అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు పర్వాలేదన్పించినా.. బ్యాటర్లు మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారత బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు.
తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైన టీమిండియా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆతిథ్య ఆసీస్ ముందు కేవలం 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే భారత్ ఉంచింది.
ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఊదిపడేసింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బ్యాటింగ్ పరంగా తాము పూర్తిగా నిరాశపరిచామని హిట్‌మ్యాన్ తెలిపాడు. కాగా రెండు ఇన్నింగ్స్‌లలోనూ రోహిత్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు.
"మాకు ఈ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌లో మేము బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాము. ఆస్ట్రేలియా మా కంటే మెరుగ్గా ఆడింది. గెలిచేందుకు వారు అన్ని రకాలగా అర్హులే. ఈ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు మాకు కొన్ని అవకాశాలు లభించాయి.
కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యాము. పెర్త్‌లో మా జట్టు అద్బుతమైన ప్రదర్శన చేసింది. అదే జోరును అడిలైడ్‌లోనూ కొనసాగించాలనుకున్నాము. కానీ ప్రతీ టెస్ట్ మ్యాచ్ ఓ సవాల్ లాంటింది. పింక్ బాల్‌తో ఆడటం అంత సులువు కాదని మాకు ముందే తెలుసు.
ఆస్ట్రేలియా మాత్రం పింక్ బాల్‌తో అద్భుతంగా ఆడింది. ఇక మా దృష్టి అంతా గబ్బా టెస్టు పైనే. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తాము. ఆ మ్యాచ్‌కు పెద్దగా సమయం కూడా లేదు. మేము వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లి పెర్త్‌లో మాప్రదర్శనపై చర్చించుకుంటాము.
అదే విధంగా గతంలో గబ్బాలో మా విజయాలను కూడా గుర్తు చేసుకుంటాము. ఇక్కడ మాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: WTC 2025: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే?
Comments
Please login to add a commentAdd a comment