టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ‘కోపమొచ్చింది’. తనను చుట్టుముట్టిన అభిమానుల్లో ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించడంతో హిట్‌మ్యాన్ నవ్వుతూనే విసుక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమయ్యాడు. తన భార్య రితికా సజ్దే తమ రెండో సంతానానికి జన్మనివ్వడంతో.. ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే, భార్యకు ప్రసవమైన వెంటనే రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.
పెర్త్ వేదికగా మొదటి టెస్టు మధ్యలోనే జట్టుతో చేరాడు. ఇక అడిలైడ్‌లో డిసెంబరు 6 నుంచి మొదలుకానున్న రెండో టెస్టు(పింక్ బాల్)తో రోహిత్ తిరిగి టీమిండియా పగ్గాలు చేపట్టనున్నాడు. అయితే, అంతకంటే ముందే గులాబీ బంతితో టీమిండియా సాధన చేసింది. కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది.
టీమిండియా విజయం
శనివారం మొదలుకావాల్సిన ఈ మ్యాచ్ వర్షం వల్ల తొలిరోజు టాస్ పడకుండానే ముగిసిపోయింది. దీంతో ఆదివారం ఆట కొనసాగగా 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. ఇదిలా ఉంటే.. ప్రాక్టీస్ మ్యాచ్‌కు వెళ్తున్న సమయంలో రోహిత్ శర్మను అభిమానులు చుట్టుముట్టారు.
హిట్‌మ్యాన్ రియాక్షన్ వైరల్
హిట్‌మ్యాన్‌తో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. అయితే, ఓ అభిమాని.. రోహిత్ వేరేవాళ్లకు ఆటోగ్రాఫ్ ఇస్తుండగా తనతో సెల్ఫీ దిగాలంటూ పదే పదే విసిగించాడు. దీంతో ఒకింత అసహనానికి గురైన రోహిత్.. ‘‘ఒకసారి ఒక్క పని మాత్రమే చేయగలం’’ అని సున్నితంగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ కేవలం మూడు పరుగులే చేసి అవుటయ్యాడు.
కాన్‌బెర్రాను వీడిన రోహిత్ సేన
రెండో టెస్టు కోసం టీమిండియా అడిలైడ్‌కు పయనమైంది. కాగా ప్రాక్టీస్ మ్యాచ్ కోసం కాన్‌బెర్రాకు వచ్చిన రోహిత్ సేన తొలుత ఆసీస్ ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం రోహిత్ ఆస్ట్రేలియన్ పార్లమెంటులో ప్రసంగించాడు. ఇక ఇప్పుడు పింక్ బాల్ టెస్టులో సారథిగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు.
Rohit to fan's : "ak time par ak hi kaam ho Sakta hai."😂👌🏻
Captain Rohit Sharma giving autograph to fan's at Manuka oval Canberra.🙌🇮🇳 pic.twitter.com/kkCMb6LHQt— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 30, 2024
Comments
Please login to add a commentAdd a comment