
స్కై బ్రౌన్,కొకొనా హిరాకరి
లాసానే: బ్రిటన్‌కు చెందిన స్కై బ్రౌన్... జపాన్‌కు చెందిన కొకొనా హిరాకరి...వీరిద్దరి వయసు 12 ఏళ్లు. బ్రౌన్‌కంటే హిరాకరి 45 రోజులు పెద్దది! ఇప్పుడు ఈ ఇద్దరు చిన్నారులు అరుదైన ఘనత సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్కేట్ బోర్డింగ్ ఈవెంట్‌కు వీరిద్దరు క్వాలిఫై అయ్యారు. మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన 80 మందితో బుధవారం విడుదల చేసిన జాబితాలో వీరిద్దరికి చోటు దక్కింది. ‘స్కేట్ బోర్డింగ్’కు తొలి సారి ఒలింపిక్స్‌లో అవకాశం కల్పించారు. వీరిలో బ్రౌన్‌కు మరో ఆసక్తికర నేపథ్యం ఉంది. 2019 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్యం సాధించింది. ఏడాది క్రితం జరిగిన మరో ఈవెంట్‌లో అనూహ్యంగా పట్టు తప్పడంతో బ్రౌన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే శస్త్రచికిత్స అనంతరం కోలుకొని ఆమె మళ్లీ బరిలోకి దిగడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment