Tom Blundell
-
జడేజా సూపర్ డెలివరీ.. కివీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో కలిపి ఆరు వికెట్లే తీసిన జడ్డూ.. మూడో టెస్టులో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముంబై మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ స్పిన్ బౌలర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు.క్రీజులో పాతుకుపోయిన న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్(71)ను అవుట్ చేసి భారత శిబిరంలో జోష్ నింపిన జడ్డూ.. టామ్ బ్లండెల్(0), గ్లెన్ ఫిలిప్స్(17)ల వికెట్లు కూడా తానే దక్కించుకున్నాడు. అదే విధంగా టెయిలెండర్లు ఇష్ సోధి(7), మ్యాట్ హెన్రీ(0)లను అవుట్ చేసి ఐదు వికెట్ల హాల్‌ను పూర్తి చేసుకున్నాడు.అయితే, వీరందరిలోకెల్లా బ్లండెల్‌ను జడేజా అవుట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. శుక్రవారం నాటి తొలిరోజు ఆటలో భాగంగా కివీస్ ఇన్నింగ్స్‌లో 45వ ఓవర్‌ను జడ్డూ వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతికి విల్ యంగ్‌ను పెవిలియన్‌కు పంపిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. ఐదో బంతిని అద్భుత రీతిలో సంధించాడు.ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్లండెల్ జడేజా సూపర్ డెలివరీకి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో జడ్డూ వేసిన బంతిని బ్యాక్‌ఫుట్‌తో డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించి బ్లండెల్ విఫలమయ్యాడు. రెప్పపాటులో బంతి స్టంప్‌ను ఎగురగొట్టడంతో బిక్కముఖం వేశాడు. నిజానికి బ్లండెల్ స్థానంలో ఏ బ్యాటర్ ఉన్నా ఇలాగే జరిగేది.. జడ్డూ వేసిన బంతి అలాంటిది మరి! ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కివీస్‌తో బెంగళూరు, పుణెలలో జరిగిన టెస్టుల్లో జడ్డూ మూడేసి వికెట్లు తీశాడు. ఇక ఈ రెండు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైన టీమిండియా సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ముంబైలో జరుగుతున్న తాజా టెస్టులో గెలిస్తేనే క్లీన్‌స్వీప్ పరాభవం నుంచి తప్పించుకోవడంతో పాటు.. రోహిత్ సేనకు డబ్ల్యూటీసీ ఫైనల్ లైన్ ఈజీగా క్లియర్ అవుతుంది.ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు కట్టడి చేసింది. తొలిరోజే న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జడేజాకు ఐదు, వాషింగ్టన్ సుందర్‌కు నాలుగు వికెట్లు దక్కగా.. పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే, బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ(18), యశస్వి జైస్వాల్(30) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరగా.. నాలుగో స్థానంలో వచ్చిన పేసర్ మహ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లి(4) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 19 ఓవర్లలో 86 పరుగులు చేసిన టీమిండియా.. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.చదవండి: IND A vs AUS A: సెంచరీకి చేరువైన సాయి సుదర్శన్Jadeja stuns the Kiwis with a double strike 💥 Catch LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Gyy3vZgTz2— JioCinema (@JioCinema) November 1, 2024 -
విరాట్ కోహ్లి వల్లే ఇదంతా?.. ఫ్యాన్స్ ఫైర్
పుణె టెస్టులో భారత బ్యాటర్ల ఆట తీరుపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ లక్ష్యం ముందున్నా చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రిషభ్ పంత్ రనౌట్ అయిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.తప్పు ఎవరిది? పంత్ అవుట్ కావడానికి విరాట్ కోహ్లినే కారణమని కొందరు.. పంత్ స్వీయ తప్పిదం వల్లే ఇలా జరిగిందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ప్రేమికులు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కాగా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుపెట్టింది.ఈ క్రమంలో కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు కట్టడి చేయగలిగిన భారత్.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్.. 255 పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.అయితే, టార్గెట్ ఛేదనలో టీమిండియా ఆరంభం నుంచే తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులకే నిష్క్రమించగా.. శుబ్‌మన్ గిల్ 23 రన్స్ చేశాడు. ఈ క్రమంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్(77).. విరాట్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ మిచెల్ సాంట్నర్ ఈ జోడీని విడగొట్టాడు. జైస్వాల్‌ను అతడు అవుట్ చేయడంతో.. రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు.ఈ క్రమంలో కోహ్లితో కలిసి పంత్ భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కిస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే, కోహ్లి- పంత్ తొందరపాటు చర్య వల్ల టీమిండియా భారీ మూల్యమే చెల్లించింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 23వ ఓవర్లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ వేశాడు.మెరుపు వేగంతో బాల్ విసరడంతోఅప్పటికి క్రీజులో ఉన్న కోహ్లి బంతిని లెఫ్ట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా గట్టిగా బాదాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బంతిని అందుకున్న ఫీల్డర్ మిచెల్ సాంట్నర్ .. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ వైపు వేగంగా విసిరాడు. అప్పటికే సింగిల్ కోసం పంత్ నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ముందుకు రాగా.. కోహ్లి కూడా పరుగుకు వెళ్లాడు. అయితే, అంతలోనే సాంట్నర్ మెరుపు వేగంతో బంతిని విసరడం.. బ్లండెల్ వికెట్లకు గిరాటేయడం జరిగిపోయింది.అప్పటికి పంత్ డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా 245 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 113 పరుగుల భారీ తేడాతో ఓడి కివీస్‌కు సిరీస్‌ను 0-2తో సమర్పించుకుంది.చదవండి: దంచికొట్టిన యశస్వి జైస్వాల్.. సొంతగడ్డపై అరుదైన రికార్డుTrust me bro Kohli ran pant out 😭 pic.twitter.com/0qmNYdZhYh— M. (@IconicKohIi) October 26, 2024Kohli saw pant is running thn he Ran .. clearly pant' call.. and lazy lazy running from him #INDvsNZ pic.twitter.com/Tv5lJm89Gj— भाई साहब (@Bhai_saheb) October 26, 2024 -
చెలరేగిన ఆండర్సన్, జాక్ లీచ్.. కష్టాల్లో కూరుకుపోయిన కివీస్
New Zealand vs England, 2nd Test- Day 2 Highlights: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు అద్భుత ఆట తీరు కనబరుస్తున్నారు. రెండో రోజు ఆటలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ స్పిన్నర్ జాక్ లీచ్ కివీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు. కీలక వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టుకు కోలుకోలేని షాకిచ్చారు. ఆండర్సన్, జాక్ లీచ్ విజృంభణతో శనివారం నాటి ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 297 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. భారీ ఆధిక్యంలో.. రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా మౌంట్మాంగనీయ్లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ 267 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో వెల్లింగ్టన్లో శుక్రవారం(ఫిబ్రవరి 24) మొదలైన రెండో టెస్టులోనూ స్టోక్స్ బృందం ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ 65 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (169 బంతుల్లో 184 బ్యాటింగ్; 24 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగి సెంచరీ సాధించగా... జో రూట్ (182 బంతుల్లో 100 బ్యాటింగ్; 7 ఫోర్లు) కెరీర్లో 29వ సెంచరీ చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 294 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వర్షం కారణంగా తొలి రోజు ఆటను 65 ఓవర్ల వద్ద ముగించారు. బ్రూక్, రూట్ సెంచరీలతో చెలరేగి అంతకుముందు ఇంగ్లండ్ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా బ్రూక్, రూట్ సెంచరీలతో ఆదుకున్నారు. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో రూట్ 153 పరుగులతో అజేయంగా నిలవగా.. హ్యారీ బ్రూక్ తన స్కోరుకు మరో రెండు పరుగులు(186) జతచేసి అవుటయ్యాడు. మిగిలిన వాళ్లు పెద్దగా రాణించకపోవడంతో 87.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద పర్యాటక ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. చెలరేగిన ఆండర్సన్, జాక్ లీచ్ డెవాన్ కాన్వేను జేమ్స్ ఆండర్సన్ తొలి వికెట్ అందించగా.. మరో ఓపెనర్ టామ్ లాథమ్ వికెట్‌ను జాక్ లీచ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విలియమ్సన్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరగగా.. 2 పరుగులకే విల్ యంగ్‌ను ఆండర్సన్ పెవిలియన్‌కు పంపాడు. వరణుడి ఆటంకం హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్ వికెట్లను జాక్ లీచ్ పడగొట్టాడు. మిచెల్ బ్రాస్‌వెల్ రూపంలో స్టువర్ట్ బ్రాడ్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక వర్షం మరోసారి ఆటంకం కలిగించడంతో రెండో రోజు టీ బ్రేక్ సమయానికే ఆట ముగించాల్సి వచ్చింది. అప్పటికి కివీస్ 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ కంటే 297 పరుగులు వెనుకబడింది సౌథీ బృందం. గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ 25, కెప్టెన్ టిమ్ సౌథీ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా తొలి టెస్టులో ఏడు వికెట్లు తీసిన ఆండర్సన్ ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: ఏదో ఒకటి చేయండి.. లేదంటే పోటుగాళ్లు కాదు.. పొట్లం అయిపోతారు! WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! -
NZ Vs Eng: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో
New Zealand vs England, 1st Test- Tom Blundell: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. 181 బంతులు ఎదుర్కొన్న అతడు 138(19 ఫోర్లు, ఒక సిక్సర్) పరుగులు చేశాడు. ఓపెనింగ్ బ్యాటర్ డెవాన్ కాన్వే(77)తో కలిసి రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. కాన్వే అర్ధ శతకం, బ్లండెల్ శతకం కారణంగా ఆతిథ్య కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేసి ఇంగ్లండ్(తొలి ఇన్నింగ్స్ 325-9 డిక్లేర్డ్)కు దీటైన జవాబు ఇవ్వగలిగింది. ఇదిలా ఉంటే.. సెంచరీ హీరో టామ్ బ్లండెల్ ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా చరిత్ర సృష్టించాడు. బ్లండెల్ ప్రపంచ రికార్డు డే- నైట్ టెస్టులో శతకం సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పింక్‌బాల్ టెస్టులో సెంచరీతో మెరిసి ఈ ఘనత సాధించాడు. కాగా 2015 నుంచి డే- నైట్ టెస్టులు మొదలుకాగా న్యూజిలాండ్- ఇంగ్లండ్ మ్యాచ్ కంటే ముందు 20 మ్యాచ్‌లు జరిగాయి. అయితే, వీటిలో ఏ ఒక్క వికెట్ కీపర్ బ్యాటర్ కూడా శతకం సాధించలేకపోయాడు. ఆ అరుదైన ఘనత బ్లండెల్‌కే సాధ్యమైంది. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షపెట్టిన టామ్ బ్లండెల్.. కివీస్ 306 పరుగుల మేర స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక తన పేరిట ప్రపంచ రికార్డు లిఖించి సత్తా చాటాడు. చదవండి: Anderson- Stuart Broad: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో.. Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?! Tom Blundell (138) leads the batting effort with his highest Test score. Blundell and Tickner share a 59-run partnership for the 10th wicket, pushing the total 306. Time to bowl at Bay Oval! Follow play LIVE in NZ with @sparknzsport & @todayfm_nz 📲 #NZvENG pic.twitter.com/QO4XENUfSt — BLACKCAPS (@BLACKCAPS) February 17, 2023 -
సెంచరీతో మెరిసిన బ్లండెల్.. ఇంగ్లండ్‌కు దీటైన జవాబు.. కానీ అంతలోనే
New Zealand vs England, 1st Test: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్ 306 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (77)కు తోడు.. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్(138) సెంచరీతో రాణించడంతో ఈ మేరకు స్కోరు చేసింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 306 పరుగుల(82.5 ఓవర్లలో) వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇంగ్లండ్ బౌలర్లలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 3 వికెట్లు తీయగా.. రాబిన్సన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వాళ్లలో స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, కెప్టెన్ స్టోక్స్‌కు ఒక్కో వికెట్ దక్కింది. కాగా గత కొంతకాలంగా దూకుడైన ఆటతో టెస్టు క్రికెట్‌కు కొత్త పాఠాలు చెబుతున్న ఇంగ్లండ్ మరోసారి అదే తరహా ఆటతీరును ప్రదర్శిస్తోంది. వికెట్లు కోల్పోయే అవకాశం ఉన్నా.. న్యూజిలాండ్‌తో గురువారం మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. కేవలం 58.2 ఓవర్లు మాత్రమే ఆడిన ఆ జట్టు ఏకంగా ఓవర్‌కు 5.57 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. వికెట్లు కోల్పోయే అవకాశం ఉన్నా... ఓపిగ్గా క్రీజ్‌లో నిలబడే ప్రయత్నం చేయకుండా ఇంగ్లండ్ బ్యాటర్లంతా ధాటిని కొనసాగించారు. హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 89; 15 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ (68 బంతుల్లో 84; 14 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, ఒలి పోప్ (42), బెన్ ఫోక్స్ (38) రాణించారు. కాన్వే, బ్లండెల్ వల్లే.. నీల్ వాగ్నర్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో కాన్వే, బ్లండెల్ బ్యాట్ ఝులిపించడంతో ఆతిథ్య కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేయగలిగింది. మరోసారి అదే దూకుడు ఈ క్రమంలో 19 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. స్వల్ప ఆధిక్యమే అయినా ఇంగ్లండ్ దూకుడుకు మాత్రం కళ్లెం పడలేదు. 9 ఓవర్లలోనే 50 పరుగులు స్కోరు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలే 27 (29), బెన్ డకెట్23 (25) దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే, 9.2 వద్ద టిక్నర్ డకెట్‌ను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా మౌంట్ మౌంగనీయ్, వెల్టింగ్టన్ ఈ సిరీస్‌కు వేదికలుగా మారాయి. చదవండి: Anderson- Stuart Broad: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో.. IND Vs AUS: పాపం వార్నర్.. మళ్లీ షమీ చేతిలోనే! వీడియో వైరల్ Tom Blundell (138) leads the batting effort with his highest Test score. Blundell and Tickner share a 59-run partnership for the 10th wicket, pushing the total 306. Time to bowl at Bay Oval! Follow play LIVE in NZ with @sparknzsport & @todayfm_nz 📲 #NZvENG pic.twitter.com/QO4XENUfSt — BLACKCAPS (@BLACKCAPS) February 17, 2023 -
కివీస్‌తో పాక్ మ్యాచ్.. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
Pakistan vs New Zealand, 1st Test: టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. వరల్డ్ టెస్టు చాంపియన్సషిప్ 2021-23 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో కరాచీ వేదికగా సోమవారం(డిసెంబరు 26) ఆరంభమైన తొలి మ్యాచ్ సందర్భంగా ప్రపంచ రికార్డు నమోదైంది. టాస్ గెలిచిన ఆతిథ్య పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌతీ.. బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. ఈ క్రమంలో నాలుగో ఓవర్లో బంతిని అజాజ్ పటేల్ చేతికి ఇవ్వగా.. స్పిన్‌తో తిప్పేశాడు. ఈ బాల్‌ను అంచనా వేయడంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(7) విఫలం కాగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండల్ అతడిని స్టంపౌట్ చేశాడు. 145 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇక ఏడో ఓవర్ మొదటి బంతికి బ్రాస్‌వెల్ బౌలింగ్‌లోనూ వన్‌డౌన్ బ్యాటర్ షాన్ మసూద్(3)ను ఇదే రీతిలో బ్లండల్ స్టంపౌట్ చేశాడు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు నమోదైంది. 145 ఏళ్ల పురుషుల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా తొలి రెండు వికెట్లు స్టంపౌట్ ద్వారా లభించడం ఇదే మొదటిసారి కాగా.. ఓవరాల్‌గా రెండోసారి. గతంలో.. 1976లో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జమైకాలో జరిగిన టెస్టులో తొలిసారి ఈ ఫీట్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ మారీ కార్నిష్ నాలుగు వికెట్లు(టూయీస్ బ్రౌనీ, జాస్మిన్ సామీ, గ్లోరియా గిల్) తీయగా.. అందులో మూడు స్టంపౌట్లే ఉండటం విశేషం. చదవండి: Ind Vs Ban: ఆ క్యాచ్ పడితే నీ ఆట ముగిసేది.. భారత్ 89కే ఆలౌట్ అయ్యేది! దిమ్మతిరిగేలా అశ్విన్ కౌంటర్ Mohammad Rizwan: వైస్ కెప్టెన్‌పై వేటు! 4 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలి మ్యాచ్.. ఆఫ్రిదిపై విమర్శలు Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు