పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓటమి ముగింట నిలిచింది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ మరోసారి భారత్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన శాంట్నర్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా 5 వికెట్లతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ,సర్ఫరాజ్, గిల్, జైశ్వాల్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బ తీశాడు.
ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సాంట్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌తో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ 5 వికెట్ల హాల్ సాధించిన తొలి కివీ స్పిన్నర్‌గా సాంట్నర్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ న్యూజిలాండ్ స్పిన్నర్ కూడా భారత్‌పై ఈ ఫీట్ నమోదు చేయలేకపోయారు.
ఓవరాల్‌గా ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ 5 వికెట్ల ఘనత సాధించిన రెండో కివీస్ స్పిన్నర్‌గా సాంట్నర్ రికార్డులకెక్కాడు. సాంట్నర్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి రెండు సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆస్ట్రేలియా,బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో వెట్టోరి ఈ ఘనత సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 13 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: విరాట్ కోహ్లి వల్లే ఇదంతా?.. ఫ్యాన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment