Indian Women Hockey Team Fight In Pics: టోక్యో ఒలింపిక్స్ కాంస్యం పోరులో భారత మహిళా హాకీ జట్టు పోరాటం వృథా అయింది. చివరికంటా ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాణి సేన బ్రిటన్ చేతిలో తలవంచక తప్పలేదు. చివరిదైన 15 నిమిషాల ఆటలో బ్రిటన్ గోల్ కొట్టడంతో 4-3 తేడాతో భారత్ పరాజయం ఖరారైంది. అయితే, తాజా ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్ సాగించిన పోరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
►ముఖ్యంగా చివరి వరకు పట్టుదల వీడకుండా ముందుకు సాగిన తీరును భారతీయులు, సహా ప్రత్యర్థి జట్టు సైతం అభినందిస్తోంది. ‘‘అత్యద్భుతమైన ఆట.. అత్యంత అద్భుతమైన ప్రత్యర్థి.. టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ ఇండియా ప్రత్యేకంగా నిలిచింది. మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలి’’ అని గ్రేట్ బ్రిటన్ హాకీ ట్వీట్ చేసింది.
రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన బ్రిటన్‌కు కాంస్య పతక వేటలో గట్టిపోటీనిచ్చిన భారత జట్టు భావోద్వేగాల సమాహారం
►ఈ మ్యాచ్‌లో భారత్ తరపున గుర్జీత్ కౌర్ రెండు, వందనా కటారియా ఒక గోల్ చేశారు.
►హోరాహోరీగా పోరాడినప్పటికీ ఓటమి ఎదురుకావడంతో భారత మహిళా జట్టు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
►ఓటమి బాధలో ఉన్న రాణి సేనను బ్రిటన్ మహిళా జట్టు ఓదార్చింది. క్రీడా స్ఫూర్తిని చాటుకుంది.
Comments
Please login to add a commentAdd a comment