టోక్యో: హ్యాండ్‌బాల్‌లో ఫ్రాన్స్ సరికొత్త చరిత్రను లిఖించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆదివారం మహిళల విభాగంలో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 30–25తో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్‌ఓసీ)పై గెలుపొంది స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే పురుషుల విభాగంలోనూ ఫ్రాన్స్ జట్టే స్వర్ణాన్ని నెగ్గడంతో... 37 ఏళ్ల తర్వాత రెండు విభాగాల్లోనూ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ నెగ్గిన తొలి జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. కాంస్యం కోసం జరిగిన పోరులో నార్వే 36–19తో స్వీడన్‌పై నెగ్గింది.
జేసన్ కెన్నీ రికార్డు స్వర్ణాలు
ఒలింపిక్స్‌లో బ్రిటన్ సైక్లిస్ట్ జేసన్ కెన్నీ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల 200 మీటర్ల కీరిన్ ఫైనల్ రేసులో జేసన్ అందరి కంటే ముందుగా 10.481 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణాన్ని నెగ్గాడు. తద్వారా ఒలింపిక్స్‌లో ఏడో స్వర్ణాన్ని సాధించిన జేసన్... బ్రిటన్ తరఫున అత్యధిక పసిడి పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా ఘనతకెక్కాడు. 0.763 సెకన్లు వెనుకగా రేసును ముగించిన మొహమ్మద్ అజీజుల్లాస్ని (మలేసియా) రజతాన్ని... హ్యారీ లావ్రిసెన్ (నెదర్లాండ్స్) కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు.
చదవండి: భజ్జీ నువ్వు కరెక్టే.. కానీ అలా అనకూడదు: గౌతమ్ గంభీర్
Comments
Please login to add a commentAdd a comment