పరుగు కోసం కోహ్లి- పంత్ (PC: Jio Cinema X)
పుణె టెస్టులో భారత బ్యాటర్ల ఆట తీరుపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ లక్ష్యం ముందున్నా చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రిషభ్ పంత్ రనౌట్ అయిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
తప్పు ఎవరిది?
పంత్ అవుట్ కావడానికి విరాట్ కోహ్లినే కారణమని కొందరు.. పంత్ స్వీయ తప్పిదం వల్లే ఇలా జరిగిందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ప్రేమికులు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కాగా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుపెట్టింది.
ఈ క్రమంలో కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు కట్టడి చేయగలిగిన భారత్.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్.. 255 పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.
అయితే, టార్గెట్ ఛేదనలో టీమిండియా ఆరంభం నుంచే తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులకే నిష్క్రమించగా.. శుబ్‌మన్ గిల్ 23 రన్స్ చేశాడు. ఈ క్రమంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్(77).. విరాట్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ మిచెల్ సాంట్నర్ ఈ జోడీని విడగొట్టాడు. జైస్వాల్‌ను అతడు అవుట్ చేయడంతో.. రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు.
ఈ క్రమంలో కోహ్లితో కలిసి పంత్ భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కిస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే, కోహ్లి- పంత్ తొందరపాటు చర్య వల్ల టీమిండియా భారీ మూల్యమే చెల్లించింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 23వ ఓవర్లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ వేశాడు.
మెరుపు వేగంతో బాల్ విసరడంతో
అప్పటికి క్రీజులో ఉన్న కోహ్లి బంతిని లెఫ్ట్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా గట్టిగా బాదాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బంతిని అందుకున్న ఫీల్డర్ మిచెల్ సాంట్నర్ .. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ వైపు వేగంగా విసిరాడు.
అప్పటికే సింగిల్ కోసం పంత్ నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ముందుకు రాగా.. కోహ్లి కూడా పరుగుకు వెళ్లాడు. అయితే, అంతలోనే సాంట్నర్ మెరుపు వేగంతో బంతిని విసరడం.. బ్లండెల్ వికెట్లకు గిరాటేయడం జరిగిపోయింది.
అప్పటికి పంత్ డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా 245 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 113 పరుగుల భారీ తేడాతో ఓడి కివీస్‌కు సిరీస్‌ను 0-2తో సమర్పించుకుంది.
చదవండి: దంచికొట్టిన యశస్వి జైస్వాల్.. సొంతగడ్డపై అరుదైన రికార్డు
Trust me bro Kohli ran pant out 😭 pic.twitter.com/0qmNYdZhYh
— M. (@IconicKohIi) October 26, 2024
Kohli saw pant is running thn he Ran .. clearly pant' call.. and lazy lazy running from him #INDvsNZ pic.twitter.com/Tv5lJm89Gj
— भाई साहब (@Bhai_saheb) October 26, 2024
Comments
Please login to add a commentAdd a comment