IND vs AUS 2nd Test 3rd Day Live updates: అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది.
టీమిండియా ఓటమి..
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 19 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని ఆసీస్ వికెట్ నష్టపోకుండా చేధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో ఆసీస్ సమం చేసింది.
175 పరుగులకు భారత్ ఆలౌట్..
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 175 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్ ముందు 19 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది. భారత బ్యాటర్లలో నితీశ్ కుమార్(42) పరుగులతో మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 5 వికెట్లతో సత్తాచాటగా.. బోలాండ్ 3, స్టార్క్ రెండు వికెట్లు సాధించారు.
తొమ్మిదో వికెట్ డౌన్..
భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 42 పరుగుల చేసిన నితీశ్ రెడ్డి.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ ప్రస్తుతం 9 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
35 ఓవర్లకు టీమిండియా స్కోర్: 160/8
35 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 3 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఆరో వికెట్ డౌన్.. రిషబ్ పంత్ ఔట్
మూడో రోజు ఆట ఆరంభంలోనే భారత్‌కు భారీ షాక్ తగిలింది. 28 పరుగులు చేసిన రిషబ్ పంత్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు.
మూడో రోజు ఆట ప్రారంభం..
అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(28), నితీశ్ కుమార్ రెడ్డి(15) ఉన్నారు. భారత్ ఇంకా 29 పరుగులు వెనకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment