పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు ఆస్ట్రేలియాకు చెందిన ఓ చిన్నారి తన నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సరిగ్గా నడవటం చేతకాని వయసులో స్కేట్ బోర్డుమీదకెక్కి పచార్లు చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని క్లార్క్ ఫీల్డ్‌కు చెందిన కోకో హీత్ అనే చిన్నారికి ఐదు నెలల వయస్సులో స్కేట్ బోర్డు్ అంటే ఇష్టం ఏర్పడింది. ఇది గమనించిన పాప తల్లి కెల్లీ చిన్నారిని అంత చిన్న వయస్సునుంచే స్కేట్‌బోర్డు మీద ఉంచి ఆడించేది. ప్రస్తుతం కోకో వయస్సు 14నెలలు.