Canberra
-
ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అస్ట్రేలియా రాజధాని కెన్బెర్రాలో రవి సాయల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రవి సాయల మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో బాగంగా మెల్బోర్న్లో కల్వకుంట్ల సాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటి నాయకులు ఝాన్సీ నోముల , గాయత్రి అరిగెల, రాకేష్ లక్కరసు , సిద్దు గొర్ల , రమేష్ కైల రుద్ర కొట్టు , వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ మహిళపై పైశాచికత్వం.. నోట్లో పళ్లన్నీ ఊడిపోయేలా..!
పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లే ఎందరో అమాయకులు బానిత్వంలో మగ్గిపోతున్నారు. వారిపై యజమానులు అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు కోకొల్లలు. మానవత్వాన్ని మరిచి చేసే హింసల దాటికి బాధితులు బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటారు. మెల్బోర్న్(ఆస్ట్రేలియా): ఓ భారతీయ మహిళను ఎనిమిదేళ్లపాటు తమ ఇంటిలో బానిసగా ఉంచినందుకు మెల్బోర్న్ దంపతులకు అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కందసామి కణ్ణన్(57), కుముత్తిని కణ్ణన్(53) భార్యాభర్తలు. అయితే కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి మెల్బోర్న్లో స్థిరపడ్డారు. కాగా వాళ్లింట్లో పనులు చేయించుకునేందుకు తమిళనాడుకు చెందిన ఓ మహిళను 2007లో మెల్బోర్న్కు తీసుకెళ్లారు. కొన్నాళ్లు బాగానే వ్యవహరించిన ఈ వృద్ధ దంపతులు ఆ తర్వాత ఆ మహిళ పట్ల కర్కశంగా వ్యవహరించారు. తిట్టి, కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆమెపై పైశాచికంగా ప్రవర్తించి కొట్టడంతో నోట్లో పళ్లన్నీ ఊడిపోయాయి. సరిగ్గా తినడానికి తిండి కూడా పెట్టకుండా నరకం చూపించారు. ఇలా వెలుగులోకి.. కాగా 2015 జులైలో ఆ పెద్దావిడ మూత్రపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ఆమెను పరీక్షించిన ఓ పారామెడిక్.. మహిళ కేవలం 40 కేజీల బరువు ఉండి, శరీర ఉష్ణోగ్రత కూడా 28.5 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆమెకు షుగర్ ఉండగా.. శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో ఆ పారామెడిక్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ భార్యాభర్తలు చేసిన అమానవీయ ఆకృత్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితురాలి వయసు 67 సంవత్సరాలు. ఈ అమానుష ఘటనపై విక్టోరియా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ చాంపియన్ తీవ్రంగా స్పందించారు. వృద్ధ దంపతుల పట్ల ఎవరూ.. ఎలాంటి కనికరం చూపరాదని.. వాళ్లు చేసిన పని కచ్చితంగా మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించడమేనని న్యాయమూర్తి తీర్పు వెలువరించే సందర్భంలో వ్యాఖ్యానించారు. -
వైరల్ వీడియో: చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలు!
కాన్బెర్రా: ఈ చరాచరా సృష్టిలో మనిషి అత్యంత బలహీనుడు. కానీ, అతడి మేధా శక్తితో ఇతర జీవులను శాసిస్తున్నాడు. ఇక పాడైపోయిన చెప్పులనైనా ఇంట్లో ఉంచుకుంటారు. కానీ మనిషి చచ్చిన మరుక్షణమే కాటికి పంపంచే కార్యక్రమం మొదలవుతుంది. అయితే మెల్బోర్న్కి చెందిన జాక్కి విలియమ్స్(29) అనే మహిళ చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలను తయారు చేస్తోంది. గ్రేవ్ మెటాలమ్ జ్యువెలరీలో చనిపోయిన వ్యక్తుల దంతాలు, వెంట్రుకలతో వారి కుటుంబాలకు ఉంగరాలు, కంఠహారాలు తయారు చేస్తోంది. దీని పై విలియమ్స్ మాట్లాడుతూ..‘‘ తనని తాను కాల్చుకుని చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబ కోసం ఐయూడీని ఉపయోగించి ఓ ఆభరణాన్ని తయారు చేసి ఇచ్చాను. ఆ విధంగా ఈ వ్యాపారం మొదలైంది. ఈ ఆభరణాలను తయారు చేయడానికి ఎనిమిది వారాలు పడుతుంది. వీటి ధర 350 నుంచి 10,000 డాలర్ల వరకు ఉంటుంది. మరణం పై ఉన్న భయాలను పోగొట్టాలనే ఆశయంతో ఈ పని చేస్తున్నాను. గ్రేవ్ మెటాలమ్ అనే వెబ్సైట్లో వీటిని విక్రయానికి పెట్టాను.’’ అని జాక్కి విలియమ్స్ పేర్కొంది. -
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కుటుంబాన్ని కలిసిన వార్నర్
ఆస్రేలియా(కాన్బెర్రా): నెల రోజుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ సోమవారం తన కుటుంబాన్ని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను వార్నర్ భార్య కాండిస్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. కాగా కోవిడ్-19 కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు పయనమయ్యారు. అయితే ఆస్ట్రేయాలో ప్రయాణాలపై నిషేధం కారణంగా ఆ దేశానికి చెందిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ తమ దేశ ఆటగాళ్లతో కలిసి మాల్దీవులకు వెళ్లాల్సి వచ్చింది. కాగా ఐపీఎల్ 2021లో ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక్కటే మ్యాచ్ గెలిచి చివరి స్థానంలో ఉంది. దీంతో సన్ రైజర్స్ జట్టు యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను కేన్ విలియమ్సన్కు అప్పగించింది. అంతేకాకుండా ఈ సీజన్లో మిగిన అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే సన్ రైజర్స్‌కు ప్లే ఆఫ్‌లో చోటు సంపాదించడానికి అవకాశం ఉంది. ఇక ఐపీఎల్-2021 సీజన్లో మిగిలిన మ్యాచ్‌లు యుఏఈలో జరుగుతాయని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసీసీఐ) ధృవీకరించిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్యాలెండర్ బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ప్యాట్ కమిన్స్ కూడా తనకు కాబోయే ఫియాన్సీ బెకీ బోస్టన్‌ని కలుసుకున్నాడు. David Warner, Steve Smith and Pat Cummins are amongst the players, staff and media who are finally home after leaving India during its COVID-19 outbreak -- which forced the postponement of the IPL. pic.twitter.com/mfibSr2zr5 — 10 Sport (@10SportAU) May 30, 2021 (చదవండి: Xavier Doherty: వడ్రంగిగా మారిన ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్!) -
ICC World Cup: గెలిచిన జట్టులో సభ్యుడు.. ఇప్పుడు కార్పెంటర్!
ఆస్ట్రేలియా(కాన్బెర్రా): భారత దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ కారణంగా కొత్తగా ఎంతో మంది స్వదేశీ, విదేశీ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. వారికి వేలంలో ఫుల్ డిమాండ్ ఉంది. ప్రతిభ నిరూపించుకంటే కోట్లకు కోట్లు ఆర్జించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాళ్లు కూడా కొంతమంది ఈ లీగ్‌లో ఆడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. కొంతమంది పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ పొట్ట పోషించుకోవడానికి వడ్రంగిగా మారిపోయాడు. జేవియర్ డోహెర్టీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేళ్లకు పైగా అవుతోంది. 2015 ప్రపంచ కప్ విజేత అయిన ఆస్ట్రేలియా జట్టులో అతడు భాగస్వామిగా ఉన్నాడు. లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన జేవియర్ డోహెర్టీ 2001-02 సీజన్లో తన ఫస్ట్-క్లాస్ జట్టులో అరంగేట్రం చేశాడు. దాదాపు అతను 17 సంవత్సరాల పాటు క్రికెట్లో కొనసాగారు. 71 ఫస్ట్ క్లాస్, 176 లిస్ట్ ఏ, 74 టీ-20 మ్యాచ్‌లు ఆడిన అతడు మొత్తం 415 వికెట్లు పడగొట్టాడు. ఇక అతడు చివరిసారిగా 2015లో ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కనిపించాడు. ఈ మాజీ ఆస్ట్రేలియన్ లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇప్పటిరకు ఆస్ట్రేలియా తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు ఆడాడు. కాగా 2020, మార్చిలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా లెజెండ్స్ కోసం చివరిసారిగా ఆడాడు. Test bowler turned carpenter 👷🔨 Xavier Doherty took some time to find what was right for him following his retirement from cricket, but he's now building his future with an apprenticeship in carpentry.#NationalCareersWeek pic.twitter.com/iYRq2m39jt — Australian Cricketers' Association (@ACA_Players) May 18, 2021 (చదవండి: Mithali Raj: వ్యక్తిగతం కాదు... సమష్టితత్వం ముఖ్యం) -
వైరల్: శునకం యోగాసనాలు..నెటిజన్లు ఫిదా!
ఆస్ట్రేలియా(కాన్బెర్రా): మనిషి జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయింది. మనుషులు తమ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలను ప్రతిదీ సోషల్ మీడియాలోనే అధికంగా పంచుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు నెటిజన్లు తమ పెంపుడు జంతువుల విన్యాసాలను షేర్ చేస్తుంటారు. మనిషి మచ్చిక చేసుకున్న మొదటి జంతువు శునకం. విశ్వాసం చూపడంలో ఇది ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే శునకాలు, మనుషుల మధ్య సంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ పెంపుడు కుక్క యోగాసనాల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో గొర్రెలకు కాపలా ఉండే ఆ శుకనం పేరు సీక్రెట్. ఈ శునకం చాపపై యోగా చేస్తూ.. దాని యజమాని మేరీని అనుకరిస్తుంది. ఈ వీడియోను "మై ఆసి గాల్" అనే క్యాప్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోను మాజీ అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్" ఈ కుక్క వాస్తవానికి యోగా చేస్తోంది." అనే క్యాప్సన్‌తో ట్విట్టలో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 4 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది హృదయాలను గెలుచుకుంటోంది. కాగా, దీనిపై నటుడు ఆష్కా గోరాడియా స్పందిస్తూ.. "మధురమైన కన్నీళ్లు ... నిన్ను ఏ కంటెంట్ కూడా అధిగమించదు ... ఇది నిజమైన ప్రేమ" అని కామెంట్ చేశారు. "సో క్యూట్! మీరు మీ శునకానికి యోగా నేర్పడానికి ఎంత సమయం పట్టింది?’’ అంటూ మరో నెటిజన్ ఆసక్తి కనబరిచారు. This dog is actually doing yoga... pic.twitter.com/d7oK5EJa2l — Rex Chapman🏇🏼 (@RexChapman) May 17, 2021 (చదవండి: Rahul Gandhi: ప్రజలు అడిగే ప్రశ్నలను కాదు..కరోనాను ఆపండి) -
పార్లమెంట్లో రాసలీలలు.. డెస్క్‌లు, టేబుళ్ల చాటుగా
సిడ్నీ: ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ కాస్త బెడ్రూమ్గా మారింది. కామవాంఛ తీర్చుకోవడానికి అడ్డాగా మారింది. పార్లమెంట్ సిబ్బంది యథేచ్ఛగా రాసలీలలు కొనసాగిస్తూ పార్లమెంట్‌కు మచ్చ తీసుకువచ్చారు. ఈ ఘటనలు ఆస్ట్రేలియా అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కంగారు దేశంలో కలకలం రేపుతోంది. పార్లమెంట్లో ఆవరణలో సిబ్బంది రాసలీలల ఫొటోలు, వీడియోలు లీకవడంతో తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆ ఫొటోలు, వీడియోలతో ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించడంతో బహిర్గతమైంది. దీంతో వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఒకరిపై వేటు వేయగా.. రక్షణ శాఖ మంత్రి క్షమాపణలు చెప్పారు. పార్లమెంట్‌లోని ప్రేయర్ రూమ్‌ను ఉద్యోగి టామ్ బెడ్రూమ్గా చేసుకున్నారు. అతడితో పాటు ఎంతో మంది సిబ్బంది ఈ విధంగా చేశారు. తోటి సిబ్బందితో పాటు బయటి నుంచి వేశ్యలను పిలిపించుకుని రాసలీలలు కొనసాగించారని ఆ దేశ ప్రధాన మీడియా బహిర్గతం చేసింది. ఓ మహిళ ఎంపీకి సంబంధించిన క్యాబీన్లో ఈ కామ కార్యాలు కొనసాగాయని తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో వాటికి సంబంధించినవి ట్రెండవుతున్నాయి. ఈ రాసలీలల కేసులో కేవలం టామ్ పేరు మాత్రమే బయటకు వచ్చింది. మిగతా వారి వివరాలు గోప్యంగా ఉంచారు. త్వరలోనే వారిని గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ వీడియోలు 2019 నాటివి. రెండేళ్ల కిందటి వీడియోలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ రాసలీలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ విషయంలో గతంలోనే ఓ మహిళ లైంగిక దాడి జరిగిందని ఆరోపించింది. ఈ విషయమై ఆ దేశ రక్షణ శాఖ మంతత్రి క్షమాపణ కూడా చెప్పారు. ఈ రాసలీలల ఘటనపై ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ స్పందించారు. ఈ వీడియోలు షాక్‌కు గురి చేశాయని చెప్పారు. సభను మళ్లీ ఆర్డర్‌లోకి పెట్టాలని, రాజకీయాలను పక్కనపెట్టి సమస్యను గుర్తించాలని సూచించారు. చదవండి: ఏం తెలివబ్బా.. మాస్క్‌తో హైటెక్ కాపీయింగ్ చదవండి: స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అదృశ్యం వెనుక మిస్టరీ ఇదేనా..! -
స్టన్నింగ్ క్యాచ్.. షాక్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్
కాన్బెర్రా : బిగ్‌బాష్ లీగ్ 2020లో మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో మెకేంజీ హార్వే అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. హార్వే అందుకున్న క్యాచ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌నే కాదు బౌలర్‌ను కూడా షాక్‌కు గురిచేసింది. కష్టసాధ్యమైన క్యాచ్‌ను హార్వే సూపర్డైవ్ చేసి అందుకున్న తీరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. హార్వే సాధించిన ఈ ఫీట్ సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జరిగింది. (చదవండి : వైరల్ : క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని) మెల్బోర్న్ రెనేగేడ్స్ బౌలర్ మిచెల్ పెర్రీ వేసిన ఫుల్‌టాస్ బంతిని అలెక్స్ హేల్స్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. ఆ షాట్ తీరు చూస్తే ఎవరైనా ఫోర్ అనుకుంటారు. కానీ బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న హార్వే ముందుకు డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. హార్వే క్యాచ్‌తో షాక్‌కు గురైన హేల్స్ నిరాశగా వెనుదిరగగా.. బౌలర్ పెర్రీ ఆశ్చర్యం వక్తం చేస్తూ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. అమేజింగ్ హార్వే.. ఇది క్యాచ్ ఆఫ్ ది టోర్న్‌మెంట్ అవుతుందా? హార్వేను బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది వరల్డ్ అనొచ్చా? దీనిపై మీ కామెంట్ ఏంటి అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా మ్యాచ్‌కు ముందు వర్షం అంతరాయం కలిగించడంతో 17 ఓవర్లకు ఆటను కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 17 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. షాన్ మార్ష్ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నబీ 33 పరుగులతో రాణించాడు. (చదవండి: క్యారీ స్టన్నింగ్ క్యాచ్.. వహ్వా అనాల్సిందే) అనంతరం 20 ఓవర్లలో 173 పరుగుల సవరించిన లక్ష్యాన్ని సిడ్నీ థండర్స్ ముందు ఉంచారు. ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా, అలెక్స్ హేల్స్ దాటిగా ఆడడంతో సిడ్నీ థండర్స్ వేగంగా పరుగులు సాధించింది. హేల్స్ వెనుదిరిగిన అనంతరం మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగింది. అప్పటికి సిడ్నీ థండర్స్ 12 ఓవర్లలో 117 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో డక్‌వర్త్ లుయీస్ పద్దతిలో సిడ్నీ థండర్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. The catch of the tournament!? The best fielder in the world!? What a grab...#BBL10 | @BKTtires pic.twitter.com/ByRq1ecBCL — cricket.com.au (@cricketcomau) January 1, 2021 -
వైరల్ : రనౌట్ తప్పించుకునేందుకే..
కాన్బెర్రా : బిగ్‌బాష్ లీగ్ 2020లో శనివారం మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ స్టార్స్ ఇన్నింగ్ ఆఖరి ఓవర్లో డేనియల్ సామ్స్ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్ లార్కిన్ ఫ్లిక్ చేశాడు. అయితే పొరపాటున బంతి లార్కిన్ జెర్సీలోకి దూరిపోయింది. అయితే లార్కిన్ కొట్టిన బంతి ఎక్కడా కనిపించకపోవడంతో సిడ్నీ థండర్స్ ఆటగాళ్లు కన్య్ఫూజ్ అయ్యారు. ఈ విషయం గమనించని లార్కిన్ నాన్ స్ట్రైకర్ ఎండ్ పిలుపుతో లార్కిన్ సింగిల్ పూర్తి చేశాడు. అతను సింగిల్ పూర్తి చేసే క్రమంలో జెర్సీ నుంచి బంతి కిందకు జారింది. (చదవండి : ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్ ఔట్!) దీంతో అవాక్కైన ఫీల్డర్లు ఇది ఛీటింగ్.. రనౌట్ తప్పించుకోవాలనే అలా చేశాడని.. అతని సింగిల్ చెల్లదని అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. ఫీల్డ్ అంపైర్లు పరిశీలించి లార్కిన్ తీసిన సింగిల్‌ను రద్దు చేసి అతన్ని మళ్లీ స్ట్రైకింగ్‌కు పంపించారు. ఈ సంఘటనతో మైదానంలో కాసేపు డ్రామా నెలకొంది. ఈ వీడియోనూ బిగ్‌బాష్ లీగ్ నిర్వాహకులు ట్విటర్ షేర్ చేశారు. ' రనౌట్ తప్పించుకునేందుకు బంతిని జెర్సీలో దాచి పరుగులు పెట్టాడు... ఎంతైనా లార్కిన్ ఇంటలిజెంట్ బ్యాట్స్‌మెన్' అని సరదాగా కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఆ తర్వాత బంతికే లార్కిన్ రన్ఔట్ అయ్యాడు.. ఈసారి మాత్రం అతన్ని అదృష్టం వరించలేదు. (చదవండి : క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం) Hide the ball and run! Bit cheeky here from Nick Larkin... 😝 A @KFCAustralia Bucket Moment | #BBL10 pic.twitter.com/M4T4h2l3g6 — KFC Big Bash League (@BBL) December 12, 2020 ఈ మ్యాచ్‌లో మెల్బోర్స్ స్టార్స్ 22 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మెల్బోర్న్ స్టార్స్ జట్టులో స్టోయినిస్ 61, మ్యాక్స్‌వెల్ 39 పరుగులతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. పెర్గూసన్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్ హేల్స్ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. (చదవండి : నా తండ్రి వ్యాఖ్యలు నన్ను బాధించాయి) -
'11 ఏళ్లయినా తక్కువ అంచనా వేస్తున్నారు'
కాన్బెర్రా : రవీంద్ర జడేజా గాయంతో దూరమవడం జట్టుకు లోటు కానుందని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. 2009లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన జడేజా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ టాప్ ఆల్‌రౌండర్ స్థాయికి చేరుకున్నాడని కైఫ్ చెప్పుకొచ్చాడు. ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో కైఫ్ మాట్లాడాడు. 'రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి 11 ఏళ్లయింది.. అయినా అతన్ని ఇప్పటికీ తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇన్నేళ్లుగా అతను ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.. తన బౌలింగ్‌తోనూ ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను చూసుకుంటే మంచి ఫామ్ కనబరుస్తూ పరుగులు సాధించాడు. మూడో వన్డేలో హార్థిక్‌తో కలిసి చేసిన 150 పరుగులు రికార్డు భాగస్వామ్యాన్ని ఎవరు మరిచిపోరు. దీంతో జడేజా ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న టీమిండియాకు జడేజా గాయంతో దూరమవడం పెద్ద లోటుగా మారనుంది. ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ సేవలను కోల్పోతే జట్టు ఇబ్బందులకు గురవ్వడం సహజమే. టీమిండియా అతని సేవలను మిస్ కానుంది.'అంటూ కైఫ్ తెలిపాడు. (చదవండి : కోహ్లికి మాత్రం రూల్స్ వర్తించవా?) కాగా ఆసీస్‌తో జరిగిన మొదటి టీ20లో జడేజా 23 బంతుల్లోనే 44 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 19వ ఓవర్లో మూడు బంతుల తర్వాత జడేజా కండరాల నొప్పితో బాధపడుతూ చికిత్స తీసుకున్నాడు. తర్వాతి ఓవర్ రెండో బంతికి స్టార్క్ వేసిన బంతి అతని హెల్మెట్‌ను బలంగా తగిలింది. అయితే ఆ సమయంలో భారత ఫిజియో రాకపోగా, జడేజా బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత నొప్పితో ఇబ్బంది పడిన జడేజా ఫీల్డింగ్‌కు రాలేదు. దీంతో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కింద చహల్‌ను జడేజా స్థానంలో తీసుకువచ్చారు. చహల్ మూడు కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే జడేజా తలకు తగిలిన దెబ్బను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. గాయం తీవ్రత దృష్ట్యా టి20 సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు జడేజా దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి ఎంపిక చేశామని బీసీసీఐ ప్రకటించింది. -
'కాంకషన్‌పై మాట్లాడే అర్హత ఆసీస్‌కు లేదు'
ఢిల్లీ : ఆసీస్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రవీంద్ర జడేజా స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన యజ్వేంద్ర చహల్ మూడు కీలక వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. టీమిండియా గెలిచినదానికంటే కాంకషన్ పద్దతిలో ఆటగాడిని తీసుకొచ్చి గెలిచిదంటూ ఆసీస్ జట్టు ఆరోపణలు చేసింది. అయితే టీమిండియా తీసుకున్న కాంకషన్ నిర్ణయం కరెక్టేనా అన్నదానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. (చదవండి : టీమిండియా ‘కాంకషన్’ రైటా... రాంగా!) 'టీమిండియా కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌పై తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నా. బ్యాటింగ్ సమయంలో స్టార్క్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా తలకు బలంగా దెబ్బ తగిలింది. వెంటనే నొప్పి వస్తుందని చెప్పలేం.. గాయం నొప్పి తెలియడానికి గంట పట్టొచ్చు.. ఒక్కసారి 24 గంటలు కావొచ్చు. ఆ సమయంలో జడేజాకు నొప్పి తెలియలేదు.. ఫిజియో రాకపోయినా బ్యాటింగ్ చేశాడు. కానీ ఇన్నింగ్స్ ముగించుకొని డ్రెస్సింగ్ రూమ్‌కు రాగానే హెల్మట్ తీసిన జడేజాకు నొప్పి తెలిసినట్లుంది. అందుకే ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో అతను ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు. మ్యాచ్ సమయంలో ఎవరైనా ఆటగాడు గాయపడితే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కింద వేరొక ఆటగాడిని బ్యాటింగ్ లేదా బౌలింగ్‌కు అనుమతించొచ్చని ఐసీసీ నిబంధనల్లో ఉంది. దానినే టీమిండియా ఆచరించింది. జడేజా స్థానంలో చహల్‌ను కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఆడించింది. చహల్ మూడు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు కాబట్టి ఇప్పుడు కాంకషన్ పదం ఆసీస్‌కు వివాదంలా కనిపిస్తుంది. అదే ఒకవేళ టీమిండియా ఓడిపోయుంటే ఆసీస్ ఇలానే వివాదం చేసేదా.. అయినా కాంకషన్ నిర్ణయంపై ఆసీస్‌కు మాట్లాడే అర్హత లేదు, ఎందుకంటే కాంకషన్‌ను మొదట ఉపయోగించిదన్న విషయం అందరికి తెలిసిందే. ఒకప్పుడు ఇదే ఆసీస్ గాయపడిన స్మిత్ స్థానంలో మార్నస్ లబుషేన్‌ను ఆడించింది. ఆ మ్యాచ్‌లో లబుషేన్ రాణించడమే గాక జట్టును గెలిపించాడు.నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నా తలకు చాలాసార్లు గాయాలు అయ్యాయి.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు.. కానీ మా రోజుల్లో ఇలాంటి రూల్స్ లేకపోవడంతో 10 మందితోనే ఆటను కొనసాగించేవారు. అయినా మ్యాచ్ రిఫరీ బూన్ తన విచక్షణాధికారంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కాంకషన్‌పై ఆసీస్ ఫిర్యాదు చేయకుండా ఉండాల్సింది' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా : మంజ్రేకర్) -
'నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా'
కాన్బెర్రా : ఆసీస్‌తో శుక్రవారం కాన్బెర్రా వేదికగా జరిగిన తొలి టీ20లో టి. నటరాజన్ మరోసారి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. నిన్న జరిగిన టీ20లో జడేజా స్థానంలో కాంకషన్‌గా వచ్చిన చహాల్ మ్యాచ్ విన్నర్‌గా నిలిచినా.. నటరాజన్ బౌలింగ్‌ను తీసిపారేసిదిగా కనిపించదు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ నటరాజన్ ప్రదర్శపై ప్రసంశలు కురిపించాడు. నటరాజన్ రాకతో టీ20 ఫార్మాట్లో మహ్మద షమీకి కష్టమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : టీమిండియా ‘కాంకషన్’ రైటా... రాంగా!) సోనీసిక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ మాట్లాడుతూ.. ' టీ20 స్పెషలిస్ట్‌గా తుది జట్టులోకి వచ్చిన నటరాజన్ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నా దృష్టిలో మహ్మద్ షమీ స్థానాన్ని నటరాజన్ భర్తీ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్లో షమీ స్థానం పదిలంగా ఉంటుందా అన్న అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో నటరాజన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. మరో పేసర్ బుమ్రాకు సరిజోడిగా కనిపిస్తున్నాడు. పైగా వీరిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంది.' అంటూ తెలిపాడు. (చదవండి : కోహ్లి.. ఇదేం వ్యూహం?) ఐపీఎల్ 13వ సీజన్లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చిన నటరాజన్‌ను ఆసీస్ పర్యటనకు ఎంపిక చేశారు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరపున 16 వికెట్లు తీసిన నటరాజన్ యార్కర్ల స్పెషలిస్ట్‌గా ముద్ర వేశాడు. ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా అతని ప్రదర్శనను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేతో అరంగేట్రం చేసిన నటరాజన్ మార్నస్ లబుషేన్ వికెట్ తీసి మెయిడెన్ వికెట్ తీశాడు. శనివారం జరిగిన టీ20లో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను అవుట్ చేసి తొలి టీ20 వికెట్ తీసిన నటరాజన్ తర్వాత ఓపెనర్ డీ ఆర్సీ షాట్‌తో పాటు మిచెల్ స్టార్క్‌ను పెవిలియన్ చేర్చి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. -
సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం : నటరాజన్
కాన్బెర్రా : ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.. టి. నటరాజన్. అరంగేట్రం మ్యాచ్‌లోనే రెండు కీలక వికెట్లను తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. మార్నస్ లబుషేన్‌ను అవుట్ చేయడం ద్వారా మెయిడెన్ వికెట్ తీసిన ఆనందక్షణాలను నటరాజన్ షేర్ చేసుకున్న తీరు అద్భుతం. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా నటరాజన్ మ్యాచ్ అనంతరం తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. (చదవండి : 'కోహ్లి వేగం మధ్యలోనే ఆగిపోతుందనుకున్నా') 'ఆసీస్‌తో మ్యాచ్ నాకు మంచి అనుభవంలా కనిపించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్విస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్ల కోసం ఎదురు చూస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఐపీఎల్ 13వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన నటరాజన్ 232వ ప్లేయర్‌గా టీమిండియా తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ సందర్భంగా బుధవారం కెప్టెన్ విరాట్ కోహ్లి చేతులు మీదుగా క్యాప్ అందుకున్నాడు. తమిళనాడు నుంచి టీమిండియాకి ఎంపికైన 5వ ఫాస్ట్ బౌలర్ నటరాజన్.. కాగా 2002లో లక్ష్మీపతి బాలాజీ తమిళనాడు నుంచి ఫాస్ట్ బౌలర్‌గా టీమిండియాకు ఎంపికయ్యాడు. (చదవండి : నటరాజన్ ఎమోషనల్ వీడియో వైరల్) It was a surreal experience to represent the country. Thanks to everyone for your wishes. Looking forward for more challenges 🇮🇳 pic.twitter.com/22DlO9Xuiv — Natarajan (@Natarajan_91) December 3, 2020 ఐపీఎల్ 13వ సీజన్లో సన్‌రైజర్స్‌కు ఆడిన నటరాజన్ మొత్తం 16 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో యార్కర్లను సందిస్తూ తనదైన శైలిలో విజృంభించాడు. ఐపీఎల్ ప్రదర్శననే పరిగణలోకి తీసుకొని బీసీసీఐ నటరాజన్‌ను ఎంపిక చేసిందనడంలో సందేహం లేదు.కాగా ఆసీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో టీమిండియా ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య కాన్బెర్రా వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. -
పాపం కోహ్లి.. మూడు సార్లు అతని బౌలింగ్‌లోనే
కాన్బెర్రా : క్రికెట్లో ప్రతీ బ్యాట్స్‌మెన్‌కు ఒక బౌలర్ కొరకరాని కొయ్యాగా మారడం సహజం. అది టెస్టు సిరీస్.. ద్వైపాక్షికం.. ముక్కోణపు టోర్నీ వన్డే సిరీస్.. ప్రపంచకప్ ఇలా ఏదైనా కావొచ్చు ఒక బ్యాట్స్‌మెన్ తనకు తెలియకుండానే ప్రతీ సారి అదే బౌలర్‌కు వికెట్ సమర్పించుకుంటాడు. ఉదాహరణకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసీస్ మాజీ స్పీడస్టర్ బ్రెట్ లీ బౌలింగ్‌లో ఓవరాల్‌గా 14 సార్లు ఔటయ్యాడు. అలాగే మెక్‌గ్రాత్, మురళీధరన్‌లు కూడా సచిన్‌ను చాలాసార్లు ఔట్ చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు అండర్సన్, బ్రాడ్లు తలా ఆరు సార్లు ఔట్ చేయడం జరిగింది. (చదవండి : ఈ ఓటమి మాకు మంచి గుణపాఠం : కోహ్లి) తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో యాదృశ్చికంగా హాజల్‌వుడ్ బౌలింగ్‌లోనే మూడుసార్లు ఔటవ్వడం విశేషం. ఓవరాల్‌గా హాజల్‌వుడ్ ఇప్పటివరకు కోహ్లిని 7 సార్లు ఔట్ చేయగా.. అందులో వన్డేల్లో నాలుగుసార్లు, టెస్టుల్లో మూడు సార్లు ఉన్నాయి. దీంతో కోహ్లిని ఎక్కువసార్లు ఔట్ చేసిన ఆటగాళ్ల సరసన హాజిల్‌వుడ్ చోటు దక్కించుకున్నాడు. ఇంతకమందు ఆసీస్‌కే చెందిన ఆడమ్ జంపా, నాథన్ లియోన్‌లతో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్సీ మోర్కెల్, విండీస్ రవి రాంపాల్‌లు ఏడేసి సార్లు ఔట్ చేశారు. (చదవండి : నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా : పాండ్యా) ఇక టెస్టుల్లో చూసుకుంటే కోహ్లిని ఎక్కువసార్లు ఔట్ చేసిన ఘనత ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ పేరిట ఉంది. కోహ్లిని అండర్సన్ 8 సార్లు ఔట్ చేయగా.. ఇంగ్లండ్‌కే చెందిన గ్రేమి స్వాన్ కూడా కోహ్లిని 8 సార్లు ఔట్ చేశాడు. ఇక ఓవరాల్‌గా వన్డే, టెస్టులు కలిపి మొత్తంగా చూసుకుంటే కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ 10 సార్లు కోహ్లిని ఔట్ చేయడం విశేషం. రానున్న సుదీర్ష సిరీస్‌లో టీమిండియా మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లోనూ హాజల్‌వుడ్ ఆసీస్ తుది జట్టులో ఉన్నాడు. దీంతో కోహ్లి హాజల్‌వుడ్‌కు ఎన్ని సార్లు బలవ్వనున్నాడో చూడాలి. (చదవండి : టీమిండియాకు ఓదార్పు విజయం) -
ఈ ఓటమి మాకు మంచి గుణపాఠం : కోహ్లి
కాన్బెర్రా : ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టుకు కోల్పోవడం నిరాశగా ఉన్నా.. సిరీస్ ఓటమితో మాకు మంచి గుణపాఠం కలిగిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. బుధవారం మూడో వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెజంటేషన్ సందర్భంగా మ్యాచ్ విజయంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 'మా పర్యటన ఇక్కడితో ముగిసిపోలేదు. రానున్న రోజుల్లో మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒక కెప్టెన్‌గా వన్డే సిరీస్ ఓడిపోవడం నిరాశను కలిగించింది. అయినా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్ ఓటమి మాకు ఒక గుణపాఠం కానుంది. మ్యాచ్ ఆడేటప్పుడు మనసు పెట్టి ఆడితే విజయం సాధిస్తామని మూడో వన్డేలో విజయం ద్వారా మాకు అర్థమైంది. ఎప్పుడైనా ఆటలో దెబ్బలు తగిలితేనే గాయం విలువేంటో తెలుస్తుంది.. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాం. అలాగే సిరీస్ ఓడిపోయినంత మాత్రానా మేము పూర్తిగా కోల్పోయినట్లు కాదు. ఈ ఓటమే రానున్న మ్యాచ్‌ల్లో మాకు విజయాలను సమకూరుస్తుందని ఆశిస్తున్నా. (చదవండి : సచిన్ రికార్డును అధిగమించిన కోహ్లి) ఇక నేడు జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.. ఈరోజు మా ఆటతీరులో మార్పు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినా శుభమన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. శిఖర్‌తో కలిసిఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ కొన్ని మంచి షాట్లు ఆడినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. నిజానికి మా బ్యాట్స్మన్లు అందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అయ్యర్ మొదలుకొని రాహుల్, జడేజా, పాండ్యా వరకు బ్యాటింగ్ లైనఫ్ పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శనను పక్కడ పెడితే పాండ్యా, జడేజాలు ఆడిన తీరు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. నేను ఔటైన తర్వాత వారిద్దరు నిలదొక్కుకొని టీమిండియాకు 300 పరుగులు గౌరవప్రదమైన స్కోరు అందించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. (చదవండి : క్రికెట్ ఆస్ట్రేలియాపై షేన్ వార్న్ అసంతృప్తి) ఇక బౌలర్ల విషయానికి వస్తే.. బుమ్రా, శార్దూల్ ఠాకూర్, సైనీ, నటరాజన్‌లతో పేస్ విభాగం పటిష్టంగా కనిపించినా.. ఇక్కడి పిచ్‌లు బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉండడంతో మా బౌలర్లు తేలిపోయారు. అంతేకాని మా బౌలర్లు విఫలమయ్యారంటే ఒప్పుకోను.. ఎందుకంటే ఆసీస్ బౌలర్లు కూడా అంత గొప్పగా ఏం రాణించలేదట్టీ ఓటమితో నేర్చుకున్న పాఠాలను రానున్న రోజుల్లో జరగనున్న మ్యాచ్‌ల్లో రాణించి ఫలితాలు సాధించేలా చూసుకుంటాం.' అని చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లి ఈ మ్యాచ్‌లో ఒక అరుదైన రికార్డు నెలకొల్పాడు. 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 302 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 92, జడేజా 66, కోహ్లి 63 పరుగులతో రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 289 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఫించ్ 75, మ్యాక్స్‌వెల్ 59 పరుగులు చేశాడు. కాగా ఇరు జట్ల మధ్య శుక్రవారం(డిసెంబర్ 4) తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. -
టీమిండియాకు ఓదార్పు విజయం
కాన్బెర్రా : ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియాకు ఓదార్పు విజయం దక్కింది. 303 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటింగ్‌లో ఆరోన్ ఫించ్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్ 59 పరగులతో రాణించాడు. ఒక దశలో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీలు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ధాటిగా ఆడిన మ్యాక్స్‌వెల్ అర్థసెంచరీ సాధించడంతో ఆసీస్ మళ్లీ గెలుపు దిశగా పయనించింది. (చదవండి : క్రికెట్ ఆస్ట్రేలియాపై వార్నర్ అసంతృప్తి) అయితే 38 పరుగులు చేసిన క్యారీ రనౌట్‌గా వెనుదిరిగినా.. మ్యాక్స్‌వెల్ ఉండడంతో ఆసీస్ గెలుపుపై ధీమాతో ఉంది. కానీ జట్టు స్కోరు 268 పరుగుల వద్ద ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గింది. ఆ తర్వాత కాసేపటికే 28 పరుగులు చేసిన ఆస్టన్ అగర్ అవుట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇక బౌలింగ్‌లో శార్ధూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, తొలి మ్యాచ్ ఆడిన నటరాజన్ 2 వికెట్లు, బుమ్రా, జడేజా, కుల్దీప్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యా 92 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జడేజా 66, కోహ్లి 63 పరుగులతో రాణించారు. పాండ్యా, జడేజాలు కలిసి ఆరో వికెట్‌కు 150 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడం టీమిండియా ఇన్నింగ్స్‌లో హైలెట్‌గా నిలిచింది. కాగా ఇప్పటికే తొలి రెండు వన్డేలు ఓడిన భారత్ సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియాకు అప్పగించింది. ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 డిసెండర్ 4 శుక్రవారం ఇదే స్టేడియంలో జరగనుంది. (చదవండి : 21 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు) -
క్రికెట్ ఆస్ట్రేలియాపై షేన్ వార్న్ అసంతృప్తి
సిడ్నీ : ఆసీస్ స్పిన్ దిగ్గజం.. మాజీ బౌలర్ షేన్ వార్న్ క్రికెట్ ఆస్ట్రేలియాపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాన్బెర్రా వేదికగా నేడు జరుగుతున్న మూడో వన్డేకు కమిన్స్‌ను పక్కనపెట్టడంపై తప్పుబట్టాడు. వాస్తవానికి ఐపీఎల్ 13 వ సీజన్ తర్వాత ఆసీస్ ఆటగాళ్లు నేరుగా టీమిండియాతో వన్డే సిరీస్ ఆడాల్సి వచ్చింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. దీంతో రానున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని ఆసీస్ ప్రధాన బౌలర్‌గా ఉన్న కమిన్స్‌కు మూడో వన్డే నుంచి విశ్రాంతి కల్పించారు. సుదీర్ఘమైన ఐపీఎల్ ఆడడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. (చదవండి : 21 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు) అయితే షేన్ వార్న్ ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ కామెంట్స్ చేశాడు. 'పాట్ కమిన్స్‌కు విశ్రాంతినివ్వడంపై నేను నిరాశకు లోనయ్యా. ఐపీఎల్ ఆడినంత మాత్రానా ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తారా? ఇలా అయితే ఆటగాళ్లను ఐపీఎల్‌కు పంపించాల్సింది కాదు.. ఏ లీగ్ ఆడినా ఆటగాళ్లకు దేశం తరపున ఆడడమే మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. అలసిపోయారనే భావనతో కమిన్స్ లాంటి ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం సరికాదు. ఐపీఎల్ అనేది ఒక లీగ్.. ఏడాదికి ఇలాంటి లీగ్‌లు ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఆడుతున్నది అంతర్జాతీయ వన్డే మ్యాచ్. మూడో వన్డేలో కమిన్స్ ఆడిస్తే బాగుండేది. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం నాకు నచ్చలేదు' అని షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్ స్టార్ బౌలర్‌గా పేరు పొందిన కమిన్స్ ఐపీఎల్ 13వ సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. రూ.16 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యానికి నిరాశనే మిగిల్చాడు. 14 మ్యాచ్‌లాడిన కమిన్స్ 7.86 ఎకానమి రేటుతో 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
మూడో వన్డే : మ్యాక్స్‌వెల్ అవుట్.. స్కోరెంతంటే
కాన్బెర్రా: మ్యాక్స్‌వెల్ అవుట్‌తో ఆసీస్‌కు షాక్ తగిలింది. అర్థసెంచరీ సాధించి మంచి ఊపు మీదున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ 59 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో ఆసీస్ 268 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ గెలవాలంటే 25 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉంది. టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ 6వ వికెట్‌ను కోల్పోయింది. 210 పరుగుల వద్ద 38 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ రనౌట్‌గా వెనుదిరగాడు. అయితే క్రీజులో ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ దాటిగా ఆడుతుండడంతో ఆసీస్ ఇంకా గెలుపుపై ధీమాగానే ఉంది. ఆసీస్ మ్యాచ్ గెలవాలంటే 60 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ 36 పరుగులతో, అగర్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 158 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన కామెరాన్ గ్రీన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 32 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ 19, మ్యాక్స్‌వెల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో 302 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇప్పటివరకు 28 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 14, అలెక్స్ క్యారీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా జట్టు స్కోరు 117 పరుగుల వద్ద ఉన్నప్పుడు 22 పరుగులు చేసిన హెన్రిక్స్ ఠాకూర్ బౌలింగ్‌లో వెనుదిరగాడు. ఆ తర్వాత కాసేపటికే 75 పరుగులతో నిలకడగా ఆడుతున్న ఓపెనర్ ఫించ్ జడేజా బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీమిండియా విధించిన 303 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ నిలకడగా చేధిస్తోంది. ఇప్పటివరకు 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ 59 పరుగులతో, హెన్రిక్స్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా గత రెండు మ్యాచ్‌ల్లో రెండు వరుస సెంచరీలతో చెలరేగిన స్టీవ్ స్మిత్ శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో 7 పరుగులకే అవుట్ కావడం టీమిండియాకు ఊరటనిచ్చే అంశం. కాగా ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న టి. నటరాజన్ ఓపెనర్ మార్నస్ లబుషేన్‌ను 7 పరగుల వద్ద ఔట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. అదరగొట్టిన పాండ్యా, జడేజా.. 300 దాటిన స్కోరు! ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, జడేజా మెరుగైన ప్రదర్శన కనబరిచారు. కెప్టెన్ కోహ్లి అవుట్ కావడంతో కష్టాల్లో మునిగిపోయిన జట్టును గట్టెక్కించే బాధ్యతను తలకెత్తుకున్న ఈ ఆల్‌రౌండర్లు.. చివరి ఓవర్లలో ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరిగెత్తించారు. వీరిద్దరు కలిసి 108 బంతుల్లో 159 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ముఖ్యంగా 47వ ఓవర్లో జడేజా ఆసీస్ బౌలర్ అబాట్‌కు చుక్కలు చూపించాడు. వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాది 43 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 50 బంతులు ఎదుర్కొన్న జడ్డూభాయ్ 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. ఇక 76 బంతుల్లో ఏడు బౌండరీలు, ఒక సిక్స్‌తో పాండ్యా 92 పరుగులు సాధించాడు. వన్డే కెరీర్లో పాండ్యాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక కోహ్లి, జడేజా, పాండ్యా అర్ధసెంచరీలు నమోదు చేయడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది.(చదవండి: ‘ఏంటిది కోహ్లి.. మమ్మల్ని ఇంతలా నిరాశపరిచావు’) కష్టాల్లో టీమిండియా టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నిలకడగా ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లి అవుట్ అయ్యాడు. 152 పరగుల వద్ద హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్‌కి ఇచ్చి కోహ్లి(63) పెవిలియన్ చేరడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఇక ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు ఆసీస్ బౌలర్లు అబాట్, జంపా, హాజిల్‌వుడ్ చెరో వికెట్ తీసుకోగా.. శుభ్‌మన్, కేఎల్ రాహుల్‌ను పెవిలియన్‌కు చేర్చిన అగర్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా అంతకు ముందు అగర్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 11 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. అంతకు ముందు ఆడం జంపా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ ఔట్ అయ్యాడు. లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. ఇప్పటివరకు ఆసీస్ బౌలర్లు అబాట్, జంపా చెరో వికెట్ తీసుకోగా.. శుభ్‌మన్, కేఎల్ రాహుల్‌ను పెవిలియన్‌కు చేర్చిన అగర్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 27వ ఓవర్ ముగిసే సరికి కోహ్లి హాఫ్ సెంచరీ(64 బంతులు) పూర్తి చేసుకున్నాడు. కాగా 30 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. శుభ్‌మన్ ఔట్! అగర్ బౌలింగ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మయాంక్ స్థానంలో జట్టులోకి వచ్చిన గిల్ 39 బంతుల్లో 33 పరుగులు చేశాడు. 122/3 (25) కాగా 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 104/2 శుభ్‌మన్ గిల్ కంటే ముందు అబాట్ బౌలింగ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ ఔటయ్యాడు. అగర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. శుభ్‌మన్, కెప్టెన్ విరాట్ కోహ్లి నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 81 పరుగులు చేసింది. కాగా తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లి సేన ఇప్పటికే 2-0తో సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో చివరి వన్డేలో ఎలాగైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో పలు మార్పులతో మైదానంలో దిగుతోంది. మయాంక్ అగర్వాల్, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, చహల్ స్థానాల్లో శుభ్‌మన్ గిల్, నటరాజన్, శార్దుల్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు కల్పించింది. కాగా మనుకా ఓవల్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి.. భారీ స్కోర్లు నమోదుకావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ జరిగిన గత ఏడు మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందడం గమనార్హం. దీంతో కోహ్లి బ్యాటింగ్‌కే మొగ్గుచూపడం సానుకూలాంశంగా పరిణమించింది.(చదవండి: ఆ రికార్డుకు 23 పరుగుల దూరంలో కోహ్లి) తుది జట్లు టీమిండియా: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, నటరాజన్ ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), లబుషేన్, స్టీవ్ స్మిత్, మాక్స్వెల్, హెన్రిక్స్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కామరూన్ గ్రీన్, ఆష్టన్ అగర్, సీన్ అబాట్, ఆడం జంపా, హేజల్‌వుడ్ -
అక్కడ మరోసారి భయానక వాతావరణం
కాన్బెర్రా : ఆస్ట్రేలియాలో మొన్నటిదాకా ప్రజలు కార్చిచ్చుతో అతలాకుతులం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్న అక్కడి ప్రజల్లో వరుస తుఫాన్లు, సుడిగాలులు మరోసారి భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. తాజాగా సోమవారం ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో సుడిగాల్పులు బీభత్సంతో తీవ్ర కలకలం రేగింది. గంటకు 107 మైళ్ల వేగంతో వీచిన గాలులకు ప్రజా భవనాలు, గృహాలు, కార్లు ద్వంసమవడంతో పాటు వేలాది చెట్లు నేలకొరిగాయి. రాజధానిలోని చాలా ప్రాంతాల్లో పవర్ కట్ అవడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. బ్రిస్బేన్, క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్‌కోస్ట్ ప్రాంతాలలో శనివారం వడగళ్ల వాన చుట్టముట్టడంతో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఇలా ఆస్ట్రేలియాలో ఒకదాని తర్వాత మరొకటి చోటుచేసుకుంటుండడంతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. రెండు నెలల క్రితం న్యూసౌత్ వేల్స్ అడవుల్లో మొదలైన కార్చిచ్చును చల్లార్చాడానికి ఈ అకాల వర్షాలు మంచివే అయినా ఆస్ట్రేలియాలోని రెండు ప్రధాన నగరాల్లోని ప్రజలకు మాత్రం పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కలిగించిందనే చెప్పుకోవాలి. అయితే కార్చిచ్చు దాటికి 28 మంది మరణించగా, వేలాది జంతువులు మృత్యువాత పడ్డాయి. కార్చిచ్చు దాటికి 10.4 మిలియన్ హెక్టార్లు కాలిపోయింది. కార్చిచ్చుకు హరించుకుపోయిన ఈ మొత్తం యూఎస్ఏలోని ఇండియానా రాష్ట్రంతో సమానం కావడం విశేషం. Narromine dust storm - Jan 19th pic.twitter.com/GeFSqby8NY — Mick Harris (@mickharris85) January 19, 2020 Fires, hottest day on record, floods, dust storm, hail storm. All in a month. Climate apocalypse starts in Australia. Are we gonna let this be the new normal?#ClimateCrisis pic.twitter.com/rPGg20JsV2 — Veronica Koman (@VeronicaKoman) January 20, 2020 -
భారీ మొసలికి అండగా నిలిచిన బాలుడు
కాన్బెర్రా : ఓ 10 సంవత్సరాల బాలుడు 13 అడుగుల భారీ ఉప్పునీటి మొసలికి అండగా నిలిచాడు. తన మొసలి స్నేహితుడ్ని స్వేచ్ఛగా ఉన్నచోటే వదిలేయాలంటూ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రికి లేఖ రాశాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ సమీపంలోని మియాలో అనే గ్రామానికి చెందిన ఎల్రాయ్ వుడ్స్ అనే 10 ఏళ్ల బాలుడికి అక్కడి చెరువులో ఉంటున్న 13 అడుగుల మొసలి ‘‘ హావర్డ్’’ అంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజు నీటిలో సంచరించే మొసలిని చూస్తూ ఆనందపడిపోయేవాడు. అయితే మొసలి కారణంగా అక్కడ ఉంటున్న ప్రజలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని భావించిన పర్యావరణ అధికారులు దాన్ని పట్టి వేరేచోట వదిలేయాలని భావించారు. ఇందుకోసం అక్కడి నీటిలో వలవేసి ఉంచారు. అధికారుల నిర్ణయంతో వుడ్స్ కలత చెందాడు. ఎలాగైనా తన మిత్రుడ్ని అది ఉంటున్న చోటే స్వేచ్ఛగా బ్రతకనివ్వాలనుకున్నాడు. ఈ మేరకు ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి లీయన్నే ఎనోచ్కు లేఖ రాశాడు. ఆ లేఖలో‘‘ నా పేరు ఎల్రాయ్ వుడ్స్. నేను గత ఐదు సంవత్సరాలుగా బాంబూ క్రీక్ రోడ్లో నివాసముంటున్నాను. హావర్డ్(మొసలి) అంటే నాకు ఎంతో ఇష్టం. అక్కడి బ్రిడ్జి మీద నుంచి నీటిలో ఈదుతున్న దాన్ని చూడటమంటే ఎంతో సరదా. మీరు హావర్డ్ను పట్టకుండా అదున్న చోటే వదిలేయండి’’ అంటూ వేడుకున్నాడు. దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా జూ అధికారులు వుడ్స్‌కు అండగా నిలిచారు. ప్రభుత్వం కూడా ఓ మెట్టు దిగి దాన్ని పట్టకుండా ఉంటామని హామీ ఇచ్చింది. -
గ్లాసు బీరుకు ఎంత చెల్లించాడో తెలిస్తే షాక్!..
కాన్బెర్రా : ఓ వ్యక్తి గ్లాసుడు బీరు కోసం చెల్లించిన మొత్తం ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. అంత చెల్లించాడా? అంటూ నోరెళ్ల బెడతారు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన పీటర్ లాలర్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మాల్మేసన్ అనే హోటల్‌కు వెళ్లాడు. అక్కడ అమెరికన్‌ది కాకుండా బ్రిటీష్ బీరు ఆర్డర్ చేశాడు. డ్రింక్‌ను ఎంజాయ్ చేస్తూ తాగాడు. కార్డుతో డబ్బులు కట్టేశాడు. బీరుకు ఎంత డబ్బులు చెల్లించానో తెలుసుకోవాలనుకున్న పీటర్ హోటల్ సిబ్బందిని అడిగాడు. పీటర్ చెల్లించిన మొత్తం ఎంతో చెప్పడానికి సిబ్బంది తటపటాయించాడు. పీటర్ గట్టిగా అడిగేసరికి బిల్ ఎంతో చెప్పాడు. అంతే! పీటర్ షాక్ తిన్నాడు. తాను ఒక గ్లాసు బీరుకోసం దాదాపు రూ. 70 లక్షలు చెల్లించానని తెలిసి నోరెళ్లబెట్టాడు. అయితే మొదట అతడికి నమ్మకం కుదురలేదు. ఇంటి వద్దనుంచి ఫోన్ రావటంతో అది వాస్తవమేనని అతడు ధ్రువీకరించుకున్నాడు. దీనిపై పీటర్ మాట్లాడుతూ.. ‘‘ చరిత్రలో అత్యంత ఖరీదైన బీరు. దీని కోసం నేను నిజంగానే 99 వేల డాలర్లు చెల్లించాను’’ అంటూ వాపోయాడు. కాగా, హోటల్ సిబ్బంది పొరపాటు వల్లే బిల్ ఎక్కువగా వేసినట్లు తేలటంతో సదరు డబ్బు మొత్తాన్ని వెనక్కు ఇచ్చేందుకు యాజమాన్యం సమ్మతించింది. జరిగిన పొరపాటుకు చింతిస్తూ పీటర్‌కు క్షమాపణలు చెప్పింది. వసూలు చేసిన డబ్బును వీలైనంత త్వరగా వెనక్కు ఇచ్చే ఏర్పాటు చేస్తామని తెలిపింది. See this beer? That is the most expensive beer in history. I paid $99,983.64 for it in the Malmaison Hotel, Manchester the other night. Seriously. Contd. pic.twitter.com/Q54SoBB7wu — Peter Lalor (@plalor) September 5, 2019 -
షూలకు గమ్ అంటించుకుందా ఏంటి?: వైరల్
కాన్బెర్రా : పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు ఆస్ట్రేలియాకు చెందిన ఓ చిన్నారి తన నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సరిగ్గా నడవటం చేతకాని వయసులో స్కేట్ బోర్డుమీదకెక్కి పచార్లు చేస్తోంది. మెయిల్ ఆన్లైన్ కథనం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని క్లార్క్ ఫీల్డ్‌కు చెందిన కోకో హీత్ అనే చిన్నారికి ఐదు నెలల వయస్సులో స్కేట్ బోర్డు్ అంటే ఇష్టం ఏర్పడింది. ఇది గమనించిన పాప తల్లి కెల్లీ చిన్నారిని అంత చిన్న వయస్సునుంచే స్కేట్‌బోర్డు మీద ఉంచి ఆడించేది. ప్రస్తుతం కోకో వయస్సు 14నెలలు. స్కేట్ బోర్డుపై కోకోకు పట్టువచ్చిన తర్వాత ఒక్కదాన్నే బోర్డుపై వదిలేసేది. చిన్నారి ఏ మాత్రం భయపడకుండా స్కేట్ బోర్డింగ్ చేయటం నేర్చుకుంది. 14 నెలల కోకో స్కేట్ బోర్డింగ్ చేయటం చూసిన చాలా మంది ఆశ్చర్యపోవటమే కాకుండా ఇంత చిన్న వయస్సులో ఎలా చేస్తోందంటూ నోరెళ్లబెడుతున్నారు. అంతేకాకుండా చిన్నారితో సెల్ఫీలు, ఫొటోలు దిగటానికి పోటీ పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలై నెటిజన్లనుంచి విశేషమైన స్పందన వస్తోంది. ‘‘ షూలకు గమ్ అంటించుకుందా ఏంటి?. అద్బుతంగా చేస్తోంది. అంత చిన్న వయస్సులో స్కేట్ బోర్డింగ్ చేయటం గొప్ప విషయం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
పాప నైపుణ్యానికి నెటిజన్ల ఆశ్చర్యం
-
ఇన్నారెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ-కాన్బెర్రా సమావేశం
కాన్బెర్రా : ఆస్ట్రేలియాలో వైఎస్ఆర్సీపీ-కాన్బెర్రా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాన్క్రిఫ్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్నా రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ-కాన్బెర్రా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి హాజరయిన వైఎస్ఆర్సీపీ నేతలను ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఈ సమావేశంలో ఇన్నారెడ్డితోపాటూ వైఎస్ఆర్సీపీ నాయకులు రాజశేఖర్, రాజ్‌కుమార్ బద్దం, జగన్ జంబుల, స్టానిస్ బెనెడిక్ట్, వరుణ్, శౌరీ రెడ్డి, సంపత్, ఈశ్వర్ రెడ్డి, రాకేష్‌లు పాల్గొన్నారు. -
'ప్రజలారా.. ఇప్పట్లో అక్కడికి వెళ్లకండి'
కాన్బెర్రా: తమ దేశ పౌరులను ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పట్లో అంకారా, ఇస్తాంబుల్వంటి టర్కీ నగరాల పర్యటనకు వెళ్లొద్దని గట్టిగా చెప్పింది. ప్రస్తుతం ఉగ్రవాదుల కన్ను ఆ నగరాలపై ఉన్నందున అక్కడికి వెళ్లవద్దని హెచ్చరించింది. ఈ రెండు నగరాల్లో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడి 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేలా చేశారని, అందుకే తమ పౌరుల ప్రాణాలు కాపాడే దృష్ట్యా ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, మరోసారి భారీ పేలుళ్లకు పాల్పడతామని వరుస హెచ్చరికలు జారీ అవుతున్నాయని, బ్యాట్ మాన్, బింగోల్, బిట్లిస్, గాజియన్ టెప్, హక్కారీ, హాతే, మార్డిన్ వంటి ప్రాంతాలతోపాటు మరెన్నింటికో వార్నింగ్స్ ఇచ్చినందున టర్కీ నగర ప్రాంతాలకు వెళ్లొద్దని తమ ప్రజలకు హెచ్చరించింది.