
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ అదరగొట్టింది. సమిష్టి ప్రదర్శనను సౌతాఫ్రికా(New Zealand vs South Africa)ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువచ్చింది. తొలుత భారీ స్కోరు చేయడంతో పాటు దానిని కాపాడుకోవడంలోనూ సఫలమై అత్యద్భుత విజయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra- 101 బంతుల్లో 108)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102) శతకాలతో చెలరేగగా.. డారిల్ మిచెల్(37 బంతుల్లో 49), గ్లెన్ ఫిలిప్స్(27 బంతుల్లో 49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టు
ఫలితంగా నిర్ణీత యాభై ఓవర్లలో న్యూజిలాండ్ ఏకంగా 362 పరుగులు సాధించింది. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగులకే చేతులెత్తేసింది.
ఓపెనర్ రియాన్ రెకెల్టన్(17) విఫలం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ టెంబా బవుమా అర్ద శతకం(71 బంతుల్లో 56) చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్ కూడా హాఫ్ సెంచరీ(66 బంతుల్లో 69) రాణించాడు.
మిల్లర్ విధ్వంసం
వీరంతా స్లో ఇన్నింగ్స్ ఆడగా డేవిడ్ మిల్లర్ మాత్రం ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 67 బంతుల్లో పది ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
యాభై పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమిపాలైన ప్రొటిస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. న్యూజిలాండ్- టీమిండియాతో ఫైనల్ ఆడేందుకు అర్హత సాధించింది.
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాపై విజయానంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టును ప్రశంసిస్తూనే భారత్‌తో మ్యాచ్‌కు తాము సంసిద్ధంగానే ఉన్నామనే సంకేతాలు ఇచ్చాడు. ‘‘పటిష్ట జట్టుతో పోటీపడి గెలవడం సంతోషంగా ఉంది. తదుపరి టీమిండియాతో ఆడబోతున్నాం.
రచిన్ , విలియమ్సన్ అద్భుతం
గ్రూప్ దశలోనూ రోహిత్ సేనను మీ ఢీకొట్టాం. అయితే, ఈసారి ఫైనల్ వేరుగా ఉంటుంది. మాకైతే కాస్త విరామం దొరికింది. విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడతాం. ఇక సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర, విలియమ్సన్ ఆడిన తీరు అద్భుతం.
అయితే, ఇక్కడ 320 పరుగుల స్కోరు సరిపోదని మేము భావించాం. కనీసం 350 రన్స్ దాటితేనే మ్యాచ్ మా చేతుల్లో ఉంటుందని భావించాం. రచిన్- విలియమ్సన్ భారీ భాగస్వామ్యం ఇందుకు బాటలు వేసింది.
అదే విధంగా.. మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు వికెట్లు తీయడం కలిసివచ్చింది. అయినా సరే సౌతాఫ్రికా మాకు సవాలు విసిరింది. ఎట్టకేలకు విజయం మాత్రం మమ్మల్నే వరించింది’’ అని సాంట్నర్ పేర్కొన్నాడు.
ఒత్తిడిలోకి నెట్టగలిగాము
ఇక టీమిండియా చేతిలో గత మ్యాచ్‌లో ఓటమి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘దుబాయ్‌లో మేము ఓడిపోయాం. అయితే, అక్కడే మ్యాచ్‌లు ఆడుతున్న వారిని మేము ఒత్తిడిలోకి నెట్టగలిగాము. టాపార్డర్‌ను మా వాళ్లు పడగొట్టారు’’ అంటూ తాము తక్కువేమీ కాదన్నట్లుగా రోహిత్ సేనకు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. కాగా దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్ జరుగుతుంది.
చదవండి: మీరిద్దరు మాట్లాడుకుంటూనే ఉండండి.. నా పని నేను చేస్తా: జడ్డూ అసహనం
South Africa's last man standing! 👊
David Miller is keeping the fight on from one end ⚔#ChampionsTrophyOnJioStar 👉 #SAvNZ | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!
📺📱 Start watching FREE on JioHotstar pic.twitter.com/EkhEIpvEI0— Star Sports (@StarSportsIndia) March 5, 2025
Comments
Please login to add a commentAdd a comment