పేలవ డ్రాగా ముగిసిన పింక్‌ బాల్‌ టెస్ట్‌ | INDW Vs AUSW: Pink Ball Test Ends In A Draw | Sakshi
Sakshi News home page

INDW Vs AUSW: పేలవ డ్రాగా ముగిసిన పింక్‌ బాల్‌ టెస్ట్‌

Published Sun, Oct 3 2021 6:38 PM | Last Updated on Sun, Oct 3 2021 6:38 PM

INDW Vs AUSW: Pink Ball Test Ends In A Draw - Sakshi

గోల్డ్‌కోస్ట్‌: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ‘పింక్‌ బాల్‌’ టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 143/4తో చివరి రోజు(ఆదివారం) ఆటను కొనసాగించిన ఆసీస్‌ మహిళల జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మిథాలీ సేన.. 36 ఓవర్లు ఆడి 3 వికెట్లు కోల్పోయి 135 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి 272 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ ముందుంచింది. అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. మ్యాచ్‌ ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. కాగా, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. సూపర్‌ శతకంతో అలరించిన మంధాన(127)కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.
చదవండి: 'లైగర్‌'తో యువ్‌రాజ్‌ సింగ్‌ పోటీ.. గెలుపెవరిది..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement