అడిలైడ్ : అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అసలు సమరానికి సమయం ఆసన్నమైంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో ప్రస్తుతం సమఉజ్జీల్లాంటి రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాను సొంతగడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించిన భారత జట్టు ఇప్పుడు అదే బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు అంతే ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగుతోంది. అయితే ఈసారి సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే డే నైట్(పింక్ బాల్) ఆడనుంది. టీమిండియాకు ఇది రెండో డై నైట్ టెస్టు మాత్రమే.. అదే ఆసీస్ మాత్రం ఇప్పటికే 7 డే నైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడి అన్నింటా గెలవడం విశేషం.
టీమిండియా మాత్రం స్వదేశంలో 2019లో బంగ్లాదేశ్‌పై కోల్‌కతా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో విజయం సాధించింది. అప్పటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైంది. ఇషాంత్ శర్మ 5వికెట్లతో టాప్ లేపగా.. ఉమేశ్‌యాదవ్ 3, షమీ 2 వికట్లెతో రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతో రాణించడంతో 9 వికెట్ల నష్టానికి 347 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన బంగ్లా జట్టు ఉమేశ్, ఇషాంత్‌ల దాటికి 195 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
కాగా జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడకపోవడంతో.. ఆసీస్‌తో జరిగే తొలి టెస్టు అతనికి మొదటి పింక్ బాల్ టెస్టు కానుంది. ఇక అనుభవం పరంగా చూసుకుంటే ఆసీస్ బలంగా కనిపిస్తున్నా.. టీమిండియా కూడా మంచి ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. స్వదేశంలో ఆడిన తొలి పింక్ టెస్టు గెలిచిన టీమిండియాకు విదేశంలో ఆడనున్న తొలి డే నైట్ కలసి వస్తుందా అనేది చూడాల్సి ఉంది.
జట్ల వివరాలు
భారత్ (తుది జట్టు): కోహ్లి (కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, పుజారా, రహానే, విహారి, సాహా, అశ్విన్, షమీ, ఉమేశ్, బుమ్రా.
ఆస్ట్రేలియా (తుది జట్టు): పైన్ (కెప్టెన్), బర్న్స్, వేడ్, లబ్‌షేన్, స్మిత్, హెడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్.
Comments
Please login to add a commentAdd a comment