NZ Vs Eng 1st Test 2023: Tom Blundell century Creates World Record - Sakshi
Sakshi News home page

Tom Blundell: కివీస్‌ బ్యాటర్‌ టామ్‌ బ్లండెల్‌ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!

Published Fri, Feb 17 2023 1:58 PM | Last Updated on Fri, Feb 17 2023 2:45 PM

NZ Vs Eng 1st Test 2023: Tom Blundell Century Creates World Record - Sakshi

టామ్‌ బ్లండెల్‌ (PC: Blackcaps)

New Zealand vs England, 1st Test- Tom Blundell: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ టామ్‌ బ్లండెల్‌ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. 181 బంతులు ఎదుర్కొన్న అతడు 138(19 ఫోర్లు, ఒక సిక్సర్‌) పరుగులు చేశాడు. ఓపెనింగ్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే(77)తో కలిసి రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు.

కాన్వే అర్ధ శతకం, బ్లండెల్‌ శతకం కారణంగా ఆతిథ్య కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేసి ఇంగ్లండ్‌(తొలి ఇన్నింగ్స్‌ 325-9 డిక్లేర్డ్‌)కు దీటైన జవాబు ఇవ్వగలిగింది. ఇదిలా ఉంటే.. సెంచరీ హీరో టామ్‌ బ్లండెల్‌ ఈ అద్భుత ఇన్నింగ్స్‌ ద్వారా చరిత్ర సృష్టించాడు.

బ్లండెల్‌ ప్రపంచ రికార్డు
డే- నైట్‌ టెస్టులో శతకం సాధించిన తొలి వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పింక్‌బాల్‌ టెస్టులో సెంచరీతో మెరిసి ఈ ఘనత సాధించాడు. కాగా 2015 నుంచి డే- నైట్‌ టెస్టులు మొదలుకాగా న్యూజిలాండ్‌- ఇంగ్లండ్‌ మ్యాచ్‌ కంటే ముందు 20 మ్యాచ్‌లు జరిగాయి.

అయితే, వీటిలో ఏ ఒక్క వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కూడా శతకం సాధించలేకపోయాడు. ఆ అరుదైన ఘనత బ్లండెల్‌కే సాధ్యమైంది. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్‌ చేస్తూ ఇంగ్లండ్‌ బౌలర్ల సహనానికి పరీక్షపెట్టిన టామ్‌ బ్లండెల్‌.. కివీస్‌ 306 పరుగుల మేర స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక తన పేరిట ప్రపంచ రికార్డు లిఖించి సత్తా చాటాడు.

చదవండి: Anderson- Stuart Broad: ఆండర్సన్‌- స్టువర్ట్‌ బ్రాడ్‌ సంచలనం.. 1000 వికెట్లతో..
Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement