'నీకు అవకాశాలు దండగ.. పోయి ఇంట్లో కూర్చో' | Hillarious Trolls In Twitter On Prithvi Shaw Duck Out Pink Ball Test | Sakshi
Sakshi News home page

పృథ్వీ షా డకౌట్‌.. వైరలవుతున్న ట్వీట్స్‌

Published Thu, Dec 17 2020 11:02 AM | Last Updated on Thu, Dec 17 2020 2:07 PM

Hillarious Trolls In Twitter On Prithvi Shaw Duck Out Pink Ball Test - Sakshi

అడిలైడ్‌ : ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ పృథ్వీ షా తొలి ఓవర్‌ రెండో బంతికే మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. స్టార్క్‌ వేసిన గుడ్‌ లెంగ్త్‌ డెలివరీని అంచనా వేయడంలో పొరబడ్డ పృథ్వీ బ్యాట్‌ పైకెత్తడంతో బంతి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో పృథ్వీ షాపై సోషల్‌ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రాణించిన శుబ్‌మన్‌ గిల్‌ను కాదని ఓపెనర్‌గా ​పృథ్వీ షాను తీసుకోవడం.. అతను డకౌట్‌గా వెనుదిరగడంతో నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్‌ చేస్తున్నారు. (చదవండి : పరుగులే కాదు వికెట్లు కూడా తీయగలరు)


'పృథ్వీ షాకు అవకాశాలు ఎందుకిస్తారో అర్థం కావడం లేదు.. పృథ్వీ స్థానంలో గిల్‌ లేదా రాహుల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది.. పృథృ షా వన్డే.. టెస్టు.. ప్రాక్టీస్‌ ఇలా ఏదైనా నీ ఆటతీరు మారదా.. వరుసగా విఫలమవుతున్న షాకు ఇంకా ఎన్ని అవకాశాలు ఇస్తారో.. పృథ్వీ నీకు అవకాశాలు ఇచ్చి దండగ.. పోయి ఇంట్లో కూర్చో ' అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. వాస్తవానికి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌కు ఒకరోజు ముందు ప్రకటించిన తుది జట్టులో గిల్‌ ఉంటాడని అంతా భావించారు. అయితే అనూహ్యంగా గిల్‌ను కాదని పృథ్వీ షాకు చాన్స్‌ ఇచ్చి మయాంక్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశం కల్పించారు. కానీ పృథ్వీ ఆ అవకాశాన్ని ఏమాత్రం వినియోగించుకోకుండానే డకౌట్‌గా వెనుదిరగడం విమర్శలకు దారితీస్తోంది. కాగా టీమిండియా ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. పుజారా 15 పరుగులతో, విరాట్‌ కోహ్లి 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : 'క్షమించండి.. మళ్లీ రిపీట్‌ కానివ్వను')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement