ డఫీ, జాక్ ఫోల్క్స్ పేసర్లుగా.. ఐష్ సోధి స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా.. గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా.. మార్క్ చాప్మన్, హెన్రీ నికోల్స్, టిమ్ రాబిన్సన్, జోష్ క్లార్క్సన్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు.ఈ సిరీస్‌ల కోసం టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విలియమ్ ఓరూర్కీ, రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్లను పరిగణలోకి తీసుకోలేదు. వీరంతా ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో బిజీగా ఉన్నారు. భారత్‌తో సిరీస్ ముగిసిన అనంతరం వీరు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.కాగా, రెండు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. నవంబర్ 9న డంబుల్లా వేదికగా తొలి టీ20, నవంబర్ 10న అదే డంబుల్లా వేదికగా రెండో టీ20 జరుగనున్నాయి. అనంతరం నవంబర్ 13న డంబుల్లా వేదికగానే తొలి వన్డే, నవంబర్ 17, 19 తేదీల్లో క్యాండీ వేదికగా రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి.శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు..మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే (వికెట్‌కీపర్), హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ రాబిన్సన్, నాథన్ స్మిత్, ఐష్ సోధి, విల్ యంగ్చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు గాయం -
కళ్లుచెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే(వీడియో)
ది హాండ్రడ్ లీగ్-20224లో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ తన ఫీల్డింగ్ విన్యాసాలను కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాంట్నర్ మరోసారి సంచలన క్యాచ్‌తో మెరిశాడు.మంగళవారం(ఆగస్టు 13) లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో నమ్మశక్యం కాని క్యాచ్‌ను ఈ కివీ స్టార్ అందుకున్నాడు. సూపర్ క్యాచ్‌తో లండన్ స్పిరిట్ బ్యాటర్ మైఖేల్ పెప్పర్‌ను సాంట్నర్ పెవిలియన్‌కు పంపాడు.లండన్ ఇన్నింగ్స్ 11వ బంతిని పేసర్ రీస్ టాప్లీ.. పెప్పర్‌కు ఫుల్ అండ్ మిడిల్లో సంధించాడు. పెప్పర్ ఆ బంతిని మిడ్ ఆన్ మీదగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఈ క్రమంలో మిడాన్‌లో ఉన్న సాంట్నర్ వెనక్కి పరిగెత్తుతూ అద్భుతమైన బ్యాక్వర్డ్ రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. చివరి క్షణం వరకు బంతిపై తన దృష్టిని కోల్పోకుండా వెనక్కి వెళ్లిన సాంట్నర్.. డైవ్ సంచలన క్యాచ్‌ను తీసుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో లండన్ స్పిరిట్‌పై నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఘన విజయం సాధించింది. Mitchell Santner, that is UNBELIEVABLE 🤯Enjoy every angle of 𝘵𝘩𝘢𝘵 catch 👇#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/oJupXTP3hR— The Hundred (@thehundred) August 13, 2024 -
పాకిస్తాన్‌తో తొలి టీ20కి ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (జనవరి 12) జరిగే తొలి టీ20కి ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ కోవిడ్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న సాంట్నర్ జట్టులో లేకపోవడం కివీస్‌కు పెద్ద లోటు. సాంట్నర్‌ను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించినట్లు క్రికెట్ న్యూజిలాండ్ పేర్కొంది. కాగా, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి దేశంలో ఎలాంటి అంక్షలు లేనప్పటికీ.. ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. 🚨NEWS ALERT🚨: Mitchell Santner has been ruled out of the first T20I against Pakistan after testing positive for Covid. pic.twitter.com/lCFttMZzpQ — CricTracker (@Cricketracker) January 12, 2024 ఇదిలా ఉంటే, ఆక్లాండ్ వేదికగా ఇవాళ న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 11: 30 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ ఫుల్‌టైమ్ టీ20 జట్టు కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదికి ఇది తొలి మ్యాచ్ కాగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చాలాకాలం తర్వాత టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీపర్), డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్ పాకిస్తాన్: మొహ్మమద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), షాహీన్ అఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, జమాన్ ఖాన్, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రర్ అహ్మద్, సాహిబ్జాదా ఫర్హాన్, అబ్బాస్ అఫ్రిది, హసీబుల్లా ఖాన్ -
NZ Vs Ban: ఆకస్మిక వర్షంలో తడిసిముద్దైన ఆటగాళ్లు.. మ్యాచ్ రద్దు
New Zealand vs Bangladesh, 2nd T20I: న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వరణుడు అడ్డుతగిలాడు. మౌంట్ మౌంగనీయ్లో ఇరు జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దైపోయింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 1-0తో ఆధిక్యం నిలబెట్టుకోగలిగింది. కాగా నజ్ముల్ హొసేన్ షాంటో కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు కివీస్ పర్యటనకు వెళ్లింది. ఈ యువ బ్యాటర్ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధించింది. తద్వారా క్లీన్‌స్వీప్ గండాన్ని తప్పించుకోవడమే గాకుండా.. న్యూజిలాండ్ గడ్డ మీద తొలి వన్డే గెలుపు నమోదు చేసి చరిత్ర సృష్టించింది. తొలి టీ20 గెలుపు ఇక మూడో వన్డేలో ఆతిథ్య కివీస్‌ను ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఊహించని రీతిలో టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. నేపియర్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో శాంట్నర్ బృందంపై ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక కివీస్ గడ్డ మీద బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టీ20 గెలుపు కూడా కావడం విశేషం. ఆకస్మిక వర్షం.. తడిసిపోయిన ఆటగాళ్లు ఈ క్రమంలో రెండో టీ20లోనూ సత్తా చాటాలని భావించిన నజ్ముల్ షాంటో బృందం.. అందుకు తగ్గట్లుగానే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ షోరిఫుల్ ఇస్లాం.. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్(2)ను పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించాడు. అయితే, 23 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి ప్రమాదకరంగా మారుతున్న మరో ఓపెనర్ టిమ్ సిఫార్ట్ను తంజీం హసన్ సకీబ్ అవుట్ చేశాడు. వీరి స్థానాల్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ 18(24 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ 9(14 బంతుల్లో) పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. And that's that! Unfortunately, the 2nd @BLACKCAPS v Bangladesh T20I at Bay Oval in Tauranga has been officially called off due to the rain 😢☔ Blackcaps v Bangladesh: 3rd T20I | Sunday from 12.30pm on TVNZ 1 and TVNZ+ pic.twitter.com/TsZoLLfRJm — TVNZ+ (@TVNZ) December 29, 2023 మ్యాచ్ రద్దు అయితే, 11 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆకస్మికంగా వర్షం మొదలైంది. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు: 72/2. ఇక మధ్యాహ్నం రెండున్నర గంటలు దాటినా తెరిపినివ్వలేదు. ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువ కావడంతో న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య డిసెంబరు 31 (ఆదివారం) నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది. ఇందులో గనుక బంగ్లాదేశ్ గెలిస్తే కివీస్ గడ్డపై మరో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం!! Heavy rain still falling at Bay Oval. The latest time play can begin again is 10:28pm #BANvNZ pic.twitter.com/w85rLJjE7F — BLACKCAPS (@BLACKCAPS) December 29, 2023 -
CWC 2023 AUS VS NZ: అతి భారీ సిక్సర్ నమోదు
2023 వన్డే ప్రపంచకప్లోకెళ్లా అత్యంత భారీ సిక్సర్ ఇవాళ (అక్టోబర్ 28) జరుగుతున్న ఆసీస్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో నమోదైంది. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఫీట్‌ను సాధించాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో మ్యాక్సీ 104 మీటర్ల సిక్సర్ బాదాడు. మ్యాక్స్‌వెల్ కొట్టిన బంతి స్టేడియం రూఫ్‌పై పడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అతి భారీ సిక్సర్. మ్యాక్స్‌వెల్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా ఆటగాడు శ్రేయస్ పేరిట ఉండేది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 101 మీటర్ల సిక్సర్ బాదాడు. అయ్యర్‌కు ముందు డేవిడ్ వార్నర్ 98 మీటర్ల సిక్సర్, డారిల్ మిచెల్ 98 మీట్లర సిక్సర్, డేవిడ్ మిల్లర్ 95 మీటర్ల సిక్సర్లు బాదారు. Glenn Maxwell smashes the biggest six of the 2023 World Cup. 104M at the Dharamshala Stadium. pic.twitter.com/soR1PNxPNm — Mufaddal Vohra (@mufaddal_vohra) October 28, 2023 కాగా, కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగి 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇతనికి ముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో శివాలెత్తడంతో ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, బౌల్ట్ చెరి 3 వికెట్లు, సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, నీషమ్ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి గెలుపుకోసం ప్రయత్నిస్తుంది. ఓపెనర్లు కాన్వే (28), విల్ యంగ్ (32) ఔట్ కాగా.. రచిన్ రవీంద్ర (18), డారిల్ మిచెల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ కోల్పోయిన 2 వికెట్లు హాజిల్‌వుడ్‌కు దక్కాయి. -
NZ VS NED: చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. ప్రపంచకప్‌లో తొలి బౌలర్..!
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా అలాగే ప్రస్తుత ఎడిషన్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 59 పరుగులకు 5 వికెట్లు పడగొట్టిన సాంట్నర్.. తొలుత బ్యాట్‌తోనూ రాణించి (17 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ 2 వికెట్లు పడగొట్టిన సాంట్నర్.. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా (7) కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 99 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. విల్ యంగ్ (70), రచిన్ రవీంద్ర (51), టామ్ లాథమ్ (53) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, వాన్ డర్ మెర్వ్, వాన్ మీకెరెన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదార్లండ్స్ ఆదిలోనే చేతులెత్తేసి 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ (10-0-59-5), మ్యాట్ హెన్రీ (8.3-0-40-3), రచిన్ రవీంద్ర (10-0-46-1) నెదర్లాండ్స్‌ను కుప్పకూల్చారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో కొలిన్ ఆకెర్మన్ (69) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. తెలుగబ్బాయి తేజ నిడమనూరు 26 బంతుల్లో 21 పరుగులు చేసి రనౌటయ్యాడు. నెదర్లాండ్స్‌పై గెలుపుతో న్యూజిలాండ్ (1.958 రన్‌రేట్) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో తన హవాను కొనసాగిస్తుంది. కాగా, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 10) మరో మ్యాచ్ జరుగనుంది. మాధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు తలపడతాయి. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ధర్మశాలలో మరో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్-బంగ్లాదేశ్ తలపడతాయి. -
WC 2023: ‘పసికూన’పై కివీస్ ప్రతాపం.. వరుసగా న్యూజిలాండ్ రెండో విజయం
ICC Cricket WC 2023- New Zealand vs Netherlands, 6th Match: వన్డే వరల్డ్‌కప్-2023లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. రెండో మ్యాచ్‌లో ‘పసికూన’ నెదర్లాండ్స్‌ను 99 పరుగుల తేడాతో మట్టికరిపించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించింది. ముగ్గురు అర్ధ శతకాలతో రాణించి ఓపెనర్ విల్ యంగ్ 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 51, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో రాణించారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ 36 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు విక్రంజిత్ సింగ్(12), మాక్స్ ఒడౌడ్(16) వికెట్లు కోల్పోయి డీలా పడినప్పటికీ.. వన్‌డౌన్ బ్యాటర్ కొలిన్ అకెర్మాన్ డచ్ శిబిరంలో ఆశలు రేపాడు. ఆశలు రేపాడు 69 పరుగులతో రాణించిన అతడు అవుట్ కావడంతో నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలైంది. సాంట్నర్ దెబ్బకు డచ్ జట్టు పెవిలియన్‌కు క్యూ కట్టింది. దీంతో... 99 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐదు వికెట్లతో చెలరేగిన సాంట్నర్ స్పిన్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మిచెల్ సాంట్నర్ అత్యధికంగా ఐదు వికెట్లు కూల్చి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. పేసర్ మ్యాట్ హెన్రీకి మూడు, మరో లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కాయి. ఇక తెలుగు మూలాలున్న డచ్ బ్యాటర్ తేజ నిడమనూరు రనౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: WC 2023: తడబడి.. నిలబడిన టీమిండియాకు బిగ్ షాక్! పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: పాపం ‘బాస్’! ‘ఆఖరి బంతి’కి 13 పరుగులు.. చుక్కలు చూపించాడు!
ICC Cricket World Cup 2023- New Zealand vs Netherlands: వన్డే వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. 17 బంతులు ఎదుర్కొని 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. సాంట్నర్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఈ లెఫ్టాండ్ బ్యాటర్ బాదిన రెండు సిక్స్‌లు కివీస్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రావడం విశేషం. అంతేకాదు.. చివరి బాల్‌కు సాంట్నర్ ఏకంగా 13 పరుగులు రాబట్టడం మరో విశేషం. ఆఖరి బంతికి అలా 13 పరుగులు ఎలా అంటారా? న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ బాస్ డి లిడే 50వ ఓవర్ వేసేందుకు బరిలోకి దిగాడు. మొదటి బంతికే సాంట్నర్ ఫోర్ బాదగా.. ఆ తర్వాత లిడే అతడిని కట్టడి చేయగలిగాడు. సాంట్నర్‌తో పాటు మ్యాచ్ హెన్రీ క్రీజులో ఉండగా.. మరో నాలుగు బంతుల్లో కివీస్ కేవలం నాలుగు పరుగులే రాబట్టగలిగింది. కానీ ఆఖరి బంతికి సీన్ మొత్తం రివర్స్ అయింది. లిడే వేసిన లో ఫుల్‌టాస్‌ను అద్భుత రీతిలో సిక్సర్‌గా మలిచాడు సాంట్నర్. అయితే, అక్కడే మరో ట్విస్టు చోటు చేసుకుంది. లిడే వేసిన బంతిని No Ball(Waist Height)గా తేల్చాడు అంపైర్. దీంతో ఏడు పరుగులు ఖాతాలో చేరాయి. ఇక అప్పటికే ఒత్తిడిలో కూరకుపోయిన బాస్ డి లిడే ఆఖరి బంతికి మరోసారి మూల్యం చెల్లించుకోకతప్పలేదు. ఆఫ్ సైడ్ దిశగా లిడే మరోసారి లో ఫుల్ టాస్ వేయగా.. సిక్సర్ బాది కివీస్ ఇన్నింగ్స్‌కు అద్భుతమైన ముగింపునిచ్చాడు సాంట్నర్. ఇలా ఒకే బంతికి పదమూడు పరుగులు ఇచ్చిన లిడేకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆఖరి ఓవర్లో మొత్తంగా 21 పరుగులు వచ్చాయి. ముగ్గురి అర్ధశతకాలతో కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విల్ యంగ్(70) సహా వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(51), కెప్టెన్ టామ్ లాథమ్(53) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సాంట్నర్ మెరుపుల కారణంగా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించి డచ్ జట్టుకు గట్టి సవాల్ విసిరింది. వరుసగా రెండో విజయంపై కన్నేసింది. చదవండి: WC 2023: పాక్, కివీస్‌లకు అంత సీన్ లేదు.. సెమీస్‌లో ఆ 4 జట్లే! ఫైనల్లో: ఆండర్సన్ View this post on Instagram A post shared by ICC (@icc) -
ENG VS NZ 2nd ODI: ఇదెక్కడి క్యాచ్ రా సామీ.. ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన రెండో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్‌లు అభిమానులకు కనువిందు చేశాయి. ఇందులో మొదటిది బౌల్ట్ బౌలింగ్‌లో సాంట్నర్ పట్టగా (బెయిర్‌స్టో).. రెండోది సౌథీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ (మొయిన్ అలీ) అందున్నాడు. సాంట్నర్ గాల్లోకి పైకి ఎగురుతూ ఒంటిచేత్తో పట్టుకున్న క్యాచ్ అద్భుతమైతే.. అసాధ్యమైన క్యాచ్‌ను పట్టుకున్న ఫిలిప్స్ అత్యద్భుతం. Some catch 👏 Jonny Bairstow is forced to depart early...#EnglandCricket | #ENGvNZ pic.twitter.com/hrB15EWVgt — England Cricket (@englandcricket) September 10, 2023 మొయిన్ అలీ బ్యాట్ లీడింగ్ ఎడ్జ్ తీసుకుని బంతి గాల్లోకి లేవగా, చాలా దూరం నుంచి పరిగెడుతూ వచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ ఫిలిప్స్ ఈ క్యాచ్‌ను అందకున్నాడు. రిస్క్‌తో కూడుకున్న ఈ క్యాచ్‌ను పట్టుకుని ఫిలిప్స్ పెద్ద సాహసమే చేశాడు. క్యాచ్ పట్టే క్రమంలో ఒకవేళ అటుఇటు అయివుంటే అతను తీవ్రంగా గాయపడేవాడు. అయితే ఫిలిప్స్ ఎంతో చాకచక్యంగా, ఎలాంటి దెబ్బలు తగిలించుకోకుండా ఈ క్యాచ్‌ను అందుకుని అందరి మన్ననలు అందుకున్నాడు. Glenn Phillips ... Flying bird ...#ENGvNZ pic.twitter.com/Y1h08pWRE8 — Manikanta Aravind (@MA_Aravind) September 10, 2023 ఈ రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. నెటిజన్లు సాంట్నర్ క్యాచ్‌తో పోలిస్తే ఫిలిప్స్ క్యాచ్‌కు ఎక్కువగా ఫిదా అవుతున్నారు. వారు ఫిలిప్స్‌ను ఫ్లయింగ్ బర్డ్‌తో పోలుస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నా, ఆ జట్టు మాత్రం 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. లివింగ్‌స్టోన్ (95 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లు బౌల్ట్ 3, సౌథీ 2, హెన్రీ, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్.. ఇంగ్లీష్ బౌలర్లు డేవిడ్ విల్లే (3/34), రీస్ టాప్లే (3/27), మొయిన్ అలీ (2/30), అట్కిన్సన్ (1/23) ధాటికి 26.5 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
పాక్ నుంచి పుట్టుకొచ్చిన బౌలర్.. మలింగను గుర్తుచేస్తూ
పాకిస్తాన్‌కు చెందిన కొత్త ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్ విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో సంచలన బౌలింగ్‌తో మెరిశాడు. డెర్బీషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న జమాన్ ఖాన్ లంక మాజీ బౌలర్ లసిత్ మలింగ బౌలింగ్‌ను పోలి ఉంది. అతని శైలిలోనే పదునైన యార్కర్లు సంధిస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. తాజాగా జమాన్ ఖాన్ ప్రత్యర్థి బ్యాటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా సోమవారం డెర్బీషైర్, వోర్సెష్టర్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వోర్సెష్టర్‌షైర్ దూకుడుగా ఆడింది. తొలి 3.4 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత జాక్ చాపెల్ బౌలింగ్‌లో ఒలివిరియా ఔట్ అయ్యాడు అనంతరం న్యూజిలాండ్ స్టార్ మిచెల్ సాంట్నర్, హెయిన్స్‌కు జత కలిశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన జమాన్ ఖాన్ ఈ జోడిని విడదీశాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతికి అద్భుత యార్కర్ సంధించగా.. సాంట్నర్ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. బంతి సూపర్‌స్పీడ్‌తో రావడంతో రెండు స్టంప్‌లు గాలిలో ఎగిరిపడ్డాయి. ఇక ఈ యంగ్ బౌలర్ నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే మిగతా బౌలర్లు విఫలం కావడంతో వోర్సెష్టర్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ సాంట్నర్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డెర్బీషైర్ మొదటి పది ఓవర్లు దూకుడు కనబరిచినప్పటికి అదే టెంపోను చివరి వరకు కొనసాగించలేకపోయింది. దీంతో 19.4 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అవడంతో వోర్సెష్టర్‌షైర్ 28 పరుగుల తేడాతో విజయం అందుకుంది. వేన్ మాడ్సన్ 63, హ్యారీ కేమ్ 43 పరుగులతో రాణించారు. Zaman Khan with an elite yorker 😍 #Blast23 pic.twitter.com/NiBPxfHK52— Vitality Blast (@VitalityBlast) July 4, 2023 చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! -
గిల్ కిల్లింగ్.. టీమిండియాదే టి20 సిరీస్ (ఫొటోలు)
-
శతక్కొట్టిన గిల్, నిప్పులు చెరిగిన పేసర్లు.. టీమిండియా ఘన విజయం
అహ్మదాబాద్: మోదీ స్టేడియంలో భారత్ పరుగుల మోత మోగించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) తన బ్యాటింగ్ సునామీని చూపించాడు. దీంతో ఆఖరి టి20లో టీమిండియా 168 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి 2–1తో సిరీస్ గెలుచుకుంది. మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించాడు. అనంతరం న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీశాడు. గిల్ విధ్వంసం ఇషాన్ కిషన్ (1) రెండో ఓవర్లోనే నిష్క్రమించగా... గిల్, త్రిపాఠి కివీస్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగారు. రెండో వికెట్‌కు ఈ జోడీ మెరుపులతో 7 ఓవర్ల వ్యవధిలోనే భారత్ 80 పరుగులు చేసింది. తర్వాత సూర్యకుమార్ (13 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. కెపె్టన్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగా... 15 ఓవర్లలో భారత్ స్కోరు 156/3. శుబ్‌మన్ 44 బంతుల్లో 67 పరుగులతో ఉన్నాడు. గిల్ అప్పటిదాకా ఒక ఆట, 16వ ఓవర్ నుంచి మరో ఆట ఆడాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన గిల్... లిస్టర్, టిక్నర్, ఫెర్గూసన్ ఎలా ఎవరెదురైనా... బంతుల్ని అదేపనిగా బౌండరీ దాటించాడు. పాండ్యా ఆడిన బంతుల్ని మినహాయిస్తే... గిల్ 16 బంతులను వరుసగా 0, 6, 6, 1, 6, 4, 0, 6, 1, 4, 6, 1, 4, 1, 4, 6లుగా ధనాదంచేశాడు. దీంతో 4 ఓవర్లలోనే భారత్ 72 పరుగులు చేసింది. ఇందులో 56 పరుగులు గిల్వే! ఈ క్రమంలో 54 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆఖరి ఓవర్లో పాండ్యా (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) అవుట్‌కాగా కేవలం 6 పరుగులే వచ్చాయి. భారత్ పేస్‌కు కివీస్ బ్యాటర్స్ వణికారు. మూడో ఓవర్లోనే కివీస్ 7 పరుగులకే 4 వికెట్లను కోల్పోవడంతో భారత్ విజయానికి బాటపడింది. మిచెల్, సాన్‌ట్నర్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బ్రేస్‌వెల్ 1; గిల్ (నాటౌట్) 126; త్రిపాఠి (సి) ఫెర్గూసన్ (బి) సోధి 44; సూర్యకుమార్ (సి) బ్రేస్‌వెల్ (బి) టిక్నర్ 24; పాండ్యా (సి) బ్రేస్‌వెల్ (బి) మిచెల్ 30; హుడా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 234. వికెట్ల పతనం: 1–7, 2–87, 3–125, 4–228. బౌలింగ్: లిస్టర్ 4–0–42–0, బ్రేస్‌వెల్ 1–0–8–1, ఫెర్గూసన్ 4–0–54–0, టిక్నర్ 3–0–50–1, ఇష్ సోధి 3–0–34–1, సాన్‌ట్నర్ 4–0–37–0, మిచెల్ 1–0–6–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (సి) సూర్య (బి) పాండ్యా 3; కాన్వే (సి) పాండ్యా (బి) అర్‡్షదీప్ 1; చాప్మన్ (సి) ఇషాన్ (బి) అర్‡్షదీప్ 0; ఫిలిప్స్ (సి) సూర్య (బి) పాండ్యా 2; మిచెల్ (సి) మావి (బి) ఉమ్రాన్ 35; బ్రేస్‌వెల్ (బి) ఉమ్రాన్ 8; సాన్‌ట్నర్ (సి) సూర్య (బి) మావి 13; ఇష్ సోధి (సి) త్రిపాఠి (బి) మావి 0; ఫెర్గూసన్ (సి) ఉమ్రాన్ (బి) పాండ్యా 0; టిక్నర్ (సి) ఇషాన్ (బి) పాండ్యా 1; లిస్టర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (12.1 ఓవర్లలో ఆలౌట్) 66. వికెట్ల పతనం: 1–4, 2–4, 3–5, 4–7, 5–21, 6–53, 7–53, 8–54, 9–66, 10–66. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 4–0–16–4, అర్ష్‌దీప్ సింగ్ 3–0–16–2, ఉమ్రాన్ మాలిక్ 2.1–0–9–2, కుల్దీప్ యాదవ్ 1–0–12–0, శివమ్ 2–0–12–2. ►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ (126 నాటౌట్) గుర్తింపు పొందాడు. కోహ్లి (122 నాటౌట్; అఫ్గానిస్తాన్‌పై 2022 లో) పేరిట ఉన్న రికార్డును గిల్ సవరించాడు. ►అంతర్జాతీయ టి20ల్లో పరుగుల తేడా పరంగా భారత్‌కిదే అతిపెద్ద విజయం. 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల తేడా తో సాధించిన విజయం రెండో స్థానానికి వెళ్లింది. ►భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20లు) సెంచరీ సాధించిన ఐదో క్రికెటర్‌గా గిల్ నిలిచాడు. గతంలో రైనా, కేఎల్ రాహుల్, రోహిత్, కోహ్లి ఈ ఘనత సాధించారు. -
నిర్ణయాత్మక మూడో టీ20.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. చహల్ ఔట్
3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక్క మార్పు చేసింది. యుజ్వేంద్ర చహల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. జాకబ్ డప్ఫీ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెన్ లిస్టర్ జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. టీమిండియా: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఐష్ సోధీ, లోకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, బ్లెయిర్ టిక్నర్ -
టాస్ గెలిచిన టీమిండియా.. పృథ్వీకి దక్కని చోటు
రాంచీ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టి20 మొదలైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఏంచుకుంది. ఊహించినట్లుగానే పృథ్వీ షాకు తుది జట్టులో చోటు దక్కలేదు. చహల్ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు. లంకతో ఆడిన జట్టే కివీస్‌తో తొలి టి20లో బరిలోకి దిగింది. ఇక న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్ స్థానంలో మార్క్ చాప్మన్, ఇష్ సోదీ జట్టులోకి వచ్చారు. భారత్ : హార్దిక్ పాండ్యా(కెప్టెన్),ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్(కెప్టెన్),ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్ ► అనుభవం, గణాంకాల దృష్ట్యా ప్రత్యర్థి కంటే టీమిండియా ఎంతో బలంగా కనిపిస్తుండగా... కివీస్ తమ యువ ఆటగాళ్లతో సంచలనాన్ని ఆశిస్తోంది. ఇలాంటి స్థితిలో ఈ సిరీస్ అయినా పోటాపోటీగా సాగుతుందా లేక ఇదీ ఏకపక్షమవుతుందా అనేది ఆసక్తికరం. దాదాపు ఇరవై రోజుల క్రితం భారత జట్టు తమ చివరి టి20 మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడింది. స్వల్ప మార్పుల మినహా అదే జట్టు ఈసారి కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఖాయం కాగా... రెండో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ ఆడతాడని కెప్టెన్ హార్దిక్ చెప్పేశాడు. ► వన్డేలలాగే టి20 సిరీస్ నుంచి కూడా న్యూజిలాండ్ సీనియర్లు విలియమ్సన్, సౌతీ విశ్రాంతి తీసుకున్నారు. దాంతో సాన్‌ట్నర్ నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతోంది. కెప్టెన్‌గా సాన్‌ట్నర్ బలహీన జట్లు ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లపై విజయాలు అందించాడు. టి20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన తర్వాత ఓపెనర్ ఫిన్ అలెన్ ఆడిన ఆరు టి20ల్లోనూ విఫలమయ్యాడు.తాజా వన్డే సిరీస్‌లో కూడా రెండుసార్లు డకౌట్ అయిన అతను ఇప్పుడైనా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాలని జట్టు కోరుకుంటోంది.అయితే గాయంతో వన్డేలు ఆడని ప్రధాన స్పిన్నర్ ఇష్ సోధి కోలుకోవడం జట్టుకు పెద్ద ఊరట. భారత గడ్డపై అతనికి మంచి రికార్డు ఉంది. చదవండి: Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే!
India vs New Zealand, 1st T20I: వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా టీ20 సిరీస్‌పై కన్నేసింది. వన్డేల్లో క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు రెట్టించిన ఉత్సాహంతో పొట్టి క్రికెట్లో పోటీకి సిద్ధమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో కివీస్‌తో పోరుకు సై అంటోంది. మరోవైపు.. వన్డే సిరీస్‌లో ఘోర పరాజయంతో డీలా పడిన న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లోనైనా సత్తా చాటి తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. మిచెల్ సాంట్నర్ నేతృత్వంలో కివీస్ జట్టు బరిలోకి దిగనుంది. కాగా సారథిగా సాంట్నర్ ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై కివీస్‌కు విజయాలు అందించాడు. ఈ క్రమంలో రాంచి వేదికగా శుక్రవారం నాటి తొలి మ్యాచ్‌తో టీమిండియా- కివీస్ మధ్య ఆరంభం కానున్న టీ20 సిరీస్ ఆసక్తికరంగా మారింది. రాంచీ మ్యాచ్ అంటే అంతే! ఇక రాంచీలో మ్యాచ్ అంటే ఆడినా, ఆడకపోయినా మహేంద్ర సింగ్ ధోని ఉండాల్సిందే! తన రిటైర్మెంట్ తర్వాతి నుంచి ఎప్పుడు నగరంలో టీమిండియా ఆడినా వారిని కలిసే ధోని ఈసారి కూడా దానిని కొనసాగించాడు. మ్యాచ్ జరిగే జేఎస్సీఏ స్టేడియానికి వచ్చి పాండ్యా బృందంతో మిస్టర్ కూల్ ముచ్చటించాడు. జార్ఖండ్ టీమ్ డ్రెస్‌లో అప్పటి వరకు ప్రాక్టీస్ సాగించిన ఈ మాజీ కెప్టెన్.. డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి ఆటగాళ్లతో విభిన్న అంశాలపై మాట్లాడాడు. అతనితో కలిసి ఆడిన, ఆడని కొత్త ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కూడా ధోనిని కలిసినందుకు ఆనందంతో పొంగిపోయారు. Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh — BCCI (@BCCI) January 26, 2023 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి టీ20 పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే సాధారణ వికెట్. ఛేదనలోనే అన్ని జట్లకు మెరుగైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 3 అంతర్జాతీయ టి20ల్లోనూ భారత్ గెలిచింది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. మంచు ప్రభావం ఎక్కువ కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ముఖాముఖి పోరు కాగా 2021 నవంబర్‌లో భారత్‌లో ఆడిన టి20 సిరీస్‌లో న్యూజిలాండ్ 0–3తో చిత్తయింది. తుది జట్ల వివరాలు (అంచనా) టీమిండియా: శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్ న్యూజిలాండ్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్, బెన్ లిస్టర్/జాకోబ్ డఫీ. చదవండి: Ravindra Jadeja: రీ ఎంట్రీలో దుమ్మురేపిన జడేజా.. ఏకంగా 8 వికెట్లతో..! ICC Awards 2022: ఐసీసీ అవార్డు విన్నర్ల మొత్తం జాబితా ఇదే.. Hello Ranchi 👋 We are here for the #INDvNZ T20I series opener 👏 👏#TeamIndia | @mastercardindia pic.twitter.com/iJ4uSi8Syv — BCCI (@BCCI) January 25, 2023 -
IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్
ఎవరన్నారు వన్డేలకు కాలం చెల్లిందని... ఎవరన్నారు 100 ఓవర్లు చూడటమంటే బోరింగ్, సమయం వృథా అని... హైదరాబాద్ స్టేడియంలో బుధవారం మ్యాచ్ చూసిన తర్వాత అలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే... భారీగా పరుగులు, సిక్సర్ల వరద, రికార్డులు, ఉత్కంఠ, ఉద్వేగం... ఒక్కటేమిటి అన్ని భావాలు ఉప్పల్ మైదానంలో కనిపించాయి. అతి సునాయాస విజయం అనుకున్నది కాస్తా ఆఖరి ఓవర్ వరకు వెళ్లింది. శుబ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌తో డబుల్ సెంచరీ సాధించి అరుదైన ఆటగాళ్ల జాబితాలో తన పేరు నమోదు చేసుకొని తొలి సగం ఆటలో హైలైట్‌గా నిలిచాడు. అయితే భారత్ భారీ స్కోరు చేయగానే గెలుపు ఖాయం కాలేదు. 21.2 ఓవర్లలో ఏకంగా 219 పరుగులు చేయాల్సిన సుదూర లక్ష్యం ముందుండగా... న్యూజిలాండ్ టి20 తరహాలో మెరుపు షాట్లతో పోరాడింది. మైకేల్ బ్రేస్‌వెల్ వీర బాదుడుకు భారత శిబిరంలో అలజడి రేగింది. ఒకదశలో టీమిండియా ఓటమి దిశగా కూడా వెళుతున్నట్లు అనిపించింది. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా... రెండో బంతికి ఆఖరి వికెట్ తీసి భారత్ ఊపిరి పీల్చుకుంది. మొత్తంగా అభిమానులకు ఫుల్ వినోదం అందింది. సాక్షి, హైదరాబాద్: హోరాహోరీ సమరంలో పైచేయి సాధించిన భారత్ వన్డే సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బుధవారం చివరి ఓవర్ వరకు ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల స్వల్ప తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. మైకేల్ బ్రేస్‌వెల్ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా, మిచెల్ సాన్‌ట్నర్ (45 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 17 ఓవర్లలోనే 162 పరుగులు జోడించడం విశేషం. సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడిన పేసర్ మొహమ్మద్ సిరాజ్ 4 కీలక వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లోని రెండో వన్డే ఈనెల 21న రాయ్‌పూర్‌లో జరుగుతుంది. కోహ్లి విఫలం... భారత్‌కు రోహిత్ శర్మ (38 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), గిల్ మరోసారి శుభారంభం అందించారు. వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు సాధించడంతో తొలి 10 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. అయితే తక్కువ వ్యవధిలో రోహిత్, కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5)లను అవుట్ చేసి న్యూజిలాండ్ ఆధిక్యం ప్రదర్శించింది. మరోవైపు గిల్ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. అతనికి సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (38 బంతుల్లో 28; 3 ఫోర్లు) తగిన సహకారం అందించారు. గిల్ నాలుగో వికెట్‌కు సూర్యతో 65 పరుగులు, ఐదో వికెట్‌కు హార్దిక్‌తో 74 పరుగులు జోడించాడు. కవర్స్‌లో సులువైన క్యాచ్ ఇచ్చి సూర్య వెనుదిరగ్గా... వివాదాస్పద రీతిలో హార్దిక్ అవుటయ్యాడు. బంతి హార్దిక్ బ్యాట్‌ను తాకకుండానే కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లుగా, కీపర్ చేతులతోనే బెయిల్స్ కదిలినట్లుగా టీవీ రీప్లేలో కనిపించింది. అయితే దీనిపై స్పష్టత లేకపోగా, హార్దిక్‌ను అంపైర్ బౌల్డ్‌గా ప్రకటించాడు. 40 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 251 పరుగులకు చేరింది. అయితే కివీస్ బౌలర్లు కట్టడి చేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. ఒక దశలో 40–47 ఓవర్ల మధ్య ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే వచ్చాయి. అయితే చివర్లో గిల్ సునామీ బ్యాటింగ్ ఒక్కసారిగా ఆటను మార్చేసింది. చివరి 10 ఓవర్లలో భారత్ 98 పరుగులు సాధించింది. ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే... గిల్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. 45 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన కీపర్ లాథమ్, అదే బంతికి స్టంపింగ్ చేసే సునాయాస అవకాశాన్ని కూడా చేజార్చాడు. ఆ తర్వాత షిప్లీ తన బౌలింగ్‌లోనే రిటర్న్ క్యాచ్ వదిలేసినప్పుడు గిల్ స్కోరు 122 పరుగులు. మెరుపు భాగస్వామ్యం.... భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మొదటి నుంచీ తడబడింది. ఏ దశలోనూ టీమ్ గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించలేదు. ఆరంభంలోనే ఒకదశలో వరుసగా 23 బంతుల పాటు కివీస్ పరుగు తీయలేకపోయింది. ఫిన్ అలెన్ (39 బంతుల్లో 40; 7 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం స్వేచ్ఛగా ఆడుతూ హార్దిక్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, సిక్స్ కొట్టడం విశేషం. అనంతరం మిడిలార్డర్లో 19 పరుగుల వ్యవధిలో జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. అనుభవజ్ఞుడైన కెప్టెన్ టామ్ లాథమ్ (24) కూడా ప్రభావం చూపలేకపోయాడు. స్కోరు 131/6కు చేరడంతో కివీస్ కుప్పకూలేందుకు ఎంతో సమయం లేదనిపించింది. అయితే ఈ దశలో బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్ భారత బౌలర్లను ఆడుకున్నారు. కొరకరాని కొయ్యలుగా మారిపోయిన వీరిద్దరు చక్కటి షాట్లతో, సమన్వయంతో దూసుకుపోయారు. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. సాన్‌ట్నర్ 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, 57 బంతుల్లోనే బ్రేస్‌వెల్ శతకం అందుకున్నాడు.ఎట్టకేలకు 17 ఓవర్ల భాగస్వామ్యం తర్వాత సాన్ట్నర్ను సిరాజ్ అవుట్ చేయడంతో భారత్ ఊరట చెందింది. అయితే మరో ఎండ్‌లో పోరాటం కొనసాగించిన బ్రేస్‌వెల్ విజయానికి చేరువగా తీసుకు రాగలిగాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మిచెల్ (బి) టక్నర్ 34; గిల్ (సి) ఫిలిప్స్ (బి) షిప్లీ 208; కోహ్లి (బి) సాన్‌ట్నర్ 8; ఇషాన్ కిషన్ (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 5; సూర్యకుమార్ (సి) సాన్‌ట్నర్ (బి) మిచెల్ 31; హార్దిక్ (బి) మిచెల్ 28; సుందర్ (ఎల్బీ) (బి) షిప్లీ 12; శార్దుల్ (రనౌట్) 3; కుల్దీప్ (నాటౌట్) 5; షమీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 349. వికెట్ల పతనం: 1–60; 2–88; 3–110; 4–175; 5–249; 6–292; 7–302; 8–345. బౌలింగ్: షిప్లీ 9–0–74–2, ఫెర్గూసన్ 10–0–77–1, టిక్నర్ 10–0–69–1, సాన్‌ట్నర్ 10–0–56–1, బ్రేస్‌వెల్ 6–0–43–0, మిచెల్ 5–0–30–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (సి) (సబ్) షహబాజ్ (బి) శార్దుల్ 40; కాన్వే (సి) కుల్దీప్ (బి) సిరాజ్ 10; నికోల్స్ (బి) కుల్దీప్ 18; మిచెల్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 9; లాథమ్ (సి) సుందర్ (బి) సిరాజ్ 24; ఫిలిప్స్ (బి) షమీ 11; బ్రేస్‌వెల్ (ఎల్బీ) (బి) శార్దుల్ 140; సాన్‌ట్నర్ (సి) కుల్దీప్ (బి) సిరాజ్ 57; షిప్లీ (బి) సిరాజ్ 0; ఫెర్గూసన్ (సి) గిల్ (బి) హార్దిక్ 8; టిక్నర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 337 వికెట్ల పతనం: 1–28, 2–70, 3–78, 4–89, 5–110, 6–131, 7–293, 8–294, 9–328, 10–337. బౌలింగ్: షమీ 10–1–69–1, సిరాజ్ 10–2–46–4, హార్దిక్ 7–0–70–1, కుల్దీప్ 8–1–43–2, శార్దుల్ 7.2–0–54–2, సుందర్ 7–0–50–0. –సాక్షి క్రీడా ప్రతినిధి -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన బ్రేస్‌వెల్..
3 వన్డే సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఓ దశలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుండగా, మైఖేల్ బ్రేస్‌వెల్ (60 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో టీమిండియాను గడగడలాడిస్తున్నాడు. అతనికి జతగా మరో ఎండ్‌లో మిచెల్ సాంట్నర్ (40 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) కూడా చెలరేగుతుండటంతో టీమిండియా డిఫెన్స్‌లో పడింది. 44 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. న్యూజిలాండ్ గెలవాలంటే 36 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 4 వికెట్లు ఉన్నాయి. 57 బంతుల్లో శతకం పూర్తి చేసిన బ్రేస్‌వెల్.. న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో మూడో ఫాస్టెస్ట్ హండ్రెడ్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్ధిక్ పాండ్యా (28) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్, తలో వికెట్ దక్కించుకున్నారు. -
భారత్ వర్సెస్ న్యూజిలాండ్.. షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు
India Vs New Zealand 2023- ODI And T20 Series: శ్రీలంకతో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లు గెలిచిన టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమవుతోంది. పర్యాటక కివీస్‌తో తొలుత వన్డే సిరీస్.. తర్వాత టీ20 సిరీస్ ఆడనుంది. లంకను 2-1 తేడాతో ఓడించి సిరీస్ గెలిచిన హార్దిక్ పాండ్యా మరోసారి భారత జట్టు టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా- న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్, ఇరు జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం తదితర విషయాలు తెలుసుకుందాం. భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన: జనవరి 18- ఫిబ్రవరి 1 వరకు టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ ►మూడు మ్యాచ్‌లు ►మొదటి వన్డే: జనవరి 18, బుధవారం- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం- హైదరాబాద్ ►రెండో వన్డే: జనవరి 21, శనివారం- షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, రాయ్‌పూర్ ►మూడో వన్డే: జనవరి 24, మంగళవారం- హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్ ►మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్ ►తొలి టీ20: జనవరి 27, శుక్రవారం- జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాంచి ►రెండో టీ20: జనవరి 29, ఆదివారం- భారత రత్ర వ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియం, లక్నో ►మూడో టీ20: ఫిబ్రవరి 1, బుధవారం- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ ►మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభం. రోహిత్ శర్మ వన్డే సిరీస్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి టి20 సిరీస్ భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ గైక్వాడ్, శుభమాన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వై చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ , శివం మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్ న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, జాకోబ్ డఫ్పీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ రిప్పన్, హెన్రీ షీప్లే, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్. ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వన్డే, టీ20 సిరీస్‌లు లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రసారాలు చదవండి: Sarfaraz Khan: అప్పుడేమో సిద్ధంగా ఉండమన్నారు! కానీ చివరకు.. నేనూ మనిషినే.. నాకూ భావోద్వేగాలు ఉంటాయి.. వుమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్‌కు ఊహించని భారీ ధర -
భారత్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన కివీస్.. కెప్టెన్ ఎవరంటే!
India Vs New Zealand T20 Series 2023: టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. భారత్‌తో తలపడే జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దేశీ లీగ్‌లలో సత్తా చాటిన హెన్రీ షీప్లే, బెన్ లిస్టర్ తొలిసారి జట్టుకు ఎంపికయ్యారు. భారత పర్యటనకు కాగా జనవరి 18- ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్ భారత్‌లో పర్యటించనుంది. వన్డే సిరీస్‌తో ఇండియా టూర్ మొదలు పెట్టి టీ20 సిరీస్‌తో ముగించనుంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌కాప్స్ టీ20 జట్టును ప్రకటించడం విశేషం. ఇక డిసెంబరులోనే వన్డే జట్టు వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జనవరి 27న రాంచి వేదికగా టీమిండియా- కివీస్ జట్ల మధ్య పొట్టి ఫార్మాట్ సిరీస్ మొదలు కానుంది. జనవరి 29, ఫిబ్రవరి 1న మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే కివీస్ జట్టు ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తోంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ డ్రా కాగా.. వన్డే సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది. టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, జాకోబ్ డఫ్పీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ రిప్పన్, హెన్రీ షీప్లే, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్. చదవండి: Rashid Khan: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! Zim Vs IRE: చెలరేగిన జింబాబ్వే బౌలర్లు.. పటిష్ట జట్లపై ఆడిన బ్యాటర్లకు చుక్కలు! గెలుపుతో -
న్యూజిలాండ్ కొంపముంచిన సాంట్నర్.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కోల్పోయేలా చేశాడు
నేపియర్‌లోని మెక్లీన్ పార్క్ వేదికగా నూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 23) జరిగిన మూడో టీ20 టైగా ముగిసింది. భారత ఇన్నింగ్స్ సమయంలో (9 ఓవర్ల తర్వాత 75/4) వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టైగా ప్రకటించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో మ్యాచ్‌లో 'సూర్య'ప్రతాపం (111 నాటౌట్) చూపించడంతో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) అర్ధసెంచరీలతో రాణించడంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో భారత్ స్కోర్ 9 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 75 పరుగుల వద్ద ఉండగా, ఒక్కసారిగా వర్షం ప్రారంభమై మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టైగా ముగిసేలా చేసింది. డీఎల్ఎస్ ప్రకారం 9 ఓవర్ల తర్వాత టీమిండియా గెలిచి ఉండాలంటే 76 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే ఈ సమయానికి టీమిండియా స్కోర్ 75 పరుగులు మాత్రమే ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను డీఎల్ఎస్ టైగా ప్రకటించారు. క్రికెట్ చరిత్రలో ఇలా డీఎల్ఎస్ టైగా ముగిసిన సందర్భాలు ఈ మ్యాచ్‌తో కలిపి మూడు ఉన్నాయి. 2021లో నెదర్లాండ్స్-మలేషియా మధ్య జరిగిన మ్యాచ్, 2021లో మాల్టా-జిబ్రాల్టర్ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలాగే డక్‌వర్త్ లూయిస్ టైగా ముగిశాయి. న్యూజిలాండ్ కొంపముంచిన సాంట్నర్.. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ చేసిన ఓ చిన్న తప్పిదం ఆ జట్టు పాలిట శాపంలా మారింది. మ్యాచ్‌తో పాటు ఏకంగా సిరీస్ కోల్పోయేలా చేసింది. వర్షం కారణంగా భారత ఇన్నింగ్స్ ఆగిపోయే సమయానికి క్షణాల ముందు, అంటే 8.6వ ఓవర్లో (9వ ఓవర్ ఆఖరి బంతి) ఐష్ సోధి బౌలింగ్‌లో సాంట్నర్ మిస్ ఫీల్డింగ్ చేశాడు. బ్యాక్ వర్డ్ పాయింట్ దిశలో ఉన్న సాంట్నర్.. దీపక్ హుడా ఆడిన షాట్‌కు మిస్ ఫీల్డ్ చేయడంతో ఓ పరుగు వచ్చింది . ఇదే పరుగు న్యూజిలాండ్ కొంపముంచింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ( 9 ఓవర్ల తర్వాత) టీమిండియా గెలిచి ఉండాలంటే 76 పరుగులు చేయాల్సి ఉండింది. అదే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలిచి ఉండాలంటే టీమిండియా స్కోర్ 9 ఓవర్ల తర్వాత 74గా ఉండాల్సిందే. అదే సాంట్నర్ 9వ ఓవర్ ఆఖరి బంతికి మిస్ ఫీల్డ్ చేయకుండి ఉంటే, పరుగు వచ్చేది కాదు.. న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచి, సిరీస్ సమం చేసుకుని ఉండేది. ఈ విషయం తెలిసి మ్యాచ్‌ను అధికారికంగా టైగా ప్రకటించక ముందే సాంట్నర్ చాలా బాధపడ్డాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్లు వీరే!
ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. వారిలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ ఉన్నారు. కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగుతోన్న టెస్టు సిరీస్‌లో బెన్ స్టోక్స్ అద్భుతమైన ప్రధర్శన కనబరుస్తున్నాడు. ప్రోటీస్‌తో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లతో పాటు అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. ఇక సికిందర్ రజా ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్, భారర్‌తో జరిగిన సిరీస్‌లలో రజా అదరగొట్టాడు. ఈ నెలలో అతడు మూడు అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను జింబాబ్వే కైవసం చేసుకోవడంలో రజా కీలక పాత్ర పోషించాడు. ఇక మిచిల్ సాంట్నర్ విషయానికి వస్తే.. సాంట్నర్ యూరప్ టూర్లో భాగంగా నెదర్లాండ్స్‌పై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో సాంట్నర్ 42 బంతుల్లో 77 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. ఇక మహిళల విభాగం నుంచి ఈ అవార్డుకు.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ, భారత మిడిలార్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మెక్‌గ్రాత్ నామినెట్ అయ్యారు. చదవండి: Ind Vs Pak: అర్ష్‌దీప్ బంగారం.. అతడిని ఏమీ అనకండి.. నిజంగా ఇది సిగ్గుచేటు: భారత మాజీ క్రికెటర్ -
రాణించిన విలియమ్సన్.. తిప్పేసిన సాంట్నర్
కింగ్స్టన్ (జమైకా): స్వదేశంలో టీమిండియా చేతిలో 0-3 తేడాతో వన్డే సిరీస్‌ను, 1-4 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయి పరువు పోగొట్టుకున్న వెస్టిండీస్ జట్టు.. వరుస పరాజయాల పరంపరను కొనసాగిస్తుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (ఆగస్ట్ 10) జరిగిన తొలి టీ20లోనూ కరీబియన్ జట్టు ఓటమిపాలైంది. కేన్ విలియమ్సన్, మిచెల్ సాంట్నర్ రాణించడంతో పర్యాటక జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. విలియమ్సన్ (33 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డెవాన్ కాన్వే (29 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జిమ్మీ నీషమ్ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా, ఛేదనలో విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖర్లో రొమారియో షెపర్డ్(16 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), ఓడియన్ స్మిత్ (12 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్)లు భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. మిచెల్ సాంట్నర్ (3/19) తన స్పిన్ మాయాజాలంతో విండీస్‌ను దెబ్బకొట్టాడు. విండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ మూడు వికెట్లతో పర్వాలేదనిపించాడు. చదవండి: బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం.. సిరీస్ జింబాబ్వే సొంతం -
పసికూనపై కివీస్ ప్రతాపం.. సిరీస్ క్లీన్‌స్వీప్
నెదర్లాండ్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన రెండో టి20లో న్యూజిలాండ్.. నెదర్లాండ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్‌లు పసికూన జట్టుపై అర్థసెంచరీలతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నెద్లరాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. బాస్ డి లీడే 53 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. టామ్ కూపర్ 26, స్కాట్ ఎడ్వర్డ్స్ 26 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికి ఆ తర్వాత మిచెల్ సాంట్నర్(42 బంతుల్లో 77 నాటౌట్, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), డారిల్ మిచెల్(27 బంతుల్లో 51 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: NZ vs NED: కివీస్‌కు ముచ్చెమటలు పట్టించిన డచ్ బ్యాటర్.. -
కివీస్‌కు ముచ్చెమటలు పట్టించిన డచ్ బ్యాటర్..
నెదర్లాండ్స్ టూర్‌ను న్యూజిలాండ్ విజయంతో ఆరంభించింది. గురువారం జరిగిన తొలి టి20లో కివీస్ 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం అందుకుంది. రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మార్టిన్ గప్టిల్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జేమ్స్ నీషమ్ 32 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 19.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. బాస్ డీ లీడి (53 బంతుల్లో 66, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నంతవరకు నెదర్లాండ్స్ విజయంపై ఆశలు పెంచుకుంది. ఒక సందర్భంలో ఈ డచ్ బ్యాటర్ న్యూజిలాండ్‌కు ముచ్చెమటలు పట్టించాడు. అయితే లీడీతో పాటు స్కాట్ ఎడ్వర్డ్స్(20 పరుగులు) ఔటైన తర్వాత డచ్ ఓటమి ఖరారైంది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ 4, బెన్ సీయర్స్ 3, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఇవాళ(ఆగస్టు 8) జరగనుంది. చదవండి: Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు -
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..!
ఐర్లాండ్ పర్యటనకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలలో అతడికి పాజిటివ్‌గా తేలింది. అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సాంట్నర్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. డబ్లిన్ వేదికగా జూలై 10న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ పర్యటనకు రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కావడంతో.. వన్డే సిరీస్‌కు టామ్ లాథమ్,టీ20 సిరీస్‌లకు సాంట్నర్‌ను కెప్టెన్లుగా న్యూజిలాండ్ క్రికెట్ నియమించింది. ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు టామ్ లాథమ్(కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రాస్‌వెల్, డేన్ క్లీవర్(వికెట్ కీపర్), జాకోబ్ డాఫీ, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, బ్లేర్ టిక్నెర్, విల్ యంగ్. ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్(వికెట్ కీపర్), లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడం మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ రిప్పన్, బెన్ సీర్స్, ఇష్ సోధి, బ్లేర్ టిక్నెర్. చదవండి: New Zealand Squads: విలియమ్సన్ లేకుండానే వరుస సిరీస్‌లు.. జట్లు ఇవే! కెప్టెన్లు ఎవరంటే! -
అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్ క్రికెటర్
నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ మైకెల్ రిప్పన్ అరుదైన ఘనత అందుకోనున్నాడు. క్రికెట్లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఆ జాబితాలోకి మైకెల్ రిప్పన్ అడుగుపెట్టనున్నాడు. ఇంతకాలం నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రిప్పన్ ఇకపై న్యూజిలాండ్ తరపున ఆడనున్నాడు. యూరోపియన్ టూర్లో భాగంగా ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ లాంటి అసోసియేట్ దేశాలతో కివీస్ జట్టు సిరీస్‌లు ఆడనుంది. దీనిలో భాగంగా ఆ టూర్లో పాల్గొనే ఆటగాళ్లను కివీస్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. వచ్చే జూలై, ఆగస్టు నెలల్లో ఈ టూర్ జరగనుంది. మొదట ఐర్లాండ్‌తో మూడు వన్డేలు.. మూడు టి20లు ఆడనున్న న్యూజిలాండ్ ఆ తర్వాత ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో రెండు టి20లు, ఒక వన్డే మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లు ముగిసిన తర్వాత అమ్‌స్టర్‌డామ్ వేదికగా నెదర్లాండ్స్‌తో రెండు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఐర్లాండ్‌తో వన్డేలకు టామ్ లాథమ్ కివీస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఐర్లాండ్‌తో టి20లు, స్కాట్లాండ్తో వన్డే, టి20లు, నెదర్లాండ్స్‌తో టి20లకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఐర్లాండ్‌తో వన్డే జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలామంది నెదర్లాండ్స్, స్కాట్లాండ్తో సిరీస్‌లో పాల్గొననున్నారు. కాగా సౌతాఫ్రికాకు చెందిన మైకెల్ రిప్పన్ కుటుంబసభ్యులు 2013లో న్యూజిలాండ్‌కు వలస వచ్చారు. అయితే న్యూజిలాండ్‌లో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న రిప్పన్.. డచ్ దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్ తరపున 9 వన్డేలు, 21 టి20 మ్యాచ్‌లు ఆడిన రిప్పన్.. తాజాగా బ్లాక్ క్యాప్స్‌కు ఆడనున్నాడు. అయితే మైకెల్ రిప్పన్ ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదు. కేవలం స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌తో సిరీస్‌ల్లో ఆడనున్నాడు. ఇక ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఏదైనా సభ్య దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు ఒక ఐసీసీలో పూర్తి స్థాయి జట్టుకు ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి పూర్తిస్థాయి జట్టుకు ఎంపికైతే మాత్రం మూడేళ్ల పాటు అసోసియేట్ దేశాలకు ఆడే వీలు మాత్రం ఉండదు. కాగా గతంలోనే ఇలా రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. వారిలో ప్రస్తుత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్( ఐర్లాండ్, ఇంగ్లండ్), లూక్ రోంచి( న్యూజిలాండ్, ఆస్ట్రేలియా), మార్క్ చాప్మన్(హాంకాంగ్, న్యూజిలాండ్), గ్జేవియర్ మార్షల్(అమెరికా, వెస్టిండీస్),హెడెన్ వాల్ష్(అమెరికా, వెస్టిండీస్), డేవిడ్ వీస్(సౌతాఫ్రికా, నమీబియా)లు ఉన్నారు. ఐర్లాండ్ పర్యటనలో వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేన్ క్లీవర్ (వికెట్ కీపర్), జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ , మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్ ఐర్లాండ్ టి20, స్కాట్లాండ్ & నెదర్లాండ్స్‌తో కివీస్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్ (వికెట్ కీపర్), లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్ మైఖేల్ రిప్పన్, బెన్ సియర్స్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్ చదవండి: బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్‌కు హక్కు ఉంటుందా? ఇదేందయ్యా ఇది.. క్యాచ్ పట్టడానికి ప్రయత్నించిన అంపైర్.. వీడియో వైరల్! -
ODI, T20 Series: విలియమ్సన్ లేకుండానే వరుస సిరీస్‌లు.. జట్లు ఇవే!
New Zealand White-ball Tours to Ireland, Scotland and the Netherlands: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రానున్న రెండు నెలలు బిజీబిజీగా గడుపనుంది. జూలైలో ఐర్లాండ్, స్కాట్లాండ్లలో పర్యటించనున్న కివీస్ ఆటగాళ్లు.. ఆగష్టులో నెదర్లాండ్స్ టూర్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి మూడు దేశాలతో సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. కాగా జూలై 10న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో వన్డే సిరీస్ ఆరంభించనున్న కివీస్.. మొత్తంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జూలై 27 నుంచి స్కాట్లాండ్తో వరుసగా రెండు టీ20లు, ఒక వన్డే ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అదే విధంగా.. ఆగష్టు 4, 6 తేదీల్లో నెదర్లాండ్స్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు న్యూజిలాండ్ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆయా సిరీస్‌లకు ప్రకటించిన జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు టామ్ లాథమ్(కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రాస్‌వెల్, డేన్ క్లీవర్(వికెట్ కీపర్), జాకోబ్ డాఫీ, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, బ్లేర్ టిక్నెర్, విల్ యంగ్. ఐర్లాండ్ టీ20 సిరీస్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌తో సిరీస్‌లకు కివీస్ జట్టు: మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్(వికెట్ కీపర్), లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడం మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ రిప్పన్, బెన్ సీర్స్, ఇష్ సోధి, బ్లేర్ టిక్నెర్. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగమైన కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇతర సీనియర్లు టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ తదితరులు లేకుండానే కివీస్ ఈ పర్యటనలు చేయనుంది. వీరికి విశ్రాంతినిచ్చేందుకు బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో జట్టుకు దూరమయ్యారు. ఇక విలియమ్సన్ స్థానంలో టామ్ లాథమ్, మిచెల్ సాంట్నర్ ఆయా సిరీస్‌లకు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నారు. అదే విధంగా హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ బ్రేక్ తీసుకోగా.. షేన్ జర్గన్సన్ ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక టెస్టు.. చెమటోడుస్తున్న టీమిండియా.. ఫోటోలు వైరల్! Shane Jurgensen looks forward to the tour of Ireland starting on 10 July in Malahide. Jurgensen will head up the coaching team for the tour, allowing regular head coach Gary Stead a short break 🏏 More details at https://t.co/3YsfR1Y3Sm or the NZC App. #IREvNZ pic.twitter.com/waWaYExCuj — BLACKCAPS (@BLACKCAPS) June 20, 2022 -
మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్.. అద్దాలు పగిలిపోయాయి
Mitchell Santner Smashes Museum Window Hitting Big Six.. న్యూజిలాండ్‌లో క్రికెట్ మైదానాలు ఎంత చిన్నగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాట్స్‌మన్ భారీ సిక్స్‌లు కొడితే బంతులన్నీ స్డేడియం బయటే ఉంటాయి. ఇక న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్ దెబ్బకు స్టేడియంలోని మ్యూజియం అద్దాలు పగిలిపోయాయి. సూపర్ స్మాష్ లీగ్‌లో భాగంగా బేసిన్ రిజర్వ్ పార్క్‌లో వెల్లింగ్టన్, నార్త్రన్ నైట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చదవండి: క్వార్టర్ ఫైనల్స్కే ఇంత రచ్చ.. మరి కప్ గెలిస్తే! మ్యాచ్‌లో సాంట్నర్ 35 బంతుల్లో ఆరు సిక్సర్లు.. నాలుగు ఫోర్లతో 59 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా సాంట్నర్ కొట్టిన ఒక సిక్స్ స్డేడియంలోని మ్యూజియం అద్దాలను పగలగొట్టింది. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన బంతిని అంపైర్లు బయటికి తీయలేకపోయారు.. కారణం మ్యూజియానికి తాళం ఉండడమేనట. దీంతో కొత్త బంతి తీసుకొని ఆటను కొనసాంచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో నార్త్రన్ నైట్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ 19.4 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఫిన్ అలెన్ 64, కెప్టెన్ బ్రేస్‌వెల్ 63 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్త్రన్ నైట్స్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: రాహుల్, పంత్‌కు ప్రమోషన్.. రహానే, పుజారాలకు డిమోషన్! "The ball is stuck in there, next time they go to open it they will find a white Kookaburra in there" 😂 Mitch Santner finds a window in the Museum Stand.#SparkSport #SuperSmashNZ@cricketwgtninc @SuperSmashNZ pic.twitter.com/9e8j5XMdcB — Spark Sport (@sparknzsport) January 24, 2022 -
మ్యాచ్ ఆడలేదు.. హీరో అయ్యాడు; అవార్డు గెలిచాడు
బ్లాక్‌క్యాప్స్ అంటే నాణ్యమైన ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. టి20, పరిమిత ఓవర్లలో వారి ఫీల్డింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది టెస్టుల్లో కూడా తమదైన ఫీల్డింగ్‌తో అదరగొట్టారు కివీస్ ఆటగాళ్లు. అందుకు మిచెల్ సాంట్నర్ ఒక నిదర్శనం. అసలే టెస్టు మ్యాచ్‌ల్లో సిక్సర్లు కొట్టడం అరుదు. అలాంటిది అయ్యర్ కొట్టిన భారీషాట్‌ను సాంట్నర్ తన అద్భుత ఫీల్డింగ్‌తో ఆపిన విధానం సూపర్ అని చెప్పొచ్చు. భారత్‌తో ముగిసిన రెండో టెస్టులో ఇది చోటుచేసుకుంది. ఇక టీమిండియా- కివీస్ టెస్టు సిరీస్‌లో మిచెల్ సాంట్నర్ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. కేవలం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మాత్రమే జట్టుకు సేవలందించిన సాంట్నర్ అవార్డు గెలుచుకున్నాడు. తన ఫీల్డింగ్‌తో సిక్స్ రాకుండా అడ్డుకున్న సాంట్నర్‌ను ''బెస్ట్ సేవ్ ఆఫ్ ది మ్యాచ్'' కింద రూ.లక్ష ప్రైజ్‌మనీ ఇవ్వడం విశేషం. చదవండి: Ashwin-Ajaz Patel: ఎజాజ్ పటేల్‌కు అశ్విన్ సాయం.. ఫ్యాన్స్ ఫిదా టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా ఇన్నింగ్స్ 47వ ఓవర్లో సోమర్ విల్లే బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ లెగ్‌సైడ్ దిశగా భారీ షాట్ ఆడాడు. కచ్చితంగా సిక్స్ అనుకుంటున్న తరుణంలో సాంట్నర్ మ్యాజిక్ చేశాడు. బౌండరీలైన్ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్న అతను బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం కావడంతో బంతిని బౌండరీ ఇవతలకు వేయడంతో సిక్స్ రాకుండా అడ్డుకున్నాడు. అలా జట్టుకు ఐదు పరుగులు కాపాడిన సాంట్నర్‌ను సహచర ఆటగాళ్లు అభినందించారు. ఇక రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మయాంక్ అగర్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా అక్కడి గడ్డపై 3 టెస్టులు.. 3 వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. చదవండి: Babar Azam: బాబర్ అజమ్ హాఫ్ సెంచరీ .. పాపం ప్రకృతి సహకరించడం లేదు Terrific work by #MitchellSantner, he saved 5 runs for his team. @StarSportsIndia #AskTheExperts @BLACKCAPS #INDvsNZTestSeries #INDvNZ pic.twitter.com/3P9hOot8Nw — Pharmacists kunal Sharma (@KunalJmu) December 3, 2021 -
మరోసారి ‘మూడో కన్ను’ తప్పు చెప్పింది!
మెల్బోర్న్: అంతర్జాతీయ క్రికెట్లో డీఆర్ఎస్ను ప్రవేశపెట్టి చాలా ఏళ్లే అయినా ఇప్పటికీ అందులో లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఫీల్డ్ అంపైర్లకు స్పష్టత లేని సందర్భాల్లో డీఆర్ఎస్ ద్వారా థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించినా నిరాశే మిగులుతుంది. ఇక్కడ థర్డ్ అంపైర్ చేస్తున్న తప్పిదమో, ఆ టెక్నాలజీ మీది పూర్తి అవగాహన లేకపోయిన కారణంగానో తప్పిదాలు జరుగుతున్నాయో అర్థం కాక గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రికెట్లో మూడో కన్నుగా పిలవబడే థర్డ్ అంపైర్ విధానం మరొకసారి వివాదాస్పదమైంది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా డీఆర్ఎస్ వివాదం వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా మిచెల్ సాంత్నార్ ఔట్‌కు సంబంధించి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిచెల్ స్టార్క్ వేసిన ఒక బంతి సాంత్నార్ గ్లౌజ్కున్న మణికట్టు బ్యాండ్‌కు తగిలిపైకి లేచింది. దాన్ని ఆసీస్ ఫీల్డర్ అందుకున్నాడు. అయితే అది ఔట్ కాదంటూ ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ ప్రకటించాడు. దీనిపై డీఆర్ఎస్కు వెళ్లగా అక్కడ కూడా ఆసీస్‌కు చుక్కెదురైంది. థర్డ్ అంపైర్‌గా ఉన్న అలీమ్ దార్.. అది ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబట్టాడు. దాంతో సాంత్నార్ నాటౌట్‌గా బతికిపోయాడు. కాగా, హాట్‌స్పాట్‌లో పదే పదే పర్యవేక్షించగా ఆ బంతి మణికట్టుకున్న బ్యాండ్‌కు తాకింది. దీన్ని సరిగా థర్డ్ అంపైర్ గమనించకపోవడంతో మరోసారి డీఆర్ఎస్ డ్రామా చోటు చేసుకుంది. ఈ విషయంపై ఆస్ట్రేలియా క్రికెటర్లు తీవ్ర నిరాశను వ్యక్తం చేయడమే కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అసలు థర్డ్ అంపైర్ ఒక నిర్ణయాన్ని ప్రకటించలేనప్పుడు ఆ విధానం ఉండి ప్రయోజనం ఏముంటుందని ఆసీస్ బ్యాటింగ్ కోచ్ రికీ పాంటింగ్ మండిపడ్డాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్‌ను సవాల్ చేసినప్పుడు థర్డ్ అంపైర్ అనేవాడు ఎటువంటి అనుమానాలకు తావులేకుండా నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుందని, మరి అటువంటుది తప్పిదం థర్డ్ అంపైర్ చేస్తే ఇక డీఆర్ఎస్కు అర్థం ఏముంటందని ఆసీస్ పేసర్ జేమ్స్ ప్యాటినసన్ లంచ్ బ్రేక్‌లో తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. The third umpire Aleem Dar decided he couldn't overturn the call made by Marais Erasmus - what's your call? #SpecsaversCricket@SpecsaversAU | #AUSvNZ pic.twitter.com/hDWFwtAfu3 — cricket.com.au (@cricketcomau) December 28, 2019 -
ఆ బౌలర్ వేస్ట్.. ఇక టెస్టు ఎలా గెలుస్తారు?
మెల్బోర్న్: తమ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఓడిపోవడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ వా జోస్యం చెప్పాడు. అందుకు కారణాలను కూడా మార్క్ వా వెల్లడించాడు. ప్రధానంగా న్యూజిలాండ్ జట్టు ఒక అనవసరమైన బౌలర్‌ను తుది జట్టులో ఆడిస్తుందని విమర్శించాడు. ఆ బౌలర్ కారణంగా న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌ను చేజార్చుకోవడం ఖాయమన్నాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరంటే.. స్పిన్నర్ మిచెల్ సాంత్నార్. అసలు మిచెల్ సాంత్నార్తో కివీస్‌కు ఒరిగేదేమీ లేదంటూ ఎద్దేవా చేశాడు. ‘ మిచెల్ సాంత్నార్ టెస్టు బౌలర్ కాదు. అతను కేవలం వన్డేలకు మాత్రమే సెట్ అవుతాడు. టెస్టు మ్యాచ్‌లకు సరిపోయే బౌలింగ్ సామర్థ్యం అతనిలో లేదు. నిజంగా సాంత్నార్ మంచి స్నిన్నర్ అయితే కచ్చితత్వం ఉండాలి. మరి అతనిలో అది లేదు. సాంత్నార్ ఎక్కువగా బంతిని స్పిన్ చేయలేడు. (ఇక్కడ చదవండి: దిమ్మ తిరిగే బంతి.. అదిరేటి క్యాచ్!) టెస్టుల్లో బంతి ఎక్కువగా స్పిన్ చేస్తేనే కెట్లు లభిస్తాయి. సాంత్నార్ ఎక్కువగా షార్డ్ బంతుల్ని సంధిస్తున్నాడు. అది పరుగులు చేయడానికి ఈజీ అవుతుంది. స్పిన్‌లో వైవిధ్యమైన బంతులు వేయలేనప్పుడు ఏ బౌలర్ అయినా టెస్టుల్లో అనవసరం. మాతో జరుగుతున్న మ్యాచ్‌లో సాంత్నార్ అవసరం లేదు. ఈ కారణంతోనే న్యూజిలాండ్ మ్యాచ్‌ను కోల్పోవడం ఖాయం. ఆస్ట్రేలియాకు వచ్చే ఏ పర్యాటక జట్టుకైనా వికెట్లు సాధించే స్పిన్నర్లు కావాలి. సిడ్నీలో జరగబోయే తదుపరి టెస్టులో సాంత్నార్‌ను కివీస్ జట్టులో చూడాలనుకోవడం లేదు. ఒక లెగ్ స్పిన్నర్‌ను వేసుకోవడం మంచిది’ అని వా పేర్కొన్నాడు. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 467 పరుగులకు ఆలౌటైంది. నీల్ వాగ్నర్ నాలుగు వికెట్లు సాధించగా, టిమ్ సౌథీ మూడు వికెట్లు తీశాడు. గ్రాండ్ హోమ్‌కు రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ వికెట్ తీశాడు. సాంత్నార్ 20 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చాడు.