pink ball test
-
చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
అడిలైడ్ వేదికగా భారత్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ది కీలక పాత్ర. మరోసారి భారత్‌పై హెడ్ సత్తాచాటాడు. ఈ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. తన మెరుపు శతకంతో మ్యాచ్‌ను కంగారూల వైపు తిప్పాడు. భారత బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 111 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 141 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్.. 4 సిక్స్‌లు, 17 బౌండరీలతో 140 పరుగులు చేశాడు. తన అద్బుత ప్రదర్శనకు గాను హెడ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ట్రావిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. 👉టీమిండియాపై పింక్, రెడ్, వైట్ బంతులతో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా హెడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరికి సాధ్యం కాలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్-2023లో భారత్‌పై తొలి రెడ్ బాల్ సెంచరీని హెడ్ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో హెడ్ 163 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో(వైట్‌బాల్) భారత్‌పై హెడ్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. 137 పరుగులు చేసి తమ జట్టును ఆరోసారి వన్డే వరల్డ్‌కప్‌ను అందించాడు. ఇప్పుడు పింక్‌బాల్‌తో జరిగిన టెస్టులో కూడా తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే టీ20ల్లో మాత్రం భారత్‌పై హెడ్ సెంచరీ చేయలేదు.👉అదే విధంగా డే అండ్ నైట్ టెస్ట్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన హెడ్.. తన రికార్డును తనే బద్దులు కొట్టాడు. 2022లో ఇంగ్లండ్‌తో హోబర్ట్ వేదికగా జరిగిన పింక్ బాల్ మ్యాచ్‌లో 112 బంతుల్లో శతకం సాధించాడు. -
అదే మా కొంపముంచింది.. వారు మాకంటే మెర్గుగా ఆడారు: రోహిత్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు పర్వాలేదన్పించినా.. బ్యాటర్లు మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారత బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైన టీమిండియా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆతిథ్య ఆసీస్ ముందు కేవలం 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే భారత్ ఉంచింది.ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఊదిపడేసింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బ్యాటింగ్ పరంగా తాము పూర్తిగా నిరాశపరిచామని హిట్‌మ్యాన్ తెలిపాడు. కాగా రెండు ఇన్నింగ్స్‌లలోనూ రోహిత్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు."మాకు ఈ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌లో మేము బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాము. ఆస్ట్రేలియా మా కంటే మెరుగ్గా ఆడింది. గెలిచేందుకు వారు అన్ని రకాలగా అర్హులే. ఈ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు మాకు కొన్ని అవకాశాలు లభించాయి.కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యాము. పెర్త్‌లో మా జట్టు అద్బుతమైన ప్రదర్శన చేసింది. అదే జోరును అడిలైడ్‌లోనూ కొనసాగించాలనుకున్నాము. కానీ ప్రతీ టెస్ట్ మ్యాచ్ ఓ సవాల్ లాంటింది. పింక్ బాల్‌తో ఆడటం అంత సులువు కాదని మాకు ముందే తెలుసు. ఆస్ట్రేలియా మాత్రం పింక్ బాల్‌తో అద్భుతంగా ఆడింది. ఇక మా దృష్టి అంతా గబ్బా టెస్టు పైనే. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తాము. ఆ మ్యాచ్‌కు పెద్దగా సమయం కూడా లేదు. మేము వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లి పెర్త్‌లో మాప్రదర్శనపై చర్చించుకుంటాము.అదే విధంగా గతంలో గబ్బాలో మా విజయాలను కూడా గుర్తు చేసుకుంటాము. ఇక్కడ మాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.చదవండి: WTC 2025: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే? -
IND vs AUS 2nd Test: అడిలైడ్ టెస్టులో టీమిండియా చిత్తు..
IND vs AUS 2nd Test 3rd Day Live updates: అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది.టీమిండియా ఓటమి..అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 19 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని ఆసీస్ వికెట్ నష్టపోకుండా చేధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో ఆసీస్ సమం చేసింది. 175 పరుగులకు భారత్ ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 175 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్ ముందు 19 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది. భారత బ్యాటర్లలో నితీశ్ కుమార్(42) పరుగులతో మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 5 వికెట్లతో సత్తాచాటగా.. బోలాండ్ 3, స్టార్క్ రెండు వికెట్లు సాధించారు.తొమ్మిదో వికెట్ డౌన్..భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 42 పరుగుల చేసిన నితీశ్ రెడ్డి.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ ప్రస్తుతం 9 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.35 ఓవర్లకు టీమిండియా స్కోర్: 160/835 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 3 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఆరో వికెట్ డౌన్.. రిషబ్ పంత్ ఔట్మూడో రోజు ఆట ఆరంభంలోనే భారత్‌కు భారీ షాక్ తగిలింది. 28 పరుగులు చేసిన రిషబ్ పంత్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు.మూడో రోజు ఆట ప్రారంభం..అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(28), నితీశ్ కుమార్ రెడ్డి(15) ఉన్నారు. భారత్ ఇంకా 29 పరుగులు వెనకబడి ఉంది. -
కోహ్లి మరోసారి విఫలం.. కష్టాల్లో టీమిండియా! అద్భుతం జరిగితేనే..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీ కొట్టి మురిపించిన ఈ రన్‌మెషీన్.. అడిలైడ్‌లో మాత్రం తేలిపోయాడు. పింక్ బాల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులకే నిష్క్రమించాడు.అజేయ శతకంతో అలరించిఈ నేపథ్యంలో కోహ్లి నిలకడలేమి ఫామ్‌పై మరోసారి విమర్శలు వస్తున్నాయి. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టు.. పెర్త్ టెస్టులో గెలిచి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకం బాదాడు కోహ్లి.యువ ఆటగాళ్ల కంటే కూడా దారుణంగాటెస్టుల్లో ముప్పైవ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ పరుగుల యంత్రం అడిలైడ్‌లోనూ రాణిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌లో యువ ఆటగాళ్ల కంటే కూడా కోహ్లి ఘోరంగా వైఫల్యం చెందాడు. ఈ క్రమంలో 180 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడుతోంది.కనీసం ఇప్పుడైనా కోహ్లి ఆదుకుంటాడేమోనని భావిస్తే ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. నిజానికి అడిలైడ్‌లో ఆరంభం నుంచి కోహ్లి కాస్త జాగ్రత్తగానే ఆడాడు. చీకట్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్‌ను ఎదుర్కొనే క్రమంలో.. అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతులను కోహ్లి వదిలేశాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్లో ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ వేసిన బంతిని బౌండరీకి తరలించి.. టచ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు.కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగిన కోహ్లిఅయితే, బోలాండ్ చేతికే కోహ్లి చిక్కడం గమనార్హం. పదిహేనవ ఓవర్ మూడో బంతి ఆఫ్ స్టంప్ దిశగా రాగా.. షాట్ ఆడేందుకు ప్రయత్నించి కోహ్లి విఫలమయ్యాడు. బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడటంతో కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తంగా 21 బంతులు ఎదుర్కొని 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి పెవిలియన్ చేరాడు.కష్టాల్లో టీమిండియాఇక శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(24) ఫర్వాలేదనిపించగా.. కేఎల్ రాహుల్(7) విఫలమయ్యాడు. శుబ్‌మన్ గిల్(28) రాణించగా.. కోహ్లి(11), రోహిత్ శర్మ(6) నిరాశపరిచారు. ఆట ముగిసే సరికి రిషభ్ పంత్ 28, నితీశ్ కుమార్ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ కంటే(తొలి ఇన్నింగ్స్) టీమిండియా ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు ఏదైనా అద్భుతం జరిగితేనే టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంటుంది. లేదంటే.. ఘోర పరాభవం తప్పదు. ఇక రెండో రోజు ఆటలో ఆసీస్ పేసర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టువేదిక: అడిలైడ్ ఓవల్ మైదానం, అడిలైడ్- పింక్ బాల్ టెస్టు- డే అండ్ నైట్ మ్యాచ్టాస్: టీమిండియా.. బ్యాటింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 180ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 337రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 128/5 (24).చదవండి: అద్భుత యార్కర్‌తో సెంచరీ వీరుడికి చెక్!.. సిరాజ్ ఉగ్రరూపం చూశారా? -
IND vs AUS 2nd Test: ముగిసిన తొలి రోజు ఆట.. పైచేయి సాధించిన ఆసీస్
ముగిసిన తొలి రోజు ఆట.. పైచేయి సాధించిన ఆసీస్భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (13) ఔట్ కాగా.. మెక్‌స్వీని (38), లబుషేన్ (20) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 94 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బేశాడు. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు. కాగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్న మెక్‌స్వీని, లబుషేన్మెక్స్వీని (38), లబుషేన్ (19) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. వీరిద్దరు రెండో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. టీమిండియా పదేపదే బౌలర్లను మారుస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. 31 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 85/1గా ఉంది. 13 పరుగులు చేసి ఉస్మాన్ ఖ్వాజా ఔటయ్యాడు. ఈ వికెట్ బుమ్రాకు దక్కింది. ఆసీస్.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 95 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది.తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా24 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా భారత్‌కు తొలి బ్రేక్ అందించాడు. బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఫస్ట్ స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో ఉస్మాన్ ఖ్వాజా (13) పెవిలియన్ బాట పట్టాడు. మెక్‌స్వీనికి (6) జతగా లబూషేన్ క్రీజ్‌లోకి వచ్చాడు. 180 పరుగులకు భారత్ ఆలౌట్పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ దాటికి భారత్ కేవలం 180 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ 6 వికెట్లతో టీమిండియాను దెబ్బతీశాడు.అతడితో పాటు పాట్ కమ్మిన్స్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భారత బ్యాటర్లలో నితీశ్ రెడ్డి(42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నితీశ్ ఫైటింగ్ నాక్ఆసీస్ బౌలర్లపై టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎదురుదాడికి దిగాడు. నితీశ్ మెరుపులు మెరిపిస్తున్నాడు. నితీశ్ 42 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 42 ఓవర్లకు భారత్ స్కోర్: 175/8టీమిండియా ఎనిమిదో వికెట్ డౌన్..తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 141 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఏడో వికెట్‌గా రవిచంద్రన్ అశ్విన్(22), ఎనిమిదో వికెట్‌గా హర్షిత్ రాణా(0) వెనుదిరిగాడు.టీమిండియా ఆరో వికెట్ డౌన్.. టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన రిషబ్ పంత్.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 35 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో నితీశ్ రెడ్డి(11), అశ్విన్(1) పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ డౌన్.. రోహిత్ శర్మ ఔట్టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రోహిత్.. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 28 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(10), నితీశ్ రెడ్డి(0) ఉన్నారు.ట్రీ బేక్కు భారత్ స్కోరంతంటే?అడిలైడ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆసీస్ పేసర్లు నిప్పలు చెరుగుతున్నారు. తొలి రోజు టీ విరామానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(4), రోహిత్ శర్మ(1) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ఇప్పటివరకు మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. బోలాండ్ ఒక్క వికెట్ సాధించారు.టీమిండియా నాలుగో వికెట్ డౌన్.. టీమిండియా కేవలం 4 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. నాలుగో వికెట్‌గా శుబ్‌మన్ గిల్ వెనుదిరిగాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు గిల్ దొరికిపోయాడు. క్రీజులోకి రోహిత్ శర్మ వచ్చాడు.భారత్ మూడో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్పింక్బాల్ టెస్టులో విరాట్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 21 ఓవర్లకు భారత్ స్కోర్: 81/3. క్రీజులో గిల్(31), రిషబ్ పంత్(4) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్..కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రాహుల్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు.15 ఓవర్లకు భారత్ స్కోర్: 53/1కేఎల్ రాహుల్(26 నాటౌట్), శుబ్‌మన్ గిల్(25) నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 53/1కేఎల్ రాహుల్ లక్కీ..కేఎల్ రాహుల్‌కు ఆదృష్టం కలిసొచ్చింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు రాహుల్ క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నో బాల్ కావడంతో రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా రిప్లేలో కూడా బంతి బ్యాట్‌కు తాకనట్లు తేలింది. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 30/16 ఓవర్లకు భారత్ స్కోర్: 15/1ఆరు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(14), కేఎల్ రాహుల్(0) ఉన్నారు. తొలి టెస్టుకు దూరమైన గిల్ పింక్ బాల్ టెస్టులో మాత్రం మంచి టచ్‌లో కన్పిస్తున్నాడు.తొలి వికెట్ డౌన్..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలి బంతికే ఔటయ్యాడు. మిచిల్ స్టార్క్ ఎల్బీ రూపంలో జైశ్వాల్‌ను పెవిలియన్‌కు పంపాడు.టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు ఆడిలైడ్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చారు. వీరి ముగ్గురి రాకతో దేవ్‌దత్త్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కే పరిమితమయ్యారు. మరోవైపు ఆస్ట్రేలియా ఒకే ఒక మార్పుతో ఆడుతోంది. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), నితీష్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
ఆసీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా ఓపెనర్లుగా వారే: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ‘పింక్ బాల్’ టెస్టులో భారత ఓపెనింగ్ జోడీపై స్పష్టతనిచ్చాడు. యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.ఇక.. తాను మిడిలార్డర్లో బరిలోకి దిగుతానని చెప్పిన రోహిత్ శర్మ.. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. తనకు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమేనని.. అయినా జట్టు కోసం ఓపెనింగ్ స్థానం త్యాగం చేయక తప్పలేదని పేర్కొన్నాడు.పితృత్వ సెలవులుకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. తన భార్య రితికా సజ్దే కుమారుడు అహాన్‌కు జన్మనివ్వడంతో పితృత్వ సెలవులు తీసుకున్నాడు. అయితే, మొదటి టెస్టు మధ్యలోనే ముంబై నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు హిట్‌మ్యాన్.జైస్వాల్‌తో కలిసి రాణించిన రాహుల్ఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులో రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించగా.. యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం(161) బాదాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్(26, 77) సైతం మెరుగ్గా రాణించాడు.అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనింగ్ జోడీని మారుస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. రాహుల్‌ను మిడిలార్డర్‌లోకి పంపి రోహిత్ ఓపెనర్‌గా వస్తాడేమోనని అంతా భావించారు. అయితే, తానే మిడిలార్డర్లో వస్తానని రోహిత్ శర్మ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. పింక్ బాల్తోకాగా అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టు డే అండ్ నైట్ మ్యాచ్. దీనిని పింక్ బాల్‌తో నిర్వహిస్తారు. ఇక ఇందుకోసం రోహిత్ సేన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో మిడిలార్డర్లో వచ్చిన రోహిత్ శర్మ(3) విఫలం కాగా.. ఓపెనర్లు జైస్వాల్ 45, రాహుల్ 27(రిటైర్డ్ హర్ట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
‘పింక్ బాల్’తో అంత ఈజీ కాదు.. నాకిదే ‘తొలి’ టెస్టు: టీమిండియా స్టార్ బ్యాటర్
‘పింక్ బాల్’తో మ్యాచ్ అంత ఈజీ కాదంటున్నాడు టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్. క్రీజులోకి వెళ్లిన తర్వాతే దాని సంగతేమిటో పూర్తిగా అర్థమవుతుందని పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడనుంది. అయితే, ప్రస్తుతం భారత జట్టులో ఎనిమిది మందికి మాత్రమే డే అండ్ నైట్(పింక్ బాల్) టెస్టు ఆడిన అనుభవం ఉంది. అందులోనూ విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఆస్ట్రేలియా గడ్డపై పింక్ బాల్‌తో ఆడారు.ఇక కేఎల్ రాహుల్‌కు ఇదే తొలి ‘పింక్ బాల్ టెస్టు’ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎర్ర బంతికి, గులాబీ మధ్య తేడా తనకు స్పష్టంగా కనిపిస్తోందని... డే అండ్ నైట్ టెస్టులో ‘పింక్ బాల్’ను ఎదుర్కోవడం అంత సులువు కాదని రాహుల్ వ్యాఖ్యానించాడు. నాకు ఇది కొత్త అనుభవం‘బౌలర్ చేతినుంచి బంతి విడుదలయ్యే సమయంలో దానిని గుర్తించడం కష్టంగా ఉంది. ఎర్ర బంతితో పోలిస్తే చాలా గట్టిగా ఉండటంతో పాటు వేగంగా కూడా దూసుకొస్తోంది. ఫీల్డింగ్‌లో క్యాచ్ పట్టే సమయంలో కూడా తేడా స్పష్టంగా కనిపిస్తోంది. స్వింగ్ కూడా భిన్నంగా అవుతోంది కాబట్టి అదే మాకు పెద్ద సవాల్ కానుంది. నాకు ఇది కొత్త అనుభవం. క్రీజ్‌లోకి వెళ్లాకే దాని సంగతేమిటో చూస్తాను. ఎలాంటి స్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రాహుల్ చెప్పాడు.అయితే ప్రాక్టీస్ ద్వారా అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నామని కేఎల్ రాహుల్ అన్నాడు. ‘గులాబీ బంతి ఎలా స్పందిస్తోందో, ఆడటం ఎంత కష్టమో తెలుసుకునేందుకే మాకు కొంత సమయం పట్టింది. బౌలర్ చేతి నుంచి వచ్చే బంతిని గుర్తించడమే తొలి అడుగు. అప్పుడే సరైన షాట్ ఆడేందుకు తగిన అవకాశం ఉంటుంది. అందుకే మేమంతా ఎక్కువ బంతులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించాం’ అని రాహుల్ వెల్లడించాడు. కాగా రెండో టెస్టు కోసం సన్నద్ధమయ్యే క్రమంలో భారత జట్టు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత పింక్ బాల్ టెస్టుకు వేదికైన అడిలైడ్ చేరుకున్న టీమ్ రెండు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది.ఓపెనర్‌గా ఆడిస్తారా?ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అయితే రెండో టెస్టు కోసం రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో అతని ఓపెనింగ్ స్థానంపై సందిగ్ధత నెలకొంది. అతను ఓపెనర్‌గా కొనసాగాలా లేక మిడిలార్డర్లో ఆడాలా అనేదానిపై చర్చ మొదలైంది. దీనిపై రాహుల్ స్పందించాడు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ అంశంపై అతడు మాట్లాడాడు. ‘అడిలైడ్ టెస్టులో నా బ్యాటింగ్ స్థానం ఏమిటనేది నాకు ఇప్పటికే చెప్పేశారు. అయితే మ్యాచ్ జరిగే వరకు దాని గురించి మాట్లాడవద్దని కూడా చెప్పారు. నేను దేనికైనా సిద్ధమే. ఏ స్థానమైనా తుది జట్టులో ఉండటమే నాకు అన్నింటికంటే ముఖ్యం. అవకాశం రాగానే బరిలోకి దిగి జట్టు కోసం ఆడటమే ప్రధానం. నేను వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను.ఆరంభంలో తొలి 20–25 బంతులు కొంత ఇబ్బందిగా అనేపించేవి. డిఫెన్స్ ఆడాలా లేక అటాక్ చేయాలనే అని సందేహ పడేవాడిని. అయితే ఇన్నేళ్ల అనుభవం తర్వాత నా ఇన్నింగ్స్‌ను ఎలా నడిపించాలో స్పష్టత వచి్చంది. తొలి 30–40 బంతులు సమర్థంగా ఎదుర్కోగలిగితే అది ఓపెనింగ్ అయినా మిడిలార్డర్ అయినా అంతా ఒకేలా అనిపిస్తుంది. దానిపైనే నేను దృష్టి పెడతా’ అని రాహుల్ వెల్లడించాడు. ముందే చెప్పారుఇక టెస్టు సిరీస్‌లో ఓపెనింగ్ చేయాల్సి రావచ్చని తనకు ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందే టీమ్ మేనేజ్మెంట్ చెప్పిందని... అందుకే అన్ని రకాలుగా సన్నద్ధమయ్యానని రాహుల్ చెప్పాడు. సరిగ్గా పదేళ్ల క్రితం రాహుల్ ఇదే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ పదేళ్ల కెరీర్లో అతను 54 టెస్టులు ఆడాడు. ఈ క్రమంలో పలు గాయాలను అధిగమించిన అతడు... మానసికంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ‘పదేళ్లు కాదు...25 ఏళ్లు గడిచినట్లుగా అనిపిస్తోంది. ఇన్నేళ్లలో నాకు ఎదురైన గాయాలు, ఆటకు దూరమైన రోజులు అలా అనిపించేలా చేస్తున్నాయి. అయితే ఈ దశాబ్దపు కెరీర్‌ను ఆస్వాదించాననేది వాస్తవం. వచ్చే పదేళ్ల కెరీర్ కోసం ఎదురు చూస్తున్నాచిన్నప్పుడు నాన్నతో కలిసి ఉదయమే టీవీలో టెస్టులు చూసిన రోజులను దాటి అదే ఆసీస్ గడ్డపై తొలి టెస్టు ఆడే సమయంలో ఎంతో భావోద్వేగానికి లోనయ్యా. ఆ సమయంలో నా బ్యాటింగ్, చేయాల్సిన పరుగుల గురించి ఆలోచనే రాలేదు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. గుర్తుంచుకునే క్షణాలతో పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నా. ఇన్నేళ్లలో ఏ స్థానంలో అయిన ఆడగలిగేలా మానసికంగా దృఢంగా తయారయ్యా. వచ్చే పదేళ్ల కెరీర్ కోసం ఎదురు చూస్తున్నా’ అని రాహుల్ వివరించాడు.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
టీమిండియాకు చేదు అనుభవం.. ఇకపై వారికి అనుమతి లేదు!
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా తొలి టెస్టు గెలిచి టీమిండియా జోరు మీదుండగా... ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ‘పింక్ బాల్’ టెస్టు ప్రారంభం కానుంది. ఇకపై వారికి అనుమతి లేదుఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు గులాబీ బంతితో ముమ్మర సాధన చేస్తుండగా... ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరైన కొందరు ఆసీస్ అభిమానులు టీమిండియా ప్లేయర్లను ఎగతాళి చేశారు.ఈ నేపథ్యంలో.. ఈ సిరీస్‌లో ఇకపై భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో అభిమానులను అనుమతించబోవడం లేదు. కాగా మంగళవారం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా... వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. పరుష పదజాలంతో దూషణలుఅడిలైడ్ మైదానంలో నెట్స్‌కు చాలా సమీపం వరకు అభిమానులు వచ్చే వీలుండటంతో... అక్కడికి చేరుకున్న పలువురు పరుష పదజాలంతో భారత ఆటగాళ్లను తూలనాడారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీమ్ మేనేజ్మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఫిర్యాదు చేసింది. ఇకపై టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్‌కు అభిమానులను అనుమతించబోమని తేల్చి చెప్పింది.చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
Ind vs Aus: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు
‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరుగనుంది. పింక్ బాల్‌తో నిర్వహించనున్న ఈ డే అండ్ నైట్ మ్యాచ్ శుక్రవారం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ పిచ్ గురించి ప్రధాన క్యూరేటర్ డామియన్ హగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడి పిచ్ స్పిన్ బౌలింగ్‌కు సహకరించనుందని వెల్లడించాడు పిచ్‌పై 6 మిల్లీ మీటర్ల పచ్చిక ఉంటుందని పేర్కొన్నాడు.ఆరంభంలో పేస్‌కు సహకరించినా...అయితే, ఫ్లడ్ లైట్ల వెలుతురులో గులాబీ బంతిని ఎదుర్కోవడం కొంచెం కష్టమే అని... అయితే పిచ్ అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు సహకరిస్తుందని హగ్ వెల్లడించాడు. ‘రికార్డులు పరిశీలిస్తే అడిలైడ్‌లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయడం కష్టమనేది సుస్పష్టం. పిచ్‌పై పచ్చిక ఉండనుంది. ఆరంభంలో పేస్‌కు సహకరించినా... మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపగలరు.బంతి పాతబడే వరకు కుదురుకుంటే పరుగులు రాబట్టడం పెద్ద కష్టం కాదు. అడిలైడ్‌లో స్పిన్ కీలక పాత్ర పోషించడం పరిపాటి. ఇక్కడ ఆడేటప్పుడు ప్రధాన స్పిన్నర్ తుది జట్టులో ఉండాల్సిందే. మ్యాచ్ ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపితే... రాత్రి పూట స్పిన్నర్లు ప్రమాదకరం’ అని హగ్ తెలిపాడు. గతంలొ 36 పరుగులకే ఆలౌట్‌కాగా పెర్త్‌లో జరిగిన టెస్టులో భారత్ ఆసీస్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టును ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది బుమ్రా సేన. ఇక అడిలైడ్ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. కాగా 2020లో ఇదే వేదికపై భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డును మూటగట్టుకుంది.చదవండి: ‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’ -
అతడి వల్లే తొలి టెస్టులో రాణించా.. వాళ్లిద్దరు కూడా అండగా ఉన్నారు: సిరాజ్
పేలవ ఫామ్‌తో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. తొలి టెస్టులోనే సత్తా చాటాడు. పెర్త్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగి జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, తాను మునుపటి లయ అందుకోవడానికి కారణం పేస్ దళ నాయకుడు, ఆసీస్‌తో మొదటి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన జస్ప్రీత్ బుమ్రానే అంటున్నాడు సిరాజ్. అప్పటికీ వికెట్లు లభించకపోతే‘నేను తరచుగా నా బౌలింగ్ గురించి బుమ్రాతో చర్చిస్తూనే ఉంటా. తొలి టెస్టుకు ముందు కూడా నా పరిస్థితి గురించి అతడికి వివరించా. బుమ్రా నాకు ఒకటే విషయం చెప్పాడు. ఎలాగైనా వికెట్ సాధించాలనే లక్ష్యంతో దాని గురించే అతిగా ప్రయత్నించవద్దు. నిలకడగా ఒకే చోట బంతులు వేస్తూ బౌలింగ్‌ను ఆస్వాదించు. అప్పటికీ వికెట్లు లభించకపోతే నన్ను అడుగు అని బుమ్రా చెప్పాడు. అతడు చెప్పిన మాటలను పాటించా. వికెట్లు కూడా దక్కాయి’ అని సిరాజ్ తన సీనియర్ పేసర్ పాత్ర గురించి చెప్పాడు.మోర్నీ మోర్కెల్ కూడాఇక భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా తనతో దాదాపు ఇవే మాటలు చెప్పి ప్రోత్సహించాడని కూడా సిరాజ్ పేర్కొన్నాడు. ఆరంభంలో సిరాజ్ కెరీర్‌ను తీర్చిదిద్దడంతో భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కీలకపాత్ర పోషించాడు. అందుకే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అరుణ్‌ను సంప్రదించడం సిరాజ్‌కు అలవాటు.అరుణ్ సర్‌ను అడిగాఈ విషయం గురించి సిరాజ్ మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ కాలంగా నా బౌలింగ్ గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే నాకు ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ అరుణ్ సర్‌ను అడిగా. ఆయన కూడా వికెట్లు తీయడంకంటే ఒక బౌలర్ తన బౌలింగ్‌ను ఆస్వాదించడం ఎంతో కీలకమో, ఫలితాలు ఎలా వస్తాయో చెప్పారు’ అని వెల్లడించాడు.ఇక ఆస్ట్రేలియాకు బయలుదేరడానికి ముందు భారత ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్‌కే చెందిన దిలీప్‌తో కలిసి సాధన చేసిన విషయాన్ని కూడా సిరాజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. మరోవైపు అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టు కోసం ‘పింక్ బాల్’తో సిద్ధమవుతున్నట్లు సిరాజ్ చెప్పాడు.అలాంటి స్థితిలో ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు‘గులాబీ బంతి సింథటిక్ బంతి తరహాలో అనిపిస్తోంది. ఎరుపు బంతితో పోలిస్తే భిన్నంగా, గట్టి సీమ్‌తో ఉంది. నా దృష్టిలో ఈ బాల్‌తో షార్ట్ ఆఫ్ లెంగ్త్ తరహాలో బంతులు వేస్తే బాగుంటుంది.దీంతో ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత పట్టు చిక్కుతుంది. అయితే లైట్లు ఉన్నప్పుడు ఎక్కువగా స్వింగ్ అవుతుందని విన్నా. నేను అలాంటి స్థితిలో ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు. అడిలైడ్‌లో అలాంటి వాతావరణంలో ప్రాక్టీస్ చేస్తా’ అని సిరాజ్ వివరించాడు. కాగా స్వదేశంలో భారత జట్టు ఆడిన గత ఐదు టెస్టుల్లో నాలుగింటిలో హైదరాబాద్ పేసర్ సిరాజ్ బరిలోకి దిగాడు. వీటన్నింటిలో కలిపి అతడు మొత్తం కేవలం ఆరు వికెట్లే పడగొట్టగలిగాడు. అయితే, ఆస్ట్రేలియాలో అతడు తిరిగి ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. ఇక భారత్- ఆసీస్ మధ్య డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు -
రోహిత్‌కు విసుగుతెప్పించిన అభిమాని.. హిట్‌మ్యాన్ రియాక్షన్ వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ‘కోపమొచ్చింది’. తనను చుట్టుముట్టిన అభిమానుల్లో ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించడంతో హిట్‌మ్యాన్ నవ్వుతూనే విసుక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమయ్యాడు. తన భార్య రితికా సజ్దే తమ రెండో సంతానానికి జన్మనివ్వడంతో.. ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే, భార్యకు ప్రసవమైన వెంటనే రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.పెర్త్ వేదికగా మొదటి టెస్టు మధ్యలోనే జట్టుతో చేరాడు. ఇక అడిలైడ్‌లో డిసెంబరు 6 నుంచి మొదలుకానున్న రెండో టెస్టు(పింక్ బాల్)తో రోహిత్ తిరిగి టీమిండియా పగ్గాలు చేపట్టనున్నాడు. అయితే, అంతకంటే ముందే గులాబీ బంతితో టీమిండియా సాధన చేసింది. కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది.టీమిండియా విజయంశనివారం మొదలుకావాల్సిన ఈ మ్యాచ్ వర్షం వల్ల తొలిరోజు టాస్ పడకుండానే ముగిసిపోయింది. దీంతో ఆదివారం ఆట కొనసాగగా 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. ఇదిలా ఉంటే.. ప్రాక్టీస్ మ్యాచ్‌కు వెళ్తున్న సమయంలో రోహిత్ శర్మను అభిమానులు చుట్టుముట్టారు.హిట్‌మ్యాన్ రియాక్షన్ వైరల్హిట్మ్యాన్తో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. అయితే, ఓ అభిమాని.. రోహిత్ వేరేవాళ్లకు ఆటోగ్రాఫ్ ఇస్తుండగా తనతో సెల్ఫీ దిగాలంటూ పదే పదే విసిగించాడు. దీంతో ఒకింత అసహనానికి గురైన రోహిత్.. ‘‘ఒకసారి ఒక్క పని మాత్రమే చేయగలం’’ అని సున్నితంగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ కేవలం మూడు పరుగులే చేసి అవుటయ్యాడు.కాన్బెర్రాను వీడిన రోహిత్ సేనరెండో టెస్టు కోసం టీమిండియా అడిలైడ్‌కు పయనమైంది. కాగా ప్రాక్టీస్ మ్యాచ్ కోసం కాన్‌బెర్రాకు వచ్చిన రోహిత్ సేన తొలుత ఆసీస్ ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం రోహిత్ ఆస్ట్రేలియన్ పార్లమెంటులో ప్రసంగించాడు. ఇక ఇప్పుడు పింక్ బాల్ టెస్టులో సారథిగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు.Rohit to fan's : "ak time par ak hi kaam ho Sakta hai."😂👌🏻Captain Rohit Sharma giving autograph to fan's at Manuka oval Canberra.🙌🇮🇳 pic.twitter.com/kkCMb6LHQt— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 30, 2024 -
మొదలుకాకుండానే ముగిసిపోయింది.. ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు!
ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో శుభారంభం అందుకున్న టీమిండియా అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. పెర్త్ టెస్టు మాదిరే అడిలైడ్‌లోనూ విజయఢంకా మోగించాలని భావిస్తోంది. అయితే, అక్కడ జరిగేది డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో మరింత ముమ్మరంగా ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమైంది.కానీ వర్షం కారణంగా టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో బుమ్రా సేన ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. ఏకంగా 295 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్తోఈ క్రమంలో డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరుగనుంది. పింక్ బాల్‌తో నిర్వహించే ఈ మ్యాచ్‌కు ముందు.. అన్ని రకాలుగా సిద్ధమయ్యేందుకు భారత్.. ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో రెండు రోజుల(శని, ఆది) పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్ ద్వారా గులాబీ బంతితో సాధన చేసేందుకు టీమిండియాకు తగిన సమయం దొరుకుతుందని భావించగా.. వరణుడు తొలిరోజు ఆటకు ఆటంకం కలిగించాడు. కాన్బెర్రా వేదికగా.. భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదలుకావాల్సిన మ్యాచ్‌కు వర్షం వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. మొదలుకాకుండానే ముగిసిపోయిందిఉదయం నుంచే భారీ వాన కురుస్తుండటంతో మనుకా ఓవల్ మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దీంతో టాస్ ఆలస్యం కాగా.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా.. తొలిరోజు ఆట మొదలుకాకుండానే ముగిసిపోయింది.కాగా అడిలైడ్‌లో టీమిండియాకు గతంతో అత్యంత చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అక్కడ నాలుగేళ్ల క్రితం జరిగిన పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 36 పరుగులకే కుప్పకూలింది. తద్వారా టెస్టుల్లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. గత అనుభవం నుంచి పాఠం నేర్చుకుని ఈసారి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో టీమిండియా ప్రాక్టీస్ చేయాలని భావించింది. కానీ దురదృష్టవశాత్తూ తొలిరోజు ఆట ఇలా వర్షార్పణం అయింది. ఆట రద్దు కావడంతో క్రికెటర్లు స్టేడియాన్ని వీడి హోటల్‌కు చేరుకున్నారు.ఇదిలా ఉంటే.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే జట్టుతో చేరాడు. అతడితో పాటు శుబ్‌మన్ గిల్ సైతం ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.ఇండియా వర్సెస్ ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్లుప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్జాక్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), శామ్ హార్పర్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, జాక్ క్లేటన్, ఆలివర్ డేవిస్, జేడెన్ గుడ్విన్, చార్లీ ఆండర్సన్, సామ్ కాన్స్టాస్, స్కాట్ బోలాండ్, లాయిడ్ పోప్, హనో జాకబ్స్, మహ్లీ బియర్డ్‌మన్, ఐడెన్ ఓ కానర్, జెమ్ ర్యాన్.టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్. -
టీమిండియాతో రెండు టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ పింక్‌బాల్ టెస్టులో గెలిచి తమ ఆధిక్యాన్ని పెంచుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. ఆసీస్ మాత్రం తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని తమ ఆస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. హేజిల్‌వుడ్ ప్రస్తుతం పక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆసీస్ జట్టు మేనెజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చింది.పెర్త్‌లో అదుర్స్..కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికి.. హాజిల్ వుడ్ మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి టెస్టులో మొత్తంగా 5 వికెట్లు హాజిల్ వుడ్ పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ కావడంలో వుడ్ది కీలక పాత్ర.అబాట్, డాగెట్లకు పిలుపు..కాగా హాజిల్‌వుడ్ రీప్లేస్మెంట్స్ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పేసర్లు సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్లకు జట్టులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరూ జట్టులోకి వచ్చినప్పటకి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం స్కాట్ బోలాండ్కే చోటు దక్కే అవకాశముంది. కాగా మొదటి టెస్టులో అతడు బెంచకే పరిమితమయ్యాడు.చదవండి: SA vs SL 1st Test: స్టబ్స్, బవుమా సెంచరీలు.. గెలుపు దిశగా దక్షిణాఫ్రికా -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రిన్స్ వచ్చేస్తున్నాడు!
ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్ అందినట్లు తెలుస్తోంది. చేతి వేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తిరిగి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం.శుక్రవారం(నవంబర్ 29) మొదటిసారి గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ ప్రాక్టీస్‌లో అతడికి ఎటువంటి సమస్యలు తలెత్తకపోతే సెకెండ్ టెస్టుకు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ పింక్ బాల్ టెస్టుకు ముందు భారత జట్టు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా తొలి టెస్టుకు ముందు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బొటన వేలికి గాయమైంది. దీంతో ఆఖరి నిమిషంలో పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు.అతడి స్ధానంలో దేవ్‌దత్త్ పడిక్కల్ తుది జట్టులోకి వచ్చాడు. కానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. మరోవైపు రెండో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అందుబాటులోకి వచ్చాడు.వీరిద్దరూ జట్టులోకి వస్తే పడిక్కల్, ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు. ఇక ఈ రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా మొదలు కానుంది. కాగా తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియాతో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ జడేజా, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్
ఈ ఏడాది నవంబర్‌లో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుండటం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరగా 1991-92లో ఆసీస్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరిగింది. కాగా ఇక ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఇరు జట్లు పింక్‌బాల్ టెస్టులో తలపడనున్నాయి. ఈ డే-నైట్ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పింక్-బాల్ టెస్ట్‌కు ముందు రెండు రోజుల డే-నైట్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా షెడ్యూల్ చేసింది. మనుకా ఓవల్ వేదికగా ప్రైమ్ మినిస్టర్ XIతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.ఈ ప్రాక్టీస్ మ్యాచ్ భారత జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఎందుకంటే 2020-21 టూర్లో డే-నైట్ టెస్ట్‌లో భారత్ ఘోర పరాభావాన్ని ఎదుర్కొంది. ఇదే అడిలైడ్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే భారత్ ఆలౌటైంది. దీంతో 8 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. ఇక ఆసీస్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్‌నే పింక్ బాల్ టెస్టుగా షెడ్యూల్ చేశారు. మొత్తం ఈ ఐదు టెస్టులు పెర్త్, ఆడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్, సిడ్నీ వేదికలగా జరగనున్నాయి. -
NZ Vs Eng: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో
New Zealand vs England, 1st Test- Tom Blundell: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. 181 బంతులు ఎదుర్కొన్న అతడు 138(19 ఫోర్లు, ఒక సిక్సర్) పరుగులు చేశాడు. ఓపెనింగ్ బ్యాటర్ డెవాన్ కాన్వే(77)తో కలిసి రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. కాన్వే అర్ధ శతకం, బ్లండెల్ శతకం కారణంగా ఆతిథ్య కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేసి ఇంగ్లండ్(తొలి ఇన్నింగ్స్ 325-9 డిక్లేర్డ్)కు దీటైన జవాబు ఇవ్వగలిగింది. ఇదిలా ఉంటే.. సెంచరీ హీరో టామ్ బ్లండెల్ ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా చరిత్ర సృష్టించాడు. బ్లండెల్ ప్రపంచ రికార్డు డే- నైట్ టెస్టులో శతకం సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పింక్‌బాల్ టెస్టులో సెంచరీతో మెరిసి ఈ ఘనత సాధించాడు. కాగా 2015 నుంచి డే- నైట్ టెస్టులు మొదలుకాగా న్యూజిలాండ్- ఇంగ్లండ్ మ్యాచ్ కంటే ముందు 20 మ్యాచ్‌లు జరిగాయి. అయితే, వీటిలో ఏ ఒక్క వికెట్ కీపర్ బ్యాటర్ కూడా శతకం సాధించలేకపోయాడు. ఆ అరుదైన ఘనత బ్లండెల్‌కే సాధ్యమైంది. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షపెట్టిన టామ్ బ్లండెల్.. కివీస్ 306 పరుగుల మేర స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక తన పేరిట ప్రపంచ రికార్డు లిఖించి సత్తా చాటాడు. చదవండి: Anderson- Stuart Broad: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో.. Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?! Tom Blundell (138) leads the batting effort with his highest Test score. Blundell and Tickner share a 59-run partnership for the 10th wicket, pushing the total 306. Time to bowl at Bay Oval! Follow play LIVE in NZ with @sparknzsport & @todayfm_nz 📲 #NZvENG pic.twitter.com/QO4XENUfSt — BLACKCAPS (@BLACKCAPS) February 17, 2023 -
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉప్పల్ వేదికగా మరో కీలక మ్యాచ్!
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం మరో అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదిక కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్యలో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. బోర్డర్-గావస్కర్ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు నాలుగు టెస్టులు ఆడనున్నాయి. ఇందులో ఒకటి పింక్ బాల్ టెస్టుగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఈ సిరీస్‌కు ఇంకా బీసీసీఐ వేదికలను ఖారారు చేయలేదు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు ఉప్పల్ స్టేడియం అతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా రెండో టెస్టు ఢిల్లీ, మూడో టెస్టుకు ధర్మశాల, ఆఖరి టెస్టుకు ఆహ్మదాబాద్ వేదికలుగా నిర్ణయించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా ఏడాది సెప్టెంబర్‌లో ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియాతో సిరీస్ డిసైడర్ ఆఖరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియంకు తరలివచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. ముహార్తం ఫిక్స్! ఎప్పుడంటే? -
IND VS SL: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి
భారత్-శ్రీలంక జట్ల మధ్య ఇటీవలే బెంగుళూరులో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ (పింక్ బాల్ టెస్ట్)పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ కోసం వినియోగించిన పిచ్‌పై ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ పెదవి విరిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్‌కు బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. చర్యల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంకు ఓ డీమెరిట్ పాయింట్ ఇచ్చాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఓ వేదిక 5 డీమెరిట్ పాయింట్లు పొందితే, సంవత్సరం పాటు అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించకుండా నిషేధిస్తారు. కాగా, రిఫరీ జవగల్ శ్రీనాథ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సొంత మైదానం కావడం విశేషం. ఇదిలా ఉంటే, పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా 3 రోజుల్లోనే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి రోజు నుంచే విపరీతంగా టర్న్ అవుతూ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టింది. తొలి రోజు ఆటలో రికార్డు స్థాయిలో 16 వికెట్లు పతనమయ్యాయి. అయితే, భారత బ్యాటర్లు, ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలతో టీమిండియాకు 238 పరుగుల భారీ విజయాన్నందించాడు. లంక రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కరుణరత్నే సూపర్ శతకంతో చెలరేగినప్పటికీ, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఇరు జట్లలోని స్పిన్నర్లు ఏకంగా 26 వికెట్లు పడగొట్టగా, టీమిండియా పేసు గుర్రం బుమ్రా నిర్జీవమైన పిచ్‌పై 8 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు) చెలరేగాడు. చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W — BCCI (@BCCI) March 14, 2022 -
చరిత్ర సృష్టించిన రోహిత్.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు
Rohit Sharma: శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా అరంగేట్రం సిరీస్‌ల్లోనే (మూడు ఫార్మాట్లు) క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి సారథిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.కోహ్లి నుంచి ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వన్డే (3-0), టీ20 సిరీస్ (3-0)ల్లో వైట్‌వాష్ చేసిన రోహిత్.. తాజాగా శ్రీలంకను టెస్ట్ సిరీస్‌లో 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. Rohit Sharma Created History As Captain Only Captain in the History Of Cricket to have Won his First Series in all three formats by Cleansweep as full Time Captain. Well done, Captain Ro. pic.twitter.com/App7UuFLLw — CricketMAN2 (@ImTanujSingh) March 14, 2022 కాగా, బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి టెస్ట్‌లోనూ లంకపై భారీ విజయం (ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో) సాధించిన రోహిత్ సేన.. టెస్ట్ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. ఈ భారత పర్యటనలో శ్రీలంక ఒక్క మ్యాచ్ కూడా గెలుపొందలేక రిక్త హస్తాలతో స్వదేశానికి తిరుగు పయనమైంది. రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధసెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ ఆధ్యంతం రాణించిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించింది. Since @ImRo45 became full time Captain: 3-0 vs NZ (T20I) 3-0 vs WI (ODI) 3-0 vs WI (T20I) 3-0 vs SL (T20I) 2-0 vs SL (Tests) #INDvSL pic.twitter.com/ojREzqlA6M — Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2022 CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W — BCCI (@BCCI) March 14, 2022 Rohit Sharma as Indian Captain 1st ODI Series - Won 1st T20I Series - Won 1st Test Series - Won*#INDvSL — CricBeat (@Cric_beat) March 14, 2022 రెండో టెస్ట్ సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్ : 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92, జయవిక్రమ 3/81) శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24) భారత్ రెండో ఇన్నింగ్స్ : 303/9 డిక్లేర్ ( శ్రేయస్ అయ్యర్ 67, జయవిక్రమ 4/78) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 208 (కరుణరత్నే 107, అశ్విన్ 4/55) చదవండి: టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా..! Spirit of Cricket at its best as #TeamIndia congratulate Suranga Lakmal who played his last international match 🤜🤛 #SpiritOfCricket | #INDvSL | @Paytm pic.twitter.com/aa17CK5hqv — BCCI (@BCCI) March 14, 2022 -
టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా..!
టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. స్వదేశంలో వరుసగా 15 సిరీస్‌లు గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర పుటల్లో నిలిచింది. సోమవారం (మార్చి 14) శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో (పింక్ బాల్ టెస్ట్) గెలుపొందడం ద్వారా టీమిండియా స్వదేశంలో వరుసగా 15వ టెస్ట్ సిరీస్ విజయం సాధించి, ఇదివరకే తమ పేరటి ఉన్న రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. టీమిండియా చివరిసారిగా 2012 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇంగ్లండ్‌తో (స్వదేశంలో) జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓడిపోయింది. నాడు మహేంద్ర సింగ్ ధోని జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పటి నుంచి భారత జట్టు స్వదేశంలో తిరుగులేని అజేయ జట్టుగా కొనసాగుతుంది. India's 15th consecutive series victory at home since losing the series to England in Dec 2012. No other home side has won more than 10 consecutive home series. #IndvSL #IndvsSL#DaynightTestmatch#PinkballTest — Mohandas Menon (@mohanstatsman) March 14, 2022 టీమిండియా తర్వాత స్వదేశంలో అత్యధిక వరుస టెస్ట్ సిరీస్‌లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా ఉంది. కంగారూ జట్టు స్వదేశంలో వరుసగా 10 టెస్ట్ సిరీస్‌ల్లో విజయం సాధించింది. ఆసీస్ రెండుసార్లు (నవంబర్ 1994-నవంబర్ 2000 మధ్యలో ఓసారి, జులై 2004-నవంబర్ 2008 మధ్యలో మరోసారి) ఈ ఘనత సాధించడం విశేషం. కాగా, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తు చేసి 2 మ్యాచ్‌ల సిరీస్‌ని 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లోనూ లంకపై భారీ విజయం (ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో) సాధించిన టీమిండియా.. టెస్ట్ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. చదవండి: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం -
శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 238 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరిశాడు. కరుణరత్నే 174 బంతుల్లో 107 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. .బుమ్రా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ 92 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగలకే కుప్ప కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంకను దెబ్బ తీశాడు. ఇక 143 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన 303-9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అయ్యర్ 67 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పంత్‌కు మ్యాన్ ఆఫ్‌ది సిరీస్అవార్డు దక్కగా, అయ్యర్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కాగా రోహిత్ శర్మకు కెప్టెన్‌గా తొలి టెస్టు విజయం. చదవండి: Ind VS Sl 2nd Test: ఛ.. నాకే ఎందుకిలా జరుగుతోంది? కోహ్లి వీడియో వైరల్ -
కోహ్లితో వ్యవహారం ఇట్లుంటది.. నలుగురు అభిమానుల అరెస్ట్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో సెల్ఫీ దిగేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చిన నలుగురు యువకులు కటకటపాలయ్యారు. భద్రతా నిబంధనలను అతిక్రమించినందుకు గాను వారిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురిలో ముగ్గురు బెంగళూరు వాసులు కాగా, ఒకరు కల్బుర్గి ప్రాంతానికి చెందిన కుర్రాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆటలో ఈ నలుగురు కుర్రాళ్లు సెక్యురిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు కోహ్లితో సెల్ఫీలు దిగగా.. మరో ఇద్దరిని సెక్యూరిటీ సిబ్బంది లాక్కెళ్లారు. Fans entered in the ground to take selfie with #viratkohli #Virat #Kohli #IndvsSL pic.twitter.com/jygYxZhKRR — TRENDING CRIC ZONE (@rishabhgautam81) March 13, 2022 కాగా, లంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా విజయపు అంచుల్లో నిలిచింది. టీమిండియా నిర్ధేశించిన 447 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక మూడో రోజు ఆట ప్రారంభం నుండే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి, వరుసగా రెండో టెస్ట్‌లో ఓటమికి సిద్ధమైంది. కరుణరత్నే(107) శతకంతో ఒంటరిపోరాటం చేయగా, మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరారు. లంక ఇన్నింగ్స్‌లో కరుణరత్నే, కుశాల్ మెండిస్ (54), డిక్వెల్లా (12) మినహా మిగతా ఆటగాళ్లెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్ : 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92, జయవిక్రమ 3/81) శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24) భారత్ రెండో ఇన్నింగ్స్ : 303/9 డిక్లేర్ ( శ్రేయస్ అయ్యర్ 67, జయవిక్రమ 4/78) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 208/9 (కరుణరత్నే 107, బుమ్రా 3/23) చదవండి: Ind VS Sl 2nd Test: అతడంటే ‘పిచ్చి’.. మైదానంలోకి దూసుకువచ్చి పోలీసులనే.. -
మరో మైలురాయిని అధిగమించిన అశ్విన్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 8వ బౌలర్‌గా..!
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో మైలురాయిని అధిగమించాడు. మూడో రోజు ఆటలో లంక బ్యాటర్ ధనంజయ డిసిల్వాను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్ట్‌ల్లో 440వ వికెట్‌ను పడగొట్టాడు. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (93 టెస్ట్‌ల్లో 439 వికెట్లు)ను అధిగమించాడు. ప్రస్తుతం 86 టెస్ట్‌ల్లో 440 వికెట్లతో కొనసాగుతున్న అశ్విన్.. ఇదే సిరీస్‌లో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ పేస్ దిగ్గజం రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్ట్‌ల్లో 431), శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్ (93 టెస్టులలో 433 వికెట్లు), భారత లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ (131 టెస్ట్‌ల్లో 434 వికెట్లు)లను కూడా అధిగమించాడు. లంకతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ ఇప్పటివరకు 10 వికెట్లు (తొలి టెస్ట్‌లో 6, రెండో టెస్ట్‌లో 4) పడగొట్టాడు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్ గ్రేట్ స్పిన్నర్ దివంగత షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు), జేమ్స్ అండర్సన్ (169 టెస్ట్‌ల్లో 640 వికెట్లు), భారత దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (132 టెస్ట్‌ల్లో 619 వికెట్లు), ఆసీస్ మాజీ పేసర్ మెక్‌గ్రాత్ (124 మ్యాచ్‌ల్లో 563 వికెట్లు), ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (152 మ్యాచ్‌ల్లో 537 వికెట్లు), విండీస్ మాజీ పేసర్ వాల్ష్ (132 టెస్ట్‌ల్లో 519 వికెట్లు) వరుసగా రెండు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతానికి అశ్విన్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పింక్ బాల్ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతుంది. సిరీస్‌లో వరుసగా రెండో విజయానికి 5 వికెట్ల దూరంలో ఉంది. 446 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 180 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కరుణరత్నే (89), చరిత్ అసలంక (5) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో లంక విజయం సాధించాలంటే మరో 267 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: అశ్విన్ ఖాతాలో మరో మైలురాయి.. కపిల్ దేవ్ రికార్డు బద్దలు -
పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
అనుకున్నదే అయ్యింది.. కోహ్లి అభిమానుల గుండె బద్దలైంది
Virat Kohli: విరాట్ కోహ్లి విషయంలో అతని ఫ్యాన్స్ భయమే నిజమైంది. ఇన్నాళ్లు తమ ఆరాధ్య క్రికెటర్ బ్యాటింగ్ సగటు అన్ని ఫార్మాట్లలో 50కి పైగా ఉందని కాలరెగరేసుకు తిరిగిన టీమిండియా మాజీ కెప్టెన్ అభిమానులకు ఇకపై అలా చెప్పుకుని తిరిగే ఛాన్స్ లేకుండా పోయింది. బెంగళూరు వేదకగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 36 పరుగులు (23, 13) మాత్రమే చేయడంతో ఐదేళ్ల తర్వాత తొలిసారి అతని బ్యాటింగ్ సగటు 50 దిగువకు పడిపోయింది. దీంతో కోహ్లి ఫ్యాన్స్ గుండె బద్దలైనంత పనైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి కనీసం 43 పరుగులు (రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి) చేసి ఉంటే అతని సగటు 50కిపైనే కొనసాగేది. అంతకుముందు 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సగటు 50 నుంచి 49.55కి దిగజారింది. ప్రస్తుతం అదే ప్రత్యర్ధితో జరిగిన మ్యాచ్‌లోనే కోహ్లి సగటు మరోసారి 50 దిగువకు (49.95) పడిపోయింది. ప్రస్తుతం కోహ్లి 101 టెస్ట్‌ల్లో 49.55, 260 వన్డేల్లో 58.07, 97 టీ20ల్లో 51.50 సగటుతో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా లంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేయగా, శ్రీలంక 109 పరుగులకు ఆలౌటైంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు -
శ్రీలంక క్రికెట్‌కు మరో షాకింగ్ న్యూస్
Suranga Lakmal Retirement: వరుస అపజయాలతో సతమతమవుతున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ సురంగ లక్మల్ (35).. బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు. భారత్‌తో సిరీస్ తనకు ఆఖరిదని ముందే ప్రకటించిన లక్మల్.. తన అంతర్జాతీయ కెరీర్లో చివరి బంతిని వేసేశాడు. పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆటలో లక్మల్ చివరి బంతిని టీమిండియా బ్యాటర్ రవీంద్ర జడేజా ఎదుర్కొన్నాడు. లక్మల్ తన ఆఖరి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కాగా, కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం జట్టు నుంచి తప్పుకుంటున్నాని, రిటైర్ అవడానికి ఇదే సరైన సమయమని లక్మల్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీలంక తరఫున 70 టెస్ట్‌ల్లో 171 వికెట్లు పడగొట్టిన లక్మల్.. 86 వన్డేల్లో 109 వికెట్లు, 11 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో అతను నాలుగు సార్లు 5 వికెట్లు ఘనతను సాధించాడు. 2018 కాలంలో టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన లక్మల్.. సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై 2-0తో ఓడించి చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా లంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ (67), పంత్ (50) హాఫ్ సెంచరీలతో చెలరేగగా, లంక బౌలర్లలో జయవిక్రమ 4, ఎంబుల్దెనియా 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేయగా, శ్రీలంక 109 పరుగులకు ఆలౌటైంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు -
శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు
Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు వచ్చి పడింది. పింక్ బాల్‌తో ఆడే డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో (ఒకే టెస్ట్) 50కి పైగా పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అయ్యర్ తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. అయ్యర్‌కు ముందు ఈ ఘనతను డారెన్ బ్రావో (87, 116) 2016లో పాక్‌పై, స్టీవ్ స్మిత్ (130, 63) 2016లో పాక్‌పై, మార్నస్ లబూషేన్ రెండు సందర్భాల్లో (2019లో న్యూజిలాండ్‌పై 143, 50.. 2021లో ఇంగ్లండ్‌పై 103, 51) సాధించారు. కాగా, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. 64 ఓవర్లు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి ఓవరాల్‌గా 414 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపును ఆపడం దాదాపుగా అసాధ్యం. తొలి రోజు ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇదే స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి 109 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా (5/24) ఐదేయగా, అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించారు. చదవండి: టెస్ట్‌ల్లో రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. 40 ఏళ్ల కపిల్ రికార్డు బ్రేక్ -
టెస్ట్‌ల్లో రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. 40 ఏళ్ల కపిల్ రికార్డు బ్రేక్
Rishabh Pant Scores Fastest 50 For India In Test Cricket: టీమిండియా వికెట్‌కీపర్ రిషభ్ పంత్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పంత్ కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ (1982లో పాక్‌పై 30 బంతుల్లో) పేరిట ఉండేది. తాజాగా పంత్ కపిల్ రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ కూడా పంత్ తరహాలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ 31 బంతుల్లో ఫిఫ్టి బాదాడు. ఇక 2008లో సెహ్వాగ్ ఇంగ్లండ్‌పై 32 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. 47 ఓవర్లు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ఓవరాల్‌గా 342 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపును ఆపడం దాదాపుగా అసాధ్యం. తొలి రోజు ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇదే స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి 109 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా (5/24) ఐదేయగా, అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించారు. చదవండి: IND VS SL 2nd Test Day 2: ఐదేసిన బుమ్రా.. కుప్పకూలిన శ్రీలంక -
IND VS SL 2nd Test Day 2: ఐదేసిన బుమ్రా.. కుప్పకూలిన శ్రీలంక
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (పింక్ బాల్ టెస్ట్) శ్రీలంక జట్టు ఓటమి దిశగా సాగుతుంది. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (5/24) ఐదేయడంతో లంకేయులు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలారు. ఓవర్ నైట్ స్కోరు 86/6 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదంటే ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. బుమ్రాకు జతగా అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించడంతో లంక తొలి రోజు స్కోర్‌కు మరో 23 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లు కోల్పోయింది. ఫలితంగా టీమిండియాకు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కెరీర్లో 29వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బుమ్రా 8వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, లంక ఇన్నింగ్స్‌లో ఏంజలో మాథ్యూస్ (43), డిక్వెల్లా (21), ధనంజయ డిసిల్వా (10)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే మయాంక్ అగర్వాల్ (22) వికెట్‌ను కోల్పోయింది. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసి, ఓవరాల్‌గా 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రోహిత్ శర్మ (20), హనుమ విహారి క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: ప్రేక్షకుడి ముక్కు పగలగొట్టిన రోహిత్ శర్మ.. ఆస్పత్రిలో చేరిక! -
Ind Vs SL 2nd Test: చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. తొలి రోజు టీమిండియాదే!
డే–నైట్ టెస్టు మ్యాచ్... గులాబీ బంతి అనూహ్యంగా టర్న్ అవుతూ, అంచనాలకు మించి బౌన్స్ అవుతూ ముల్లులా గుచ్చుకుంటోంది. ఫలితంగా 126 పరుగులకే భారత టాప్–5 పెవిలియన్‌కు... ఇలాంటి సమయంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆట దిశను మార్చాడు. శతకం సాధించకపోయినా ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ను జట్టు పరువు నిలిపాడు. ఆపై రాత్రి వాతావరణంలో మన పేసర్లు బంతితో ‘స్వింగాట’ ఆడించారు. దాంతో 30 ఓవర్లకే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి అప్పుడే మ్యాచ్‌లో చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. పరిస్థితి చూస్తే ఈ మ్యాచ్ కూడా మూడు రోజుల్లోపే ముగిసేలా ఉంది! బెంగళూరు: శ్రీలంకతో రెండో టెస్టులో భారత్‌కు తొలి రోజే పట్టు చిక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 59.1 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 92; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సత్తా చాటగా, రిషభ్ పంత్ (26 బంతుల్లో 39; 7 ఫోర్లు), హనుమ విహారి (81 బంతుల్లో 31; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం లంక ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేయగలిగింది. మాథ్యూస్ (85 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం ఆ జట్టు మరో 166 పరుగులు వెనుకబడి ఉంది. పంత్ ఎదురుదాడి... పిచ్ అనూహ్య రీతిలో స్పందించడంతో భారత బ్యాటర్లు కూడా తడబడ్డారు. ఫలితంగా తక్కువ వ్యవధిలో జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. బౌలర్ ఎల్బీ కోసం అప్పీల్ చేస్తున్న సమయంలో అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి మయాంక్ (4) రనౌట్ కాగా, ఒక్కసారిగా పైకి లేచిన బంతిని ఆడలేక రోహిత్ శర్మ (15) స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. విహారి, విరాట్ కోహ్లి (23) కొద్దిసేపు పట్టుదలగా నిలబడ్డారు. అయితే 47 పరుగుల భాగస్వామ్యం తర్వాత వీరిద్దరు కూడా వరుస ఓవర్లలో వెనుదిరిగారు. ఈ దశలో పంత్ ఎదురుదాడికి దిగాడు. తొలి 7 బంతుల్లోనే 3 ఫోర్లు కొట్టిన అతను టీ విరామం తర్వాత ధనంజయ ఓవర్లో రెండు, జయవిక్రమ ఓవర్లో 3 బౌండరీల చొప్పున బాదాడు. అయితే ఎంబుల్డెనియా బంతికి అతను క్లీన్ బౌల్డ్ కాగా... జడేజా (4), అశ్విన్ (13), అక్షర్ (9) ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు నుంచి మాత్రం అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా ప్రతీ బౌలర్‌పై పైచేసి సాధిస్తూ వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడాడు. ధనంజయ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లతో అయ్యర్ 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి మరో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో అతను సెంచరీకి చేరువయ్యాడు. అయితే ముందుకు దూసుకొచ్చి ఆడే ప్రయత్నంలో స్టంపౌట్ కావడంతో ఆ అవకాశం చేజారింది. టపటపా... ప్రత్యర్థిని కట్టడి చేసిన శ్రీలంకకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బుమ్రా తన వరుస ఓవర్లలో కుశాల్ మెండిస్ (2), తిరిమన్నె (8)లను అవుట్ చేయడంతో లంక పతనం మొదలైంది. తన మొదటి బంతికే కరుణరత్నే (4)ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ, కొద్ది సేపటికే ధనంజయ (10) పని పట్టాడు. మాథ్యూస్ ఒక్కడే పోరాడే ప్రయత్నం చేసినా చివర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా అతని ఆట ముగించడంతో లంక పేలవంగా తొలి రోజును ముగించింది. భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (రనౌట్) 4; రోహిత్ (సి) డిసిల్వా (బి) ఎంబుల్డెనియా 15; విహారి (సి) డిక్వెలా (బి) జయవిక్రమ 31; కోహ్లి (ఎల్బీ) (బి) డిసిల్వా 23; పంత్ (బి) ఎంబుల్డెనియా 39; అయ్యర్ (స్టంప్డ్) డిక్వెలా (బి) జయవిక్రమ 92; జడేజా (సి) తిరిమన్నె (బి) ఎంబుల్డెనియా 4; అశ్విన్ (సి) డిక్వెలా (బి) డిసిల్వా 13; అక్షర్ (బి) లక్మల్ 9; షమీ (సి) డిసిల్వా (బి) జయవిక్రమ 5; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (59.1 ఓవర్లలో ఆలౌట్) 252. వికెట్ల పత నం: 1–10, 2–29, 3–76, 4–86, 5–126, 6– 148, 7–183, 8–215, 9–229, 10–252. బౌ లింగ్: లక్మల్ 8–3–12–1, ఫెర్నాండో 3–0– 18– 0, ఎంబుల్డెనియా 24–2– 94–3, జయ విక్రమ 17.1–3–81–3, ధనంజయ డిసిల్వా 7–1–32–2. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: కుశాల్ మెండిస్ (సి) శ్రేయస్ (బి) బుమ్రా 2; కరుణరత్నే (బి) షమీ 4; తిరిమన్నె (సి) శ్రేయస్ (బి) బుమ్రా 8; మాథ్యూస్ (సి) రోహిత్ (బి) బుమ్రా 43; ధనంజయ (ఎల్బీ) (బి) షమీ 10; అసలంక (సి) అశ్విన్ (బి) అక్షర్ 5; డిక్వెలా (నాటౌట్) 13; ఎంబుల్డెనియా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (30 ఓవర్లలో 6 వికెట్లకు) 86. వికెట్ల పతనం: 1–2, 2–14, 3–14, 4–28, 5–50, 6–85. బౌలింగ్: బుమ్రా 7–3–15–3, అశ్విన్ 6–1–16–0, షమీ 6–1–18–2, జడేజా 6–1–15–0, అక్షర్ పటేల్ 5–1–21–1. -
పింక్ బాల్ టెస్ట్‌ల్లో సరికొత్త రికార్డు.. తొలి రోజు ఏకంగా..!
India vs Sri Lanka, pink-ball Test Day 1 highlights: పింక్ బాల్‌తో జరిగే డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఫార్మాట్లో బెంగళూరు వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటలో ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌ల చరిత్రలో తొలి రోజే ఇన్ని వికెట్లు కూలడం ఇదే ప్రధమం. 2017లో సౌతాఫ్రికా, జింబాబ్వేల మధ్య మ్యాచ్‌లో 13 వికెట్లు, 2018లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌లో 13, 2019లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో 13, 2021 భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లో 13 వికెట్లు తొలి రోజే పడ్డాయి. ఈ ఐదు సందర్భాల్లో మూడింటిలో టీమిండియా భాగం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (92) ఒంటరి పోరాటం చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ తలో 3 వికెట్లు, ధనంజయ డిసిల్వా 2, సురంగ లక్మల్ ఓ వికెట్ పడగొట్టారు. మయాంక్ అగర్వాల్ రనౌటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక భారత బౌలర్లు బుమ్రా (3/15), షమీ (2/ 18), అక్షర్ పటేల్ (1/21)ల ధాటికి విలవిలలాడింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఏంజలో మాథ్యూస్ ధాటిగా ఆడి 43 పరుగులు చేయడంతో లంక జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. చదవండి: మాతృదేశంపై సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ అరుదైన ఘనత -
అయ్యో మా గుండె పగిలింది కోహ్లి! నా పరిస్థితీ అదే ఇక్కడ .. ఏం చెప్పను!
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. 48 బంతుల్లో కేవలం 23 పరుగుల మాత్రమే చేసి కోహ్లి పెవిలియన్‌కు చేరాడు. ఇక భారత ఇన్నింగ్స్ 23 ఓవర్ వేసిన ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో.. కోహ్లి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఒక్క సారిగా టర్న్ అయ్యి బ్యాట్‌కు తగలకుండా అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో లంక ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్ చేశారు. వెంటనే ఆన్-ఫీల్డ్ అంపైర్ వేలు పైకెత్తాడు. కాగా కోహ్లి తను ఔట్‌గా భావించి రివ్యూ అవకాశం ఉన్న తీసుకోలేదు. అయితే ఔటయ్యాక కోహ్లి ముఖం ఒక్క సారిగా మారిపోయింది. బాధపడుతూ కోహ్లి క్రీజులో కొద్ది సేపు టీమిండియా అలా ఉండిపోయాడు. అనంతరం నిరాశగా పెవిలియ్నకు కోహ్లి చేరాడు. కాగా కోహ్లి లూక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నెటిజన్లు కోహ్లికు మద్దతుగా నిలుస్తోన్నారు. "అయ్యో మా గుండె పగిలింది కోహ్లి.. బంతి అలా టర్న్ అవుతుందని అసలు ఊహించలేదు" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక భారత తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకి ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(92) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు. భారత బ్యాటర్లలో పంత్(39),విహారి(31),కోహ్లి(23) పరుగులు సాధించారు.శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దేనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ధనంజయ డి సిల్వా రెండు వికెట్లు, లక్మల్ ఒక వికెట్ సాధించాడు. చదవండి: IND VS SL 2nd Test Day 1: శ్రేయస్ ఒంటరి పోరాటం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ Another heartbreak @imVkohli 🥺💔 The ball literally died after landing. #INDvsSL #ViratKohlihttps://t.co/qI5tLIMA6a pic.twitter.com/5keZcjXG7j — 💫💙Srikanth (@Srikanth_Tweetz) March 12, 2022 -
శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం.. మరో 8 పరుగులు చేసుంటే..!
మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (92, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 252 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా, శ్రేయస్ ఏమ్రాతం తగ్గకుండా దూకుడుగా ఆడుతూ 54 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తొలి రోజు నుంచే బౌలర్లకు అనుకూలంగా మరిపోయిన పిచ్‌పై శ్రేయస్ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. టెయిలెండర్లు క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడుతుండగా 11వ నంబర్ ఆటగాడు బుమ్రా (0) సహకారంతో ఫోర్లు, సిక్సర్లతో ఎదురుదాడికి దిగాడు. మరో 8 పరుగులు చేస్తే కెరీర్లో రెండో సెంచరీ చేస్తాడనుకున్న సమయంలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన శ్రేయస్ స్టంపవుటయ్యాడు. దీంతో 252 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. కెరీర్లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ (15)తో పాటు 101 టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి (23), ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) మరోసారి నిరాశపరిచారు. హనుమ విహారి (31), రిషబ్ పంత్ (26 బంతుల్లో 39; 7 ఫోర్లు) పర్వాలేదనిపించగా, తొలి టెస్ట్ హీరో రవీంద్ర జడేజా (4), అశ్విన్ (13), అక్షర్ (9), షమీ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో బుమ్రా సహకారంతో శ్రేయస్ ఆపద్భాందవుని ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ తలో 3 వికెట్లు, ధనంజయ డిసిల్వా 2, సురంగ లక్మల్ ఓ వికెట్ పడగొట్టారు. మయాంక్ అగర్వాల్ రనౌటయ్యాడు. చదవండి: అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత! -
Ravindra Jadeja: మరో అరుదైన ఘనతకు తొమ్మిది వికెట్ల దూరంలో..
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన 175 పరుగులతో (తొలి ఇన్నింగ్స్) పాటు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టి, టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. బెంగళూరు వేదికగా రేపటి (మార్చి 12) నుంచి ప్రారంభంకానున్న పింక్ బాల్ టెస్ట్‌లో మరో అరుదైన ఘనత సాధించేందుకు తహతహలాడుతున్నాడు. బెంగళూరు టెస్ట్‌లో సర్ జడ్డూ మరో 9 వికెట్లు పడగొడితే టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు (58 టెస్ట్‌లు) సాధించిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. జడేజాకు ముందు రవిచంద్రన్ అశ్విన్ (42 టెస్ట్‌లు), అనిల్ కుంబ్లే (55) వేగంగా 250 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు. ప్రస్తుతం జడేజా 58 టెస్ట్‌ల్లో 241 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే, పింక్ బాల్ టెస్ట్‌కు జడేజా పూర్తి ఫిట్‌గా లేడని వార్తలు వినిపిస్తున్నాయి. జడ్డూ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే సమయంలో అసౌకర్యంగా కనిపించాడని, అతనేదో గాయాన్ని దాస్తున్నట్లున్నాడని ఓ ప్రముఖ మీడియా కథనాన్ని ప్రచురితం చేసింది. ఈ విషయమై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించనప్పటికీ, అతని డిప్యూటీ జస్ప్రీత్ బుమ్రా క్లారిటీ ఇచ్చాడు. బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా ముగ్గరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని పరోక్ష సంకేతాలు ఇచ్చాడు. ప్రస్తుతం అక్షర్‌తో కలుపుకుని భారత జట్టులో ముగ్గురే స్పిన్నర్లు ఉండటంతో జడేజా రెండో టెస్ట్‌లో ఆడటం ఖాయంగా తెలుస్తోంది. చదవండి: జడ్డూను కాపీ కొట్టిన పాక్ బౌలర్.. ట్రోల్స్ చేసిన క్రికెట్ ఫ్యాన్స్ -
కుల్దీప్ను జట్టు నుంచి తొలగించలేదు.. బుమ్రా కీలక ప్రకటన
బెంగళూరు వేదికగా రేపటి (మార్చి 12) నుంచి శ్రీలంకతో ప్రారంభంకానున్న రెండో టెస్ట్ (పింక్ బాల్‌తో డే అండ్ నైట్)కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్‌లో భాగంగా బుమ్రా మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్‌ను జట్టు నుంచి తొలగించారనే విషయంపై స్పష్టత ఇచ్చాడు. కుల్దీప్ బయో బబుల్‌లో ఎక్కువ కాలం నుంచి ఉన్నాడని, అందుకే అతనికి విశ్రాంతి ఇచ్చామని, కుల్దీప్ను అకారణంగా జట్టు నుంచి తప్పించారన్నది అవాస్తవమని వివరణ ఇచ్చాడు. బయో బబుల్‌లో ఎక్కువ కాలం ఉండటం అంత తేలికైన విషయం కాదని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చైనామన్ బౌలర్‌కు విశ్రాంతి ఇచ్చామని చెప్పుకొచ్చాడు. కుల్దీప్ను రిలీజ్ చేయడంతో అతని స్థానాన్ని అక్షర్ పటేల్‌తో భర్తీ చేశామని తెలిపాడు. ఇదే సందర్భంగా పింక్ బాల్ టెస్ట్‌పై బుమ్రా స్పందిస్తూ.. టీమిండియా పింక్ బాల్ టెస్ట్‌లు ఎక్కువగా ఆడలేదని, ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లు భిన్నమైన పిచ్‌లపై ఆడినవని, బెంగళూరు పిచ్ కూడా అంతే భిన్నంగా ఉండాలని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే జైత్రయాత్రను రెండో టెస్ట్‌లోనూ కొనసాగించాలని ఆరాటపడుతున్న రోహిత్ సేన.. డే అండ్ నైట్ టెస్ట్‌లోనూ విజయం సాధించి మరో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. గతంలో టీమిండియా ఆడిన మూడు పింక్ బాల్ టెస్ట్‌ల్లో (బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్) రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. చదవండి: 'పింక్‌బాల్ టెస్టు సవాల్‌తో కూడుకున్నది.. మానసికంగా సిద్ధం' -
'పింక్‌బాల్ టెస్టు సవాల్‌తో కూడుకున్నది.. మానసికంగా సిద్ధం'
శ్రీలంకతో టీమిండియా పింక్‌బాల్ టెస్టు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు వైస్‌కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్‌లో భాగంగా బుమ్రా మాట్లాడాడు. ''డే అండ్ నైట్ టెస్టు ఆడుతున్నామంటే దానికి మానసికంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఫ్లడ్‌లైట్ల వెళుతురులో ఫీల్డింగ్, బౌలింగ్ చేయడం కాస్త సవాల్‌తో కూడుకున్నది. వన్డే, టి20 అయితే ఒక్క రోజులో ముగుస్తుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ పింక్‌బాల్ టెస్టు అంటే ఐదురోజులు ఫ్లడ్లైట్స్ వెళుతురులో ఆడాల్సి ఉంటుంది. అందుకే వీటన్నింటిన మైండ్‌లో పెట్టుకొని మా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నాం. మేము పెద్దగా డే అండ్ నైట్ ఎక్కువగా ఆడలేదు కాబట్టి.. ప్రతీ పింక్‌బాల్ టెస్టులో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక మ్యాచ్‌లో ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉండాలా లేక ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్ తీసుకోవాలా అనేది ఆలోచిస్తున్నాం. డే అండ్ నైట్ టెస్టు అంటే పింక్‌బాల్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. రాత్రిళ్లు పిచ్ సీమర్లకు అనుకూలిస్తుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటే సిరాజ్‌కు చోటు ఉండొచ్చు.. లేదంటే అక్షర్ తుది జట్టులోకి రావొచ్చు. దీనికి సంబంధించిన పారామీటర్స్‌ను ఇంకా సిద్ధం చేసుకోలేదు.'' అంటూ వివరించాడు. ఇక బుమ్రా టీమిండియా తరపున 28 టెస్టుల్లో 115 వికెట్లు తీశాడు. తొలి టెస్టులో టీమిండియా 222 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఇక ఇప్పటివరకు టీమిండియా మూడు పింక్‌బాల్ టెస్టులు ఆడింది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో ఆడిన మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన పింక్‌బాల్ టెస్టులో మాత్రం ఓటమి చవిచూసింది. అటు లంక కూడా మూడు పింక్‌బాల్ టెస్టులు ఆడగా.. రెండింటిలో గెలిచి.. ఒకదాంట్లో ఓటమి చూసింది. చదవండి: Shaheen Afridi-Jadeja: జడ్డూను కాపీ కొట్టిన పాక్ బౌలర్.. ట్రోల్స్ చేసిన క్రికెట్ ఫ్యాన్స్ Rohit Sharma-Gavaskar: 'రోహిత్.. కుదురుకునే వరకు ఆ షాట్ ఆడకపోవడం ఉత్తమం' #TeamIndia vice-captain @Jaspritbumrah93 on the mental changes that need to be made for a Pink Ball Test.@Paytm #INDvSL pic.twitter.com/PCfrY6sJe7 — BCCI (@BCCI) March 11, 2022 Mohali ✈️ Bengaluru Pink-ball Test, here we come 🙌#TeamIndia | #INDvSL | @Paytm pic.twitter.com/9fK2czlEKu — BCCI (@BCCI) March 10, 2022 -
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్
Bengaluru Allows 100 Percent Crowd For Pink Ball Test: క్రికెట్ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారత్, శ్రీలంక మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 12 నుంచి జరుగనున్న రెండో టెస్టుకు(డే అండ్ నైట్) పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అనుమతినిచ్చింది. ఈ మేరకు కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) గురువారం ఓ ప్రకటన చేసింది. కోవిడ్ తర్వాత భారత్‌లో జరిగే ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు 100 శాతం ప్రేక్షకులను అనుమతించడం ఇదే తొలిసారి. గతంలో 50 శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వగా.. వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గిపోవడంతో పింక్ బాల్ టెస్టుకు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించాలని కేఎస్‌సీఏ కోరగా.. ప్రభుత్వం అందుకు ఓకే చెప్పింది. ఇక కోహ్లి వందో టెస్టు ఆడిన మొహలీలో 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు వంద శాతం అనుమతి ఇస్తుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైనట్లు సమాచారం. కోహ్లి స్వస్థలం ఢిల్లీ అయినప్పటికి.. బెంగళూరు అతని హోమ్ గ్రౌండ్‌గా పరిగణిస్తారు. అందుకు కారణం ఐపీఎల్. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతూ వస్తున్నాడు. వాస్తవానికి కోహ్లి వందో టెస్టు ఇక్కడే ఆడించాలని ఫ్యాన్స్ కోరారు. కానీ బీసీసీఐ వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఇప్పటికే తొలి టెస్టును గెలుచుకున్న టీమిండియా రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. Getting Pink Ball Ready 😀😎#TeamIndia | #INDvSL | @Paytm pic.twitter.com/94O8DDzs9x — BCCI (@BCCI) March 9, 2022 -
కోహ్లి వందో టెస్ట్ కోసం భారీ ఏర్పాట్లు.. కన్ఫర్మ్ చేసిన గంగూలీ
టీమిండియా కెప్టెన్సీ అంశం కారణంగా బీసీసీఐ-కోహ్లిల మధ్య గ్యాప్ వచ్చిందన్న పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో బీసీసీఐ బాస్ గంగూలీ వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా కోహ్లి 100వ టెస్ట్ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చి, తమ మధ్యలో ఎలాంటి విభేదాలు లేవన్న సంకేతాలు పంపడంతో పాటు కోహ్లిని వ్యక్తిగతంగా ఖుషీ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో కోహ్లి తన వందో టెస్ట్ మ్యాచ్‌ను ఆడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌ను పింక్ బాల్ టెస్ట్(డే అండ్ నైట్ టెస్ట్)గా మార్చి కోహ్లి కెరీర్లో ప్రత్యేకంగా గుర్తుండిపోయేదిగా మలచాలని గంగూలీ స్కెచ్ వేశాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 25న బెంగళూరు వేదికగా జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ కోహ్లికి వందో టెస్ట్ కానుంది. ఈ మ్యాచ్‌ను సకల హంగూ ఆర్భాటాలతో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇదిలా ఉంటే, విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో లంకేయులు టీమిండియాతో 2 టెస్ట్‌లు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 25న తొలి టెస్ట్(బెంగళూరు), మార్చి 5న రెండో టెస్ట్(మొహాలి), మార్చి 13, 15, 18 తేదీల్లో 3 టీ20లు జరగాల్సి ఉన్నాయి. అయితే, ఒక్క బెంగళూరు టెస్ట్ మినహా మిగతా షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని గంగూలీ సూచనప్రాయంగా వెల్లడించాడు. దేశంలో కోవిడ్ పరిస్థితులు అలాగే షెడ్యూల్లో మార్పుపై లంక క్రికెట్ బోర్డు అభ్యర్ధనను పరిగణలోకి తీసుకుని త్వరలో అప్డేటెడ్ షెడ్యూల్ ప్రకటిస్తారని తెలుస్తోంది. చదవండి: IPL 2022: ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ అక్కడే: గంగూలీ -
కోహ్లిని ఖుషి చేయాలనుకుంటున్న బీసీసీఐ.. వందో టెస్ట్ కోసం భారీ ఏర్పాట్లు..!
టీమిండియా కెప్టెన్సీ అంశం కారణంగా ఇటీవలి కాలంలో బీసీసీఐ-కోహ్లిల మధ్య భారీ గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ గ్యాప్‌ను కవర్ చేసి, కోహ్లిని ఖుషి చేసేందుకు బీసీసీఐ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కోహ్లి 100వ టెస్ట్ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చేందుకు భారీ ఏర్పాట్లు చేస్తుంది. త్వరలో శ్రీలంకతో స్వదేశంలో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో కోహ్లి తన 100వ టెస్ట్ మ్యాచ్‌ను ఆడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌ను పింక్ బాల్ టెస్ట్(డే అండ్ నైట్ టెస్ట్)గా మార్చి కోహ్లి కెరీర్లో ప్రత్యేకంగా గుర్తుండిపోయేదిగా మలచాలని ప్లాన్ చేస్తుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు జాతీయ వార్తా సంస్థతో చెప్పినట్లు సమాచారం. కాగా, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో లంకేయులు టీమిండియాతో 2 టెస్ట్‌లు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వరకు బెంగళూరు వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్.. కోహ్లికి వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్ ముగిశాక లంకతో సిరీస్ మొదలుకానుంది. మరోవైపు భారత పర్యటన షెడ్యూల్లో మార్పులు చేయాలని లంక క్రికెట్ బోర్డు ఇటీవల బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ముందుగా ప్రకటించిన విధంగా తొలుత టెస్ట్ సిరీస్ కాకుండా టీ20లను నిర్వహించాలని ఎస్ఎల్సీ.. బీసీసీఐని రిక్వెస్ట్ చేసింది. ఈ విషయమై భారత క్రికెట్ బోర్డు స్పందించాల్సి ఉంది. కాగా, షెడ్యూల్ ప్రకారం.. లంకతో సిరీస్‌లో ఫిబ్రవరి 25న తొలి టెస్ట్(బెంగళూరు), మార్చి 5న రెండో టెస్ట్(మొహాలి), మార్చి 13, 15, 18 తేదీల్లో 3 టీ20లు జరగాల్సి ఉన్నాయి. చదవండి: 'ఆరంభానికి ముందు ఈ నిరీక్షణ తట్టుకోలేకపోతున్నా' -
డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో స్టార్క్ స్పార్క్.. ఆ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు
Ashes 2021 Australia Vs England 2nd Test: పింక్ బాల్‌తో జరిగే డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ మ్యాజిక్ చేస్తున్నాడు. పింక్ బాల్‌తో మరే ఇతర బౌలర్‌కూ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన స్టార్క్.. పింక్ బాల్ టెస్ట్‌ల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో స్టువర్ట్ బ్రాడ్ వికెట్ పడగొట్టడం ద్వారా స్టార్క్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 9 డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన స్టార్క్ 18.10 సగటుతో 50 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనతను మూడుసార్లు సాధించాడు. పాక్‌పై 6/66 అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టార్క్ తర్వాతి స్థానంలో సహచర బౌలర్లు హేజిల్‌వుడ్(13 ఇన్నింగ్స్‌ల్లో 32 వికెట్లు), నాథన్ లియాన్(16 ఇన్నంగ్స్ల్లో 32 వికెట్లు) ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసి, ఓవరాల్‌గా 282 పరుగుల భారీ అధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగుల వద్ద ఆలౌటైంది. జో రూట్(62; 7 ఫోర్లు), మలాన్(80; 10 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 473/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్ నెగ్గిన ఆసీస్ 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 అధిక్యంలో ఉంది. చదవండి: బీసీసీఐ కీలక అధికారి రాజీనామా -
పింక్ బాల్ టెస్ట్‌లో ఆడడం చాలా కష్టం: మార్నెష్ లబూషేన్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నెష్ లబూషేన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. రెండో రోజు మ్యాచ్ అనంతరం విలేకరల సమావేశంలో మాట్లాడిన లబూషేన్ పలు విషయాలను వెల్లడించాడు. పింక్‌బాల్‌తో ఆడడం చాలా కష్టమని, అంత సులభంగా పరుగులు రాబట్టలేమని లబూషేన్ తెలిపాడు. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడడం చాలా భిన్నమైనదని, ఒక్కో పిచ్‌పై ఒక్కోలా పింక్ బాల్ ప్రవర్తిస్తుందని అతడు చెప్పాడు. "పింక్ బాల్‌తో ఆడడం చాలా కష్టం. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. సాధరణ టెస్ట్ మ్యాచ్ కంటే భిన్నంగా ఉంటుంది. మేము గతంలో ఇదే వేదికలో పాకిస్తాన్‌తో ఆడాము. అప్పుడు వికెట్‌పై కొంచెం గ్రాస్ ఉండడంతో పిచ్ చదునుగా ఉండేది. దీంతో బంతి అంత బౌన్స్‌గా కాలేదు. కానీ ప్రస్తుతం పిచ్‌పై ఎక్కువగా గ్రాస్ ఉండడంతో బంతి ఎక్కువగా బౌన్స్ అవుతోంది. దీంతో ఆడడం చాలా కష్టం అవుతోంది. రెండో రోజు ఆట ప్రారంభించినప్పుడు పరుగులు ఎలా సాధించాలో నాకు అర్ధం కాలేదు" అని లబూషేన్ పేర్కొన్నాడు. ఇక ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 473 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటరల్లో లబూషేన్(103), వార్నర్(95), స్మిత్(93) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతోంది. చదవండి: IPL 2022: ‘‘అవును.. అతడిని తీసుకున్నాం’’.. కొత్త ఫ్రాంఛైజీ మెంటార్‌గా గౌతీ -
టాస్ విషయంలో ధోని నుంచి చాలా నేర్చుకోవాలి
Need to learn from MS Dhoni To Win Toss.. టీమిండియా వుమెన్స్ కెప్టెన్‌గా మిథాలీ రాజ్ టాస్ నెగ్గిన సందర్భాల కంటే ఓడిపోయినవే ఎక్కువగా ఉన్నాయి. మిథాలీకి టాస్ విషయంలో ఏ మాత్రం కలిసిరాదని పలుమార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో మిథాలీ టాస్ ఓడిపోయింది. దీంతో మ్యాచ్ అనంతరం మిథాలీతో జరిగిన ఇంటర్య్వూలో మరోసారి టాస్ ప్రస్తావన వచ్చింది. దీనిపై మిథాలీ రాజ్ ఫన్నీవేలో స్పందించింది. టాస్ ఓడిపోవడం అనేది నా దృష్టిలో పెద్ద విషయం కాదు. అనవసరంగా దీనిని పెద్ద ఇష్యూ చేయడం నాకు ఇష్టం ఉండదు. కాల్ చెప్పడం వరకే నా బాధ్యత.. ఆ తర్వాత జరిగేది నా చేతుల్లో ఉండదు. అయితే టాస్ గెలవడం విషయంలో ధోని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. అని చెప్పుకొచ్చింది. చదవండి: Ind-W Vs Aus-W: 30 ఏళ్ల తర్వాత... తొలిసారిగా.. భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఏకైక డే–నైట్ ‘పింక్ బాల్’ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మూడు దశాబ్దాల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’గా ముగించడం విశేషం. మ్యాచ్ చివరి రోజు ఆస్ట్రేలియాకు భారత్ 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 32 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 2 వికెట్లకు 36 పరుగులు చేసింది. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 143/4తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 96.4 ఓవర్లలో 9 వికెట్లకు 241 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ గురువారం నుంచి మొదలవుతుంది. చదవండి: T20 World Cup 2021: హార్దిక్ పాండ్యాపై విశ్వాసం ఎక్కువ.. అతన్ని తొలగించరు! Talk about taking a cue from @msdhoni to win the toss 🙂🙂#TeamIndia | @M_Raj03 | #AUSvIND pic.twitter.com/kFtDHeuItW — BCCI Women (@BCCIWomen) October 3, 2021 -
Ind-W Vs Aus-W: 30 ఏళ్ల తర్వాత... తొలిసారిగా..
Ind W Vs Aus W Pink Ball Test: భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఏకైక డే–నైట్ ‘పింక్ బాల్’ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మూడు దశాబ్దాల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’గా ముగించడం విశేషం. 1991 జనవరిలో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌ను భారత్ చివరిసారి ‘డ్రా’ చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లో భారత్ ఓడిపోయింది. తాజా టెస్టులో మ్యాచ్ చివరి రోజు ఆస్ట్రేలియాకు భారత్ 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 32 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 2 వికెట్లకు 36 పరుగులు చేసింది. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 143/4తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 96.4 ఓవర్లలో 9 వికెట్లకు 241 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో.... 136 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 37 ఓవర్లలో 3 వికెట్లకు 135 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. షఫాలీ వర్మ (52; 6 ఫోర్లు), స్మృతి మంధాన (31; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన 25 ఏళ్ల స్మృతి మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ గురువారం నుంచి మొదలవుతుంది. Watch highlights from that innings here #AUSvIND https://t.co/7lk4fXLqmJ — cricket.com.au (@cricketcomau) October 3, 2021 The sides will have to settle for two points apiece after four tough days of Test cricket. #AUSvIND #PinkBallTest https://t.co/H6lNJOUhGR — cricket.com.au (@cricketcomau) October 3, 2021 -
పేలవ డ్రాగా ముగిసిన పింక్ బాల్ టెస్ట్
గోల్డ్‌కోస్ట్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ‘పింక్ బాల్’ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 143/4తో చివరి రోజు(ఆదివారం) ఆటను కొనసాగించిన ఆసీస్ మహిళల జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మిథాలీ సేన.. 36 ఓవర్లు ఆడి 3 వికెట్లు కోల్పోయి 135 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి 272 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందుంచింది. అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. మ్యాచ్ ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. సూపర్ శతకంతో అలరించిన మంధాన(127)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: 'లైగర్'తో యువ్‌రాజ్ సింగ్ పోటీ.. గెలుపెవరిది..? -
భారత్ 377/8 డిక్లేర్డ్.. రాణించిన దీప్తి శర్మ
గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ‘పింక్ బాల్’ టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 276/5తో శనివారం ఆటను కొనసాగించిన భారత మహిళల జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 145 ఓవర్లలో 8 వికెట్లకు 377 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాపై భారత్‌కిదే అత్యధిక స్కోరు. ఆ్రస్టేలియా గడ్డపై విదేశీ జట్టు చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే. ఓవర్‌నైట్ బ్యాటర్ దీప్తి శర్మ (167 బంతుల్లో 66; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను జులన్ గోస్వామి (2/27), పూజా వ్రస్తాకర్ (2/31) ఇబ్బంది పెట్టారు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 143 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (27 బ్యాటింగ్; 3 ఫోర్లు), గార్డ్నర్ (13 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే ఆ్రస్టేలియా మరో 85 పరుగులు చేయాల్సి ఉంది. నేడు ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ భారత్ గెలవాలంటే మాత్రం... ఆదివారం జరిగే మూడు సెషన్స్‌లోనూ బౌలర్లు అద్భుతంగా రాణించాలి. తొలి సెషన్లో ఆస్ట్రేలియాను 228 పరుగులలోపు ఆలౌట్ చేయాలి. అప్పుడు ఆ జట్టు ఫాలోఆన్ ఆడే అవకాశం ఉంటుంది. చివరి రెండు సెషన్స్‌లో (దాదాపు 60 ఓవర్లలో) మరోసారి ఆస్ట్రేలియాను 150లోపు ఆలౌట్ చేయగలిగితే భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకోగలదు. -
పూనమ్‌పై ప్రశంసలు.. ‘నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు’
Beth Mooney Commnets On Punam Raut dismissal: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్ట్‌లో భారత మహిళా జట్టు బ్యాటర్ పూనమ్ రౌత్ ప్రదర్శించిన క్రీడా స్పూర్తి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నది. రెండో రోజు భారత్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఆసీస్ బౌలర్ మోలిన్యూక్స్ వేసిన బంతిని పూనమ్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్‌ను తాకి నేరుగా కీపర్ హీలీ చేతిలోకి వెళ్లింది. కీపర్‌తో పాటు ,ఆసీస్ క్రికెటర్లు అందరూ అవుట్ అని అప్పీల్ చేయగా.. అంపైర్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా తాను ఔటయినట్టు నిర్ధారించుకున్న రౌత్ పెవిలియన్ బాట పట్టింది. ఈ సిరీస్‌లో డీఆర్ఎస్ కూడా అందుబాటులో లేదు. అయినప్పటకీ మైదానాన్ని వదిలి వెళ్లి ఆసీస్ క్రికెటర్లను సైతం పూనమ్ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ మాట్లాడుతూ.. ఒక వేళ ఆమె స్ధానంలో నేను ఉంటే అస్సలు గ్రౌండ్‌ని వదిలి వేళ్లేదాన్ని కాదని తోటి ఆటగాళ్లతో మాట్లాడింది. ఈ సంభాషణ అంతా స్టంప్ మైక్రోఫోన్లో రికార్డయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... భారత్ ఆడుతున్న తొలి డే నైట్ టెస్టులో సెంచరీ సాధించి స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మంధాన 216 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్స్‌తో 127 పరుగులు సాధించింది. వర్షంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 101.5 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. Unbelievable scenes 😨 Punam Raut is given not out, but the Indian No.3 walks! #AUSvIND | @CommBank pic.twitter.com/xfAMsfC9s1 — cricket.com.au (@cricketcomau) October 1, 2021 చదవండి: Virender Sehwag: ‘ఇక చాలు... ఈసారి ముంబై అస్సలు పైకి రావొద్దు’ -
డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ.. స్మృతి మంధాన సరి కొత్త చరిత్ర
Smriti Mandhana Maiden Century: భారత ఓపెనర్ స్మృతి మంధాన (216 బంతుల్లో 127; 22 ఫోర్లు, 1 సిక్స్) ‘పింక్ బాల్’ టెస్టులో చరిత్రకెక్కింది. భారత్ ఆడుతున్న తొలి డే నైట్ టెస్టులో ఆమె శతకం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన రెండో రోజు ఆటలో ఆమె సెంచరీ హైలైట్‌గా నిలిచింది. వర్షంతో ఆట ముగిసే సమయానికి భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 101.5 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. రెండో రోజు వర్షం, ప్రతికూల వాతా వరణంతో 57.4 ఓవర్ల ఆటే సా«ధ్యమైంది. డిన్నర్ బ్రేక్ తర్వాత ఆట కాసేపే (17 ఓవర్లు) జరిగింది. పటిష్టస్థితిలో భారత్ ఓవర్‌నైట్ స్కోరు 132/1తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్‌ను స్మృతి పటిష్ట స్థితిలో నిలిపింది. ఆట మొదలైన రెండో ఓవర్లోనే పెర్రీ క్యాచ్ జారవిడువడటంతో బతికిపోయిన స్మృతి తర్వాత ఎలాంటి పొరపాటుకు తావివ్వలేదు. స్ట్రయిట్ డ్రైవ్‌లతో బౌలర్లను ఓ ఆటాడుకుంది. ఆఫ్‌సైడ్‌లో ఫీల్డర్లను పదేపదే పరిగెత్తించింది. ఆమె చేసిన 127 పరుగుల్లో 94 (22 ఫోర్లు, సిక్స్) పరుగులు బౌండరీల రూపంలో రావడం విశేషం. 170 బంతుల్లో కెరీర్లో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేసిన ఆమె రెండో వికెట్‌కు పూనమ్ రౌత్‌తో కలిసి 102 పరుగులు జతచేసింది. స్వల్ప వ్యవధిలో స్మృతితో పాటు రౌత్ (36; 2 ఫోర్లు) నిష్క్రమించాక 231/3 స్కోరు వద్ద భారత్ భోజన విరామానికెళ్లింది. తర్వాత కెపె్టన్ మిథాలీ రాజ్ (30; 5 ఫోర్లు), యస్తిక భాటియా (19) కాసేపు ఆడారు. ఆట నిలిచే సమయానికి దీప్తి శర్మ (12 బ్యాటింగ్), తానియా (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సోఫీ మోలినెక్స్కు 2 వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన విదేశీ మహిళా క్రికెటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. గతంలో ఈ రికార్డు మోలీ హైడ్ (124 నాటౌట్–ఇంగ్లండ్; 1949లో) పేరిట ఉండేది. ఆ్రస్టేలియా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ స్మృతి. సంధ్యా అగర్వాల్ (134; 1984లో) తర్వాత ఆ్రస్టేలియా జట్టుపై టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాటర్ స్మృతి. ఆ్రస్టేలియా జట్టుపై వన్డేల్లో, టెస్టుల్లో సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్ స్మృతి. గతంలో ఎనిడ్ బేక్వెల్ (ఇంగ్లండ్), దెబోరా హాక్లీ (న్యూజిలాండ్), క్లెయిర్ టేలర్ (ఇంగ్లండ్) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
అంపైర్ ఔటివ్వలేదు.. పెవిలియన్ చేరి మనసులు దోచుకుంది
Punam Raut Walks Despite Being Given Not Out.. ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో టీమిండియా బ్యాటర్స్ ఒకేరోజు రెండు అద్భుతాలు చేసి చూపించారు. ఆసీస్ గడ్డపై సెంచరీ బాదిన తొలి టీమిండియా మహిళా క్రికెటర్‌గా.. తొలి పింక్ బాల్ టెస్టులోనే శతక్కొట్టిన స్మృతి మంధన చరిత్ర సృష్టించగా.. మరో టీమిండియా బ్యాటర్ పూనమ్ రౌత్ అభిమానుల మనసులు గెలుచుకుంది. అంపైర్ ఓటవ్వికున్నా తనకు తానుగా క్రీజు వీడి క్రీడాస్పూర్తి ప్రదర్శించింది. విషయంలోకి వెళితే.. పింక్‌బాల్ టెస్టులో భాగంగా ఆట రెండో రోజు పూనమ్ రౌత్ 36 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 81వ ఓవర్లో మొలినుక్స్ వేసిన నాలుగో బంతిని పూనమ్ ఫ్లిక్ చేయగా.. కీపర్ హీలే దానిని అందుకుంది. అంపైర్‌కు అప్పీల్ చేయగా అతను ఔట్ కాదంటూ సిగ్నల్ ఇచ్చాడు. చదవండి: Smriti Mandhana: చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లో రికార్డు శతకం.. కోహ్లి తర్వాత..! అయితే రౌత్ మాత్రం బంతి తన బ్యాట్‌కు తగిలిందని నిర్థారణకు వచ్చి అంపైర్ నిర్ణయం చూడకుండానే వాకౌట్ చేసింది. ఈ చర్యతో అంపైర్‌తో పాటు ఆసీస్ మహిళా క్రికెటర్లు ఆశ్చర్యపోయారు.. అనంతరం క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన పూనమ్‌ను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా స్వయంగా ట్విటర్లో షేర్ చేసింది. ''నమ్మశక్యం కాని విషయం.. పూనమ్ రౌత్ ఔట్ కాదని అంపైర్ అన్నాడు.. కానీ ఆమె పెవిలియన్‌కు చేరింది.. సూపర్ పూనమ్ రౌత్ అంటూ క్యాప్షన్ జత చేసింది. పూనమ్ రౌత్ చేసిన పనిని మెచ్చకుంటున్న అభిమానులు ఆమె క్రీడాస్పూర్తిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇక టీమిండియా రెండో రోజు టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. క్రీజ్‌లో దీప్తి శర్మ(12), తానియా భాటియా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో సోఫి మోలినెక్స్ 2, ఆష్లే గార్డనర్, ఎలైస్ పెర్రీ తలో వికెట్ పడగొట్టగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(30) రనౌటైంది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ(31), పూనమ్ రౌత్(36) పర్వాలేదనిపించగా, యస్తికా భాటియా(19) నిరాశపరిచింది. అంతకుముందు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చదవండి: Ashes Series: మిమ్మల్ని ఎవరూ రమ్మని బలవంతం చేయడం లేదు Unbelievable scenes 😨 Punam Raut is given not out, but the Indian No.3 walks! #AUSvIND | @CommBank pic.twitter.com/xfAMsfC9s1 — cricket.com.au (@cricketcomau) October 1, 2021 -
చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లో రికార్డు శతకం.. కోహ్లి తర్వాత..!
Smriti Mandhana Slams Maiden Hundred in Historic Pink Ball Test: ఆసీస్ మహిళల జట్టుతో జరుగుతున్న చారిత్రక పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధాన(216 బంతుల్లో 127; 22 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకం సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ శతకంతో స్మృతి మంధాన పలు రికార్డులు నెలకొల్పింది. పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా మహిళల జట్టు తరఫున సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా, తొలి పింక్ బాల్ టెస్ట్‌లోనే శతక్కొట్టిన బ్యాటర్‌గా, అలాగే ఆసీస్ గడ్డపై సెంచరీ బాదిన తొలి టీమిండియా మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. గతంలో పురుషుల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి పింక్ బాల్ టెస్ట్‌లో సెంచరీ కొట్టాడు. 2019లో కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ టెస్ట్‌లో కోహ్లి 136 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే, స్మృతి మంధాన టెస్ట్ కెరీర్లో తన తొలి శతకం సాధించడంతో టీమిండియా రెండో రోజు టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. క్రీజ్‌లో దీప్తి శర్మ(12), తానియా భాటియా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో సోఫి మోలినెక్స్ 2, ఆష్లే గార్డనర్, ఎలైస్ పెర్రీ తలో వికెట్ పడగొట్టగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(30) రనౌటైంది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ(31), పూనమ్ రౌత్(36) పర్వాలేదనిపించగా, యస్తికా భాటియా(19) నిరాశపరిచింది. అంతకుముందు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చదవండి: కోహ్లిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అతనే డేంజర్ మ్యాన్ -
పింక్ బాల్ టెస్టుకు వరుణుడి అడ్డంకి..సెంచరీకి చేరువలో స్మృతి మంధాన
Pink Ball Test: భారత్, ఆస్ట్రేలియా మహిళల మధ్య జరుగుతున్నచరిత్రత్మాక డే అండ్ నైట్ టెస్టు మొదటి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. క్వీన్స్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 44.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 132 పరుగులు చేసింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన , షెఫాలి వర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 93 పరుగల బాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా 64 బంతుల్లో 31 పరగులు చేసిన షెఫాలి తొలి వికెట్‌గా వెనుదిరిగింది. స్మృతి మంధాన 144 బంతుల్లో 80 పరగులు చేసి సెంచరీకు చేరువలో ఉంది. ప్రస్తుతం మంధాన, పూనమ్ రౌత్ క్రీజులో ఉన్నారు. చదవండి: IPL 2021 2nd Phase RCB Vs RR: ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు.. -
IndW Vs AusW Pink Ball Test: భారత అమ్మాయిల ‘పింక్’ ఆట
గోల్డ్‌కోస్ట్: భారత మహిళల జట్టు ‘పింక్’ టెస్టుకు ‘సై’ అంటోంది. ఆ్రస్టేలియాతో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే నాలుగు రోజుల టెస్టు నేటి నుంచి జరగనుంది. మిథాలీ రాజ్ బృందానికి డే–నైట్ టెస్టు కొత్తనుకుంటే... ఆసీస్‌తో ఆడటం కూడా ఒక రకంగా కొత్తే! ఎందు కంటే ఇరు జట్ల మధ్య సంప్రదాయ మ్యాచ్ జరిగి దశాబ్దంన్నరకాలం అవుతోంది. ఆఖరిసారిగా 2006లో ఇరు జట్లు టెస్టులో తలబడ్డాయి. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ముఖాముఖీ టెస్టు పోరుకు ఇప్పుడు సిద్ధమయ్యాయి. కెపె్టన్ మిథాలీ రాజ్, వెటరన్ సీమర్ జులన్ గోస్వామి అప్పటి మ్యాచ్ ఆడారు. ఇప్పుడు వీళ్లిద్దరితో ఆడుతున్న వాళ్లంతా కొత్తవాళ్లే! ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో టెస్టు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఏకైక టెస్టులో మిథాలీ సేన చక్కని పోరాటస్ఫూర్తి కనబరిచింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా 2019లో యాషెస్ సిరీస్ ఆడాక మళ్లీ టెస్టులే ఆడలేదు. ఈ నేపథ్యంలో భారత అమ్మాయిలకు ఇంగ్లండ్‌తో టెస్టు అనుభవం పైచేయి సాధించేందుకు దోహదం చేయొచ్చు. జట్లు (అంచనా) భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి, పూనమ్ రౌత్/యస్తిక, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, తానియా, పూజ/శిఖా పాండే, జులన్, మేఘన, రాజేశ్వరి గైక్వాడ్. ఆ్రస్టేలియా మహిళల జట్టు: మెగ్ లానింగ్ (కెప్టెన్), అలీసా హీలీ, బెత్ మూనీ, ఎలీస్ పెర్రీ, తాలియా, యాష్ గార్డెనెర్, సదర్లాండ్, సోఫీ, వేర్హామ్, డార్సీ బ్రౌన్, స్టెల్లా. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటివరకు 9 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 5 టెస్టుల్లో గెలుపొందగా, నాలుగు ‘డ్రా’గా ముగిశాయి. భారత్ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. -
చరిత్ర సృష్టించనున్న మిథాలీ సేన..
ముంబై: భారత మహిళా క్రికెట్ లో మరో ఘట్టానికి తెర లేవనుంది. మహిళల క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకు వేళ్లేందుకు బీసీసీఐ అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు తమ తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో మిథాలీ సేన పింక్ బాల్ టెస్ట్ ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ మ్యాచ్ జరగునుంది. ఈ విషయాన్ని భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే మహిళల క్రికెట్ చరిత్రలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే పింక్‌బాల్ టెస్టు రెండోది మాత్రమే. 2017లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.జూన్ 2న భారత పురుషులతో పాటు మహిళలు కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఏడేళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో మిథాలీ సేన టెస్టు మ్యాచ్ ఆడనుంది. జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. (చదవండి:ఇంగ్లండ్ వేదికగా ఐపీఎల్ ?) -
'థ్యాంక్స్ పీటర్సన్.. అర్థం చేసుకున్నందుకు'
ముంబై: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ థ్యాంక్స్ చెప్పాడు. అసలు విషయంలోకి వెళితే.. మొటేరా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఫలితంపై పలువురు మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పిన్ పిచ్‌కు అనుకూలించే ఈ పిచ్ టెస్టు మ్యాచ్‌లకు పనికిరాదంటూ విమర్శలు గుప్పించారు. అయితే పీటర్పన్ మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పింక్ బాల్ టెస్టుపై కాస్త భిన్నంగా స్పందించాడు. ''మ్యాచ్ తర్వగా ముగియడం నిరాశ కలిగించినా.. బ్యాట్స్‌మెన్ వైఫల్యమే అందుకు ప్రధాన కారణం. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇరు జట్లు బ్యాటింగ్‌లో విఫలమయ్యాయి. ఆటగాళ్లు నిజాయితీగా ఉంటే ఫేలవంగా ఆడామని వారే ఒప్పుకుంటారు. కొందరు పని గట్టుకొని పిచ్‌ను విమర్శించడం నచ్చలేదు. అయినా మ్యాచ్‌లో 30 వికెట్లు పడితే .. అందులో 21 వికెట్లు నేరుగా వేసిన బంతుల వల్లే పడ్డాయి. వాస్తవానికి పిచ్‌తో ఎలాంటి ప్రమాదం లేదు. బ్యాట్స్‌మెన్ కాస్త జాగ్రత్తగా ఆడి ఉంటే మ్యాచ్ మూడు, నాలుగు రోజుల దాకా వెళ్లి ఉండేది. అంటూ చెప్పుకొచ్చాడు. పీటర్సన్ కామెంట్స్‌పై రోహిత్ శర్మ స్పందిస్తూ.. ''థ్యాంక్స్ పీటర్సన్.. కనీసం ఆట గురించి ఒక్కరైనా అర్థం చేసుకున్నందుకు'' అంటూ తెలిపాడు. మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. కాగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మార్చి 4 నుంచి అహ్మదాబాద్ వేదికగానే జరగనుంది. చదవండి: పింక్ బాల్ టెస్టు: పీటర్సన్ ట్వీట్ వైరల్ వాళ్లు ఆలోచించరు.. మాకు అవసరమా: రోహిత్ View this post on Instagram A post shared by Kevin Pietersen 🦏 (@kp24) -
కోహ్లి విచిత్ర భాష.. షాక్‌లో పాండ్యా, అక్షర్
అహ్మదాబాద్: మొటేరా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా విజయంలో లోకల్ స్టార్ అక్షర్ పటేల్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తం 11 వికెట్లు తీసిన అక్షర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్.. మరో లోకల్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అక్షర్‌కు కంగ్రాట్స్ చెబుతూ సరదాగా ఇంటర్య్వూ చేశాడు. అయితే వీరి ఇంటర్య్వూ సీరియస్‌గా సాగుతున్న వేళ విరాట్ కోహ్లి అక్కడికి వచ్చాడు. అల్లరి చేయడంలో కోహ్లి అందరికంటే ముందు వరుసలో ఉంటాడు. మ్యాచ్ గెలిచామన్న ఆనందంతో మరింత జోష్‌లో ఉన్న కోహ్లిని హార్దిక్ 'వెల్కమ్ ఇండియన్ కెప్టెన్' అంటూ పరిచయం చేశాడు. అయితే హార్దిక్ ప్రశ్న అడిగేలోపే అతని చేతిలో నుంచి మైకు లాక్కొన్న కోహ్లి అక్షర్‌ను ఉద్ధేశించి గుజరాతీ భాషలో ఏదో అన్నాడు. దీంతో అక్షర్ నవ్వగా.. ఆశ్యర్య పోవడం హార్దిక్ వంతైంది. అయితే వెంటనే తేరుకున్న హార్దిక్..'' కోహ్లి బహుశా గుజరాతీ భాష నేర్చుకుంటున్నాడు. అందుకే అప్పుడప్పుడు ఇలా గుజరాతీలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు'' అంటూ చమత్కరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పింక్ బాల్ టెస్టులో విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అర్హతకు మరింత దగ్గరైంది. టీమిండియా నాలుగో టెస్టు మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా.. లేక గెలిచినా డబ్య్లూటీసీ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. కాగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 4 నుంచి మొదలుకానుంది. చదవండి: 'కోహ్లి మాటలు నాకు కోపం తెప్పించాయి' అశ్విన్ 11వ సారి.. అక్షర్ రెండో బౌలర్‌గా DO NOT MISS: @hardikpandya7 interviews man of the moment @akshar2026.👍👍 - By @RajalArora P.S.: #TeamIndia skipper @imVkohli makes a special appearance 😎@Paytm #INDvENG #PinkBallTest Watch the full interview 🎥 👇 https://t.co/kytMdM4JzN pic.twitter.com/QLJWMkCNM5 — BCCI (@BCCI) February 26, 2021 -
'పిచ్‌ను నిందించడం కాదు.. ఫుట్‌వర్క్‌పై దృష్టి పెట్టండి'
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఆ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ ఔటైన తీరు పట్ల టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పిచ్‌పై నింద వేయడం కన్నా.. షాట్ సెలక్షన్, ఫుట్‌వర్క్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. పింక్ బాల్ టెస్టులో టీమిండియా విజయం అనంతరం అజారుద్దీన్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ''అహ్మదాబాద్ టెస్టులో స్పిన్నర్ల దాటికి బ్యాట్స్‌మెన్ కుప్పకూలడం నిరుత్సాహాపరిచింది. అలాంటి డ్రై ట్రాక్‌లపై బ్యాటింగ్ చేయాలంటే.. షాట్ల ఎంపికతో పాటు ఫుట్‌వర్క్ కీలకపాత్ర పోషిస్తుంది.బ్యాటింగ్ సమయంలో స్పైక్ షూ ధరించడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు. ఇలాంటి పిచ్‌లపై రబ్బర్ సోల్ ఉన్న షూలను ధరించడం వల్ల బ్యాట్స్‌మెన్ సామర్థ్యం తగ్గదు. బ్యాటింగ్‌కు అనుకూలించని ఇలాంటి నిర్జీవమైన మైదానాల్లో ఉత్తమ టెస్ట్ ఇన్నింగ్స్‌లను ఎన్నో చూశాను. గతంలో ఇలాంటి పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ కేవలం రబ్బర్ సోల్స్ ధరించి రాణించారు. రబ్బర్ షూ ధరించిన ఆటగాళ్లు పిచ్‌పై జారిపడుతారన్న వాదన తప్పు. వింబుల్డన్ లాంటి టెన్నిస్ టోర్నీల్లో ప్లేయర్లు రబ్బర్ షూలతోనూ ఆడుతున్నారు. గతంలో టీమిండియా దిగ్గజాలు సునీల్ గవాస్కర్, మోహిందర్ అమర్నాథ్, దిలీప్ వెంగ్‌సర్కార్‌తో పాటు విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, మైక్ గ్యాటింగ్, అలెన్ బోర్డర్ లాంటి వాళ్లు రబ్బర్ సోల్ ఉన్న షూతోనే ఆడేవారు. డ్రై పిచ్‌లపై రబ్బర్ సోల్ ఉన్న షూస్‌ను ప్రిఫర్ చేయడం మంచిదని నా అభిప్రాయం'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: 'కోహ్లి మాటలు నాకు కోపం తెప్పించాయి' టెస్టు క్రికెట్‌కు మంచిది కాదు; అశ్విన్ సీరియస్ ట్వీట్! It was disappointing to watch the batsmen come a cropper in the Ahmedabad Test.The key to batting on such dry tracks and rank turners is shot-selection and assured footwork. It makes little sense to wear spikes when batting.Rubber soles dont hamper ability of batsmen (1/3) — Mohammed Azharuddin (@azharflicks) February 26, 2021 -
'కోహ్లి మాటలు నాకు కోపం తెప్పించాయి'
అహ్మదాబాద్: మొటేరా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో విజయం వెనుక పిచ్ కీలకపాత్ర పోషించిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. పిచ్ పరిస్థితి దారుణంగా ఉందని.. అసలు ఆడుతుంది టెస్టు మ్యాచ్ లేక టీ20 మ్యాచ్ అన్న అనుమానం కలిగిందంటూ పేర్కొన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురువారం మ్యాచ్ విజయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ''పిచ్‌లో ఏం తప్పు లేదు.. బ్యాట్స్‌మెన్ వైఫల్యం వల్లే మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసింది. నిజాయితీగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటింగ్ నాణ్యతలో లోపం ఉంది. మొదటి రోజు 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసి ఆటను ముగించాం. కానీ రెండో రోజు దానికి మరో 46 పరుగులు మాత్రమే జత చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయాం. ఇదే విషయం ఇంగ్లండ్ బ్యాటింగ్‌లోనూ నిజమైంది. వాస్తవానికి తొలి ఇన్నింగ్స్ సమయంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి కోల్పోయిన 30 వికెట్లలో 21 వికెట్లు నేరుగా విసిరిన బంతులకే పడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మన డిఫెన్స్‌పై నమ్మకం పెట్టుకోకకుండా పిచ్‌ను నిందించడం సరికాదు. టెస్టు క్రికెట్లో నెమ్మైదన ఆట ఆడడం ప్రధానం. అలా ఆడకపోవడం.. పరుగులు చేయలేకపోవడం వల్లే మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసింది'' అని తెలిపాడు. తాజాగా కోహ్లి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''కోహ్లి వ్యాఖ్యలు నాకు కోపం తెప్పించాయి. పింక్ బాల్ టెస్టులో పిచ్ తప్పు ఏం లేదని.. బ్యాట్స్‌మెన్ వైఫల్యం ప్రధాన కారణమని అంటున్నాడు. ఇది తప్పు.. స్పిన్ బాగా ఆడగలడని పేరున్న కోహ్లి, జో రూట్లు కూడా మూడో టెస్టులో ఆత్మరక్షణ ధోరణిలో పడ్డారు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ ఢిఫెన్స్ మోడ్‌కు ఇద్దరు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. నిజానికి మొటేరా పిచ్ బ్యాటింగ్ చేయడానికి ఏ మాత్రం అనువుగా లేదు. బంతులన్ని వికెట్ల మీదకు వస్తుంటే ఏ బ్యాట్స్‌మెన్ అయినా ఎలా ఆడగలుగుతాడు.. ఈ విషయం తెలిసి కూడా కోహ్లి బ్యాట్స్‌మెన్ వైఫల్యం అనడం నచ్చలేదు.'' అంటూ చురకలంటించాడు. చదవండి: స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్ -
పిచ్‌పై యువీ సెటైర్లు.. అశ్విన్ సీరియస్ ట్వీట్!
అహ్మదాబాద్: ‘‘తమ వద్ద ఉన్న ఉత్పత్తులను అమ్ముకునేందుకు చాలా మంది వివిధ రకాల మార్కెట్ వ్యూహాలు అనుసరిస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన, ఆమోదయోగ్యమైన విధానమే! అయితే ఇప్పుడు మనం ఎలాంటి యుగంలో నివసిస్తున్నాం అంటే... ఇక్కడ మనకు ఐడియాలు కూడా అమ్ముతారు. ఔట్‌బౌండ్ మార్కెటింగ్‌కు ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇవి ఎలాంటివి అంటే.. ‘‘మీరు మీ సొంతంగా ఆలోచించకూడదు’’ అని చెబుతున్నట్లుగా ఉంటాయి. అంతేకాదు, మీరు ఎలా ఆలోచించాలో, అది కూడా మేం ఏం కోరుకుంటామో, అదే తరహాలో ఆలోచించాలని బోధిస్తాయి. ఒక మంచి గేమ్ ఆడిన తర్వాత.. నాకేం అనిపించిందంటే.. ఇలాంటి ఐడియాలు మనం కొంటూ ఉన్నంత వరకు అవి మన గొంతునొక్కేస్తూనే ఉంటాయి. గళమెత్తకుండా చేస్తాయి. చివరగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే... మన అభిప్రాయాలకు మనం కట్టుబడి ఉండాలి. మెజారిటీ ప్రజలు దానిని వ్యతిరేకించినా సరే మన ఆలోచనకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే.. అది మనకు ఎవరో అమ్మిన ఐడియా కాదు కదా! ఏదేమైనా చాయిస్ మన చేతుల్లోనే ఉంటుంది’’ అంటూ టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిమానులను సందేహంలో పడేశాడు. మార్కెటింగ్ టెక్నిక్‌ల గురించి చెబుతున్నట్లుగా ఉన్న ఈ ట్వీట్‌తో విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో అశ్విన్ ఏడు వికెట్లు తీసి సత్తా చాటిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను అవుట్ చేయడం ద్వారా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో 400 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అంతేగాక టెస్టుల్లో అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన తొలి టీమిండియా ఆటగాడిగా.. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. టీమిండియా బౌలర్లలో అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417) మాత్రమే 400 వికెట్ల క్లబ్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో మొతేరా పిచ్‌ను రూపొందించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పేసర్లకు అనుకూలం అనుకున్న ఈ పిచ్‌పై ఇరు జట్ల స్పిన్నర్లు చెలరేగిపోవడంతో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్... ‘‘రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడం టెస్టు క్రికెట్‌కు అంత మంచిది కాదు. ఒకవేళ అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఈ పిచ్‌పై బౌలింగ్ చేస్తే వెయ్యి లేదా 800 వికెట్ల మైలురాయి వద్ద కూర్చునేవారేమో? ఏదైతేనేమి టీమిండియాకు శుభాకాంక్షలు. అక్షర్ పటేల్ స్పెల్ అద్భుతం! అశ్విన్‌కు కంగ్రాట్స్. వందో టెస్టు ఆడిన ఇషాంత్ శర్మకు కూడా’’అంటూ పిచ్‌పై వ్యంగ్య రీతిలో ట్వీట్ చేశాడు. ఇందుకు బదులుగానే అశ్విన్ పైవిధంగా స్పందించి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పిచ్‌ను సాకుగా చూపి, 72 టెస్టుల్లోనే 400 వికెట్లు తీసిన అశ్విన్ ప్రతిభను తక్కువ చేసి చూపడం సరికాదని హితవు పలుకుతున్నారు. అయితే ఆ ట్వీట్ల వెనుక ఆంతర్యం ఏమిటో అశ్విన్‌కు మాత్రమే తెలియాలి! Products are sold using various marketing strategies and that’s an accepted practice! We now live in an era where ideas are also being sold to us and it’s a classic example of “outbound marketing”, however I would like to add that buying ideas being sold to us is like telling us — Ashwin 🇮🇳 (@ashwinravi99) February 26, 2021 This Tweet Related to this 👇 pic.twitter.com/hEVXYZGLq3 — Aashik (@Aashiik180) February 26, 2021 చదవండి: అద్భుత విజయం.. అగ్రస్థానంలో టీమిండియా ఆర్చర్ ఔట్, రికార్డు సృష్టించిన అశ్విన్ -
చరిత్రలో ఇది ఏడోసారి మాత్రమే
అహ్మదాబాద్: పింక్ బాల్ టెస్టులో టీమిండియా అద్బుత విజయంతో పాటు పలు రికార్డులు బద్దలయ్యాయి. ఐదు రోజులు జరగాల్సిన ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. టెస్టు క్రికెట్ అత్యంత తక్కువ బాల్స్‌లోనే మ్యాచ్ ముగియడం చరిత్రలో ఏడోసారి మాత్రమే. తాజాగా పింక్ బాల్ టెస్టులో 842 బంతుల్లోనే ఫలితం వచ్చింది. కాగా ఈ ఏడులో ఆరు డే టెస్టులు కాగా.. ఇండియా, ఇంగ్లండ్ మాత్రమే డే నైట్ కావడం విశేషం. ఒకసారి ఆ వివరాలు పరిశీలిస్తే.. ►1923లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా( మెల్బోర్న్.. 656 బంతులు) తొలి స్థానం ►1935లో వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్( బ్రిడ్జ్‌టౌన్.. 672 బంతులు) రెండో స్థానం ►1888లో ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా( మాంచెస్టర్.. 788 బంతులు) మూడో స్థానం ►1888లో ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా( మాంచెస్టర్.. 788 బంతులు) నాలుగో స్థానం ►1889లో దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్( కేప్‌టౌన్.. 796 బంతులు) ఐదో స్థానం ►1912లో ఇంగ్లండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా( ఓవల్.. 815 బంతులు) ఆరో స్థానం ►2021లో ఇంగ్లండ్ వర్సెస్ టీమిండియా(అహ్మదాబాద్.. 842 బంతుల) ఏడో స్థానం చదవండి: స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్ -
స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘన విజయం ద్వారా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు కోహ్లి సారధ్యంలో స్వదేశంలో 29 టెస్టులాడిన టీమిండియా 22 విజయాలు సాధించింది. తాజాగా పింక్ బాల్ టెస్టు విజయంతో ధోనిని కోహ్లి అధిగమించాడు. కాగా ధోని సారధ్యంలో స్వదేశంలో టీమిండియా 21 విజయాలు సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్‌గా కోహ్లి సారధ్యంలో భారత్ ఇప్పటివరకు 59 టెస్టులాడి 35 విజయాలు సాధించింది. స్వదేశం, విదేశం కలుపుకొని టీమిండియాకు టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించి పెట్టిన కెప్టెన్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కోహ్లి తర్వాత ధోని 60 మ్యాచ్‌ల్లో 27 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. గంగూలీ 21 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 49 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. మూడో టెస్టు విజయంతో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జూన్‌లో లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇంగ్లండ్, టీమిండియాల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ మార్చి 4 నుంచి అహ్మదాబాద్ వేదికలోనే జరగనుంది. చదవండి: అద్భుత విజయం.. అగ్రస్థానంలో టీమిండియా పాపం కోహ్లి.. భయపడి పారిపోయాడు -
మూడో టెస్ట్ : 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం
-
అశ్విన్ 11వ సారి.. అక్షర్ రెండో బౌలర్‌గా
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌లు అరుదైన రికార్డు సాధించారు. ముందుగా అక్షర్ పటేల్ విషయానికి వస్తే .. మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన అతను రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లను పడగొట్టాడు. ఓవరాల్‌గా ఒక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 11 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఒక డే నైట్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అక్షర్(11/70) తొలి స్థానంలో నిలిచాడు. ఆసీస్‌కు చెందిన పాట్ కమిన్స్( 10/62)తో రెండో స్థానంలో.. విండీస్ స్పిన్నర్ దేవేంద్ర బిషో(10/174)తో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేగాక ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ దక్కించుకున్న ఆటగాడిగా అక్షర్ ఏదో స్థానంలో.. టీమిండియా నుంచి రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. భారత్ నుంచి తొలి ఆటగాడిగా అశ్విన్ ఉన్నాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను అవుట్ చేయడం ఇది 11వ సారి కావడం విశేషం. ఒక బ్యాట్స్‌మెన్‌ను ఇన్నిసార్లు అవుట్ చేయడంలో అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు డేవిడ్ వార్నర్‌ను 10 సార్లు, అలిస్టర్ కుక్‌ను 9 సార్లు, జేమ్స్ అండర్సన్, ఎడ్ కోవాన్లు ఏడేసి సార్లు అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యారు. ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే.. వీరంతా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్ కావడం విశేషం. చదవండి: ఆర్చర్ ఔట్, రికార్డు సృష్టించిన అశ్విన్ 38 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ చెత్త రికార్డు -
38 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ చెత్త రికార్డు
అహ్మదాబాద్: టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ 38 ఏళ్ల తర్వాత మరోసారి చెత్త రికార్డును నమోదు చేసింది. భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 81 పరుగులకే ఆలౌట్ కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు చాప చుట్టేసిన సంగతి తెలిసింది. ఈ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఓవరాల్‌గా 193 పరుగులు చేసింది. 1983-84లో క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే కుప్పకూలింది. అప్పట్లో ఆ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 175 పరుగులు మాత్రమే చేసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాలోఆన్ ఆడి రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే ఆలౌట్ కావడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. తాజాగా టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మరోసారి తక్కువ స్కోరు నమోదు చేయడం ద్వారా 38 ఏళ్ల చెత్త రికార్డును ఇంగ్లండ్ సవరించింది అయితే అప్పటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాలోఆన్ ఆడగా.. తాజాగా మాత్రం రెండో ఇన్నింగ్స్ ఆడడం ఒక్కటే తేడా అని చెప్పొచ్చు. దీంతో పాటు ఇండియాపై టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది ఐదోసారి కాగా.. 81 పరుగుల అత్యల్ప స్కోరు తొలి స్థానంలో నిలిచింది. చదవండి: ఇది 5 రోజుల టెస్టు పిచ్ కాదు: మాజీ క్రికెటర్ ఆర్చర్ ఔట్, రికార్డు సృష్టించిన అశ్విన్ -
ఆర్చర్ ఔట్, రికార్డు సృష్టించిన అశ్విన్
అహ్మదాబాద్: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో 400 వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ 400 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. కాగా ఇంతకముందు టెస్టుల్లో టీమిండియా తరపున ఎక్కువ వికెట్లు సాధించిన వారిలో అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417) మాత్రమే ఉన్నారు. దీంతో పాటు అశ్విన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన తొలి టీమిండియా ఆటగాడిగా.. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 400 వికెట్ల తీయడానికి అశ్విన్‌కు 77 టెస్టులు అవసరమవగా.. లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ మాత్రం 72 టెస్టుల్లోనే 400 వికెట్ల ఫీట్‌ను సాధించి తొలి స్థానంలో నిలిచాడు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా స్పిన్నర్ల దాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో వణికిపోతుంది. అశ్విన్, అక్షర్‌ల దాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. -
ఇది 5 రోజుల టెస్టు పిచ్ కాదు: మాజీ క్రికెటర్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 145 పరుగులకు టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా పర్యాటక జట్టు కంటే 33 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 99/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజును ఆటను ఆరంభించిన కోహ్లి సేన.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ దెబ్బకు విలవిల్లాడింది. పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ అయిన రూట్, తమ జట్టు ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్‌తో సమానంగా ఐదు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. పేసర్లకు అనుకూలం అనుకున్న పింక్ బాల్ టెస్టు పిచ్‌పై తొలి రోజు టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్ సత్తా చాటగా, రెండో రోజు రూట్ స్పిన్ మాయాజాలంతో భారత్‌ను దెబ్బకొట్టాడు. ఇదిలా ఉంటే.. తొలుత 112 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్, గురువారం నాటి రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జాక్ క్రాలే, బెయిర్‌స్టోను అక్షర్ పటేల్ పెవలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మరో ఓపెపర్ సిబ్లీ కూడా అక్షర్‌కే వికెట్ సమర్పించుకుని వెనుదిరిగాడు దీంతో మరోసారి స్పిన్నర్లు మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ పిచ్‌పై ఇప్పటి వరకు మొత్తంగా 23 వికెట్లు పడ్డాయి. వీటిలో రెండు మినహా(ఇషాంత్ శర్మ, ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెరో వికెట్) మిగతావన్నీ స్పిన్నర్లు తీసినవే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ మొతేరా పిచ్ గురించి తనదైన శైలిలో స్పందించాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే ఇది 5 రోజుల టెస్టు పిచ్ కాదు’’ అంటూ సెటైర్లు వేశాడు. కాగా చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా కూడా మైకేల్ వాన్, చెపాక్ పిచ్‌పై కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిచ్ షాక్‌కు గురిచేసింది. టీమిండియా చాలా మెరుగ్గా ఆడింది. కానీ ఇది 5 రోజుల టెస్టు మ్యాచ్ కోసం తయారుచేసిన పిచ్ మాత్రం కాదు’’ అని కామెంట్ చేసి విమర్శల పాలయ్యాడు. కాగా రెండో టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్‌పై 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. చదవండి: అమ్మో రూట్.. ప్రధాన స్పిన్నర్‌ను మించిపోయాడు డబుల్ సెంచరీ... పృథ్వీ షా సరికొత్త రికార్డు Let’s be honest this is not a 5 day Test pitch !! #INDvENG — Michael Vaughan (@MichaelVaughan) February 25, 2021 -
అమ్మో రూట్.. ప్రధాన స్పిన్నర్‌ను మించిపోయాడు
అహ్మదాబాద్: 6.2-3-8-5.. ఇవి ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ గణాంకాలు. సాధారణంగా ఇలాంటి స్పెల్ ఒక ప్రధాన బౌలర్ నుంచి చూస్తుంటాం. కానీ ఎవరు ఊహించని విధంగా టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో రూట్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొటేరా పిచ్ అనూహ్యంగా మారుతున్న వేళ తమ జట్టు ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్‌ను రూట్ మించిపోయాడు. డే నైట్ టెస్టులు సాధారణంగా పేసర్లకు స్వర్గధామంగా నిలిచాయి.. కానీ అనూహ్యంగా అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. దీంతో ఇంగ్లండ్‌కు లీచ్ మినహా మరో స్పిన్నర్ లేకపోవడంతో రూట్ తానే స్వయంగా రంగంలోకి దిగాడు. పంత్‌తో తన వికెట్ల వేటను ఆరంభించిన రూట్ చివరి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకోవడం విశేషం. బ్యాటింగ్‌లోనే అదరగొడుతానుకున్న రూట్ బౌలింగ్‌లోనూ ఈ విధంగా చెలరేగిపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. మొదటి టెస్టులో తన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన రూట్.. తాజాగా మూడో టెస్టులో తమ ప్రధాన బౌలర్ జాక్ లీచ్‌తో సమానంగా వికెట్లు తీసి టీమిండియా ఆలౌట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా మొదటి రోజు ఆటలో టీమిండియా ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఔట్ల విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో రూట్ వివాదానికి దిగిన సంగతి తెలిసిందే. మైదానంలో కెమెరా యాంగిల్స్ అన్ని పరిశీలించకుండానే నాటౌట్ ఎలా ఇస్తారంటూ రూట్ అసహనం వ్యక్తం చేశాడు. ఇదే విషయమై ఇంగ్లండ్ ప్రధాన కోచ్ క్రిస్ సిల్వర్వుడ్తో కలిసి రూట్ మ్యాచ రిఫరీ జగవల్ శ్రీనాథ్‌కు ఫిర్యాదు చేశాడు. చదవండి: మూడో టెస్ట్ లైవ్ అప్డేట్స్: సూన్నాకే రెండు వికెట్లు -
మూడో టెస్ట్ లైవ్ అప్డేట్స్; ఉంటారా, పడతారా?
-
పింక్ బాల్ టెస్టు: టీమిండియా ఘన విజయం
టీమిండియా ఘన విజయం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 112 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 81 ఆలౌట్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ 145 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 49/0 ►పింక్ బాల్ టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 49 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో ఓపెనర్ రోహిత్ శర్మ ఫోర్, సిక్స్ కొట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఐదు రోజులు జరగాల్సిన మూడో టెస్టు ఆట రెండు రోజుల్లోనే ముగిసిపోవడం విశేషం. ►తొలి రోజు ఆటలో రెండో సెషన్లోనే ఇంగ్లండ్ 112 పరుగులకే ఆలౌట్ కావడం.. ఆ తర్వాత భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 99 పరుగులు వద్ద ముగించింది. రెండో రోజు ఆటలో తొలి సెషన్లోనే టీమిండియా మిగతా 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాతి సెషన్లో ఇంగ్లండ్ టీమిండియా స్పిన్నర్ల దాటికి రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. పిచ్ పరిస్థితి అర్థం కాక బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి తంటాలు పడితే బౌలర్లు మాత్రం వికెట్ల పండగ చేసుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లు రెచ్చిపోయారు. మొత్తం వికెట్లలో 27 వికెట్లు స్పిన్నర్లే తీయగా... పేసర్లు మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు. ►విజయానికి 21 పరుగులు దూరంలో నిలిచింది. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టపోకుండా 28 పరుగుల చేసింది. 49 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ భోజన విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం 48 ►పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. దీంతో 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో స్టోక్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే.. రూట్ 19 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికట్లు, అశ్విన్ 4, సుందర్ ఒక వికెట్ తీశాడు. అశ్విన్ ఖాతాలో 400 వికెట్లు ►ఇంగ్లండ్ జట్టును అశ్విన్ తన రెండు వరుస ఓవర్లలో దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 23వ ఓవర్ తొలి బంతికే ఆర్చర్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన అశ్విన్ టెస్టుల్లో 400 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ 68 పరుగుల వద్ద ఏడో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ కేవలం 35 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.అంతకముందు అశ్విన్ బౌలింగ్‌లోనే 21వ ఓవర్ చివరి బంతికి ఓలీ పోప్ ఎల్బీగా వెనుదిరగడంతో ఆరో వికెట్ నష్టపోయింది. రూట్ అవుట్.. ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్ ►ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 11 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో 56 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. కాగా ఇంగ్లండ్ 23 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అక్షర్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అక్షర్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి మొత్తం 10 వికెట్లు సాధించాడు. 11వ సారి అశ్విన్ చేతిలోనే ►ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 50 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కాగా టెస్టుల్లో అశ్విన్ బౌలింగ్‌లో స్టోక్స్ అవుటవడం ఇది 11 సారి కావడం విశేషం. మెరిసిన అక్షర్..ఇంగ్లండ్ 19/3 ► పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ మూడో బంతిని ఫ్లిక్ చేయగా రిషబ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ 19 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 12 పరుగులు వెనుకబడి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో మూడో వికెట్లు అక్షర్ పటేల్ ఖాతాలోకి వెళ్లాయి. సున్నాకే రెండు వికెట్లు ► తొలి సెషన్ విరామం అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అక్షర్ పటేల్ వేసిన తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో దెబ్బతీశాడు. ఓవర్ తొలి బంతికే ఓపెనర్ జాక్ క్రాలేను గోల్డెన్ డక్‌గా అవుట్ చేయగా.. మూడో బంతికి జానీ బెయిర్ స్టోను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఖాతా తెరవకుండానే ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 5 పరుగులు చేసింది. 145 పరుగులకు టీమిండియా ఆలౌట్ ► పింక్ బాల్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 5 వికెట్లు తీసి టీమిండియా నడ్డి విరిచాడు. కాగా టీమిండియా చివరి వికెట్‌గా జస్ప్రీత్ బుమ్రా వెనుదిరిగాడు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. టీమిండియా బ్యాటింగ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ 66 మినహా మరే ఆటగాడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ 5 వికెట్లు తీయగా.. జాక్ లీచ్ 4, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ తీశాడు. అశ్విన్ అవుట్.. ఆలౌట్‌కు ఒక వికెట్ దూరంలో ► టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 17 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్‌లో క్రాలేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 134 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 143/9గా ఉంది. కాగా టీమిండియా ప్రస్తుతం 31 పరుగుల ఆధిక్యంలో ఉంది. అశ్విన్ అవుట్ చేయడం ద్వారా రూట్ నాలుగో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాకు రూట్ దెబ్బ ► పింక్ బాల్ టెస్టులో టీమిండియా వికెట్ల పరంపర కొనసాగుతుంది. తాజాగా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ భారత్‌ను దెబ్బతీశాడు. రూట్ తాను వేసిన రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 45వ ఓవర్ మొదటి బంతికి సుందర్‌ను పెవిలియన్‌కు పంపిన రూట్ మూడో బంతికి అక్షర్‌పటేల్‌ను డకౌట్ చేశాడు. ప్రస్తుతం టీమిండియా 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అశ్విన్ 15, ఇషాంత సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా టీమిండియా ఇప్పటివరకు 18 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. అంతకముందు 41 ఓవర్ వేసిన రూట్ మొదటి బంతినే వికెట్‌గా మల్చుకున్నాడు. 8 పరుగులు చేసిన పంత్ ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 117 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ►ఇంగ్లండ్ స్పిన్నర్ లీచ్ మరోసారి టీమిండియాను దెబ్బ కొట్టాడు. ఇప్పటికే కీలక ఆటగాళ్లు కెప్టెన్ విరాట్ కోహ్లి, పుజారా వికెట్లు తీసిన లీచ్ రహానే (7)ను, ఆ వెంటనే మెరుగ్గా రాణిస్తున్న రోహిత్ శర్మ (66)ను ఔట్ చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 117/5. క్రీజులో పంత్ (1), అశ్విన్ (2) క్రీజులో ఉన్నారు. ► పింక్ బాల్ టెస్టులో టీమిండియా తడబడుతుంది. మొదటిరోజు ఆటలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన టీమిండియా రెండోరోజు ఆటలో మాత్రం ఇంగ్లండ్ బౌలర్ల దాటికి పరుగులు చేయడానికి అవస్థలు పడుతుంది, ఓపెనర్ రోహిత్ శర్మ ఆండర్సన్ బౌలింగ్‌లో రెండో బౌండరీలు బాది 66 పరుగుల వద్ద ఉన్నాడు. మరో ఎండ్‌లో అజింక్య రహానే(1) హిట్‌మ్యాన్‌కు సహకారం అందిస్తున్నాడు. టీమిండియా ప్రస్తుత స్కోరు108/3. అహ్మదాబాద్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మొదటి రోజే ఇంగ్లీషు టీమ్‌ను టీమిండియా బౌలర్లు 112 పరుగులకే ఆలౌట్ చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కూడా 3 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. భారత్ బ్యాట్స్‌మన్ ఎంతవరకు ఇంగ్లండ్ బౌలర్లను కాచుకుంటారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30కు మ్యాచ్ ప్రారంభమైంది. 99/3 ఓవర్‌నైట్ స్కోరుతో టీమిండియా రెండో రోజు గురువారం ఆట ప్రారంభించింది. మొదటి రోజు ఆటలో హైలైట్స్ ► భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 11వ క్రికెటర్‌గా ఇషాంత్ శర్మ గుర్తింపు పొందాడు. కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో పేస్ బౌలర్‌గా ఇషాంత్ నిలిచాడు. ► అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్ (597 వికెట్లు)ను ఐదో స్థానానికి నెట్టి అశ్విన్ (598 వికెట్లు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. అనిల్ కుంబ్లే (953), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: ఇంగ్లండ్‌పై అక్షరాస్త్రం పాపం కోహ్లి.. భయపడి పారిపోయాడు -
పాపం కోహ్లి.. భయపడి పారిపోయాడు
గాంధీనగర్: వీరాభిమాని ఒకరు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని కలవడానికి బయో బబుల్ ప్రొటోకాల్‌ని ఉల్లంఘించాడు. స్టేడియంలోకి దూసుకెళ్లాడు. అతడిని గమనించిన కోహ్లి.. వెంటనే కొద్ది దూరం పరిగెత్తి.. సదరు అభిమానిని వెనక్కి తిరిగి వెళ్లాల్సిందిగా కోరాడు. ఈ సంఘటన బుధవారం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు చోటు చేసుకుంది. కోహ్లి అలా వెళ్లిపోవడం చూసిన ఆ వీరాభిమాని.. నిరాశగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం ఆటగాళ్లందరూ బయో బబుల్ సెక్యూరిటీలో ఉన్నారు. బయో బబుల్ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ మేరకు ఆటగాళ్లను, మ్యాచ్ అధికారులను ఎవరినీ కలవడానికి అనుమతించరు. మ్యాచ్ ముందు శిక్షణ సెషన్ల సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక అభిమాని ప్రోటోకాల్‌లను ఉల్లంఘించడంపై జీసీఏ అధికారి మాట్లాడుతూ.. "మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము.. అభిమాని ఎవరో గుర్తించి. అతడిపై చర్యలు తీసుకుంటాము’’ అని తెలిపారు. అహ్మాదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం ప్రారంభమైన పింక్ బాల్ టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 99/3 నిలవగా.. ఇంగ్లండ్ 112 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ (57), అజింక్య రహనె (1) క్రీజులో ఉన్నారు. -
ఇంగ్లండ్‌పై అక్షరాస్త్రం
ఇన్నాళ్లూ ‘పింక్ టెస్టు’లను సీమర్లు శాసించారు. ఇప్పటిదాకా డే–నైట్ టెస్టులను గెలిచిన జట్లన్నీ పేసర్ల బలంతో నెగ్గాయి. భారత గడ్డపై జరిగిన ఏకైక పింక్‌బాల్ టెస్టు (ఈడెన్ గార్డెన్స్)లో కూడా టీమిండియా పేస్ దళంతోనే గెలిచింది. కానీ తాజా ‘పింక్’ ఆట స్పిన్నర్ల చేతుల్లోకి వెళ్లింది. తొలి టెస్టులో భారీ తేడాతో జయభేరి మోగించిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు మూడో టెస్టులో అక్షర్ పటేల్, అశ్విన్ స్పిన్‌కు తలవంచింది. దీంతో రెండు సెషన్లను కూడా పూర్తిగా ఆడలేకపోయింది. అయితే భారత్ కూడా స్పిన్ వలలో పడి కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. అహ్మదాబాద్: డే–నైట్ టెస్టును తిప్పేసిన ఘనత కచ్చితంగా మన స్పిన్నర్లదే! ఫాస్ట్ బౌలర్లు చెలరేగే పింక్ బాల్ మ్యాచ్ ఇప్పుడు తిరగబడింది. స్పిన్నర్ల చేతుల్లోకి వచ్చేసింది. మొత్తానికి కొత్త స్టేడియంలో పాత ఆట సాగలేదు. ప్రధాన బౌలర్ కాకపోయినా... అక్షర్ పటేల్ (6/38) ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పాలిట ప్రమాదకర బౌలరయ్యాడు. దీంతో బుధవారం మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లయినా ఆడలేకపోయింది. 48.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ (53; 10 ఫోర్లు) ఒక్కడే భారత్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మరో స్పిన్నర్ అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. 100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్‌కు ఒక వికెట్ లభించింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట నిలిచే సమయానికి 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (82 బంతుల్లో 57 బ్యాటింగ్; 9 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 2 వికెట్లు తీశాడు. తిప్పేసి... పడగొట్టేశాడు... వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ ఇంగ్లండ్ పతనానికి బీజం వేశాడు. మూడో ఓవర్లోనే సిబ్లీ (0)ని డకౌట్ చేశాడు. స్లిప్‌లో ఉన్న రోహిత్ అతని క్యాచ్‌ను అందుకోగా.... జట్టు స్కోరు 27 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. బెయిర్‌స్టో (0)కూడా ఖాతా తెరవలేదు. ఈ వికెట్‌తోనే అక్షర్ పటేల్ ప్రతాపం మెల్లిగా మొదలైంది. ఓపెనర్ క్రాలే... కెప్టెన్ రూట్ (17) పోరాడేందుకు ప్రయతించాడు. కానీ తొలి సెషన్‌కు ముందే రూట్‌ను అశ్విన్, అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న క్రాలేని అక్షర్ ఔట్ చేశారు. 81/4 వద్ద ఇంగ్లండ్ విరామానికెళ్లింది. రెండో సెషన్ మొదలవగానే అశ్విన్, అక్షర్ చెరో వికెట్ పడగొట్టడంతో అదేస్కోరు (81/6) వద్ద ఇంకో రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా స్పిన్నర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కేవలం 38 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది. రోహిత్ ఫిఫ్టీ తర్వాత భారత్ ఇన్నింగ్స్ మొదలైనా... స్పిన్‌కు టాప్ ఆర్డర్ కుదేలైంది. 15వ ఓవర్లో గిల్ (11)ను ఆర్చర్ ఔట్ చేస్తే, పుజారాను పరుగైనా చేయకముందే లీచ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కెప్టెన్ కోహ్లి అండతో ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించాక కోహ్లిని చక్కని డెలివరీతో లీచ్ బోల్తా కొట్టించాడు. ► భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 11వ క్రికెటర్‌గా ఇషాంత్ శర్మ గుర్తింపు పొందాడు. కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో పేస్ బౌలర్‌గా ఇషాంత్ నిలిచాడు. ► అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్ (597 వికెట్లు)ను ఐదో స్థానానికి నెట్టి అశ్విన్ (598 వికెట్లు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. అనిల్ కుంబ్లే (953), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ పటేల్ 53; సిబ్లీ (సి) రోహిత్ శర్మ (బి) ఇషాంత్ శర్మ 0; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ పటేల్ 0; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 17; స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 6; పోప్ (బి) అశ్విన్ 1; ఫోక్స్ (బి) అక్షర్ పటేల్ 12; ఆర్చర్ (బి) అక్షర్ పటేల్ 11; లీచ్ (సి) పుజారా (బి) అశ్విన్ 3; బ్రాడ్ (సి) బుమ్రా (బి) అక్షర్ పటేల్ 3; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 112. వికెట్ల పతనం: 1–2, 2–27, 3–74, 4–80, 5–81, 6–81, 7–93, 8–98, 9–105, 10–112. బౌలింగ్: ఇషాంత్ శర్మ 5–1–26–1; బుమ్రా 6–3–19–0; అక్షర్ పటేల్ 21.4–6–38–6; అశ్విన్ 16–6–26–3. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 57; గిల్ (సి) క్రాలే (బి) ఆర్చర్ 11; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) లీచ్ 0; కోహ్లి (బి) లీచ్ 27; రహానే (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (33 ఓవర్లలో మూడు వికెట్లకు) 99. వికెట్ల పతనం: 1–33, 2–34, 3–98. బౌలింగ్: అండర్సన్ 9–6–11–0; బ్రాడ్ 6–1–16–0; ఆర్చర్ 5–2–24–1; లీచ్ 10–1–27–2; స్టోక్స్ 3–0–19–0. -
1986 తర్వాత మళ్లీ ఇప్పుడే
అహ్మదాబాద్: టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ఇంగ్లండ్‌కు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. కాగా ఇంగ్లండ్ టెస్టుల్లో టీమిండియాపై అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఓవరాల్‌గా ఇది ఐదోసారి కాగా అత్యల్ప స్కోరుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. 1971 ఓవల్ టెస్టులో 101 పరుగులు, 1979/80 ముంబై టెస్టులో 102 పరుగులు, 1986 లీడ్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 128 పరుగులు, తాజాగా అహ్మదాబాద్‌లో 112 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్‌పై ఆరు వికెట్లతో సత్తా చాటిన అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. డే నైట్ టెస్టులో ఒక బౌలర్ కెరీర్ బెస్ట్ నమోదు చేయడం ఇది మూడోసారి కాగా.. అక్షర్(6/38) రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌కు చెందిన దేవేంద్ర బిషూ 8/49తో తొలి స్థానంలో ఉన్నాడు. 2016/17 పాకిస్తాన్ సిరీస్ సందర్భంగా జరిగిన డే నైట్ టెస్టులో బిషూ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: పింక్ బాల్ టెస్టు: పీటర్సన్ ట్వీట్ వైరల్ -
పింక్ బాల్ టెస్టు: పీటర్సన్ ట్వీట్ వైరల్
అహ్మదాబాద్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్,టీమిండియాల మధ్య సిరీస్ ప్రారంభం అయినప్పటి నుంచి ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. తొలి టెస్టులో ఇంగ్లండ్ మ్యాచ్ గెలవగానే.. టీమిండియా ఇప్పుడే సమాధానం ఇస్తారు చెప్పండి అంటూ ఘాటు విమర్శలు చేశాడు. అయితే టీమిండియా చెన్నైలోనే జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై గెలిచి పీటర్సన్‌కు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చింది. అయితే టీమిండియా ఇంగ్లండ్- బి టీమ్‌తో ఆడి గెలిచిదంటూ పీటర్సన్ ట్రోల్ చేసి విమర్శల పాలయ్యాడు. తాజగా మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకోగానే పీటర్సన్ హిందీలో ట్వీట్ చేశాడు. 'ఇది టాస్ ఎవరు గెలిస్తే వారు మ్యాచ్ గెలుస్తారని నేను అనుకోను.. కేవలం మ్యాచ్‌లో వికెట్లు తీయడంపైనే విజయం ఆధారపడి ఉంటుంది.' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం పీటర్సన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా బౌలర్ల ఉచ్చులో పడిన ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. అక్షర్ పటేల్ వేసిన 28వ ఓవర్ 5వ బంతికి స్టోక్స్ ఎల్బీగా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 81 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 86 పరుగులుగా ఉంది. చదవండి: 'ప్లీజ్.. పీటర్సన్‌ను ఎవరు ట్రోల్ చేయొద్దు' 'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్ ఆడను' Oops india , asha karta hoon ki yeh, toss jeeto match jeeto wala wicket na ho 😉 — Kevin Pietersen🦏 (@KP24) February 24, 2021 -
పింక్ బాల్ టెస్టు : ముగిసిన తొలిరోజు ఆట
ముగిసిన తొలిరోజు ఆట ►పింక్ బాల్ టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 57 పరుగులతో, అజింక్య రహానే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా మూడో టెస్టు తొలిరోజు ఆటలో టీమిండియా అన్ని సెషన్లలోనూ ఆధిపత్యం చలాయించింది. మొదట బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ గిల్, పుజారాలు ఔటైనా మరో ఓపెనర్ రోహిత్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ బాది అర్థ శతకం సాధించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రోహిత్‌కు సహకారమందించడంతో జట్టు స్కోరులో వేగం పెరిగింది. రోహిత్, కోహ్లి మూడో వికెట్‌కు 60 పరుగులు జతచేశారు. వీరిద్దరి జోడి బలపడుతున్న క్రమంలో 27 పరుగులు చేసిన కోహ్లి జాక్ లీచ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రహానే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడడంతో 3 వికెట్ల నష్టానికి 99 పరుగుల వద్ద తొలి రోజు ఆటను ముగించింది. ఇంగ్లండ్ కంటే ఇంకా 13 పరుగులు మాత్రమే వెనుకబడి ఉన్న భారత్ రెండో రోజు ఆటలో భారీ స్కోరు చేస్తుందా లేక ఇంగ్లీష్ బౌలర్ల ముందు తలవంచుతుందా అనేది చూడాలి. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ ►టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పింక్ బాల్ టెస్టులో అర్థ శతకం సాధించాడు. బెన్ స్టోక్స్ వేసిన 24 ఓవర్ 5వ బంతికి సింగిల్ తీసిన రోహిత్ 63 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో టెస్టు కెరీర్లో 12వ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా 25 ఓవర్లలో 83 పరుగులు చేసింది. కోహ్లి 19, రోహిత్ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు. గిల్. పుజారా ఔట్ ►టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్సోయింది. శుబ్‌మన్ గిల్(11), చతేశ్వర్ పుజారా(0)ల వికెట్లను వరుస ఓవర్లలో టీమిండియా చేజార్చుకుంది. జోఫ్రా ఆర్చర్ వేసిన 15 ఓవర్ చివరి బంతికి గిల్ ఔట్ కాగా, ఆపై వచ్చిన పుజారా సైతం నిరాశపరిచాడు. స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్ ఐదో బంతికి పుజారా వికెట్లు ముందు దొరికిపోయాడు. నాలుగు బంతులు ఆడిన పుజారా పరుగులేమీ చేయకుండా ఎల్బీగా ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. రోహిత్ 31 పరుగులు, కోహ్లి 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. నత్తనడకన టీమిండియా ఇన్నింగ్స్ ►పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ నత్తనడకన సాగుతుంది. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతుండడంతో టీమిండియా ఆచితూచి ఆడుతుంది. పిచ్ ఎలా ఉంటుందో అర్థం కాక బ్యాట్స్‌మెన్ పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం టీమిండియా 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. రోహిత్ 21 పరుగులు, గిల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో సెషన్ విరామం.. టీమిండియా స్కోరు 5/0 ►మూడో టెస్టు తొలిరోజు ఆటలో రెండో సెషన్ విరామ సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. ఓపెనర్లె రోహిత్ శర్మ 5 పరుగులు, శుబ్‌మన్ గిల్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆట తొలిరోజులో భాగంగా రెండు సెషన్లలోనూ టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అయితే పిచ్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటుండడంతో చివరి సెషన్లో భారత బ్యాటింగ్ ఏ విధంగా కొనసాగుతుందో చూడాలి. 112 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ ► పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 38 పరుగులకే ఆరు వికెట్లు తీసి టెస్టు కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఓపెనర్ జాక్ క్రావ్లే(53) మినహా మిగతా ఏ బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ 6 వికెట్లు తీయగా.. అశ్విన్ 3, ఇషాంత్ ఒక వికెట్ తీశాడు. విజృంభిస్తున్న టీమిండియా స్పిన్నర్లు ►ఇంగ్లండ్ జట్టు తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 46వ ఓవర్ మూడో బంతికి స్టువర్ట్ బ్రాడ్ బుమ్రాకు క్యాచ్ ఇవ్వడంతో 106 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కాగా అక్షర్ పటేల్ బ్రాడ్ వికెట్ ద్వారా వరుసగా రెండోసారి 5 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్ తన డబ్యూ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ►ఇంగ్లండ్ 98 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్ వేసిన 37వ ఓవర్ 3వ బంతిని జాక్ లీచ్ ఫ్లిక్ చేయగా.. స్లిప్‌లో ఉన్న పుజారా ఒడిసి పట్టకున్నాడు. అయితే పుజారా క్యాచ్ అందుకునే క్రమంలో చేతి వేళ్లు గ్రౌండ్‌ను తాకాయన్న అనుమానంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు. పుజారా అందుకున్న క్యాచ్‌ను పలు యాంగిల్స్‌లో చూసిన థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్‌కు ఇంకా రెండు వికెట్ల దూరంలో మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 8 వికెట్లకు 100 పరుగులు సాధించింది. క్రీజులో బ్రాడ్(2), ఫోక్స్(3) తో క్రీజులో ఉన్నారు. ►పింక్‌బాల్ టెస్టులో టీమిండియా స్పిన్నర్ల దాటికి ఇంగ్లండ్ విలవిలలాడుతోంది. పిచ్‌పై అనూహ్యంగా తిరుగుతున్న బంతిని ఆడలేక ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు తడబడుతున్నారు. తాజాగా అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఆర్చర్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 93 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. దాంతో వందలోపే ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ తీవ్ర కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో చెలరేగుతుండగా... మరో స్పిన్నర్ అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. ► టీమిండియా బౌలర్ల ఉచ్చులో పడిన ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. అక్షర్ పటేల్ వేసిన 28వ ఓవర్ 5వ బంతికి స్టోక్స్ ఎల్బీగా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 81 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 86 పరుగులుగా ఉంది. అంతకముందు తొలి సెషన్ విరామం అనంతరం తొలి ఓవర్లోనే ఓలీ పోప్ రూపంలో ఐదో వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్ వేసిన 27వ ఓవర్ నాలుగో బంతి పోప్ హిట్ చేసే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు. తొలి సెషన్ విరామం: ఇంగ్లండ్ స్కోరు 81/4 ►పింక్ బాల్ టెస్టులో మొదటిరోజు ఆటలో తొలి సెషన్లో టీమిండియా ఆదిపత్యం ప్రదర్శించింది. తొలి సెషన్ విరామ సమయానికి ఇంగ్లండ్ 27వ ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. స్టోక్స్ 6, ఓలీ పోప్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా మొదటి సెషన్ ఆరంభంలోనే ఇంగ్లండ్ ఓపెనర్ సిబ్లీని డకౌట్ చేసిన ఇషాంత్ టీమిండియాకు శుభారంబాన్ని అందించాడు. అనంతరం అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో కూడా సున్నా పరుగులకే ఔట్ కావడంతో ఇంగ్లండ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత రూట్, క్రావ్లేలు కలిసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశారు. అయితే మొదటి సెషన్ విరామానికి ముందు ఇంగ్లండ్ వరుసగా రూట్ , క్రావ్లే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా బౌలింగ్‌లో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. ఇషాంత్ , అశ్విన్ చెరొక వికెట్ తీశారు. కీలక వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ►53 పరుగులతో నిలకడగా ఆడుతున్న జాక్ క్రావ్లే అక్షర్ బౌలింగ్ అవుటవడంతో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 25 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. స్టోక్స్ 6, ఓలీ పోప్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. రూట్ అవుట్.. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ►పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కెప్టెన్ జో రూట్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 74 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. అశ్విన్ వేసిన బంతి రూట్ ప్యాడ్లను తాకుతూ లెగ్ స్టంప్ మీదుగా వెళ్లింది. టీమిండియా అప్పీల్ చేయగా అంపైర్ అవుటిచ్చాడు. అయితే రూట్ రివ్యూకు వెళ్లగా అతనికి నిరాశ ఎదురైంది. ఓపెనర్ క్రాలీ అర్థ సెంచరీ.. నిలకడగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ►ఇంగ్లండ్ ఓపెనర్ క్రావ్లే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను క్రావ్లే, రూట్లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు. ఈ దశలో అక్షర్ పటేల్ వేసిన 18వ ఓవర్లో మూడో బంతిని ఫోర్ కొట్టిన క్రావ్లే కెరీర్లో నాలుగో అర్థ శతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.క్రావ్లే 52, రూట్ 11 పరుగులతో ఆడుతున్నారు. 50 పరుగులు పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ ►పింక్ బాల్ టెస్టులో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 13వ ఓవర్లో 50 పరుగులు పూర్తి చేసుకుంది. ఓపెనర్ సిబ్లీతో పాటు జానీ బెయిర్ స్టో సున్నా పరుగులకే వెనుదిరిగినా.. తర్వాత వచ్చిన కెప్టెన్ రూట్‌తో కలిసి మరో ఓపెనర్ జాక్ క్రావ్లే వికెట్ పడకుండా నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 15 ఓవర్లలో 53 పరుగులు చేసింది.క్రావ్లే 40, రూట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ►టీమిండియాతో జరుగుతున్ను పింక్‌బాల్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 6వ ఓవర్ మొదటి బంతి జానీ బెయిర్ స్టో ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. టీమిండియా ఎల్బీ అప్పీల్ చేయడంతో అంపైర్ నితిన్ మీనన్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బెయిర్ స్టో రివ్యూకి వెళ్లగా.. రిప్లేలో బంతి ఇంపాక్ట్ మిడిల్ స్టంప్‌పైకి వెళుతున్నట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లండ్ 27 పరుగులు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. జాక్ క్రావ్లే 23, జో రూట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆదిలోని ఇంగ్లండ్ షాక్ ►బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ డొమినిక్ సిబ్లే ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవరలో సిబ్లే ఔటయ్యాడు. ఆ ఓవర్ మూడో బంతికి రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. ఏడు బంతులు ఆడిన సిబ్లే డకౌట్‌గా పెవిలియన్ చేరగా, ఇంగ్లండ్ స్కోర్ బోర్డుపై రెండు పరుగులే ఉన్నాయి. అహ్మదాబాద్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ముందుగా బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపాడు. ఇప్పటికే ఇరుజట్లు తలో టెస్టు మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నందున ఈ మ్యాచ్ కీలకంగా మారింది. కొత్తగా పునర్నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడేందుకు సిద్ధమయ్యే క్షణం భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయం కానుంది. ఇక్కడ చదవండి: ‘మహా’ సమరానికి సై ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంగా వార్తల్లో నిలిచిన అహ్మదాబాద్ వేదికపై ఒక హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్ సమంగా నిలిచిన ప్రస్తుత స్థితిలో ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరువవుతుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. సిరాజ్ స్థానంలో బుమ్రాను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఇక కుల్దీప్ యాదయ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. ఇంగ్లండ్ జట్టులోకి బెయిర్ స్టో, అండర్సన్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక్కడ చదవండి: మొతేరా క్రికెట్ స్టేడియం : బిగ్ సర్ప్రైజ్ భారత్ తుది జట్టు విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, అజ్యింకా రహానే, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, బుమ్రా ఇంగ్లండ్ తుది జట్టు జోరూట్(కెప్టెన్), డొమినిక్ సిబ్లే, క్రావ్లే, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, ఓలీ పోప్, బెన్ ఫోక్స్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ -
India vs England 3rd Test: ‘మహా’ సమరానికి సై
సబర్మతి తీరాన బుధవారం భారత క్రికెట్ అభిమానులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లబోతున్నారు. కళ్లు చెదిరే భారీతనం... అలా చూస్తూ ఉండిపోయే నిర్మాణ చాతుర్యం, కొత్తగా కనిపించే ఎల్ఈడీ లైట్ల వెలుగులు... వీటికి తోడు గులాబీ బంతి... సుమారు 55 వేల మంది ప్రేక్షకులతో మొటెరా మైదానంలో మోత మోగనుంది. కొత్తగా పునర్నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడేందుకు సిద్ధమయ్యే క్షణం భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయం కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంగా వార్తల్లో నిలిచిన అహ్మదాబాద్ వేదికపై ఒక హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్ సమంగా నిలిచిన ప్రస్తుత స్థితిలో ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరువవుతుంది. అహ్మదాబాద్: సిరీస్‌లోని మూడో టెస్టులోనే ఇంగ్లండ్‌కు ఎంతో కొంత విజయావకాశాలు ఉన్నాయి. ఆ జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో చాలా మంది విశ్లేషకులు, మాజీల అభిప్రాయమిది. డే అండ్ నైట్ టెస్టు కావడం, గులాబీ బంతితో స్వింగ్‌కు అనుకూలించే పరిస్థితులు ఉండటమే అందుకు కారణం. అయితే చెన్నైలో తొలి టెస్టు ఫలితం వారికి అనుకూలం రాగా, రెండో టెస్టులో భారత్ దెబ్బ కొట్టింది. గత మ్యాచ్ తర్వాత టీమిండియాలో ఆత్మవిశ్వాసం రెట్టింపవ్వగా, ఇంగ్లండ్ కొంత ఒత్తిడిలో పడింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు నేటి నుంచి జరిగే మూడో టెస్టులో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాయి. భారత గడ్డపై ఇది రెండో డే అండ్ నైట్ టెస్టు కాగా, ఓవరాల్‌గా టీమిండియాకు మూడోది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం అధికారికంగా స్టేడియంను ప్రారంభిస్తారు. బరిలోకి బుమ్రా... రెండో టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత జట్టు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో సిరాజ్‌కు అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు బుమ్రా మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. చెన్నైలో రెండో టెస్టు ముగిసిన రోజే పింక్ బాల్‌తో బుమ్రా తన సాధన మొదలు పెట్టడం విశేషం. అయితే తుది జట్టులో మరో మార్పుకు కూడా అవకాశం కనిపిస్తోంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడం దాదాపు ఖాయమైంది. అతని స్థానంలో మూడో పేసర్‌గా ఉమేశ్ యాదవ్ ఆడవచ్చు. భారత్‌లో మంచి రికార్డు ఉండటంతో పాటు రివర్స్ స్వింగ్ రాబట్టగల నైపుణ్యం అతని సొంతం. ఒకవేళ పిచ్ స్పిన్‌కు బాగా అనుకూలిస్తుందని భావించినా ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ జట్టులో ఉండగా గత మ్యాచ్ తరహాలోనే (12.2 ఓవర్లు) ఈసారి కూడా కుల్దీప్కు పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాకపోవచ్చు కాబట్టి అతడిని తప్పించినట్లే. అయితే ఉమేశ్‌కు బదులుగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సొంత మైదానంలో టెస్టు ఆడే అవకాశం కల్పించడంపై కూడా టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. మూడో పేసర్‌గా కొన్ని ఓవర్లు వేయడంతో పాటు అతని దూకుడైన బ్యాటింగ్ జట్టుకు ఉపయోగపడగలదు. బ్యాటింగ్‌పరంగా భారత్ టాప్–6తో పటిష్టంగా ఉంది. తన స్థాయి ఏమిటో రోహిత్ శర్మ గత టెస్టులో చూపించగా, కోహ్లి కూడా నిలకడగా ఆడుతున్నాడు. రహానే ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా... పాత స్టేడియం కూలగొట్టడానికి ముందు ఇక్కడ జరిగిన ఆఖరి టెస్టులో ‘డబుల్ సెంచరీ’ చేసిన పుజారా మళ్లీ చెలరేగేందుకు సన్నద్ధమయ్యాడు. ఇక అశ్విన్ తమ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌తోనూ ప్రత్యర్థి పని పట్టడం ఖాయం. బెయిర్‌స్టో, రూట్ బెయిర్‌స్టోకు చాన్స్... అనూహ్యంగా తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ రెండో టెస్టులో కుప్పకూలింది. ఇప్పుడు మళ్లీ కోలుకునేందుకు ఆ జట్టుకు ఇది మంచి అవకాశం. లైట్ల వెలుగులో పింక్ బంతి ఏమాత్రం స్వింగ్ అయినా దానిని సమర్థంగా ఉపయోగించుకోవడంలో అండర్సన్‌ను మించినవాళ్లు లేరు. అతనికి మరోవైపు నుంచి ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ నుంచి కూడా సహకారం లభిస్తే వీరిని ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. ఇదే కారణంగా ఒకే ఒక స్పిన్నర్ (లీచ్)ను ఆడించి మరో స్వింగ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌ను కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు జట్టు పరిశీలనలో ఉన్నాయి. అయితే పిచ్ స్పిన్‌కు బాగుందని భావిస్తే మాత్రం డామ్ బెస్ జట్టులోకి వస్తాడు. మొయిన్ అలీ స్వదేశం వెళ్లిపోవడంతో బెస్‌కు మరో అవకాశం దక్కనుంది. బ్యాటింగ్‌లో మరోసారి కెప్టెన్ జో రూట్‌పైనే భారం ఉండగా, స్టోక్స్ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ మరో రెండు మార్పులు కూడా చేసింది. బర్న్స్, లారెన్స్ స్థానాల్లో క్రాలీ, బెయిర్‌స్టో బరిలోకి దిగుతారు. గత మ్యాచ్ అనుభవం నేపథ్యంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఈసారి మరింత పట్టుదల కనబర్చి భారీ స్కోరు సాధిస్తేనే గెలుపుపై ఆశలు పెంచుకోవచ్చు. పిచ్, వాతావరణం పూర్తిగా కొత్త మైదానం కాబట్టి పిచ్‌పై సరిగ్గా అంచనా వేయలేని పరిస్థితి ఉంది. అయితే పచ్చిక తొలగించడాన్ని బట్టి చూస్తే స్పిన్‌కు అనుకూలంగా చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు కాకుండా మ్యాచ్ సాగినకొద్దీ దాని ప్రభావం ఉండవచ్చు. లైట్లు, పింక్ బాల్ కారణంగా పేసర్లకు కూడా కొంత అనుకూలత ఉంది. అయితే తమ చివరి పింక్ బాల్ టెస్టుల్లో భారత్ (36 ఆలౌట్), ఇంగ్లండ్ (58 ఆలౌట్) ప్రదర్శన చూస్తే దీని అనిశ్చితి ఏమిటో అర్థమవుతుంది. మ్యాచ్ రోజుల్లో వర్షంతో ఏమాత్రం ఇబ్బంది లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, గిల్, పుజారా, రహానే, పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), సిబ్లీ, క్రాలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, పోప్, ఫోక్స్ (వికెట్ కీపర్), బెస్/వోక్స్, ఆర్చర్, లీచ్, అండర్సన్. గులాబీ బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుందనేది వాస్తవం. అయితే అది మెరుపు ఉన్నంత వరకే అనేది నా అభిప్రాయం. ఆపై స్పిన్నర్లు కచ్చితంగా ప్రభావం చూపిస్తారు. అయితే మేం బంతి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ఎలా స్పందించినా, ఏ సవాల్‌కైనా సిద్ధంగా ఉన్నాం. ప్రత్యర్థి జట్టు బలహీనతలేమిటో మాకూ తెలుసు కాబట్టి పరిస్థితులను సరిగ్గా ఉపయోగించుకుంటాం. – కోహ్లి, భారత కెప్టెన్ -
ఆ రికార్డుకు ఆరు వికెట్ల దూరంలో..
అహ్మదాబాద్: టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో కలిపి అశ్విన్ 17.82 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు 5 వికెట్ల మార్క్‌ని అశ్విన్ అందుకోగా.. ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం వేదికగా బుధవారం నుంచి మూడో టెస్టు డే నైట్ తరహాలో ప్రారంభంకానుంది. ఈ మూడో టెస్టులో అశ్విన్ 6 వికెట్లు పడగొడితే.. 400 వికెట్లు పడగొట్టిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డులెక్కనున్నాడు. 2011లో భారత టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసిన అశ్విన్ ఇప్పటి వరకూ 76 టెస్టు మ్యాచ్‌లాడి 394 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 10 సార్లు 10 వికెట్ల మార్క్‌ని అందుకున్న అశ్విన్.. ఏకంగా 29 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. టీమిండియా తరపున దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో టెస్టుల్లో టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (434 వికెట్లు), హర్భజన్ సింగ్ (417) టాప్-3లో కొనసాగుతున్నారు. ఒకవేళ అశ్విన్ 400 వికెట్ల మార్క్‌ని అందుకోగలిగితే.. ఈ ఘనత సాధించిన మూడో భారత స్పిన్నర్‌గా నిలవనున్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ 800 వికెట్లతో ఉన్నాడు. చదవండి: 'మాస్టర్' డ్యాన్స్‌తో దుమ్మురేపిన క్రికెటర్లు సిక్సర్లతో రెచ్చిపోయిన ఇషాన్ కిషన్ -
మొటెరా పిచ్ ఎవరికి లాభం చేకూర్చనుంది!
అహ్మదాబాద్: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మొటెరా స్టేడియం వేదికగా డే-నైట్ టెస్టు మ్యాచ్(పింక్ బాల్ టెస్టు) జరగనున్న సంగతి తెలిసిందే. ఆధునాతన సౌకర్యాలతో లక్షా 10వేల సీటింగ్ కెపాసిటీతో నూతనంగా నిర్మించిన మొటెరా స్టేడియం ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ మైదానంగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 నుంచి డే నైట్ టెస్టుకు అన్ని హంగులతో సిద్ధమవుతుంది. ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారినవేళ ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అర్హతకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొటెరా పిచ్ ఎలా ఉండబోతుందనే విషయంపై తెగ చర్చ నడుస్తుంది. మొదటి రెండు టెస్టులు జరిగిన చెన్నై పిచ్‌కు, అహ్మదాబాద్ పిచ్‌కు చాలా తేడా ఉండనుంది. అందులోనూ మూడో టెస్టు డై నైట్ తరహాలో జరగనుండడంతో పిచ్ రిపోర్ట్‌పై మరింత ప్రాముఖ్యత సంతరించుకొంది. సాధారణంగా టీమిండియా టెస్టు మ్యాచ్‌లు ఆడే పిచ్‌లు స్పిన్నర్లకు అనువుగా ఉండేలా క్యూరేటర్లు తయారు చేస్తుంటారు. అయితే కొన్నేళ్లుగా వీటిలో మార్పు కనిపిస్తూ వచ్చింది. స్పిన్నర్లతో పాటు పేసర్లకు కూడా స్వర్గధామంగా నిలుస్తూ వచ్చాయి. తాజాగా మొతేరాలో పిచ్ నల్లమట్టి, ఎర్రమట్టి కాంబినేషన్‌తో కూడి ఉంది. ప్రధాన గ్రౌండ్లో 11పిచ్‌లు ఉన్న నేపథ్యంలో ఈసారి పిచ్‌ను స్పిన్నర్లుకు అనూకూలంగా ఉండేలా ఎర్రమట్టితో రూపొందించనున్నట్లు సమాచారం. మొదటి మూడు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా, చివరి రెండు రోజులు మాత్రం బౌలర్లకు అనుకూలించేలా పిచ్‌ను తీర్చిదిద్దారు. అయితే గతంలో జరిగిన పింక్ బాల్ టెస్టులు చూసుకుంటే స్పిన్నర్ల కంటే సీమర్లు రాణించిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. 2019 నవంబర్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన డే నైట్ టెస్టులోనూ ఇదే నిరూపితమైంది.ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్స్ కలిపి అన్ని వికెట్లు టీమిండియా పేసర్లే తీయడం విశేషం. ముఖ్యంగా ఇషాంత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా ఇప్పుడు ఎక్కువగా స్పిన్నర్లను నమ్ముకోవడంతో తుది జట్టులో ఇద్దరు పేసర్లకు మాత్రమే అవకాశం ఉంది. అయితే క్యురేటర్లు మాత్రం పిచ్‌ను స్పిన్‌కు అనుకూలించే విధంగా రూపొందించినట్లు తెలిపారు. దీంతో పాటు మ్యాచ్ డే నైట్ కావడం.. రాత్రిళ్లు మంచుతో బౌలర్‌కు గ్రిప్పింగ్ చేజారడం జరుగుతుంటుంది. బంతి రంగు కూడా పిచ్‌పై కీలకపాత్ర పోషించనుంది. అందుకే పిచ్‌పై పచ్చిక ఎక్కువ లేకుండా చూసుకుంటూ కాస్త కఠినతరంగా రూపొందించనున్నారు. ఇక 2012లో మొటెరా మైదానంలో చివరి మ్యాచ్ జరిగింది. కాగా ఇటీవలే ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లకు కూడా ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: మూడో టెస్ట్‌తో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం -
ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది: షమీ
న్యూఢిల్లీ: ‘‘నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. నిన్ను మళ్లీ ఒక్కసారి చూడాలని ఉంది నాన్నా, ఈ తలుపు గుండా లోపలికి వచ్చెయ్. ఇది అసాధ్యమని నాకు తెలుసు. నా కన్నీళ్లను నువ్వు చూస్తూనే ఉంటావు. నేను ఏడవకూడదని కోరుకుంటావు. నిన్ను శాశ్వతంగా కోల్పోయినపుడు గుండెపగిలేలా ఏడ్చాను. ఈ విషాదం నుంచి తేరుకునేందుకు ధైర్యాన్ని ఇవ్వమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. నీకు కొడుకుగా పుట్టినందుకు ఎంతగానో గర్విస్తున్నా. మిస్ యూ, లవ్ యూ డాడ్!’’ అంటూ టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ భావోద్వేగానికి లోనయ్యాడు. తండ్రి నాలుగో వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పించాడు. కాగా షమీ తండ్రి 2017లో గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. (చదవండి: ఐసీసీ సరికొత్త అవార్డు.. పరిశీలనలో వారి పేర్లు!) ఇక ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైడ్ టెస్టు మ్యాచ్‌లో గాయపడిన షమీ.. మిగతా మూడు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. పింక్‌బాల్ టెస్టులో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కుడిచేయికి గాయమైంది. దీంతో అతడు స్వదేశానికి తిరిగి వచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగనున్న టెస్టు సిరీస్ తొలి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టులో షమీకి చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు భారత్ తరఫున 50 టెస్టులాడిన షమీ.. 180 వికెట్లు తీశాడు. 79 వన్డేల్లో 148 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పొట్టిఫార్మాట్లో ఇప్పటివరకు 12 వికెట్లు తీశాడు. (చదవండి: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: పూర్తి షెడ్యూల్ ఇదే!) -
గబ్బా విజయం: రవిశాస్త్రి చెప్పిన మంత్రమిదే
ముంబై: గబ్బాలో టీమిండియా 32 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. పింక్ బాల్ టెస్ట్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు.. 40 రోజుల వ్యవధిలో.. అదే ఆస్ట్రేలియాను బ్రిస్బెన్ టెస్ట్‌లో మట్టి కరిపించింది. కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికి చారిత్రాత్మక విజయం సాధించిన బ్రిస్బేన్ టెస్ట్‌కు ప్రత్యేకతలేన్నో. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నటీ లీవ్‌లో ఉన్నాడు.. ఇక సీనియర్ ఆటగాళ్లను గాయాలు వెంటాడాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అజింక్య రహానే ఆధ్వర్యంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు గబ్బా వేదికగా చరిత్రని తిరగరాసింది. పింక్ బాల్ ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ నేపథ్యంలో గబ్బా విజయానికి సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. టీమిండియా క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ తన యూట్యూబ్ చానెల్లో రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన సంభాషణలో ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన ప్రసంగం అడిలైడ్‌లో ఎదుర్కొన్న ఓటమి నుంచి టీమిండియా అదృష్టాన్ని ఎలా మలుపు తిప్పిందో వెల్లడించారు. (చదవండి: క్రికెటర్స్.. ‘గేమ్’చేంజర్స్..!) ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘36 ఆలౌట్ తరువాత ఏం జరిగిందో మీకు తెలియదు. అప్పుడు రవి (శాస్త్రి) భాయ్ జట్టు సభ్యులను పిలిచి ఇలా అన్నాడు.. ‘‘ఈ 36 ను మీ స్లీవ్స్‌లో బ్యాడ్జ్ లాగా ధరించండి.. ఆ ఓటమి మీలో కసి పెంచుతుంది. మీ ఆట తీరు మారుతుంది. ఇక చూడండి మీరు గొప్ప జట్టు అవుతారు’’ అన్నాడు. 40 రోజుల వ్యవధిలో రవిశాస్త్రి మాటలు నిజం అయ్యాయి. అలాగే, అడిలైడ్ టెస్ట్ అనంతరం రెండు రోజుల వ్యవధిలో మేము ఐదు సార్లు సమావేశం అయ్యాం. విరాట్ (కోహ్లీ), జింక్స్ (అజింక్య రహానె), కోచింగ్ సిబ్బంది కాంబినేషన్స్ గురించి చర్చించారు. విరాట్ కొన్ని అద్భుతమైన సూచనలు ఇచ్చాడు. వాటన్నింటి ఫలితమే ఈ విజయం’’ అన్నారు శ్రీధర్. (నన్ను ఎవరితోనూ పోల్చకండి: పంత్) -
నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. పింక్‌బాల్ టెస్టులో అవమానకర రీతిలో కోహ్లి సేన ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులే చేసిన భారత్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. దీంతో టీమిండియా ప్రదర్శనపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతి విశ్వాసమే ఈ పరిస్థితిని కల్పించింది అని కొందరు అంటుంటే, మరికొందరేమో పింక్ బాల్ కొంపముంచిందని భారత ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ తనయుడు, మాజీ ఆటగాడు రోహన్ గావస్కర్ కోహ్లి సేనపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తొలి ఇన్నింగ్స్ టెస్టు మ్యాచ్‌గా, రెండో ఇన్నింగ్స్ టీ20 గా అనిపించిందని ట్విటర్లో కామెంట్ చేశాడు. పింక్ బాల్ టెస్టుతో మరో కొత్త ఫార్మాట్ పుట్టుకొచ్చిందని పేర్కొన్నాడు. అయితే, రోహన్ కామెంట్లపై ఓ అభిమాని విరుచుకుపడ్డాడు. ‘హే బడ్డీ.. ఇంతకూ క్రికెట్‌కు సంబంధించి ఏం సాధించావ్. టీమిండియా ఆటగాళ్లపై ఊరికే ఎందుకు కామెంట్ చేస్తావ్. ముందు నీ జీవితంలో ఏదైనా సాధించు. నీకింకా చిన్నా పిల్లాడి మనస్తత్వమే ఉంది’అని ఎద్దేవా చేశాడు. ఇక అభిమాని కౌంటర్‌పై రోహన్ తనదైన శైలిలో స్పందించాడు. ‘నన్ను బడ్డీ అని కామెంట్ చేస్తున్న నీదే పిల్లల మనస్తత్వం. భారత్ తరపున వన్డేలకు ప్రాతినిథ్యం వహించాను. కనుకనే టీమిండియాపై కామెంట్లు చేస్తున్నాను. నువ్ ఫాంటసీ క్రికెట్ ఆడుకో. ఒకరిపై ఆధారపడకుండా బతకడం నేర్చుకో’ అని చురకలు వేశాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్లోకి 2004లో అరంగేట్రం చేసిన రోహన్ 11 వన్డేలు ఆడి 18.87 సగటుతో 151 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 117 మ్యాచ్‌లు ఆడి 44 సగటుతో 6900 పరుగులు చేశాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. A) I’m not your buddy B) yes I have . C) stick to making your fantasy teams . D) move out of your parents house . https://t.co/LM6Q8oeKVT — Rohan Gavaskar (@rohangava9) December 19, 2020 -
భారత్ ఘోర పరాజయం
భారత అభిమానులను ఈ సంఖ్య చిరకాలం వెంటాడుతుంది... ఇప్పటి వరకు క్రికెట్లో 36 అంటే మన యువరాజ్ కొట్టిన సిక్సర్ల వర్షం గుర్తుకొచ్చేది... ఇప్పుడు 36 అంటే మరచిపోలేని ఒక పరాభవం... ఆస్ట్రేలియా గడ్డపై ఒక అవమానకర ఓటమి... అడిలైడ్ మైదానంలో ‘పింక్ బాల్ తెచ్చిన పీడకల’... డే అండ్ నైట్ టెస్టు పోరులో చివరకు మనకు మిగిల్చిన చీకటి... ఒకరిని మించి మరొకరు బ్యాట్స్‌మన్ ఉన్న జట్టులో ఒక్కరు కూడా రెండంకెల పరుగులు చేయలేని వేళ... అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కనుమూసి తెరిచేలోపు వికెట్ పడిపోతున్నట్లు అనిపించిన ఆవేదన... ఇంకొద్దిసేపు నిలబడలేరా? ఇంకొన్ని పరుగులు చేయలేరా? అంటూ పెట్టుకుంటున్న ఆశలు క్షణాల వ్యవధిలో మటుమాయం అవుతుండగా చివరకు తమ టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరుకు టీమిండియా దిగజారింది. ఆటలో ఉండే అనిశ్చితే వేరు... ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లగలదు, ఆ వెంటనే అధః పాతాళానికి పడేయగలదు... రెండు రోజుల ఆట తర్వాత టెస్టు గెలుచుకోగలమనే నమ్మకాన్ని కలిగించిన జట్టు కొన్ని గంటల్లోనే ఒక్కసారిగా ఓటమిని నట్టింట్లోకి ఆహ్వానించింది... గంటలకొద్దీ క్రీజ్‌లో గడిపి వందలకొద్దీ పరుగులు చేయగల సామర్థ్యం ఉన్న బ్యాట్స్‌మెన్ కలిగిన జట్టు ఆట కట్టించేందుకు మూడో రోజు 92 బంతులే సరిపోయాయి... మన జట్టుకు భారీ పరాజయాలు కొత్త కాదు... విదేశీ గడ్డపై ఎన్నో పేలవ ప్రదర్శనలు వచ్చాయి... కానీ ఎప్పుడో 1974 నాటి చెత్త రికార్డును తిరగరాసేంత వైఫల్యం 2020లో ఊహించలేనిది. అయితే ఇలాంటి స్థితిని సృష్టించిన ఆస్ట్రేలియా అద్భుత బౌలింగ్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. మన బ్యాటింగ్ లోపాలకంటే హాజల్‌వుడ్, కమిన్స్ చెలరేగిన తీరు ఆస్ట్రేలియాకు అనూహ్య విజయాన్ని అందించిందంటే అతిశయోక్తి కాదు. అడిలైడ్: రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో అద్భుత విజయంతో ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత్ ఇప్పుడు అక్కడే పరాజయంతో సిరీస్‌లో వెనుకంజ వేసింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌటైంది. జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పేసర్లు జోష్ హాజల్‌వుడ్ (5/8), ప్యాట్ కమిన్స్ (4/21) భారత జట్టు వెన్నువిరిచారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 53 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ స్కోరు 89 పరుగులకు చేరింది. 90 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 21 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 2 వికెట్లకు 93 పరుగులు సాధించి గెలిచింది. జో బర్న్స్ (63 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీకి తోడు మాథ్యూ వేడ్ (53 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక అర్ధసెంచరీతో జట్టును ఆదుకోవడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 5 చక్కటి క్యాచ్‌లు అందుకున్న కెప్టెన్ టిమ్ పైన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఆసీస్ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో నిలవగా... ఈ నెల 26 నుంచి మెల్బోర్న్లో రెండో టెస్టు జరుగుతుంది. టపటపా... మూడో రోజు భారత్ ఆట ముగిసేందుకు 15.2 ఓవర్లు సరిపోయాయి. ‘నైట్ వాచ్‌మన్’ బుమ్రాను తన తొలి ఓవర్లోనే అవుట్ చేసి కమిన్స్ భారత్ పతనానికి శ్రీకారం చుట్టగా, హాజల్‌వుడ్ తన అద్భుత బౌలింగ్‌తో జట్టు ఆట ముగించాడు. 15 పరుగుల స్కోరు వద్దే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. హాజల్‌వుడ్ ఒకే ఓవర్లో మయాంక్, రహానేలను అవుట్ చేయగా... గ్రీన్ చక్కటి క్యాచ్‌కు కోహ్లి నిష్క్రమించాడు. క్యాచ్ అందుకునే సమయంలో బంతి నేలను తాకినట్లు సందేహించిన థర్డ్ అంపైర్ పదే పదే రీప్లేలు చూసిన అనంతరం అవుట్‌గా నిర్ధారించాడు. టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరు (26) వద్దే భారత్ రెండు వికెట్లు చేజార్చుకోవడంతో మన జట్టూ ఆ జాబితాలో చేరుతుందేమో అనిపించింది. అయితే దానిని అధిగమించిన భారత్ మరో 10 పరుగులు జోడించి తర్వాతి మూడు వికెట్లు కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో షమీ చేతికి దెబ్బ తగలగా... వైద్యులు స్వల్ప చికిత్స చేసినా ఫలితం లేకపోగా, అతను పెవిలియన్‌కు వచ్చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. వేగంగా... స్వల్ప ఛేదనలో ఆసీస్ చకచకా దూసుకుపోయింది. ముఖ్యంగా బర్న్స్ తన ఆత్మవిశ్వాసం పెంచే ఇన్నింగ్స్ ఆడాడు. స్వల్ప స్కోరు కారణంగా బౌలర్లు కూడా కుంగిపోయారేమో... బుమ్రా, ఉమేశ్‌లలో తొలి ఇన్నింగ్స్ పదును కనిపించలేదు. ఫలితంగా 4.42 రన్‌రేట్‌తో ఆసీస్ పరుగులు సాధించింది. విజయానికి చేరువైన దశలో రెండు వికెట్లు కోల్పోయినా... ఎలాంటి ఇబ్బంది లేకుండా బర్న్స్, స్మిత్ (1 నాటౌట్) మ్యాచ్‌ను ముగించారు. ఇలా వరుసకట్టి... ఓవర్ 3.1–పృథ్వీ షా (రెండో రోజు): కమిన్స్ వేసిన బంతి ఆఫ్‌స్టంప్‌పై పడి లోపలికి దూసుకొచ్చింది. డిఫెన్స్ ఆడటంలో నెమ్మదిగా కదలడంతో క్లీన్‌బౌల్డ్. ఓవర్ 7.6–బుమ్రా (మూడో రోజు): కమిన్స్ బౌలింగ్‌లో నేరుగా దూసుకొచ్చిన స్లో లెగ్కటర్. షాట్ ఆడబోయి బౌలర్ చేతుల్లోకి బంతి. ఓవర్ 11.2–పుజారా: కమిన్స్ కచ్చితమైన లెంగ్త్‌తో వేసిన అద్భుత బంతి. తప్పకుండా ఆడాల్సిన పరిస్థితి. బ్యాట్‌కు తగులుతూ బంతి కీపర్ చేతుల్లోకి. ఓవర్ 12.1–మయాంక్: హాజల్‌వుడ్ బౌలింగ్‌లో నేరుగా వచ్చిన బంతి. అదనపు బౌన్స్ కారణంగా బ్యాట్‌కు తగిలి కీపర్ క్యాచ్. ఓవర్ 12.5–రహానే: నేరుగా బ్యాట్‌పైకి కచ్చితత్వంలో వచ్చిన హాజల్‌వుడ్ బంతి. బ్యాట్స్‌మన్ కదల్లేని పరిస్థితి. కీపర్‌కు క్యాచ్. ఓవర్ 13.4–కోహ్లి: క్రీజ్‌కు దూరంగా వెళుతున్న బంతిని డ్రైవ్ చేసే ప్రయత్నం. గల్లీలో క్యాచ్. ఓవర్ 18.4–సాహా: కాస్త భిన్నం. హాజల్‌వుడ్ లెగ్‌స్టంప్‌పై వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో మిడ్వికెట్లో క్యాచ్. ఓవర్ 18.5–అశ్విన్: తొలి బంతికే అవుట్. హాజల్‌వుడ్ గుడ్‌లెంగ్త్‌లో వేయగా ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడబోయి కీపర్‌కు క్యాచ్. ఓవర్ 20.1–విహారి: స్టంప్స్‌పైకి నేరుగా హాజల్‌వుడ్ బౌలింగ్ చేయగా ఫ్రంట్‌ఫుట్ షాట్ ఆడిన విహారి బ్యాట్‌కు తగులుతూ కీపర్ చేతుల్లోకి. ఓవర్ 21.2–షమీ: కమిన్స్ వేసిన షార్ట్ బాల్‌ను తప్పించుకునే ప్రయత్నంలో చేతికి బలంగా తగిలిన బంతి. ఆడలేని పరిస్థితిలో రిటైర్డ్. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 244; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 191; భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) కమిన్స్ 4, మయాంక్ (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 9, బుమ్రా (సి అండ్ బి) కమిన్స్ 2, పుజారా (సి) పైన్ (బి) కమిన్స్ 0, కోహ్లి (సి) గ్రీన్ (బి) కమిన్స్ 4, రహానే (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 0, విహారి (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 8, సాహా (సి) లబ్‌షేన్ (బి) హాజల్‌వుడ్ 4, అశ్విన్ (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 0, ఉమేశ్ యాదవ్ (నాటౌట్) 4, షమీ (రిటైర్డ్ నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (21.2 ఓవర్లలో ఆలౌట్) 36. వికెట్ల పతనం: 1–7, 2–15, 3–15, 4–15, 5–15, 6–19, 7–26, 8–26, 9–31, 9–36. బౌలింగ్: స్టార్క్ 6–3–7–0, కమిన్స్ 10.2–4–21–4, హాజల్‌వుడ్ 5–3–8–5. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వేడ్ (రనౌట్) 33, బర్న్స్ (నాటౌట్) 51, లబ్‌షేన్ (సి) మయాంక్ (బి) అశ్విన్ 6, స్మిత్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం (21 ఓవర్లలో 2 వికెట్లకు) 93. వికెట్ల పతనం: 1–70, 2–82. బౌలింగ్: ఉమేశ్ 8–1–49–0, బుమ్రా 7–1–27–0, అశ్విన్ 6–1–16–1. ‘42’ మ్యాచ్‌లో... 1974లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే ఆలౌట్ కావడం ఇప్పటి వరకు భారత్ అత్యల్ప స్కోరు. ముందుగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగులు చేయగా... భారత్ 302 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫాలోఆన్ ఆడిన మన జట్టు 17 ఓవర్లలో 77 నిమిషాల్లోనే 42 పరుగులకు కుప్పకూలింది. సునీల్ గావస్కర్ (5), గుండప్ప విశ్వనాథ్ (5), బ్రిజేశ్ పటేల్ (1), ఆబిద్ అలీ (3) తదితరులు విఫలమవ్వగా... ఏక్నాథ్ సోల్కర్ (18) ఒక్కడే రెండంకెల స్కోరు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్, 285 పరుగులతో గెలిచింది. -
మాటల్లో చెప్పలేను: కోహ్లి
అడిలైడ్: పింక్ బాల్ టెస్టులో ఓటమి తనను తీవ్రంగా కలచివేసిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. ఆ బాధను మాటల్లో చెప్పడం చాలా కష్టమని, ఈ పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి సేన 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగుల స్కోరుకే పరిమితమై ఘోర ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా సింగిల్ దాటలేక చేతులెత్తేయడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: టీమిండియా మా రికార్డును బ్రేక్ చేసింది: అక్తర్) ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ ప్రస్తుతం నా మదిలో మెదులుతున్న భావాలను వర్ణించడానికి మాటలు రావడం లేదు. మైదానంలో అడుగుపెట్టేసరికి 60 పరుగుల ఆధిక్యంలో ఉన్నాం. కానీ వెనువెంటనే అంతా ముగిసిపోయింది. రెండు రోజుల పాటు బాగానే ఆడాం. కానీ చివరి సమయంలో ఏం చేయలేకపోయాం. ఇది నిజంగా నన్ను బాధించింది. పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాం. తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే బౌలర్లు అదే ఏరియాలో బంతులు వేశారు. మేం కూడా వీలైనంత ఎక్కువ స్కోరు చేయాలనే భావించాం. కానీ అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిర్లక్ష్య ఆటతీరు, ప్రత్యర్థి జట్టు బౌలర్లు బంతులు సంధించిన విధానం రెండూ కూడా ఓటమికి కారణమయ్యాయి’’ అని పేర్కొన్నాడు.