skateboard
-
స్కేట్‌బోర్డ్‌పై మనాలి టు కన్యాకుమారి
‘మనాలి నుంచి కన్యాకుమారికి ఎలా వెళతాం?’ అనే ప్రశ్నకు ‘స్కేట్‌బోర్డ్ మీద’ అని ఎవరూ చెప్పరు. ‘మీరు చెప్పకపోతేనేం... నేనైతే స్కేట్‌బోర్డ్ మీదే వెళ్లాను’ అంటున్నాడు రితిక్. ప్రెషనల్ స్కేట్ బోర్డర్ అయిన రితిక్ క్రాడ్జెల్ మనాలి నుంచి కన్యాకుమారికి స్కేట్‌బోర్డ్ మీద వెళ్లాడు. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు నెట్లోకాన్ని అబ్బురపరుస్తున్నాయి. చిన్న బ్యాక్‌ప్యాక్‌తో బయలుదేరిన రితిక్ 100 రోజుల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. రీల్స్, వీడియోలలో తనకు ఎదురైన అనుభవాలను నెటిజనులతో పంచుకున్నాడు. గూగుల్ మ్యాప్స్ పనిచేయకపోవడం నుంచి దట్టమైన ΄పొగమంచుతో హైవేల జీరో విజిబిలిటీ వరకు రితిక్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకే వెళ్లాడు. రితిక్ సాహసం, ఓపికకు నెటిజనులు ప్రశంసల వర్షం కురిపించారు. -
అయ్ బామ్మోయి!
సంప్రదాయ దుస్తుల్లో బామ్మలు వీధుల్లో స్కేట్బోర్డింగ్ చేస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజం కాదు. బామ్మలు నిజమే. స్కేట్బోర్డింగ్ మాత్రం ఏఐ సృష్టి! ఆశిష్ జోస్ అనే ఆర్టిస్ట్ ప్రాంప్ట్–బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ‘మిడ్‌జర్నీ’ని ఉపయోగించి ఈ చిత్రాలను సృష్టించాడు. ‘స్కేటింగ్ నానీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మూడు రోజుల వ్యవధిలోనే 1.17 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘సాహసానికి వయసు అడ్డు కాదు’లాంటి ఎన్నో కామెంట్స్ కనిపించాయి. -
హేయ్ నా దారికే అడ్డొస్తావా.. పక్కకు జరుగు.. చూడటానికి ఎంత ముద్దుగుందో!
-
Viral Video: ఏదో చేద్దాం అనుకున్నాడు.. మరేదో అయ్యింది..!
-
చీరకట్టులో స్కేటింగ్.. కేరళ అందాలకు అద్దం పట్టే వీడియో
తిరువనంతపురం: మలయాళీ సంప్రదాయ చీరకట్టుతో ఒక మహిళ కేరళ రోడ్లపై స్కేట్ బోర్డింగ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే... ఆమె పేరు లారిసా. ప్రయాణాలు చేయడం అంటే బోలెడు ఇష్టం. తన ప్రయాణ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ‘చీరకట్టుకొని స్కేటింగ్ చేయడం సులభం కాదు. అయినప్పటికీ సాధించాను. చాలా ఫన్‌గా ఫీలయ్యాను. దారి పొడుగునా జనాలు నాతో సెల్ఫీ దిగడం మరో ఫన్’ అంటుంది లారిసా. ఆమె బ్యాలెన్సింగ్ స్కిల్స్ గురించి నెటిజనులు ప్రశంసల వర్షం కురిపించారు.‘పచ్చని ప్రకృతిని దర్శిస్తూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు మీద స్కేటింగ్ చేయండి’ అంటాడు ఒక నెటిజనుడు. మరొకరు ఈ సూచనకు తన సూచన ఇలా జత చేశాడు...‘ఊరకే స్కేటింగ్ చేయడం ఎందుకు! ఆ స్కేటింగ్‌కు ఒక పరమార్థం కలిపించాలంటే, పర్యావరణ స్పృహ గురించి ప్రచారం చేస్తూ వెళ్లాలి’ లారీసా స్పందన ఏమిటో వేచిచూద్దాం! View this post on Instagram A post shared by Larissa D’Sa 🐆Travel•Lifestyle 🇮🇳 (@larissa_wlc) -
లియో... ద రోబో డ్రోన్
ఎగిరే డ్రోన్స్ మాత్రమే ఇప్పటివరకు చూసుంటారు. తాడుపై సర్కస్, స్కేట్ బోర్డుపై ఫీట్లు చేసే కొత్త డ్రోన్ వచ్చేసింది. సెంటర్ ఫర్ అటానమస్‌సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ (కాస్ట్) బృందం తయారుచేసిన ఈ రోబో డ్రోన్ పేరు లియోనార్డో... (లెగ్స్ ఆన్‌బోర్డ్ డ్రోన్). ముద్దు పేరు లియో. రెండు కాళ్లు కలిగి, రెండున్నర ఫీట్ల పొడవున్న ఈ రోబోడ్రోన్ తాడుపై నడవడమే కాదు... స్కేటింగ్ కూడా చేయగలదు. అవసరం ఉన్న చోట సాధారణ డ్రోన్ మాదిరిగానే ఎగురుతుంది. సెకనుకు 20 సెంటీమీటర్ల దూరం నడుస్తుంది. రెండు కాళ్లకు ఉన్న హైబ్రిడ్ మూవ్మెంట్ వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి సులభంగా కదులుతుంది. ఎగురుతుంది. మెట్లు కూడా ఎక్కగలుగుతుంది. సాధారణ డ్రోన్ ఆపరేటింగ్ కష్టమైన పరిస్థితుల్లో సైతం ఈ డ్రోన్ సునాయాసంగా పని చేయగలుగుతుందని చెబుతున్నది బృందం. ‘‘ఆకాశంలో ఎగురుతూ, నేల మీద నడుస్తూ తమ అవసరాలకనుగుణంగా కదిలే పక్షులే మాకు స్ఫూర్తి. ఎగిరే డ్రోన్లకు కొన్ని పరిమితులున్నాయి. విద్యుత్ వినియోగం ఎక్కువ. కానీ లియో అలా కాదు. పరిస్థితులకు అనుగుణంగా దాని మోడ్‌ను మార్చుకుంటుంది. జెట్సూట్ వేసుకున్న మనిషి భూమి మీద వాలేప్పుడు, ఎగరడానికి ముందు కాళ్లను నియంత్రించినట్టుగానే ఈ రోబో డ్రోన్ సైతం నియంత్రిస్తుంది. హై వోల్టేజ్ లైన్ల తనిఖీ, అంతరిక్ష కేంద్రంలోని వివిధ భాగాల మరమ్మతుల వంటివి చాలా ప్రమాదంతో కూడుకున్నవి. అలాంటి వాటిని సైతం లియో ఒక్కటే చేసేస్తుంది’’అని ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సూన్ జో చుంగ్ తెలిపారు. అయితే మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? దాని ధర ఎంత అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇంకా పయ్రోగ స్థాయిలో ఉన్న ఈ రోబో... తయారీ కోసం ఏదైనా కంపెనీ ముందుకొస్తే త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. -
కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి
స్కేటింగ్ ఒక రకంగా సాహస క్రీడ. అప్రమత్తంగా లేకుంటే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఎంతో శిక్షణతో నేర్చుకుని అన్ని జాగ్రత్తలతో చేస్తుంటే ఆ మజానే వేరు. రోజురోజుకు స్కేటింగ్‌పై ప్రజలకు మక్కువ పెరుగుతోంది. అయితే స్కేటింగ్ అంటే కుర్రాళ్లు మాత్రమే చేస్తారా? నేను కూడా ఓ తాతయ్య రంగంలోకి దూకాడు. కుర్రాళ్లకు దీటుగా ఆయన స్కేటింగ్ చేస్తూ జాలీగా రోడ్లపై తిరిగాడు. ఈ దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చదవండి: చెరువులా మారిన ఢిల్లీ విమానాశ్రయం ఈ వీడియో పాతదైనా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రష్యాకు చెందిన 73 ఏళ్ల పెద్దమనిషి ఇగోర్ స్కేటింగ్‌పై తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించాడు. స్కేట్‌బోర్డుపై వంగి నిల్చుని జాలీగా రోడ్లపై ఆయన జాలీగా తిరుగుతున్నాడు. ఎలాంటి బెరుకు లేకుండా హాయిగా సంచరిస్తున్నాడు. ప్రతిభకు వయసు అడ్డంకి కాదని నిరూపించాడు. మాక్స్ తిముకిన్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశాడు. ‘73 ఏళ్లు వయసు మరచిపోండి. ఆయన 1981 నుంచి స్కేట్‌బోర్డును రఫ్ఫాడిస్తున్నాడు’ అంటూ పోస్టు చేశాడు. కారు కన్నా స్కేట్ బోర్డు మేలు అని ఇగోర్ చెప్పడం చూస్తుంటే ఆయనకు స్కేటింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు View this post on Instagram A post shared by Max Timukhin (@timukhinmax) -
స్పోర్ట్స్ లెజెండ్ సొంత రక్తంతో స్కేట్‌బోర్డ్: వీడియో వైరల్
సాక్షి,న్యూఢిల్లీ: స్పోర్ట్స్ లెజెండ్ ముఖ్యంగా స్కేట్బోర్డింగ్ లెజెండ్ టోనీ హాక్ (53) తన ఫ్యాన్స్‌కు ఒక అరుదైన అవకాశాన్నిస్తున్నారు. స్వయంగా తన రక్తంతో కలిపి పెయింట్ చేసిన స్కేటింగ్ బోర్డ్స్‌ను విక్రయిస్తున్నాడు. లిమిటెడ్-ఎడిషన్‌గా 100 స్కేట్‌బోర్డ్‌లను లాంచ్ చేశాడు. వీటి తయారీకోసం టోనీ బ్లడ్‌ను డోనేట్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై టోనీ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. లిక్విడ్ డెత్ మౌంటైన్ వాటర్ తోపాటు, టోనీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన వీడియోను బుధవారం షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 1.7 మిలియన్ వ్యూస్ దాటేసింది. టోనీ హాక్ లిక్విడ్ డెత్‌కు అంబాసిడర్ అయ్యాడంటూ చమత్కరించింది. అంతేకాదు లెజెండరీ అథ్లెట్ రక్తంతో నిండిన స్కేట్ బోర్డ్‌ను సొంతం చేసుకోవడం అంత సులభం కాదు చౌక అంతకన్నా కాదు. వీటి ధర 500 డాలర్లు అంటూ ప్రకటించింది. వీటిని స్టెరిటైజ్ కూడా చేశాం.. త్వరపడండి సాధ్యమైనంత తొందరగా వీటిని సొంతం చేసుకోండి అంటూ ఫ్యాన్స్‌కు పిలుపినిచ్చింది. అయితే దీనిపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. చదవండి: Kabul Airport: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి కాగా టోకీ స్కేట్‌బోర్డ్ గేమ్స్ ఇప్పటికీ చాలామంది ఆసక్తి చూపిస్తారు. లిక్విడ్ డెత్ వెబ్సైట్ ప్రకారం, స్కేట్ బోర్డ్ నుండి వచ్చే లాభాలలో 10శాతంటోనీకి చెందిన ‘ది స్కేట్ బోర్డ్ ప్రాజెక్ట్’కు వెళతాయి. వీటి ద్వారా పబ్లిక్ స్కేట్పార్క్ల అభివృద్ధి, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు పనిచేస్తున్న 5 గైర్స్ సంస్థలకు నిధులు సమకూర్చుతుంది. చదవండి: తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!? View this post on Instagram A post shared by Tony Hawk (@tonyhawk) -
Tokyo Olympics: 13...13...16!
టోక్యో: స్కేట్ బోర్డింగ్... ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన క్రీడ. స్కేట్‌బోర్డ్‌ను ఉపయోగించుకుంటూ జిమ్నాస్టిక్స్ తరహాలో పలు విన్యాసాలు ప్రదర్శించే వేదిక. కొన్నాళ్ల క్రితం వరకు వేల కోట్ల రూపాయల వ్యాపారంతో ముడిపడి కేవలం ఎంటర్టైన్మెంట్గానే గుర్తింపు పొందిన ఈ ఆట ఇప్పుడు క్రీడాంశంగా ఒలింపిక్స్ వరకు చేరింది. స్కేట్ బోర్డింగ్‌లో రెండు ఈవెంట్లు ఉంటాయి. ‘స్ట్రీట్’ విభాగంలో పోటీ జరిగే ‘కోర్స్’ కాస్త సాఫీగా, తక్కువ ప్రమాదకారిగా ఉంటుంది. అదే రెండో విభాగం ‘పార్క్’లో మాత్రం అంతా కఠినంగా సాగుతుంది. 3ప్లేయర్లు తమ సామర్థ్యాన్ని బట్టి భిన్నమైన విన్యాసాలు ప్రదర్శిస్తారు. వేగం, టైమింగ్, నిలకడతో ఎంత కష్టంతో కూడుకున్నదనేదానిపై ఆధారపడి జడ్జీలు పాయింట్లు ఇస్తారు. 18 ఏళ్ల లోపువారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఈ పోటీల ‘మహిళల’ విభాగం (స్ట్రీట్ ఈవెంట్)లో సోమవారం ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. స్వర్ణం సాధించిన నిషియా మొమిజి (జపాన్) వయసు 13 ఏళ్ల 330 రోజులుకాగా... రజతం గెలుచుకున్న రెసా లియన్ (బ్రెజిల్) వయసు 13 ఏళ్ల 203 రోజలు. కాంస్యం సాధించిన ఫునా నకయామా (జపాన్) వయసు 16 ఏళ్ల 39 రోజులు! కొత్త తరం ప్రతినిధులుగా ఈ ముగ్గురు స్కేట్ బోర్డింగ్‌లో మరికొందరు అమ్మాయిలు అడుగుపెట్టేందుకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంత కాలం దీనిని ఆటగా పరిగణించకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఆడేందుకు అంగీకరించేవారు కాదని, ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఈ ముగ్గురు టీనేజర్ల ప్రదర్శనతో పరిస్థితిలో మార్పు వస్తుందన్న అమెరికా సీనియర్ స్కేటర్ మారియా డురాన్...తాజా ఫలితం తర్వాత ఒక్కరోజులో 500 మంది కొత్తగా అడ్మిషన్ తీసుకున్నా ఆశ్చర్యపోనని వ్యాఖ్యానించింది. -
టోక్యో ఒలింపిక్స్: 13 ఏళ్ల వయస్సుకే గోల్డ్ మెడల్
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. ట్రిక్స్ సెక్షన్లో 15.26 పాయింట్లు సాధించిన నిషియా..పసిడిని కైవసం చేసుకుంది. ఆమె ప్రస్తుత వయస్సు 13 ఏళ్ల 330 రోజులు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో మొట్టమొదటి వుమెన్స్ స్కేట్బోర్డింగ్ ఛాంపియన్ గా నిలిచింది. ఇంతకు ముందు బ్రెజిల్‌కి చెందిన రేసా లీల్ గోడ్డ్మెడల్ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఉంది. ఆమె 13 ఏళ్ల 203 వయస్సులో ఈ ఘనత సాధించింది. యూఎస్‌కి చెందిన డైవర్ మర్జోరీ గెస్ట్రింగ్, 1936 బెర్లిన్ గేమ్స్‌లో తన 13 ఏళ్ల 168 రోజుల వయసులో ఒలింపిక్ పతకం సాధించి, ఒలింపిక్ పతకం సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. A historic first on home soil!#JPN's Nishiya Momiji is the first women's Olympic #Skateboarding champion!@worldskatesb @Japan_Olympic pic.twitter.com/6W6ReQE3BS — Olympics (@Olympics) July 26, 2021 -
'ఆంటీ వయసుకు వచ్చాక.. మన కలలను నెరవేర్చుకోవచ్చు'
‘ఆంటీ’ అనే మాటను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడరు. వయసును చెప్పడాన్నీ అంతగా ఇష్టపడరు. ఒక వయసు వచ్చాక వారు ఏదైనా భిన్నమైన పని చేస్తే ఎదుటివారు ఇష్టపడరు మరి. ‘ఇలా ఇష్టపడని వారంతా ఎటైనాపోండి’ అంటారు స్కేట్‌బోర్డ్ మీద రివ్వున దూసుకుపోయే ఊర్బీ రాయ్. కెనడాలో ఉన్న ఈ 46 ఏళ్ల భారతీయురాలు ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్. ‘ఆంటీ వయసుకు వచ్చాక కూడా మన కలలను నెరవేర్చుకోవచ్చు’ అని ఈమె సందేశం. రంగు రంగుల చీరతో స్కేటింగ్ విన్యాసాలు చేస్తూ ‘ఆంటీ స్కేట్స్’ పేరుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ‘పార్క్కో, పిక్నిక్కో వచ్చిన ఫ్యామిలీస్‌ని చూడండి. తండ్రి, పిల్లలు ఆడుతుంటారు. తల్లి దూరంగా కూచుని వారిని ఫొటోలు తీస్తుంటుంది. లేదా బ్లాంకెట్ పరిచి స్నాక్స్ రెడీ చేస్తూ ఉంటుంది. నేను అలాంటి తల్లిని కాను. నేను మాత్రం ఎందుకు ఆడకూడదు అనుకున్నాను’ అని నవ్వుతుంది 46 ఏళ్ల ఊర్బీ రాయ్. కోల్‌కతా నుంచి అమెరికా మీదుగా కెనెడా వలస వెళ్లి ప్రస్తుతం టొరొంటోలో నివాసం ఉంటున్న ఈ ఫ్యాషన్ డిజైనర్ తన టిక్‌టాక్‌ల ద్వారా 90 వేల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుని స్టార్‌డమ్‌ను అనుభవిస్తోంది. ఇంతవరకూ ఆమె టొరెంటోలో మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రపంచమంతా తెలుసు. దానికి కారణం ఈ వయసులో ఆమె అద్భుతంగా స్కేటింగ్ చేయడమే. భారతీయ స్త్రీగా చీర కట్టుకుని మరీ స్కేటింగ్ చేసి ఆమె ప్రశంసలు అందుకుంటోంది. ఆంటీ స్కేట్స్ కెనడాలో టిక్‌టాక్ ఉంది. బ్యాన్ కాలేదు. అక్కడ టిక్‌టాక్‌లో ‘ఆంటీ స్కేట్స్’ అనే అకౌంట్ కింద ఊర్బీ రాయ్ అప్లోడ్ చేసే వీడియోస్ వైరల్‌గా మారాయి. టిక్ టాక్ ఉన్న అనేక దేశాలలో ఇప్పుడు వాటిని పదే పదే చూస్తున్నారు. ‘సాధారణంగా స్కేట్బోర్డింగ్ని పిల్లల ఆటగా చూస్తారు. ఆ తర్వాత కుర్రాళ్ల ఆటగా చూస్తారు. టీనేజ్ దాటాక దీని జోలికి వచ్చేవాళ్లు తక్కువ. నా వయసు స్త్రీలు, అందునా ఇద్దరు పిల్లల తల్లి స్కేట్బోర్డింగ్ చేస్తుండేసరికి చాలామంది ఇన్‌స్పయిర్ అవుతున్నారు’ అంటుంది ఊర్బీ. ‘నా భర్త సంజీవ్ స్కేట్బోర్డింగ్ చేస్తాడు. నా ఇద్దరు పిల్లలకూ అది ఇష్టమే. వారితో పాటు కలిసి నేను స్కేట్పార్క్లకు వచ్చి వారు ఆడుతుంటే చూసేదాన్ని. ఎన్నాళ్లని చూడను? ఒకరోజు స్కేట్‌బోర్డ్‌ను కాళ్ల కిందకు తీసుకున్నాను. వెంటనే దానిని స్వారీ చేశాను’ అంటుంది ఊర్బీ. ఆమె వీడియోలకు ‘ఆంటీ స్కేట్స్’ అనే టైటిల్ ఎందుకు పెట్టింది అని అడిగితే ‘ఆంటీలు చాదస్తం అని చాలామంది అనుకుంటారు. ఆంటీలు అదిలా ఇదిలా అని వంకలు పెడుతుంటారు, జడ్జ్ చేస్తుంటారు అని కూడా అనుకుంటూ ఉంటారు. కాని ఆంటీలు కూడా జీవితాల్లో కొత్తది చేస్తారు. చేయగలరు. వారు కుర్రవయసులో ఉన్నవారితో సమంగా ఉత్సాహంగా ఉండగలరు అని చెప్పడానికే ఆంటీ స్కేట్స్ అనే పేరు పెట్టాను’ అంటుంది ఊర్బి. కోల్కటా వాసి అయితే ఇలా స్కేటింగ్ చేస్తూ వార్తలకెక్కిన ఊర్బి కేవలం స్కేటింగ్‌తో కాలక్షేపం చేసే హౌస్‌వైఫ్ కాదు. ఆమె భర్త సంజీవ్, ఆమె ఇద్దరూ న్యూయార్క్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేశారు. ‘ఆ ఉద్యోగం నా జీవితాన్ని నమిలేస్తుందని అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ మీద చాలా ఆసక్తి. మార్కెట్లో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయో గమనించేదాన్ని. మా అమ్మ ద్వారా నాకు భారతీయ సంస్కృతిని డిజైనింగ్‌లో ఎలా వాడాలో తెలిసింది. అందుకని ఇక్కడ ‘ఓమ్ హోమ్’ పేరుతో నా ఔట్లెట్ తెరిచాను. కోల్‌కతాలో కొంతమంది నేతగాళ్లను, టైలర్లను పనిలోకి తీసుకుని అక్కడ తయారు చేయించి ఇక్కడ నుంచి మార్కెటింగ్ చేస్తున్నాను’ అంటుంది ఊర్బి. ఆమె భర్తతో కలిసి కెనడాకు వలస వచ్చింది. ఊర్బి కుటుంబం ముందు నుంచి వ్యాపార రంగంలో ఉంది. ‘మా ముత్తాత బెంగాల్ పల్లెల నుంచి మొదటిసారి కోల్‌కతా వచ్చి ఇంటింటికి తిరిగి సబ్బులమ్మేవాడు’ అంది ఊర్బి. కష్టమే కాని తప్పదు ‘‘ఒక వయసు వచ్చిన స్త్రీలు ప్రాణం సుఖంగా ఉంది కదా ఇప్పుడు కొత్త కష్టాలు ఎందుకు అనుకుంటారు. 2018లో స్కేట్బోర్డింగ్ నేర్చుకునే సమయంలో ఇది నాకు అవసరమా అని ఒక క్షణం అనిపించింది. కొత్తది నేర్చుకోగలనా అనే సంశయం కూడా ఉండింది. కాని లేదు.. చేయాల్సిందే అని ముందుకు వెళ్లాను. ఇవాళ టొరెంటోలో స్కేట్బోర్డింగ్ కమ్యూనిటీ అంతా నన్ను చాలా గౌరవిస్తుంది. నా చేత ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ కొత్త పిల్లలు ఈ ఆటను నేర్చుకుంటున్నారు. అది కాదు విశేషం. ఎన్నో దేశాలలో చాలామంది నా వయసు వారు ‘నిన్ను చూసి ఇన్‌స్పయిర్ అయ్యి స్కేట్బోర్డింగ్ నేర్చుకుంటున్నాం’ అని నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? జీవితం ఎప్పుడూ పూర్తయినట్టు కాదు. కొత్తగా ప్రారంభించవచ్చు’’ అంటుంది ఊర్బి. – సాక్షి ఫ్యామిలీ -
Sky Brown, Kokona Hiraki:12 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌కు...
లాసానే: బ్రిటన్‌కు చెందిన స్కై బ్రౌన్... జపాన్‌కు చెందిన కొకొనా హిరాకరి...వీరిద్దరి వయసు 12 ఏళ్లు. బ్రౌన్కంటే హిరాకరి 45 రోజులు పెద్దది! ఇప్పుడు ఈ ఇద్దరు చిన్నారులు అరుదైన ఘనత సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్కేట్ బోర్డింగ్ ఈవెంట్‌కు వీరిద్దరు క్వాలిఫై అయ్యారు. మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన 80 మందితో బుధవారం విడుదల చేసిన జాబితాలో వీరిద్దరికి చోటు దక్కింది. ‘స్కేట్ బోర్డింగ్’కు తొలి సారి ఒలింపిక్స్‌లో అవకాశం కల్పించారు. వీరిలో బ్రౌన్కు మరో ఆసక్తికర నేపథ్యం ఉంది. 2019 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్యం సాధించింది. ఏడాది క్రితం జరిగిన మరో ఈవెంట్లో అనూహ్యంగా పట్టు తప్పడంతో బ్రౌన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే శస్త్రచికిత్స అనంతరం కోలుకొని ఆమె మళ్లీ బరిలోకి దిగడం విశేషం. -
వైరల్: స్కేటింగ్ అదరగొట్టిన కుక్క పిల్ల
-
వైరల్: స్కేటింగ్ అదరగొట్టిన కుక్క పిల్ల
కొన్ని ఆటల్లో మనుషుల కంటే జంతువులే తమ ప్రతిభను చాలా చక్కగా కనబరుస్తాయనడంలో సందేహం లేదు. సాధారణంగా మనుషులు స్కేటింగ్ చేస్తేనే.. ఎక్కడో ఒక చోటు బ్యాలన్స్ తప్పి పడుతూ, లేస్తూ ముందుకు వెళ్లుతారు. అలాంటిది ఓ కుక్క పిల్ల రోడ్డుపై చేసిన స్కేటింగ్ వీడియోను చూస్తే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. ప్రస్తుతం ఆ కుక్క పిల్ల చేసిన స్కేటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. ఈ వీడియోను అమెరికన్ మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ తన ట్వీటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘స్కేటర్ గుడ్ బాయ్...’అని కాప్షన్ జతచేశారు. ఆ కుక్క పిల్ల స్కేటింగ్ బోర్డుపై నిలబడి రోడ్డుపై దర్జాగా స్కేటింగ్ చేస్తూ ఉంటే దాన్ని చూసిన జనాలు ఆశ్చర్యపోయారు. ఆ చిన్న కుక్కపిల్ల చాలా సులువుగా చేస్తున్న స్కేటింగ్ రోడ్డుపై ఉన్న కొందరిలో నవ్వులు పూయించింది. అది రోడ్డు మీద ఉన్న ఓ మూల మలుపును కూడా చాలా చక్కగా దాటుకుంటూ మరో రోడ్డుపైకి వెళ్తుతుంది. చాలా దూరం స్కేటింగ్ చేసిన కుక్క ఒకసారి స్కేటింగ్ బోర్డు దిగి అదే హుషారుతో మళ్లీ స్కేటింగ్ చేస్తుంది. ఈ క్రేజీ వీడియోను ఇప్పటికే సుమారు ఆరు లక్షల మంది వీక్షించగా, పదివేల లైక్‌లు, రెండు వేల రీ ట్వీట్లు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఆ కుక్క పిల్ల నాకుంటే చాలా ప్రశాంతంగా స్కేటింగ్ చేస్తోంది’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఓ మై గాడ్.. చాలా అద్భుతం’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. -
షూలకు గమ్ అంటించుకుందా ఏంటి?: వైరల్
కాన్బెర్రా : పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు ఆస్ట్రేలియాకు చెందిన ఓ చిన్నారి తన నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సరిగ్గా నడవటం చేతకాని వయసులో స్కేట్ బోర్డుమీదకెక్కి పచార్లు చేస్తోంది. మెయిల్ ఆన్లైన్ కథనం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని క్లార్క్ ఫీల్డ్‌కు చెందిన కోకో హీత్ అనే చిన్నారికి ఐదు నెలల వయస్సులో స్కేట్ బోర్డు్ అంటే ఇష్టం ఏర్పడింది. ఇది గమనించిన పాప తల్లి కెల్లీ చిన్నారిని అంత చిన్న వయస్సునుంచే స్కేట్‌బోర్డు మీద ఉంచి ఆడించేది. ప్రస్తుతం కోకో వయస్సు 14నెలలు. స్కేట్ బోర్డుపై కోకోకు పట్టువచ్చిన తర్వాత ఒక్కదాన్నే బోర్డుపై వదిలేసేది. చిన్నారి ఏ మాత్రం భయపడకుండా స్కేట్ బోర్డింగ్ చేయటం నేర్చుకుంది. 14 నెలల కోకో స్కేట్ బోర్డింగ్ చేయటం చూసిన చాలా మంది ఆశ్చర్యపోవటమే కాకుండా ఇంత చిన్న వయస్సులో ఎలా చేస్తోందంటూ నోరెళ్లబెడుతున్నారు. అంతేకాకుండా చిన్నారితో సెల్ఫీలు, ఫొటోలు దిగటానికి పోటీ పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలై నెటిజన్లనుంచి విశేషమైన స్పందన వస్తోంది. ‘‘ షూలకు గమ్ అంటించుకుందా ఏంటి?. అద్బుతంగా చేస్తోంది. అంత చిన్న వయస్సులో స్కేట్ బోర్డింగ్ చేయటం గొప్ప విషయం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
పాప నైపుణ్యానికి నెటిజన్ల ఆశ్చర్యం
-
ఆకాశానికి స్కీటింగ్
రెండేళ్లనాటి వీడియో ఆల్బమ్ ‘ఆల్ఫా ఫిమేల్’ మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది. దేశమంతా ఎన్నికల మూడ్‌లో ఉన్నప్పుడు ఈ వీడియో ఇప్పుడెందుకు నెట్ ఉపరితలంలోకి వచ్చింది?! స్త్రీ శక్తి అందులోని థీమ్. ఓటు వేయడంలోనే కాదు, సీట్లకు పోటీ పడడంలోనూ నేటి మహిళ చూపుతున్న చొరవకు, ఉత్సాహానికి ‘ఆల్ఫా ఫిమేల్’..ప్రస్తుత తరుణంలో ఒక ప్రతీక అయింది. ఇదే సమయంలో చెరకు పొలాల్లోని శ్రామిక మహిళల దైన్యస్థితిని బహిర్గతం చేసిన ఓ వార్తా కథనం కూడా వైరల్ అయింది. స్త్రీ శక్తి అటొకటి, ఇటొకటిగా ఉన్న వైరుధ్యాలివి. ఇండియా ఇప్పుడు మహిళలు స్వారీ చేస్తున్న ఒక గెలుపు గుర్రం! ఉహు.. గెలుపు గుర్రం పాత పోలిక. ఇండియా ఇప్పుడు ‘స్కేట్బోర్డింగ్ ఉమన్’! చీర కట్టుకుని హైవేపై స్కేటింగ్ చేస్తున్న మహిళను ఊహించుకోండి! ఒడుపుగా, వేగంగా, ధీమాగా.. మలుపుల్లో గాల్లోకి పైకి లేచి, లక్ష్యాల వైపు దిగి రయ్యిన సాగిపోతోంది ఇండియా. ‘ఉమెన్ హోల్డ్ అప్ హాఫ్ ద స్కై’! అన్నదెవరూ.. మావో జెడాంగ్. చైనా మహోన్నత విప్లవకారుడు. ఆయన అన్న ‘ఆకాశంలో సగం’ బాగా పాతబడిపోయిన మాట. ఆకాశంలో అంతా వాళ్లే ఇప్పుడు. మహిళలే. ‘ఉమన్ ఫస్ట్’ అన్నాడు మోదీ సడన్‌గా ఈవారం ఎలక్షన్ సభలో! రాహుల్ అయితే.. ఉమెన్ పవరేంటో ఎన్నికలకు ముందే గుర్తించి, ‘నో ఉమన్.. నో ఇండియా’ అన్నాడు! మహిళ లేనిదే ఇండియా లేదని. ‘‘మాకు పవర్ ఇస్తే మీకు పవర్ ఇస్తాం’’ అని మోదీ, రాహుల్.. ఇద్దరూ, మహిళలకు హామీ ఇచ్చారు. కామన్‌గా వీళ్లిచ్చిన హామీ చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు. రాహుల్ ఇంకో స్టెప్ వేసి, ఉద్యోగాల్లో కూడా మహిళలకు ముప్పైమూడు శాతం ఇస్తాం అని వాగ్దానం చేశారు. అంతవరకు ఎందుకని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఈ ఎన్నికల్లో 41 శాతం సీట్లు మహిళలకే ఇచ్చారు! ఒడిశా సీఎం ముఫ్పైమూడు శాతం ఇచ్చారు. ఈ రెండు రాష్ట్రాల్లో నిన్ననే ఎన్నికలు ముగిశాయి. భారతీయ రాజకీయాల్ని మహిళలు శాసించబోతున్నారనే దానికి చిన్న సంకేతం ఒకటి గత ఏడాది జరిగిన రాజస్తాన్ ఎన్నికల్లో తొలిసారిగా గమనింపుకు వచ్చింది. ఏ ఎన్నికల్లోనూ లేనంతగా ఆ ఎన్నికల్లో ఓటేయడానికి ఇళ్లలోంచి మహిళలు బయటికి వచ్చారు! మహిళా ఓట్లు ఎక్కువగా పోల్ అయిన స్థానాల్లోని అభ్యర్థులంతా పార్టీలతో సంబంధం లేకుండా గెలిచారు. మహిళలకు నీళ్లు కావాలి. నీళ్లిస్తానన్నవాళ్లకు, నీళ్లివ్వగలరన్న నమ్మకం ఉన్నవాళ్లకు ఓటేసి గెలిపించుకున్నారు. ఇదొకటే సంకేతం కాదు. దేశంలోని రాష్ట్రాలన్నిటిలో మహిళా ఓటర్లు పెరిగారు. ఓటేసే మహిళలూ పెరిగారు. విద్య, ఉద్యోగ, సేవా రంగాల్లోనే మాత్రమే ఇంతవరకు అన్నిటా పురుషుడితో సహ భాగస్వామ్యం కలిగి ఉన్న మహిళలు.. రాజకీయాల్లో ఆ సహత్వాన్ని, సమత్వాన్ని దాటి ‘ఈ దేశం ఎలా ఉండాలంటే?’ అని నిర్ణయించే శక్తిగా ఎదిగారు. అయితే ఇదంతా రాజకీయ రంగంలో. ఎన్నికల సందర్భంలో ఉన్నాం కాబట్టి.. ‘స్కేట్బో ర్డింగ్ ఉమన్’ గురించి మాట్లాడుకున్నాం. కానీ శ్రామికరంగంలో రోజువారీ మహిళా కూలీల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇందుకు ఒక నిదర్శనం.. మహారాష్ట్ర బీద్లోని చెరకు పొలాల్లో పని చేస్తున్న మహిళా కార్మికుల దయనీయస్థితి. ఏ రోజైనా కూలీ పనికి వెళ్లలేకపోతే యాజమాన్యానికి ఆ రోజుకు చెల్లించవలసిన రూ.500 నష్టపరిహారాన్ని తప్పించుకోవడానికి ఆ మహిళలు బహిష్టు అవాంతరాలు రాకుండా గర్భసంచిని తీయించుకున్నారనే విషయం తాజాగా దేశాన్ని దిగ్భ్రాంతి పరచింది. ఎన్నికలే లేకపోతే.. పార్లమెంటే జరుగుతుంటే.. పత్రికలకు, టీవీలకు ఇదొక బ్రేకింగ్ స్టోరీ అయి ఉండేది. అంతలోనే మహిళల్ని ఆకాశానికి ఎత్తేసి, మళ్లీ అంతలోనే కిందికి దింపేయడం కాదిది. రాజకీయ అధికారం కలిగిన, రాజకీయ అధికారం ఇస్తున్న మహిళలు ప్రాధాన్యం ఇవ్వవలసిన అంశాలలో.. మహిళల జీవితాలను దుర్భరం చేస్తున్న పేదరికం ఒక ప్రధానాంశం అని చెప్పుకోవడం.స్త్రీల ఆరోగ్యం నెలలో అన్ని రోజులూ ఒకేలా ఉండదు. పని మాత్రం అన్నీ రోజులూ ఉంటుంది. ఆడైనా, మగైనా ఆరోగ్యం బాగుంటేనే కదా.. పని చేయడం. కానీ పని ఇచ్చినవారు, పనికి డబ్బులు ఇచ్చేవారు పని జరిగిందా అనే చూసుకుంటారు. ఆడా, మగా అని చూసుకోరు. స్త్రీ,పురుషులకు ఇచ్చే వేతనం ఒకేలా లేకపోయినా, పురుషుడితో సమానంగా స్త్రీ కూడా పని చేయాలని ఆశిస్తారు. నెలసరి రోజుల్లో ఒంట్లో బాగోలేకపోవడంతో వాళ్లకు సంబంధం లేదు. పని జరగాలి అంతే. పనికి రాకపోతే ఆరోజు కూలీ కట్. అయితే బీద్లోని చెరకు పొలాల పంట కోత పనుల్లో ఇంతకన్నా దారుణమైన పని నిబంధనలు ఉన్నాయి. పనికి రాని రోజు కూలీలు ఆ రోజు వేతనాన్ని తిరిగి తామే పరిహారంగా చెల్లించవలసి ఉంటుంది! చెల్లించలేకపోతే ఉపాధికే అది ఆఖరి రోజు అవుతుంది. బహిష్టు రోజులలో స్త్రీలకు నీరసంగా, నిస్సత్తువగా ఉంటుంది. పొత్తికడుపు నొప్పి ఉండొచ్చు. అకారణంగా చికాకు, విసుగు ఉంటాయి. కొందరు నిస్పృహలోకి వెళ్తారు. మరికొందరు అసలే లేవలేరు. ఈ స్థితిలోనూ వారి నుంచి పనిని, సేవల్ని ఆశించడం క్రౌర్యమే. ఇళ్లలోనూ, ఆఫీస్‌లలోనూ స్త్రీ పట్ల ఈ రకం క్రౌర్యం, నిర్దయ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడిప్పుడు కొన్ని దేశాలు.. బహిష్టు రోజులకు జీతంతో కూడిన సెలవును ఇచ్చే చట్టాలు తెస్తున్నాయి. అయితే రోజువారీ కూలీల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆ చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. బీద్ విషయానికే వస్తే.. పనికి వెళ్లని రోజున ఒక రోజు వేతనాన్ని యజమానికి చెల్లించే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండేందుకు అసలు బహిష్టులే రాకుండా, గర్భాశయాన్ని తీయించుకోవడం.. అన్నది ఏడు సముద్రాలంత దుఃఖాన్ని కలుగజేసే విషయం. మీడియాలో ఈ వార్తను చదివి చలించిపోయిన మహారాష్ట్ర జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.పి.ఎస్. మదన్‌కు మంగళవారం నోటీసులు పంపుతూ, జరిగిన దానిపై తక్షణం విచారణ జరిపించాలని, మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని కోరారు. ‘‘ఉపాధి పోతుందన్న భయంతో గర్భసంచిని తీయించుకునే (హిస్టెరెక్టమీ) దుస్థితి ఉండడం మానవ నాగరికతకే తలవంపు’’ అని ఆ లేఖలో రేఖ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ మహారాష్ట్రలో అక్టోబర్ – మార్చి మధ్య కాలంలో చెరకు పంట కోతలు ఉంటాయి. అక్కడి కాంట్రాక్టర్లు కోత పనికి వచ్చే భార్యాభర్తలిద్దర్నీ ‘ఒకే కూలీ’గా రిజిస్టర్లో నమోదు చేసుకుని, వాళ్లిద్దరిలో ఏ ఒక్కరు పనికి రాకపోయినా రోజుకు రూ.500 చొప్పున వాళ్లకు ఇవ్వబోయే జీతంలో తగ్గించుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. జీతంలో కోత పడకుండా చూసుకోవడం కోసం ఇద్దరు ముగ్గురు పిల్లలున్న తల్లులు గర్భాశయాన్ని తీయించుకున్న ఘటన వెలుగు లోకి రావడంతో మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. మహిళల సమస్యల్లో ముందుండేవి వివక్ష, అసమానత్వం, గృహహింస, పని చేసే చోట లైంగిక వేధింపులు, అత్యాచారాలు, లైంగిక హత్యలు. అయితే ఇవన్నీ పైకి కనిపించేవి. వీటన్నిటికన్నా కూడా మహిళా జీవితాన్ని దుర్భరం చేసేదీ, ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టి రూపాయిని చేజారిపోనివ్వని పరిస్థితుల్ని కల్పించేది.. పేదరికం! అధికారంలోకి రాబోయే మహిళలు, తమ అభ్యర్థులను అధికారంలోకి తీసుకురాబోతున్న మహిళలు.. మహిళల పేదరికాన్ని నిర్మూలించేందుకు ‘స్కేట్బోర్డింగ్’ చేయాలి. మహిళల శ్రమకు తగిన ఫలితమో, తగుమాత్రం ఫలితం కాకుండా.. ఒక విలువను సృష్టించాలి. పనికి రాలేని రోజున కూడా వేతనం ఇచ్చినప్పుడు నిజంగా ఈ దేశం స్త్రీ శ్రమ విలువను గుర్తించినట్లు. స్త్రీ శ్రమకు గౌరవం ఇచ్చినట్లు. ఆల్ఫా ఫిమేల్ మహిళలు స్కేటింగ్ చేస్తున్న ఈ ఫొటో రెండేళ్ల క్రితం ‘వైల్డ్ బీస్ట్స్’ అనే ఇంగ్లిష్ ఇండీ రాక్ బ్యాండ్ విడుదల చేసిన ‘ఆల్ఫా ఫిమేల్’ అనే వీడియో ట్రాక్ లోనిది. ఆల్ఫా ఉమెన్ అంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్న మహిళలు అని అర్థం. సమాజంలోని వివిధ రంగాలతో పాటు రాజకీయ రంగాన్నీ మహిళలు అతి శక్తిమంతంగా ప్రభావితం చేస్తున్న ప్రస్తుత ఎన్నికల తరుణంలో ఈ వీడియోకు మళ్లీ ప్రాధాన్యం లభించింది. 3 నిమిషాల 43 సెకన్ల ఈ వీడియోలో.. స్కేటింగ్ చేస్తున్న మహిళల నేర్పు నివ్వెరపరిచేలా ఉంటుంది. -
అమెజాన్ మరో పైత్యం
చండీఘడ్: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన పైత్యాన్ని మరోసారి చాటుకుంది. ఎన్ని హెచ్చరికలు చేసినా.. తప్పులు మీద తప్పు లు చేస్తూ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదిర్శిస్తోంది. తాజాగా ఏకంగా వినాయకుడి బొమ్మలున్న స్కేట్ బోర్డులను విక్రయానికి పెట్టింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ తీరుకు నిరసనగా చండీగఢ్‌కు చెందిన న్యాయవాది అజయ్ జగ్గా స్పందించారు. స్కేట్ బోర్డులపై గణపతి బొమ్మలను ముద్రించడంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే అమెజాన్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెబ్సైట్ నుంచి వాటిని తొలగించాలని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. ఈ చర్య భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్ 295 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. భారతీయుల మనోభావాలనుదెబ్బతీసిన అమెజాన్‌పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కాగా ఇటీవల అమెజాన్ భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తూ వెబ్ సైట్ లో వస్తువులను విక్రయానికి పెట్టింది. జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్మ్యాట్లలు ఆ తర్వాత మహాత్మాగాంధీ ఫొటో ముద్రించిన చెప్పులను వెబ్సైట్లో పెట్టింది. దీనిపై కేంద్ర విదేశామంత్రి సుష్మా స్వరాజ్ సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే.