పసికూనపై కివీస్‌ ప్రతాపం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ | New Zeland Beat Netherlands By 8 Wickets Clinches Series Victory 2-0 | Sakshi
Sakshi News home page

NED vs NZ: పసికూనపై కివీస్‌ ప్రతాపం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

Published Sat, Aug 6 2022 7:29 AM | Last Updated on Sat, Aug 6 2022 8:07 AM

New Zeland Beat Netherlands By 8 Wickets Clinches Series Victory 2-0 - Sakshi

నెదర్లాండ్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. శుక్రవారం జరిగిన రెండో టి20లో న్యూజిలాండ్‌.. నెదర్లాండ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌, డారిల్‌ మిచెల్‌లు పసికూన జట్టుపై అర్థసెంచరీలతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన నెద్లరాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. బాస్‌ డి లీడే 53 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. టామ్‌ కూపర్‌ 26, స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ 26 పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికి ఆ తర్వాత మిచెల్‌ సాంట్నర్‌(42 బంతుల్లో 77 నాటౌట్‌, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), డారిల్‌ మిచెల్‌(27 బంతుల్లో 51 నాటౌట్‌, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు.

చదవండి: NZ vs NED: కివీస్‌కు ముచ్చెమటలు పట్టించిన డచ్‌ బ్యాటర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement